French Open
-
స్వియాటెక్‌పై ఉదారత ఎందుకు?
బుడాపెస్ట్ (రొమేనియా): వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ మాజీ చాంపియన్ సిమోనా హాలెప్ అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ పక్షపాత వైఖరిపై మండిపడింది. గతంలో తాను డోపింగ్‌లో పట్టుబడితే నాలుగేళ్ల నిషేధం విధించిన టెన్నిస్ వర్గాలు ఇప్పుడు స్వియాటెక్ డోపీగా తేలితే ఒకే ఒక్క నెల సస్పెన్షన్‌తో సరిపెట్టడంపై ఆమె తీవ్రస్థాయిలో ఆక్షేపించింది. క్రీడాకారుల పట్ల ఇలాంటి పక్షపాత వైఖరి ఎంతమాత్రం తగదని బాహాటంగా తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. ‘నేను ఎంతసేపు స్థిమితంగా కూర్చొని ఆలోచించినా ఈ వ్యత్యాసమెంటో అంతుచిక్కడం లేదు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో తన అసంతృప్తిని పోస్ట్ చేసింది. ‘ఎంత ఆలోచించినా... ఆశ్చర్యమే తప్ప అసలెందుకీ వివక్షో తెలియడం లేదు. ఒకే రకమైన శిక్షకు ఒకే రకమైన తీర్పు ఉండదా? ఎంతగా ప్రయతి్నంచినా కూడా ఇదేం లాజిక్కో అర్థమవడం లేదు. కనీసం అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) వద్దనయినా సరైన సమాధానం దొరుకుతుందేమో చూడాలి. నా విషయంలో కఠినంగా వ్యవహరించిన టెన్నిస్ ఏజెన్సీ... స్వియాటెక్ విషయంలో ఎందుకంత ఉదాíసీనంగా వ్యవహరించాలి. నేను నేరుగా నిషేధిత ఉ్రత్పేరకాలు తీసుకోలేదని ఎంత వాదించినా వినని ఐటీఐఏ స్వియాటెక్ చెబితే వినడమెంటో తెలియడం లేదు’ అని తనకు జరిగిన అన్యాయంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. 2018లో ఫ్రెంచ్ ఓపెన్, 2019లో వింబుల్డన్ నెగ్గిన హాలెప్... 2022 యూఎస్ ఓపెన్ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో నిషిద్ధ ఉ్రత్పేరకం ‘రొక్సాడ్యుస్టట్’ తీసుకున్నట్లు తేలడంతో ఏకంగా నాలుగేళ్ల నిషేధం విధించారు. తర్వాత ఆమె న్యాయపోరాటం చేయడంతో కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ శిక్షను 9 నెలలకు తగ్గించింది. అయితే ఆమె ఏడాదిన్నర పాటు ఆటకు దూరమైంది. కానీ తాజాగా స్వియాటెక్‌కు కేవలం 30 రోజుల శిక్ష విధించడాన్ని తప్పుబట్టింది. ‘నేనెప్పుడు మంచినే కోరుకుంటా. టెన్నిస్‌లోనూ నీతి న్యాయం సమానంగా ఉండాలని ఆశిస్తా. కానీ ఇంతటి అసమానతలు చూసి తట్టుకోవడం నా వల్ల కావట్లేదు’ అని ఐటీఐఏ తీరును దుయ్యబట్టింది. ఇటీవల ఐటీఐఏ వ్యవహారం తరచూ విమర్శలపాలవుతోంది. పురుషుల టాప్ ర్యాంక్ ప్లేయర్ యానిక్ సినెర్ ఈ ఏడాది మార్చిలో రెండు సార్లు డోపింగ్‌లో దొరికిపోయినా టెన్నిస్ ఏజెన్సీ మెతక వైఖరి అవలంభించడంతో పలువురు టెన్నిస్ దిగ్గజాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. -
తగ్గేదేలే..! టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సుదీర్ఘ మ్యాచ్‌లు ఇవే
టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టిన ఏ ఆటగాడైనా గెలవాలనే కసితోనే పోరాడతాడు. కొందరు ప్లేయర్లు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ చూస్తుండగానే మ్యాచ్‌ను లాగేసుకుంటే... మరికొందరు తుదికంటా పోరాడుతూ శక్తి మేరకు ప్రయత్నిస్తారు! టెన్నిస్ కోర్టులో అప్పుడప్పుడు సమఉజ్జీల సమరాలు అభిమానులను అలరిస్తూ ఉంటాయి. శరీరంలో శక్తి క్షీణిస్తున్నా... చెమట ధారగా కారుతున్నా లెక్కచేయకుండా మైదానంలో ఇరువురు ఆటగాళ్లు కొదమ సింహాల్లా పోరాడినపుడు ఆ మ్యాచ్‌లు గంటలకొద్దీ సాగుతూ ఉంటాయి. ఇరువురు ప్లేయర్లు ‘తగ్గేదేలే’ అన్నట్లు చెలరేగిన మ్యాచ్‌లు సుదీర్ఘ పోరాటాలుగా చరిత్ర పుటల్లో చోటు దక్కించుకుంటున్నాయి. టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అలా రికార్డుల్లోకెక్కిన మ్యాచ్‌లను ఓసారి పరిశీలిస్తే... శారీరక శ్రమ అధికంగా ఉండే టెన్నిస్ క్రీడలో అప్పుడప్పుడు కొన్ని మ్యాచ్‌లు సుదీర్ఘంగా సాగడం పరిపాటే. తాజాగా సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో డేనియల్ ఇవాన్స్ (బ్రిటన్), కరెన్ ఖచనోవ్ (రష్యా) మధ్య పోరు 5 గంటల 35 నిమిషాల పాటు సాగి అభిమానులకు ప్రత్యేక అనుభూతినిచ్చింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఇదే సుదీర్ఘమైన మ్యాచ్ కాగా.. గతంలో వింబుల్డన్ టోరీ్నలో ఇంతకుమించిన మ్యాచ్‌లు చాలా జరిగాయి. 2010 వింబుల్డన్ టోర్నీలో జాన్ ఇస్నెర్ (అమెరికా), నికోలస్ మహుత్ (ఫ్రాన్స్) మధ్య జరిగిన పోరు ఇందులో ముందు వరుసలో నిలుస్తుంది.వర్షం అంతరాయం కలిగించడంతో... వరుసగా మూడు రోజులు సాగిన ఈ మారథాన్ మ్యాచ్ టెన్నిస్ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన పోరుగా రికార్డుల్లోకెక్కింది. ఇప్పటి వరకు ప్రొఫెషనల్ టెన్నిస్‌లో రెండు మ్యాచ్‌లు మాత్రమే 7 గంటలకు పైగా సాగగా... మరో 14 మ్యాచ్‌లు ఆరు గంటలకు పైగా జరిగాయి. ప్లేయర్ల అలసట, అభిమానుల అసౌకర్యం, నిర్వాహకులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రధాన టోర్నీల్లోని చివరి సెట్లోనూ ‘టైబ్రేకర్’ నిబంధనలు తీసుకొచ్చారు. 1970 నుంచి యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ‘టైబ్రేకర్’ అమలు చేస్తున్నారు. దీంతో సుదీర్ఘ పోరాటాలకు ఒకింత బ్రేక్ పడింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో... 6 గంటల 33 నిమిషాలుసీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ మారథాన్ మ్యాచ్‌లకు కొదువలేదు. 2004 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సుదీర్ఘ మ్యాచ్ జరిగింది. రెండు రోజుల పాటు సాగిన పోరులో ఫ్రాన్స్‌కే చెందిన ఫాబ్రిస్ సాంతోరో, ఆర్నాడ్ క్లెమెంట్ తుదికంటా పోరాడారు. 6 గంటల 33 నిమిషాల తర్వాత ఫాబ్రిస్ సాంతోరో 6–4, 6–3, 6–7 (5/7), 3–6, 16–14తో ఆర్నాడ్ క్లెమెంట్పై గెలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఇదే సుదీర్ఘ మ్యాచ్‌గా రికార్డుల్లోకెక్కింది. వింబుల్డన్‌లో ఇస్నెర్ డబుల్ ధమాకాటెన్నిస్ చరిత్రలో అత్యంత పురాతన గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన వింబుల్డన్‌లో అమెరికా ఆటగాడు జాన్ ఇస్నెర్ ఒకటికి రెండుసార్లు ఇలాంటి సుదీర్ఘ మ్యాచ్‌ల్లో భాగస్వామి అయ్యాడు. 2010 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఇస్నెర్, నికోలస్ మహుత్ మధ్య పోరు వరుసగా మూడు రోజుల పాటు నడిచింది. వర్షం కారణంగా అంతరాయాల నడుము జరిగిన పోరులో ఇస్నెర్ 6–4, 3–6, 6–7 (7/9), 7–6 (7/3), 70–68తో మహుత్‌పై విజయం సాధించాడు. 11 గంటల 5 నిమిషాల పాటు సాగిన ఈ పోరాటం... ప్రొఫెషనల్ టెన్నిస్‌లో అత్యంత సుదీర్ఘ పోరుగా చరిత్రకెక్కింది. ఇరువురు ఆటగాళ్లు గంటలకొద్దీ పట్టు వదలకుండా పోరాడటంతో ఈ రికార్డు సాధ్యమైంది. మరో ఎనిమిదేళ్ల తర్వాత 2018 వింబుల్డన్ సెమీఫైనల్లో మరోసారి ఇలాంటి సుదీర్ఘ పోరాటమే జరిగింది. 6 గంటల 36 నిమిషాల పాటు సాగిన పోరులో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 7–6 (8/6), 6–7 (5/7), 6–7 (9/11), 6–4, 26–24తో ఇస్నెర్‌పై విజయం సాధించాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో... 5 గంటల 53 నిమిషాలుటెన్నిస్ చరిత్రలో దిగ్గజ ప్లేయర్లుగా గుర్తింపు సాధించిన నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), రాఫెల్ నాదల్ (స్పెయిన్) కూడా సుదీర్ఘ పోరాటాల్లో భాగస్వాములయ్యారు. గిరిగీసి బరిలోకి దిగితే అంతుచూసేవరకు వదలని స్వభావం గల ఈ ఇద్దరూ ఎన్నో సార్లు హోరాహోరీగా తలబడ్డారు. అందులో 2012 ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ ఒకటి. 5 గంటల 53 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో జొకోవిచ్ 5–7, 6–4, 6–2, 6–7 (5/7), 7–5తో నాదల్‌ను ఓడించి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్నాడు. ఓపెన్ శకంలో (1968 నుంచి)అత్యంత సుదీర్ఘంగా సాగిన గ్రాండ్‌స్లామ్ ఫైనల్గానూ ఈ పోరు చరిత్రకెక్కింది. 1975కంటే ముందు టైబ్రేక్ నిబంధన లేదు.ఫలితంగా డేవిస్‌కప్‌లోనూ ఎన్నో సుదీర్ఘ మ్యాచ్‌లు జరిగాయి. 1975 తర్వాత నిర్ణాయక ఐదో సెట్ మినహా ఇతర సెట్లలో టైబ్రేక్లను అమలు చేయడం మొదలుపెట్టారు. 12 పాయింట్ల టైబ్రేక్‌లో తొలుత ఏడు పాయింట్లు సాధించిన ప్లేయర్‌కు సెట్ లభించేది. ఒకవేళ మ్యాచ్ ఐదో సెట్‌కు వెళితే స్కోరు 5–5 తర్వాత రెండు గేమ్‌ల ఆధిక్యం సంపాదించిన ప్లేయర్‌ను విజేతగా ప్రకటించేవారు. 2016 నుంచి డేవిస్ కప్‌లోనూ నిబంధనలు మార్చారు. మ్యాచ్‌లను ‘బెస్ట్ ఆఫ్ 5 సెట్స్’ పద్ధతిలో కాకుండా ‘బెస్ట్ ఆఫ్ 3 సెట్స్’గా నిర్వహించడం ప్రారంభించారు. సెట్లో స్కోరు 6–6తో సమంగా నిలిస్తే టైబ్రేక్‌ను అమలు చేస్తున్నారు.డేవిస్ కప్‌లో సుదీర్ఘ పురుషుల సింగిల్స్ మ్యాచ్లుసమయం- విజేత -పరాజిత- ఏడాది- స్కోరు 👉6గం:43ని- లియోనార్డో మాయెర్ (అర్జెంటీనా)- జొవా సౌజా (బ్రెజిల్)- 2015- 7–6 (7/4), 7–6 (7/5), 5–7, 5–7, 15–13 👉6గం:22ని-జాన్ మెకన్రో (అమెరికా)-విలాండర్ (స్వీడన్) -1982- 9–7, 6–2, 15–17, 3–6, 8–6 👉6గం:21ని-బోరిస్ బెకర్ (జర్మనీ)-జాన్ మెకన్రో (అమెరికా)-1987-6–3, 6–2, 4–6, 14–12 👉6గం:15ని-జోస్ లూయిస్ క్లెర్క్ (అర్జెంటీనా)-జాన్ మెకన్రో (అమెరికా)-1980-6–3, 6–2, 4–6, 14–12 👉6గం: 04ని-హార్స్ స్కాఫ్ (ఆ్రస్టియా)- విలాండర్ (స్వీడన్)-1989-6–7 (5/7), 7–6 (9/7), 1–6, 6–4, 9–7 – సాక్షి క్రీడావిభాగం -
‘ఫ్రెంచ్ కింగ్’ అల్కరాజ్
మట్టి కోర్టులపై కొత్త యువరాజు వచ్చాడు. ఇప్పటికే పచ్చిక కోర్టులపై, హార్డ్ కోర్టులపై గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన స్పెయిన్ యువతార కార్లోస్ అల్కరాజ్ మట్టి కోర్టులపై కూడా తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన తొలిసారే అల్కరాజ్ చాంపియన్‌గా అవతరించాడు. ఈ క్రమంలో పలు రికార్డులు నెలకొల్పాడు. మరోవైపు కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని ఆశించిన జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు రెండోసారీ నిరాశే ఎదురైంది. 2020 యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఐదు సెట్లలో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో ఓడిపోయిన జ్వెరెవ్ ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఐదు సెట్ల సమరంలో పరాజయం చవిచూశాడు.పారిస్: అంచనాలకు అనుగుణంగా ఆద్యంతం పట్టుదల కోల్పోకుండా ఆడిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఆదివారం ముగిసిన టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో 21 ఏళ్ల అల్కరాజ్ చాంపియన్‌గా అవతరించాడు. 4 గంటల 19 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ అల్కరాజ్ 6–3, 2–6, 5–7, 6–1, 6–2తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై విజయం సాధించాడు. విజేతగా నిలిచిన అల్కరాజ్కు 24 లక్షల యూరోలు (రూ. 21 కోట్ల 71 లక్షలు), రన్నరప్ జ్వెరెవ్‌కు 12 లక్షల యూరోలు (రూ. 10 కోట్ల 84 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన ఇద్దరు స్టార్ ఆటగాళ్ల మధ్య జరిగిన సమరం హోరాహోరీగా సాగింది. తొలి సెట్లో అల్కరాజ్ పైచేయి సాధించగా... రెండో సెట్లో జ్వెరెవ్ పుంజుకున్నాడు. మూడో సెట్లో ఒకదశలో జ్వెరెవ్ 2–5తో వెనుకబడ్డాడు. అయితే జ్వెరెవ్ సంయమనం కోల్పోకుండా ఆడి వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి సెట్‌ను 7–5తో సొంతం చేసుకొని టైటిల్ దిశగా అడుగు వేశాడు. కానీ నాలుగో సెట్లో అల్కరాజ్ మళ్లీ చెలరేగాడు.జ్వెరెవ్‌కు కేవలం ఒక గేమ్ కోల్పోయి సెట్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్లోనూ అల్కరాజ్ తన జోరు కొనసాగించాడు. రెండుసార్లు జ్వెరెవ్ సర్విస్‌ను బ్రేక్ చేసి తన సర్విస్లను నిలబెట్టుకొని ఈ స్పెయిన్ స్టార్ విజయకేతనం ఎగురవేశాడు. » ఓపెన్ శకంలో (1968 తర్వాత) మూడు ఉపరితలాలపై గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన పిన్న వయసు్కడిగా అల్కరాజ్ (21 ఏళ్లు) గుర్తింపు పొందాడు. గతంలో ఈ రికార్డు రాఫెల్ నాదల్ (23 ఏళ్లు) పేరిట ఉంది.హార్డ్ కోర్టులపై 2022 యూఎస్ ఓపెన్ నెగ్గిన అల్కరాజ్, 2023లో పచ్చిక కోర్టులపై వింబుల్డన్ టైటిల్ నెగ్గాడు. » టెన్నిస్‌లోని మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల (ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) టైటిల్స్ సాధించిన ఏడో ప్లేయర్‌గా అల్కరాజ్ ఘనత వహించాడు. రాఫెల్ నాదల్ (స్పెయిన్), మాట్స్ విలాండర్ (స్వీడన్), జిమ్మీ కానర్స్ (అమెరికా), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్ (సెర్బియా), ఆండ్రీ అగస్సీ (అమెరికా) గతంలో ఈ ఘనత సాధించారు. » కెరీర్లో ఫైనల్ చేరిన మొదటి మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన ఏడో ప్లేయర్‌గా అల్కరాజ్ నిలిచాడు. గతంలో గుస్తావో కుయెర్టన్ (బ్రెజిల్), స్టీఫెన్ ఎడ్బర్గ్ (స్వీడన్), జాన్ బోర్గ్ (స్వీడన్), ఫెడరర్, జిమ్మీ కానర్స్, వావ్రింకా (స్విట్జర్లాండ్) ఈ ఘనత సాధించారు. » నాదల్, సాంటానా, గిమెనో, సెర్గీ బ్రుగుయెరా, కార్లోస్ మోయా, అల్బెర్ట్ కోస్టా, కార్లోస్ ఫెరీరో తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఎనిమిదో స్పెయిన్ ప్లేయర్‌గా అల్కరాజ్ నిలిచాడు. -
చాంపియన్ స్వియాటెక్
పారిస్: వరల్డ్ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ ఎర్ర మట్టిపై తన జోరును కొనసాగిస్తూ ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో వరుసగా మూడో ఏడాది ఆమె చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో స్వియాటెక్ (పోలండ్) 6–2, 6–1 స్కోరుతో 12వ సీడ్ జాస్మిన్ పావ్లిని (ఇటలీ)పై ఘన విజయం సాధించింది. 2022, 2023, 2024లలో వరుసగా ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన స్వియాటెక్...అంతకు ముందు 2020లో కూడా ఇక్కడ విజేతగా ట్రోఫీని అందుకుంది. 2022 యూఎస్ ఓపెన్ కలిసి ఆమె ఖాతాలో మొత్తం ఐదు గ్రాండ్‌స్లామ్‌లు ఉన్నాయి. గ్రాండ్‌స్లామ్ టోరీ్నలలో ఫైనల్ చేరిన ఐదు సార్లూ స్వియాటెక్ టైటిల్ దక్కించుకోవడం విశేషం. 2007 (జస్టిన్ హెనిన్) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌ను వరుసగా మూడు సార్లు గెలిచిన తొలి మహిళా ప్లేయర్‌గా ఆమె నిలిచింది. తొలి సారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పావ్లిని బలమైన ప్రత్యర్థి జోరు ముందు నిలవలేకపోయింది. తొలి సెట్లో స్వియాటెక్ సర్వీస్‌ను బ్రేక్ చేసి పావ్లిని 2–1తో ముందంజ వేసినా...అది అక్కడితో సరి. పోలండ్ స్టార్ ఆ తర్వాత తన స్థాయికి తగ్గట్లు చెలరేగిపోయి వరుసగా 10 గేమ్‌లను గెలుచుకుంది. ఫలితంగా తొలి సెట్‌ను గెలుచుకోవడంతో పాటు రెండో సెట్లోనూ 5–0తో విజయానికి చేరువైంది. ఈ స్థితిలో తర్వాతి గేమ్‌ను ఎలాగో పావ్లిని గెలుచుకోగలిగినా...తర్వాతి గేమ్‌ను అలవోకగా సొంతం చేసుకొని స్వియాటెక్ సంబరాలు చేసుకుంది. 68 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో స్వియాటెక్ 18 విన్నర్లు కొట్టగా...18 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్‌తో పావ్లిని తన ఓటమిని ఆహ్వానించింది. విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు 24 లక్షల యూరోలు (సుమారు రూ. 22 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. నేడు పురుషుల ఫైనల్ అల్కరాజ్ (స్పెయిన్) X జ్వెరెవ్ (జర్మనీ)సా.గం.6.00 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
అల్కరాజ్ అదరహో
పారిస్: కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించడానికి స్పెయిన్ టెన్నిస్ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ విజయం దూరంలో నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో అల్కరాజ్ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. వచ్చే వారం కొత్త ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించనున్న ప్రస్తుత రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ (ఇటలీ)తో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో అల్కరాజ్ 2–6, 6–3, 3–6, 6–4, 6–3తో గెలుపొందాడు. నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), గత ఏడాది రన్నరప్ కాస్పర్ రూడ్ (నార్వే) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో అల్కరాజ్ తలపడతాడు. 21 ఏళ్ల అల్కరాజ్ 2022లో యూఎస్ ఓపెన్, 2023లో వింబుల్డన్ టోర్నీర్నీలో విజేతగా నిలిచాడు. అడ్రియానో పనట్టా (1976లో) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి ఇటలీ ప్లేయర్‌గా ఘనత వహించాలనుకున్న సినెర్‌కు నిరాశ ఎదురైంది. 4 గంటల 9 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సినెర్ చివరి రెండు సెట్లలో అల్కరాజ్ ఆటకు ఎదురునిలువలేక ఓడిపోయాడు. 8 ఏస్‌లు, 7 డబుల్ ఫాల్ట్‌లు చేసిన అల్కరాజ్ 65 విన్నర్స్‌తో అదరగొట్టాడు. తన సర్విస్‌ను ఆరుసార్లు కోల్పోయిన ఈ మాజీ నంబర్‌వన్ ప్రత్యర్థి సర్విస్‌ను కూడా ఆరుసార్లు బ్రేక్ చేశాడు. 15 పాసింగ్, 23 డ్రాప్ షాట్లతో అలరించిన అల్కరాజ్ నెట్ వద్దకు 27 సార్లు దూసుకొచ్చి 16 సార్లు పాయింట్లు గెలిచాడు.స్వియాటెక్ X జాస్మిన్ » నేడు మహిళల సింగిల్స్ ఫైనల్» సాయంత్రం గం. 6:30 నుంచి సోనీ స్పోర్ట్స్లోకెరీర్లో ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా స్వియాటెక్... తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే పట్టుదలతో జాస్మిన్ పావ్లిని... నేడు జరిగే ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తలపడనున్నారు. ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్ (పోలాండ్) ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను మూడుసార్లు (2020, 2022, 2023) చేజిక్కించుకోగా... 15వ ర్యాంకర్ జాస్మిన్ (ఇటలీ) మాత్రం కెరీర్లో 18వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతూ తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరింది. -
టైటిల్ పోరుకు స్వియాటెక్, జాస్మిన్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగో టైటిల్ గెలిచేందుకు పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్ విజయం దూరంలో నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన స్వియాటెక్ గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో 6–2, 6–4తో మూడో ర్యాంకర్ కోకో గాఫ్ (అమెరికా)పై గెలిచింది. రెండో సెమీఫైనల్లో 12వ సీడ్ జాస్మిన్ పావ్లిని (ఇటలీ) 6–3, 6–1తో రష్యాకు చెందిన 17 ఏళ్ల మిరా ఆండ్రీవాపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 5–7, 6–2, 2–6తో బొలెలీ–వావసోరి (ఇటలీ) జోడీ చేతిలో ఓడింది. -
సబలెంకాకు చుక్కెదురు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్), నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్) క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. రష్యాకు చెందిన 17 ఏళ్ల మిరా ఆండ్రీవా 2 గంటల 29 నిమిషాల పోరులో 6–7 (5/7), 6–4, 6–4తో సబలెంకాను బోల్తా కొట్టించగా... ఇటలీకి చెందిన 12వ సీడ్ జాస్మిన్ పావ్లిని 2 గంటల 3 నిమిషాల్లో 6–2, 4–6, 6–4తో రిబాకినాను ఓడించింది. ఆండ్రీవా, జాస్మిన్ తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. సెమీస్‌లో బోపన్న జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 7–6 (7/3), 5–7, 6–1తో సాండర్ గిలె–జొరాన్ వ్లీగెన్ (బెల్జియం) జంటను ఓడించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో మూడో ర్యాంకర్ అల్కరాజ్ (స్పెయిన్) సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6–3, 7–6 (7/3), 6–4తో తొమ్మిదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)పై గెలిచి రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ (ఇటలీ)తో సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు. -
కోకో గాఫ్ తొలిసారి...
పారిస్: పట్టుదలతో పోరాడిన అమెరికా టెన్నిస్ యంగ్‌స్టార్ కోకో గాఫ్ వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్, మూడో సీడ్ కోకో గాఫ్ 4–6, 6–2, 6–3తో ఎనిమిదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీíÙయా)పై గెలిచింది. ఐదోసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న కోకో గాఫ్ తొలిసారి సెమీఫైనల్లోకి ప్రవేశించడం విశేషం. 2023 యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన కోకో ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్లో నిష్క్రమించింది. జబర్‌తో గంటా 57 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కోకో ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. 21 విన్నర్స్ కొట్టిన ఆమె నెట్ వద్ద 11 పాయింట్లు గెలిచింది. మరో క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 6–0, 6–2తో ఐదో సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)పై అలవోకగా గెలిచి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 62 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్ ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది.వైదొలిగిన జొకోవిచ్ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మోకాలి గాయంతో ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలిగాడు. సెరున్‌డొలో (అర్జెంటీనా)తో 4 గంటల 39 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–1, 5–7, 3–6, 7–5, 6–3తో గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్ సందర్భంగా జొకోవిచ్ జారిపడటంతో అతని మోకాలికి గాయమైంది. గాయం తీవ్రత దృష్ట్యా జొకోవిచ్ క్వార్టర్ ఫైనల్లో బరిలోకి దిగకూడదని నిర్ణయం తీసుకొని టోర్నీ నుంచి వైదొలిగాడు. కొత్త నంబర్‌వన్ సినెర్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, ఇటలీ స్టార్ యానిక్ సినెర్ కొత్త ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించనున్నాడు. జొకోవిచ్ టోర్నీ నుంచి వైదొలగడం... సినెర్ సెమీఫైనల్ చేరుకోవడంతో ఈ ఇటలీ స్టార్ ఈనెల పదో తేదీన విడుదలయ్యే ర్యాంకింగ్స్‌లో అధికారికంగా నంబర్‌వన్ స్థానాన్ని అందుకుంటాడు. క్వార్టర్ ఫైనల్లో సినెర్ 6–2, 6–4, 7–6 (7/3)తో పదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై గెలిచి కెరీర్లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. -
స్వియాటెక్ ఫటాఫట్...
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ‘హ్యాట్రిక్’ టైటిల్‌పై గురి పెట్టిన ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ ఆ దిశగా మరో అడుగు వేసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ అదరగొట్టింది. రష్యా ప్లేయర్ అనస్తాసియా పొటపోవాతో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ స్వియాటెక్ (పోలాండ్) 6–0, 6–0తో ఘనవిజయం సాధించింది. కేవలం 40 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్ మూడు ఏస్‌లు సంధించింది. ప్రత్యర్థి సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. 13 విన్నర్స్ కొట్టిన ఆమె నెట్ వద్ద ఆరు పాయింట్లు గెలిచింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–1, 6–2తో ఎలిసబెట్టా కొకైరెట్టో (ఇటలీ)పై, ఐదో సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 6–4, 6–2తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అల్కరాజ్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), తొమ్మిదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అల్కరాజ్ 6–3, 6–3, 6–1తో అగుర్ అలియాసిమ్ (కెనడా)పై, సిట్సిపాస్ 3–6, 7–6 (7/4), 6–2, 6–2తో మాటియో అర్నాల్డి (ఇటలీ)పై గెలుపొందారు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్ మ్యాచ్‌లో విజయం కోసం తీవ్రంగా శ్రమించాడు. 4 గంటల 29 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ 7–5, 6–7 (6/8), 2–6, 6–3, 6–0తో లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ పురుషుల డబుల్స్‌లో రెండో సీడ్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఆదివారం జరిగిన తొలి రౌండ్లో బోపన్న–ఎబ్డెన్ జోడీ 7–5, 4–6, 6–4తో ఒర్లాండో లుజ్–మార్సెలో జొర్మాన్ (బ్రెజిల్) జంటను ఓడించింది. రెండో రౌండ్లో బోపన్న–ఎబ్డెన్లతో ఆడాల్సిన సెబాస్టియన్ బేజ్ (అర్జెంటీనా)–థియాగో వైల్డ్ (బ్రెజిల్) టోర్నీ నుంచి వైదొలిగారు. దాంతో బోపన్న–ఎబ్డెన్ రెండో రౌండ్ మ్యాచ్ ఆడకుండానే నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో)లతో బోపన్న–ఎబ్డెన్ ఆడతారు. -
ప్రిక్వార్టర్స్ చేరిన రిబాకినా
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో కజకిస్తాన్ స్టార్ రిబాకినా, రెండో సీడ్ సబలెంక అలవోక విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడోరౌండ్లో నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–4, 6–2తో వరుస సెట్లలో ఎలైస్ మెర్టెన్స్ (బెల్జియం)ను చిత్తు చేయగా, రెండో సీడ్ సబలెంక (రష్యా) 7–5, 6–1తో బడొసా (స్పెయిన్)పై నెగ్గింది. ఆ్రస్టేలియా ఓపెన్ రన్నరప్, ఏడోసీడ్ క్వినెన్ జెంగ్‌కు రష్యా ప్లేయర్ ఎలీనా అవనెసియాన్ షాకి చ్చింది. మూడో రౌండ్లో అన్సీడెన్ ఎలీనా 3–6, 6–3, 7–6 (10/6)తో చైనా స్టార్‌ను ఇంటిదారి పట్టించింది. మరో మ్యాచ్‌లో వింబుల్డన్ చాంపియన్ మార్కెటా వొండ్రొసొవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–3తో క్లో పాక్వెట్ (ఫ్రాన్స్)పై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరింది. పురుషుల సింగిల్స్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్, అల్కరాజ్ ముందంజ వేశారు. మూడోరౌండ్లో నిరుటి సెమీఫైనలిస్ట్, నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 3–6, 6–4, 6–2, 4–6, 7–6 (10/3)తో టాలన్ గ్రీక్స్పూర్ (నెదర్లాండ్స్)పై శ్రమించి నెగ్గాడు. స్పెయిన్ స్టార్, మూడో సీడ్ కార్లొస్ అల్కరాజ్ 6–4, 7–6 (7/5), 6–3తో 27వ సీడ్ సెబాస్టియన్ కొర్డా (అమెరికా)పై గెలుపొందగా, సిట్సిపాస్ (గ్రీస్) 6–3, 6–3, 6–1తో జాంగ్ జిజెన్ (చైనా)ను ఓడించాడు. ఆ్రస్టేలియా ఓపెన్ రన్నరప్, ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 7–6 (7/4), 7–5, 1–6, 6–4తో థామస్ మచక్ (చెక్ రిపబ్లిక్)పై చెమటోడ్చి విజయం సాధించాడు. శ్రీరామ్ బాలాజీ ముందంజ భారత ఆటగాడు శ్రీరామ్ బాలాజీ ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. పురుషుల డబుల్స్‌లో మిగెల్ వరేలా (మెక్సికో)తో జోడీకట్టిన బాలాజీ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో భారత్–మెక్సికన్ ద్వయం 6–4, 3–6, 6–2తో డాన్ ఆడెడ్–థియో అరిబేజ్ (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. -
స్వియాటెక్ సులువుగా...
పారిస్: రెండో రౌండ్లో ఓటమి అంచుల్లో నుంచి గట్టెక్కిన పోలాండ్ టెన్నిస్ స్టార్ ఇగా స్వియాటెక్ మూడో రౌండ్లో మాత్రం అలవోకగా గెలిచింది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వరుసగా ఆరో ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటికే ఈ టోర్నీలో మూడుసార్లు విజేతగా నిలిచిన స్వియాటెక్ శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో 6–4, 6–2తో మేరీ బుజ్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్ ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి సర్విస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 34 విన్నర్స్ కొట్టిన ఆమె కేవలం ఎనిమిది అనవసర తప్పిదాలు చేసింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–2, 6–4తో డయానా యెస్ట్రెమ్స్కా (ఉక్రెయిన్)పై, ఐదో సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–3తో చోల్ పాక్వెట్ (ఫ్రాన్స్)పై, ఎనిమిదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీషియా) 6–4, 7–6 (7/5)తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సినెర్ ముందంజ... పురుషుల సింగిల్స్ విభాగంలో ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ (ఇటలీ) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సినెర్ మూడో రౌండ్లో 6–4, 6–4, 6–4తో కొటోవ్ (రష్యా)ను ఓడించాడు. ఆరో సీడ్ రుబ్లెవ్ (రష్యా) మాత్రం మూడో రౌండ్లోనే నిష్క్రమించాడు. అర్నాల్డి (ఇటలీ) 7–6 (8/6), 6–2, 6–4తో రుబ్లెవ్‌ను ఇంటిదారి పట్టించాడు. బాలాజీ జోడీ గెలుపు పురుషుల డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో) జోడీ రెండో రౌండ్‌కు చేరింది. తొలి రౌండ్లో బాలాజీ–వరేలా ద్వయం 6–3, 6–4తో రీస్ స్టాల్డెర్ (అమెరికా)–సెమ్ వీర్బీక్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ 3–6, 6–7 (5/7)తో జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా)–సఫీయులిన్ (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది. -
జొకోవిచ్ అలవోకగా...
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ వరుసగా 19వ ఏడాది మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఈ సెర్బియా దిగ్గజం 6–4, 6–1, 6–2తో రొబెర్టో కార్బెలస్ బేనా (స్పెయిన్)పై విజయం సాధించాడు. 2 గంటల 4 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ ఐదు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. కెరీర్లో 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్ 43 విన్నర్స్ కొట్టడంతోపాటు నెట్ వద్ద 20 పాయింట్లు సాధించాడు. మరోవైపు నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), ఎనిమిదో సీడ్ హుర్కాజ్ (పోలాండ్) కూడా మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో జ్వెరెవ్ 7–6 (7/4), 6–2, 6–2తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై, హుర్కాజ్ 6–7 (2/7), 6–1, 6–3, 7–6 (7/5)తో నకíÙమా (అమెరికా)పై గెలుపొందారు. కెచ్‌మనోవిచ్ (సెర్బియా)తో జరిగిన మ్యాచ్‌లో మెద్వెదెవ్ తొలి సెట్‌ను 6–1తో నెగ్గి, రెండో సెట్లో 5–0తో ఆధిక్యంలో ఉన్నపుడు కెచ్‌మనోవిచ్ గాయం కారణంగా వైదొలిగాడు. సబలెంకా ముందుకు... మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్), నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సబలెంకా 6–2, 6–2తో ఉచిజిమా (జపాన్)పై, రిబాకినా 6–3, 6–4తో అరంటా రుస్ (నెదర్లాండ్స్)పై గెలిచారు. డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 7–6 (7/1), 1–6, 7–5తో నయోమి ఒసాకా (జపాన్)పై, మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–3, 6–4తో తమారా జిదాన్సెక్ (స్లొవేనియా)పై నెగ్గారు. -
టైటిల్ వేట మొదలైంది...
