పోలాండ్ టెన్నిస్ స్టార్ నిషేధ కాలంపై మాజీ నంబర్‌వన్ హాలెప్ విస్మయం
శిక్షలు అందరికి ఒకేలా ఉండవా?
టెన్నిస్ వర్గాలపై అసంతృప్తి
బుడాపెస్ట్ (రొమేనియా): వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ మాజీ చాంపియన్ సిమోనా హాలెప్ అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ పక్షపాత వైఖరిపై మండిపడింది. గతంలో తాను డోపింగ్‌లో పట్టుబడితే నాలుగేళ్ల నిషేధం విధించిన టెన్నిస్ వర్గాలు ఇప్పుడు స్వియాటెక్ డోపీగా తేలితే ఒకే ఒక్క నెల సస్పెన్షన్‌తో సరిపెట్టడంపై ఆమె తీవ్రస్థాయిలో ఆక్షేపించింది. క్రీడాకారుల పట్ల ఇలాంటి పక్షపాత వైఖరి ఎంతమాత్రం తగదని బాహాటంగా తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. ‘నేను ఎంతసేపు స్థిమితంగా కూర్చొని ఆలోచించినా ఈ వ్యత్యాసమెంటో అంతుచిక్కడం లేదు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో తన అసంతృప్తిని పోస్ట్ చేసింది. ‘ఎంత ఆలోచించినా... ఆశ్చర్యమే తప్ప అసలెందుకీ వివక్షో తెలియడం లేదు.
ఒకే రకమైన శిక్షకు ఒకే రకమైన తీర్పు ఉండదా? ఎంతగా ప్రయతి్నంచినా కూడా ఇదేం లాజిక్కో అర్థమవడం లేదు. కనీసం అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) వద్దనయినా సరైన సమాధానం దొరుకుతుందేమో చూడాలి. నా విషయంలో కఠినంగా వ్యవహరించిన టెన్నిస్ ఏజెన్సీ... స్వియాటెక్ విషయంలో ఎందుకంత ఉదాíసీనంగా వ్యవహరించాలి. నేను నేరుగా నిషేధిత ఉ్రత్పేరకాలు తీసుకోలేదని ఎంత వాదించినా వినని ఐటీఐఏ స్వియాటెక్ చెబితే వినడమెంటో తెలియడం లేదు’ అని తనకు జరిగిన అన్యాయంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. 2018లో ఫ్రెంచ్ ఓపెన్, 2019లో వింబుల్డన్ నెగ్గిన హాలెప్... 2022 యూఎస్ ఓపెన్ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో నిషిద్ధ ఉ్రత్పేరకం ‘రొక్సాడ్యుస్టట్’ తీసుకున్నట్లు తేలడంతో ఏకంగా నాలుగేళ్ల నిషేధం విధించారు. తర్వాత ఆమె న్యాయపోరాటం చేయడంతో కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ శిక్షను 9 నెలలకు తగ్గించింది.
అయితే ఆమె ఏడాదిన్నర పాటు ఆటకు దూరమైంది. కానీ తాజాగా స్వియాటెక్‌కు కేవలం 30 రోజుల శిక్ష విధించడాన్ని తప్పుబట్టింది. ‘నేనెప్పుడు మంచినే కోరుకుంటా. టెన్నిస్‌లోనూ నీతి న్యాయం సమానంగా ఉండాలని ఆశిస్తా. కానీ ఇంతటి అసమానతలు చూసి తట్టుకోవడం నా వల్ల కావట్లేదు’ అని ఐటీఐఏ తీరును దుయ్యబట్టింది. ఇటీవల ఐటీఐఏ వ్యవహారం తరచూ విమర్శలపాలవుతోంది. పురుషుల టాప్ ర్యాంక్ ప్లేయర్ యానిక్ సినెర్ ఈ ఏడాది మార్చిలో రెండు సార్లు డోపింగ్‌లో దొరికిపోయినా టెన్నిస్ ఏజెన్సీ మెతక వైఖరి అవలంభించడంతో పలువురు టెన్నిస్ దిగ్గజాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment