Alexander Zverev
-
US Open 2024: జ్వెరెవ్ శుభారంభం
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ జ్వెరెవ్ 6–2, 6–7 (5/7), 6–3, 6–2తో మాక్సిమిలన్ మార్టెరర్ (జర్మనీ)పై గెలుపొందాడు. 2 గంటల 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ 21 ఏస్‌లు సంధించాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి ప్రత్యర్థి సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు 2020 చాంపియన్ డొమినిక్ థీమ్ (ఆ్రస్టియా) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. 13వ సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) గంటా 50 నిమిషాల్లో 6–4, 6–2, 6–2తో థీమ్‌ను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) కష్టపడి రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్లో కిన్వెన్ జెంగ్ 4–6, 6–4, 6–2తో అనిసిమోవా (అమెరికా)పై గెలిచింది. 12వ సీడ్ దరియా కసత్కినా (రష్యా), 24వ సీడ్ డొనా వెకిచ్ (క్రొయేíÙయా), 27వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) కూడా తొలి రౌండ్లో గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మరోవైపు తొమ్మిదో సీడ్ మరియా సాకరి (గ్రీస్) గాయం కారణంగా తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. యఫాన్ వాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో సాకరి తొలి సెట్‌ను 2–6తో కోల్పోయింది. ఈ దశల గాయం కారణంగా సాకరి మ్యాచ్ నుంచి తప్పుకుంది. -
French Open 2024: నాదల్కు షాక్
పారిస్: తరచూ గాయాలబారిన పడటం... పూర్తిస్థాయి ఫిట్నెస్ లేకపోవడం... వెరసి మట్టికోర్టులపై మకుటంలేని మహరాజుగా వెలుగొందిన స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్కు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ఊహించని పరాజయం ఎదురైంది. 2005 నుంచి ఈ టోర్నీలో ఆడుతూ ఏకంగా 14 సార్లు విజేతగా నిలిచిన 37 ఏళ్ల నాదల్ మొదటి రౌండ్లోనే ఇంటిదారి పట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రపంచ నాలుగో ర్యాంకర్, గత మూడేళ్లుగా ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరిన జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ పక్కా ప్రణాళికతో ఆడి నాదల్ ఆట కట్టించాడు. 3 గంటల 5 నిమిషాలపాటు సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో జ్వెరెవ్ 6–3, 7–6 (7/5), 6–3తో నాదల్‌ను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు నాదల్ సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. జ్వెరెవ్ సరీ్వస్‌ను కేవలం రెండుసార్లు బ్రేక్ చేసిన నాదల్ 30 అనవసర తప్పిదాలు కూడా చేశాడు. గాయం కారణంగా గత ఏడాది ఈ టోరీ్నకి దూరంగా ఉన్న నాదల్ తాజా ఓటమితో చివరిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడినట్లు భావించాలి. సుమిత్ నగాల్ ఓటమి ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి ఆడుతున్న భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ పోరాటం మొదటి రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ 18వ ర్యాంకర్ ఖచనోవ్ (రష్యా)తో జరిగిన మ్యాచ్‌లో సుమిత్ 2–6, 0–6, 6–7 (5/7)తో ఓడిపోయాడు. మరోవైపు ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ (ఇటలీ) శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో సినెర్ 6–3, 6–3, 6–4తో యుబ్యాంక్స్ (అమెరికా)పై గెలిచాడు. స్వియాటెక్ ముందంజ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో స్వియాటెక్ 6–1, 6–2తో లియోలియా జీన్జీన్ (ఫ్రాన్స్)పై గెలిచింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–1, 6–1తో జూలియా అవ్దీవా (రష్యా)పై, ఎనిమిదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీíÙయా) 6–3, 6–2తో సాచియా వికెరీ (అమెరికా)పై, ఐదో సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–3తో మసరోవా (స్పెయిన్)పై విజయం సాధించారు. 3: ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో నాదల్‌ను ఓడించిన మూడో ప్లేయర్‌గా జ్వెరెవ్ నిలిచాడు. గతంలో సోడెర్లింగ్ (స్వీడన్; 2009లో ప్రిక్వార్టర్స్‌లో) ఒకసారి... జొకోవిచ్ (సెర్బియా; 2015 క్వార్టర్ ఫైనల్లో, 2021 సెమీఫైనల్లో) రెండుసార్లు ఈ టోర్నీ లో నాదల్‌ను ఓడించారు. 2016లో గాయం కారణంగా నాదల్ మూడో రౌండ్ నుంచి వైదొలిగాడు.3: గ్రాండ్‌స్లామ్ టోరీ్నలలో నాదల్ తొలి రౌండ్లో ఓడిపోవడం ఓవరాల్‌గా ఇది మూడోసారి మాత్రమే. ఇంతకుముందు నాదల్ 2016 ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో, 2013 వింబుల్డన్ టోర్నీలో తొలి రౌండ్లో ఓటమి పాలయ్యాడు. -
రూడ్, జబర్లకు షాక్!
మెల్బోర్న్: ఈ సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. సీడెడ్ స్టార్లు రెండో రౌండే దాటలేకపోతున్నారు. నాలుగో రోజు పోటీల్లో రెండో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), 12వ సీడ్, ఒలింపిక్ చాంపియన్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) ఇంటిదారి పట్టారు. నాదల్ ఇది వరకే అవుటైన ఈ టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా మారిన సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో నిరుటి వింబుల్డన్, యూఎస్ ఓపెన్ రన్నరప్, రెండో సీడ్ అన్స్ జబర్ (ట్యూనిషియా), తొమ్మిదో సీడ్ వెరొనికా కుడెర్మెతొవ (రష్యా), 16వ సీడ్ అనెట్ కొంటావిట్ (ఈస్టోనియా)లు కంగు తిన్నారు. ఈ విభాగంలో నాలుగో సీడ్ కరొలిన్ గార్సియా (ఫ్రాన్స్), ఐదో సీడ్ అరిన సబలెంక (బెలారస్), 12వ సీడ్ బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) ముందంజ వేశారు. బ్రూక్స్‌బి ‘హీరో’చితం పురుషుల సింగిల్స్‌లో గురువారం జరిగిన రెండో రౌండ్లో 22 ఏళ్ల యువ అమెరికన్ జెన్సన్ బ్రూక్స్‌బి సంచలన ప్రదర్శనతో రూడ్‌ను కంగుతినిపించాడు. దీంతో గతేడాది ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్లలో రన్నరప్‌గా నిలిచిన రూడ్ ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్‌లో అనూహ్యంగా రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. 3 గంటల 55 నిమిషాల సమరంలో బ్రూక్స్‌బి 6–3, 7–5, 6–7 (4/7), 6–2తో రూడ్‌ను ఓడించాడు. 8వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) అయితే వైల్డ్‌కార్డ్ ప్లేయర్ అలెక్సీ పాపిరిన్ (ఆస్ట్రేలియా) చేతిలో చేతులెత్తేశాడు. ఫ్రిట్జ్ 7–6 (7/4), 6–7 (2/7), 4–6, 7–6 (8/6), 2–6తో 23 ఏళ్ల అలెక్సీ పోరాటానికి తలవంచాడు. నాలుగో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6–1, 6–7 (5/7), 6–2, 6–0తో క్వాలిఫయర్ ఎంజో కౌకాడ్ (మారిషస్)పై గెలుపొందగా, జ్వెరెవ్‌కు 7–6 (7/1), 4–6, 3–6, 2–6తో మైకేల్ మో (అమెరికా) చేతిలో చుక్కెదురైంది. ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–2, 6–4, 6–7 (2/7), 6–3తో ఎమిల్ రుసువురి (ఫిన్లాండ్)పై నెగ్గాడు. మూడో రౌండ్లో గార్సియా, సబలెంక మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో నాలుగో సీడ్ గార్సియా (ఫ్రాన్స్) 7–6 (7/5), 7–5తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా)పై, ఐదో సీడ్ సబలెంక (బెలారస్) 6–3, 6–1తో షెల్బీ రోజర్స్ (అమెరికా)పై వరుస సెట్లలో విజయం సాధించారు. అయితే గతేడాది సూపర్ ఫామ్‌లో ఉన్న రెండో సీడ్ జబర్ (ట్యూనిషియా) 1–6, 7–5, 1–6తో మర్కెట వొండ్రొసొవా (చెక్ రిపబ్లిక్) చేతిలో పరాజయం పాలైంది. 9వ సీడ్ కుడెర్మెతొవ (రష్యా) 4–6, 6–2, 2–6తో అమెరికాకు చెందిన క్వాలిఫయర్ కేటీ వొలినెట్స్ చేతిలో ఇంటిదారి పట్టింది. 12వ సీడ్ బెన్సిచ్ 7–6 (7/3), 6–3తో క్లెయిర్ లియూ (అమెరికా)పై గెలుపొందగా, 16వ సీడ్ కొంటావిట్ (ఈస్టోనియా) 6–3, 3–6, 4–6తో మగ్ద లినెట్ (పోలాండ్) చేతిలో కంగుతింది. 30వ సీడ్ కరోలినా ప్లిస్కొవా (చెక్ రిపబ్లిక్) 6–0, 7–5తో పుతినెత్సవ (రష్యా)పై గెలిచింది. -
Alexander Zverev: టెన్నిస్ స్టార్‌కు వింత అనుభవం..
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు వింత అనుభవం ఎదురైంది. సీరియస్‌గా మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆకాశంలో ఒక పిట్ట.. పోతూ పోతూ అతని తలపై రెట్ట వేసింది. ఒక్కక్షణం ఆగిన జ్వెరెవ్ ఏంటా అని తల నిమురుకుంటే పిట్ట రెట్ట అతని చేతులకు అంటింది. దీంతో ఇదేం కర్మరా బాబు అనుకుంటూ పక్కకు వెళ్లి తలను టవల్‌తో తుడుచుకొని మ్యాచ్‌ను కంటిన్యూ చేశాడు. ఇది చూసిన అభిమానులు గొల్లుమని నవ్వారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొలి సెట్లో 2-2 స్కోరు సమానంతో టైబ్రేక్ ఆడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ప్రపంచ 13వ ర్యాంకర్ అయిన అలెగ్జాండర్ జ్వెరెవ్ రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. అమెరికాకు చెందిన అన్‌సీడెడ్ మైకెల్ మోహ్ చేతిలో జ్వెరెవ్ 6-7(1), 6-4, 6-3,6-2తో ఓటమి పాలయ్యాడు. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో సొంతం చేసుకున్న జ్వెరెవ్ ఆ తర్వాత అదే ఆటతీరును కనబరచడంలో విఫలమయ్యాడు. వరుస సెట్లలో మోహ్ చేతిలో ఖంగుతిన్నాడు. A perfect shot from the Australian Open bird 💩🤣 Alexander Zverev will be hoping he gets some good luck after that 🍀#AusOpen | @AlexZverev pic.twitter.com/Bi1TDcfz1q — Eurosport (@eurosport) January 19, 2023 చదవండి: మ్యాచ్ పట్టించుకోకుండా పక్షులు, ఆకాశంకేసి చూస్తున్నారా!? -
నీ క్రీడాస్ఫూర్తికి సలామ్ నాదల్: సచిన్, రవిశాస్త్రి ప్రశంసలు
‘‘వినమ్రంగా వ్యవహరించిన తీరు.. సాటి ఆటగాడి పట్ల సహృదయ భావం నాదల్‌ను మరింత ప్రత్యేకంగా మార్చాయి’’ అంటూ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్‌పై ప్రశంసలు కురిపించారు. అతడి క్రీడాస్ఫూర్తిని కొనియాడారు. కాగా ఫ్రెంచ్ ఓపెన్-2022 గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి సెమీస్‌లో నాదల్- మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్(జర్మనీ) తలపడ్డారు. ఈ క్రమంలో నాదల్ తొలి సెట్ గెలవగా.. రెండో సెట్లో నాదల్ రిటర్న్ షాట్‌ను అందుకునే క్రమంలో దురదృష్టవశాత్తూ జ్వెరెవ్ జారిపడ్డాడు. నొప్పి తీవ్రతరం కావడంతో మళ్లీ కోర్టులో అడుగుపెట్టలేకపోయాడు. దీంతో నాదల్‌ను విన్నర్‌గా ప్రకటించారు. అయితే, చక్రాల కుర్చీలో బయటకు వెళ్లిన జ్వెరెవ్ మళ్లీ ‘క్రచెస్’ సాయంతో కోర్టులోకి వచ్చి ప్రేక్షకులను చూస్తూ అభివాదం చేసి వెళ్లాడు. అతడి నిష్క్రమణతో అభిమానులు నిరాశలో మునిగిపోగా.. నాదల్ సైతం జ్వెరెవ్‌కు ఇలా జరిగినందుకు విచారంగా కనిపించాడు. ప్రత్యర్థి ఆటగాడి పట్ల సానుభూతి చూపించాడు. భావోద్వేగానికి గురైన జ్వెరెవ్‌ను ఓదార్చాడు. ఇక జ్వెరెవ్ క్రచెస్ సాయంతో నడుస్తుండగా.. నాదల్ అతడి పక్కనే బాధగా ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో సచిన్ నాదల్‌ను కొనియాడాడు. ఇక టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి సైతం.. ‘‘ఇలాంటివి చూసినపుడే కదా హృదయం ద్రవిస్తుంది. నువ్వు త్వరలోనే తిరిగి వస్తావు జ్వెరెవ్. ఇక నాదల్ క్రీడాస్ఫూర్తికి చేతులెత్తి నమస్కరించాలి. అన్ని రకాలుగా గౌరవం అందుకునేందుకు అతడు అర్హుడు’’ అని ట్వీట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో విజయంతో నాదల్ ఏకంగా 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నాడు. The humility and concern shown by Nadal is what makes him so special.#RolandGarros pic.twitter.com/t7ZE6wpi47 — Sachin Tendulkar (@sachin_rt) June 3, 2022 This is why sport can make you cry. You will be back @AlexZverev. @RafaelNadal - Sportsmanship, humility. Just brilliant and respect 🙏🙏🙏 #FrenchOpen2022 #RolandGarros pic.twitter.com/n5JFNFK7r1 — Ravi Shastri (@RaviShastriOfc) June 3, 2022 ⚔️ A thrilling battle came to a tough end with an injury to @AlexZverev but he and @RafaelNadal played some amazing points! Check out the Highlights by @emirates 🎥#RolandGarros | #EmiratesFlyBetterMoment pic.twitter.com/E9vn2iRF1v — Roland-Garros (@rolandgarros) June 3, 2022 -
French Open: హోరాహోరీ సమరం... గాయంతో సమాప్తం
పాయింట్ పాయింట్‌కూ పోరాటం... సుదీర్ఘ ర్యాలీలు... 3 గంటల 13 నిమిషాలు ముగిసినా పూర్తి కాని రెండు సెట్లు... ఫ్రెంచ్ ఓపెన్‌లో 13 సార్లు చాంపియన్ రాఫెల్ నాదల్, జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ తీరిది. తొలి సెట్‌ను అతికష్టమ్మీద నెగ్గిన నాదల్కు రెండో సెట్లోనూ ఒక్కో పాయింట్‌కు తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాల్సిన స్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ తుది ఫలితం ఎలా ఉంటుందోనని అభిమానులు ఆలోచిస్తున్న తరుణంలో కోర్టులో ఊహించని సంఘటన జరిగింది. రెండో సెట్ 12వ గేమ్‌లో నాదల్ రిటర్న్ షాట్‌ను అందుకోనే క్రమంలో బేస్‌లైన్ వద్ద జ్వెరెవ్ జారి పడటంతో చీలమండకు తీవ్ర గాయమైంది. పడిన వెంటనే జ్వెరెవ్ నొప్పితో విలవిలలాడాడు. మైదానంలో ప్రథమ చికిత్స తర్వాత జ్వెరెవ్‌ను చక్రాల కుర్చీపై బయటకు తీసుకెళ్లారు. ఐదు నిమిషాల తర్వాత జ్వెరెవ్ ‘క్రచెస్’ సహాయంతో కోర్టులోకి వచ్చి అభిమానులకు అభివాదం చేసి వెళ్లిపోయాడు. దాంతో రాఫెల్ నాదల్ తనకెంతో కలిసొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్‌లో 14వ సారి ఫైనల్లోకి ప్రవేశించాడు. గతంలో ఫైనల్ చేరిన 13 సార్లూ నాదలే విజేతగా నిలిచాడు. కాస్పర్ రూడ్ (నార్వే), సిలిచ్ (క్రొయేషియా) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో నాదల్ తలపడతాడు. పారిస్: తన 36వ పుట్టిన రోజు విజయం రుచి చూసిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో నాదల్ తొలి సెట్‌ను 7–6 (10/8)తో టైబ్రేక్‌లో గెలిచాడు. రెండో సెట్లోని 12వ గేమ్ చివర్లో నాదల్ రిటర్న్ షాట్‌ను అందుకునే క్రమంలో జ్వెరెవ్ కోర్టులో జారి పడ్డాడు. దాంతో పాయింట్ నాదల్కు లభించింది. స్కోరు 6–6తో సమమైంది. కోర్టులో జారిపడ్డ జ్వెరెవ్‌కు గాయం త్రీవంగా ఉండటంతో అతను మళ్లీ బరిలోకి దిగలేకపోయాడు. దాంతో నాదల్‌ను విజేతగా ప్రకటించారు. 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన పోరులో జ్వెరెవ్ రెండు సెట్లలో నాదల్కు చెమటలు పట్టించాడు. తొలి సెట్ టైబ్రేక్‌లో జ్వెరెవ్ 6–2తో ఆధిక్యంలో నిలిచి నాలుగు సెట్ పాయిం ట్లు సంపాదించాడు. కానీ పట్టువదలకుండా పోరాడినా నాదల్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 7–6తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత స్కోరు 7–7తో, 8–8తో సమమైంది. ఈ దశలో నాదల్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి తొలి సెట్‌ను గంటా 38 నిమిషాల్లో గెల్చుకున్నాడు. రెండో సెట్లోనూ జ్వెరెవ్ అద్భుతంగా ఆడుతూ 5–3తో ఆధిక్యంలోకి వచ్చి సెట్ కోసం సర్వీస్ చేశా డు. కానీ తొమ్మిదో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 5–5తో సమం చేశాడు. 11వ గేమ్‌లో జ్వెరెవ్ తన సర్వీస్‌ను కాపాడుకోగా... 12వ గేమ్‌లో నాదల్ సర్వీస్‌లో చివరి పాయింట్ సమయంలో జ్వెరెవ్ జారి పడటంతో మ్యాచ్ ముగిసింది. నేడు మహిళల సింగిల్స్ ఫైనల్ స్వియాటెక్ (పోలాండ్) X కోకో గాఫ్ (అమెరికా) సా. గం. 6:30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం అమెరికా టీనేజర్ కోకో గాఫ్... రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గాలనే లక్ష్యంతో స్వియాటెక్ నేడు మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో తలపడనున్నారు. ⚔️ A thrilling battle came to a tough end with an injury to @AlexZverev but he and @RafaelNadal played some amazing points! Check out the Highlights by @emirates 🎥#RolandGarros | #EmiratesFlyBetterMoment pic.twitter.com/E9vn2iRF1v — Roland-Garros (@rolandgarros) June 3, 2022 -
French Open: జొకోవిచ్‌కు భారీ షాక్.. నాదల్ చేతిలో ఘోర ఓటమి!
French Open 2022: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెర్బియన్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌ను ఓడించాడు. ఫిలిప్ చార్టియర్ కోర్టులో బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల 12 నిమిషాల పాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్‌కు చుక్కలు చూపించిన నాదల్.. 6-2, 4-6, 6-2, 7-6 (7/4) తేడాతో అతడిపై విజయం సాధించాడు. తద్వారా ఫ్రెంచ్ ఓపెన్-2022 సెమీ ఫైనల్లో అడుగుపెట్టాడు. కాగా ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో నాదల్ సెమీస్ చేరడం ఇది 15వ సారి. ఈ నేపథ్యంలో వరల్డ్ నంబర్ 1 జొకోవిచ్పై విజయానంతరం నాదల్ మాట్లాడుతూ.. ‘‘ఎన్నెన్నో భావోద్వేగాలు నన్ను చుట్టుముట్టాయి. ఇక్కడ ఆడటం నిజంగా నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. అతడి(జొకోవిచ్)తో పోటీ పడటం అతిపెద్ద సవాలు.. మనలోని అత్యుత్తమ ప్రతిభ కనబరిచినపుడు మాత్రమే అతడిని ఓడించే అవకాశం ఉంటుంది’’ అని ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక నాదల్కు అభినందనలు తెలిపిన జొకోవిచ్.. తనొక గొప్ప చాంపియన్ అని, ఈ విజయానికి నాదల్ అర్హుడు అంటూ ప్రశంసలు కురిపించాడు. కాగా శుక్రవారం జరుగనున్న సెమీస్‌లో మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్(జర్మనీ)తో నాదల్ ఫైనల్ బెర్తు కోసం పోటీపడనున్నాడు. చదవండి: French Open: కోకో కేక.. తొలిసారి గ్రాండ్‌స్లామ్‌లో సెమీస్‌కు అర్హత 🎥 Check out the best moments of @RafaelNadal 's thrilling four-set win over No.1 Novak Djokovic with Highlights by @emirates#RolandGarros | #EmiratesFlyBetterMoments pic.twitter.com/3F2oFCSD00 — Roland-Garros (@rolandgarros) June 1, 2022 "He was a better player in important moments" No.1 @DjokerNole on his loss to @RafaelNadal #RolandGarros — Roland-Garros (@rolandgarros) June 1, 2022 -
సూపర్ టైమింగ్.. ఎవరికి సాధ్యం కాని ఫీట్ అందుకున్నాడు
మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భాగంగా గురువారం నార్వేకు చెందిన కాస్పర్ రాడ్, జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కాస్పర్ రాడ్.. జ్వెరెవ్‌ను (6-3,1-6,6-3)తో ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాడు. మూడు సెట్లలోనే మ్యాచ్‌ను ముగించిన కాస్పర్ రాడ్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే తన ట్రిక్‌తో ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు. విషయంలోకి వెళితే.. మ్యాచ్ మధ్యలో రాడ్ సర్వీస్ చేయాల్సి ఉంది. జ్వెరెవ్ కోర్టు బయటకు వెళ్లి బంతిని రాడ్వైపు విసిరాడు. సాధారణంగా చేతితో అందుకుంటే సరిపోయేది..కానీ కాస్పర్ రాడ్ బంతి కచ్చితంగా తన జేబులో పడేలా ట్రిక్ చేయడం ఆసక్తి కలిగించింది. అతని టైమింగ్ ఎంతలా అంటే.. అతను తన జేబును ఓపెన్ చేయడం..బంతి వెళ్లి అతని పాకెట్లో పడడం జరిగిపోయింది. ఇది చూసిన అభిమానులు అతని ట్రిక్స్‌కు మంత్రముగ్దులై లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. దీనికి సంబంధించిన వీడియోను టెన్నిస్ టీవీ తన ట్విటర్లో షేర్ చేసింది. చదవండి: పుట్‌బాల్ ప్రపంచకప్‌కు పోర్చుగల్ Ruud-iculous skills 😍@CasperRuud98 #MiamiOpen pic.twitter.com/3NZCRN3p2b — Tennis TV (@TennisTV) March 31, 2022 -
జ్వెరెవ్‌కు ఊరట.. జరిమానా, సస్పెన్షన్ నిలుపుదల
అకాపుల్కో(మెక్సికో): టోక్యో ఒలింపిక్స్ చాంపియన్, జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) నుంచి చెప్పుకోదగ్గ ఊరట లభించింది. ఏటీపీ జరిమానా, సస్పెన్షన్ వేటు నిలుపుదల చేసింది. గత నెల మెక్సికో ఓపెన్‌లో డబుల్స్ మ్యాచ్ ఓడిన వెంటనే జ్వెరెవ్ చైర్ అంపైర్ కుర్చికేసి బలంగా తన రాకెట్ విరిగేలా పదేపదే కొట్టాడు. దీంతో టోర్నీ నిర్వాహకులు సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అయిన జ్వెరెవ్‌ను పంపించేశారు. దాంతో పాటు 40 వేల డాలర్లు (రూ. 30 లక్షలు), ఆ టోర్నీలో పొందిన ఏటీపీ పాయింట్లను జరిమానాగా విధించారు. ఇది పూర్తిగా మెక్సికో ఓపెన్‌కు సంబంధించిన పెనాల్టీ అయితే... ఏటీపీ నుంచి మరో 25 వేల డాలర్లు (రూ. 19 లక్షల 25 వేలు) జరిమానా, 8 వారాల సస్పెన్షన్ వేటు కూడా వేశారు. తాజాగా ఏటీపీ ఈ శిక్షను తాత్కా లికంగా నిలిపివేసి, ఏడాది పాటు ప్రొబేషన్‌లో ఉంచింది. అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 22తో ముగిసే ప్రొబేషన్ వరకు అతని ప్రవర్తన హుందాగా ఉంటే ఏ సమస్యా లేదు. ఏటీపీ శిక్ష కూడా ఉండదు. ఈ ప్రొబేషన్ కాలంలో జ్వెరెవ్ తన అనుచిత ప్రవర్తనను పునరావృతం చేస్తే మాత్రం ఏటీపీ శిక్షను తక్షణం అమలు చేస్తారు. -