పారిస్: కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గాలనే లక్ష్యంతో ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) తొలి రౌండ్‌ను దాటాడు. ప్రపంచ 142వ ర్యాంకర్ హెర్బర్ట్ (ఫ్రాన్స్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో జొకోవిచ్ 2 గంటల 31 నిమిషాల్లో 6–4, 7–6 (7/3), 6–4తో గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ప్రత్యర్థి సర్విస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ నెట్ వద్ద 19 పాయింట్లు గెలిచాడు. మరోవైపు మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), ఆరో సీడ్ రుబ్లెవ్ (రష్యా), తొమ్మిదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో అల్కరాజ్, సిట్సిపాస్లకు తమ ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురుకాగా... రుబ్లెవ్ వరుస సెట్లలో విజయాన్ని అందుకున్నాడు. అల్కరాజ్ 3 గంటల 9 నిమిషాల్లో 6–3, 6–4, 2–6, 6–2తో జెస్పర్ డి జాంగ్ (నెదర్లాండ్స్)పై, సిట్సిపాస్ 2 గంటల 43 నిమిషాల్లో 6–3, 6–2, 6–7 (2/7), 6–4తో అల్టమెయిర్ (జర్మనీ)పై, రుబ్లెవ్ 2 గంటల 1 నిమిషంలో 6–3, 6–4, 6–3తో పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్)పై గెలుపొందారు. జాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్కరాజ్ తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి స ర్వి స్ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేశాడు. 35 విన్నర్స్ కొట్టిన ఈ స్పెయిన్ స్టార్ ఏకంగా 47 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. మహిళల సింగిల్స్‌లో 2020 ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ (అమెరికా), ఎనిమిదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీ షియా) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సోఫియా 6–3, 6–3తో 21వ సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్)పై, ఎనిమిదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీషియా) 6–3, 1–6, 6–3తో కామిలా ఒసోరియో (కొలంబియా)పై గెలుపొందారు. భారీ వర్షాల కారణంగా బుధవారం ఏకంగా 23 సింగిల్స్ మ్యాచ్‌లను వాయిదా వేశారు. -
French Open 2024: నాదల్కు షాక్
పారిస్: తరచూ గాయాలబారిన పడటం... పూర్తిస్థాయి ఫిట్నెస్ లేకపోవడం... వెరసి మట్టికోర్టులపై మకుటంలేని మహరాజుగా వెలుగొందిన స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్కు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ఊహించని పరాజయం ఎదురైంది. 2005 నుంచి ఈ టోర్నీలో ఆడుతూ ఏకంగా 14 సార్లు విజేతగా నిలిచిన 37 ఏళ్ల నాదల్ మొదటి రౌండ్లోనే ఇంటిదారి పట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రపంచ నాలుగో ర్యాంకర్, గత మూడేళ్లుగా ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరిన జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ పక్కా ప్రణాళికతో ఆడి నాదల్ ఆట కట్టించాడు. 3 గంటల 5 నిమిషాలపాటు సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో జ్వెరెవ్ 6–3, 7–6 (7/5), 6–3తో నాదల్‌ను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు నాదల్ సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. జ్వెరెవ్ సరీ్వస్‌ను కేవలం రెండుసార్లు బ్రేక్ చేసిన నాదల్ 30 అనవసర తప్పిదాలు కూడా చేశాడు. గాయం కారణంగా గత ఏడాది ఈ టోరీ్నకి దూరంగా ఉన్న నాదల్ తాజా ఓటమితో చివరిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడినట్లు భావించాలి. సుమిత్ నగాల్ ఓటమి ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి ఆడుతున్న భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ పోరాటం మొదటి రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ 18వ ర్యాంకర్ ఖచనోవ్ (రష్యా)తో జరిగిన మ్యాచ్‌లో సుమిత్ 2–6, 0–6, 6–7 (5/7)తో ఓడిపోయాడు. మరోవైపు ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ (ఇటలీ) శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో సినెర్ 6–3, 6–3, 6–4తో యుబ్యాంక్స్ (అమెరికా)పై గెలిచాడు. స్వియాటెక్ ముందంజ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో స్వియాటెక్ 6–1, 6–2తో లియోలియా జీన్జీన్ (ఫ్రాన్స్)పై గెలిచింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–1, 6–1తో జూలియా అవ్దీవా (రష్యా)పై, ఎనిమిదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీíÙయా) 6–3, 6–2తో సాచియా వికెరీ (అమెరికా)పై, ఐదో సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–3తో మసరోవా (స్పెయిన్)పై విజయం సాధించారు. 3: ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో నాదల్‌ను ఓడించిన మూడో ప్లేయర్‌గా జ్వెరెవ్ నిలిచాడు. గతంలో సోడెర్లింగ్ (స్వీడన్; 2009లో ప్రిక్వార్టర్స్‌లో) ఒకసారి... జొకోవిచ్ (సెర్బియా; 2015 క్వార్టర్ ఫైనల్లో, 2021 సెమీఫైనల్లో) రెండుసార్లు ఈ టోర్నీ లో నాదల్‌ను ఓడించారు. 2016లో గాయం కారణంగా నాదల్ మూడో రౌండ్ నుంచి వైదొలిగాడు.3: గ్రాండ్‌స్లామ్ టోరీ్నలలో నాదల్ తొలి రౌండ్లో ఓడిపోవడం ఓవరాల్‌గా ఇది మూడోసారి మాత్రమే. ఇంతకుముందు నాదల్ 2016 ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో, 2013 వింబుల్డన్ టోర్నీలో తొలి రౌండ్లో ఓటమి పాలయ్యాడు. -
French Open 2024: నేటినుంచి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
ప్రతిష్టాత్మక క్లే కోర్టు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. పారిస్‌లో నేడు ప్రారంభమయ్యే ఈ టోర్నీ 9 జూన్ వరకు సాగుతుంది. ఈ మెగా టోర్నీలో ప్రస్తుతం అందరి దృష్టీ దిగ్గజ ఆటగాడు, 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్)పైనే ఉంది. తొలి రౌండ్లో అతను సోమవారం నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో తలపడతాడు.ఈ జూన్ 3న 38 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న నాదల్ వరుస గాయాలతో ఇబ్బంది పడుతూ ఒక దశలో టోరీ్నకి దూరమయ్యేలా కనిపించాడు. అయితే శనివారం మీడియాతో మాట్లాడిన అతను తాను ప్రస్తుతం మంచి స్థితిలో ఉన్నానని, ఇది చివరి ఫ్రెంచ్ ఓపెన్ కాకపోవచ్చని స్పష్టం చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన మ్యాచ్‌లలో మహిళల సింగిల్స్‌లో లూసియా బ్రాన్జెట్టీతో 4 గ్రాండ్‌స్లామ్‌ల విజేత నయోమీ ఒసాకా తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో జేజే వుల్ఫ్‌ను మూడో సీడ్ కార్లోస్ అల్కరాజ్ ఎదుర్కొంటాడు. అయితే సీనియర్లు ఆండీ ముర్రే, స్టాన్ వావ్రింకా మధ్య పోరు అత్యంత ఆసక్తికరం కానుంది. -
మళ్లీ ఓడిన నాదల్
రోమ్: గాయంనుంచి కోలుకొని మళ్లీ కోర్టులోకి అడుగు పెట్టిన తర్వాత రాణించలేకపోతున్న టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్కు మరో పరాజయం ఎదురైంది. గత వారమే మాడ్రిడ్ ఓపెన్‌లో ఓడిన నాదల్ ఇప్పుడు ఇటాలియన్ ఓపెన్ రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. ఈ క్లే కోర్టు టోర్నీలో 10 సార్లు చాంపియన్‌గా నిలిచిన నాదల్‌పై 6–1, 6–3 స్కోరుతో వరల్డ్ నంబర్ 9 హ్యూబర్ట్ హర్కాజ్ (పోలండ్) ఘన విజయం సాధించాడు.గత ఏడాదిన్నర కాలంలో నాదల్ టాప్–10 ర్యాంకుల్లో ఉన్న ఆటగాడితో తలపడటం ఇదే మొదటిసారి. 93 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో నాదల్ 4 గేమ్‌లే గెలవడం అతని పరిస్థితిని చూపిస్తోంది. తాజా ప్రదర్శన తాను ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడే విషయంపై సందేహాలు లేవనెత్తుతోందని మ్యాచ్ ముగిసిన తర్వాత నాదల్ వ్యాఖ్యానించాడు. -
French Open 2024 : సాత్వి క్–చిరాగ్ జోడీదే టైటిల్
పారిస్: ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ సాత్వి క్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ ఈ ఏడాది తమ ఖాతాలో తొలి టైటిల్‌ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోరీ్నలో సాత్విక్–చిరాగ్ ద్వయం చాంపియన్‌గా నిలిచింది. కేవలం 37 నిమిషాల్లో ముగిసిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జంట సాత్వి క్–చిరాగ్ 21–11, 21–17తో లీ జె హుయ్–పో సువాన్ యాంగ్ (చైనీస్ తైపీ) జోడీని ఓడించింది. టైటిల్ గెలిచే క్రమంలో భారత జోడీ తమ ప్రత్యర్థులకు ఒక్కగేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. విజేతగా నిలిచిన సాత్వి క్–చిరాగ్ శెట్టిలకు 62,900 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 52 లక్షలు), 11,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టి 2022లోనూ ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ గెలిచారు. ఈ ఏడాది సాత్వి క్–చిరాగ్ మలేసియా మాస్టర్స్ టోర్నీ, ఇండియా ఓపెన్ టోరీ్నలలో ఫైనల్ చేరి రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు. మూడో టోర్నీలో మాత్రం ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా విజేతగా నిలిచారు. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ కాంగ్ మిన్ హుక్–సియో సెంగ్ జే (దక్షిణ కొరియా) జోడీని 21–13, 21–16తో చిత్తు చేసిన సాత్వి క్–చిరాగ్... ఫైనల్లోనూ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. సుదీర్ఘ ర్యాలీలు సాగకుండా కళ్లు చెదిరే స్మాష్‌లతో పాయింట్లను తొందరగా ముగించారు. తొలి గేమ్‌లో తొలి ఏడు నిమిషాల్లోనే సాత్వి క్–చిరాగ్ 11–4తో ఆధిక్యంలోకి వెళ్లారు. ఆ తర్వాత అదే జోరును కొనసాగిస్తూ మరో నాలుగు నిమిషాల్లో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నారు. రెండో గేమ్‌లో చైనీస్ తైపీ జోడీ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా కీలకదశలో భారత ద్వయం పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. -
French Open: పీవీ సింధుకు పరభావం.. క్వార్టర్స్‌లో ఓటమి
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో చైనాకు చెందిన చెన్ యు ఫీ చేతిలో ఓటమి పాలైంది. క్వార్టర్స్‌లో అద్భుతమైన పోరాట పటిమ చూపించిన సింధు.. ఆఖరికి 24-22,17-21, 18-21తో పరాజయం చవిచూసింది. హోరాహోరీగా సాగిన తొలి సెట్లో 24-22 తేడాతో చెన్ యు ఫీని ఓడించిన సింధూ.. రెండు, మూడు సెట్లను మాత్రం ప్రత్యర్థికి కోల్పోయింది. రెండు, మూడు సెట్లలో ప్రత్యర్ధి చెన్ యు ఫీ అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఎటువంటి తప్పిదాలు చేయకుండా సెమీస్బెర్త్ను ఖారారు చేసుకుంది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి జోడీ 21-19, 21-13తో సుపక్ జొంకో, కెడ్రెన్(థాయ్‌లాండ్) జోడీని ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. తొలి గేమ్‌ను కష్టంగా గెలిచిన సాత్విక్, చిరాగ్ జంట.. రెండో గేమ్‌ను అలవోకగా దక్కించుకున్నారు. సెమీస్‌లో మిన్ హ్యుక్ కాంగ్, సెయింగ్ జయె(కొరియా) జోడీతో తలపడనున్నారు. చదవండి: IPL 2024: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రోహిత్ శర్మ సంచలన నిర్ణయం..!? -
సింధు పరాజయం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లకు క్వార్టర్ ఫైనల్లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ నంబర్‌వన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లగా, రెండు వరుస ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధుకు క్వార్టర్ ఫైనల్లో చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 24–22, 17–21, 18–21తో ఒలింపిక్ చాంపియన్ చెన్ యూ ఫె (చైనా) చేతిలో పోరాడి ఓడింది. గంటా 32 నిమిషాల పాటు భారత స్టార్ తుదికంటా పోరాడినా ఫలితం దక్కలేదు. ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ యూ ఫెకు దీటుగా కోర్టులో శ్రమించడంతో ర్యాలీలు సుదీర్ఘంగా సాగాయి. దీంతో తొలిగేమ్ హోరాహోరీగా సాగింది. 22–22 వద్ద సింధు క్రాస్‌కోర్టు షాట్లతో విరుచుకుపడి తొలిగేమ్ నెగ్గింది. తర్వాత రెండో గేమ్‌లో సరీ్వస్ వైఫల్యంతో వెనుకబడిన సింధు గేమ్‌ను కోల్పోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లోనూ ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. కానీ చైనా ప్రత్యర్థి పైచేయి సాధించడంతో మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్‌సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 21–19, 21–13తో థాయ్‌లాండ్‌కు చెందిన సుపక్ జొమ్కొ–కిటినుపాంగ్ కెడ్రెన్ జోడీపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ కూడా సెమీస్ చేరుకున్నాడు. క్వార్టర్స్ మ్యాచ్‌లో లక్ష్య 19–21, 21–15, 21–13 స్కోరుతో లో కీన్ యూ (సింగపూర్)ను ఓడించాడు. -
గట్టెక్కిన సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 80 నిమిషాల్లో 20–22, 22–20, 21–19తో మిచెల్లి లీ (కెనడా)పై కష్టపడి గెలిచింది. తొలి గేమ్ కోల్పోయి, రెండో గేమ్‌లో 7–14తో వెనుకబడిన సింధు నెమ్మదిగా పుంజుకుంది. స్కోరు 15–18 వద్ద సింధు వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 20–18తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత స్కోరు 20–20తో సమమైనా... కీలకదశలో సింధు రాణించి రెండు పాయింట్లు నెగ్గి 22–20తో గేమ్‌ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్ కూడా హోరాహోరీగా సాగినా కీలక తరుణంలో సింధు పైచేయి సాధించింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–15, 20–22, 21–8తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై నెగ్గగా... ప్రణయ్ 17–21, 17–21తో లు గ్వాంగ్ జు (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు. -
ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి జోడీ
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో గాయత్రి–ట్రెసా ద్వయం 16–21, 21–19, 21–17తో భారత్‌కే చెందిన అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జంటను ఓడించింది. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–13, 24–22తో ఒంగ్ యె సిన్–తియో ఈ యి (మలేసియా) జంటపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో లక్ష్య సేన్ (భారత్) 15–21, 21–15, 21–3తో కాంటా సునెయామ (జపాన్)పై నెగ్గగా... ప్రియాన్షు రజావత్ (భారత్) 8–21, 15–21తో ప్రపంచ నంబర్‌వన్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. -
సాత్విక్–చిరాగ్ జోడీకి షాక్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల కథ ముగిసింది. పురుషుల డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్స్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీకి ప్రిక్వార్టర్ ఫైనల్లో చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ పీవీ సింధు గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో వైదొలిగింది. డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 23–25, 21–19, 19–21తో మొహమ్మద్ అహసాన్–హెంద్రా సెతియవాన్ (ఇండోనేసియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. సుపనిద కటెథోంగ్ (థాయ్‌లాండ్)తో జరిగిన మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను 21–18తో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో స్కోరు 1–1 వద్ద సింధు మోకాలికి గాయం కావడంతో ఆమె మ్యాచ్ నుంచి వైదొలిగింది. -
శ్రమించి నెగ్గిన సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 69 నిమిషాల్లో 12–21, 21–18, 21–15తో ప్రపంచ 7వ ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా టున్‌జంగ్ (ఇండోనేసియా)పై కష్టపడి గెలిచింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–13, 21–13తో లుకాస్ కోర్వి–రొనన్ లాబర్ (ఫ్రాన్స్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
18 ఏళ్లకే సంచలనాలు.. 70వ దశకాన్ని శాసించిన టెన్నిస్ దిగ్గజం
21 ఏళ్ల వయసు వచ్చే సరికే టెన్నిస్ చరిత్రలో దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా అతను గుర్తింపు తెచ్చుకోగలిగాడు. 26 ఏళ్ల వయసు వచ్చేసరికి ఎందరికో సాధ్యం కాని ఘనతలను అతను సొంతం చేసుకున్నాడు. ఆధునిక టెన్నిస్ తరంలో ఏ ఆటగాడి కెరీర్ కూడా అంత తక్కువ సమయంలో అంత అద్భుతంగా లేదు. చాంపియన్‌షిప్ విజయాలు, ఫలితాలు మాత్రమే కాదు.. అతను వాటిని సాధించిన తీరు కూడా అబ్బురపరచాయి. 18 ఏళ్ల వయసుకే ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి అప్పటికి అత్యంత పిన్న వయస్కుడిగా అతను గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండు పూర్తిగా భిన్నమైన వేదికలపై వరుసగా మూడేసి సార్లు గ్రాండ్‌స్లామ్ గెలవడం అతనికి మాత్రమే సాధ్యమైన ఘనత. ఆ పొడవాటి జట్టు, హెడ్ బ్యాండ్ సుదీర్ఘ సమయం పాటు ప్రపంచ టెన్నిస్‌పై చెరగని ముద్ర వేశాయి. వరల్డ్ టెన్నిస్‌లో ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచిన ఆ స్వీడిష్ స్టార్ ప్లేయర్ బోర్న్ బోర్గ్. టీనేజ్ సంచలనంగా తన కెరీర్ మొదలు పెట్టిన బోర్గ్ తన ఆకర్షణీయమైన ఆటతో 70వ దశకపు టెన్నిస్ ప్రపంచాన్ని శాసించాడు. 'మేమందరం టెన్నిస్ ఆడుతున్నాం. అతను మాత్రం అంతకు మించి ఆడుతున్నాడు'.. 1976 వింబుల్డన్ ఫైనల్లో బోర్గ్ చేతిలో ఓడిన తర్వాత అతని ప్రత్యర్థి, అప్పటి ఫేవరెట్ ఎలీ నాస్టెస్ చేసిన వ్యాఖ్య అది. 20 ఏళ్ల బోర్గ్ ఆ మ్యాచ్‌లో చూపిన ప్రదర్శన అలాంటిది మరి. మంచి ఫిట్నెస్.. చక్కటి నైపుణ్యంతో పాటు వైవిధ్యమైన శైలి బోర్గ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అటు ఫోర్‌హ్యాండ్‌ను, ఇటు బ్యాక్‌హ్యాండ్‌ను కూడా సమర్థంగా వాడగల ప్రతిభ బోర్గ్ అద్భుతమైన కెరీర్‌కి బలాలుగా నిలిచాయి. హాకీలో స్లాప్ షాట్ తరహాలో రెండు చేతులతో అతను ఆడే బ్యాక్‌హ్యాండ్‌కు ప్రత్యర్థి ఎవరైనా సరే.. ఓటమిని ఒప్పుకోవాల్సిందే. 13 ఏళ్ల వయసులోనే స్వీడన్ లో 18 ఏళ్ల ఆటగాళ్లందరినీ ఓడించి వచ్చిన బోర్గ్ ఆటపై ఆ దేశపు అభిమానులు పెట్టుకున్న అంచనాలు ఎప్పుడూ తప్పు కాలేదు. బోర్గ్ తండ్రి తనకు స్థానిక పోటీల్లో బహుమతిగా వచ్చిన ఒక రాకెట్‌ను కొడుకు చేతుల్లో పెట్టినప్పుడు అతనికి తొలిసారి ఆటపై ఆసక్తి కలిగింది. ఆ తర్వాత మొదలైన అతని సాధన బోర్గ్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. ఆటలో ఓనమాలు నేర్చుకున్నప్పుడు అతను బేస్‌లై¯Œ కే ప్రాధాన్యమిచ్చాడు. సుదీర్ఘ ర్యాలీలు ప్రాక్టీస్ చేయడంతో పాటు బ్యాక్‌హ్యాండ్‌పై దృష్టి పెట్టాడు. ప్రొఫెషనల్‌గా మారిన తర్వాత కూడా బోర్గ్ సర్వీస్ కాస్త బలహీనంగానే ఉండేది. అయితే వింబుల్డ¯Œ లాంటి పెద్ద టోర్నీలు నెగ్గాలంటే సాధారణ ఆట సరిపోదని భావించి తన సర్వ్ అండ్ వ్యాలీని పటిష్ఠపరచుకున్నాడు. చివరకు అది గొప్ప విజయాలను అందించింది. ఆటలో ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనూ ఒత్తిడిని దరి చేరనీయకుండా, ఓటమి తర్వాత కూడా ప్రశాంతంగా కనిపించగల అతని తత్వం బోర్గ్‌కు ‘ఐస్‌బర్గ్’ అనే పేరు తెచ్చి పెట్టింది. ఫ్రెంచ్ ఓపెన్‌తో మొదలు.. స్వీడన్ తరఫున డేవిస్ కప్ టీమ్‌లో ఆడే అవకాశం బోర్గ్‌కు పదిహేనవ ఏటనే వచ్చింది. కెరీర్ తొలి మ్యాచ్‌లో అతను చక్కటి విజయంతో శుభారంభం చేసినా టీమ్ ముందుకు వెళ్లలేకపోయింది. మరో రెండేళ్ల పాటు అక్కడక్కడా కొన్ని ఆకట్టుకునే ప్రదర్శనలు చేసినా.. చెప్పుకోదక్క టైటిల్‌ను మాత్రం అందుకోలేదు. అయితే 1974.. అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆక్లాండ్‌లో గ్రాస్‌కోర్టుపై తొలి టోర్నీ నెగ్గి సంబరాలు చేసుకున్న బోర్గ్ అదే ఏడాది గ్రాండ్‌స్లామ్ చాంప్‌గా కూడా అవతరించాడు. రోమ్‌లో ఇటాలియన్ ఓపెన్ గెలవడంతో అతనిపై అంచనాలు పెరిగిపోయాయి. వాటిని నిలబెట్టుకుంటూ అతను మరికొద్ది రోజులకే రోలండ్గారోస్లో సత్తా చాటాడు. ఫైనల్లో ఐదు సెట్ల సమరంలో మ్యాన్యూల్ ఒరెంటెస్ (స్పెయిన్)ను ఓడించి 18 ఏళ్లకే ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ అయ్యాడు. ఆ ఏడాది మొత్తం 8 టోర్నీల్లో విజేతగా నిలిచి బోర్గ్ తన రాకను ఘనంగా చాటాడు. తర్వాతి ఏడాది కూడా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకున్న అతను మరో నాలుగు ట్రోఫీలతో తన జోరును కొనసాగించాడు. 1975.. అతనికి మరో మధురానుభూతిని మిగిల్చింది. 19 ఏళ్ల వయసులో అతను స్వీడన్‌ను తొలిసారి డేవిస్ కప్ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలో డేవిస్ కప్‌లో 19 వరుస విజయాలు సాధించి ఆ ఘనత అందుకున్న తొలి ఆటగాడిగానూ కొత్త రికార్డు సృష్టించాడు. ట్రిపుల్ ధమాకా.. రెండు ఫ్రెంచ్ టైటిల్స్ సాధించినా గ్రాస్ కోర్టుపై ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గెలవని లోటు అప్పుడే బోర్గ్‌కు కనిపించింది. దాంతో తన ఆటలో స్వల్ప మార్పులతో ప్రత్యేక దృష్టి పెట్టాడు. చివరకు ఆ సాధన అద్భుతమైన ఫలితాలను అందించింది. 1976లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా తొలిసారి అతను వింబుల్డన్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మెగా ఈవెంట్‌పై అతని హవా మరో నాలుగేళ్లు సాగడం విశేషం. 1976 నుంచి 1980 వరకు వరుసగా ఐదేళ్ల పాటు బోర్గ్ వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచాడు. రెండో టైటిల్ సాధించిన సమయంలో మొదటిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ కూడా బోర్గ్ రాకెట్లో చిక్కింది. మరో వైపు రోలండ్ గారోస్ క్లే కోర్టుపై కూడా పట్టు కోల్పోలేదు. రెండేళ్ల విరామం తర్వాత 1978లో మూడో ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న అతను ఆ తర్వాత మరో మూడు టైటిల్స్‌ను తన కోర్ట్‌లో వేసుకున్నాడు. ఆ క్రమంలో బోర్గ్ ప్రపంచ టెన్నిస్ చరిత్రలో మరెవరికీ సాధ్యం కాని, ఈతరం ఆటగాళ్లు కూడా అందుకోలేని ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గ్రాండ్‌స్లామ్‌లో తక్కువ వ్యవధిలో పూర్తిగా రెండు భిన్న సర్ఫేస్ (క్లే, గ్రాస్)లపై జరిగే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ లను అతను వరుసగా మూడేళ్ల పాటు గెలిచాడు. 1979లో ఏకంగా 13 టైటిల్స్‌తో అతను సంచలనం సృష్టించాడు. 1980.. వింబుల్డన్ ఫైనల్ అయితే చరిత్రలోనే అత్యుత్తమ మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. అందులో బోర్గ్ .. తన చిరకాల ప్రత్యర్థి జాన్ మెకన్రోపై 16, 75, 63, 67 (16/18), 86తో విజయం సాధించాడు. ముగింపు...పునరాగమనం... బోర్గ్ తన ఇరవై ఆరవ ఏట.. ఒక రోజు.. అనూహ్యంగా తాను టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టెన్నిస్‌లో చక్కగా ఎదిగే వయసు.. ఎదుగుతున్న సమయంలో.. అతని ఆ ప్రకటన అందరికీ ఆశ్చర్యం కలిగించింది. 1982లో ఒకే ఒక టోర్నీ ఆడిన అతను సన్నిహితులు ఎందరు వారించినా తగిన కారణం కూడా లేకుండా రిటైర్మెంట్ ప్రకటించాడు. 1981లో గెలిచిన ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ అతని ఆఖరి గ్రాండ్‌స్లామ్. ఆ తర్వాత అతను తన బ్రాండ్‌ను వాడుకుంటూ వేర్వేరు వ్యాపారాల్లోకి వెళ్లిపోయాడు. అయితే దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఆటపై మనసు మళ్లడంతో తన పాత ఫ్యాషన్ స్టయిల్లో, పాతతరం వుడెన్ రాకెట్‌తో మళ్లీ కోర్టులోకి అడుగు పెట్టాడు. ఊహించినట్లుగానే ఆ ప్రయత్నం సఫలం కాలేదు. ఆ టైమ్‌కి టెన్నిస్ పూర్తిగా మారిపోయిందని బోర్గ్‌కు అర్థమైంది. ఆడిన 12 మ్యాచ్‌లలో ఒక్కటి కూడా గెలవకుండా ఈసారి శాశ్వతంగా గుడ్‌బై చెప్పేశాడు. అయితే 11 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ సాధించిన ఘనత, 66 టైటిల్స్, 109 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్... వీటన్నింటితో పాటు ఎన్నో గొప్ప మ్యాచ్‌లను అందించిన శాశ్వత కీర్తితో అభిమానుల మదిలో నిలిచిపోవడంలో మాత్రం బోర్గ్ సఫలమయ్యాడు. - మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: Ashes 2023: ఇంగ్లండ్ కోచ్ మెక్‌కల్లమ్‌కు చేదు అనుభవం.. -
మళ్లీ నంబర్‌వన్‌గా జొకోవిచ్
కెరీర్లో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో కొత్త చరిత్ర సృష్టించిన దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తన అగ్ర స్థానాన్ని మళ్లీ అందుకున్నాడు. ఏటీపీ సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అతను 7,595 పాయింట్లతో రెండు స్థానాలు మెరుగుపర్చుకొని వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచాడు. 36 ఏళ్ల జొకోవిచ్ తన కెరీర్లో నంబర్‌వన్‌గా 388వ వారంలోకి అడుగు పెట్టడం విశేషం. ఇప్పటివరకు టాప్‌లో ఉండి సెమీస్‌లో జొకోవిచ్ చేతిలో ఓడిన అల్కరాజ్ రెండో స్థానానికి పడిపోగా, రష్యా ప్లేయర్ ఖచనోవ్ మరోసారి టాప్–10లోకి అడుగు పెట్టాడు. చదవండి: WTC Final: ఔను.. ఇంగ్లండ్‌లోనే ఎందుకు జరగాలి? వేరే పిచ్ పెట్టాల్సిందే.. పెరుగుతున్న మద్ధతు -
గర్జించిన సెర్బియా సింహం.. టెన్నిస్ చరిత్రలో ఒకే ఒక్కడు (ఫొటోలు)
-
#NovakDjokovic: సెర్బియా యోధుడి చరిత్ర.. టెన్నిస్‌లో కొత్త రారాజు
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ పురుషుల టెన్నిస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం(జూన్ 11న) ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గడం ద్వారా తన ఖాతాలో 23వ గ్రాండ్‌స్లామ్ జమ చేసుకున్నాడు. తద్వారా ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన యోధుడిగా రికార్డులకెక్కాడు. ఇంతకవరకు నాదల్‌తో కలిసి 22 గ్రాండ్‌స్లామ్‌లతో సంయుక్తంగా ఉన్న జొకోవిచ్ తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ గెలవడంతో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ పురుషుల టెన్నిస్‌లో కొత్త రారాజుగా ఆవిర్భవించాడు. ► జొకోవిచ్ సాధించిన 23 గ్రాండ్‌స్లామ్స్‌లో అత్యధికంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ పది ఉండగా.. ఆ తర్వాత వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను ఏడుసార్లు గెలుచుకున్నాడు. ఇక యూస్ ఓపెన్‌తో పాటు ఫ్రెంచ్ ఓపెన్‌ను మూడేసి సార్లు నెగ్గిన జొకోవిచ్.. నాలుగు మేజర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ కనీసం మూడుసార్గు నెగ్గిన తొలి ఆటగాడిగానూ రికార్డులకెక్కాడు. ► ఇక జొకోవిచ్ ఇప్పటివరకు సాధించిన 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో పది గ్రాండ్‌స్లామ్‌లు 30 ఏళ్లలోపే సాధించడం గమనార్హం. ► రోలాండ్ గారోస్‌లో(ఫ్రెంచ్ ఓపెన్)లో ఛాంపియన్‌గా అవతరించిన అతిపెద్ద వయస్కుడిగానూ జొకో చరిత్ర సృష్టించాడు. 2023 ఫ్రెంచ్ ఓపెన్ కైవసం చేసుకునే నాటికి జొకో వయసు 36 ఏళ్ల 19 రోజులుగా ఉంది. ఈ నేపథ్యంలో రఫెల్ నాదల్(35 ఏళ్ల 11 నెలల 19 రోజులు) రికార్డును బద్దలు కొట్టాడు. ► ఇక ఓపెన్ శకంలో మహిళల, పురుషుల టెన్నిస్ విభాగాలను కలిపి చూస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన క్రీడాకారుల్లో సెరెనా విలియమ్స్‌తో కలిసి జొకోవిచ్(23 టైటిల్స్) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గజం మార్గరెట్ కోర్ట్ 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో తొలిస్థానంలో ఉంది. ఒకవేళ వచ్చే నెలలో ఆరంభం కానున్న వింబుల్డన్‌లో గనుక జొకోవిచ్ టైటిల్ కొడితే మాత్రం మార్గరెట్ కోర్ట్ సరసన నిలవనున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆదివారం నార్వేకు చెందిన కాస్పర్ రూడ్‌తో జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 7-6(7-1), 6-3, 7-5తో గెలుపొందాడు. మూడు గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో తొలిసెట్లోనే జొకోవిచ్‌కు కాస్పర్ రూడ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. టైబ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్‌ను జొకోవిచ్ 7-1తో కైవసం చేసుకున్నాడు. ఇక రెండో సెట్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండానే కేవలం 45 నిమిషాల్లో 6-3తో సొంతం చేసుకున్నాడు. కీలకమైన మూడోసెట్లో కాస్పర్ రూడ్ ఫుంజుకోవడంతో మళ్లీ టైబ్రేక్ తప్పదనిపించింది. ఈ దశలో రూడ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ 7-5తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. One of the best speeches after winning a grand slam Special achievement, special speech NEVER GIVE UP#RolandGarros #RolandGarros2023 #Djokovic #NovakDjokovic pic.twitter.com/zcwbd4Up6X — Vaibhav Sharma (@vaibhav_4x) June 11, 2023 🏆🇷🇸#RolandGarros | @DjokerNole pic.twitter.com/sopyII3GfQ — Roland-Garros (@rolandgarros) June 11, 2023 A legendary moment ✨#RolandGarros @DjokerNole pic.twitter.com/IdT4LWqqjO — Roland-Garros (@rolandgarros) June 11, 2023 🏆 Forever raising the bar 🏆@DjokerNole masters Casper Ruud 7-6(1), 6-3, 7-5 to win a third Roland-Garros title and an unprecedented 23rd Grand Slam men’s singles title. ⁰#RolandGarros pic.twitter.com/9IfTi39alB — Roland-Garros (@rolandgarros) June 11, 2023 చదవండి: French Open 2023 Final: జొకోవిచ్‌దే ఫ్రెంచ్ ఓపెన్.. ఖాతాలో 23వ గ్రాండ్‌స్లామ్ -
జొకోవిచ్‌దే ఫ్రెంచ్ ఓపెన్.. ఖాతాలో 23వ గ్రాండ్‌స్లామ్
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మెన్స్ సింగిల్స్ విజేతగా సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో కాస్పర్ రూడ్‌పై 7-6 6-3 7-5 తేడాతో విజయం సాధించాడు. జొకోవిచ్ ఖాతాలో ఇది మూడో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కాగా.. ఓవరాల్‌గా 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఓపెన్ శకంలో పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన తొలి ఆటగాడిగా జొకోవిచ్ చరిత్రకెక్కాడు. 🏆 Forever raising the bar 🏆@DjokerNole masters Casper Ruud 7-6(1), 6-3, 7-5 to win a third Roland-Garros title and an unprecedented 23rd Grand Slam men’s singles title.⁰#RolandGarros pic.twitter.com/9IfTi39alB— Roland-Garros (@rolandgarros) June 11, 2023 Time 21:50: మూడోసెట్లో హోరాహోరీ మూడోసెట్లో జొకోవిచ్, కాస్పర్ రూడ్ల్ హోరాహోరీగా తలపడుతున్నారు. ఇప్పటివరకు 5-5తో సమానంగా ఉండడంతో సెట్ టైబ్రేక్‌కు దారితీసే అవకాశం ఉంది. Time: 20:50: రెండో సెట్లో గెలుపు జొకోవిచ్‌దే తొలిసెట్‌ను గెలుచుకోవడానికి కష్టపడిన జొకోవిచ్‌కు రెండో సెట్లో మాత్రం పెద్దగా ఇబ్బందులు ఎదురవ్వలేదు. 6-3తో రెండో సెట్‌ను గెలుచుకున్న జొకోవిచ్ కేవలం 45 నిమిషాల్లోనే కాస్పర్ రూడ్‌ను ఓడించి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. మరికొద్ది సేపట్లో నిర్ణయాత్మక మూడోసెట్ జరగనుంది. Too strong. @DjokerNole takes the 2nd. #RolandGarros pic.twitter.com/uv2pb44Esh — Roland-Garros (@rolandgarros) June 11, 2023 Time: 20:45.. రెండో సెట్లో దూకుడు మీదున్న జొకోవిచ్ తొలిసెట్‌ను సొంతం చేసుకున్న జొకోవిచ్ రెండో సెట్లోనూ దూకుడు కనబరుస్తున్నాడు. తొలిసెట్లో పోటీ ఇచ్చిన రూడ్ ఒక్కసారి మాత్రమే జొకోవిచ్ సర్వీస్ బ్రేక్ చేయగలిగాడు. అదే సమయంలో జొకోవిచ్ మాత్రం నాలుగుసార్లు రూడ్ సర్వీస్ బ్రేక్ చేయగలిగాడు. ప్రస్తుతం జొకోవిచ్ 5-2తో రెండోసెట్లో ఆధిక్యంలో ఉన్నాడు. Time:20:06.. తొలి సెట్ సొంతం చేసుకున్న జొకోవిచ్ ఇక హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను జొకోవిచ్ సొంతం చేసుకున్నాడు. తొలి సెట్లో ఇద్దరు పోటాపోటీగా తలపడ్డారు. జొకో సర్వీస్‌లను బ్రేక్ చేస్తూ ఒక దశలో కాస్పర్ రూడ్ 3-0తో ఆధిక్యంలో కనిపించాడు. అయితే జొకోవిచ్ మళ్లీ ఫుంజుకొని రూడ్ సర్వీస్ బ్రేక్ చేసి మూడు పాయింట్లు సాధించాడు. దీంతో 6-6తో తొలి సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. ఇక కీలక టైబ్రేక్‌లో జొకోవిచ్ తన జోరు చూపించి విన్నర్స్ సంధించి 7-6(7-1)తో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. Here, there, everywhere 🏃♂️#RolandGarros pic.twitter.com/VuWtw0fCN2 — Roland-Garros (@rolandgarros) June 11, 2023 Time: 18:30.. ప్రారంభమైన ఫైనల్ పోరు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా జొకోవిచ్, కాస్పర్ రూడ్ మధ్య జరుగుతున్న పురుషుల సింగిల్స్ ఫైనల్ హోరాహోరీగా మొదలైంది. 23వ గ్రాండ్‌స్లామ్ గెలవాలన్న పట్టుదలతో జొకోవిచ్ ఒకవైపు ఉంటే.. జొకో జోరుకు అడ్డుకట్ట వేయాలనే యోచనతో కాస్పర్ రూడ్ ఉన్నాడు. -
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత స్వియాటెక్
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా వరల్డ్ నెంబర్ వన్.. పోలాండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి కరోలినా ముకోవాపై 6-2,5-7,6-4తో గెలుపొందింది. 2 గంటల 46 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను ఇగా స్వియాటెక్ 6-2తో పెద్దగా కష్టపడకుండానే సొంతం చేసుకుంది. అయితే రెండోసెట్లో ఫుంజుకున్న కరోలినా ముకోవా స్వియాటెక్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 7-5తో సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక కీలకమైన మూడో సెట్లో తన అనుభవాన్నంతా రంగరించిన స్వియాటెక్ కరోలినాకు అవకాశం ఇవ్వకుండా 6-4తో సెట్ గెలవడంతో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గడం ఇది మూడోసారి. 2020, 2022లో విజేతగా అవతరించిన స్వియాటెక్.. 2023లోనే విజేతగా నిలిచి హ్యాట్రిక్ ఫ్రెంచ్ఓపెన్ను కైవసం చేసుకుంది. గత నాలుగేళ్లలో రోలాండ్ గారోస్ టైటిల్‌ను మూడుసార్లు నెగ్గిన క్రీడాకారిణిగా స్వియాటెక్ చరిత్ర సృష్ఠించింది. THAT MOMENT 🥹🇵🇱#RolandGarros #Paris @iga_swiatek @WTA pic.twitter.com/Dy0NnNLOZD — Roland-Garros (@rolandgarros) June 10, 2023 Hat's off, champ 🤭#RolandGarros | @iga_swiatek pic.twitter.com/Iw49NVgC9K — Roland-Garros (@rolandgarros) June 10, 2023 చదవండి: 'చీటింగ్ అనే పదం వాళ్ల బ్లడ్‌లోనే ఉంది!' -
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్.. చరిత్రకు అడుగు దూరంలో
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2023లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం వరల్డ్ నెంబర్ వన్.. స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్తో జరిగిన సెమీస్ పోరులో జొకోవిచ్ 6-3, 5-7,6-1,6-1తో విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలో జొకోవిచ్‌ను ప్రతిఘటించిన అల్కరాజ్ తర్వాతి రెండు సెట్లలో అనుభవం ముందు నిలవలేకపోయాడు. అయితే గేమ్‌లో మాత్రం అల్కరాజ్ తనదైన సర్వీస్ షాట్లతో జొకోవిచ్ మనసును గెలుచుకున్నాడు. ఇక జొకోవిచ్ కెరీర్లో 34వ సారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అడుగుపెట్టాడు. నాదల్‌తో కలిసి 22 టైటిల్స్‌తో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ సాధించిన ఆటగాడిగా జొకోవిచ్ సంయుక్తంగా ఉన్నాడు. ఈసారి ఫైనల్లో గెలిచి ఫ్రెంచ్ ఓపెన్ అందుకుంటే.. ఓపెన్ శకంలో(23 టైటిల్స్) అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా జొకోవిచ్ చరిత్రకెక్కనున్నాడు. మరో సెమీఫైనల్లో కాస్పర్ రూడ్, అలెగ్జాండర్ జ్వెరెవ్‌ల మధ్య జరగనుంది. ఈ ఇద్దరిలో గెలిచిన ఆటగాడితో జొకోవిచ్ ఆదివారం ఫైనల్లో అమితుమీ తేల్చుకోనున్నాడు. Never doubt Novak 💪🇷🇸@DjokerNole gets the better of Alcaraz 6-3, 5-7, 6-1, 6-1 to reach a 34th Grand Slam final.#RolandGarros pic.twitter.com/fefJZKKMxn — Roland-Garros (@rolandgarros) June 9, 2023 చదవండి: 'సామాన్యుడు కాడు వీడు'.. టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ షాట్ -
'సామాన్యుడు కాడు వీడు'.. టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ షాట్
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా వరల్డ్ నెంబర్ వన్ కార్లెస్ అల్కరాజ్, సెర్బియా స్టాన్ నొవాక్ జొకోవిచ్ మధ్య సెమీఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగుతుంది. ఇద్దరు నువ్వా నేనా అన్నట్లుగా కొదమ సింహాల్లా తలపడుతున్నారు. ఇప్పటికైతే తొలి సెట్‌ను జొకోవిచ్ 6-3తో సొంతం చేసుకున్నప్పటికి.. రెండో సెట్లో మాత్రం అల్కరాజ్ లీడింగ్‌లో ఉన్నాడు. హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్‌లో గెలుపు ఎవరిది అని చెప్పడం కష్టంగా మారింది. ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్ సందర్భంగా అల్కరాజ్ చేసిన విన్యాసం జొకోవిచ్ చేత చప్పట్లు కొట్టించింది. వరల్డ్ నెంబర్ వన్ అనే పదానికి సార్థకం చేస్తూ అల్కరాజ్ కొట్టిన బ్యాక్ హ్యాండ్ షాట్ చరిత్రలో మిగిలిపోనుంది. విషయంలోకి వెళితే.. రెండోసెట్లో భాగంగా ఇద్దరు 1-1తో ఉన్నప్పుడు జొకోవిచ్ కాస్త తెలివిగా ర్యాలీ చేశాడు. అయితే అల్కరాజ్ వేగంగా స్పందించి షాట్ ఆడాడు. కానీ అల్కరాజ్ కోర్టు దగ్గరకు రావడం.. అదే సమయంలో జొకోవిచ్ ఆఫ్‌సైడ్ రిఫ్ట్ షాట్ కొట్టాడు. ఇక జొకోకు పాయింట్ వచ్చినట్లేనని అంతా భావించారు. కానీ ఇక్కడే అల్కరాజ్ ఎవరు ఊహించని ఫీట్ నమోదు చేశాడు. వేగంగా పరిగెత్తిన అల్కరాజ్ బ్యాక్‌హ్యాండ్ స్ట్రోక్ ఉపయోగించి షాట్ కొట్టాడు. బంతి కూడా లైన్ ఇవతల పడడంతో అల్కరాజ్ పాయింట్ గెలుచుకున్నాడు. అల్కరాజ్ చర్యకు ఆశ్చర్యపోయిన జొకోవిచ్ చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Take a bow, @carlosalcaraz 😱#RolandGarros pic.twitter.com/2m25jQtOy1 — Tennis Channel (@TennisChannel) June 9, 2023 😳#RolandGarros pic.twitter.com/3UA4JbPHz4 — Wimbledon (@Wimbledon) June 9, 2023 చదవండి: 'చాన్స్ కూడా ఇవ్వలేదు'.. సిరాజ్ దెబ్బకు లేచి కూర్చొన్నాడు -
ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. ఫైనల్‌కు చేరిన కరోలినా
పారిస్: అందరి అంచనాలను తారుమారు చేసి చెక్ రిపబ్లిక్కు చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి కరోలినా ముకోవా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ప్రపంచ 43వ ర్యాంకర్ ముకోవా 7–6 (7/5), 6–7 (5/7), 7–5తో ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్ సబలెంకా (బెలారస్)పై సంచలన విజయం సాధించింది. తన కెరీర్లో 17వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న 26 ఏళ్ల ముకోవా తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సబలెంకాతో 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్ పోరులో నిర్ణాయక మూడో సెట్లో ముకోవా 2–5 స్కోరు వద్ద తన సరీ్వస్‌లో 30–40 పాయింట్ల వద్ద ఓటమి ముంగిట నిలిచింది. ఈ కీలక తరుణంలో ముకోవా ఫోర్‌హ్యాండ్ విన్నర్‌తో 40–40తో సమం చేసింది. అనంతరం సబలెంకా రెండు అనవసర తప్పిదాలు చేయడంతో ముకోవా తన సరీ్వస్‌ను నిలబెట్టుకుంది. అనంతరం సబలెంకా సరీవస్ను బ్రేక్ చేసి, మళ్లీ తన సరీవస్ను కాపాడుకున్న ముకోవా స్కోరును 5–5తో సమం చేసింది. 11వ గేమ్‌లో సబలెంకా సర్వీస్‌ను మళ్లీ బ్రేక్ చేసిన ముకోవా 12వ గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌తోపాటు చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకుంది. రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 6–2, 7–6 (9/7) తో 14వ సీడ్ బీత్రిజ్ హదాద్ మయా (బ్రెజిల్)పై గెలిచి మూడోసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. 2020, 2022లలో విజేతగా నిలిచిన స్వియాటెక్ శనివారం జరిగే ఫైనల్లో ముకోవాతో తలపడుతుంది. చదవండి: WTC Final: ఆసీస్ బౌలర్ సూపర్ డెలివరీ.. దెబ్బకు గిల్‌కు ప్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్ -
సెమీస్‌కు దూసుకెళ్లిన వరల్డ్ నెంబర్‌వన్ స్వియాటెక్
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో మహిళల టెన్నిస్ నెంబర్‌వన్ ఇగా స్వియాటెక్ సెమీస్‌కు దూసుకెళ్లింది. హ్యాట్రిక్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌పై కన్నేసిన స్వియాటెక్ దానిని సొంతం చేసుకోవడానికి మరో రెండడుగుల దూరంలో ఉంది. బుధవారం క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ అమెరికాకు చెందిన కోకో గాఫ్‌పై 6-4, 6-2 వరుస సెట్లలో ఓడించింది. మ్యాచ్‌లో ఒక ఏస్ సందించిన స్వియాటెక్ నాలుగు బ్రేక్ పాయింట్స్ సాధించగా.. రెండు ఏస్‌లు సందించడంతో పాటు రెండు డబుల్ ఫాల్ట్స్ చేసిన కోకో గాఫ్ ఒకే ఒక్క బ్రేక్ పాయింట్ సాధించింది. మరో క్వార్టర్స్‌లో బ్రెజిల్‌కు చెందిన హదాద్ మయియా .. ట్యునిషియాకు చెందిన జెబర్పై 3-6, 7-6,6-1తో గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టింది. గురువారం జరగనున్న సెమీస్‌లో బ్రెజిల్‌కు చెందిన హదాద్ మయియాతో స్వియాటెక్ తలపడనుంది. Back to the semis 👋#RolandGarros | @iga_swiatek pic.twitter.com/PsCZygZWim — Roland-Garros (@rolandgarros) June 7, 2023 Feeling the love ❤️#RolandGarros | @iga_swiatek pic.twitter.com/spBvtHqExx — Roland-Garros (@rolandgarros) June 7, 2023 చదవండి: 'పదేళ్లుగా మేజర్ టైటిల్ లేదు.. ఇంత బద్దకం అవసరమా?' -
French Open 2023: 55 ఏళ్ల తర్వాత...
