ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయిన స్పెయిన్ దిగ్గజం
జర్మనీ స్టార్ జ్వెరెవ్ సంచలనం
పారిస్: తరచూ గాయాలబారిన పడటం... పూర్తిస్థాయి ఫిట్‌నెస్ లేకపోవడం... వెరసి మట్టికోర్టులపై మకుటంలేని మహరాజుగా వెలుగొందిన స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్‌కు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ఊహించని పరాజయం ఎదురైంది.
2005 నుంచి ఈ టోర్నీలో ఆడుతూ ఏకంగా 14 సార్లు విజేతగా నిలిచిన 37 ఏళ్ల నాదల్ మొదటి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రపంచ నాలుగో ర్యాంకర్, గత మూడేళ్లుగా ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరిన జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ పక్కా ప్రణాళికతో ఆడి నాదల్ ఆట కట్టించాడు.
3 గంటల 5 నిమిషాలపాటు సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో జ్వెరెవ్ 6–3, 7–6 (7/5), 6–3తో నాదల్‌ను ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు నాదల్ సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. జ్వెరెవ్ సరీ్వస్‌ను కేవలం రెండుసార్లు బ్రేక్ చేసిన నాదల్ 30 అనవసర తప్పిదాలు కూడా చేశాడు. గాయం కారణంగా గత ఏడాది ఈ టోరీ్నకి దూరంగా ఉన్న నాదల్ తాజా ఓటమితో చివరిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడినట్లు భావించాలి.
సుమిత్ నగాల్ ఓటమి
ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి ఆడుతున్న భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ పోరాటం మొదటి రౌండ్‌లోనే ముగిసింది. ప్రపంచ 18వ ర్యాంకర్ ఖచనోవ్ (రష్యా)తో జరిగిన మ్యాచ్‌లో సుమిత్ 2–6, 0–6, 6–7 (5/7)తో ఓడిపోయాడు. మరోవైపు ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ (ఇటలీ) శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో సినెర్ 6–3, 6–3, 6–4తో యుబ్యాంక్స్ (అమెరికా)పై గెలిచాడు.
స్వియాటెక్ ముందంజ
మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్‌లో స్వియాటెక్ 6–1, 6–2తో లియోలియా జీన్‌జీన్ (ఫ్రాన్స్)పై గెలిచింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–1, 6–1తో జూలియా అవ్‌దీవా (రష్యా)పై, ఎనిమిదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీíÙయా) 6–3, 6–2తో సాచియా వికెరీ (అమెరికా)పై, ఐదో సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–3తో మసరోవా (స్పెయిన్)పై విజయం సాధించారు.
3: ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో నాదల్‌ను ఓడించిన మూడో ప్లేయర్‌గా జ్వెరెవ్ నిలిచాడు. గతంలో సోడెర్లింగ్ (స్వీడన్; 2009లో ప్రిక్వార్టర్స్‌లో) ఒకసారి... జొకోవిచ్ (సెర్బియా; 2015 క్వార్టర్ ఫైనల్లో, 2021 సెమీఫైనల్లో) రెండుసార్లు ఈ టోర్నీ లో నాదల్‌ను ఓడించారు. 2016లో గాయం కారణంగా నాదల్ మూడో రౌండ్ నుంచి వైదొలిగాడు.
3: గ్రాండ్‌స్లామ్ టోరీ్నలలో నాదల్ తొలి రౌండ్‌లో ఓడిపోవడం ఓవరాల్‌గా ఇది మూడోసారి మాత్రమే. ఇంతకుముందు నాదల్ 2016 ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో, 2013 వింబుల్డన్ టోర్నీలో తొలి రౌండ్‌లో ఓటమి పాలయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment