
లైవ్ ప్రసారంలో యాంకర్‌కు ముద్దిచ్చాడు!
ఫ్రెంచ్ టెన్నిస్ ఆటగాడు మాక్సిమ్ హమౌపై ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ నిర్వాహకులు నిషేధం విధించారు.
టెన్నిస్ ఆటగాడిపై నిషేధం!
ఫ్రెంచ్ టెన్నిస్ ఆటగాడు మాక్సిమ్ హమౌపై ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ నిర్వాహకులు నిషేధం విధించారు. లైవ్ ప్రసారంలో ఓ టీవీ యాంకర్‌ను ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ముద్దాడి అసభ్యంగా ప్రవర్తించడంతో టోర్నీలో పాల్గొనకుండా అతన్ని బహిష్కరించారు. 21 ఏళ్ల హమౌ ప్రవర్తన చాలా అసభ్యంగా ఉందని నిర్వాహకులు మండిపడ్డారు. సోమవారం ఫస్ట్‌రౌండ్ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత హమౌను యూరోస్పోర్ట్ మహిళా జర్నలిస్టు మేలీ థామస్ ఇంటర్వ్యూ చేసింది.
ఈ సందర్భంగా ఆమె భుజాల చుట్టు చేయి వేసి అతి చనువుగా వ్యవహరించిన హమౌ.. ఆమె వద్దంటున్న బలవంతంగా పలుసార్లు ముద్దు పెట్టుకున్నాడు. అతని ప్రవర్తనతో ఆమె బిత్తరపోయింది. లైవ్ ప్రసారం కాకపోయి ఉంటే హమౌ చెంప ఛెళ్లుమనిపించేదానినని ఆమె తర్వాత మీడియాకు తెలిపింది. దీంతో ప్రపంచ 287వ ర్యాంకు ఆటగాడు అయిన హమౌ గుర్తింపును రద్దుచేసి.. పూర్తిగా టోర్నమెంటు నుంచి నిషేధిస్తున్నామని ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.