పారిస్: బ్రెజిల్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 55 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో ఆ దేశ క్రీడాకారిణికి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో బ్రెజిల్‌కు చెందిన బీత్రిజ్ హదాద్ మాయ క్వార్టర్ ఫైనల్ చేరింది. టెన్నిస్‌లో ఓపెన్ శకం (1968లో) మొదలయ్యాక దివంగత మరియా బ్యూనో చివరిసారి బ్రెజిల్ తరఫున గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో క్వార్టర్ ఫైనల్ చేరింది. 1968లో మరియా బ్యూనో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలలో క్వార్టర్ ఫైనల్‌కు... యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరింది. మరియా బ్యూనో ఐదు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గినా ఆ విజయాలన్నీ ఓపెన్ శకంకంటే ముందు వచ్చాయి. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ బీత్రిజ్ 3 గంటల 51 నిమిషాల్లో 6–7 (3/7), 6–3, 7–5తో సారా సొరిబెస్ టోర్మో (స్పెయిన్)పై విజయం సాధించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యునీషియా) 6–3, 6–1తో బెర్నార్డా పెరా (అమెరికా)పై, అమెరికా టీనేజర్ కోకో గాఫ్ 7–5, 6–2తో షిమెద్లోవా (స్లొవేకియా)పై, రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 7–6 (7/5), 6–4తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరారు. పురుషుల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఆరో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) క్వార్టర్ ఫైనల్లోకి చేరారు. -
జొకోవిచ్ రికార్డు
పారిస్: కెరీర్లో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగిన సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో జొకోవిచ్ రికార్డు సృష్టిస్తూ 17వసారి ఈ మెగా టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గతంలో రాఫెల్ నాదల్ అత్యధికంగా 16 సార్లు క్వార్టర్ ఫైనల్ చేరగా... నాదల్‌తో సమంగా ఉన్న జొకోవిచ్ తాజా విజయంతో ఈ స్పెయిన్ దిగ్గజాన్ని దాటి ముందుకు వెళ్లాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–2, 6–2తో యువాన్ పాబ్లో వారిలాస్ (పెరూ)పై గెలుపొందాడు. గంటా 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఏడు ఏస్‌లు సంధించాడు. ప్రత్యర్థి సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. 35 విన్నర్స్ కొట్టిన అతను నెట్ వద్దకు 17 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు గెలిచాడు. ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అత్యధికసార్లు క్వార్టర్ ఫైనల్ చేరిన రికార్డు ఫెడరర్ (స్విట్జర్లాండ్; 58 సార్లు) పేరిట ఉంది. జొకోవిచ్ (55 సార్లు) రెండో స్థానంలో, నాదల్ (47 సార్లు) మూడో స్థానంలో, జిమ్మీ కానర్స్ (41 సార్లు) నాలుగో స్థానంలో, రాయ్ ఎమర్సన్ (37 సార్లు) ఐదో స్థానంలో ఉన్నారు. క్వార్టర్ ఫైనల్లో 11వ సీడ్ ఖచనోవ్ (రష్యా)తో జొకోవిచ్ ఆడతాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఖచనోవ్ 1–6, 6–4, 7–6 (9/7), 6–1తో సొనెగో (ఇటలీ)పై నెగ్గాడు. అల్కరాజ్ అలవోకగా... ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) మరో అలవోక విజయంతో రెండోసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. అల్కరాజ్ 6–3, 6–2, 6–2తో లొరెంజె ముజెట్టి (ఇటలీ)పై గెలిచాడు. ఆరు ఏస్‌లు సంధించిన అల్కరాజ్, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), సెబాస్టియన్ ఆఫ్నర్ (ఆ్రస్టియా) మధ్య ప్రిక్వార్టర్ ఫైనల్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ తలపడతాడు. పావ్లీచెంకోవా ముందంజ... మహిళల సింగిల్స్ విభాగంలో 2021 రన్నరప్ పావ్లీచెంకోవా (రష్యా), ముకోవా (చెక్ రిపబ్లిక్), స్వితోలినా (ఉక్రెయిన్) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో పావ్లీచెంకోవా 3 గంటల 9 నిమిషాల్లో 3–6, 7–6 (7/3), 6–3తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)ను ఓడించగా... ముకోవా 6–4, 6–3తో అవనెస్యాన్ (రష్యా)పై గెలిచింది. స్వితోలినా గంటా 56 నిమిషాల్లో 6–4, 7–6 (7/5)తో తొమ్మిదో సీడ్ కసత్కినా (రష్యా)ను బోల్తా కొట్టించింది. కసత్కినా ఓటమితో ప్రస్తుతం మహిళల సింగిల్స్‌లో టాప్–10లో నలుగురు మాత్రమే బరిలో మిగిలారు. 44 ఏళ్ల తర్వాత... బ్రెజిల్‌కు చెందిన 14వ సీడ్ బీత్రిజ్ హదాద్ మాయ మూడో రౌండ్ మ్యాచ్‌లో 5–7, 6–4, 7–5తో ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)పై నెగ్గి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. అంతేకాకుండా 44 ఏళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన బ్రెజిల్ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. బ్రెజిల్ తరఫున చివరిసారి 1979లో పాట్రిసియా మెద్రాడో ఈ ఘనత సాధించింది. -
French Open 2023: గార్సియాకు షాక్
పారిస్: మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరైన కరోలిన్ గార్సియాకు అనూహ్య ఓటమి ఎదురైంది. సొంతగడ్డపై జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఈ ఫ్రాన్స్ స్టార్ రెండో రౌండ్‌ను దాటి ముందుకెళ్లలేకపోయింది. బుధవారం జరిగిన రెండో రౌండ్లో ప్రపంచ ఐదో ర్యాంకర్, ఐదో సీడ్ గార్సియా 6–4, 3–6, 5–7తో ప్రపంచ 56వ ర్యాంకర్ అనా బ్లింకోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. 2 గంటల 51 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో గార్సియా ఏడు డబుల్ ఫాల్ట్‌లు, 50 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. వరుసగా నాలుగో ఏడాది ఈ టోర్నీలో ఆడుతున్న బ్లింకోవా ఐదుసార్లు గార్సియా సర్వీస్‌ను బ్రేక్ చేసి రెండోసారి మూడో రౌండ్లోకి అడుగు పెట్టింది. 2017 చాంపియన్, 17వ ర్యాంకర్ ఎలెనా ఒస్టాపెంకో (లాత్వియా) కూడా రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. ఒస్టాపెంకో 3–6, 6–1, 2–6తో పేటన్ స్టెర్న్స్ (అమెరికా) చేతిలో పరాజయం పాలైంది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 7–5, 6–2తో ఇరీనా షిమనోవిచ్ (బెలారస్)పై, తొమ్మిదో సీడ్ కసత్కినా (రష్యా) 6–3, 6–4తో వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)పై, స్వితోలినా (ఉక్రెయిన్) 2–6, 6–3, 6–1తో స్టార్మ్ హంటర్ (ఆస్ట్రేలియా)పై గెలుపొంది మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) తొలి సెట్‌ను 6–2తో గెల్చుకున్నాక ఆమె ప్రత్యర్థి కామిల్లా జియార్జి (ఇటలీ) గాయం కారణంగా వైదొలిగింది. అల్కరాజ్ ముందుకు... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), 11వ సీడ్ ఖచనోవ్ (రష్యా) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. అల్కరాజ్ 6–1, 3–6, 6–1, 6–2తో టారో డానియల్ (జపాన్)పై, సిట్సిపాస్ 6–3, 7–6 (7/4), 6–2తో కార్బెలాస్ బేనా (స్పెయిన్)పై, ఖచనోవ్ 6–3, 6–4, 6–2తో రాడూ అల్బోట్ (మాల్డొవా)పై గెలిచారు. 2015 చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 4 గంటల 38 నిమిషాల పోరులో 6–3, 5–7, 3–6, 7–6 (7/4), 3–6తో కొకినాకిస్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. -
డానిల్ మెద్వెదెవ్కు షాక్.. ఐదోసారి కలిసి రాని 'ఫ్రెంచ్'
పారిస్: రష్యన్ టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్కు ‘ఫ్రెంచ్’ మరోసారి అచ్చిరాలేదు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ రష్యన్ తొలిరౌండ్లోనే నిష్క్రమించాడు. యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ మెద్వెదెవ్ క్లేకోర్టులో ఐదోసారి మొదటి రౌండ్లోనే కంగుతిన్నాడు. వరుసగా నాలుగేళ్లు అతను తొలిరౌండ్ అడ్డంకి దాటలేకపోయాడు. తాజాగా మెద్వెదెవ్ 6–7 (5/7), 7–6 (8/6), 6–2, 3–6, 4–6తో క్వాలిఫయర్ సెబొత్ వైల్డ్ (బ్రెజిల్) చేతిలో కంగుతిన్నాడు. మిగతా మ్యాచ్‌ల్లో పురుషుల నాలుగో సీడ్ కాస్పెర్ రూడ్ (నార్వే) 6–4, 6–3, 6–2తో క్వాలిఫయర్ ఎలియస్ వైమెర్ (స్వీడెన్)పై గెలుపొందగా... 22వ సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) తొలిరౌండ్ అడ్డంకిని దాటేందుకు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ఈ జర్మన్ ప్లేయర్ 7–6 (8/6), 7–6 (7/0), 6–1తో హ్యారిస్ (దక్షిణాఫ్రికా)పై చెమటోడ్చి నెగ్గాడు. Biggest W of his young career. ✨🇧🇷 Seyboth Wild's astonishing match against No.2 seed Medvedev is the extraordinary moment of the day! #ExtraordinaryMoments @HaierEurope pic.twitter.com/ZTcL9Q2tmC — Roland-Garros (@rolandgarros) May 30, 2023 స్వియాటెక్ శుభారంభం.. డిఫెండింగ్ చాంపియన్, టాప్‌సీడ్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో పోలండ్ స్టార్ 6–4, 6–0తో క్రిస్టినా బుక్సా (స్పెయిన్)పై అలవోక విజయం సాధించింది. వరుస సెట్లలో కేవలం గంటా 13 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. మిగతా మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా) 3–6, 6–1, 6–2తో రెబెక మసరొవా (స్పెయిన్)పై, ఏడో సీడ్ ఓన్స్ జాబెర్ (ట్యూనిషియా ) 6–4, 6–1తో లూసియా బ్రాంజెటి (ఇటలీ)పై, నాలుగో సీడ్ ఎలీనా రిబాకిన (కజకిస్తాన్) 6–4, 6–2తో క్వాలిఫయర్ లిండా ఫ్రువిర్టొవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందారు. వైల్డ్‌కార్డ్ ప్లేయర్ డియన్ ప్యారీ (ఫ్రాన్స్) 6–2, 6–3తో 25వ సీడ్ అన్హెలినా కలినినా (ఉక్రెయిన్)కు వరుస సెట్లలో షాకిచ్చింది. చదవండి: 'అది మేము కాదు.. మా ఫోటోలను మార్ఫింగ్ చేశారు!' -
French Open: జొకోవిచ్ శుభారంభం
French Open 2023- పారిస్: కెరీర్లో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో బరిలోకి దిగిన సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ జొకోవిచ్ 6–3, 6–2, 7–6 (7/1)తో అలెగ్జాండర్ కొవాసెవిచ్ (అమెరికా)పై గెలుపొందాడు. 2 గంటల 26 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 10 ఏస్‌లు సంధించాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన ఈ సెర్బియా స్టార్ 22 అనవసర తప్పిదాలు చేశాడు. వరుసగా 19వసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న జొకోవిచ్ రెండుసార్లు టైటిల్ సాధించడంతోపాటు నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) గైర్హాజరీలో టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. క్వాలిఫయర్ ఫ్లావియో కొబొలి (ఇటలీ)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో అల్కరాజ్ 6–0, 6–2, 7–5తో విజయం సాధించాడు. గంటా 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు పదో సీడ్ ఫెలిక్స్ అగుర్ అలియాసిమ్ (కెనడా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. ఫాబియో ఫాగ్నిని (ఇటలీ) 6–4, 6–4, 6–3తో ఫెలిక్స్ను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఇతర మ్యాచ్‌ల్లో 14వ సీడ్ కామెరాన్ నోరి (బ్రిటన్) 7–5, 4–6, 3–6, 6–1, 6–4తో బెనోయి పెయిర్ (ఫ్రాన్స్)పై, మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7–6 (7/5), 6–4, 6–7 (2/7), 1–6, 6–4తో రామోస్ వినోలస్ (స్పెయిన్)పై, షపోవలోవ్ (కెనడా) 6–4, 7–5, 4–6, 3–6, 6–3తో నకషిమా (అమెరికా)పై గెలిచి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. 12వ సీడ్ బెన్‌చిచ్ ఓటమి మహిళల సింగిల్స్ విభాగంలో 12వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ‘లక్కీ లూజర్’ ఎలీనా అలనెస్యాన్ (రష్యా) 6–3, 2–6, 6–4తో బెన్చిచ్ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 7–6 (7/4), 4–6, 6–4తో జియు వాంగ్ (చైనా)పై, స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) 6–0, 6–4తో కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై, కేలా డే (అమెరికా) 7–5, 6–1తో మ్లాడోనోవిచ్ (ఫ్రాన్స్)పై, స్వితోలినా (ఉక్రెయిన్) 6–2, 6–2తో మార్టినా ట్రెవిసాన్ (ఇటలీ)పై గెలిచారు. -
French Open 2023: రెండో రౌండ్లోకి సబలెంకా, సిట్సిపాస్
పారిస్: అంతా అనుకున్నట్లు జరిగే ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ కూడా సొంతమయ్యే పరిస్థితుల్లో... ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్) శుభారంభం చేసింది. ఆదివారం మొదలైన సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సబలెంకా రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. ఉక్రెయిన్ ప్లేయర్ మార్టా కోస్టుక్తో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సబలెంకా 6–3, 6–2తో గెలిచింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 19 విన్నర్స్ కొట్టిన సబలెంకా 21 అనవసర తప్పిదాలు కూడా చేసింది. మరోవైపు ఎనిమిదో సీడ్ మరియా సాకరి (గ్రీస్) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) 7–6 (7/5), 7–5తో సాకరిని ఓడించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. 2 గంటల 6 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముకోవా తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా), 11వ సీడ్ ఖచనోవ్ (రష్యా), 13వ సీడ్ హుర్కాజ్ (పోలాండ్) తమ ప్రత్యర్థులపై కష్టపడి గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సిట్సిపాస్ 7–5, 6–3, 4–6, 7–6 (9/7)తో జిరీ వెసిలీ (చెక్ రిపబ్లిక్)పై, రుబ్లెవ్ 6–1, 3–6, 6–3, 6–4తో జెరె (సెర్బియా)పై, హుర్కాజ్ 6–3, 5–7, 4–6, 2–6, 6–4తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై, ఖచనోవ్ 3–6, 1–6, 6–2, 6–1, 6–3తో లెస్టిన్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. -
French Open 2023: మట్టి కోర్టులో మహా సంగ్రామం షురూ
పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ నేడు మొదలుకానుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో స్పెయిన్ దిగ్గజం, 14 సార్లు చాంపియన్ రాఫెల్ నాదల్ తుంటి గాయం కారణంగా ఈ టోర్నీకి తొలిసారి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్), సెర్బియా దిగ్గజం జొకోవిచ్, నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఆరో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు. నేడు జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో జిరీ వెసిలీ (చెక్ రిపబ్లిక్)తో సిట్సిపాస్, లాస్లో జెరి (సెర్బియా)తో ఏడో సీడ్ రుబ్లెవ్ తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. స్వియాటెక్‌కు రెండో సీడ్ సబలెంకా (బెలారస్), నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), ఐదో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్), ఆరో సీడ్, గత ఏడాది రన్నరప్ కోకో గాఫ్ (అమెరికా) ఏడో సీడ్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా), ఎనిమిదో సీడ్ మరియా సాకరి (గ్రీస్) నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. పురుషుల డబుల్స్ విభాగంలో భారత్ నుంచి రోహన్ బోపన్న, యూకీ బాంబ్రీ, సాకేత్ మైనేని బరిలోకి దిగనున్నారు. -
ఫైనల్లో కాదు.. సెమీస్‌లోనే..!
French Open 2023: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ ‘డ్రా’ వివరాలను గురువారం విడుదల చేశారు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ గాయం కారణంగా తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఈసారి కొత్త చాంపియన్ అవతరిస్తాడా లేక మాజీ విజేత జొకోవిచ్ మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుస్తాడా వేచి చూడాలి. పురుషుల సింగిల్స్ ‘డ్రా’ ప్రకారం టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ అల్కరాజ్ (స్పెయిన్), మూడో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) ఒకే పార్శ్వంలో ఉన్నారు. దాంతో వీరిద్దరు ఫైనల్లో కాకుండా సెమీఫైనల్లోనే తలపడే అవకాశముంది. మరో పార్శ్వం నుంచి రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), ఆరో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్), ఎనిమిదో సీడ్ జానిక్ సినెర్ (ఇటలీ)లలో ఇద్దరు సెమీఫైనల్ చేరుకుంటారు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)కు టాప్ సీడింగ్ కేటాయించారు. గత ఏడాది రన్నరప్ కోకో గాఫ్ (అమెరికా)కు ఆరో సీడ్ దక్కడంతో క్వార్టర్ ఫైనల్లో ఆమెకు స్వియాటెక్ ఎదురయ్యే చాన్స్ ఉంది. ఆదివారం ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ మొదలవుతుంది. -
#Rafael Nadal: తిరగబెట్టిన గాయం.. ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరం
స్పెయిన్ బుల్.. టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌కు దూరమయ్యాడు. దీనికి తుంటి ఎముక గాయం తిరగబెట్టడమే కారణమని తెలిసింది. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తుంటి గాయంతో టోర్నీ మధ్యలోనే నాదల్ వైదొలిగాడు. అప్పటినుంచి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా మరోసారి గాయం తిరగబెట్టడంతో గురువారం తాను ఫ్రెంచ్ ఓపెన్ ఆడడం లేదని నాదల్ స్వయంగా స్పష్టం చేశాడు. కాగా 2004 నుంచి వరుసగా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఆడుతూ వస్తున్న నాదల్ తనకు అచ్చొచ్చిన గ్రాండ్‌స్లామ్‌కు దూరమవ్వడం ఇదే తొలిసారి. క్లేకోర్టు రారాజుగా అభివర్ణించిన నాదల్ ఇప్పటివరకు 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ కొల్లగొడితే.. అందులో 14 టైటిల్స్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లే కావడం విశేషం. అంతేకాదు ఫ్రెంచ్ ఓపెన్‌లో 115 మ్యాచ్‌లు ఆడిన నాదల్ 112 మ్యాచ్‌లు గెలిచి కేవలం మూడు మాత్రమే ఓడిపోయాడు. దీన్నిబట్టే ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ ఆధిపత్యం ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇక 2024 ఏడాదిలో నాదల్ టెన్నిస్ కెరీర్‌కు ముగింపు పలికే అవకాశాలు ఉన్నట్లు AFP ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు 22 గ్రాండ్‌స్లామ్స్ కొల్లగొట్టిన నాదల్.. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విషయంలో జొకోవిచ్‌తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నాడు. -
సైనా నెహ్వాల్ పరాజయం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో భారత ప్లేయర్ సైనా నెహ్వాల్ ఆట తొలి పోరులోనే ముగిసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21–13, 17–21, 19–21తో వ్యోనె లీ (జర్మనీ) చేతిలో ఓడింది. తొలి గేమ్‌ను గెలుచుకున్న సైనా, ఆ తర్వాత ప్రత్యర్థి ముందు నిలబడలేకపోయింది. మరో వైపు డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జంట శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ పోరులో కామన్వెల్త్ చాంపియన్స్, ఏడోసీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ 19–21, 21–9, 21–13తో క్రిస్టో పొపొవ్–తొమా జూనియర్ పొపొవ్ (ఫ్రాన్స్) జంటపై గెలుపొందింది. తొలి గేమ్‌ను కోల్పోయిన భారత జోడీ తర్వాతి గేమ్‌లలో పుంజుకొంది. రెండో గేమ్‌ను చకచకా ముగించగా, నిర్ణాయక గేమ్‌లోనూ ఇదే ఆటతీరు కొనసాగించడంతో స్థానిక ఆటగాళ్లకు పరాజయం తప్పలేదు. ఒక గంటా 8 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ జోడీ తేలిపోయింది. అయితే మిక్స్డ్, మహిళల డబుల్స్‌లో భారత షట్లర్లకు చుక్కెదురైంది. మహిళల డబుల్స్ మ్యాచ్‌లో గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ జంట 21–23, 20–22తో ఆరో సీడ్ జాంగకొల్ఫన్ కిటితరకుల్–రవిండ ప్రజొంగ్జయ్ (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో పోరాడి ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో ఇషాన్ భట్నాగర్–తనీషా క్రాస్టో జోడీ 13–21, 16–21తో జపాన్‌కు చెందిన క్యోహెయ్ యమషిత–నరు షినొయా జంట చేతిలో పరాజయం చవిచూసింది. -
Rafael Nadal: మట్టికోర్టుకు రారాజు నాదల్.. పలు అరుదైన రికార్డులు!
French Open 2022- Winner Rafael Nadal: మట్టికోర్టులో తనకు తిరుగులేదని స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ మరోసారి నిరూపించుకున్నాడు. ఏకంగా 14వసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచి సత్తా చాటాడు. తద్వారా కెరీర్లో 22వ ‘గ్రాండ్’ టైటిల్ కైవసం చేసుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇక ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో నార్వేకు చెందిన ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ కాస్పర్ రూడ్‌పై ఐదో సీడ్ నాదల్ 6–3, 6–3, 6–0తో విజయం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో నాదల్ పేరిట పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఓ లుక్కేద్దాం! ►1: ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా నాదల్ (36 ఏళ్ల 2 రోజులు) రికార్డు సృష్టించాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు ఆండ్రెస్ గిమెనో (స్పెయిన్; 1972లో 34 ఏళ్ల 10 నెలలు) పేరిట ఉండేది. 🚫 Trying a drop shot against @RafaelNadal is never a good idea -- find out why with our Shot of the Day by @oppo 🎥#RolandGarros | #InspirationAhead pic.twitter.com/tfnK8YrvMO — Roland-Garros (@rolandgarros) June 5, 2022 ►8: నాదల్ 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన క్రమంలో ఎనిమిదిసార్లు వేర్వేరు ప్రత్యర్థులపై గెలిచాడు. ఫైనల్స్‌లో ఫెడరర్‌పై నాలుగుసార్లు, జొకోవిచ్పై మూడుసార్లు, డొమినిక్ థీమ్‌పై రెండుసార్లు, సోడెర్లింగ్, పుయెర్టా, ఫెరర్, వావ్రింకా, కాస్పర్ రూడ్లపై ఒక్కోసారి విజయం సాధించాడు. ►23: నాదల్ 14సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన క్రమంలో తన ప్రత్యర్థులకు కోల్పోయిన మొత్తం సెట్ల సంఖ్య. ♦2008, 2010, 2017, 2020లలో అతను ఒక్క సెట్ కూడా ఓడిపోలేదు. ♦2007, 2012, 2018లలో ఒక్కో సెట్... 2014, 2019లలో రెండు సెట్లు... 2005, 2006, 2011, 2022లలో మూడు సెట్లు... 2013లో అత్యధికంగా నాలుగు సెట్లు చేజార్చుకున్నాడు. ✅ Rafa 🆚 Ruud ✅ Double delight for France 🇫🇷 ✅ 1️⃣4️⃣ for @RafaelNadal Look back at Day 15 with the Best Moments of the Day by @emirates 🎥#RolandGarros | #EmiratesFlyBetterMoments pic.twitter.com/IPfdgyMB2w — Roland-Garros (@rolandgarros) June 5, 2022 ►112: ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ చరిత్రలో నాదల్ గెలిచిన మొత్తం మ్యాచ్‌లు. ►22: నాదల్ నెగ్గిన ఓవరాల్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్. ఇందులో 14 ఫ్రెంచ్ ఓపెన్‌కాగా... 4 యూఎస్ ఓపెన్, 2 వింబుల్డన్, 2 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. 2️⃣2️⃣ in '22 -- a look back at how @RafaelNadal reached a new record for career Grand Slams: 1️⃣4️⃣ #RolandGarros 2️⃣ @Wimbledon 4️⃣ @usopen 2️⃣ @AustralianOpen pic.twitter.com/hq1HPD9uRL — Roland-Garros (@rolandgarros) June 5, 2022 చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. వెంకటేష్ అయ్యర్, దినేష్ కార్తీక్‌కు నో ఛాన్స్..! -
నీ క్రీడాస్ఫూర్తికి సలామ్ నాదల్: సచిన్, రవిశాస్త్రి ప్రశంసలు
‘‘వినమ్రంగా వ్యవహరించిన తీరు.. సాటి ఆటగాడి పట్ల సహృదయ భావం నాదల్‌ను మరింత ప్రత్యేకంగా మార్చాయి’’ అంటూ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్‌పై ప్రశంసలు కురిపించారు. అతడి క్రీడాస్ఫూర్తిని కొనియాడారు. కాగా ఫ్రెంచ్ ఓపెన్-2022 గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి సెమీస్‌లో నాదల్- మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్(జర్మనీ) తలపడ్డారు. ఈ క్రమంలో నాదల్ తొలి సెట్ గెలవగా.. రెండో సెట్లో నాదల్ రిటర్న్ షాట్‌ను అందుకునే క్రమంలో దురదృష్టవశాత్తూ జ్వెరెవ్ జారిపడ్డాడు. నొప్పి తీవ్రతరం కావడంతో మళ్లీ కోర్టులో అడుగుపెట్టలేకపోయాడు. దీంతో నాదల్‌ను విన్నర్‌గా ప్రకటించారు. అయితే, చక్రాల కుర్చీలో బయటకు వెళ్లిన జ్వెరెవ్ మళ్లీ ‘క్రచెస్’ సాయంతో కోర్టులోకి వచ్చి ప్రేక్షకులను చూస్తూ అభివాదం చేసి వెళ్లాడు. అతడి నిష్క్రమణతో అభిమానులు నిరాశలో మునిగిపోగా.. నాదల్ సైతం జ్వెరెవ్‌కు ఇలా జరిగినందుకు విచారంగా కనిపించాడు. ప్రత్యర్థి ఆటగాడి పట్ల సానుభూతి చూపించాడు. భావోద్వేగానికి గురైన జ్వెరెవ్‌ను ఓదార్చాడు. ఇక జ్వెరెవ్ క్రచెస్ సాయంతో నడుస్తుండగా.. నాదల్ అతడి పక్కనే బాధగా ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో సచిన్ నాదల్‌ను కొనియాడాడు. ఇక టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి సైతం.. ‘‘ఇలాంటివి చూసినపుడే కదా హృదయం ద్రవిస్తుంది. నువ్వు త్వరలోనే తిరిగి వస్తావు జ్వెరెవ్. ఇక నాదల్ క్రీడాస్ఫూర్తికి చేతులెత్తి నమస్కరించాలి. అన్ని రకాలుగా గౌరవం అందుకునేందుకు అతడు అర్హుడు’’ అని ట్వీట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో విజయంతో నాదల్ ఏకంగా 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నాడు. The humility and concern shown by Nadal is what makes him so special.#RolandGarros pic.twitter.com/t7ZE6wpi47 — Sachin Tendulkar (@sachin_rt) June 3, 2022 This is why sport can make you cry. You will be back @AlexZverev. @RafaelNadal - Sportsmanship, humility. Just brilliant and respect 🙏🙏🙏 #FrenchOpen2022 #RolandGarros pic.twitter.com/n5JFNFK7r1 — Ravi Shastri (@RaviShastriOfc) June 3, 2022 ⚔️ A thrilling battle came to a tough end with an injury to @AlexZverev but he and @RafaelNadal played some amazing points! Check out the Highlights by @emirates 🎥#RolandGarros | #EmiratesFlyBetterMoment pic.twitter.com/E9vn2iRF1v — Roland-Garros (@rolandgarros) June 3, 2022 -
ఫుట్‌బాలర్ కావాల్సిన వ్యక్తి.. క్లేకోర్టు రారాజు ఎలా అయ్యాడు
టెన్నిస్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు.. ఆటలో అతనికి ఎదురులేదు.. కోర్టులో అతను బరిలోకి దిగాడంటే ప్రత్యర్థులకు హడల్.. అందరూ అతన్ని క్లేకోర్టు రారాజుగా అభివర్ణిస్తారు. టెన్నిస్ ఓపెన్ శకం మొదలైన తర్వాత అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు కొల్లగొట్టిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ సాధించిన ఆల్‌టైమ్ గ్రేట్ జాబితా తీస్తే అందులోనూ అగ్రస్థానం అతనిదే. తన తరంలోనే పుట్టిన మరో ఇద్దరు గ్రెటేస్ట్ ఆటగాళ్లను దాటి మరీ.. మరో గ్రాండ్‌స్లామ్ దక్కించుకోవడం కోసం పరుగులు తీస్తున్నాడు. ఈ పాటికే మీకు అర్థమయి ఉంటుంది ఆ వ్యక్తి ఎవరో.. ది గ్రేట్ రాఫెల్ నాదల్. నాదల్ ఇవాళ 36వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఫుట్‌బాలర్ కావాల్సిన వ్యక్తి ఈరోజు టెన్నిస్ ప్రపంచాన్ని రారాజులా ఏలుతున్నాడు. హ్యాపీ బర్త్‌డే నాదల్.. పవర్‌గేమ్‌కు పెట్టింది పేరు రాఫెల్ నాదల్. ఫుట్‌బాలర్ కావాల్సిన నాదల్ తన అంకుల్ ప్రోత్సాహంతో రాకెట్ చేతబట్టాడు.. టెన్నిస్ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. స్పెయిన్‌లోని మానకోర్లో అనా మారియా, సెబాస్టియన్ నాదల్ దంపతులకు 1986 జూన్ 3న రాఫెల్ నాదల్ జన్మించాడు. నాదల్ బాబాయిలు ఇద్దరు(మిగ్యూల్ నాదల్, టోనీ నాదల్) ఫుట్‌బాల్ ఆటలో పేరు సంపాదించారు. తొలుత నాదల్‌ను కూడా ఫుట్‌బాలర్‌గానే చూడాలనుకున్నారు. కానీ నాదల్ చిన్న బాబాయి టోనీ నాదల్‌ను మూడేళ్ల వయసులోనే ప్రతిభను గుర్తించాడు. తమలా ఫుట్‌బాలర్ కాకుండా టెన్నిస్ బ్యాట్ చేతపడితే ఎలా ఉంటుందని ఆలోచించాడు. టోనీ నాదల్.. క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉండేవాడు. నాదల్ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా బాబాయితోనే గడిపేవాడు. ప్రతీరోజు ఎర్రమట్టిలో గంటల తరబడి నాదల్ చేత ప్రాక్టీస్ చేయించేవాడు. అతని కోసం ఎర్రమట్టిని అత్యంత కఠిన పరిస్థితులను సృష్టించి మరీ నాదల్కు శిక్షణ ఇచ్చేవాడు. నాదల్ ఆ శిక్షణ తట్టుకోలేక ఒక సందర్భంలో తన తల్లికి ఫిర్యాదు చేశాడు. కానీ బాబాయి టోనీ మాత్రం నాదల్‌ను టెన్నిస్ రారాజులా చూడాలనుకుంటున్నానని నాదల్ తల్లికి ముందే చెప్పాడు. ఆమె కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. చిన్ననాటి నుంచే ఎర్రమట్టిలో కఠోర సాధన చేశాడు గనుకనే నాదల్ ఇవాళ క్లేకోర్టుకు రారాజు అయ్యాడు. ఒక రకంగా నాదల్ టెన్నిస్ కెరీర్‌కు బీజం పడింది ఇక్కడే. బాబాయి కఠిన శిక్షణలో అండర్-12 టైటిల్ సాధించేశాడు. ఆ తర్వాత 14 ఏళ్లకే స్పానిష్ జూనియర్ సర్క్యూట్లో రఫాకు మంచి పేరు వచ్చింది. ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో అప్పటికే టెన్నిస్‌లో టాప్ ఆటగాడిగా ఉన్న కార్లోస్ మోయాను ఓడించి సంచలనం సృష్టించాడు రాఫెల్ నాదల్. అప్పటికి నాదల్ వయస్సు 14 ఏళ్లే. ఈ సంచలనం అక్కడితో ఆగలేదు. 2001లో ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారుడిగా నాదల్ కెరీర్‌ను ఆరంభించాడు. ఆ మరుసటి ఏడాది జరిగిన వింబుల్డన్‌లో సెమీఫైనల్ చేరి అందరి దృష్టిని ఆకర్షించాడు. 18 ఏళ్ల వయసులో డేవిస్ కప్‌లో అప్పటి వరల్డ్ నెంబర్-2 ఆండ్రీ అగస్సీని ఓడించి ఔరా అనిపించాడు. అక్కడి నుంచి నాదల్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. తన ఆటను మాత్రం అంతే పట్టుదలతో కొసాగించాడు.. కొనసాగిస్తున్నాడు. ఇక తన కాలంలోనే మరో టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్‌కు ధీటుగా మారాడు. 2005 నుంచి రోజర్ ఫెదరర్‌కు ప్రధాన ప్రత్యర్థిగా మారిన నాదల్ 2006 నుంచి 2009లోపూ ఐదు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఓడించి సంచలనం సృష్టించాడు. ఆటను ఎంత ప్రేమించాడో.. కుటంబాన్ని అంతే.. ఆటను ఎంత ప్రేమించాడో కుటుంబాన్ని అంతే ప్రేమించాడు నాదల్. తల్లిదండ్రులంటే అమితంగా ఇష్టపడే నాదల్కు 2009లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మనస్పర్థల కారణంగా నాదల్ తల్లిదండ్రులు విడిపోయారు. ఇది నాదల్‌ను మానసికంగానూ.. కెరీర్ పరంగానూ చాలా దెబ్బ తీసింది. ఎంతలా అంటే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఓటమి ఎరుగని రారాజుగా వెలుగొందుతున్న నాదల్కు తొలి ఓటమి అదే సంవత్సరం వచ్చింది. ఆ ఏడాది ఫైనల్లో రోజర్ ఫెదరర్ నాదల్‌ను ఓడించి విజేతగా అవతరించాడు. అయితే ఈ భాద నాదల్‌ను ఎంతోకాలం ఆపలేకపోయింది. గోడకు కొట్టిన బంతిలా.. 2010లో మళ్లీ ఫుంజుకున్న నాదల్ ఏకంగా మూడు గ్రాండ్‌స్లామ్‌లను కొల్లగొట్టి పూర్వ వైభవం సాధించాడు. ఆటలో చాంపియన్‌గా నిలిచిన నాదల్కు అదే ఏడాది విడిపోయిన తల్లిదండ్రులు మళ్లీ కలుసుకోవడం మరింత సంతోషాన్నిచ్చింది. ఆ తర్వాత కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదురైనప్పటికి అంతా సాఫీగానే సాగింది. అయితే గత నాలుగేళ్లలో వయసు మీద పడడం.. ఆటలో ఏకాగ్రత తగ్గడం.. గాయాలు వేదించడంతో .. నాదల్ పని అయిపోయిందని అంతా భావించారు. దీనికి తోడూ రోజర్ ఫెదరర్, జొకోవిచ్‌లు ఆటలో దూసుకుపోతున్నారు. వీటన్నింటికి నాదల్ ఒకే ఒక్క గ్రాండ్‌స్లామ్‌తో సమాధానమిచ్చాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ డానిల్ మెద్వెదెవ్‌తో జరిగిన సుధీర్ఘ పోరులో నాదల్ ఓటమి అంచుల వరకు వెళ్లి విజేతగా నిలిచాడు. అలా కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ అందుకొని ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇక తనకు అచ్చొచ్చిన రోలాండ్ గారోస్(ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ) నాదల్ దూసుకెళుతున్నాడు. 36వ పుట్టిరోజు జరుపుకుంటున్న రోజునే అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో సెమీ ఫైనల్లో తలపడుతున్నాడు. 22వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన నాదల్కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ముగిద్దాం. ముగించేముందు నాదల్కు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.. నాదల్ గురించి మనకు తెలియని కొన్ని ముఖ్య విషయాలు ►నాదల్ 2019, అక్టోబర్ 19న మారియా ఫ్రాన్సియా పెరెల్లోతో వివాహం జరిగింది. ►నాదల్ రెండు చేతులతో ఆడగలడు. అతను ఫోర్ హ్యాండ్ షాట్‌కు ఎడమ చేతిని వాడతాడు. రెండు చేతులతో టూహ్యాండెడ్ ఫోర్షాట్ కూడా ఆడగల సామర్థ్యం ఉంది. ►రాఫెల్ నాదల్కు చీకటంటే చచ్చేంత భయం. నిద్రపోతున్న సమయంలో ఒక లైటు లేదా టీవీ స్క్రీన్ వెలుగుతూనే ఉంటుంది. ►ఫ్రెంచ్ ఓపెన్ ఆడే సమయంలో నాదల్ లాకర్ నెంబర్ 159 మాత్రమే తీసుకుంటాడు. ►ప్రతీ మ్యాచ్‌కు ముందు చన్నీటితో స్నానం చేయడం నాదల్కు అలవాటు ►నాదల్ ఏ గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకున్న నోటితో కొరకడం అలవాటుగా చేసుకున్నాడు. ఇలా ఎందుకు చేస్తున్నానో తనకు తెలియదని.. ఒకసారి కొరకడం అలవాటయ్యాకా దానికి మానలేకపోయానని ఒక ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. ►టెన్నిస్ కోర్టులో నాదల్ తాగే వాటర్ బాటిల్స్ వరుస క్రమంలో ఉంటేనే తాగుతాడు. అలా లేకుంటే వాటిని సరిచేసి గానీ నీళ్లు తాగడు. -
సెమీస్‌లోనే ముగిసిన బోపన్న పోరాటం
పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న అద్భుత పోరాటం సెమీస్‌లో ముగిసింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో 16వ సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ 6–4, 3–6, 6–7 (8/10) స్కోరుతో 12వ సీడ్ మార్సెలో అరివలో (సాల్వేడార్)–జీన్ జులియెన్ రోజర్ (నెదర్లాండ్స్) జంట చేతిలో పరాజయం చవిచూసింది. ఈ టోర్నీలో గత మ్యాచ్‌ల్లో సూపర్ టైబ్రేకర్‌లో ప్రత్యర్థి ద్వయంపై ఆధిపత్యం కనబరిచి నెగ్గుకొచ్చిన భారత్–డచ్ జంటకు ఇక్కడ మాత్రం కలిసిరాలేదు. 2 గంటల 7 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో బోపన్న జోడీ తొలి సెట్ చేజిక్కించుకుంది కానీ రెండో సెట్‌ను కోల్పోయింది. ఆఖరి సెట్ మాత్రం హోరాహోరీగా జరగడంతో టైబ్రేక్‌దాకా వచ్చింది.అయితే ఇందులో బోపన్న–మిడిల్‌కూప్ ఆటలు సాగలేదు. దీంతో 12 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ పురుషుల డబుల్స్‌లో టైటిల్ పోరుకు చేరాలనుకున్న బోపన్న ఆశలు సెమీస్‌లోనే గల్లంతయ్యాయి. చివరిసారిగా బోపన్న... ఐజముల్ హక్ ఖురేషీ (పాకిస్తాన్)తో కలిసి 2010 యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. -
French Open 2022: వారెవ్వా.. రోహన్ బోపన్న తొలిసారి..
భారత టెన్నిస్ సీనియర్ స్టార్ రోహన్ బోపన్న తన కెరీర్లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో బోపన్న(భారత్)- మిడిల్‌కూప్(నెదర్లాండ్స్) ద్వయం 4-6, 6-4, 7-6(10/3)తో సూపర్ ట్రై బ్రేక్‌లో లాయిడ్ గ్లాస్‌పూల్(బ్రిటన్)- హెలియోవారా(ఫిన్లాండ్) జోడీపై గెలిచింది. ఈ విజయంతో 42 ఏళ్ల బోపన్న ఏడేళ్ల విరామం తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్‌కు అర్హత సాధించాడు. చివరసారి బోపన్న 2015లో వింబుల్డన్ టోర్నీలో సెమీ ఫైనల్ చేరాడు. The first men’s doubles semi-final is set! 🇸🇻🇳🇱Arevalo/Rojer 🆚 Bopanna/Middelkoop 🇮🇳🇳🇱#RolandGarros pic.twitter.com/66zNDLzmgZ — Roland-Garros (@rolandgarros) May 30, 2022 -
French Open: జొకోవిచ్‌కు భారీ షాక్.. నాదల్ చేతిలో ఘోర ఓటమి!
French Open 2022: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెర్బియన్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌ను ఓడించాడు. ఫిలిప్ చార్టియర్ కోర్టులో బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల 12 నిమిషాల పాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్‌కు చుక్కలు చూపించిన నాదల్.. 6-2, 4-6, 6-2, 7-6 (7/4) తేడాతో అతడిపై విజయం సాధించాడు. తద్వారా ఫ్రెంచ్ ఓపెన్-2022 సెమీ ఫైనల్లో అడుగుపెట్టాడు. కాగా ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో నాదల్ సెమీస్ చేరడం ఇది 15వ సారి. ఈ నేపథ్యంలో వరల్డ్ నంబర్ 1 జొకోవిచ్పై విజయానంతరం నాదల్ మాట్లాడుతూ.. ‘‘ఎన్నెన్నో భావోద్వేగాలు నన్ను చుట్టుముట్టాయి. ఇక్కడ ఆడటం నిజంగా నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. అతడి(జొకోవిచ్)తో పోటీ పడటం అతిపెద్ద సవాలు.. మనలోని అత్యుత్తమ ప్రతిభ కనబరిచినపుడు మాత్రమే అతడిని ఓడించే అవకాశం ఉంటుంది’’ అని ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక నాదల్కు అభినందనలు తెలిపిన జొకోవిచ్.. తనొక గొప్ప చాంపియన్ అని, ఈ విజయానికి నాదల్ అర్హుడు అంటూ ప్రశంసలు కురిపించాడు. కాగా శుక్రవారం జరుగనున్న సెమీస్‌లో మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్(జర్మనీ)తో నాదల్ ఫైనల్ బెర్తు కోసం పోటీపడనున్నాడు. చదవండి: French Open: కోకో కేక.. తొలిసారి గ్రాండ్‌స్లామ్‌లో సెమీస్‌కు అర్హత 🎥 Check out the best moments of @RafaelNadal 's thrilling four-set win over No.1 Novak Djokovic with Highlights by @emirates#RolandGarros | #EmiratesFlyBetterMoments pic.twitter.com/3F2oFCSD00 — Roland-Garros (@rolandgarros) June 1, 2022 "He was a better player in important moments" No.1 @DjokerNole on his loss to @RafaelNadal #RolandGarros — Roland-Garros (@rolandgarros) June 1, 2022 -
French Open: కోకో కేక.. తొలిసారి గ్రాండ్‌స్లామ్‌లో..
అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ అమెరికన్ టీనేజ్ స్టార్ కోకో గౌఫ్ కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీ ఫైనల్ దశకు అర్హత సాధించింది. టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో అమెరికాకు చెందిన 18 ఏళ్ల కోకో గౌఫ్ తన జోరు కొనసాగిస్తూ వరుసగా ఐదో మ్యాచ్‌లో ప్రత్యర్థికి ఒక్క సెట్ కోల్పోకుండా విజయం సాధించింది. 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్, 64వ ర్యాంకర్ స్లోన్ స్టీఫెన్స్(అమెరికా)తో మంగళవారం జరిగిన సింగిల్వ్ క్వార్టర్ ఫైనల్లో 18వ సీడ్, ప్రపంచ 23వ ర్యాంకర్ కోకో 7-5, 6-2తో గెలుపొందింది. నాలుగేళ్ల క్రితం ప్రొఫెషనల్‌గా మారి ఇప్పటివరకు 11 గ్రాండ్‌స్లామ్‌లు ఆడిన కోకో గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇదే టోర్నీలో ఈసారి క్వార్టర్స్ అడ్డంకిని అధిగమించి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్‌కు అర్హత సాధించింది. 🇺🇸🆚🇺🇸 Teenager @CocoGauff came out on top against fellow American Sloane Stephens in a hard-fought quarter-final:#RolandGarros pic.twitter.com/kQphuXxVva — Roland-Garros (@rolandgarros) May 31, 2022 -
నేను మగాడినైనా బాగుండేది.. ఈ కడుపునొప్పి వల్ల: టెన్నిస్ ప్లేయర్ భావోద్వేగం
Zheng Qinwen French Open 2022: ‘‘ఇది అమ్మాయిలకు సంబంధించిన విషయం. మొదటి రోజు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. భరించలేని కడుపు నొప్పి. అయినా నేను గేమ్ ఆడాలనే ప్రయత్నిస్తాను. కానీ ఈరోజు అలా జరుగలేదు’’ అంటూ చైనా యువ టెన్నిస్ క్రీడాకారిణి జెంగ్ కిన్వెన్ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తాను పురుషుడినైనా బాగుండేదని ఉద్వేగానికి గురైంది. ప్రతిష్టాత్మక టెన్నిస్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ అరంగేట్రంలోనే నాలుగో రౌండ్‌కు చేరుకున్న నాలుగో చైనీస్ మహిళగా కిన్వెన్ చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో ప్రపంచ నంబర్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్‌తో తలపడే అవకాశం దక్కించుకుంది ఈ 19 ఏళ్ల చైనీస్ టీనేజర్. అయితే, సోమవారం నాటి ఈ మ్యాచ్ సందర్భంగా కిన్వెన్ రుతుస్రావ సమయంలో కలిగే నొప్పి కారణంగా విలవిల్లాడింది. స్వియాటెక్‌తో మ్యాచ్‌లో తొలి సెట్ వరకు బాగానే ఉన్న కిన్వెన్.. ఆ తర్వాత నొప్పి తీవ్రతరం కావడంతో అక్కడే బ్యాక్ మసాజ్ చేయించుకుంది. ఆ తర్వాత కుడి తొడకు కట్టు కట్టుకుని బరిలోకి దిగింది. ఈ క్రమంలో 6-7(5), 6-0, 6-2 తేడాతో స్వియాటెక్ చేతిలో ఆమెకు ఓటమి తప్పలేదు. దీంతో కిన్వెన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో తీవ్ర నిరాశకు లోనైన ఆమె విలేకరులతో మాట్లాడుతూ... ‘‘ఎంతకష్టమైనా మ్యాచ్ పూర్తి చేయడానికే నేను ఇష్టపడతా. నా స్వభావానికి విరుద్ధంగా వెళ్లను. అయితే, ఈరోజు కోర్టులో ఉన్న సమయంలో నేను పురుషుడినైతే బాగుండేదనిపించింది. ఆ క్షణంలో నిజంగా నేను మగాడిని అయి ఉంటే.. ఈ బాధ తప్పేది. పరిస్థితి ఇంకాస్త మెరుగ్గా ఉండేదేమో. ’’ అని వ్యాఖ్యానించింది. కడుపునొప్పి, కాలు నొప్పి కారణంగా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే, వరల్డ్ నెంబర్ 1తో పోటీపడిన సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించానని ఈ 74వ ర్యాంకర్ పేర్కొంది. అయితే, కడుపునొప్పి లేకుండా మరింత ఎక్కువగా ఎంజాయ్ చేసేదానినని, ఇంకాస్త బాగా ఆడేదానిని తెలిపింది. తనతో మరో మ్యాచ్ అవకాశం వచ్చినపుడు మాత్రం అస్సలు ఇలాంటి పరిస్థితి(రుతుస్రావం) ఎదురుకాకూడదని ఉద్వేగపూరితంగా మాట్లాడింది. ఇదిలా ఉంటే.. కిన్వెన్పై విజయంతో ఈ ఏడాది వరుసగా 32వ గెలుపు నమోదు చేసింది పోలాండ్‌కు చెందిన స్వియాటెక్. క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన ఆమె.. టైటిల్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. క్వార్టర్లో అమెరికాకు చెందిన జెసికా పెగులాతో ఆమె అమీతుమీ తేల్చుకోనుంది. చదవండి: IPL 2022: ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు.. కానీ రెండు టైటిల్స్.. ఐపీఎల్లో మోస్ట్ లక్కీ ప్లేయర్..! 📽️ It was a real battle for No.1 @iga_swiatek against Zheng Qinwen in their Round of 16 match:#RolandGarros pic.twitter.com/1FWNGZS5Im — Roland-Garros (@rolandgarros) May 30, 2022 -
మెద్వెదేవ్‌కు భారీ షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఔట్
ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రపంచ నం.2 డానియల్ మెద్వెదేవ్‌కు భారీ షాక్ తగిలింది. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో క్రొయేషియాకు చెందిన మారిన్ సిలిక్ 6-2, 6-3, 6-2తో మెద్వెదేవ్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. దీంతో మెద్వెదేవ్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే మెద్వెదేవ్పై సిలిక్ ఆధిపత్యం చెలాయించాడు. కేవలం గంటా 47 నిమిషాల్లో సిలిక్ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో సిలిక్ నాలుగేళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ఇక క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ ఆండ్రూ రూబ్లేవ్తో సిలిక్ తలపడనున్నాడు. చదవండి: ISSF World Cup: స్వర్ణ పతకంపై ఇలవేనిల్ బృందం గురి -
ఫ్రెంచ్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల కుర్రాడు..
స్పెయిన్ టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ 2022లో చరిత్ర సృష్టించాడు. సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్ తర్వాత అత్యంత పిన్న వయసులో ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్ చేరిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 19 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్.. శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో సెబాస్టియర్ కోర్డాను 6-2, 6-4, 6-2తో వరుస సెట్లలో ఖంగుతినిపించాడు. కాగా మాంటే కార్లో ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సెబాస్టియన్ చేతిలో ఓటమికి కార్లోస్ బదులు తీర్చుకున్నాడు. సెబాస్టియన్ క్లే కోర్టులో ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడగా.. అతనికి ఇదే తొలి ఓటమి కావడం విశేషం. ఇంతకముందు 2006లో నొవాక్ జొకోవిచ్ అత్యంత పిన్న వయసులో ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్ చేరిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇక కార్లోస్ అల్కరాజ్.. ప్రిక్వార్టర్స్‌లో 21వ సీడ్ కరెన్ ఖచనోవ్‌తో తలపడనున్నాడు. చదవండి: French Open 2022: నాదల్, జొకోవిచ్ జోరు [6] @alcarazcarlos03 defeats [27] Korda 6-4 6-4 6-2 and is youngest man to reach 4R @RolandGarros since #Djokovic in 2006. #Alcaraz saved all 5 break pts faced (broke 4 times) en route to his 13th win in a row. Next: 1st meeting vs [21] @karenkhachanov (d [10] Norrie in 4 sets). — ATP Media Info (@ATPMediaInfo) May 27, 2022 -
French Open 2022: మూడో రౌండ్‌కు దూసుకెళ్లిన వరల్డ్ నెంబర్-2
టెన్నిస్ పురుషుల ప్రపంచ నెంబర్-2 డానిల్ మెద్వెదెవ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో మెద్వదెవ్.. సెర్బియాకు చెందిన లాస్లో జెరీని 6-3, 6-4, 6-3తో వరుస సెట్లలో ఖంగుతినిపించాడు. కాగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ కోసం మెద్వెదెవ్ సెర్బియాకు చెందిన 28వ సీడ్ మియోమిర్ కెక్మనోవిక్తో తలపడనున్నాడు. 2 గంటల 35 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో జెరిని 39 విన్నర్స్ సందించినప్పటికి.. 68 తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ''లాస్లో పోరాటం మెచ్చుకోదగినది. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో జెరీని విన్నర్స్ సంధించినప్పటికి.. అన్నే తప్పులు చేశాడు. అతని కాలికి కచ్చితంగా దెబ్బలు తగిలి ఉంటాయి. అతని టఫ్ ఫైట్ కారణఃగా నేను ప్రతీ పాయింట్‌పై ఫోకస్ చేయాల్సి వచ్చింది.'' అని మెద్వెదెవ్ మ్యాచ్ విజయం అనంతరం పేర్కొన్నాడు. -
'మోస్ట్ అన్‌లక్కీ'.. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి డిఫెండింగ్ చాంపియన్ ఔట్
డిఫెండింగ్ చాంపియన్ బార్బరా క్రేజీకోవా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి అనూహ్యంగా వైదొలిగింది. ఇప్పటికే సింగిల్స్‌లో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన క్రేజీకోవా.. తాజాగా కోవిడ్-19 పాజిటివ్‌గా తేలడంతో డబుల్స్ మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి నిరాశగా నిష్క్రమించాల్సి వచ్చింది. దీంతో డబుల్స్ టైటిల్‌ను నిలుపుకోవాలనుకున్న ఆమె ఆశలు ఆవిరయ్యాయి. ఈ విషయాన్ని క్రేజీకోవా 'దురదృష్టవంతురాలిని' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన మెడికల్ అప్డేట్ను షేర్ చేసుకుంది. ''మంగళవారం రాత్రి కాస్త అలసటగా అనిపించింది. తెల్లారి చూసేసరికి కొద్దిగా జ్వరం వచ్చినట్లయింది. దీంతో టెస్టుకు వెళ్లగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయం తెలియగానే వెంటనే టోర్నీ నుంచి వైదొలిగాను. సింగిల్స్ ఓడిపోయాను.. కనీసం డబుల్స్ టైటిల్ నిలుపుకుందామనుకున్నా.. కానీ బ్యాడ్‌లక్ కుదరలేదు''అంటూ ఎమెషనల్ అయింది. కాగా కేజ్రీకోవాతో పాటు చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి మేరీ బౌజ్కోవా కూడా ఆరోగ్య కారణాలతో రెండో రౌండ్ సింగిల్స్ ఆడకుండానే టోర్నీ నుంచి వైదొలిగింది. కాగా సోమవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో బార్బరా క్రేజీకోవా 19 ఏళ్ల డైన్ పారీ చేతిలో ఓటమి చవిచూసింది. కాగా గతేడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన కేజ్రీకోవా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చాంపియన్‌గా నిలిచింది. సింగిల్స్ ఫైనల్లో అనస్తాసియా పావ్లియుచెంకోవాను ఓడించి తొలి టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత సినికోవాతో జతకట్టి ఫైనల్లో గెలిచిన కేజ్రీకోవా డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. కాగా మేరీ పియర్స్ తర్వాత ఒక ఫ్రెంచ్ ఓపెన్‌లో సింగిల్స్, డబుల్స్ విజేతగా నిలిచిన రెండో మహిళగా కేజ్రీకోవా నిలిచింది. చదవండి: Nikhat Zareen-Mary Kom: కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. తిట్టిన నోరు మెచ్చుకునేలా చేసింది French Open 2022: మూడో రౌండ్లోకి నొవాక్ జొకోవిచ్ -
French open 2022: మూడో రౌండ్లోకి నొవాక్ జొకోవిచ్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ 6–2, 6–3, 7–6 (7/4)తో అలెక్స్ మొల్కాన్ (స్లొవేకియా)పై గెలుపొందాడు. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 10 ఏస్‌లు సంధించాడు. మరోవైపు మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 3 గంటల 36 నిమిషాల్లో 2–6, 4–6, 6–1, 6–2, 7–5తో సెబాస్టియన్ బేజ్ (అర్జెంటీనా)పై, ఆరో సీడ్ కార్లోస్ అల్కారజ్ (స్పెయిన్) 4 గంటల 34 నిమిషాల్లో 6–1, 6–7 (7/9), 5–7, 7–6 (7/2), 6–4తో అల్బర్ట్ రామోస్ వినోలస్ (స్పెయిన్)పై కష్టపడి గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రామ్‌కుమార్ రామనాథన్ (భారత్)–హంటర్ రీస్ (అమెరికా) ద్వయం 7–6 (7/4), 6–3తో అల్ట్మెర్–ఆస్కార్ ఒటి (జర్మనీ) జోడీపై నెగ్గింది. నాలుగో సీడ్ సాకరి ఓటమి మహిళల సింగిల్స్ విభాగంలో రెండు సంచలనాలు నమోదయ్యాయి. నాలుగో సీడ్, గత ఏడాది సెమీఫైనలిస్ట్ మరియా సాకరి (గ్రీస్), గత ఏడాది యూఎస్ ఓపెన్ చాంపియన్, 12వ సీడ్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్) రెండో రౌండ్లో నిష్క్రమించారు. కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) 7–6 (7/5), 7–6 (7/4)తో సాకరిపై, అలెగ్జాండ్రా సాస్నోవిచ్ (రష్యా) 3–6, 6–1, 6–1తో రాడుకానుపై గెలుపొంది మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. చదవండి: R Praggnanandhaa: భారత యంగ్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద పెను సంచలనం.. -
18-0.. ఎదురులేని సెర్బియా స్టార్
టెన్నిస్ పురుషుల ప్రపంచ నెంబర్ వన్.. సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. సోమవారం అర్థరాత్రి జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో 99వ ర్యాంకర్ జపాన్‌కు చెందిన యోషియితో నిషియోకాను 6-3,6-1, 6-0తో వరుస సెట్లతో ఖంగుతినిపించి రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు. ఆదివారం పుట్టినరోజు జరుపుకున్న సెర్బియా స్టార్.. క్లే కోర్టుపై తొలి రౌండ్లో ఉన్న రికార్డును కాపాడుకున్నాడు. ఇప్పటివరకు ఫ్రెంచ్ ఓపెన్‌లో జొకోవిచ్ ఒక్కసారి కూడా తొలి రౌండ్ ఓడిపోలేదు. 18-0తో జొకోవిచ్ తన రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. కాగా జొకోవిచ్‌కు పారిస్ ఈవెంట్లో ఇది 82వ విజయం కావడం విశేషం. కాగా జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో జొకోవిచ్ ఆడని సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకోవిచ్‌ను ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఆడకుండా నిషేధించింది. మూడేళ్ల పాటు జొకోవిచ్‌కు ఆసీస్ గడ్డపై అడుగుపెట్టకుండా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చదవండి: ఫ్రెంచ్ ఓపెన్‌లో పెను సంచలనం.. తొలి రౌండ్లోనే డిఫెండింగ్ ఛాంపియన్‌కు పరాభవం 🥇 No.1 @DjokerNole cruised in his first round matchup against Yoshihito Nishioka in today's late match -- catch the highlights:#RolandGarros pic.twitter.com/agxo5JfBuy — Roland-Garros (@rolandgarros) May 23, 2022 -
ఫ్రెంచ్ ఓపెన్‌లో పెను సంచలనం.. తొలి రౌండ్లోనే డిఫెండింగ్ ఛాంపియన్‌కు పరాభవం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో రెండో రోజు పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ బార్బరా క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ప్రపంచ 97వ ర్యాంకర్, 19 ఏళ్ల ఫ్రాన్స్ అమ్మాయి డియాన్ పారీ 1–6, 6–2, 6–3తో క్రిచికోవాపై సంచలన విజయం సాధించి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఈ ఓటమితో ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన మూడో డిఫెండింగ్ చాంపియన్‌గా క్రిచికోవా నిలిచింది. గతంలో అనస్తాసియా మిస్కినా (రష్యా–2005), ఎలెనా ఒస్టాపెంకో (లాత్వియా–2019) మాత్రమే టైటిల్ సాధించిన తర్వాత ఏడాది తొలి రౌండ్లోనే ఓడిపోయారు. మరోవైపు ప్రపంచ మాజీ నంబర్‌వన్, 38వ ర్యాంకర్ నయోమి ఒసాకా (జపాన్) కూడా తొలి రౌండ్లోనే ఓడిపోయింది. 28వ ర్యాంకర్ అనిసిమోవా (అమెరికా) 7–5, 6–4తో మూడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత నయోమి ఒసాకాను ఓడించింది. టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్) 6–2, 6–0తో సురెంకో (ఉక్రెయిన్)పై నెగ్గింది. పురుషుల సింగిల్స్‌లో 13 సార్లు చాంపియన్ నాదల్ (స్పెయిన్) తొలి రౌండ్లో 6–2, 6–2, 6–2తో థాంప్సన్ (ఆస్ట్రేలియా)పై గెలిచి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. 2015 విజేత వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–2, 3–6, 6–7 (2/7), 3–6తో ముటెట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. -
సంచలనాలతో షురూ
పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ సంచలన ఫలితాలతో ప్రారంభమైంది. టోర్నీ మొదటి రోజు ఆదివారం మహిళల సింగిల్స్‌లో 2016 చాంపియన్, పదో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్), ఆరో సీడ్ ఆన్స్ జెబర్ (ట్యూనిసియా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ప్రపంచ 46వ ర్యాంకర్ కయా కనెపి (ఎస్టోనియా) 2–6, 6–3, 6–4తో పదో ర్యాంకర్ ముగురుజాను ఓడించగా... ప్రపంచ 52వ ర్యాంకర్ మాగ్దా లినెట్ (పోలాండ్) 3–6, 7–6 (7/4), 7–5తో ఆరో ర్యాంకర్ ఆన్స్ జెబర్పై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. 2011 జూనియర్ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన ఆన్స్ జెబర్ ఇటీవల మాడ్రిడ్ ఓపెన్–1000 టోర్నీలో టైటిల్ సాధించడంతోపాటు ఇటాలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. క్లే కోర్టులపై 17 విజయాలు నమోదు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జెబర్ను ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరిగా పరిగణించారు. అయితే మాగ్దా లినెట్‌తో 2 గంటల 28 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జెబర్ 47 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. పురుషుల సింగిల్స్‌లో 2018, 2019 రన్నరప్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమై 194వ ర్యాంక్‌కు పడిపోయిన థీమ్ 3–6, 2–6, 4–6తో హుగో డెలియన్ (బొలీవియా) చేతిలో ఓడిపోయాడు. -
French Open Qualifiers 2022: రామ్‌కుమార్ పరాజయం
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పారిస్‌లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో భారత నంబర్‌వన్ రామ్‌కుమార్ రామనాథన్ 6–7 (6/8), 4–6తో సీన్ క్యూనిన్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. గంటా 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ నాలుగు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 17 అనవసర తప్పిదాలు చేసిన ఈ చెన్నై ప్లేయర్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. -
French Open 2022 Qualifiers: రామ్‌కుమార్ సంచలన విజయం
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో తొలి రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో భారత నంబర్‌వన్ రామ్‌కుమార్ రామనాథన్ 6–3, 6–2తో తొమ్మిదో సీడ్ యానిక్ హాంఫ్మన్ (జర్మనీ)పై సంచలన విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకోగా... యూకీ బాంబ్రీ (భారత్) 3–6, 5–7తో అల్తుగ్ సెలిక్బిలెక్ (టర్కీ) చేతిలో ఓడిపోయాడు. యానిక్తో జరిగిన మ్యాచ్‌లో రామ్‌కుమార్ ఆరు ఏస్‌లు సంధించాడు. -
బార్సిలోనా ఓపెన్‌కు నాదల్ దూరం
Rafael Nadal: పక్కటెముకల గాయం నుంచి స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఇంకా కోలుకోలేదు. దీంతో స్వదేశంలో ఈనెల 18 నుంచి జరిగే బార్సిలోనా ఓపెన్ టోర్నీకి అతడు దూరమయ్యాడు. కాగా బార్సిలోనా ఓపెన్‌లో రికార్డుస్థాయిలో 12 సార్లు విజేతగా నిలిచాడు నాదల్. ఇక వచ్చే నెలలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకల్లా నాదల్ కోలుకునే అవకాశముంది. 35 ఏళ్ల నాదల్ ఓవరాల్‌గా 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవగా అందులో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్సే 13 ఉన్నాయి. చదవండి: IPL 2022: మొదట్లో కష్టాలు... తర్వాత చుక్కలు... సిక్సర్ల సునామీతో చెన్నై బోణీ -
ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్స్‌లో కీలక మార్పు.. ఇకపై
టెన్నిస్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టారు. గ్రాండ్‌స్లామ్ టోర్నీ మ్యాచ్‌ల్లో ఇకపై ఆఖరి సెట్లో స్కోరు 6-6తో సమంగా ఉన్నప్పుడు 10 పాయింట్ టై బ్రేక్ ఆడేలా కొత్త రూల్ తీసుకొచ్చినట్లు బుధవారం గ్రాండ్‌స్లామ్ బోర్డు ఉమ్మడి అధికారిక ప్రకటన చేసింది. ఈ నిబంధన రానున్న ఫ్రెంచ్ ఓపెన్ నుంచే అమలు చేయనున్నట్లు బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ''ఆస్ట్రేలియన్ ఓపెన్, రోలాండ్-గారోస్(ఫ్రెంచ్ ఓపెన్), వింబుల్డన్, యుఎస్ ఓపెన్ లాంటి మేజర్ గ్రాండ్ స్లామ్ టోర్నీలలో 10-పాయింట్ టై-బ్రేక్ ఆడాలనే ఉమ్మడి నిర్ణయాన్ని తీసుకున్నాం. ఆఖరి సెట్లో స్కోరు ఆరుకు చేరుకున్నప్పుడు ఈ 10 పాయింట్ టై బ్రేక్ ఆడాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సుధీర్ఘ మ్యాచ్‌లు జరిగాయి. వాటివల్ల ఆటగాళ్లు మానసికంగా అలిసిపోతున్నారు.బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం ఆట నియమాలలో మరింత స్థిరత్వాన్ని సృష్టించనుంది. తద్వారా ఆటగాళ్ల అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఇక డబ్ల్యూటీఏ, ఏటీపీ, ఐటీఎఫ్ లాంటి టోర్నీల్లోనూ త్వరలోనే దీనిని అమలు చేయనున్నాం. ఇందుకోసం సదరు కమ్యూనిటీ అధికారులతో విస్తృతమైన సంప్రదింపులు జరుపుతున్నాం. ముందుగా ఫ్రెంచ్ ఓపెన్‌లో 10 పాయింట్ టై బ్రేక్‌ను ట్రయల్ నిర్వహించనున్నాం. ఆ తర్వాత మెల్లిగా అన్నింటికి వర్తించనున్నాం'' అని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక 10 పాయింట్ టై బ్రేక్ అనేది అన్ని గ్రాండ్‌స్లామ్‌ల్లో.. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో క్వాలిఫయింగ్ నుంచి ఫైనల్‌కు వరకు ఆఖరి సెట్లో ఇది వర్తించనుంది. సీనియర్‌తో పాటు జూనియర్ సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, వీల్‌చైర్ డబుల్స్‌లో కూడా ఈ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. చదవండి: Maria Sharapova-Michael Schumacher: షరపోవా, షుమాకర్‌లపై చీటింగ్, క్రిమినల్ కేసులు PAK vs AUS: 23 ఏళ్ల క్రితం టీమిండియా బ్యాటర్.. ఇప్పుడు పాకిస్తాన్ బ్యాటర్; సీన్ రిపీట్ -
Djokovic: వ్యాక్సిన్ తీసుకోకపోయినా ఫ్రెంచ్ ఓపెన్ బరిలో..!
Djokovic Might Play French Open 2022 : వ్యాక్సిన్ తీసుకోని కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయిన ప్రపంచ నంబర్ 1 ఆటగాడు నొవాక్ జకోవిచ్.. త్వరలో ప్రారంభంకానున్న ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్ నిబంధనలను సడలించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఫ్రాన్స్‌లో మహమ్మారి వైరస్ అదుపులోకి వస్తున్న నేపథ్యంలో నిబంధనలను సడలించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు నెలల క్రితం పాజిటివ్ వచ్చిన వారు ఫ్రాన్స్‌లో ఎంట్రీకి తప్పనిసరి వ్యాక్సిన్ పాస్ చూపాల్సిన అవసరం లేదని ఫ్రాన్స్ అధికారులు ప్రకటించారు. దీంతో జకో ఫ్రెంచ్ ఓపెన్ ఎంట్రీకి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. కాగా, జకో గతేడాది డిసెంబర్లో కరోనా బారినపడినట్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా వెల్లడించిన విషయం తెలిసిందే. చదవండి: టీమిండియా క్రికెటర్‌పై చేయి చేసుకున్న పెద్దాయన.. -
అలా అయితే నువ్వు మాకొద్దు!
పారిస్: ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి నిరాకరిస్తూ వస్తున్న జొకోవిచ్‌ను ఫ్రెంచ్ ఓపెన్ ఆడనివ్వమంటూ ఫ్రాన్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ జొకోవిచ్ వ్యాక్సిన్ తీసుకోని పక్షంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడటానికి అనుమతి ఇవ్వమని ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘ నో వ్యాక్సిన్.. నో ఫ్రెంచ్ ఓపెన్. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. జొకోవిచ్‌కు అయినా ఇదే రూల్. వ్యాక్సిన్ పాస్ రూల్ మేము అమలు చేయబోతున్నాం. ఇప్పటికే మాకు హెల్త్ పాస్ అనేది ఒకటి ఉంది. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. అది ఏ రంగంలో సెలబ్రెటీ అయినా వర్తిస్తుంది’ అని సదరు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఏడాది మే 22వ తేదీ నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం కానుంది. కాగా, అంతకముందు వీసా అంశంలో ఆస్ట్రేలియా కోర్టులో అతడికి చుక్కెదురైన సంగతి తెలిసిందే. దీంతో టైటిల్ నిలబెట్టుకోవాలన్న జొకోవిచ్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కాగా ఆస్ట్రేలియా ఓపెన్ నేపథ్యంలో వ్యాక్సినేషన్ వేయించుకోకపోయినా... ప్రత్యేక మినహాయింపుతో అతడు ఆస్ట్రేలియాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకో వీసాను రద్దు చేసింది. అయితే, అతడు కోర్టుకెక్కి విజయం సాధించాడు. కానీ ప్రభుత్వం మాత్రం తమకున్న అధికారాలతో మరోసారి వీసాను రద్దు చేసింది. దీంతో జొకో రెండోసారి కోర్టును ఆశ్రయించాడు. కానీ.. ఈసారి మాత్రం అతడికి నిరాశే ఎదురైంది. న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా వీసాను రద్దు చేశామన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. వ్యాక్సినేషన్ పత్రాలు సమర్పించడంలో విఫలం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. -
సెమీఫైనల్ల్లో ఓడిన పీవీ సింధు..
Pv Sindhu: ఫ్రెంచ్ ఓపెన్ 2021 టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పోరాటం ముగిసింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్‌కి చెందిన సయాక తకహాషీ చేతిలో 21-18, 16-21, 12-21 తేడాతో సింధు ఒటమి చెందింది. ఈ విజయంతో సయాక తకహాషీ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరింది. అంతకుముందు పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్‌పై 21-14, 21-14తో విజయం సాధించి సెమిస్లో అడుగు పెట్టింది. కాగా ఇప్పటి వరకు సయాక తకయాషీతో జరిగిన గత 8 మ్యాచుల్లో పీవీ సింధుకి ఇది నాలుగో ఓటమి కావడం విశేషం. చదవండి: AUS Vs ENG: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ -
నదాల్‌కు మళ్లీ పెళ్ళా.. ఫేస్బుక్ అప్డేట్ చూసి షాక్ తిన్న అభిమానులు
పారిస్: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు, ప్రపంచ నంబర్ 3 ఆటగాడు, స్పెయిన్ బుల్ రఫేల్ నదాల్ సోమవారం చేసిన ఓ ఫేస్బుక్ అప్డేట్ అతని అభిమానులను అయోమయానికి గురి చేసింది. గాట్ మ్యారీడ్ అంటూ రఫా తన రిలేషన్షిప్ స్టేటస్‌ను పొరపాటున అప్డేట్ చేయడంతో ఈ గందరగోళం మొదలైంది. ఇది చూసి కొందరు ఫ్యాన్స్ ఆనందపడగా.. మరికొందరు నదాల్‌కు మళ్లీ పెళ్ళా అంటూ కామెంట్లు పోస్ట్ చేశారు. నిజానికి నదాల్‌కు 2019 అక్టోబర్‌లోనే ప్రేయసి మరియా ఫ్రాన్సిస్కా పెరెల్లోతో పెళ్ళైంది. అయితే ఈ అప్డేట్ చూసిన కొందరు అభిమానులు నదాల్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడనుకుని పొరబడి, అతనికి శభాకాంక్షలు తెలిపారు. కాగా, నదాల్ పొరపాటున ఫేస్బుక్లో రిలేషన్షిప్ స్టేటస్‌ను అప్డేట్ చేయడంతో అది కాస్తా అతను ఆదివారమే పెళ్లి చేసుకున్నట్లుగా చూపించింది. ఇదిలా ఉంటే ఈ స్పెయిన్ బుల్ ప్రస్తుతం ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లాడు. ఈ రౌండ్లో అతను ఇటలీకి చెందిన 19 ఏళ్ల జన్నిక్ సిన్నర్‌తో తలపడనున్నాడు. కాగా, రఫా ప్రస్తుతానికి 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్లు సాధించి స్విస్ యోధుడు రోజర్ ఫెదరర్‌తో(20) సమానంగా ఉన్నాడు. ఇదిలా ఉంటే నదాల్‌కు మట్టి కోర్టుపై తిరుగులేని రికార్డు ఉంది. అతను 2005లో అరంగేట్రం చేసిన నాటి నుంచి కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయి 103 విజయాలు సాధించాడు. చదవండి: శ్రీలంకలో టీ20 ప్రపంచకప్..? -
ఫ్రెంచ్ ఓపెన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్.. రష్యా ప్లేయర్ అరెస్టు
పారిస్: గతేడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రష్యా క్రీడాకారిణి యానా సిజికోవాను శుక్రవారం ఫ్రెంచ్ పోలీసులు అరెస్టు చేశారు. 2020 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ తొలి రౌండ్ పోటీల్లో(సెప్టెంబర్ 30) సిజికోవా.. తన అమెరికన్ పార్ట్నర్ మాడిసన్ బ్రెంగ్లీలో కలిసి ఉద్దేశపూర్వకంగా మ్యాచ్ ఓడినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో సిజాకోవా జోడీ.. రొమేనియా జంట ఆండ్రియా మీటు, పాట్రిసియా మారియా చేతిలో 6-7, 4-6 తేడాతో ఓటమిపాలైంది. రెండో సెట్ అయిదో పాయింట్ వద్ద సిజికోవా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతేడాది అక్టోబర్‌లో విచారణ ప్రారంభించిన పోలీసులు, తాజాగా ఆమెపై ఆరోపణలు రుజువు కావడంతో అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా సిజికోవా తొలి రౌండ్లోనే ఓటమిపాలైంది. నిన్న (గురువారం) సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో రష్యా భామ ఎకాటరీనా అలెక్సాండ్రోవాతో తొలిసారి జతకట్టిన సిజికోవా.. 1-6, 1-6తో ఆస్ట్రేలియా జోడీ స్టార్మ్ సాండర్స్, అజ్లా టామ్లజనోవిక్ చేతిలో పరాజయం పాలైంది. ప్రస్తుతం డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 101 స్థానంలో కొనసాగుతున్న సిజికోవా.. ఈ ఏడాది ఇప్పటికే ఏడుగురు పార్ట్నర్లను మార్చి వరుస పరాజయాలను మూటకట్టుకుంది. చదవండి: ఆట కోసం ఆస్తులమ్ముకున్నాడు.. దేశాన్ని కూడా వీడాడు -
Naomi Osaka: ఫ్రెంచ్ టోర్నీలో ఊహించని ట్విస్ట్!
‘మీడియా సమావేశాల్లో పాల్గొనను. ఈ నిర్ణయం కారణంగా ఎదురయ్యే ఎలాంటి పరిణామాలకైనా సిద్ధం’... ఫ్రెంచ్ ఓపెన్ ఆరంభానికి ముందు జపాన్ స్టార్ నయోమి ఒసాకా చేసిన ప్రకటన ఇది. వారం రోజులు కూడా గడవక ముందే ఆమె అంచనా నిజమైంది. ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు భారీ జరిమానా వేసి కఠినంగా వ్యవహరించగా... తాను కూడా వెనక్కి తగ్గనంటూ ఒసాకా కఠిన నిర్ణయం తీసుకుంది. మున్ముందు తనపై చర్యలు తీసుకునే అవకాశం ఎలాగూ ఉండటంతో టోర్నీ నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. మీడియా కారణంగా మానసికంగా ఆందోళనకు లోనవుతున్న తన దృష్టిలో గ్రాండ్‌స్లామ్ టోర్నీ లెక్క కాదన్నట్లుగా ఆమె వ్యవహరించింది. పారిస్: నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ రెండో ర్యాంకర్ నయోమి ఒసాకా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకుంది. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా ఆట నుంచి విరామం కోరుకుంటున్నట్లు ప్రకటించింది. తొలి రౌండ్లో విజయం సాధించిన ఒసాకా... బుధవారం జరిగే రెండో రౌండ్లో రొమేనియాకు చెందిన అనా బొగ్డన్తో తలపడాల్సి ఉంది. అయితే ఒకరోజు ముందే ఆమె క్లే కోర్టు గ్రాండ్‌స్లామ్‌కు గుడ్‌బై చెప్పేసింది. తాను తప్పుకోవడానికి గల కారణాలను వెల్లడిస్తూ ఒసాకా ట్విటర్లో ఒక ప్రకటన విడుదల చేసింది. 23 ఏళ్ల ఒసాకా తన కెరీర్లో మొత్తం ఏడు సింగిల్స్ టైటిల్స్ సాధించగా... అందులో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉండటం విశేషం. 2018లో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను ఓడించి యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఒసాకా 2019, 2021లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను... 2020లో యూఎస్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఒసాకా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకోవడం దురదృష్టకరమని, వచ్చే ఏడాది ఆమె ఈ టోర్నీలో పాల్గొనాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించిన ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ చీఫ్ గైల్స్ మోరెటాన్... ఆటగాళ్ల ఆరోగ్యం, మంచీ చెడూ చూసుకునే బాధ్యతను తాము ఎప్పుడూ విస్మరించలేదని స్పష్టం చేశారు. నేపథ్యమిదీ... మీడియా సమావేశాల్లో విలేకరులు అర్థం పర్థం లేని ప్రశ్నలు, అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగి తమను ఇబ్బంది పెడుతుంటారని... పలు సందర్భాల్లో ఆటగాళ్లను బాధపెట్టడమే లక్ష్యంగా ఇలా చేస్తుంటారని ఆరోపిస్తూ ఒసాకా రాబోయే ఫ్రెంచ్ ఓపెన్‌లో జరిగే మీడియా సమావేశాల్లో పాల్గొననని టోర్నీకి ముందు ప్రకటించింది. ఓడినప్పుడైతే తమ మానసిక స్థితిని పట్టించుకోకుండా విలేకరులు వేధిస్తారంటూ వ్యాఖ్యానించిన ఆమె... తాను ఇవన్నీ తట్టుకోలేనంటూ చెప్పింది. అయితే గ్రాండ్‌స్లామ్ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు కచ్చితంగా మీడియా సమావేశానికి హాజరు కావాల్సిందే. ఊహించినట్లుగానే తొలి రౌండ్ విజయం తర్వాత ఒసాకా తన మాటపై నిలబడటంతో నిర్వాహకులు ఆమెపై 15 వేల డాలర్ల జరిమానా కూడా విధించారు. దీంతో పాటు అవసరమైతే గ్రాండ్‌స్లామ్‌లలో ఆడకుండా నిషేధం కూడా విధిస్తామంటూ నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల నిర్వాహకులు హెచ్చరించారు కూడా. ఇలాంటి స్థితిలో టోర్నీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడమే సరైందిగా ఆమె భావించింది. మీడియా గురించి కొద్ది రోజుల క్రితం నేను మాట్లాడినప్పుడు ఇలాంటి స్థితి వస్తుందని ఊహించలేదు. అయితే నాపై అనవసర దృష్టి పడుతున్న కారణంగా అందరి మేలు కోరి టోర్నీ నుంచి తప్పుకోవడమే సరైనదిగా భావిస్తున్నా. ఇది తగిన సమయం కాదని తెలిసినా తప్పడం లేదు. నా దృష్టిలో మానసిక ఆరోగ్య సమస్య చిన్నదేమీ కాదు. నిజం చెప్పాలంటే 2018లో యూఎస్ ఓపెన్ గెలిచిన నాటి నుంచే మానసికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ వస్తున్నాను. నేను పెద్దగా కలుపుగోలు మనిషిని కాదని నా సన్నిహితులందరికీ తెలుసు. జనంలో ఉన్నప్పుడు ఆందోళనను తగ్గించుకునే క్రమంలోనే ఎక్కువ సమయం హెడ్ ఫోన్లు ధరిస్తూ ఉంటాను కూడా. నిజానికి టెన్నిస్ మీడియా నన్ను మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టకపోయినా, మీడియా సమావేశానికి రాగానే తీవ్రంగా ఆందోళనకు లోనవుతూ ఉంటాను. పారిస్‌లో ఇప్పటికే పరిస్థితి నన్ను మరీ భయపెట్టేలా ఉంది. అందుకే నా మేలు కోసం మీడియాకు దూరంగా ఉండాలని భావించా. ఇక్కడ ఉన్న కొన్ని పాతకాలపు నిబంధనలను అందరి దృష్టికీ తీసుకురావాలని ప్రయత్నించా. నిర్వాహకులకు క్షమాపణ చెబుతూ టోర్నీ ముగిసిన తర్వాత మాట్లాడతా అని కూడా విడిగా చెప్పా. ప్రస్తుతానికి మైదానం నుంచి విరామం తీసుకుంటున్నా. రాబోయే రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఏమేం చేయవచ్చో నేనూ చర్చిస్తా. –నయోమి ఒసాకా చదవండి: ర్యాప్ అండ్ లవ్‌స్టోరీ -
ప్రెస్‌మీట్ వివాదం.. ఒసాకాకు ఝలక్
పారిస్: జపనీస్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ నయోమి ఒసాకా చెప్పినట్లే చేసింది. ఫ్రెంచ్ టోర్నీలో భాగంగా మ్యాచ్ తర్వాత ప్రెస్మీట్లో పాల్గొనకుండా వెళ్లిపోయింది. దీంతో మ్యాచ్ రిఫరీ ఆమెకు ఫైన్ విధించడంతో పాటు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకపోతే టోర్నీ నుంచి డిస్క్వాలిఫై చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాగా, రూల్స్ తెలిసి కూడా ప్రెస్‌మీట్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ఒసాకా ఇది వరకు ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో భాగంగా ఆదివారం రొమేనియన్ ప్లేయర్ ప్యాట్రికాతో మ్యాచ్ తర్వాత(ఒసాకానే గెలిచింది) ఆమె మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయింది. దీంతో ఈ వరల్డ్ నెంబర్ టు ర్యాంకర్‌కి 15 వేల డాలర్ల జరిమానా విధించారు. అంతేకాదు మళ్లీ ఇలా జరిగితే అనర్హత వేటు తప్పదని మ్యాచ్ రిఫరీ రొనాల్డ్ గారోస్ హెచ్చరించారు. 23 ఏళ్ల వయసున్న ఒసాకా నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెల్చుకోవడంతో పాటు.. స్పోర్ట్స్‌లో అత్యధికంగా సంపాదించే ఫిమేల్ ప్లేయర్ కూడా.: చూడండి: నయోమి ఒసాకా ఫొటోలు మీరేం స్పెషల్ కాదు ఇక ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభానికి ముందే నయోమి ఒసాకా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లను బాధపెట్టే విధంగా మీడియా అడిగే ప్రశ్నలు తమ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని చెబుతూ ప్రెస్‌మీట్‌ను బాయ్‌కాట్ చేసింది. గ్రాండ్‌స్లామ్ రూల్స్ ప్రకారం.. మీడియా సమావేశాన్ని ఎగ్గొడితే 20 వేల డాలర్లు (సుమారు రూ. 15 లక్షలు) దాకా జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా ఆమె బాయ్‌కాట్ చేయడం నిర్వాహకులకు మరింత కోపం తెప్పించింది. దీంతో మీరేం స్పెషల్ కాదని, నిబంధనలను ఆటగాళ్లందరికీ వర్తిస్తాయని పేర్కొంటూ ‘వింబుల్డన్, ఫ్రెంఛ్ ఓపెన్, ఆస్ట్రేలియన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ నిర్వాహ కమిటీలు సంయుక్తంగా ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. అయితే మ్యాచ్ ముగిశాక ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో ఆమె మీడియాతో ఇంటెరాక్ట్ కావడం విశేషం. anger is a lack of understanding. change makes people uncomfortable. — NaomiOsaka大坂なおみ (@naomiosaka) May 30, 2021 -
నాదల్‌ను ఆపతరమా?
పారిస్: పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్‌లో అడుగుపెడుతున్నాడు. ఆదివారం మొదలయ్యే ఈ టోర్నీలో నాదల్ మరోసారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇప్పటికే 13 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన 34 ఏళ్ల నాదల్... ఓవరాల్‌గా 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సరసన సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఈసారి నాదల్ పార్శ్వంలోనే వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా), మాజీ చాంపియన్ ఫెడరర్ కూడా ఉండటంతో నాదల్ ఖాతాలో ట్రోఫీ చేరాలంటే అతను విశేషంగా రాణించాల్సి ఉంటుంది. మరో పార్శ్వంలో రెండుసార్లు రన్నరప్ డొమినిక్ థీమ్ (ఆ్రస్టియా)తోపాటు ఐదో ర్యాంకర్ సిట్సిపాస్ (గ్రీస్), ఆరో ర్యాంకర్ జ్వెరెవ్ (జర్మనీ), రెండో ర్యాంకర్ మెద్వెదేవ్ (రష్యా) ఉన్నారు. అయితే క్లే కోర్టులపై మెద్వెదేవ్‌కు అంత గొప్ప రికార్డులేదు. ఫ్రెంచ్ ఓపెన్‌లో పాల్గొన్న నాలుగుసార్లు మెద్వెదేవ్ తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. నాదల్, జొకోవిచ్లతోపాటు థీమ్, సిట్సిపాస్‌లు కూడా టైటిల్ రేసులో ఉన్నారు. తొలి రౌండ్లో 62వ ర్యాంకర్ పాపిరిన్ (ఆ్రస్టేలియా)తో నాదల్... ఇస్తోమిన్ (ఉజ్బెకిస్తాన్)తో ఫెడరర్... సాండ్‌గ్రెన్ (అమెరికా) తో జొకోవిచ్ ఆడతారు. మరోవైపు మహిళల విభాగంలో తీవ్రమైన పోటీదృష్ట్యా కచి్చతమైన ఫేవరెట్ కనిపించడంలేదు. డిఫెండింగ్ చాంపియన్ స్వియాటెక్ (పోలాండ్)తోపాటు వరల్డ్ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), రెండో సీడ్ నయోమి ఒసాకా (జపాన్), ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), మాజీ చాంపియన్స్ ముగురుజా (స్పెయిన్), సెరెనా విలియమ్స్ (అమెరికా) టైటిల్ రేసులో ఉన్నారు. -
మీడియాతో మాట్లాడేది లేదు!
ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు జపాన్ స్టార్ నవోమీ ఒసాకా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నడూ లేని విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు హాజరు కానని ప్రకటించింది. ఆటగాళ్లను బాధపెట్టే విధంగా మీడియా అడిగే ప్రశ్నలు తమ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని చెప్పింది. గ్రాండ్‌స్లామ్ నిబంధనల ప్రకారం మీడియా సమావేశానికి హాజరు కాకపోతే 20 వేల డాలర్లు (సుమారు రూ. 15 లక్షలు) జరిమానా విధించే అవకాశం ఉండగా...అందుకు తాను సిద్ధమని ప్రకటించింది. -
14వ టైటిల్ వేటలో...‘స్టెయిన్లెస్ స్టీల్’ నాదల్
పారిస్: 100 విజయాలు, కేవలం 2 పరాజయాలు, 13 టైటిల్స్... ఫ్రెంచ్ ఓపెన్‌లో రాఫెల్ నాదల్ సాధించిన అత్యద్భుత ఘనత ఇది. ఎర్రమట్టిపై తనకే సాధ్యమైన జోరును కొనసాగించి మరో టోర్నీ గెలిస్తే అతను టెన్నిస్‌లో కొత్త చరిత్ర సృష్టిస్తాడు. 20 గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలతో ఫెడరర్గా సమంగా అగ్రస్థానంలో ఉన్న నాదల్...21వ టైటిల్‌తో ఒక్కడే శిఖరాన నిలుస్తాడు. అయితే తనకు అచ్చొచ్చిన మైదానంలో కూడా ఓటమి ఎదురు కావచ్చని, ఆటలో ఎక్కడా, ఎవరూ అజేయులు కాదని నాదల్ వ్యాఖ్యానించాడు. ‘కొద్ది రోజుల క్రితమే క్లే కోర్టుపైనే మాంటెకార్లో, మాడ్రిడ్ టోర్నీలలో నేను ఓడాను. రోలండ్ గారోస్‌లో మాత్రం ఓడిపోరాదని కోరుకుంటున్నా. నా శక్తి మేరకు పోరాడటమే నేను చేయగలిగింది’ అని చెప్పాడు. జూన్ 3న 35వ పుట్టిన రోజు జరుపుకోనున్న నాదల్... ఇంత కాలం ఆడగలనని పదేళ్ల క్రితం అనుకోలేదన్నాడు. ‘పదేళ్ల క్రితం నేను వరుస గాయాలతో బాధపడ్డాను. అసలు ఎంత కాలం ఆడతానో చెప్పలేని పరిస్థితి. అయితే రెండేళ్ల క్రితం మాత్రం నాలో కొత్త ఉత్సాహం వచ్చింది. కెరీర్‌ను మరికొన్నేళ్లు పొడిగించుకోవచ్చని అనిపించింది. 2005నుంచి ఇప్పటి వరకు ఇంత సుదీర్ఘ కాలం టాప్–10 కొనసాగడం గర్వంగా అనిపిస్తోంది’ అని ఈ స్పెయిన్ స్టార్ గుర్తు చేసుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో 2009 రాబిన్ సొదర్లింగ్ చేతిలో పరాజయం పాలైన నాదల్, 2015లో జొకోవిచ్ చేతిలో ఓడాడు. తర్వాతి ఏడాది గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే తప్పుకున్నాడు. ‘రోలండ్ గారోస్‌కు నా దృష్టిలో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గెలిచిన 13 టైటిల్స్‌లో ఏది ఇష్టమంటే చెప్పలేను. ప్రతీ దానికి ఒక్కో విశిష్టత ఉంది. మళ్లీ నా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి నెగ్గాలని అనుకుంటున్నా’ అని ఈ దిగ్గజ ఆటగాడు తన మనసులో మాట చెప్పాడు. ఒకే పార్శ్వంలో ముగ్గురు దిగ్గజాలు 14వ టైటిల్ వేటలో నాదల్కు కఠినమైన డ్రా ఎదురైంది. టాప్ సీడ్ నాదల్‌తో పాటు వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్, స్విస్ స్టార్ రోజర్ ఫెడరర్ కూడా ఒకే పార్శ్వంలో ఉండటం విశేషం. ముందంజ వేయాలంటే నాదల్ ఇటీవల క్లే కోర్టుల్లో విశేషంగా రాణిస్తున్న పలువురు యువ ఆటగాళ్లను దాటాల్సి ఉంటుంది. ఎలాంటి సంచలనాలు లేకుండా అంతా సాఫీగా సాగితే పురుషుల క్వార్టర్ ఫైనల్లో నాదల్‌తో రుబ్లెవ్ తలపడే అవకాశం ఉండగా...జొకోవిచ్, ఫెడరర్ మధ్య క్వార్టర్స్‌లోనే పోరు జరగనుంది. ఫ్రెంచ్ ఓపెన్‌కు పర్యాయపదంగా మారిన రాఫెల్ నాదల్‌ను నిర్వాహకులు సముచిత రీతిలో గౌరవించారు. రోలండ్ గారోస్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద నాదల్ స్టెయిన్లెస్ స్టీల్ విగ్రహాన్ని వారు ఏర్పాటు చేశారు. నాదల్ ప్రధాన బలమైన ‘ఫోర్ హ్యాండ్’ షాట్ పోజులో ఈ 3 మీటర్ల విగ్రహం కనిపిస్తుంది. స్పెయిన్‌కు చెందిన ప్రముఖ శిల్పి జోర్డీ డి ఫెర్నాండెజ్ దీనిని రూపొందించారు. రాతి, ఇనుము, చెక్క, మట్టి తదితర వస్తువులతో ప్రయత్నించిన తర్వాత చివరకు నాదల్ విగ్రహాన్ని స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేయాలని ఆయన నిర్ణయించారు. -
French Open: రామ్‌కుమార్ శుభారంభం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులు రామ్‌కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పారిస్‌లో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ 2–6, 7–6 (7/4), 6–3తో మైకేల్ మోమో (అమెరికా)పై నెగ్గి రెండో రౌండ్‌కు చేరాడు. మరోవైపు ప్రజ్నేశ్ 2–6, 2–6తో ఆస్కార్ ఒట్టె (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. Weight Lifting: స్నాచ్ విభాగంలో జెరెమీకి రజతం ప్రపంచ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో భారత క్రీడాకారుడు జెరెమీ లాల్రినుంగా స్నాచ్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించాడు. తాష్కెంట్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో మిజోరం లిఫ్టర్ జెరెమీ 67 కేజీల విభాగంలో ఓవరాల్‌గా 300 కేజీలు (స్నాచ్‌లో 135+క్లీన్ అండ్ జెర్క్‌లో 165) బరువెత్తి నాలుగో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ఒజ్బెక్ (టర్కీ–317 కేజీలు), అక్మోల్డా (కజకిస్తాన్–308 కేజీలు), యూసుఫ్ (టర్కీ–308 కేజీలు) స్వర్ణ, రజత, కాంస్య పతకాలు నెగ్గారు. -
French Open: అంకిత గెలుపు.. రెండో రౌండ్లోకి ఎంట్రీ
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ క్రీడాకారిణి అంకిత రైనా రెండో రౌండ్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 182వ ర్యాంకర్ అంకిత 2 గంటల 9 నిమిషాల్లో 3–6, 6–1, 6–4తో ప్రపంచ 169వ ర్యాంకర్ అనస్తాసియా రొడియోనోవా (ఆస్ట్రేలియా)పై గెలిచింది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో అంకిత నెట్‌వద్దకు 27 సార్లు దూసుకొచ్చి 18 సార్లు పాయింట్లు సంపాదించింది. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయిన అంకిత ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. రొడియోనోవా పది డబుల్ఫాల్ట్లతోపాటు 39 అనవసర తప్పిదాలు చేసింది. రెండో రౌండ్లో ప్రపంచ 125వ ర్యాంకర్ గ్రీట్ మినెన్ (బెల్జియం)తో అంకిత ఆడుతుంది. చదవండి: Telangana Boxer: క్వార్టర్ ఫైనల్లో హసాముద్దీన్ -
French Open: సుమిత్ తొలి రౌండ్ ప్రత్యర్థి అతడే
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ 191వ ర్యాంకర్ మార్కోరా (ఇటలీ)తో ఆడనున్నాడు. నేడు మొదలయ్యే ఈ టోర్నీలో భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 152వ ర్యాంకర్ ఆస్కార్ ఒట్టె (జర్మనీ)తో... రామ్‌కుమార్ 168వ ర్యాంకర్ మైకేల్ మోమో (అమెరికా)తో తలపడతారు. మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్ తొలి రౌండ్లో అరీనా రొడియోనోవా (ఆస్ట్రేలియా)తో అంకిత రైనా ఆడుతుంది. చదవండి: Asian Boxing Championship: భారత్‌కు 7 పతకాలు ఖాయం Monaco Grand Prix: విజేత వెర్స్టాపెన్ -
French Open: మరో స్టార్ ప్లేయర్ దూరం
రొమేనియా: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరమైన స్టార్ ప్లేయర్ల జాబితాలో మరొకరు చేరారు. పురుషుల సింగిల్స్‌లో 2015 చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్), మాజీ నంబర్‌వన్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఈ మెగా ఈవెంట్‌కు దూరంకాగా ... తాజాగా మహిళల సింగిల్స్‌లో 2018 చాంపియన్, మూడో ర్యాంకర్ సిమోనా హలెప్ బరిలోకి దిగడంలేదని ప్రకటించింది. కాలిపిక్క గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హలెప్ తెలిపింది. ఈనెల 30న ఫ్రెంచ్ ఓపెన్ మొదలవుతుంది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట ఓటమి జెనీవా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–ఫ్రాంకోస్కుగర్ (క్రొయేషియా) పోరాటం ముగిసింది. స్విట్జర్లాండ్‌లో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ బోపన్న–స్కుగర్ ద్వయం 3–6, 6–3, 11–13తో ‘సూపర్ టైబ్రేక్’లో గొంజాలో ఎస్కోబార్ (కొలంబియా)–ఏరియల్ బెహర్ (ఉరుగ్వే) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. క్వార్టర్స్‌లో ఓడిన బోపన్న జంటకు 4,710 యూరోల (రూ. 4 లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఫ్రెంచ్ ఓపెన్‌కు మాజీ విజేత వావ్రింకా దూరం
పారిస్‌లో ఈనెల 30న మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తాను ఆడటంలేదని 2015 చాంపియన్, ప్రపంచ 24వ ర్యాంకర్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) మంగళవారం ప్రకటించాడు. గత మార్చిలో వావ్రింకా ఎడమ కాలికి శస్త్ర చికిత్స జరిగింది. ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించపోవడంతో ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరంగా ఉంటున్నానని... జూన్ 28న మొదలయ్యే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీతో పునరాగమనం చేస్తానని 36 ఏళ్ల వావ్రింకా తెలిపాడు. -
French Open:: టోర్నీకి స్టార్ ప్లేయర్ దూరం
ప్రపంచ మాజీ నంబర్‌వన్, మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత, బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే మే 30 నుంచి జరిగే ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే నెలలో గ్రాస్‌కోర్టు సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యేందుకే ముర్రే ఈ నిర్ణయం తీసుకున్నాడు. గజ్జల్లో గాయం కారణంగా గత మార్చిలో మయామి ఓపెన్ నుంచి వైదొలిగిన ముర్రే ఆ తర్వాత మరే టోర్నీలోనూ సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగలేదు. చదవండి: Rafael Nadal: పదోసారీ టైటిల్ అతడిదే -
2009 ఫ్రెంచ్ ఓపెన్ రాకెట్ వేలానికి...
స్విట్జర్లాండ్: టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన కెరీర్లో ఏకైక ఫ్రెంచ్ ఓపెన్‌ను 2009లో సాధించాడు. దాంతోనే అతని కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తయింది. ఆ టోర్నీ ఫైనల్లో రాబిన్ సొదర్లింగ్పై గెలిచిన ఫెడరర్... నాటి మ్యాచ్‌లో వాడిన రాకెట్‌ను ఇప్పుడు తన ఫౌండేషన్ కోసం వేలానికి పెట్టాడు. పారిస్ క్లే కోర్టు ఎర్ర మట్టి మరకలు ఇప్పటికీ ఉన్న మ్యాచ్ షూస్‌ను కూడా అతను వేలం కోసం అందుబాటులో ఉంచాడు. వీటితో పాటు పలు జ్ఞాపికలను ఈ ఏడాది జూన్, జులైలలో జరిగిన ఆన్లైన్ వేలంలో అభిమానులు సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంది. చదవండి: టోక్యో ఒలంపిక్స్: అడుగడుగునా కరోనా పరీక్షలు -
నాదల్ 13వసారి సెమీస్‌లోకి...
మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)దే పైచేయిగా నిలిచింది. ఇటలీ టీనేజర్ జానిక్ సినెర్‌తో జరిగిన మ్యాచ్‌లో నాదల్ 7–6 (7/4), 6–4, 6–1తో గెలుపొంది ఈ టోర్నీలో 13వసారి సెమీఫైనల్‌కు చేరాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో 12వ సీడ్ డీగో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)తో నాదల్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో నాదల్ 9–1తో ఆధిక్యంలో ఉన్నాడు. పారిస్ కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమై రాత్రి ఒకటిన్నరకు ముగిసింది. ఫ్రెంచ్ ఓపెన్‌లోని సెంటర్ కోర్టుకు పైకప్పు అమర్చడంతో ఈసారి రాత్రి వేళ కూడా మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 7–5, 6–2, 6–3తో 13వ సీడ్ రుబ్లెవ్ (రష్యా)ను ఓడించి తొలిసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. -
క్విటోవా కేక...
పారిస్: కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి పెట్రా క్విటోవా ఆ దిశగా మరో అడుగు వేసింది. ఎనిమిదేళ్ల తర్వాత ఆమె ఫ్రెంచ్ ఓపెన్‌లో మళ్లీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ క్విటోవా 6–3, 6–3తో లౌరా సిగెముండ్ (జర్మనీ)పై విజయం సాధించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో క్విటోవా ఆరు ఏస్‌లు సంధించింది. నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 15 అనవసర తప్పిదాలు చేసిన ఆమె ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. పదునైన ఏస్‌లతో చెలరేగిన క్విటోవా తొలి సెట్లో ప్రత్యర్థికి ఒక్కసారీ బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. ఫోర్ హ్యాండ్ విన్నర్‌తో తొలి సెట్‌ను నెగ్గిన ఆమె రెండో సెట్లోనూ అదే జోరు కొనసాగించింది. తొలి గేమ్‌లోనే సిగెముండ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన క్విటోవా ఆ తర్వాత తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. కానీ సిగెముండ్ తన సర్వీస్‌ను కాపాడుకోవడంలో మూడుసార్లు విఫలమవ్వడంతో క్విటోవాకు విజయం సులువుగానే దక్కింది. 2012లో ఏకైకసారి ఈ టోర్నీలో సెమీస్ చేరిన క్విటోవా తొలిసారి ఫైనల్‌కు చేరాలంటే సెమీఫైనల్లో నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా)ను ఓడించాల్సి ఉంటుంది. మరో క్వార్టర్ ఫైనల్లో సోఫియా 6–4, 4–6, 6–0తో అన్‌సీడెడ్ డానియెలా కొలిన్స్ (అమెరికా)పై గెలిచింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సోఫియా ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి సెమీఫైనల్‌కు చేరడం విశేషం. 2 గంటల 4 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సోఫియా రెండో సెట్లో తడబడింది. కానీ నిర్ణాయక మూడో సెట్లో ఈ అమెరికా క్రీడాకారిణి ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా విజయాన్ని ఖాయం చేసుకుంది. -
ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో నాదల్ !
పారిస్: డిఫెండింగ్ ఛాంపియన్ రాఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో ఇటలీకి చెందిన యువ ఆటగాడు 'జన్నిక్ సిన్నర్'పై 7-6, 6-4, 6-1 తేడాతో గెలుపొందాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ ఇప్పటివరకు వంద మ్యాచులు ఆడగా, వీటిలో 98 విజయాలు సాధించడం విశేషం. ఇప్పటి వరకు 12 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ దక్కించుకున్న నాదల్ మరో టైటిల్ సాధించేందుకు రెండు అడుగుల దూరంలో ఉన్నాడు. సెమీ ఫైనల్స్‌లో అర్జెంటినాకు చెందిన 'డీగో ష్వార్ట్మెన్'తో తలపడనున్నాడు. ఆ టైంలో భయకరంగా ఉంది... దాదాపు 2 గంటల 49 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ ముగిసేసరికి అర్ధరాత్రి 1.30 గంటలైంది. మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో నాదల్ మాట్లాడాడు. 12 డిగ్రీల సెల్సియల్తో ఈ సమయం వరకు మ్యాచ్ ఆడడం భయంకరంగా ఉందని అన్నాడు. ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఇలాంటి వాతావరణంలో ఆడుతారని, కానీ నిర్వాహకులు మ్యాచ్‌ను ఇంత ఆలస్యంగా ఎందుకు నిర్వహించారని అసంతృప్తి వ్యక్తం చేశాడు. నాదల్, జన్నిక్ సిన్నర్ రాత్రి 10.30 గంటలకు కోర్ట్‌లో అడుగుపెట్టారు. ఒకే కోర్టుపై ఐదు మ్యాచులు ఉండడంతో వారికి ఆలస్యం అవ్వక తప్పలేదు. జన్నిక్పై ప్రశంసలు... జన్నిక్ అద్భుతంగా ఆడాడని, బంతిని ధాటిగా స్ట్రైక్ చేస్తున్నాడని నాదల్ అన్నాడు. మొదటి రెండు సెట్స్‌లో మంచి పోటీనిచ్చాడని...ముఖ్యంగా మొదటి సెట్లో హోరాహోరిగా పోటిపడ్డామని అన్నాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉందని కితాబిచ్చాడు. (ఇదీ చదవండి: అక్షరాలా రూ. 7 కోట్లు) -
ఫ్రెంచ్ కోటలో కొత్త చరిత్ర
తొలి రౌండ్ నుంచి మొదలైన సంచలనాల మోత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇంకా కొనసాగుతోంది. వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న ఈ టోర్నమెంట్లో ఎవ్వరూ ఊహించని విధంగా మహిళల సింగిల్స్ విభాగంలో తొలిసారి ఓ క్వాలిఫయర్ సెమీఫైనల్‌కు దూసుకొచ్చింది. కెరీర్లో కేవలం రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న అర్జెంటీనాకు చెందిన 131వ ర్యాంకర్ నదియా పొడొరోస్కా ఈ ఘనత సాధించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా పారిస్ వచ్చిన 23 ఏళ్ల నదియా తన జోరు కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ స్వితోలినాను బోల్తా కొట్టించి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. పారిస్: డిఫెండింగ్ చాంపియన్ వైదొలగడం... టైటిల్ ఫేవరెట్స్ ఆరంభ రౌండ్లలోనే వెనుదిరగడం ... వెరసి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ఊహించని ఫలితాలు నమోదవుతున్నాయి. తొలిసారి ఈ మెగా ఈవెంట్లో మహిళల సింగిల్స్‌లో ఓ క్వాలిఫయర్ సెమీఫైనల్ దశకు అర్హత పొందింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 131వ ర్యాంకర్ నదియా పొడొరోస్కా (అర్జెంటీనా) 79 నిమిషాల్లో 6–2, 6–4తో మూడో సీడ్, ప్రపంచ ఐదో ర్యాంకర్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలిచింది. ఈ క్రమంలో 23 ఏళ్ల పొడొరోస్కా 2004 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన తొలి అర్జెంటీనా క్రీడాకారిణిగా నిలిచింది. చివరిసారి అర్జెంటీనా తరఫున 2004లో పౌలా సురెజ్ ఈ ఘనత సాధించింది. పౌలా సురెజ్ కూడా ఫ్రెంచ్ ఓపెన్లోనే సెమీఫైనల్ చేరింది. ఇగా స్వియాటెక్ (పోలాండ్), క్వాలిఫయర్ మారి్టనా ట్రెవిసాన్ (ఇటలీ) మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో సెమీఫైనల్లో పొడొరోస్కా ఆడుతుంది. ఆన్స్ జెబర్ (ట్యూనిషియా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో డానియెలా కొలిన్స్ (అమెరికా) 6–4, 4–6, 6–4తో నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరింది. తడబాటు... డిఫెండింగ్ చాంపియన్ యాష్లే బార్టీ ఈ టోర్నీకి దూరంగా ఉండటం... మాజీ చాంపియన్స్ సెరెనా, హలెప్, ముగురుజా... రెండో సీడ్ ప్లిస్కోవా ప్రిక్వార్టర్ ఫైనల్లోపే ని్రష్కమించడంతో మూడో సీడ్ స్వితోలినాకు కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ టైటిల్ కలను సాకారం చేసుకునేందుకు మంచి అవకాశం లభించింది. కానీ పొడొరోస్కా రూపంలో స్వితోలినాకు దెబ్బ పడింది. తన క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి పొడొరోస్కా గురించి అంతగా వినలేదని... ఆమె ఆట గురించి కూడా తెలియదని వ్యాఖ్యానించిన స్వితోలినాకు కోర్టులో విభిన్న పరిస్థితి ఎదురైంది. పొడొరోస్కా ఆటపై అవగాహన కలిగేలోపే స్వితోలినా తొలి సెట్‌ను కోల్పోయింది. 35 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్లో నాలుగుసార్లు స్వితోలినా సర్వీస్‌ను బ్రేక్ చేసిన పొడొరోస్కా తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. ఇక రెండో సెట్లో ఆరంభంలో ఇద్దరూ 1–1తో సమంగా నిలిచాక మూడుసార్లు చొప్పున తమ సర్వీస్‌లను నిలబెట్టుకోలేకపోయారు. దాంతో స్కోరు 4–4తో సమం అయ్యింది. ఆ తర్వాత పొడొరోస్కా తన సర్వీస్‌ను కాపాడుకొని పదో గేమ్‌లో స్వితోలినా సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో పొడొరోస్కా తన సరీ్వస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిది సార్లు బ్రేక్ చేసింది. స్వితోలినా 8 విన్నర్స్ కొట్టగా... పొడొరోస్కా ఏకంగా 30 విన్నర్స్ కొట్టింది. నెట్ వద్ద పొడొరోస్కా 17 సార్లు... స్వితోలినా ఏడుసార్లు పాయింట్లు సాధించారు. స్వితోలినా క్వాలిఫయర్ అంటే... గ్రాండ్‌స్లామ్ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో 128 మంది ఉంటారు. ఇందులో 104 మందికి ర్యాంకింగ్ ద్వారా నేరుగా చోటు కల్పిస్తారు. మిగిలిన 24 మందిలో 8 మందికి నిర్వాహకులు వైల్డ్ కార్డులు ద్వారా ప్రవేశం కల్పిస్తారు. మిగిలిన 16 బెర్త్‌లను క్వాలిఫయింగ్ నాకౌట్ టోర్నీ ద్వారా భర్తీ చేస్తారు. మూడు రౌండ్లపాటు జరిగే క్వాలిఫయింగ్ టోర్నిలో 128 మంది పాల్గొంటారు. క్వాలిఫయింగ్ టోర్నిలో మూడు మ్యాచ్‌లు నెగ్గి ముందంజ వేసినవారు (16 మంది) మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందుతారు. ►ఈ టోర్నీకంటే ముందు పొడొరోస్కా తన కెరీర్లో ఏనాడూ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మ్యాచ్ గెలవలేదు. టాప్–50 ర్యాంకింగ్స్లోపు క్రీడాకారిణిని ఓడించలేదు. 2016లో ఆమె యూఎస్ ఓపెన్‌లో ఆడినా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. డబ్ల్యూటీఏ టూర్ టోర్నీలలో కూడా ఆమె ఏనాడూ వరుస రెండు మ్యాచ్‌ల్లో నెగ్గలేదు. థీమ్‌కు షాక్... పురుషుల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆ్రస్టియా) క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. 5 గంటల 8 నిమిషాలపాటు సాగిన క్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ డీగో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 7–6 (7/1), 5–7, 6–7 (6/8), 7–6 (7/5), 6–2తో గతేడాది రన్నరప్ థీమ్‌పై సంచలన విజయం సాధించాడు. తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో సెమీస్ చేరాడు. ►గ్రాండ్‌స్లామ్ టోర్నీల మహిళల సింగిల్స్‌లో పొడొరోస్కా కంటే ముందు క్వాలిఫయర్ హోదాలో 1978 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్రిస్టిన్ డొరీ (ఆ్రస్టేలియా)... 1999 వింబుల్డన్ టోర్నీలో అలెగ్జాండ్రా స్టీవెన్సన్ (అమెరికా) మాత్రమే సెమీస్ చేరారు. -
అక్షరాలా రూ. 7 కోట్లు
పారిస్: అగ్రశ్రేణి క్రీడాకారులు తమ ఆటతోపాటు తమ అలంకారాలతో కూడా అందరి దృష్టిని ఆకర్షించడం కొత్త కాదు. ఇప్పుడు ఇదే జాబితాలో టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ కూడా చేరాడు. 20వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఫ్రెంచ్ ఓపెన్‌లో దూసుకుపోతున్న నాదల్ తన కుడిచేతికి ధరించిన గడియారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ చేతి గడియారం ఖరీదు ఏకంగా 10 లక్షల 50 వేల డాలర్లు (సుమారు రూ. 7 కోట్ల 67 లక్షలు) కావడం విశేషం. ఇంత ఖరీదైన రిస్ట్ వాచ్‌ను ఒక టెన్నిస్ ఆటగాడు గతంలో ఎప్పుడూ ధరించలేదు. ప్రతిష్టాత్మక కంపెనీ ‘రిచర్డ్ మిల్లే’ నాదల్‌తో తమకు ఉన్న 10 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ వాచీని ప్రత్యేకంగా తయారు చేసింది. ‘ఆర్ఎం 27–04 టోర్బిలాన్ రాఫెల్ నాదల్’ పేరుతో సదరు కంపెనీ ఇలాంటి 50 చేతి గడియారాలను మాత్రమే రూపొందించి మార్కెట్లో ఉంచింది. టైటాకార్బ్ టెక్నాలజీతో కార్ల తయారీలో వాడే మెటీరియల్‌ను దీనికి ఉపయోగించారు. అదీ ఇది అని కాకుండా సాంకేతికపరంగా లెక్కలేనన్ని ప్రత్యేకతలు ఈ గడియారంలో ఉన్నాయన్న రిచర్డ్ మిల్లే... నాదల్లాంటి దిగ్గజం మణికట్టుకు ఇది కనిపించడం తమకు గర్వకారణమని పేర్కొంది. ఆట ఓడాక ఆనందం... ‘చాలా అద్భుతంగా ఉంది’, ‘నా జీవితంలో కచ్చితంగా ఇదే అత్యుత్తమ క్షణం’... సాధారణంగా ఇలాంటి మాటలు విజేతగా నిలిచిన ఆటగాడి నోటి నుంచి వినిపిస్తుంటాయి. కానీ ఒక మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన తర్వాత కూడా ఎవరైనా ఇలా మాట్లాడితే ఆశ్చర్యపడాల్సిందే. అమెరికా యువ ఆటగాడు సెబాస్టియన్ కోర్డా ఫ్రెంచ్ ఓపెన్ ప్రిక్వార్టర్స్‌లో రాఫెల్ నాదల్ చేతిలో ఓడిన ఇలాంటి ‘తన్మయత్వానికి’ గురయ్యాడు. అందుకు కారణం అతను చిన్ననాటి నుంచి నాదల్ వీరాభిమాని కావడమే. ‘చిన్నప్పటి నుంచి నాకు ఆటంటే నాదల్ మాత్రమే. అతను ఏ టోర్నీలో ఆడినా, ఎవరితో తలపడినా ప్రతీ మ్యాచ్‌ను నేను చూశాను. నా పిల్లికి కూడా అతని పేరే పెట్టుకున్నాను. అలాంటిది క్లే కోర్టులో అతనికి ప్రత్యర్థిగా ఆడగలనని అస్సలు ఊహించలేదు. అందుకే ఇది నాకు మరచిపోలేని మధుర క్షణం’ అని 20 ఏళ్ల సెబాస్టియన్ చెప్పాడు. సెబాస్టియన్ తండ్రి పెటర్ కోర్డా 1998లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలవగా, 1992 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు వచ్చాడు. అయినా సరే నాదల్ అంటేనే సెబాస్టియన్ పడి చస్తాడు. అందుకే మ్యాచ్ ముగిసిన తర్వాత నేరుగా నాదల్ వద్దకే వెళ్లి అడిగి మరీ టీ షర్ట్‌పై ఆటోగ్రాఫ్ తీసుకొని సంబరపడిపోయాడు. మరోవైపు సెబాస్టియన్ భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని నాదల్ ఆకాంక్షించాడు. సెబాస్టియన్ కోర్డా -
సబలెంకాకు షాక్
పారిస్: టెన్నిస్ సీజన్లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీగా జరుగుతోన్న ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. తాజాగా మహిళల సింగిల్స్ విభాగంలో ఎనిమిదో సీడ్ సబలెంకా (బెలారస్), 13వ సీడ్ పెట్రా మార్టిక్ (చెక్ రిపబ్లిక్)... పురుషుల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ), పదో సీడ్ రొబెర్టో బాటిస్టా అగుట్ (స్పెయిన్) మూడో రౌండ్లో ఇంటిముఖం పట్టారు. ట్యూనిషియా క్రీడాకారిణి, ప్రపంచ 35వ ర్యాంకర్ ఆన్స్ జెబర్ 7–6 (9/7), 2–6, 6–3తో సబలెంకాను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ఏడు డబుల్ ఫాల్ట్‌లు, 36 అనవసర తప్పిదాలు చేసింది. సబలెంకా ఓటమితో ప్రస్తుతం మహిళల సింగిల్స్ విభాగంలో టాప్–10లో ఐదుగురు మాత్రమే మిగిలారు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) 6–2, 6–0తో ఇరీనా బారా (రొమేనియా)పై, ఏడో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–3తో లెలా ఫెర్నాండెజ్ (కెనడా)పై నెగ్గగా... 13వ సీడ్ పెట్రా మార్టిక్ 7–6 (7/5), 3–6, 0–6తో లౌరా సిగెముండ్ (జర్మనీ) చేతిలో, 2017 చాంపియన్ ఒస్టాపెంకో (లాత్వియా) 4–6, 3–6తో పౌలా బడోసా (స్పెయిన్) చేతిలో ఓడిపోయారు. క్వాలిఫయర్ ఆల్ట్‌మైర్ సంచలనం పురుషుల సింగిల్స్‌లో క్వాలిఫయర్, 186వ ర్యాంకర్ డానియల్ ఆల్ట్‌మైర్ సంచలన ప్రదర్శనతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మూడో రౌండ్లో ఆల్ట్‌మైర్ 6–2, 7–6 (7/5), 6–4తో ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ)పై నెగ్గాడు. తద్వారా 2000 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరిన ఐదో క్వాలిఫయర్‌గా గుర్తింపు పొందాడు. పదో సీడ్ అగుట్ 4–6, 3–6, 7–5, 4–6తో కరెనో బుస్టా (స్పెయిన్) చేతిలో ఓటమి చవిచూశాడు. మరో మ్యాచ్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6–0, 6–3, 6–2తో డానియల్ గలాన్ (కొలంబియా)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. -
నాదల్‌ను నిలువరించేనా?
పారిస్: ఎర్రమట్టి కోర్టులపై మకుటంలేని మహరాజు రాఫెల్ నాదల్ ఈసారీ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సాధిస్తే రెండు ఘనతలు సాధిస్తాడు. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ (20 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేయడంతోపాటు... ఫ్రెంచ్ ఓపెన్‌లో 100 విజయాలు పూర్తి చేసుకున్న ఏకైక ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. నేటి నుంచి మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ రెండు లక్ష్యాలు అధిగమించాలంటే నాదల్ ఎప్పటిలాగే విశేషంగా ఆడాల్సి ఉంటుంది. తన పార్శ్వంలో ఉన్న గత ఏడాది రన్నరప్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను... మాజీ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించాల్సి ఉంటుంది. ‘డ్రా’ ప్రకారమైతే నాదల్ ఇటీవల యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన థీమ్‌ను సెమీస్‌లో... ఈ ఏడాది ఓటమెరుగని జొకోవిచ్ ను ఫైనల్లో ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. 2005 నుంచి ఈ టోర్నీలో ఆడుతోన్న నాదల్కు అద్వితీయ రికార్డు ఉంది. 93 మ్యాచ్‌ల్లో నెగ్గిన అతను రెండు సార్లు (2009లో ప్రిక్వార్టర్ ఫైనల్లో సోడెర్లింగ్చేతిలో; 2015 క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో) మాత్రమే ఓటమి చవిచూశాడు. గాయం కారణంగా 2016లో మూడో రౌండ్లో బరిలోకి దిగకుండానే ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చాడు. ఈసారి తొలి రౌండ్లో ఇగోర్ జెరాసిమోవ్ (బెలారస్)తో నాదల్ తలపడనున్నాడు. టైటిల్ సాధించే క్రమంలో ఏడు మ్యాచ్‌లు నెగ్గితే నాదల్కు ఫ్రెంచ్ ఓపెన్‌లో సరిగ్గా 100 విజయాలు పూర్తవుతాయి. ఫెడరర్ (ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 102; వింబుల్డన్‌లో 101) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ లో 100 విజయాలు నమోదు చేసుకున్న ప్లేయర్‌గా నాదల్ నిలుస్తాడు. అంతేకాకుండా పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఫెడరర్ రికార్డును నాదల్ సమం చేస్తాడు. నాదల్‌తోపాటు రెండుసార్లు రన్నరప్ డొమినిక్ థీమ్, మాజీ విజేత జొకోవిచ్ కూడా టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు. ఇటాలియన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెలిచి జొకోవిచ్... యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గి థీమ్ ఫామ్‌లో ఉన్నారు. ఈ ముగ్గురు కాకుండా జ్వెరెవ్ (జర్మనీ), సిట్సిపాస్ (గ్రీస్), మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) కూడా మెరిపించే అవకాశముంది. సెరెనా సత్తా చాటేనా... మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్స్ హలెప్ (రొమేనియా), సెరెనా విలియమ్స్ (అమెరికా), ముగురుజా (స్పెయిన్) టైటిల్ ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నారు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆల్‌టైమ్ ప్లేయర్‌గా మార్గరెట్ కోర్ట్ (24 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేసేందుకు సెరెనాకు మరో ‘గ్రాండ్’ టైటిల్ కావాలి. యూఎస్ ఓపెన్‌లో సెమీస్ చేరిన సెరెనా ఈసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో పూర్తిస్థాయి మ్యాచ్ ఫిట్నెస్తో బరిలోకి దిగడంలేదని వ్యాఖ్యానించడం గమనార్హం. 2015లో ఈ టైటిల్ నెగ్గి, 2016లో రన్నరప్ గా నిలిచిన సెరెనా ఆ తర్వాత రెండుసార్లు పాల్గొని నాలుగో రౌండ్‌ను దాటలేదు. డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), యూఎస్ ఓపెన్ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్) ఈసారి ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరంగా ఉన్నారు. -
అంకితకు నిరాశ
పారిస్: గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మెయిన్ డ్రాలో ఆడాలనుకున్న భారత మహిళల నంబర్‌వన్ క్రీడాకారిణి అంకిత రైనా నిరీక్షణ మరింత కాలం కొనసాగనుంది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టోర్నీలో 27 ఏళ్ల అంకితకు మరోసారి నిరాశే ఎదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 176వ ర్యాంకర్ అంకిత 3–6, 2–6తో 22వ సీడ్ కురిమి నారా (జపాన్) చేతిలో వరుస సెట్లలో ఓటమి పాలైంది. గంటా 21 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. ‘మ్యాచ్‌లో మరీ చెత్తగా ఆడలేదు. నా ప్రత్యర్థి గొప్పగా ఆడి నా సర్వీస్ గేమ్‌ల్ని దక్కించుకుంది. అవి గెలిచుంటే ఫలితం మరోలా ఉండేది. అక్కడ గాలి కూడా ప్రభావం చూపింది’ అని మ్యాచ్ అనంతరం అంకిత వ్యాఖ్యానించింది. అంకిత ఓటమితో ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ కేటగిరీలో భారత ప్రాతినిధ్యం లేనట్లయింది. ఇప్పటికే పురుషుల సింగిల్స్ విభాగంలో సుమీత్ నాగల్, రామ్‌కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ క్వాలిఫయర్స్‌లోనే ఓటమి పాలయ్యారు. -
ప్రజ్నేశ్ శుభారంభం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ప్రజ్నేశ్ గుణేశ్వరన్ శుభారంభం చేయగా... భారత నంబర్‌వన్ సుమీత్ నాగల్, రామ్‌కుమార్ రామనాథన్ తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. 29వ సీడ్ ప్రజ్నేశ్ 6–3, 6–1తో సిమ్ ఇల్కెల్ (టర్కీ)పై గెలుపొందగా... 16వ సీడ్ సుమీత్ నాగల్ 6–7 (4/7), 5–7తో డస్టిన్ బ్రౌన్ (జర్మనీ) చేతిలో... రామ్‌కుమార్ 5–7, 2–6తో లమసినె (ఫ్రాన్స్) చేతిలో పరాజయం పాలయ్యారు. ఇల్కెల్తో 65 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రజ్నేశ్ రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ఐదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన ప్రజ్నేశ్ తన సర్వీస్‌ను ఒకసారి మాత్రమే కోల్పోయాడు. రెండో రౌండ్లో అలెగ్జాండర్ వుకిచ్ (ఆస్ట్రేలియా)తో ప్రజ్నేశ్ ఆడతాడు. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ విభాగంలో భారత నంబర్‌వన్ అంకితా రైనా బరిలో ఉంది. నేడు జరిగే తొలి రౌండ్లో ఆమె జొవానా జోవిచ్ (సెర్బియా)తో తలపడుతుంది. -
ఫ్రెంచ్ ఓపెన్‌కు ఒసాకా దూరం
పారిస్: గతవారమే యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను రెండోసారి నెగ్గిన జపాన్ యువతార, ప్రపంచ మూడో ర్యాంకర్ నయోమి ఒసాకా... ఈనెల 27 నుంచి మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. ఎడమ తొడ కండరాల గాయం కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఈసారి నేను ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడటంలేదు. తొడ కండరాల గాయం ఇంకా తగ్గలేదు. ఈ మెగా టోర్నీకి నిర్ణీత సమయంలోపు సిద్ధం కాలేను’ అని ఒసాకా ట్విట్టర్లో ప్రకటించింది. ఫలితంగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి దూరమైన రెండో స్టార్‌గా ఒసాకా నిలిచింది. కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ నుంచి మహిళల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ తప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఫ్రాన్స్‌లో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రెంచ్ ఓపెన్‌ను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను నిర్వాహకులు కుదించారు. గతంలో రోజుకు 11,500 మంది ప్రేక్షకులను అనుమతించాలని భావించినా నిర్వాహకులు ఇప్పుడు ఆ సంఖ్యను 5000 పరిమితం చేయనున్నారు. -
ఫ్రెంచ్ ఓపెన్‌లో ముర్రేకు వైల్డ్ కార్డు
పారిస్: ప్రపంచ మాజీ నంబర్‌వన్, బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రేకు ఈ నెల 27న మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడేందుకు నిర్వాహకులు వైల్డ్ కార్డు కేటాయించారు. నేరుగా మెయిన్ ‘డ్రా’లో ఆడేందుకు తగిన ర్యాంక్ లేకపోవడంతో ముర్రే గత ఘనతలను లెక్కలోనికి తీసుకొని (2016లో రన్నరప్) ఈ అవకాశం ఇచ్చారు. గాయాల కారణంగా కొంతకాలం ఆటకు దూరం కావడంతో ముర్రే ర్యాంక్ 129కి పడిపోయింది. యూఎస్ ఓపెన్‌లోనూ ముర్రే వైల్డ్ కార్డుతోనే ఆడాడు. -
ఫ్రెంచ్ ఓపెన్‌కూ యాష్లే బార్టీ దూరం
బ్రిస్బేన్: ఒకవైపు కరోనా వైరస్‌తో భయం... మరోవైపు సరైన సన్నాహాలు లేకపోవడంతో... తాను ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లోనూ ఆడటంలేదని మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ప్రకటించింది. డిఫెండింగ్ చాంపియన్ అయిన బార్టీ ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన టోర్నమెంట్. కాబట్టి ఇది నేను తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు’ అని 24 ఏళ్ల బార్టీ పేర్కొంది. ప్రేక్షకులు లేకుండానే యూఎస్ ఓపెన్ జరుగుతుండగా... ఫ్రెంచ్ ఓపెన్‌లో అభిమానులను అనుమతిస్తామని నిర్వాహకులు ప్రకటించిన కొద్ది గంటల్లోనే బార్టీ తన నిర్ణయాన్ని వెల్లడించింది. రోమ్‌లో 14 నుంచి జరిగే ఇటాలియన్ ఓపెన్‌లోనూ పాల్గొనబోవడం లేదని బార్టీ తెలిపింది. ‘ఈ ఏడాది అందరికీ సవాలుగా నిలిచింది. నేను టెన్నిస్‌లో వెనుకబడినప్పటికీ నా కుటుంబం, నా టీమ్ ఆరోగ్య భద్రతే నాకు ప్రధానం. వారిని ఇబ్బంది పెట్టలేను. నాకు మద్దతుగా నిలిచిన నా అభిమానులందరికీ ధన్యవాదాలు. త్వరలోనే మీ కోసం మళ్లీ టెన్నిస్ ఆడతా’ అని బార్టీ వివరించింది. ఆమె చివరిసారిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లో సోఫియా కెనిన్ చేతిలో ఓటమి పాలైంది. -
ఫ్రెంచ్ ఓపెన్‌కు ప్రేక్షకుల అనుమతి
పారిస్ : ఈ నెల 27 నుంచి అక్టోబర్ 11 వరకు జరిగే టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రేక్షకులను అనుమతించనున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు బెర్నార్డ్ సోమవారం స్పష్టం చేశారు. దాంతో కరోనా విరామం అనంతరం ప్రేక్షకులతో జరగనున్న తొలి మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్‌గా ఫ్రెంచ్ ఓపెన్ నిలవనుంది. తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం పారిస్ వంటి నగరాల్లో 5 వేల మందితో కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వడంతో ఇది సాధ్యమైంది. (తన కోపమే తన శత్రువు) ఫ్రెంచ్ ఓపెన్ పూర్తి సామర్థ్యంలో 50 నుంచి 60 శాతం వీక్షకులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అంటే ఇంచుమించుగా టోర్నీ జరుగుతున్న రోజుల్లో రోజుకు 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా టోర్నీకి వేదికయ్యే ప్రదేశాన్ని మూడు జోన్లుగా విభజించారు. మ్యాచ్‌ను చూడటానికి వచ్చిన ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కులను ధరించాలి. టోర్నీలో ఆడేందుకు వచ్చిన ప్లేయర్లకు 72 గంటల వ్యవధిలో రెండు సార్లు కరోనా పరీక్షలు చేస్తామని రెండు సార్లు నెగెటివ్ అని వస్తేనే వారిని టోర్నీలో ఆడేందుకు అనుమతిస్తామని టోర్నీ డైరెక్టర్ గయ్ ఫోర్జె తెలిపారు. (ఒలింపిక్స్ జరగడం ఖాయం: ఐఓసీ) -
యూఎస్ ఓపెన్ ఆడతా: బోపన్న
న్యూఢిల్లీ: ఐదు నెలల విరామం తర్వాత మళ్లీ కోర్టులో అడుగుపెట్టేందుకు భారత డబుల్స్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న సిద్ధమవుతున్నాడు. తన భాగస్వామి డెనిస్ షపోవలోవ్ (కెనడా)తో కలిసి యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ బరిలో దిగుతానని పేర్కొన్నాడు. ఈ మేరకు ప్రొఫెషనల్ సర్క్యూట్లో సత్తా చాటేందుకు తనను తాను సన్నద్ధం చేసుకుంటున్నానని బోపన్న చెప్పాడు. ‘డెనిస్ యూఎస్‌లోని ఐఎంజీ అకాడమీలోనే ఉన్నాడు. యూఎస్ ఓపెన్ కన్నా ముందు న్యూయార్క్‌లో సిన్సినాటి ఓపెన్ ఆడాలని మేం నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత రోమ్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీల్లోనూ పాల్గొంటాం’ అని ప్రపంచ 37వ ర్యాంకర్ బోపన్న పేర్కొన్నాడు. యూఎస్ వెళ్లేందుకు కోవిడ్–19 పరీక్ష కూడా చేయించుకోనున్నాడు. అనూహ్యంగా దొరికిన ఈ విరామ సమయంలో ఎన్నాళ్లుగానో నేర్చుకోవాలనుకున్న ‘అయ్యంగార్ యోగా’ను ప్రాక్టీస్ చేసినట్లు బోపన్న పేర్కొన్నాడు. దీనిద్వారా తన శరీరం దృఢంగా మారిందని, తన కాళ్లు బలంగా మారడం వల్ల ఆటాడే సమయంలో మోకాళ్లపై ఎక్కువగా భారం పడబోదని పేర్కొన్నాడు. బెంగళూరు స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులకు 24 నెలల పాటు స్కాలర్షిప్ అందించే ప్రక్రియ మొదలుపెట్టామని అతను వెల్లడించాడు. -
ఫ్రెంచ్ ఓపెన్ టికెట్ల డబ్బులు వాపస్
పారిస్: ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీని ప్రత్యక్షంగా తిలకించడం కోసం టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు టికెట్ వెల మొత్తాన్ని రిఫండ్ చేయనున్నట్లు ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య (ఎఫ్టీఎఫ్) గురువారం ప్రకటించింది. నిజానికి మే 24 నుంచి జూన్ 7 మరకు జరగాల్సిన ఈ టోర్నీని కరోనా మహమ్మారి వల్ల సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టికెట్లను కొన్న ప్రేక్షకులకు డబ్బును తిరిగి చెల్లించాలని నిర్వాహకులు నిర్ణయించారు. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 4 కు మారిన షెడ్యూల్ ప్రకారం చేపట్టే టికెట్ల విక్రయాన్ని ఈవెంట్‌కు ముందు వెల్లడిస్తామని ఎఫ్టీఎఫ్ వర్గాలు తెలిపాయి. వైరస్ విజృంభిస్తుండటంతో ఆల్ ఇంగ్లండ్ క్లబ్... వింబుల్డన్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. -
ఫ్రెంచ్ ఓపెన్‌కు ఫెడరర్ దూరం
బాసెల్ (స్విట్జర్లాండ్): కుడి మోకాలికి శస్త్ర చికిత్స జరగడంతో... స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ నాలుగు నెలలపాటు ఆటకు దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో 38 ఏళ్ల ఫెడరర్ వచ్చే నాలుగు నెలల్లో జరిగే దుబాయ్ ఓపెన్, ఇండియన్ వెల్స్ ఓపెన్, బొగోటా ఓపెన్, మయామి ఓపెన్ టోర్నీలతో సహా మే 24 నుంచి జూన్ 7 వరకు జరిగే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకిఅందుబాటులో ఉండటం లేదు. -
బార్టీ ఆట ముగిసింది
లండన్: ఎర్ర మట్టి కోర్టులపై చెలరేగి ఫ్రెంచ్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచిన యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) పచ్చిక కోర్టులపై మాత్రం తడబడింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ హోదాలో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బరిలోకి దిగిన యాష్లే బార్టీ ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. యాష్లే బార్టీతోపాటు మూడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), ఆరో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) కూడా ప్రిక్వార్టర్స్ దాటకుండానే ఇంటిముఖం పట్టారు. 15 ఏళ్ల అమెరికా రైజింగ్ స్టార్ కోరి గాఫ్ సంచలన ప్రదర్శనకు ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) అడ్డుకట్ట వేసింది. హలెప్తోపాటు ఎనిమిదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఏడుసార్లు చాంపియన్ సెరెనా విలియమ్స్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గతేడాది వింబుల్డన్‌లో మూడో రౌండ్లో ఓడిన బార్టీ ఈ ఏడాది ఒక అడుగు ముందుకేసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 23 ఏళ్ల బార్టీ 6–3, 2–6, 3–6తో అన్‌సీడెడ్ అలీసన్ రిస్కీ (అమెరికా) చేతిలో కంగుతింది. తొలి సెట్లో ప్రభావం చూపించిన ఈ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ తర్వాత రెండు సెట్లలోనూ నిరాశపరిచింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో హలెప్ 6–3, 6–3తో కోరి గాఫ్‌పై అలవోక విజయం సాధించింది. అమెరికా టెన్నిస్ దిగ్గజం, 11వ సీడ్ సెరెనా 6–2, 6–2తో వరుస సెట్లలో కార్లా స్వారెజ్ నవారో (స్పెయిన్)పై, స్వితోలినా 6–4, 6–2తో పెట్రా మార్టిక్ (క్రొయేషియా)పై గెలుపొందారు. మూడో సీడ్ ప్లిస్కోవా 6–4, 5–7, 11–13తో కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో... ఆరో సీడ్ క్విటోవా 6–4, 2–6, 4–6తో 19వ సీడ్ జొహనా కొంటా (బ్రిటన్) చేతిలో కంగుతింది. సీడెడ్ ఆటగాళ్ల జోరు... పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా)తోపాటు మాజీ చాంపియన్స్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జొకోవిచ్ 6–3, 6–2, 6–3తో ఉగో హంబర్ట్ (ఫ్రాన్స్)పై, మూడో సీడ్ నాదల్ 6–2, 6–2, 6–2తో జొవో సొసా (పోర్చుగల్)పై, రెండో సీడ్ ఫెడరర్ 6–1, 6–2, 6–2తో బెరెటిని (ఇటలీ)పై సునాయాస విజయం సాధించారు. ఇతర మ్యాచ్‌ల్లో 21వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 7–6 (11/9), 2–6, 6–3, 6–4తో ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్)పై, 23వ సీడ్ బాటిస్ట అగుట్ (స్పెయిన్) 6–3, 7–5, 6–2తో బెనొయిట్ పెయిర్ (ఫ్రాన్స్)పై నెగ్గారు. పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో దివిజ్ శరణ్ (భారత్)–మార్సెలో డెమోలైనర్ (బ్రెజిల్) జంట 5–7, 7–6 (8/6), 6–7 (3/7), 3–6తో టాప్ సీడ్ కుబోట్ (పోలాండ్)–మార్సెలో మెలో (బ్రెజిల్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన రాఫెల్ నాదల్
-
ఫెడరర్ ఔట్.. ఫైనల్‌కు నాదల్
పారిస్: ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ రోజు జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో నాదల్ 6-3,6-4, 6-2 తేడాతో స్విస్ దిగ్గజం ఫెడరర్‌పై గెలిచి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. తొలి సెట్‌ను అవలీలగా గెలుచుకున్న నాదల్.. రెండో సెట్లో కాస్త శ్రమించాడు. రెండో సెట్లో తొలుత ఫెడరర్ ఆధిక్యంలో నిలిచినప్పటికీ నాదల్ పోరాడి గెలిచాడు. ఇక మూడో సెట్ ఏకపక్షంగా సాగింది. నాదల్ దూకుడుకు ఫెడరర్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. వరుస పాయింట్లు సాధించిన నాదల్ ఆ సెట్‌ను కైవసం చేసుకోవడమే కాకుండా మ్యాచ్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఫెడరర్ మూడు ఏస్‌లు సంధించగా, నాదల్ కూడా మూడు ఏస్‌లకే పరిమితమయ్యాడు. ఇక డబుల్ ఫాల్ట్ విషయానికొస్తే తలో తప్పిదం చేశారు. ఇక నాదల్ ఆరు బ్రేక్ పాయింట్లను సాధించగా, ఫెడరర్ రెండు బ్రేక్ పాయింట్లను మాత్రమే సాధించాడు. ఓవరాల్‌గా నాదల్ 102 పాయింట్లను గెలవగా, ఫెడరర్ 79 పాయింట్లను గెలిచాడు. సర్వీస్ పాయింట్ల విషయంలో నాదల్ హవానే కొనసాగింది. 58 సర్వీస్ పాయింట్లను నాదల్ గెలవగా, 49 సర్వీస్ పాయింట్లకే ఫెడరర్ పరిమితయ్యాడు. -
జకోవిచ్ అలవోకగా..
పారిస్: ప్రపంచ నెం.1, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో అలవోకగా క్వార్టర్ఫైనల్స్కు దూసుకెళ్లాడు. సోమవారం పురుషుల సింగిల్స్‌లో జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో జకోవిచ్ 6–3, 6–2, 6–2తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్(జర్మనీ)ని చిత్తు చేశాడు. గంటా 36 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో జకోవిచ్ 6 ఏస్‌లు సంధించి, 3 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 31 విన్నర్లు కొట్టి, 12 అనవసర తప్పిదాలు చేశాడు. సుదీర్ఘంగా జరిగిన మరో మ్యాచ్‌లో నిషికొరి(జపాన్) 6–2, 6–7(8/10), 6–2, 6–7(8/10), 7–5తో బెనాయిట్ పైర్(ఫ్రాన్స్)పై చెమటోడ్చి నెగ్గాడు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ మారథాన్ పోరులో ఏడో సీడ్ నిషికోరికి 38వ ర్యాంకర్ అయిన ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తొలి, మూడవ సెట్లను నిషికోరి దక్కించుకోగా, టైబ్రేక్‌కు దారితీసిన రెండు, నాలుగు సెట్లు పైర్ వశమయ్యాయి. నిర్ణయాత్మక ఐదో సెట్లోనూ పోరు హోరాహోరీ సాగింది. పాయింట్ పాయింట్‌కూ ఇద్దరూ చెమటోడ్చారు. చివరి ఈ సెట్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకున్న నిషికోరి తదుపరి రౌండ్లో రెండో సీడ్ నాదల్‌తో తలపడతాడు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 14వ ర్యాంకర్ మాడిసన్ కీస్(అమెరికా) 6–2, 6–4తో సినియకోవా(చెక్‌రిపబ్లిక్)ను వరుస సెట్లలో చిత్తు చేసి క్వార్టర్ఫైనల్స్కు చేరుకుంది. మరో మ్యాచ్‌లో సోఫియా కెనిన్(అమెరికా)ను 3–6, 6–3, 0–6తో ఇంటిబాట పట్టించిన ఎనిమిదో సీడ్ ఆష్లే బార్టీ(ఆస్ట్రేలియా)తో తదుపరి రౌండ్లో మాడిసన్ కీస్‌తో తలపడనుంది. -
క్వార్టర్ ఫైనల్స్‌కు ఫెదరర్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో స్విస్ దిగ్గజం, మూడో సీడ్ రోజర్ ఫెదరర్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్‌లో ఆదివారం ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఫెదరర్ 6–2, 6–3, 6–3తో వరుస సెట్లలో లెనార్డో మేయర్(అర్జెంటీనా)ను చిత్తు చేశాడు. గంటా 45 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఫెడెక్స్ 4 ఏస్‌లు సంధించి 30 విన్నర్లు కొట్టాడు. మరోవైపు 4 డబుల్ఫాల్ట్స్తోపాటు 31 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. కాగా, మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నెం.12 సెవత్సోవా(లాత్వియా) అనూహ్య పరాజయం పాలైంది. ఆమె 2–6, 0–6తో ప్రపంచ 38వ ర్యాంకర్ వాండ్రొసోవా(చెక్ రిపబ్లిక్) చేతిలో కంగుతింది. ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో పెట్రా మాట్రిచ్(క్రొయేషియా) 5–7, 6–2, 6–4తో కనెపి(ఎస్తోనియా)పై చెమటోడ్చి నెగ్గగా, జొహన్నా కొంటా(బ్రిటన్) 6–2, 6–4తో వెకిచ్(క్రొయేషియా)ను చిత్తు చేసింది. బొపన్న జోడీ ఓటమి పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు రోహన్ బొపన్న జోడీ ఓటమిపాలైంది. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో బొపన్న(భారత్)–మారియస్ కొపిల్(రొమేనియా) ద్వయం 6–1, 5–7, 6–7(8/10)తో సెర్బియా జోడీ లజోవిచ్–తిపాసరవిచ్ చేతిలో ఓడింది. తొలి సెటన్ను సునాయాసంగా గెల్చుకున్న బొపన్న జోడీ రెండో సెట్‌ను కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో సెట్లో టైబ్రేక్‌లో చేతులెత్తేసి ఇంటిబాట పట్టింది. -
ఇంకా ఆడుతున్నాడు... గెలుస్తున్నాడు
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్. వయసులో ఫిఫ్టీకి చేరువవుతున్నా... వన్నె తగ్గని ఈ వెటరన్ స్టార్ టోక్యో ఒలింపిక్స్‌పై కూడా దృష్టి పెట్టాడు. 46 ఏళ్ల పేస్ ప్రస్తుతం ఫ్రెంచ్ ఓపెన్ ఆడుతున్నాడు. పురుషుల డబుల్స్‌లో స్థానిక భాగస్వామి బెనోయిట్ పెయిర్‌తో కలిసి శుభారంభం చేశాడు. టెన్నిస్‌లో ఓపెన్ శకం మొదలయ్యాక మ్యాచ్ గెలిచిన అతి పెద్ద వయస్కుడిగా పేస్ నిలిచాడు. తన కీర్తి కిరీటంలో చేరిన ఈ ఘనతపై అతను మాట్లాడుతూ ‘30 ఏళ్లుగా టెన్నిస్ ఆడుతున్నా. నా సుదీర్ఘ ప్రస్థానంలో 12 తరాల ఆటగాళ్లను చూశా. ఆల్‌టైమ్ గ్రేట్ పీట్ సంప్రాస్, ప్యాట్ రాఫ్టర్లు సింగిల్స్ ఆడితే... నేను డబుల్స్ ఆడాను. టెన్నిస్‌లో నాకంటూ గౌరవాన్ని సంపాదించుకున్నాను’ అని అన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ సందర్భంగా...రాఫెల్ నాదల్, అతని మాజీ కోచ్ టోనీ ఎదురుపడినపుడు ఆసక్తికర సంభాషణ జరిగిందన్నాడు. ‘నేను నా డబుల్స్ మ్యాచ్ ముగించుకొని వస్తుంటే వాళ్లిద్ద రూ ఎదురయ్యారు. నన్ను గుర్తించిన కోచ్ టోనీ... లియో (పేస్) నీకు 46 ఏళ్ల వయసు కదా! అంటే ఔనన్నా. రొలాండ్ గారోస్‌లో 1989 (జూనియర్స్), తర్వాత సీనియర్స్ ఆడావుగా అంటే ఔననే చెప్పా. ఇన్నేళ్లయినా మళ్లీ ఇక్కడ తొలి గేమ్ గెలిచావంటా... అంటే ఔననే తల ఊపాను. వెంటనే నాదల్‌తో చూశావా నాదల్... 46 వయసులో పేస్ ఆడటమే కాదు గెలవడం కూడా చేస్తున్నాడు’ అని చెప్పారు. ఓ మేటి కోచ్ మరో దిగ్గజ ఆటగాడు (నాదల్)తో తన గురించి చెబుతుంటే ఎంతో సంతోషం కలిగిందన్నాడు. టెన్నిస్‌లో అప్పటి దిగ్గజాల నుంచి ఇప్పటి గ్రేటెస్ట్ స్టార్ల వరకు అందరూ తనను గుర్తిస్తారని, గౌరవంతో చూస్తారని పేస్ చెప్పుకొచ్చాడు. నాదల్, రోజర్ ఫెడరర్లిద్దరూ తనకు టీనేజ్ వయసు నుంచే తెలుసని చెప్పాడు. ‘నా జీవితంలో టెన్నిస్‌తో నా ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. సుదీర్ఘ కెరీర్‌ను కొనసాగిస్తుండటం అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడైతే (ఫ్రెంచ్ ఓపెన్‌లో) నాలుగు సార్లు డబుల్స్ టైటిల్ సాధించాను. అలసట ఎరుగని నా పయనంలో ఆటను ఇప్పుడప్పుడే ఆపలేను. 2020 ఒలింపిక్స్ కూడా ఆడేస్తానేమో. ఇప్పటికే అత్యధిక ఒలింపిక్స్ (6) ఆడిన ఆటగాడిగా రికార్డులకెక్కాను. మరోటి ఆడితే ఆ రికార్డును మెరుగుపరుచుకుంటా’ అని పేస్ వివరించాడు. -
ఫ్రెంచ్ ఓపెన్: ప్లిస్కోవా ఇంటిబాట
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్లో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ కరోలినా ప్లిస్కోవా(చెక్‌రిపబ్లిక్) ఇంటిబాట పట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ప్లిస్కోవా 3–6, 3–6తో 31వ సీడ్ పెట్రా మాట్రిచ్(క్రొయేషియా) చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 23 విన్నర్లు కొట్టిన ప్లిస్కోవా 28 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మహిళల విభాగంలోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో సెవత్సోవా(లాత్వియా) 6–7 (3/7), 6–6, 11–9తో మెర్టెన్స్(బెల్జియం)పై, వాండ్రొసోవా(చెక్‌రిపబ్లిక్) 6–4, 6–4తో సూరజ్ నవారో(స్పెయిన్)పై, మాడిసన్ కీస్(అమెరికా) 7–5, 5–7, 6–3తో హాన్(ఆస్ట్రేలియా)పై, ముగురుజ(స్పెయిన్) 6–3, 6–3తో స్వితోలినా(ఉక్రెయిన్)పై నెగ్గి తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. ఫెదరర్ టైబ్రేక్‌లో... పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ రోజర్ ఫెదరర్(స్విట్జర్లాండ్) 6–3, 6–1, 6–2, 7–6(10/8)తో రూడ్(నార్వే)పై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరుకున్నాడు. తొలి రెండు సెట్లు అలవోకగా గెల్చుకున్న ఫెదరర్‌కు మూడో సెట్లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. హోరాహోరీగా సాగిన ఈ సెట్‌ను టైబ్రేక్‌లో ఫెడెక్స్ గెలుచుకున్నాడు. కాగా, పురుషుల డబుల్స్‌లో దివిజ్ శరణ్(భారత్)–డెమోలైనర్(బ్రెజిల్) జోడీ పోరాటం ముగిసింది. హెన్నీ కొంటినెన్(ఫిన్లాండ్)–జాన్ పీర్స్(ఆస్ట్రేలియా)తో జరిగిన మ్యాచ్‌లో 3–6, 4–6 దివిజ్ శరణ్ జోడీ పరాజయం పాలైంది. -
షేక్ హుమేరాకు నిరాశ
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో నేరుగా పాల్గొనేందుకు వచ్చిన అవకాశాన్ని హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ షేక్ హుమేరా సద్వినియోగం చేసుకోలేకపోయింది. పారిస్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ వైల్డ్ కార్డు టోర్నీలో హుమేరాకు నిరాశ ఎదురైంది. ముగ్గురు క్రీడాకారిణుల మధ్య జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచిన వారికి మెయిన్ ‘డ్రా’లో స్థానం లభిస్తుంది. అయితే హుమేరా ఒక మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌లో పరాజయం పాలవ్వడంతో మెయిన్ ‘డ్రా’లో చోటు సంపాదించలేకపోయింది. తొలి మ్యాచ్‌లో షేక్ హుమేరా 6–3, 7–5తో కామిల్లా బొస్సి (బ్రెజిల్)పై గెలిచింది. అయితే ఫంగ్రాన్ తియాన్ (చైనా)తో జరిగిన రెండో మ్యాచ్‌లో హుమేరా 1–6, 3–2తో ఓడిపోయింది. -
ఫ్రెంచ్ ఓపెన్‌కు షరపోవా దూరం
పారిస్: త్వరలో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్ టోర్నీ నుంచి మాజీ చాంపియన్, రష్యన్ స్టార్ క్రీడాకారిణి మరియా షరపోవా వైదొలిగారు. కొన్ని వారాల క్రితం భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షరపోవా ఇంకా పూర్తిగా కోలుకోపోవడంతో టోర్నీ నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు షరపోవా బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నేను ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నాను. కొన్ని సందర్భాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం అంత సులభతరం కాదు’ అని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇప్పటివరకూ ఓవరాల్‌గా ఐదు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన షరపోవా.. రెండు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. 2012,14 సంవత్పరాల్లో షరపోవా ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచారు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఏ టోర్నీలోనూ షరపోవా పాల్గొనలేదు. ఫిబ్రవరి నెలలో భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆమె తిరిగి కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్నారు షరపోవా. మే 26వ తేదీ నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. -
ఫ్రెంచ్ ఓపెన్ వైల్డ్ కార్డు టోర్నీకి హుమేరా అర్హత
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మెయిన్ ‘డ్రా’లో పాల్గొనే దిశగా తెలంగాణ అమ్మాయి షేక్ హుమేరా ముందంజ వేసింది. భారత్‌లో నిర్వహించిన వైల్డ్ కార్డు టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో హుమేరా 7–5, 6–3తో సారా దేవ్‌పై విజయం సాధించింది. ఎనిమిది మంది మధ్య నాకౌట్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో హుమేరా ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజేతగా నిలువడం విశేషం. పారిస్‌లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ వైల్డ్ కార్డు టోర్నీలో బ్రెజిల్, చైనా క్రీడాకారిణులతో హుమేరా తలపడుతుంది. ఆ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన వారికి ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. బాలుర సింగిల్స్ విభాగంలో మన్ మౌలిక్ షా ఈ అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్లో మన్ 7–6 (7/1), 6–2తో మధ్విన్ కామత్‌పై గెలిచాడు. విజేతలకు ఏడుసార్లు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జస్టిన్ హెనిన్ (బెల్జియం) బహుమతులు అందజేసింది. -
ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీకి హుమేరా, భక్తి, సంస్కృతి
న్యూఢిల్లీ: ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ వైల్డ్ కార్డు టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారుల జాబితాను అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) ప్రకటించింది. బాలికల సింగిల్స్ విభాగంలో ఎనిమిది మంది... బాలుర సింగిల్స్ విభాగంలో ఎనిమిది మందిని ‘ఐటా’ ఎంపిక చేసింది. ఏప్రిల్ 29 నుంచి మే 1 వరకు న్యూఢిల్లీలో ఈ టోర్నీ జరుగుతుంది. బాలికల విభాగంలో తెలంగాణకు చెందిన షేక్ హుమేరా, దామెర సంస్కృతి, భక్తి షాలకు అవకాశం లభించింది. ఈ టోర్నీ విజేతలు పారిస్‌లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ వైల్డ్ కార్డు టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఆ టోర్నీలో చైనా, బ్రెజిల్, జపాన్, కొరియా అమెరికాలకు చెందిన ఆటగాళ్లు కూడా పాల్గొంటారు. విజేతగా నిలిచిన వారికి ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ ప్రధాన టోర్నమెంట్లో నేరుగా ఆడే అవకాశం లభిస్తుంది. గత నాలుగేళ్లుగా భారత్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. బాలికల సింగిల్స్: షేక్ హుమేరా, భక్తి షా, దామెర సంస్కృతి, సాల్సా అహిర్, కావ్య సాహ్ని, సారా దేవ్, నికిత విశ్వాసె, గార్గి పవార్. బాలుర సింగిల్స్: మన్ మౌలిక్ షా, దేవ్ జావియా, కబీర్ హన్స్, మద్విన్ కామత్, సుశాంత్ దబస్, దివేశ్ గెహ్లట్, రిథమ్ మల్హోత్రా, డెనిమ్ యాదవ్. -
సెమీస్‌లో ఓడిన సాత్విక్–చిరాగ్ జంట
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత కథ ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 12–21, 24–26తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జోడీ కెవిన్ సుకముల్జో–మార్కస్ గిడియోన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయింది. శుక్రవారం ఆలస్యంగా ముగిసిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ 16–21, 19–21తో ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. మొమోటా చేతిలో శ్రీకాంత్‌కిది వరుసగా ఏడో ఓటమి కావడం గమనార్హం. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ పీవీ సింధు 13–21, 16–21తో ఏడో సీడ్ హి బింగ్జియావో (చైనా) చేతిలో పరాజయం పాలైంది. -
సైనా, శ్రీకాంత్ శుభారంభం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్స్ సైనా, శ్రీకాంత్, సాయిప్రణీత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో సైనా 21–11, 21–11తో సయేనా కవాకమి (జపాన్)పై, శ్రీకాంత్ 21–19, 21–13తో విన్సెంట్ (హాంకాంగ్)పై, సాయిప్రణీత్ 21–13, 21–17తో యోగర్ కొయిలో (బ్రెజిల్)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 21–16, 17–21, 15–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. -
టాప్ ర్యాంక్‌కు విజయం దూరంలో...
స్టుట్గార్ట్: ఈ సీజన్లో రెండోసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ సొంతం చేసుకునేందుకు స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మరో విజయం దూరంలో ఉన్నాడు. మెర్సిడెస్ ఓపెన్‌లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ 6–4, 6–4తో గిడో పెల్లా (అర్జెంటీనా)పై గెలిచి సెమీస్‌కు చేరాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)తో ఫెడరర్ ఆడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో కిరియోస్ 6–4, 3–6, 6–3తో లోపెజ్ (స్పెయిన్)పై గెలుపొందాడు. -
ఫెడరర్‌పై అసూయ లేదు
పారిస్: స్పెయిన్ సూపర్ స్టార్ రాఫెల్ నాదల్. క్లే కోర్టుపై మళ్లీ ఈ స్పెయిన్ బుల్ రంకెలేశాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో రికార్డుస్థాయిలో 11వసారి టైటిల్ గెలిచాడు. ఈ విజయంతో నాదల్ కెరీర్లో 17 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ చేరాయి. స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ రికార్డుకు కేవలం మూడే అడుగుల దూరంలో ఉన్న నాదల్ తనకు మాత్రం ‘ఇరవై’పై ప్రత్యేక ధ్యాసలేదన్నాడు. ఆటలో భాగంగా ఆ రికార్డును అధిగమిస్తే సంతోషమే కానీ మరొకరి పేరిట ‘ఆల్‌టైమ్’ రికార్డు ఉందన్న అసూయ తనకు ఎంతమాత్రం లేదని స్పష్టం చేశాడు. ఆదివారం ఆస్ట్రియా ప్రత్యర్థి డొమినిక్ థీమ్‌పై వరుస సెట్లలో టైటిల్ గెలిచిన నాదల్ సోమవారం పారిస్ మేయర్ యాని హిడాల్గోతో కలిసి మీడియాతో ముచ్చటించాడు. ‘నాకు 20వ ‘గ్రాండ్’ టైటిల్ ఇష్టమే. ఫెడరర్లా భవిష్యత్తులో నేనూ సాధిస్తే మంచిదే. అంతకు మించినా సంతోషమే! కానీ... నిజాయతీగా చెబుతున్నా. అదే పనిగా గెలవాలనే కసి లేదు. ఇప్పుడైతే తాజా టైటిల్‌ను ఆస్వాదిస్తున్నా. నేనేప్పుడూ నేనే అందరికంటే మిన్నగా ఉండాలనుకోను. అలా ఆలోచించను కూడా. గెలవాలనే లక్ష్యం ఉన్నప్పటికీ... కష్టపడతానే గానీ, నాకంటే ఎక్కువగా మరొకరివద్ద టైటిల్స్ ఉన్నాయనో, ఎక్కువ డబ్బులు ఉన్నాయనో, పెద్ద భవంతి ఉందనో అసూయతో కుమిలిపోను. అలాంటి ఊహల్లో బతకను’ అని నాదల్ చెప్పాడు. వచ్చే నెలలో జరిగే వింబుల్డన్ టైటిల్‌పై కన్నేసిన ఫెడరర్ తనకు క్లిష్టమైన ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్నాడు. గతేడాది కూడా ఇలాంటి వ్యూహరచనే చేసిన ఫెడెక్స్ వింబుల్డన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. మొత్తానికి వెటరన్ స్టార్లు ఫెడరర్, నాదల్ ఇద్దరు గత ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను చేజిక్కించుకోవడంతో యువ ఆటగాళ్లు విలవిల్లాడుతున్నారు. -
నాదల్ పెద్ద తప్పే చేశాడా?
పారిస్/రొనాల్డ్ గారోస్: టెన్నిస్ రారాజు రఫెల్ నాదల్ 11వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ఏడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను 6-4, 6-3, 6-2 సెట్ల తేడాతో చిత్తుగా ఓడించాడు. అయితే ఫైనల్ సమరంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడనే విమర్శలు నాదల్‌పై ఇప్పుడు మొదలయ్యాయి. అసలేం చేశాడు... ఫిలిప్పె ఛాట్రైర్ కోర్టులో జరిగిన ఫైనల్ పోరు సందర్భంగా మూడో సెట్ సమయంలో నాదల్ తన ఫిజిషియన్‌ను కోర్టులోకి రప్పించి మణికట్టుకు చికిత్స చేయించుకున్నాడు. అయితే అలా చికిత్స చేయించుకోవటం టోర్నీ రూల్స్ ప్రకారం విరుద్ధం. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. (కల నెరవేర్చాడు..! ఆసక్తికర కథనం) దిగ్గజాల మండిపాటు... నాదల్ చేసింది ఘోర తప్పిదమని టెన్నిస్ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. ‘అలాంటప్పుడు మెడికల్ టైమ్ అవుట్లో తాత్కాలిక ఉపశమనం కోసం ప్రయత్నించొచ్చు. కానీ, ఇలా సెట్ మధ్యలో ఉండగా ఫిజిషియన్‌ను రప్పించుకుని చికిత్స చేయించుకోవటం మాత్రం ముమ్మాటికీ నేరమే’ అని మాజీ ఆటగాడు గ్రెగ్ రుసెదిస్కి చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారంలో నాదల్‌పై చర్యలు తీసుకోవాల్సిందేనని మరో దిగ్గజం అన్నాబెల్ క్రోఫ్ట్ ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ నిర్వాహకులను డిమాండ్ చేస్తున్నారు. రూల్స్ నాదల్కు వర్తించవా?.. ఈ టోర్నీలో రాబిన్ హాసే(నెదర్లాండ్స్), డెవిడ్ గొఫ్ఫిన్ (బెల్జియం) మ్యాచ్ సందర్భంగా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే చైర్ అంఫైర్లు మాత్రం చికిత్సకు నిరాకరించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రుసెదిస్కి టోర్నీ నిర్వాహకులపై మండిపడ్డాడు. ‘నాదల్స్కు రూల్స్ వర్తించవా? అతనికి మినహాయింపు ఎందుకిచ్చారు? అతనికి శిక్ష పడాల్సిందే... అంటూ రుసెదిస్కి కోరుతున్నారు. నాదల్ రియాక్షన్... వివాదంపై నాదల్ స్పందించాడు. చేతి కండరాలు పట్టేయటంతోనే ఫిజీషియన్‌ను పిలిపించుకున్నట్లు తెలిపాడు. సెమీస్ నుంచే తనకు నొప్పి వేధించిందని, ఈ వివాదాన్ని అనవసరంగా పెద్దది చేయొకండంటూ ఆయన మాజీలకు విజ్ఞప్తి చేస్తున్నాడు. -
నాదల్‌కే మళ్లీ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్
-
నాదల్‌కే 'ఫ్రెంచ్' కిరీటం...
ఎలాంటి అద్భుతం జరగలేదు. సంచలనం చోటు చేసుకుంటుందని ఏ క్షణానా అనిపించలేదు. క్లే కోర్టులపై మకుటం లేని మహారాజుగా తన పేరును చిరస్మరణీయం చేసుకుంటూ... స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ 11వసారి ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడాడు. ఇతర క్లే కోర్టు టోర్నీలలో తనపై విజయాలు సాధించినా... ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌లో అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయడం ఇప్పట్లో అసాధ్యమేనని నిరూపించాడు. గత 13 ఏళ్లలో ఈ ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన 11 సార్లూ అజేయంగా నిలిచి క్లే కోర్టులపై తాను ఎదురులేని మొనగాడినని చాటుకున్నాడు. గత రెండేళ్లలో క్లే కోర్టులపై నాదల్‌ను ఓడించిన ఏకైక ప్లేయర్ డొమినిక్ థీమ్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకొచ్చేసరికి వరుస సెట్లలో చేతులెత్తేశాడు. ఫ్రెంచ్ ఓపెన్ అంతిమ సమరంలో నాదల్ చేతిలో ఎదురైన పరాజితుల జాబితాలో ఏడో క్రీడాకారిడిగా చేరిపోయాడు. పారిస్: గతంలో ఎవరివల్లా కానిది డొమినిక్ థీమ్ వల్ల కూడా కాలేదు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో 11వసారీ రాఫెల్ నాదలే రాజ్యమేలాడు. రికార్డుస్థాయిలో 11వసారి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం 2 గంటల 42 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నాదల్ 6–4, 6–3, 6–2తో ఏడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను ఓడించాడు. విజేతగా నిలిచిన 32 ఏళ్ల నాదల్కు 22 లక్షల యూరోలు (రూ. 17 కోట్ల 48 లక్షలు), రన్నరప్ డొమినిక్ థీమ్‌కు 11 లక్షల 20 వేల యూరోలు (రూ. 8 కోట్ల 90 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. గత రెండేళ్లలో క్లే కోర్టులపై నాదల్‌ను ఓడించిన ఏకైక ప్లేయర్ థీమ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం స్పెయిన్ స్టార్ ముందు ఎదురు నిలువలేకపోయాడు. మ్యాచ్ మొత్తంలో కేవలం మూడుసార్లు మాత్రమే నాదల్ సర్వీస్‌లో బ్రేక్ పాయింట్ అవకాశాలను రాబట్టుకున్న అతను తొలి సెట్లో ఒక్కసారి మాత్రమే దానిని సద్వినియోగం చేసుకున్నాడు. మరోవైపు థీమ్ సర్వీస్‌లలో 17సార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలను సంపాదించిన నాదల్ ఐదుసార్లు వాటిని అనుకూలంగా మల్చుకున్నాడు. నెట్ వద్దకు నాదల్ 18 సార్లు దూసుకొచ్చి 16 సార్లు పాయింట్లు పొందగా... థీమ్ 15 సార్లు అలా చేసి ఎనిమిదిసార్లు మాత్రమే సఫలమయ్యాడు. అనవసర తప్పిదాల విషయానికొస్తే నాదల్ 24 చేయగా... థీమ్ రాకెట్ నుంచి 42 రావడం గమనార్హం. మేఘావృత వాతావరణంలో మొదలైన ఫైనల్లో తొలి సెట్ రెండో గేమ్‌లోనే థీమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే మూడో గేమ్‌లో తన సర్వీస్ కాపాడుకొని, నాలుగో గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన థీమ్ స్కోరును 2–2తో సమం చేశాడు. ఆ తర్వాత తొమ్మిదో గేమ్‌లో నాదల్ సర్వీస్ కాపాడుకొని 5–4తో ముందంజ వేశాడు. పదో గేమ్‌లో థీమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 61 నిమిషాల్లో నాదల్ తొలి సెట్‌ను 6–4తో దక్కించుకున్నాడు. రెండో సెట్లోనూ పరిస్థితిలో మార్పు కనిపించలేదు. అడపాదడపా థీమ్ మెరుపులు కనిపించినా కీలకదశలో నాదల్‌దే పైచేయిగా నిలిచింది. రెండో గేమ్‌లోనే థీమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ ఆ తర్వాత సర్వీస్‌లను కాపాడుకొని రెండో సెట్‌నూ ఖాతాలో వేసుకున్నాడు. మూడో సెట్లో నాదల్ మరింత జోరు పెంచగా థీమ్ డీలా పడిపోయాడు. ఎనిమిదో గేమ్‌లో థీమ్ కొట్టిన రిటర్న్ షాట్ బయటకు వెళ్లడంతో నాదల్ విజయం ఖాయమైంది. ►17 నాదల్ గెలిచిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్. ఇందులో 11 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ కాగా... మూడు యూఎస్ ఓపెన్ (2010, 2013, 2017), రెండు వింబుల్డన్ (2008, 2010), ఒక ఆస్ట్రేలియన్ ఓపెన్ (2009) టైటిల్స్ ఉన్నాయి. ఫెడరర్ అత్యధికంగా 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించాడు. ►1 టెన్నిస్ చరిత్రలో మూడు వేర్వేరు టోర్నీలను 11 సార్లు గెలిచిన ఏకైక ప్లేయర్ నాదల్. బార్సిలోనా ఓపెన్, మోంటెకార్లో టోర్నీ టైటిల్స్‌ను కూడా నాదల్ 11 సార్ల చొప్పున నెగ్గాడు. ►2 ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ ఓడిన మ్యాచ్‌లు. 2005 నుంచి ఈ టోర్నీ లో ఆడుతున్న నాదల్ ఇప్పటివరకు 87 మ్యాచ్‌ల్లో గెలిచాడు. 2009 ప్రిక్వార్టర్ ఫైనల్లో సోడెర్లింగ్ (స్వీడన్) చేతిలో... 2015లో క్వార్టర్స్‌లో జొకోవిచ్ (సెర్బియా) చేతిలో మాత్రమే నాదల్ ఓడిపోయాడు. 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018లలో నాదల్ విజేతగా నిలిచాడు. ►6 తాను ఆడిన 11 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌లో నాదల్ తన ప్రత్యర్థులకు కోల్పోయిన సెట్ల సంఖ్య. పుయెర్టా (అర్జెంటీనా–2005లో), ఫెడరర్ (స్విట్జర్లాండ్–2006, 2007, 2011లో), జొకోవిచ్ (సెర్బియా–2012, 2014లో) మాత్రమే నాదల్‌పై ఒక్కో సెట్ గెలవగలిగారు. సోడెర్లింగ్, ఫెరర్, వావ్రింకా, థీమ్ మాత్రం వరుస సెట్లలో ఓడిపోయారు. ►2 టెన్నిస్ చరిత్రలో ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌ను 11 సార్లు గెలిచిన రెండో ప్లేయర్ నాదల్. గతంలో ఆస్ట్రేలియా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ 1960 నుంచి 1973 మధ్య కాలంలో 11 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సాధించింది. -
‘ఫ్రెంచ్’ కోటలో కొత్త రాణి
పోయినచోటే వెతుక్కోవాలి. రొమేనియా టెన్నిస్ స్టార్ సిమోనా హలెప్ విషయంలో ఇది నిజమైంది. గత ఏడాది అన్‌సీడెడ్ క్రీడాకారిణి జెలెనా ఒస్టాపెంకోతో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఒక దశలో విజయానికి చేరువై... ఆ తర్వాత తడబడి ఓటమిని మూటగట్టుకున్న ఆమె సంవత్సరం తిరిగేలోపు అదే వేదికపై విజయ గర్జన చేసింది. ఈసారి కూడా ఫైనల్లో హలెప్‌కు ఓటమి తప్పదా అనే పరిస్థితి నుంచి కోలుకొని అద్వితీయ పోరాటంతో విజయం వైపు అడుగు వేయడం విశేషం. పారిస్: ఎర్రమట్టి కోటలో కొత్త రాణి కొలువైంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుసగా మూడో ఏడాది మహిళల సింగిల్స్ విభాగంలో నయా చాంపియన్ అవతరించింది. 2014, 2017లో ఫైనల్‌కు చేరి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న రొమేనియా స్టార్ సిమోనా హలెప్ ముచ్చటగా మూడో ప్రయత్నంలో విజేతగా నిలిచింది. తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ హలెప్ 3–6, 6–4, 6–1తో పదో సీడ్, 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచింది. విజేతగా నిలిచిన హలెప్‌కు 22 లక్షల యూరోలు (రూ. 17 కోట్ల 48 లక్షలు), రన్నరప్ స్లోన్ స్టీఫెన్స్కు 11 లక్షల 20 వేల యూరోలు (రూ. 8 కోట్ల 90 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. గత ఏడాది అన్‌సీడెడ్ క్రీడాకారిణి జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా)తో జరిగిన ఫైనల్లో హలెప్ తొలి సెట్‌ను గెలిచి, రెండో సెట్లో 3–0తో ఆధిక్యంలో నిలిచి విజయానికి చేరువైంది. కానీ ఒస్టాపెంకో ధాటికి తడబడి చివరకు ఓటమిపాలైంది. ఈసారి స్లోన్తో జరిగిన తుది పోరులో హలెప్ తొలి సెట్‌ను చేజార్చుకుంది. రెండో సెట్లో 0–2తో వెనుకబడింది. మళ్లీ గత ఏడాది దృశ్యమే పునరావృతమవుతుందా అని సందేహిస్తున్న తరుణంలో హలెప్ నేలకు కొట్టిన రబ్బరు బంతిలా ఎగిసింది. తన అనుభవాన్నంతా రంగరించి పోరాడింది. మూడో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని, నాలుగో గేమ్‌లో స్లోన్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 2–2తో సమం చేసింది. ఆ తర్వాత ఐదో గేమ్‌లో సర్వీస్ కాపాడుకొని, ఆరో గేమ్‌లో స్లోన్ సర్వీస్‌ను మరోసారి బ్రేక్ చేసిన హలెప్ 4–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ ఏడో గేమ్‌లో హలెప్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన స్లోన్, ఎనిమిదో గేమ్‌లో సర్వీస్ కాపాడుకొని స్కోరును 4–4తో సమం చేసింది. కీలకమైన తొమ్మిదో గేమ్‌లో హలెప్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని, పదో గేమ్‌లో స్లోన్ సర్వీస్‌ను బ్రేక్ చేసి రెండో సెట్‌ను 6–4తో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో హలెప్ తన విశ్వరూపం ప్రదర్శించింది. రెండుసార్లు స్లోన్ సర్వీస్‌లను బ్రేక్ చేసి, తన సర్వీస్‌లను నిలబెట్టుకొని 6–1తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొంది. విశేషాలు వర్జినియా రుజుసి (1978లో) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన రెండో రొమేనియా క్రీడాకారిణి హలెప్. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల,జూనియర్ బాలికల సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఎనిమిదో క్రీడాకారిణి హలెప్. 2008 లో హలెప్ జూనియర్ సింగిల్స్ టైటిల్ నెగ్గింది. గత ఏడాది చేసిన పొరపాట్లు ఈసారి పునరావృతం చేయకూడదని అనుకున్నాను. ఈ విజయంతో నా కల నిజమైంది. రెండో సెట్లో 0–2తో వెనుకబడిన దశలో ఒత్తిడికి లోనుకావొద్దని, ఆటను ఆస్వాదించాలని భావించాను. అదే చేసి కోలుకున్నాను. మ్యాచ్ చివరి గేమ్‌లోనైతే నాకు ఊపిరి ఆడనంత పనైంది. – సిమోనా హలెప్ -
నాదల్... 11వ సారి ఫైనల్‌కు
పారిస్: మట్టి కోర్టులపై మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ 11వసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 10 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ నాదల్ 6–4, 6–1, 6–2తో ఐదో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా)పై అలవోకగా గెలిచాడు. ఈ క్రమంలో రోజర్ ఫెడరర్ (11–వింబుల్డన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రికార్డుస్థాయిలో 11వసారి ఫైనల్ చేరిన రెండో ప్లేయర్‌గా నాదల్ గుర్తింపు పొందాడు. ఓవరాల్‌గా నాదల్ కెరీర్లో ఇది 24వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్. డెల్‌పొట్రోతో 2 గంటల 14 నిమిషాలపాటు జరిగిన సెమీస్‌లో నాదల్కు తొలి సెట్లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. అయితే అందివచ్చిన అవకాశాలను డెల్‌పొట్రో సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నాదల్ సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా డెల్‌పొట్రో వినియోగించుకోలేదు. ఆదివారం జరిగే ఫైనల్లో ఏడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)తో నాదల్ అమీతుమీ తేల్చుకుంటాడు. మరో సెమీఫైనల్లో థీమ్ 7–5, 7–6 (12/10), 6–1తో సెచి నాటో (ఇటలీ)పై గెలిచాడు. క్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించిన సెచినాటో అదే జోరును కనబర్చలేకపోయాడు. 1995లో థామస్ ముస్టర్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించాక మరో ఆస్ట్రియా ఆటగాడు ఈ టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే ప్రథమం. థీమ్‌తో ముఖాముఖి రికార్డులో నాదల్ 6–3తో ఆధిక్యం లో ఉన్నాడు. అయితే థీమ్ చేతిలో నాదల్ ఓడిపోయిన మూడు మ్యాచ్‌లూ క్లే కోర్టులపైనే కావడం గమనార్హం. -
నాదల్ నిలిచాడు
ఎర్రమట్టిపై ఎదురు లేని రారాజు రాఫెల్ నాదల్ 2015 క్వార్టర్ ఫైనల్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒక్క సెట్ కూడా ఓడిపోలేదు. వరుసగా 37 సెట్ల పాటు ప్రత్యర్థికి తలవంచకుండా వరుస విజయాలు సాధించాడు. అలాంటిది అర్జెంటీనా కుర్రాడు డీగో ష్వార్ట్‌జ్‌మన్ క్వార్టర్ ఫైనల్లో నాదల్‌పై తొలి సెట్ గెలిచి షాక్‌కు గురి చేశాడు. రెండో సెట్లో కూడా ఒక దశలో 3–2తో ముందంజ వేసి సంచలనం సృష్టిస్తాడా అనిపించాడు. కానీ స్పెయిన్ బుల్ తన అసలు సత్తాను ప్రదర్శించి ఆ తర్వాత చెలరేగిపోయాడు. 11వ టైటిల్ వేటలో సెమీస్‌లోకి అడుగు పెట్టాడు. పారిస్: వర్షం కారణంగా ఆగిపోయి గురువారం కొనసాగిన క్వార్టర్ ఫైనల్లో నాదల్ విజయం సాధించి ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 3 గంటల 42 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో నాదల్ 4–6, 6–3, 6–2, 6–2తో ష్వార్ట్‌జ్‌మన్‌ను చిత్తు చేశాడు. బుధవారం రెండో సెట్లో 5–3తో ఆధిక్యంలో ఉన్న నాదల్ చకచకా రెండు గేమ్‌లు గెలుచుకొని సెట్ సాధించాడు. ఆ తర్వాత మూడో సెట్నుంచి అతనికి తిరుగు లేకుండా పోయింది. చక్కటి డ్రాప్ షాట్లతో రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ 4–1తో దూసుకుపోయాడు. ఆ తర్వాత ష్వార్ట్‌జ్‌మన్ తన సర్వీస్ నిలబెట్టుకున్నా... మరుసటి గేమ్ నాదల్ ఖాతాలో చేరింది. రెండో సెట్లో నాలుగు సార్లు బ్రేక్ పాయింట్ కాపాడుకున్న వరల్డ్ నంబర్‌వన్‌ను సుదీర్ఘంగా సాగిన ఎనిమిదో గేమ్‌లో అర్జెంటీనా కుర్రాడు నిలువరించలేకపోయాడు. చివరి సెట్లో కూడా ఒక దశలో ష్వార్ట్‌జ్‌మన్ తీవ్రంగా పోరాడినా నాదల్ దూకుడు ముందు అది సరిపోలేదు. పురుషుల విభాగంలో ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో కనీసం 11 సార్లు సెమీస్ చేరిన మూడో ఆటగాడు నాదల్. గతంలో ఫెడరర్, కానర్స్ ఈ ఘనత సాధించారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఐదో సీడ్ జువాన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 7–6, 5–7, 6–3, 7–5తో మూడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)ను ఓడించాడు. 2009 తర్వాత డెల్‌పొట్రో ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ చేరడం ఇదే మొదటిసారి. ‘వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోవడం నాకు కొంత వరకు కలిసొచ్చింది. నేను నా వ్యూహాలు మార్చుకునేందుకు అవకాశం కలిగింది. అయితే వర్షమో, సూర్యుడు రావడమో నా విజయానికి కారణం కాదు. నా ఆటను మార్చుకోవడం వల్లే ఈ మ్యాచ్ గెలవగలిగాననేది వాస్తవం. మీరు ఒత్తిడిని జయించలేకపోయారంటే ఆటను ఇష్టపడట్లేదనే అర్థం’ – నాదల్ నంబర్‌వన్ నిలబెట్టుకున్న హలెప్... మహిళల సింగిల్స్‌లో సిమోనా హలెప్ (రుమేనియా), స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) తుది పోరుకు సిద్ధమయ్యారు. వీరిద్దరు తమ సెమీ ఫైనల్ మ్యాచ్‌లలో సునాయాస విజయాలు సాధించి ఫైనల్లోకి అడుగు పెట్టారు. హలెప్ 6–1, 6–4 స్కోరుతో 2016 చాంపియన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)ను చిత్తు చేసింది. ఫలితంగా తన నంబర్‌వన్ ర్యాంక్‌ను కూడా నిలబెట్టుకుంది. హలెప్ జోరు ముందు ఏమాత్రం నిలవలేకపోయిన ముగురుజా, ఈ పరాజయంతో వరల్డ్ నంబర్‌వన్ అయ్యే అవకాశం కూడా చేజార్చుకుంది. హలెప్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరడం ఇది మూడోసారి. గత ఏడాది కూడా ఆమె ఫైనల్లో ఓడింది. మరో సెమీస్‌లో స్టోన్ స్టీఫెన్స్ (అమెరికా) 6–4, 6–4తో సహచర అమెరికా క్రీడాకారిణి మాడిసన్ కీస్పై గెలుపొందింది. 77 నిమిషాల్లో సాగిన ఈ పోరులో స్టీఫెన్స్ చక్కటి షాట్లతో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. -
హై హై హలెప్
పారిస్: గతంలో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న రొమేనియా స్టార్ సిమోనా హలెప్ ఈసారి మాత్రం టైటిల్ సాధించే దిశగా మరో అడుగు వేసింది. మాజీ నంబర్‌వన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)తో బుధవారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ హలెప్ 6–7 (2/7), 6–3, 6–2తో విజయం సాధించింది. 2 గంటల 14 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో హలెప్ తొలి సెట్లో 0–4తో వెనుకబడింది. ఆ తర్వాత మూడుసార్లు కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి పుంజుకుంది. అయితే టైబ్రేక్‌లో 12వ సీడ్ కెర్బర్ పైచేయి సాధించింది. తొలి సెట్ కోల్పోయినా హలెప్ విజయంపై ఆశలు వదులుకోలేదు. లోపాలను సరిదిద్దుకొని రెండుసార్లు కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌లను కాపాడుకొని రెండో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లోనూ హలెప్ ఏకాగ్రత కోల్పోకుండా ఆడి మూడుసార్లు కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి అదే ఊపులో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ‘తొలి సెట్ చేజార్చుకున్నా పట్టువదలకుండా పోరాడాలని నిశ్చయించుకున్నాను. తొలి సెట్ ఆరంభంలో ఎక్కువ ప్రయోగాలు చేసి మూల్యం చెల్లించుకున్నాను. ఆ తర్వాత నా వ్యూహాల్లో మార్పు చేసి ఫలితాన్ని సాధించాను’ అని హలెప్ వ్యాఖ్యానించింది. షరపోవా చిత్తు... మరో క్వార్టర్ ఫైనల్లో 2016 చాంపియన్, మూడో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) ధాటికి మాజీ విజేత, రష్యా స్టార్ షరపోవా హడలిపోయింది. ఆరేళ్ల కాలంలో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ముగురుజా 6–2, 6–1తో 28వ సీడ్ షరపోవాను చిత్తుగా ఓడించి హలెప్‌తో సెమీస్ పోరుకు సిద్ధమైంది. 2012 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో 3–6, 0–6తో అజరెంకా (బెలారస్) చేతిలో ఓటమి తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలో షరపోవా ఏకపక్ష ఓటమిని చవిచూడటం ఇదే తొలిసారి. సెమీస్‌లో ముగురుజాపై గెలిస్తే హలెప్ తన నంబర్‌వన్ ర్యాంక్‌ను పదిలం చేసుకుంటుంది. ఒకవేళ హలెప్ ఓడిపోతే ముగురుజాకు నంబర్‌వన్ ర్యాంక్ ఖాయమవుతుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ముగురుజా ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. మరోవైపు హలెప్ రెండు సెట్లను చేజార్చుకుంది. నాదల్ మ్యాచ్ నేటికి వాయిదా... పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లకు వర్షం అడ్డంకిగా నిలవడంతో గురువారానికి వాయిదా వేశారు. డీగో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)తో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) తొలి సెట్‌ను 4–6తో కోల్పోయి... రెండో సెట్లో 5–3తో ఆధిక్యంలో ఉన్నాడు. మారిన్ సిలిచ్ (క్రొయేషియా), డెల్ పొట్రో (అర్జెంటీనా) మధ్య మ్యాచ్‌లో ఇద్దరూ తొలి సెట్లో 6–6 పాయింట్ల వద్ద... టైబ్రేక్‌లో 5–5తో సమంగా ఉన్నారు. ఈ దశలో వర్షం రావడంతో ఆటను నిలిపివేశారు. -
ఫ్రెంచ్ ఓపెన్: షరపోవా ‘ఖేల్’ ఖతం
పారిస్ : ఎన్నో ఆశలతో ఫ్రెంచ్ ఓపెన్‌లో అడుగుపెట్టిన రష్యా టెన్నిస్ స్టార్, మాజీ చాంపియన్ మారియా షరపోవాకు నిరాశే ఎదురైంది. మూడో సీడ్, స్పెయిన్ స్టార్ గార్బిన్ ముగురుజాతో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో షరపోవా 6-2,6-1 తేడాతో పరాజయం పాలైంది. వరుస సెట్లలో షరపోవాపై ముగురుజా సునాయస విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ భుజం కండరాలు పట్టేయడంతో షరపోవాకు వాకోవర్ ఇచ్చింది. దీంతో ఈ మ్యాచ్ ఆడకుండానే షరపోవా క్వార్టర్‌ఫైనల్‌కు చేరిన విషయం తెలిసింది. హలెప్ హవా.. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్నా... ఎంతోకాలంగా ఊరిస్తోన్న గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఈసారైనా నెగ్గాలనే పట్టుదలతో ఉన్న సిమోనా హలెప్ తన హవా కొనసాగిస్తోంది. జర్మనీ క్రీడాకారిణి ఎంజెలిక్ కెర్బర్తో జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో హలెప్ 6-2(2/7), 6-3, 6-2 తేడాతో విజయం సాధించింది. ఇక హలెప్ సెమీ ఫైనల్లో స్పెయిన్ స్టార్ గార్బిన్ ముగురుజాతో తలపడనుంది. -
ఫ్రెంచ్ ఓపెన్‌లో జొకోవిచ్‌కు చుక్కెదురు
-
జొకోవిచ్‌కు చుక్కెదురు
ఒకవైపు 12 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్. మరోవైపు కెరీర్లో ఓ గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారి క్వార్టర్ ఫైనల్ ఆడుతున్న ఆటగాడు. ఈ ఇద్దరి మధ్య పోటీ జరుగుతుంటే 12 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన అతనే మ్యాచ్ గెలుస్తాడని ఎవరైనా అంచనా వేయొచ్చు. కానీ మంగళవారం ఫ్రెంచ్ ఓపెన్‌లో అలా జరగలేదు. డజను గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన యోధుడిపై అనామకుడిగా బరిలోకి దిగిన మరో ప్లేయర్ అద్వితీయ విజయం సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ అసాధారణ విజయం నమోదు చేసిన ప్లేయర్ ఇటలీకి చెందిన మార్కో సెచినాటో. ఫ్రెంచ్ ఓపెన్‌లో అడుగు పెట్టకముందు కెరీర్లో ఒక్క గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ కూడా నెగ్గని సెచినాటో ఈసారి ఏకంగా సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకొని ఔరా అనిపించాడు. పారిస్: కొన్నాళ్ల క్రితం వరుస విజయాలతో అదరగొట్టిన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో ఈ మాజీ నంబర్‌వన్ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ 72వ ర్యాంకర్ మార్కో సెచినాటో (ఇటలీ) అసాధారణ ప్రదర్శన కనబరిచి 3 గంటల 26 నిమిషాల్లో 6–3, 7–6 (7/4), 1–6, 7–6 (13/11)తో 20వ సీడ్ జొకోవిచ్‌ను బోల్తా కొట్టించి తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. ఈ గెలుపుతో 25 ఏళ్ల సెచినాటో తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరాడు. ఈ టోర్నీకి ముందు సెచినాటో తన కెరీర్లో ఏనాడూ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో కనీసం ఒక్క విజయం కూడా సాధించకపోవడం గమనార్హం. 2015 యూఎస్ ఓపెన్, 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, 2017 వింబుల్డన్ టోర్నీల్లో అతను తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. 1999లో ఆండ్రీ మెద్వదేవ్ (100వ ర్యాంక్) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరిన తక్కువ ర్యాంక్ ప్లేయర్‌గా సెచినాటో గుర్తింపు పొందాడు. అంతేకాకుండా 1978లో కొరాడో బారాజుటి తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన తొలి ఇటలీ క్రీడాకారుడిగా సెచినాటో రికార్డు సృష్టించాడు. సెచినాటోతో జరిగిన పోరులో తొలి రెండు సెట్లు కోల్పోయి... మూడో సెట్లో నెగ్గిన జొకోవిచ్ నాలుగో సెట్లో కీలకదశలో పొరపాట్లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. మరోవైపు తన ప్రత్యర్థి గత రికార్డును ఏమాత్రం పట్టించుకోకుండా పట్టుదలతో ఆడిన సెచినాటో కీలక సందర్భాల్లో పాయింట్లు గెలిచి ఫలితాన్ని శాసించాడు. సెమీఫైనల్లో ఏడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)తో సెచినాటో ఆడతాడు. జ్వెరెవ్‌కు షాక్ మరో క్వార్టర్ ఫైనల్లో డొమినిక్ థీమ్ వరుస సెట్లలో 6–4, 6–2, 6–1తో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ని ఓడించాడు. గంటా 50 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏ దశలోనూ థీమ్‌కు జ్వెరెవ్ పోటీనివ్వలేకపోయాడు. స్లోన్తో కీస్ ‘ఢీ’ గాయం కారణంగా అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ వైదొలిగినప్పటికీ... అమెరికాకే చెందిన ఇద్దరు యువ తారలు స్లోన్ స్టీఫెన్స్, మాడిసన్ కీస్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్లో పదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ 6–3, 6–1తో 14వ సీడ్ దరియా కసత్కినా (రష్యా)పై, 13వ సీడ్ కీస్ 7–6 (7/5), 6–4తో పుతింత్సెవా (కజకిస్తాన్)పై గెలిచి సెమీస్‌లో అమీతుమీకి సిద్ధమయ్యారు. బోపన్న జంట నిష్క్రమణ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) ద్వయం 6–7 (4/7), 2–6తో నికోలా మెక్టిక్ (క్రొయేషియా)–అలెగ్జాండర్ పెయా (ఆస్ట్రియా) జంట చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)తో రాఫెల్ నాదల్ (స్పెయిన్); డెల్ పొట్రో (అర్జెంటీనా)తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)... మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో షరపోవా (రష్యా)తో ముగురుజా (స్పెయిన్); కెర్బర్ (జర్మనీ)తో సిమోనా హలెప్ (రొమేనియా) తలపడతారు. -
హలెప్ హవా...
అపారిస్: ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్నా... ఎంతోకాలంగా ఊరిస్తోన్న గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఈసారైనా నెగ్గాలనే పట్టుదలతో ఉన్న సిమోనా హలెప్ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ రొమేనియా క్రీడాకారిణి అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ హలెప్ 6–2, 6–1తో 16వ సీడ్ ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై విజయం సాధించింది. 59 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో హలెప్ ఆరు బ్రేక్ పాయింట్లు సాధించడంతోపాటు నెట్ వద్దకు 10 సార్లు వచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు గెలిచింది. గత ఐదేళ్లలో ఈ టోర్నీలో హలెప్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం ఇది మూడోసారి. క్వార్టర్ ఫైనల్లో మాజీ నంబర్‌వన్, 12వ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)తో హలెప్ తలపడుతుంది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో కెర్బర్ 6–2, 6–3తో ఏడో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్)ను ఓడించింది. కసత్కినా సంచలనం మరోవైపు రష్యా యువతార దరియా కసత్కినా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, రెండో సీడ్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించి కసత్కినా ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. గంటా 57 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కసత్కినా 7–6 (7/5), 6–3తో వొజ్నియాకిపై నెగ్గింది. నాదల్ జోరు... పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ 34వ సారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ నాదల్ 6–3, 6–2, 7–6 (7/4)తో మాక్సిమిలియన్ మార్టెరర్ (జర్మనీ)పై గెలుపొందాడు. నాదల్ కెరీర్లో ఇది 900వ విజయం కావడం విశేషం. ఈ క్రమంలో ఓపెన్ శకంలో (1967 తర్వాత) కనీసం 900 విజయాలు సాధించిన ఐదో ప్లేయర్‌గా నాదల్ గుర్తింపు పొందాడు. జిమ్మీ కానర్స్ (అమెరికా –1,256), ఫెడరర్ (స్విట్జర్లాండ్–1,149), లెండిల్ (అమెరికా–1,068), గిలెర్మో విలాస్ (అర్జెంటీనా– 948) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఆదివారం తన 32వ జన్మదినాన్ని జరుపుకున్న ఈ స్పెయిన్ స్టార్‌కు ప్రిక్వార్టర్ ఫైనల్లో తొలి రెండు సెట్లలో అంతగా పోటీ ఎదురుకాలేదు. కానీ మూడో సెట్లో ఇద్దరూ ఒక్కోసారి తమ సర్వీస్‌ను కోల్పోయి మిగతా వాటిని నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో నాదల్ పైచేయి సాధించాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 1–6, 2–6, 7–5, 7–6 (9/7), 6–2తో అండ ర్సన్ (దక్షిణాఫ్రికా)పై, డెల్‌పొట్రో (అర్జెంటీనా) 6–4, 6–4, 6–4తో ఇస్నెర్ (అమెరికా)పై, సిలిచ్ (క్రొయేషియా) 6–4, 6–1, 3–6, 6–7 (4/7), 6–3తో ఫాగ్నిని (ఇటలీ)పై గెలిచారు. షరపోవాకు సెరెనా వాకోవర్... ఇద్దరు మాజీ చాంపియన్స్ సెరెనా విలియమ్స్ (అమెరికా), షరపోవా (రష్యా) మధ్య సోమవారం ‘బ్లాక్ బస్టర్’ ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించాలని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. భుజం కండరాలు పట్టేయడంతో సెరెనా కోర్టులోకి అడుగు పెట్టకుండానే షరపోవాకు ‘వాకోవర్’ ఇచ్చింది. దాంతో షరపోవా బరిలోకి దిగకుండానే క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ‘భుజం కండరాలు పట్టేయడంతో సర్వీస్ చేసే పరిస్థితిలో లేను. టోర్నీకి ముందు ఈ సమస్య లేదు. జూలియా జార్జెస్‌తో జరిగిన మూడో రౌండ్లో భుజం నొప్పి మొదలైంది. గాయం కారణంగా వైదొలుగుతున్నందుకు చాలా బాధగా ఉంది’ అని సెరెనా వ్యాఖ్యానించింది. -
ఫ్రెంచ్ ఓపెన్ : ఆడకుండానే వైదొలిగిన పులి
పారిస్/రొనాల్డ్ గారోస్ : బిడ్డకు పాలిచ్చి వచ్చిన పులి సెరెనా. బోనులోంచి బయటికి వచ్చిన చిరుత షరపోవా. ఇద్దరిలో ఆకలి ఉంది. బరిలో ఆహారం ఉంది. ఇదొక యుగాంతపు ఆట అని, ఉమెన్స్ టెన్నిస్‌లో ఈరోజు ధూమ్స్ డే అనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగం నాలుగో రౌండ్లో భాగంగా అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్, రష్యా స్టార్ మారియా షరపోవాల మధ్య ఉత్కంఠగా సాగుతుందనుకున్న మ్యాచ్ జరగనేలేదు. సెరెనా భుజ కండరాల గాయంతో మ్యాచ్‌కు ముందే తప్పుకోవడంతో షరపోవా ఆడకుండానే గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో రష్యా స్టార్ ముగురుజ(స్పెయిన్), లెసియా సురెంకో (ఉక్రెయిన్)ల్లో ఒకరితో తలపడనుంది. సెరెనా ఆవేదన.. ‘దురదృష్టవశాత్తు భుజ కండరాల గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో నేను ఆడలేను. ఇది చాలా కష్టంగా ఉంది. మారియాతో పోటీని ఎప్పుడు ఇష్టపడుతాను. ఇలా జరుగుతుందని ఊహించలేదు. చాలా బాధేస్తుంది. నా కూతురు, కుటుంబానికి దూరంగా ఉంటూ సాధన చేశాను. ఈ పరిస్థితి చాలా కఠినంగా ఉంది.’అని సెరెనా ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఆదివారం జరిగిన ఉమెన్ డబుల్స్‌లో విలియమ్స్ సిస్టర్స్ అండ్రెజా క్లెపాక్(స్లోవేనియా)-మరియా జోస్ మార్టినెజ్(ఇటలీ) చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. చదవండి: పులి.. చిరుత -
ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం
పారిస్/రొనాల్డ్ గారోస్: ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో సంచలనం చోటు చేసుకుంది. ఉమెన్ డబుల్స్ విభాగం నుంచి విలియమ్స్ సిస్టర్స్ నిష్క్రమించారు. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో అండ్రెజా క్లెపాక్(స్లోవేనియా)-మరియా జోస్ మార్టినెజ్(ఇటలీ) చేతిలో ఓటమిపాలయ్యారు. చివరి సెట్‌ను విలియమ్స్ సోదరీమణులు చిత్తుగా కోల్పోవటం విశేషం. మొత్తం మూడు రౌండ్లలో 6-4, 6-7(4), 6-0 తేడాతో ఓడిపోయారు. నిర్ణయాత్మక రౌండ్లో కనీస పోటీని కూడా ప్రదర్శించలేకపోయారు. కాగా, సెరెనా-వీనస్‌లు ఇప్పటిదాకా 14 గ్రాండ్ స్లామ్ డబుల్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. సోమవారం మహిళల సింగిల్స్ విభాగం నాలుగో రౌండ్లో భాగంగా సెరెనా, రష్యన్ టెన్నిస్ క్వీన్ మరియా షరపోవాతో తలపడనుంది. గతంలో వీరిద్దరి 18సార్లు తలపడగా, 16 సార్లు సెరెనా, 2 సార్లు షరపోవా నెగ్గారు. జకోవిచ్ ఖాతాలో మరో రికార్డు... పురుషుల విభాగంలో నోవాక్ జకోవిచ్(సెర్బియా).. స్పెయిన్‌కు చెందిన ఫెర్నాండో వర్దాస్కోపై 6-3, 6-4, 6-2 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. జకోవిచ్‌కు ఇది క్లే మైదానంలో 200వ విజయం. జకోవిచ్ తన తదుపరి మ్యాచ్‌లో ఇటలీకి చెందిన మార్కో కెచ్చినషియోతో తలపడనున్నాడు. -
గట్టెక్కిన జ్వెరెవ్
పారిస్: మూడో రౌండ్లో మ్యాచ్ పాయింట్ కాపాడుకొని ఊపిరి పీల్చుకున్న జర్మనీ టెన్నిస్ యువతార అలెగ్జాండర్ జ్వెరెవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనూ పోరాడి గట్టెక్కాడు. ఈ క్రమంలో తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించాడు. టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 4–6, 7–6 (7/4), 2–6, 6–3, 6–3తో కరెన్ ఖచనోవ్ (రష్యా)పై విజయం సాధించాడు. 3 గంటల 29 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ ఏకంగా 17 ఏస్‌లు సంధించాడు. నాలుగు డబుల్ ఫాల్ట్‌లతోపాటు 51 అవనసర తప్పిదాలు కూడా చేశాడు. ఒకదశలో 1–2 సెట్లతో వెనుకబడిన 21 ఏళ్ల జ్వెరెవ్ చివరి రెండు సెట్లను వరుసగా గెల్చుకొన్ని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ‘నేనింకా యువకుడినే. ఇంకొంత సమయం కోర్టులో గడిపి మీ అందరికీ వినోదం అందిస్తాను’ అని మ్యాచ్ అనంతరం జ్వెరెవ్ సరదాగా వ్యాఖ్యానించాడు. ‘నేను, నా సోదరుడు మిషా జ్వెరెవ్ రోజుకు నాలుగైదు గంటలు జిమ్‌లో గడుపుతాం. ట్రెడ్‌మిల్‌పై సాధన చేస్తాం. ఆ శ్రమ ఈ రోజు ఫలితాన్నిచ్చింది’ అని జ్వెరెవ్ అన్నాడు. క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)తో జ్వెరెవ్ తలపడతాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో థీమ్ 6–2, 6–0, 5–7, 6–4తో 19వ సీడ్ నిషికోరి (జపాన్)పై గెలిచి వరుసగా ఈ టోర్నీలో మూడోసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6–3, 6–4, 6–2తో ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్)పై గెలుపొందగా... అన్‌సీడెడ్ మార్కో సెచినాటో (ఇటలీ) 7–5, 4–6, 6–0, 6–3తో ఎనిమిదో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం)ను బోల్తా కొట్టించి జొకోవిచ్‌తో క్వార్టర్ ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు. స్లోన్ స్టీఫెన్స్ జోరు... మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా యువ తారలు పదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్, 13వ సీడ్ మాడిసన్ కీస్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో స్లోన్ స్టీఫెన్స్ 6–2, 6–0తో కొంటావీట్ (ఎస్తోనియా)పై... కీస్ 6–1, 6–4తో బుజర్‌నెస్కూ (రొమేనియా)పై గెలుపొందారు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో 26వ సీడ్ బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) 4–6, 3–6తో యూలియా పుతింత్సెవా (కజకిస్తాన్) చేతిలో పరాజయం పాలైంది. -
రష్మికకు నిరాశ
సాక్షి, హైదరాబాద్: జూనియర్ ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీకి క్వాలిఫయర్‌గా నిర్వహించిన రోలాండ్ గారోస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ టెన్నిస్ టోర్నీలో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారిణి శ్రీవల్లి రష్మికకు నిరాశ ఎదురైంది. ఈ క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తా చాటి జూనియర్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడాలన్న ఆమె ఆశలు ఆవిరయ్యాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ పొందడానికి 2 మ్యాచ్‌లు గెలవాల్సి ఉండగా ఆమె ఒకే మ్యాచ్‌లో గెలుపొంది అద్భుత అవకాశాన్ని చేజార్చుకుంది. పారిస్‌లో జరిగిన ఈ టోర్నీ తొలిరౌండ్లో రష్మిక (భారత్) 6–3, 6–2తో కావో షి (చైనా)పై విజయం సాధించి శుభారంభం చేసిం ది. కానీ రెండో రౌండ్లో రష్మిక 5–7, 4–6తో అనా పౌలా మెలిలో (బ్రెజిల్) చేతిలో ఓడిపోయి పోటీ నుంచి నిష్క్రమించింది. మూడో రౌండ్లో అనా పౌలా (బ్రెజిల్) 7–6 (7/4), 6–2తో కావో షి (చైనా)పై నెగ్గి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా జూనియర్ ఫ్రెంచ్ ఓపెన్‌కు అర్హత సాధించింది. -
ఒస్టాపెంకో నిష్క్రమణ
పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రోజే పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్, ఐదో సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఆదివారం జరిగిన మొదటి రౌండ్లో కాటరీనా కొజ్లోవా (ఉక్రెయిన్) 7–5, 6–3తో ఒస్టాపెంకోను ఓడించి తన కెరీర్లోనే గొప్ప విజయం సాధించింది. గంటా 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒస్టాపెంకో 13 డబుల్ ఫాల్ట్‌లు, 48 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. డిఫెండింగ్ చాంపియన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించడం 2005 (మిస్కినా–రష్యా) తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు తొమ్మిదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) కూడా తొలి రౌండ్లోనే ఓడింది. వాంగ్ కియాంగ్ (చైనా) 6–4, 7–5తో వీనస్‌పై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), నాలుగో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) రెండో రౌండ్‌కు చేరారు. -
సెరెనా తొలి రౌండ్ ప్రత్యర్థి ప్లిస్కోవా
టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ ‘డ్రా’ విడుదలైంది. గతేడాది సెప్టెంబరులో పాపకు జన్మనిచ్చాక మాజీ చాంపియన్, మాజీ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ ఆడుతున్న తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఇదే. ఆదివారం మొదలయ్యే ఈ టోర్నీలో ఆమె తొలి రౌండ్లో క్రిస్టినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో తలపడనుంది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) తొలి రౌండ్లో కొజ్లోవా (ఉక్రెయిన్)తో ఆడనుంది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ మొదటి రౌండ్లో డల్గొపలోవ్ (ఉక్రెయిన్)తో పోటీపడతాడు. -
ప్రజ్నేశ్ గుణేశ్వరన్ శుభారంభం
ఫ్రెంచ్ ఓపెన్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పారిస్‌లో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ గెలుపొందగా... సుమీత్ నాగల్, రామ్‌కుమార్ రామనాథన్ ఓడిపోయారు. ప్రజ్నేశ్ 6–4, 6–4తో సాల్వటోర్ కరూసో (ఇటలీ)పై నెగ్గి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. సుమీత్ 6–4, 4–6, 1–6తో మార్టిన్ క్లిజాన్ (స్లొవేకియా) చేతిలో... రామ్‌కుమార్ 3–6, 7–5, 1–6తో జే క్లార్క్ (బ్రిటన్) చేతిలో ఓటమి చవిచూశారు. -
ఫ్రెంచ్ ఓపెన్కల్లా కోలుకుంటా
న్యూఢిల్లీ: కుడి మోకాలి గాయం వల్ల గత అక్టోబర్ నుంచి ఆటకు దూరమైన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో మూడు నెలల్లో రాకెట్ పట్టుకునే అవకాశం ఉంది. మే నెలాఖర్లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకల్లా కోలుకుంటానని ఈ హైదరాబాద్ క్రీడాకారిణి ఆశాభావంతో ఉంది. మహిళల టెన్నిస్‌ను సెరెనా సహా ఏ ఒక్కరూ ఎక్కువ కాలం శాసించలేరని చెప్పింది. యువ ప్రతిభావంతులు టాప్ ర్యాంకర్లను కంగుతినిపిస్తున్న సంగతి మరవొద్దని సూచించింది. ఫెడ్ కప్ టీమ్ టోర్నమెంట్లో భారత యువతార అంకితా రైనా ప్రదర్శన అద్భుతంగా ఉందని సానియా కితాబిచ్చింది. ‘ఫెడ్ కప్‌లో ఈసారి యువ క్రీడాకారిణుల పోరాటపటిమ ఆకట్టుకుంది. కానీ తదుపరి దశకు చేరకపోవడమే నిరాశను కలిగిస్తోంది. ఆ వెలితి ఇంకా కొనసాగుతోంది’ అని హైదరాబాదీ స్టార్ చెప్పింది. ఫెడ్ కప్‌లో అంకిత ఆటతీరు అసాధారణమని పేర్కొంది. తనకన్నా ఎంతో మెరుగైనా, టాప్– 100 ర్యాంకర్లను ఆమె కంగుతినిపించిన తీరు గొప్ప పురోగతి అని ప్రశంసించింది. అంకితను తదుపరి భావి సానియాగా భావించవచ్చా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... చాన్నాళ్లుగా ఎంతో మంది ఈ ప్రశ్న అడుగుతున్నారు. అయితే వీళ్లందరికీ చెబుతున్నా... ఎందుకు మనం సానియా దగ్గరే ఆగిపోవాలి. నన్ను మించి మేటి క్రీడాకారిణిగా ఎదగాలని ఆశిద్దాం’ అని తెలిపింది. -
న భూతో...న భవిష్యతి!
►నాదల్ నయా చరిత్ర ►పదోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సొంతం ►ఒకే గ్రాండ్‌స్లామ్‌ను పదిసార్లు గెలిచిన ఏకైక ప్లేయర్‌గా ఘనత ►అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన జాబితాలో రెండో స్థానానికి ►ఫైనల్లో వావ్రింకాపై వరుస సెట్లలో ఘనవిజయం ►రూ. 15 కోట్ల 10 లక్షల ప్రైజ్‌మనీ కైవసం జీవితం మొత్తంలో ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిలైనా గెలిస్తే తమ జన్మ ధన్యమైపోతుందని రాకెట్ పట్టిన సమయంలో ప్రతి టెన్నిస్ క్రీడాకారుడు కలలు కంటాడు. అలాంటిది ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌ను ఒకటికాదు... రెండుకాదు.. మూడుకాదు... ఏకంగా పదిసార్లు గెలిచి స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ కొత్త చరిత్ర లిఖించాడు. పదోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సాధించి మట్టి కోర్టులపై మకుటంలేని మహారాజు తానేనని మరోసారి నిరూపించాడు. ఒకే గ్రాండ్‌స్లామ్‌ను పదిసార్లు గెలిచిన నాదల్ గతంలో ఎవరూ సాధించని... భవిష్యత్‌లోనూ దాదాపుగా మరెవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నట్లే. పారిస్: అతని పనైపోయిందని అన్న వారందరికీ దిమ్మదిరిగే జవాబు లభించింది. పూర్తి ఫిట్‌గా ఉంటే విశ్వరూపం చూపిస్తానని స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ మళ్లీ రుజువు చేశాడు. రికార్డుస్థాయిలో పదోసారి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. టెన్నిస్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. రొలాండ్ గారోస్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ నాదల్ 6–2, 6–3, 6–1తో మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్)ను చిత్తుగా ఓడించాడు. 2 గంటల 5 నిమిషాలపాటు జరిగిన ఈ తుది పోరులో ఆద్యంతం నాదలే ఆధిపత్యం చలాయించాడు. సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై గెలుపొందిన వావ్రింకా ఫైనల్లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. విజేతగా నిలిచిన నాదల్కు 21 లక్షల యూరోలు (రూ. 15 కోట్ల 10 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. నాదల్ గతంలో 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014లలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ సాధించాడు. ⇒ ఈ విజయంతో నాదల్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సంఖ్య 15కు చేరుకుంది. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జాబితాలో నాదల్ రెండో స్థానానికి చేరుకున్నాడు. 18 టైటిల్స్‌తో ఫెడరర్ అగ్రస్థానంలో ఉండగా... 14 టైటిల్స్‌తో సంప్రాస్ మూడో స్థానంలో ఉన్నాడు. ⇒ఓవరాల్‌గా నాదల్ కెరీర్లో ఇది 73వ సింగిల్స్ టైటిల్. క్లే కోర్టులపై 53వది. 13 సార్లు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడిన నాదల్ మొత్తం 79 మ్యాచ్‌ల్లో గెలిచి, కేవలం రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. ⇒ ఒక్క సెట్ కోల్పోకుండా గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను మూడుసార్లు (ఫ్రెంచ్ ఓపెన్ 2008, 2010, 2017లో) గెలిచిన ఏకైక ప్లేయర్‌గా నాదల్ గుర్తింపు పొందాడు. గతంలో ఫెడరర్, నస్టాసే (రొమేనియా), రోజ్‌వెల్ (ఆస్ట్రేలియా) ఒక్కోసారి ఈ ఘనత సాధించారు. ⇒ఈ విజయంతో నాదల్ 2014 తర్వాత మళ్లీ రెండో ర్యాంక్‌కు చేరుకోనున్నాడు. ⇒మోంటెకార్లో, బార్సిలోనా ఓపెన్ టైటిల్స్‌ను కూడా నాదల్ పదిసార్లు చొప్పున గెలిచాడు. ⇒1972 తర్వాత ఒక సీజన్‌లోని తొలి రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను 30 ఏళ్లకుపైబడిన వారు గెలవడం ఇదే ప్రథమం. ఈ ఏడాది 35 ఏళ్ల ఫెడరర్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో, 31 ఏళ్ల నాదల్ ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచారు. 1972లో 37 ఏళ్ల కెన్ రోజ్‌వెల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను, 34 ఏళ్ల ఆండ్రెస్ గిమెనో ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలిచారు. ⇒ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ 35 గేమ్‌లు మాత్రమే కోల్పోయాడు. ఈ రికార్డు బోర్గ్ (స్వీడన్–32 గేమ్‌లు, 1978లో) పేరిట ఉంది. నిజంగా నమ్మశక్యంగా లేదు. లా డెసిమా (స్పానిష్ భాషలో పదోసారి) ఘనత సాధించినందుకు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. నా అనుభూతిని మాటల్లో వర్ణించలేను. నా అంకుల్ టోనీ లేకపోతే నేను పదిసార్లు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచేవాణ్ని కాదు. – నాదల్ -
కొత్త కిడ్
టీనేజ్లోంచి క్వీన్ ఏజ్‌లోకి వచ్చిన కొత్త కిడ్ జెలెనా ఒస్టాపెంకో! ఫ్రెంచి ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుని తొలిసారి గ్రాండ్స్లామ్లోకి అడుగుపెట్టిన ఈ రాకుమారి.. మహామహా టెన్నిస్ పచ్చిక మైదానాలన్నిటినీ తనకు రెడ్ కార్పెట్‌గా మార్చుకోబోతున్నారా?! పారిస్‌లో ఆమె కనబరిచిన ఫుట్‌వర్క్‌ను చూస్తే ఉమెన్ టెన్నిస్‌లో కొత్త శకం ఆరంభం అయినట్లే కనిపిస్తోంది. జెలెనా ఒస్టాపెంకో టెన్నిస్ క్రీడాకారిణి జననం : 1997 జూన్ 8 జన్మస్థలం : రీగా, లాత్వియా ఎత్తు : 5 అడుగుల తొమ్మిదిన్నర అంగుళాలు ఆట తీరు : రైట్ హ్యాండెడ్ కోచ్ : అనబెల్ మెదీనా గ్యారిగ్స్ (మహిళ) తల్లిదండ్రులు : జవ్జెనిస్, జెకోవ్లెవా ర్యాంకు : 47 (ఇక ఇప్పుడు 12కి చేరుకోవచ్చు) జెలెనాకు ట్విట్టర్ అకౌంట్ లేదు. ఆమెకో ఫోన్ ఉందేమో కానీ, ఆ ఫోన్ నెంబర్ మానవ మాత్రుల దగ్గర లేదు! శనివారం జెలెనా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలవగానే లాత్వియా అధ్యక్షుడు రైమండ్స్ వెజెనిస్ నుంచి జెలెనా తల్లి జెకోవ్లెవాకు కాల్ వచ్చింది. ‘‘మీ అమ్మాయికి కంగ్రాట్స్ చెప్పండి’’ అని. ఆ తర్వాత ఆయన తల్లిని, కూతుర్ని అభినందనల్లో ముంచెత్తారు. జూన్ పదిహేనున రైమండ్స్ పుట్టిన రోజు. ఐదు రోజుల ముందే ఆయన తన బర్త్‌డే చేసుకున్నంతగా సంబరపడిపోయారు. కాదా మరి! లాత్వియాకు అది తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఆ టైటిల్‌ను సాధించి తెచ్చింది తన దేశ పౌరురాలు. జెలెనాకు టెన్నిస్‌లో ఫస్ట్ కోచ్ ఆమె తల్లే. టీవీలో సెరెనా విలియమ్స్‌ని చూపిస్తూ ‘నువ్వలా ఆడాలి’ అంటూ ఆమెను ఆడించింది. పట్టుపట్టి టెన్నిస్ నేర్పించింది. బాసిన్స్కీపై సెమీఫైనల్లో కూతురు విజయం సాధించగానే ‘‘తను ఎప్పటికైనా స్లామ్ ఫైనల్‌కు వెళుతుందని మా నమ్మకం. అందుకు ఎంతో సమయం లేదని ఇప్పుడు అనిపిస్తోంది’ అని తమ ఇంటి ముందు గుమికూడిన టీవీ చానళ్ల ప్రతినిధులతో అన్నారామె. ఫైనల్లో రొమేనియా క్రీడాకారిణి సిమోనా హలెప్‌ను ఓడించడానికి ముందు తన కెరీర్ మొత్తం మీద 54 మంది జగజ్జెట్టీలను టెన్నిస్ కోర్టులలో మట్టుపెట్టింది జెలెనా. ‘ఈ పిడుగు కొట్టిన షాట్లకు నా కడుపు కదిలిపోయింది’ అని సిమోనా హలెప్ బహిరంగంగానే అంగీకరించారు. ఈ విజయంతో జెలెనాకు 21 లక్షల యూరోల ప్రైజ్ మనీ చేతికి వచ్చింది. సుమారు 15 కోట్ల 10 లక్షల రూపాయలు! రకరకాల ఉద్యోగాలు చేసి, తినీతినకా దాచి, ఔదార్యం గల అజ్ఞాత దాతల నుంచి ఆర్థిక సహాయం పొంది కూతుర్ని టెన్నిస్ క్రీడాకారిణిగా నిలబెట్టిన ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు కాస్త ‘బ్రీతింగ్ స్పేస్’ దొరికినట్టే. ఆట కోసం జెలెనా ఎంత కష్టపడుతుందో వాళ్లకు తెలుసు. అయితే ఆ కష్టాన్ని ఈ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆమె తల్లి చూడదలచుకోలేదు! తను చూస్తుండగా ఆడుతున్నప్పుడు కూతురు స్ట్రెస్‌కు గురువుతుందేమోనన్న భయంతో ఆమె కోర్టు బయటే ఉండిపోయారు! జెలెనా ఆట దూకుడుగా ఉంటుంది. బాల్ మిస్ అయితే ఆమె కోపం చూడలేం. నిరుడు ఆక్లాండ్‌లో ఆడుతూ బ్రిటన్ ప్లేయర్ నవోమీ బ్రాడీతో వాదనకు దిగి, ర్యాకెట్‌ను విసిరి కొడితే అది వెళ్లి బాల్ బాయ్‌కి తగిలినంత పనవడం.. టెన్నిస్ క్రీడాభిమానులకు ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు వారికి ఎప్పటికీ గుర్తుండిపోయే పవర్ షాట్ల మ్యాచ్‌ని ఒక పుష్పగుచ్ఛంగా అందించింది జెలెనా ఒస్టాపెంకో. ఆ గుచ్ఛంలోని కొన్ని పరిమళాలు మీకోసం.. బ్రీఫ్‌గా. వన్ బై వన్ ఒక ఒలింపిక్స్ చాంపియన్, ఒక యూఎస్ ఓపెన్ చాంపియన్, ఒక ప్రపంచ మాజీ నంబర్ వన్, ఒక సీడెడ్ ప్లేయర్.. వీళ్లందర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుసగా మట్టికరిపిస్తూ ఫైనల్‌కి చేరిన 20 ఏళ్ల కొత్తమ్మాయి జెలెనా వొస్తాపెంకో శనివారం నాడు మూడో సీడ్ సిమోనా హలప్పై ఘన విజయం సాధించి గ్రాండ్ స్లామ్లోకి ఎంట్రీ ఇచ్చింది. జెలెనా ధాటికి ఏ రౌండ్లో ఎవరు చేతులెత్తేశారో చూడండి. 1. రెండో రౌండ్ మోనికా ఫుయిగ్ (ఫ్యూర్టోరికో) 2. ప్రిక్వార్టర్ ఫైనల్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) 3. క్వార్టర్ ఫైనల్ వోజ్నియాకి (డెన్మార్క్) 4. సెమీ ఫైనల్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) 5. ఫైనల్ సిమోనా హలెప్(రొమేనియా) దృఢమైన ఓక్ వృక్షం యు.ఎస్. క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌తో పాటు జెలెనాకు ఎర్నెస్ట్ గల్బైస్ కూడా అభిమాన క్రీడాకారుడు. గల్బైస్ పుట్టిందీ లాత్వియాలో జెలెనా జన్మస్థలం రిగాలోనే. జెలెనాకు ‘అలోనా’ అని పిలిపించుకోవడం ఇష్టం. స్నేహితులు, బంధువులు అంతా ఆమెను అలోనా అనే పిలుస్తారు. ప్రొఫెషనల్‌గా కూడా అలోనా అనే పేరుతోనే గుర్తింపు పొందాలని అనుకున్నా లాత్వియా నిబంధనల ప్రకారం అది కష్టమైన విషయం. అందుకే ఆటలో మాత్రం ఈ ‘అలోనా’.. జెలెనా నే! అలోనా అంటే హెబ్రూ భాషలో దృఢమైన ఓక్ వృక్షం అని అర్థం. బర్త్‌డే బేబీ జూన్ 8 గురువారం. ఫ్రెంచ్ ఓపెన్ మొదలైన పదో రోజు. అదే రోజు ఉమెన్ సింగిల్స్ సెమీ ఫైనల్స్‌లో జెలెనా, స్విస్ అమ్మాయి బాసిన్‌స్కీ తలపడుతున్నారు. ఆ రోజు ఎవరు గెలిచినా అది వారికి బర్త్‌డే గిఫ్ట్ అవుతుంది. జెలెనా, బాసిన్‌స్కీ ఇద్దరూ జూన్ 8నే పుట్టారు. అయితే బాసిన్‌స్కీ బర్త్ ఇయర్ 1989. జెలెనా కన్నా ఎనిమిదేళ్లు పెద్ద. ఆటలో కూడా జెలెనా కన్నా అనుభవజ్ఞురాలు. చివరికి బర్త్‌డే గిఫ్ట్ జెలెనా చేతికి వచ్చింది. అమ్మ చెప్పింది జెలెనా తండ్రి ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్. ఉక్రెయి¯Œ నగరం జపోరిజియాలో అక్కడి ఫుట్‌బాల్ క్లబ్ తరఫున గోల్‌కీపర్. జెలెనా నానమ్మ జపోరిజియాలోనే ఉంటుంది. జెలెనా కజిన్ బ్రదర్ మక్సిమ్ యు.ఎస్.లో ఉంటున్నాడు. జెలెనాకు టెన్నిస్‌పై ఇష్టం కలగడానికి ఆమె తల్లే కారణం. ఆమె టెన్నిస్ కోచ్. అలా ఐదవ ఏటే జెలెనా టెన్నిస్ ర్యాకెట్ పట్టింది. అదే ఏజ్‌లో డ్యాన్స్ కూడా నేర్చుకుంది. ‘నేషనల్ లాత్వియన్ చాంపియన్‌షిప్స్ ఫర్ బాల్రూమ్ డాన్సింగ్’ కోసం పోటీ పడింది. అయితే పన్నెండేళ్లు వచ్చేసరికి జెలెనా దృష్టి పూర్తిగా టెన్నిస్ వైపు మళ్లింది. టెన్నిస్‌లో ఇప్పటి తన కోఆర్డినేషన్కి, ఫుట్‌వర్క్ నైపుణ్యానికి అప్పుడు నేర్చుకున్న డాన్సే ఉపయోగపడిందని జెలెనా అంటుంది. ఆమె ఫేవరేట్ డాన్స్ సాల్సా. ఇప్పటికీ వారానికి నాలుగు సార్లు డ్యాన్స్‌కు వెళుతుంది. జెలెనా మూడు భాషలు మాట్లాడుతుంది. లాత్వియా, రష్యన్, ఇంగ్లిష్. ఒక విజయం... అనేక విశేషాలు ∙కేవలం 20 లక్షల జనాభా ఉన్న ఐరోపా దేశం లాత్వియా నుంచి గ్రాండ్ స్లామ్ చాంపియన్‌గా అవతరించిన తొలి క్రీడాకారిణి.కెరీర్లో తొలి ప్రొఫెషనల్ టైటిల్‌గా గ్రాండ్‌స్లామ్ టోర్నీని గెలుచుకున్న మూడో ప్లేయర్. మొదటి ఇద్దరూ.. మహిళల విభాగంలో బార్బరా జోర్డాన్ (యు.ఎస్), పురుషుల విభాగంలో గుస్తావో కుయెర్టన్ (బ్రెజిల్). బార్బరా 1979లో(ఆస్ట్రేలియన్ ఓపెన్), గుస్తావో కుయెర్టన్ 1997లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకున్నారు.1997 జూన్ 8న గుస్తావో కుయెర్టన్ టైటిల్ గెలుచుకున్న రోజే మన లేటెస్టు హీరోయిన్ జెలెనా ఒస్టాపెంకో జన్మించడం విశేషం. ఒస్టాపెంకో విజయానికి మరికొన్ని ప్రత్యేకతలు 1933లో మార్గరెట్ స్క్రివెన్ వివియన్ (బ్రిటన్) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన తొలి అన్‌సీడెడ్ క్రీడాకారిణి.1997లో ఇవా మయోలీ (19 సం. 300 రోజులు) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్, 2006లో మరియా షరపోవా (19 సం. 77 రోజులు) తర్వాత గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన చిన్న వయసు అమ్మాయి.2001లో జెన్నిఫర్ కాప్రియాటి తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తొలి సెట్లో ఓడిపోయాక కూడా టైటిల్ నెగ్గిన తొలి ప్లేయర్. -
ఫ్రెంచ్ ఓపెన్ విజేత రఫెల్ నాదల్
పారిస్: మట్టి కోర్టు రారాజు రఫెల్ నాదల్ మరోసారి విజృంభించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో వావ్రింకాపై విజయం సాధించి ఫ్రెంచ్ ఓపెన్‌లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో వావ్రికాను 6-2, 6-3, 6-1 తేడాతో నాదల్ మట్టికరిపించాడు. ఈ విజయంతో 10 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన ఆటగాడిగా నాదల్ రికార్డు సృష్టించాడు. అలాగే.. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో నాదల్ రెండోస్థానంలో నిలిచాడు. మొత్తంగా నాదల్కు ఇది 15వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కాగా.. ఫెదరర్ 18 గ్రాండ్‌స్లామ్‌లతో మొదటి స్థానంలో ఉన్నాడు. టైటిల్ గెలిచే క్రమంలో మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడిన నాదల్ కేవలం 35 గేమ్‌లను మాత్రమే కోల్పోవడం గమనార్హం. -
నాదల్ & వావ్రింకా
►పదో సారి ఫైనల్లోకి నాదల్ ►వావ్రింకాతో అమీతుమీ రేపు ►ఫ్రెంచ్ ఓపెన్ ఇటు వావ్రింకా, అటు నాదల్ తమ ప్రత్యర్థులను దెబ్బకు దెబ్బ తీశారు. తమ ప్రతీకారానికి ఫ్రెంచ్ ఓపెన్‌ను వేదికగా చేసుకున్నారు. గతేడాది ఇదే వేదికపై బ్రిటన్ స్టార్ ముర్రే చేతిలో సెమీస్‌లో ఎదురైన పరాభవానికి ఈ ఏడాది వావ్రింకా బదులు తీసుకుంటే... మూడువారాల క్రితం రోమ్ మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్లో థీమ్ చేతిలో చవిచూసిన పరాజయానికి నాదల్ ప్రతీకారం తీర్చుకున్నాడు. పారిస్: స్పానిష్ సంచలనం రాఫెల్ నాదల్... మళ్లీ ఫ్రెంచ్ ఓపెన్‌లో తుదిపోరుకు అర్హత సంపాదించాడు. ఈ క్లేకోర్టు సూపర్ చాంపియన్ పదో టైటిల్ కోసం స్విట్జర్లాండ్ స్టార్ వావ్రింకాతో తలపడనున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో నాదల్ 6–3, 6–4, 6–0తో డొమినిక్ థీమ్‌ను చిత్తుచిత్తుగా ఓడించాడు. కేవలం 2 గంటల 7 నిమిషాల్లోనే థీమ్ ఆట కట్టించాడు. మరో సెమీస్‌లో వావ్రింకా 6–7 (6/8), 6–3, 5–7, 7–6 (7/3), 6–1తో ముర్రేను కంగుతినిపించాడు. ఇద్దరు తమ తమ ప్రత్యుర్థులపై ప్రతీకారం తీర్చుకున్నారు. ఫైనల్ పరంగా చూస్తే కూడా ఇద్దరి గణాంకాలు ఆసక్తికరంగానే ఉన్నాయి. ఇప్పటి దాకా ఫైనల్ చేరిన ఏ గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ వావ్రింకా ఓడిపోలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ (2014) ఫైనల్లో నాదల్‌ను కంగుతినిపించిన వావ్రింకా... ఫ్రెంచ్ ఓపెన్ (2015), యూఎస్ ఓపెన్ (2016) ఫైనల్స్‌లో జొకోవిచ్‌ను ఓడించాడు. మరోవైపు ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్‌ది ఎదురులేని రికార్డు. ఫైనల్ చేరిన 9 సార్లు టైటిల్ చేజిక్కించుకున్నాడు. వారెవ్వా వావ్రింకా గతేడాది... ఇదే టోర్నీ... డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి వావ్రింకా... క్వార్టర్స్ దాకా ఎదురేలేని పయనం. కానీ సెమీస్‌లో చుక్కెదురు. బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే చేతిలో ఓటమి. వరుసగా రెండో టైటిల్ గెలుద్దామనుకున్న ఆశలకు తెర! అందుకేనేమో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనుకున్నాడు. ఏడాది తిరిగేలోపే లెక్క సరిచేశాడు. ముర్రే కథను అదే టోర్నీ సెమీస్‌లో ముగించాడు. వారెవ్వా వావ్రింకా అనిపించుకున్నాడు. ఆద్యంతం హోరాహోరీగా జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 2015 చాంపియన్ స్విస్ స్టార్ 3–2 సెట్లతో గతేడాది రన్నరప్ ముర్రేను కంగుతినిపించాడు. జోరు మీదున్న వావ్రింకాకు ఇది వరుసగా పదో విజయం కావడం గమనార్హం. ఇద్దరి పోరాటంతో నాలుగున్నర గంటలపాటు ఈ మ్యాచ్ సాగింది. మొదటి సెట్ నుంచే ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడటంతో రెండు సెట్లు టైబ్రేక్ దారి తీశాయి. చివరకు వావ్రింకా 6–7 (6/8), 6–3, 5–7, 7–6 (7/3), 6–1తో ముర్రేను కంగుతినిపించాడు. బ్రిటన్ స్టార్ ఆరంభం నుంచే మ్యాచ్‌పై పట్టుబిగించే ప్రయత్నం చేశాడు. అయితే వావ్రింకా కూడా దీటుగా బదులివ్వడంతో ప్రతీపాయింట్కు చెమటోడ్చాల్సివచ్చింది. అయితే ఈ సెట్లో స్విస్ స్టార్ పదే పదే అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. టైబ్రేక్‌లోనూ సరిదిద్దుకోలేని తప్పులతో తొలిసెట్‌ను కోల్పోయాడు. తర్వాత రెండో సెట్‌ను మాత్రం దూకుడుగా ప్రారంభించిన వావ్రింకా ప్రత్యర్థి సర్వీస్‌ను రెండు సార్లు బ్రేక్ చేసి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. అయితే మూడో సెట్లో మళ్లీ ముర్రేదే పైచేయి అయ్యింది. ముర్రే మూడు బ్రేక్ పాయింట్లను సాధించగా... వావ్రింకా మళ్లీ నియంత్రణే లేని అనవసర తప్పిదాలతో సెట్‌ను కోల్పోవాల్సివచ్చింది. ఇక నాలుగో సెట్లో మళ్లీ ఇద్దరు అసాధారణ ప్రదర్శన కనబరచడంతో ఇది సుదీర్ఘంగా సాగింది. దీంతో ఈ సెట్ కూడా టైబ్రేక్‌కు దారితీసినప్పటికీ వావ్రింకా దూకుడుగా ఆడి సెట్‌ను ముగించాడు. ఇద్దరూ వీరోచిత పోరాటంతో 2–2తో సమంగా నిలిచారు. నిర్ణాయక ఐదో సెట్లో వావ్రింకా జోరు ముందు ముర్రే తేలిపోయాడు. వరుసగా ఐదు గేమ్‌లు గెలుచుకొని వావ్రింకా 5–0తో ఆధిక్యంలో నిలిచాడు. తర్వాతి గేమ్‌ను ముర్రే బ్రేక్ చేసినా... ఏడో గేమ్‌ను బ్రేక్ చేసిన స్విస్ ఆటగాడు సెట్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. -
ఎవరు గెలిచిన చరిత్రే
►హలెప్ & ఒస్టాపెంకో ►నేడు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ ►ఫేవరెట్‌గా హలెప్ పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో శనివారం ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ప్రపంచ నాలుగోర్యాంకర్, మూడోసీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)తో అన్‌సీడేడ్ ఎలీనా ఒస్టాపెంకో (లాత్వియా) తలపడనుంది. సెమీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్, రెండోసీడ్ కరోలిన్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై సంచలన విజయం సాధించిన హలెప్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. నెగ్గితే టాప్ ర్యాంకుకు హలెప్.. మహిళల సింగిల్స్‌లో నం.1 ప్లేయర్, ఏంజెలిక్ కెర్బర్ (జర్మనీ) తొలిరౌండ్లోనే వెనుదిరగడంతో టాప్ ప్లేస్ దక్కించుకునేందుకు ప్లిస్కోవా, హలెప్లకు మంచి అవకాశం దక్కింది. మరోవైపు ప్రపంచ నం.2 సెరెనా విలియమ్స్ (అమెరికా) ప్రస్తుతం గర్భవతిగా ఉండడంతో మరో ఏడాది వరకు ఆమె బరిలోకి దిగే చాన్స్ లేదు. దీంతో ప్లిస్కోవా ఈ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశిస్తే టాప్ ర్యాంకు సొంతమయ్యేది. అయితే గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో ప్లిస్కోవా 4–6, 6–3, 3–6తో హలెప్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఈ టోర్నీ ఫైనల్లోకి చేరిన హలెప్ మరో విజయం సాధిస్తే చాలు టాప్ ర్యాంకును కైవసం చేసుకుంటుంది. క్వార్టర్స్ వరకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ప్రయాణం కొనసాగించిన రొమేనియన్ ప్లేయర్‌కు ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)తో జరిగిన మ్యాచ్ కఠినంగా సాగింది. దాదాపు మ్యాచ్ పాయింట్‌ను కాచుకుని ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. సెమీస్ మ్యాచ్‌లో కూడా విజయం అంత సులువుగా దక్కలేదు. మరోవైపు 2014లో ఈ టోర్నీ ఫైనల్‌కు చేరిన హలెప్.. మరియా షరపోవా (రష్యా) చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. దీంతో ఈ మ్యాచ్‌లో నెగ్గి ఎలాగైనా తొలి గ్రాండ్‌స్లామ్ కైవసం చేసుకోవాలని హలెప్ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఓసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడి ఉండడం హలెప్‌కు ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. తొలిసారి ఫైనల్‌కు.. మరోవైపు 2015 నుంచి గ్రాండ్‌స్లామ్‌లలో ఆడుతున్న 20 ఏళ్ల ఒస్టాపెంకో.. గ్రాండ్‌స్లామ్‌లలో మూడో రౌండ్‌కు చేరుకోవడమే అత్యుత్తమ ప్రదర్శనగా చెప్పుకోవచ్చు. అది కూడా ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నమోదు చేసినదే. అయితే ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం అద్వితీయ ఆటతీరు ప్రదర్శించిన ఒస్టాపెంకో.. ఏకంగా గ్రాండ్‌స్లామ్ పైనల్‌కు చేరుకుంది. కెరీర్లో ఒక్క డబ్ల్యూటీఏ టైటిల్లేని ఎలీనా.. 2016 ఖతార్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఇప్పటివరకు ఇదే ఎలీనా అత్యుత్తమ ప్రదర్శనగా చెప్పుకోవచు. మరోవైపు సంచలనాలతో ఫైనల్‌కు చేరిన ఒస్టాపెంకో.. ఫైనల్లోనూ విజయం సాధించి ఈ టోర్నీ మధురానుభూతిగా మలుచుకోవాలని భావిస్తోంది. ►మ్యాచ్ సా.6.30 ని.లకు స్టార్‌స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
ఒస్టాపెంకో సంచలనం
► మహిళల సింగిల్స్ ఫైనల్లోకి అన్‌సీడెడ్ క్రీడాకారిణి ► రేపు మూడో సీడ్ హలెప్‌తో టైటిల్ పోరు పారిస్: కెరీర్లో ఏడు గ్రాండ్‌స్లామ్ టోర్నీ లు ఆడినా ఏనాడూ రెండో రౌండ్ దాటలేకపోయిన జెలెనా ఒస్టాపెంకో ఎనిమిదో ప్రయత్నంలో సంచలనమే సృష్టించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో 20 ఏళ్ల ఈ లాత్వియా క్రీడాకారిణి మహిళల సింగిల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో 1983లో మిమా జౌసోవెచ్ (యుగోస్లావియా) తర్వాత ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి అన్‌సీడెడ్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఒస్టాపెంకో 7–6 (7/4), 3–6, 6–3తో 30వ సీడ్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)పై గెలిచింది. గురువారమే తమ జన్మదినాన్ని నిర్వహించుకున్న ఒస్టాపెంకో, బాసిన్స్కీలు హోరాహోరీగా పోరాడినా తుదకు ఒస్టాపెంకోనే విజయం వరించింది. రెండో సెమీఫైనల్లో మూడో సీడ్ హలెప్ (రొమేనియా) 6–4, 3–6, 6–3తో రెండో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది. -
శభాష్.. బోపన్న
►ఫ్రెంచ్ ఓపెన్ ‘మిక్స్డ్’ టైటిల్ కైవసం ►దబ్రోవ్స్కీతో కలసి చాంపియన్‌గా నిలిచిన భారత ప్లేయర్ ►కెరీర్లో తొలిగ్రాండ్‌స్లామ్ టైటిల్ పారిస్: భారత డబుల్స్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న కెరీర్లో అపూర్వ విజయం సాధించాడు. కెనడా క్రీడాకారిణి గాబ్రియేలా దబ్రోవ్స్కీతో కలసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. బోపన్న కెరీర్లో ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. పోరాడి నెగ్గిన బోపన్న జంట.. ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్‌లో భాగంగా గురువారం జరిగిన ఫైనల్లో ఏడోసీడ్ బోపన్న జంట 2–6, 6–2, 12–10తో అన్నా లీనా గ్రోన్‌ఫెల్డ్(జర్మీనీ)– రాబెర్ట్ ఫరా (కొలంబియా)పై సంచలన విజయం సాధించింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు మ్యాచ్పాయింట్లను కాచుకుని మరీ ఇండో–కెనడియన్ జంట విజేతగా నిలవడం విశేషం. కెరీర్లో రెండోగ్రాండ్స్లామ్ ఆడుతున్న బోపన్న.. మిక్సడ్లో మాత్రం తొలిసారే చాంపియన్‌గా నిలిచాడు. తొలిసెట్ ఆరంభ గేమ్‌ల్లో ఇరుజోడీలు తమ సర్వీస్‌ను నిలబెట్టుకున్నారు. అయితే మూడోగేమ్‌లో బోపన్న జంట సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫరా జంట.. 2–1తో ఆధిక్యంలో నిలిచింది. అనంతరం ఏడోగేమ్లోనూ మరోసారి బోపన్న జంట సర్వీస్‌ను బ్రేక్ చేసి 5–2తో ఆధిక్యంలో నిలిచింది. అదే జోరులో కేవలం 22 నిమిషాల్లో తొలిసెట్‌ను కైవసం చేసుకుంది. రెండోసెట్ ఆరంభంలోనూ బోపన్న జంట కుదరుకోలేదు. మూడోగేమ్‌లో ప్రత్యర్థి దూకుడుగా ఆడడంతో బోపన్న జంట సర్వీస్‌ను కోల్పోయి 1–2తో వెనుకంజలో నిలిచింది. తర్వాతి గేమ్ నుంచి ఇండో–కెనడియన్ జంట తమ సిసలైన ఆటతీరును ప్రదర్శించింది. వరుసగా మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసింది. సుదీర్ఘంగా సాగిన ఎనిమిదో గేమ్‌లో ఓ బ్రేక్ పాయింట్ అవకాశాన్ని చేజార్చుకున్న బోపన్న జంట.. వెంటనే దూకుడుగా ఆడి సెట్‌ను కైవసం చేసుకుంది. దీంతో 1–1 సెట్లతో మ్యాచ్ సమమైంది. ఈ క్రమంలో మ్యాచ్ సూపర్ టైబ్రేకర్‌కు దారి తీసింది. ఈ సెట్ ఆరంభంలో 3–0తో ముందంజలో నిలిచిన ఇండో–కెనడియన్ జోడీ.. అనంతరం ఒత్తిడికి లోనైంది. ఈ దశలో ప్రత్యర్థి పుంజుకుని వరుసగా ఐదు పాయింట్లు సాధించి 5–3తో ముందంజలో నిలిచింది. ఈ క్రమంలో బోపన్న జంట మరోసారి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వరుసగా మూడు పాయింట్లు సాధించి 6–5తో ముందంజలో నిలిచింది. అనంతరం ఫరా జోడీ పుంజుకుని మరో మూడు పాయింట్లు సాధించడంతో 8–6తో మ్యాచ్ ఉత్కంఠస్థితిలో నిలిచింది. ఈ దశలో ఇరుజోడీలు తీవ్రంగా పోరాడడంతో మ్యాచ్‌లో ఆధిక్యం చాలాసార్లు మారుతూ వచ్చింది. చివరికి 10–10తో మ్యాచ్ సమంగా ఉన్న దశలో వరుసగా రెండుపాయింట్లు సాధించిన బోపన్న–దబ్రోవ్‌స్కీ జంట సెట్‌తోపాటు చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. -
బోపన్న సాధించాడు..
పారిస్: భారత టెన్నిస్ సంచలనం రోహన్ బోపన్న తన కెరీర్ లో నూతన అధ్యాయాన్ని లిఖించాడు. ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ను సాధించడం ద్వారా కొత్త చరిత్రను సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్ లో భాగంగా మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్లో గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా)తో కలిసి టైటిల్ ను చేజిక్కించుకున్నాడు. గురువారం జరిగిన తుది పోరులో రోహన్ బోపన్న- దబౌస్కీ జోడి 2-6, 6-2, 12-10 తేడాతో అనాలెనా గ్రోన్‌ఫెల్డ్ (జర్మనీ)–రాబర్ట్ ఫరా (కొలంబియా)పై గెలిచి టైటిల్ ను సొంతం చేసుకున్నారు. హోరాహోరీగా జరిగిన పోరులో అత్యంత ఆత్మవిశ్వాసం కనబరిచిన బోపన్న-దబౌస్కీ జోడి కడవరకూ పోరాడి టైటిల్ ను సాధించారు. తొలి సెట్ ను కోల్పోయినప్పటికీ, ఆ తరువాత రెండు సెట్లలో ఈ జోడి చెలరేగి ఆడింది. ప్రధానంగా చివరి సెట్ మాత్రం నువ్వా-నేనా అన్న రీతిలో ఉత్కంఠభరింతగా సాగింది. అయితే ఒత్తిడిన అధిగమించిన బోపన్న జోడి చివరకు విజేతగా నిలిచింది. తాజా టైటిల్ తో భారత దిగ్గజ టెన్నిస్ ఆటగాళ్ల జాబితాలో బోపన్న చేరిపోయాడు. అంతకుముందు భారత తరపున లియాండర్, మహేశ్ భూపతి, సానియా మీర్జాలకు మాత్రమే గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను సాధించగా, ఆ తరువాత స్థానంలో బోపన్న నిలిచాడు. 2010లో తొలిసారి యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ లో ఫైనల్ కు చేరిన బోపన్న.. అప్పుడు గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సాధించడంలో విఫలమయ్యాడు. -
జొకోవిచ్‌కు షాక్
⇒క్వార్టర్స్‌లోనే ఓడిన డిఫెండింగ్ చాంపియన్ ⇒థీమ్ చేతిలో పరాజయం పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో పెను సంచలనం నమోదైంది. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్, నోవాక్ జొకోవిచ్ (సెర్బియా) కథ క్వార్టర్స్‌లోనే ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో రెండోసీడ్ జొకోవిచ్ 6–7, 3–6, 0–6తో ప్రపంచ ఏడో ర్యాంకర్, ఆరోసీడ్, డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. రెండుగంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోయాడు. తొలిగేమ్‌లో ఇరువురు చెరో రెండుసార్లు సర్వీస్ కోల్పోవడంతో మ్యాచ్ టై బ్రేకర్‌కు దారి తీసింది. ఇందులో కీలకదశలో విజృంభించిన థీమ్.. తొలిసెట్‌ను 74 నిమిషాల్లో కైవసం చేసుకున్నాడు. ఇక రెండోసెట్లో దూకుడు పెంచిన ఆస్ట్రియా ప్లేయర్.. రెండోగేమ్‌లోనే జొకోవిచ్ సర్వీస్ బ్రేక్ చేసి 2–0తో ఆధిక్యంలోకి వచ్చాడు. అనంతరం అదే జోరులో సెట్‌ను తన వశం చేసుకున్నాడు. ఇక నిర్ణయాత్మక మూడోగేమ్‌లో సెర్బియన్స్టార్ ఆటతీరు పూర్తిగా గాడితప్పింది. వరుసగా మూడు సార్లు తన సర్వీస్ కోల్పోవడంతో కనీసం ఒక్క గేమ్ కూడా నెగ్గకుండా సెట్‌తోపాటు మ్యాచ్‌ను కోల్పోయాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో రెండు ఏస్‌లు, 38 విన్నర్లు ఆడిన థీమ్.. తొలి సర్వీస్‌లోనే 74 శాతం పాయింట్లను గెలుపొందడం విశేషం. మరోవైపు మూడు డబుల్ఫాల్టులు, 35 అనవసర తప్పిదాలు చేసిన జొకో.. తనకు లభించిన 6 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో కేవలం రెండింటిని మాత్రమే సద్వినయోగం చేసుకుని భంగపడ్డాడు. సెమీస్‌లో తొమ్మిదిసార్లు చాంపియన్, నాలుగోసీడ్ రఫెల్ నాదల్(స్పెయిన్)తో థీమ్ తలపడనున్నాడు. మరో క్వార్టర్స్ ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాదల్ 6–2, 2–0తో ఆధిక్యంలో ఉండగా.. ప్రత్యర్థి పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్) గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. సెమీస్‌లో ప్లిస్కోవా, హలెప్ మహిళల సింగిల్స్‌లో రెండోసీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్‌రిపబ్లిక్), మూడోసీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) సెమీస్‌లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్, ప్లిస్కోవా 7–6, 6–4తో 28వ సీడ్, స్థానిక ప్లేయర్ కరోలిన్ గార్సియాపై విజయం సాధించింది. మరో క్వార్టర్స్‌లో ప్రపంచ నాలుగోర్యాంకర్, హలెప్ 3–6, 7–6, 6–0తో ప్రపంచ ఆరో ర్యాంకర్, ఐదో సీడ్, ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలుపొందింది. రెండుగంటలకుపైగా జరిగిన ఈమ్యాచ్‌లో రెండోసెట్ టైబ్రేకర్‌లో ఓ మ్యాచ్పాయింట్ను కాచుకున్న హలెప్.. తర్వాతి సెట్లో విజృంభించింది. మూడోసెట్లో ప్రత్యర్థి సర్వీస్‌ను వరుసగా మూడుసార్లు బ్రేక్‌చేసి సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. సెమీస్‌లో ప్లిస్కోవాతో హలెప్ తలపడనుంది. -
మ్లాడెనోవిచ్‌కు చుక్కెదురు
సెమీస్‌లో బాసిన్‌స్కీ, ఒస్టాపెంకో పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో 30వ సీడ్ తిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్), అన్‌సీడెడ్ క్రీడాకారిణి ఒస్టాపెంకో (లాత్వియా) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో బాసిన్‌స్కీ 6–4, 6–4తో 13వ సీడ్ క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)ను బోల్తా కొట్టించగా... ఒస్టాపెంకో 4–6, 6–2, 6–2తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, 11వ సీడ్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించింది. గురువారం జరిగే సెమీఫైనల్లో బాసిన్స్కీతో ఒస్టాపెంకో తలపడుతుంది. యాదృచ్చికంగా గురువారమే వీరిద్దరి పుట్టినరోజు కావడం విశేషం. ప్రిక్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, నాలుగో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)ను ఓడించిన మ్లాడెనోవిచ్ క్వార్టర్ ఫైనల్లో మాత్రం తడబడి మూల్యం చెల్లించుకుంది. అంతకుముందు మంగళవారం వర్షం కారణంగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లకు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. దాంతో నాలుగు క్వార్టర్ ఫైనల్స్‌కు బదులుగా రెండు మాత్రమే సాధ్యమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం మంగళవారమే రాఫెల్ నాదల్ (స్పెయిన్), కరెనో బుస్టా (స్పెయిన్); జొకోవిచ్ (సెర్బియా), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ల మధ్య పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరగాల్సింది. అయితే ఈ రెండు క్వార్టర్ ఫైనల్స్‌ను బుధవారానికి వాయిదా వేశారు. -
వావ్రింకా, ముర్రే జోరు
క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశం ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ పారిస్: మ్యాచ్ మ్యాచ్‌కూ తన ఆటతీరును మెరుగుపర్చుకుంటున్న మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్)... ప్రపంచ నంబర్‌వన్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ వావ్రింకా 7–5, 7–6 (9/7), 6–2తో 15వ సీడ్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై గెలుపొందగా... టాప్ సీడ్ ముర్రే 6–3, 6–4, 6–4తో ఖచనోవ్ (రష్యా)ను ఓడించాడు. మోన్ఫిల్స్తో రెండు గంటల 43 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో వావ్రింకా ఐదు బ్రేక్ పాయింట్లు సాధించాడు. మోన్ఫిల్స్ ఓటమితో ఈ టోర్నీలో ఫ్రాన్స్ ఆటగాళ్ల పోరాటం ముగిసింది. 1983లో యానిక్ నోవా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచాక... 1988లో హెన్రీ లెకొంటె ఫైనల్‌కు చేరిన తర్వాత ఇప్పటివరకు ఈ టోర్నీలో ఫ్రాన్స్ నుంచి మరో క్రీడాకారుడు ఫైనల్‌కు చేరలేకపోయాడు. గతేడాది రన్నరప్‌గా నిలిచిన ముర్రే తాజా విజయంతో తన కెరీర్లో 650 విజయాలు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 15వ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. మరోవైపు ఏడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా), ఎనిమిదో సీడ్ కీ నిషికోరి (జపాన్), డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), ఆరో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) కూడా క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నిషికోరి 0–6, 6–4, 6–4, 6–0తో వెర్డాస్కో (స్పెయిన్)పై, జొకోవిచ్ 7–6 (7/5), 6–1, 6–3తో రామోస్ వినోలాస్ (స్పెయిన్)పై, థీమ్ 6–1, 6–3, 6–1తో జెబలాస్ (అర్జెంటీనా)పై నెగ్గగా... సిలిచ్ 6–3, 3–0తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి అండర్సన్ (దక్షిణాఫ్రికా) గాయంతో వైదొలిగాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో నిషికోరితో ముర్రే; సిలిచ్‌తో వావ్రింకా; కరెనో బుస్టాతో నాదల్; థీమ్‌తో జొకోవిచ్ తలపడతారు. సానియా జంట ఓటమి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా) జంట సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ బోపన్న–దబ్రౌస్కీ ద్వయం 6–3, 6–4తో రెండో సీడ్ సానియా మీర్జా (భారత్)–డోడిగ్ (క్రొయేషియా) జోడీపై గెలిచింది. క్వార్టర్స్‌లో ప్లిస్కోవా, హలెప్ మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), మూడో సీడ్ హలెప్ (రొమేనియా), 28వ సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్), ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్స్‌లో హలెప్ 6–1, 6–1తో నవారో (స్పెయిన్)పై, స్వితోలినా 4–6, 6–3, 7–5తో మార్టిక్ (క్రొయేషియా)పై, గార్సియా 6–2, 6–4తో అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్)పై, ప్లిస్కోవా 2–6, 6–3, 6–4తో వెరోనికా (పరాగ్వే)పై గెలిచారు. -
సంచలనాల మోత
►డిఫెండింగ్ చాంపియన్ ముగురుజాపై మ్లాడెనోవిచ్ అద్భుత విజయం ►వీనస్, రావ్‌నిచ్ ఇంటిముఖం పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆదివారం సంచలనాల మోత మోగింది. మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)... ఎనిమిదో సీడ్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా)... పదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా)... పురుషుల సింగిల్స్ విభాగంలో ఐదో సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ అమ్మాయి, 13వ సీడ్ క్రిస్టినా మ్లాడెనోవిచ్ అద్వితీయ ఆటతీరును కనబరిచి 6–1, 3–6, 6–3తో ముగురుజాను మట్టి కరిపించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మ్లాడెనోవిచ్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. ఇతర మ్యాచ్‌ల్లో మాజీ నంబర్‌వన్ వొజ్నియాకి (డెన్మార్క్) 6–1, 4–6, 6–2తో 2009 చాంపియన్ కుజ్నెత్సోవాను... 30వ సీడ్ తిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) 5–7, 6–2, 6–1తో వీనస్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను దక్కించుకున్నారు. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–1తో వితోఫ్ట్ (జర్మనీ)పై, ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 7–5తో లినెట్టా (పోలాండ్)పై గెలిచారు. నాదల్ జోరు... పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 6–1, 6–2, 6–2తో బాటిస్టా అగుట్ (స్పెయిన్)ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మరోవైపు 20వ సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్) 4–6, 7–6 (7/2), 6–7 (6/8), 6–4, 8–6తో మిలోస్ రావ్నిచ్పై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో నాదల్‌తో అమీతుమీకి సిద్ధమయ్యాడు. మిక్స్డ్ క్వార్టర్స్‌లో సానియా జంట పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో బోపన్న (భారత్)–క్యువాస్ (ఉరుగ్వే) జంట 6–7 (5/7), 2–6తో జేమీ ముర్రే (బ్రిటన్)–సోరెస్ (బ్రెజిల్) జోడీ చేతి లో... దివిజ్ శరణ్–పురవ్ రాజా (భారత్) ద్వయం 6–4, 6–7 (5/7), 2–6తో హారిసన్ (అమెరికా)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో సానియా మీర్జా (భారత్)–డోడిగ్ (క్రొయేషియా) జంట 6–2, 6–4తో స్వితోలినా (ఉక్రెయిన్)–సితాక్ (న్యూజిలాండ్) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
ప్రిక్వార్టర్స్‌లో ముర్రే
పారిస్: ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. శనివారం జరిగిన మూడో రౌండ్లో ముర్రే 7–6 (10/8), 7–5, 6–0తో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా)పై గెలిచాడు. ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7–6 (7/2), 6–0, 6–2తో ఫాగ్నిని (ఇటలీ)పై, ఏడో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6–1, 6–3, 6–3తో లోపెజ్ (స్పెయిన్)పై, వెర్డాస్కో (స్పెయిన్) 6–2, 6–1, 6–3తో 22వ సీడ్ క్యువాస్ (ఉరుగ్వే)పై నెగ్గారు. రద్వాన్‌స్కా అవుట్...: మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో తొమ్మిదో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా 2–6, 1–6తో అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో 11వ సీడ్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్) 6–2, 2–6, 6–3తో బెలిస్ (అమెరికా)పై, మూడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) 6–0, 7–5తో కసత్కినా (రష్యా)పై, కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–4, 4–6, 9–7తో సు వీ సెయి (చైనీస్ తైపీ)పై గెలిచారు. -
గట్టెక్కిన జొకోవిచ్
ఐదు సెట్ల పోరులో విజయం ► ఎదురులేని నాదల్ ► ఫ్రెంచ్ ఓపెన్ పారిస్: కొత్త కోచ్ అగస్సీ పర్యవేక్షణలో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ఆడుతోన్న డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు శుక్రవారం కఠిన పరీక్ష ఎదురైంది. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో రెండో సీడ్ జొకోవిచ్ 5–7, 6–3, 3–6, 6–1, 6–1తో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)పై కష్టపడి గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 3 గంటల 18 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఏకంగా 55 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. మరోవైపు నాలుగో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఐదో సీడ్ రావ్‌నిచ్ (కెనడా), ఆరో సీడ్ థీమ్ (ఆస్ట్రియా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో నాదల్ 6–0, 6–1, 6–0తో బాసిలాష్విలి (జార్జియా)ను చిత్తుగా ఓడించగా... థీమ్ 6–1, 7–6 (7/4), 6–3తో జాన్సన్ (అమెరికా)పై గెలుపొందాడు. రావ్‌నిచ్ 6–1, 1–0తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి లోపెజ్ (స్పెయిన్) గాయంతో వైదొలిగాడు. అయితే 11వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా), పదో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) మూడో రౌండ్లో ఇంటిదారి పట్టారు. దిమిత్రోవ్ 5–7, 3–6, 4–6తో కరెనో బుస్టా (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. జెబలాస్ (అర్జెంటీనా)తో జరిగిన మ్యాచ్‌లో గాఫిన్ 5–4తో ఆధిక్యంలో ఉన్నపుడు కోర్టులో జారిపడ్డాడు. కాలికి గాయం కావడంతో గాఫిన్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. ముగురుజా ముందుకు... మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ముగురుజా (స్పెయిన్) మూడో రౌండ్లో 7–5, 6–2తో పుతింత్సెవా (కజకిస్తాన్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో 13వ సీడ్ మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) 7–5, 4–6, 8–6తో షెల్బీ రోజర్స్ (అమెరికా)పై, 23వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) 6–2, 6–2తో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)పై గెలిచారు. బోపన్న జంట గెలుపు పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–క్యువాస్ (ఉరుగ్వే) 5–7, 7–6 (7/4), 6–4తో ట్రీట్ హుయె (ఫిలిప్పీన్స్)–ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్)లపై... దివిజ్ శరణ్–పురవ్ రాజా (భారత్) 6–4, 3–6, 6–4తో మరాచ్ (ఆస్ట్రియా)–పావిక్ (క్రొయేషియా)లపై గెలుపొందగా... లియాండర్ పేస్ (భారత్)–స్కాట్ లిప్స్కీ (అమెరికా) 6–7 (3/7), 2–6తో మరెరో–రొబ్రెడో (స్పెయిన్)ల చేతిలో ఓడిపోయారు. పేస్–హింగిస్ జోడీకి షాక్ మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్స్ లియాండర్ పేస్–మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట 4–6, 6–1, 2–10తో సూపర్ టైబ్రేక్‌లో క్లాసెన్ (దక్షిణాఫ్రికా)–స్రెబొత్నిక్ (స్లొవేనియా) జోడీ చేతిలో ఓడిపోయింది. సానియా మీర్జా (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంట 7–5, 6–3తో దరియా జురాక్–పావిక్ (క్రొయేషియా) జోడీపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. -
సానియా జంటకు షాక్
తొలి రౌండ్లోనే నిష్క్రమణ lబోపన్న, పేస్ జోడీలు ముందంజ పారిస్: కొత్త భాగస్వామి యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్)తో కలిసి తొలి గ్రాండ్‌స్లామ్ ఆడుతోన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ ఇండో–కజక్ ద్వయం అనూహ్యంగా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. దరియా గావ్రిలోవా (ఆస్ట్రేలియా)–అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా) జంటతో బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా–ష్వెదోవా జంట 6–7 (5/7), 6–1, 2–6తో ఓటమి పాలైంది. 2 గంటల 23 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ రెండు డబుల్ ఫాల్ట్‌లు చేయడంతోపాటు తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో భారత స్టార్స్ లియాండర్ పేస్, రోహన్ బోపన్న తమ వేర్వేరు భాగస్వాములతో కలిసి శుభారంభం చేశారు. తొలి రౌండ్లో పేస్–స్కాట్ లిప్స్కీ (అమెరికా) జంట 7–6 (7/5), 4–6, 6–2తో హైయోన్ చుంగ్ (దక్షిణ కొరియా)–అల్బోట్ (మాల్డోవా) ద్వయంపై గెలిచింది. తొమ్మిదో సీడ్ రోహన్ బోపన్న–క్యువాస్ (ఉరుగ్వే) జోడీ 6–1, 6–1తో మథియాస్ బుర్గ్యూ–పాల్ హెన్రీ మథియు (ఫ్రాన్స్) జంటపై విజయం సాధించింది. -
లైవ్ ప్రసారంలో యాంకర్‌కు ముద్దిచ్చాడు!
టెన్నిస్ ఆటగాడిపై నిషేధం! ఫ్రెంచ్ టెన్నిస్ ఆటగాడు మాక్సిమ్ హమౌపై ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ నిర్వాహకులు నిషేధం విధించారు. లైవ్ ప్రసారంలో ఓ టీవీ యాంకర్‌ను ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ముద్దాడి అసభ్యంగా ప్రవర్తించడంతో టోర్నీలో పాల్గొనకుండా అతన్ని బహిష్కరించారు. 21 ఏళ్ల హమౌ ప్రవర్తన చాలా అసభ్యంగా ఉందని నిర్వాహకులు మండిపడ్డారు. సోమవారం ఫస్ట్‌రౌండ్ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత హమౌను యూరోస్పోర్ట్ మహిళా జర్నలిస్టు మేలీ థామస్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆమె భుజాల చుట్టు చేయి వేసి అతి చనువుగా వ్యవహరించిన హమౌ.. ఆమె వద్దంటున్న బలవంతంగా పలుసార్లు ముద్దు పెట్టుకున్నాడు. అతని ప్రవర్తనతో ఆమె బిత్తరపోయింది. లైవ్ ప్రసారం కాకపోయి ఉంటే హమౌ చెంప ఛెళ్లుమనిపించేదానినని ఆమె తర్వాత మీడియాకు తెలిపింది. దీంతో ప్రపంచ 287వ ర్యాంకు ఆటగాడు అయిన హమౌ గుర్తింపును రద్దుచేసి.. పూర్తిగా టోర్నమెంటు నుంచి నిషేధిస్తున్నామని ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. -
చాంపియన్స్ అలవోకగా...
జొకోవిచ్, ముగురుజా శుభారంభం ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ పారిస్: పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో డిఫెండింగ్ చాంపియన్స్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), గార్బిన్ ముగురుజా (స్పెయిన్) అలవోక విజయాలతో ఫ్రెంచ్ ఓపెన్‌లో శుభారంభం చేశారు. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–2తో గ్రానోలెర్స్ (స్పెయిన్)పై... నాలుగో సీడ్ ముగురుజా 6–4, 6–2తో షియవోని (ఇటలీ)పై గెలిచారు. అమెరికా టెన్నిస్ దిగ్గజం ఆండ్రీ అగస్సీని కోచ్‌గా నియమించుకున్నాక ఆడుతున్న తొలి టోర్నీలో జొకోవిచ్ ఆకట్టుకున్నాడు. 2 గంటల 27 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఐదు ఏస్‌లు సంధించాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసి... తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు. 30 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ 29 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు రికార్డుస్థాయిలో పదో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌పై కన్నేసిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ తొలి అడ్డంకిని సాఫీగా అధిగమించాడు. గతంలో తొమ్మిదిసార్లు చాంపియన్‌గా నిలిచిన నాలుగో సీడ్ నాదల్ తొలి రౌండ్లో 6–1, 6–4, 6–1తో బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)ను ఓడించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ రావ్‌నిచ్ (కెనడా) 6–3, 6–4, 6–2తో డార్సిస్ (బెల్జియం)పై, ఏడో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6–3, 6–3, 6–3తో గుల్బిస్ (లాత్వియా)పై, పదో సీడ్ గాఫిన్ (బెల్జియం) 6–2, 6–2, 6–2తో మథియు (ఫ్రాన్స్)పై గెలిచారు. అయితే 14వ సీడ్ జాక్ సోక్ (అమెరికా) 5–7, 5–7, 3–6తో వెసిలీ (చెక్ రిపబ్లిక్) చేతిలో, 32వ సీడ్ మిషా జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 5–7, 2–6, 2–6తో నపోలితానో (ఇటలీ) చేతిలో తొలి రౌండ్లోనే ఓడి ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 7–5, 6–2తో జెంగ్ (చైనా)పై, రెండో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 11వ సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్) 6–4, 3–6, 6–2తో ఫోర్లిస్ (ఆస్ట్రేలియా)పై, 13వ సీడ్ మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) 3–6, 6–3, 9–7తో బ్రాడీ (అమెరికా)పై నెగ్గారు. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా (భారత్)–ష్వెదోవా (కజకిస్తాన్) జంటకు నాలుగో సీడింగ్ లభించింది. తొలి రౌండ్లో ఈ ఇండో–కజక్ ద్వయం గావ్రిలోవా (ఆస్ట్రేలియా)–పావ్లీచెంకోవా (రష్యా) జోడీతో ఆడుతుంది. -
అయ్యో... కెర్బర్
► తొలి రౌండ్లోనే ఓడిన టాప్ సీడ్ ► మకరోవా అద్భుత ప్రదర్శన పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ పెను సంచలనంతో ప్రారంభమైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ క్రీడాకారిణి ఎంజెలిక్ కెర్బర్ ఊహించనిరీతిలో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. రష్యా అన్‌సీడెడ్ ప్లేయర్ ఎకతెరీనా మకరోవా అద్వితీయ ఆటతీరుకు కెర్బర్ చేతులెత్తేసింది. ఈ క్రమంలో టాప్ సీడ్ హోదాలో ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన మొదటి క్రీడాకారిణిగా కెర్బర్ గుర్తింపు పొందింది. గతంలో టాప్ సీడ్ హోదాలో హెనిన్ (బెల్జియం) 2004లో, సెరెనా (అమెరికా) 2014లో రెండో రౌండ్లో వెనుదిరిగారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 40వ ర్యాంకర్ మకరోవా 6–2, 6–2తో కెర్బర్‌ను చిత్తు చేసి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ‘ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే టాప్ సీడ్ క్రీడాకారిణిని ఓడించిన తొలి ప్లేయర్‌గా నేను చరిత్ర సృష్టించానన్న విషయం తెలియగానే నమ్మలేకపోయాను’ అని మకరోవా వ్యాఖ్యానించింది. గంటా 22 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మకరోవా ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. 27 విన్నర్స్ కొట్టిన ఆమె, నెట్ వద్దకు 16 సార్లు దూసుకొచ్చి 12 సార్లు పాయింట్లు గెలిచింది. గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించి, వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచిన కెర్బర్‌కు ఈ ఏడాది కలిసి రావడంలేదు. తాజా సీజన్లో ఆమె 19 మ్యాచ్‌ల్లో గెలిచి, 13 మ్యాచ్‌ల్లో ఓడిపోవడం గమనార్హం. మరోవైపు కెర్బర్‌కు ముందు నాలుగుసార్లు మాత్రమే టాప్ సీడ్ క్రీడాకారిణులు ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో తొలి రౌండ్లో ఓడిపోవడం జరిగింది. గతంలో టాప్ సీడ్ హోదాలో రుజుకి (1979 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో), స్టెఫీ గ్రాఫ్ (1994 వింబుల్డన్‌లో), మార్టినా హింగిస్ (1999, 2001 వింబుల్డన్‌లో) తొలి రౌండ్లో ఓడిపోయారు. ఆకట్టుకున్న క్విటోవా: గత డిసెంబరులో తన ఇంట్లో ఆగంతకుడి కత్తి దాడిలో చేతికి గాయమై ఆటకు దూరమైన పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) ఫ్రెంచ్ ఓపెన్‌తో పునరాగమనం చేసింది. తొలి రౌండ్లో క్విటోవా 6–3, 6–2తో జూలియా బోసెరప్ (అమెరికా)పై అలవోకగా గెలిచి శుభారంభం చేసింది. ‘గత వారంలోనే నేను ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడాలని నిర్ణయం తీసుకున్నాను. కష్టకాలంలో నాకు మద్దతుగా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు’ అని క్విటోవా వ్యాఖ్యానించింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ కుజ్నెత్సోవా (రష్యా) 7–5, 6–4తో మెక్‌హాలె (అమెరికా)పై పదో సీడ్ వీనస్ (అమెరికా) 6–4, 7–6 (7/3)తో కియాంగ్ (చైనా)పై గెలిచారు. థీమ్ శుభారంభం: పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఆరో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–4, 6–0, 6–2తో టామిక్ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. 11వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6–2, 6–3, 6–4తో రాబర్ట్ (ఫ్రాన్స్)పై, 23వ సీడ్ కార్లోవిచ్ (క్రొయేషియా) 7–6 (7/5), 7–5, 6–4తో సిట్సిపాస్ (గ్రీస్)పై గెలుపొందారు. -
‘ఫ్రెంచ్’ కిరీటమెవరిదో?
♦ నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ♦ ఫేవరెట్స్‌గా నాదల్, జొకోవిచ్ పారిస్: తనకెంతో కలిసొచ్చిన చోట పదోసారి పాగా వేయాలని రాఫెల్ నాదల్... ప్రతికూల పరిస్థితులను అధిగమించి విజయాలబాట పట్టాలని నొవాక్ జొకోవిచ్... అందరి అంచనాలను తలకిందులు చేసి విజేతగా అవతరించాలని యువ తారలు అలెగ్జాండర్ జ్వెరెవ్, డొమినిక్ థీమ్... క్లే కోర్టులపై కూడా గొప్పగా రాణించే సత్తా ఉందని నిరూపించుకోవాలని బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే... అవకాశం వస్తే రెండోసారి టైటిల్ సొంతం చేసుకోవాలని స్విస్ నంబర్‌వన్ వావ్రింకా... ఇలా ఒకరికంటే ఎక్కువ ఫేవరెట్స్‌తో ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. నేడు (ఆదివారం) మొదలయ్యే ఈ టోర్నీ జూన్ 11న జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్‌తో ముగుస్తుంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్కు అద్వితీయమైన రికార్డు ఉంది. ఈ టోర్నీలో 12 సార్లు పాల్గొన్న నాదల్ తొమ్మిదిసార్లు విజేతగా నిలిచాడు. 2009లో ప్రిక్వార్టర్ ఫైనల్లో, 2015లో క్వార్టర్ ఫైనల్లో, 2016లో మూడో రౌండ్లో అతను నిష్క్రమించాడు. ఈ ఏడాది క్లే కోర్టు సీజన్లో మూడు టైటిల్స్ సాధించి జోరుమీదున్న నాదల్కు డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా)తోపాటు యువ తారలు జ్వెరెవ్ (జర్మనీ), థీమ్ (ఆస్ట్రియా) నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది. ‘డ్రా’ ప్రకారం నాదల్కు సెమీఫైనల్లో జొకోవిచ్ ఎదురుకావొచ్చు. ఈ సీజన్లో రోమ్ ఓపెన్‌లో జొకోవిచ్‌ను ఓడించి జ్వెరెవ్ టైటిల్ సాధించగా... ఇదే టోర్నీ క్వార్టర్ ఫైనల్లో నాదల్‌పై థీమ్ సంచలన విజయం సాధించి తమను తక్కువ అంచనా వేయొద్దని సంకేతాలు పంపించారు. శనివారం ముగిసిన జెనీవా ఓపెన్‌లో వావ్రింకా (స్విట్జర్లాండ్) తన టైటిల్‌ను నిలబెట్టుకొని ఫ్రెంచ్ ఓపెన్‌లో పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగనున్నాడు. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఆండీ ముర్రే ఫామ్‌లో లేకపోయినా అతడిని తక్కువ అంచనా వేసే ప్రసక్తి లేదు. సెరెనా విలియమ్స్, షరపోవా గైర్హాజరీలో మహిళల సింగిల్స్ విభాగంలో కచ్చితమైన ఫేవరెట్ కనిపించడంలేదు. నంబర్‌వన్ కెర్బర్ (జర్మనీ), డిఫెండింగ్ చాంపియన్ ముగురుజా (స్పెయిన్)లతోపాటు మూడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), రెండో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), 13వ సీడ్ మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) టైటిల్ రేసులో ఉన్నారు. అభిమన్యుకు వైల్డ్ కార్డు: భారత యువ ఆటగాడు వన్నెంరెడ్డి అభిమన్యు ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ బాలుర సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో పాల్గొనేందుకు ‘వైల్డ్ కార్డు’ సంపాదించాడు. శనివారం జరిగిన రాండీవూ ఈవెంట్ ఫైనల్లో బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల అభిమన్యు 6–1, 4–6, 6–1తో హికారు షిరైషి (జపాన్)పై గెలిచి ఈ ఘనత సాధించాడు. -
నాదల్కు అడ్డుగా జొకోవిచ్!
►ఒకే పార్శ్వంలో మాజీ విజేత, డిఫెండింగ్ చాంపియన్ ►ఇద్దరూ సెమీస్‌లో తలపడే అవకాశం ►ఫ్రెంచ్ ఓపెన్ ‘డ్రా’ విడుదల పారిస్: రికార్డుస్థాయిలో పదోసారి ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ నెగ్గాలంటే స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ మరోసారి తన అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఆదివారం మొదలయ్యే సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌కు సంబంధించిన ‘డ్రా’ను శుక్రవారం విడుదల చేశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), తొమ్మిదిసార్లు విజేత రాఫెల్ నాదల్ ఒకే పార్శ్వంలో ఉన్నారు. ఫలితంగా ఈ ఇద్దరూ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటితే సెమీఫైనల్లో ముఖాముఖిగా తలపడతారు. ఈ టోర్నీ చరిత్రలో నాదల్ గెలుపోటముల రికార్డు 72–2గా ఉంది. గాయం కారణంగా గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ మధ్యలోనే నిష్క్రమించిన నాదల్ ఈసారి క్లే కోర్టు సీజన్లో మోంటెకార్లో మాస్టర్స్, బార్సిలోనా ఓపెన్, మాడ్రిడ్ ఓపెన్ టైటిల్స్ గెలిచి జోరుమీదున్నాడు. తొలి రౌండ్లో బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)తో ఆడనున్న నాదల్కు మూడో రౌండ్లో సిమోన్ (ఫ్రాన్స్), క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ రావ్‌నిచ్ (కెనడా) ఎదురయ్యే అవకాశముంది. మరో పార్శ్వంలో టాప్ సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్), మాజీ చాంపియన్, మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) ఉన్నారు. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత పూర్తి చేసుకున్న జొకోవిచ్ ఈసారి తొలి రౌండ్లో గ్రానోలెర్స్ (స్పెయిన్)తో ఆడతాడు. ఈ సీజన్లో గొప్ప విజయాలు సాధించలేకపోయిన జొకోవిచ్ తాజాగా అమెరికా టెన్నిస్ దిగ్గజం ఆండ్రీ అగస్సీని కొత్త కోచ్‌గా నియమించుకొని ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగుతున్నాడు. మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్), టాప్ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) ఒకే పార్శ్వంలో ఉన్నారు. వీరిద్దరూ సెమీఫైనల్లో తలపడే అవకాశముంది. తొలి రౌండ్లో మకరోవా (రష్యా)తో కెర్బర్; షియవోని (ఇటలీ)తో ముగురుజా ఆడతారు.