మతి తప్పిన జ్వెరెవ్.. టోర్నీ నుంచి గెంటేసిన నిర్వాహకులు
అకాపుల్కో (మెక్సికో): ప్రపంచ మూడో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) హద్దు మీరాడు. మెక్సికో ఓపెన్ టెన్నిస్ టోర్నీలో జ్వెరెవ్ తన రాకెట్‌తో అంపైర్‌ను దాదాపు కొట్టినంత పని చేశాడు. దాంతో జ్వెరెవ్ నిర్వాకంపై టోర్నీ నిర్వాహకులు క్రమశిక్షణ చర్య తీసుకున్నారు. టోర్నీలో అతను సింగిల్స్ మ్యాచ్ ఆడాల్సిన పనిలేదంటూ ఇంటికి పంపించేశారు. వివరాల్లోకి వెళితే... మంగళవారం రాత్రి జరిగిన డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో జ్వెరెవ్ –మార్సెలో మెలో (బ్రెజిల్) జోడీ 2–6, 6–4, 6–10తో గ్లాస్‌పూల్ (బ్రిటన్)–హారి హెలియోవారా (ఫిన్లాండ్) జంట చేతిలో ఓడింది. మ్యాచ్ సందర్భంగా అంపైర్ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన జ్వెరెవ్ తుది ఫలితం తర్వాత తన రాకెట్‌తో ఏకంగా చైర్ అంపైర్ కుర్చీకేసి బాదాడు. అంపైర్ తన కాళ్లను దగ్గరకు తీసుకోకపోతే కచ్చితంగా గాయమయ్యేది. ‘క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన జ్వెరెవ్‌ను టోర్నీ నుంచి తప్పించాం’ అని అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ తెలిపింది. మరోవైపు తన హద్దుమీరిన ప్రవర్తనపై జ్వెరెవ్ బుధవారం స్పందించాడు. చైర్ అంపైర్‌తోపాటు టోర్నీ నిర్వాహకులకు క్షమాపణలు చెప్పాడు. Alexander Zverev has been THROWN OUT of the Mexican Open for attacking the umpire's chair at the end of his doubles match 😮😮😮 pic.twitter.com/CWhQ1r6kwj — Amazon Prime Video Sport (@primevideosport) February 23, 2022 -
Australian Open 2022: ఎదురులేని నాదల్.. మూడో రౌండ్‌కు జ్వెరెవ్
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ దూసుకెళ్తున్నాడు. 21వ గ్రాండ్‌స్లామ్ లక్ష్యంగా బరిలోకి దిగిన నాదల్ మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. బుధవారం జర్మనీకి చెందిన యానిక్ హాన్ఫ్మన్ను 6-2, 6-3, 6-4తో వరుస సెట్లో ఖంగుతినిపించిన నాదల్ ప్రిక్వార్టర్స్‌లోకి ఎంటరయ్యాడు. స్విస్ సూపర్‌స్టార్ రోజర్ ఫెదరర్‌తో సంయుక్తంగా 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన నాదల్కు ఇది మంచి అవకాశం. ఫెదరర్, జొకోవిచ్ లాంటి దిగ్గజాలు ఈ గ్రాండ్‌స్లామ్‌కు దూరంగా ఉన్నారు. ఇక మూడోరౌండ్లో నాదల్.. రష్యన్ టెన్నిస్ ప్లేయర్ కచనోవ్‌తో అమితుమీ తేల్చుకోనున్నాడు. మరో మ్యాచ్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ ఆస్ట్రేలియాకు చెందిన జాన్ మిల్‌మాన్‌ను 6-4,6-4,6-0తో ఓడించి మూడోరౌండ్లోకి అడుగుపెట్టాడు. -
స్వర్ణ పతక విజేతను ఓడించి.. ఫైనల్లో జొకోవిచ్.. గెలిస్తే..
-
జయహో జొకోవిచ్.. యూఎస్ ఓపెన్‌లో తొమ్మిదోసారి ఫైనల్‌కు..
న్యూయార్క్: ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్ టోరీ్నలలో తన అది్వతీయ ఫామ్‌ను కొనసాగిస్తూ వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) యూఎస్ ఓపెన్‌లోనూ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 4–6, 6–2, 6–4, 4–6, 6–2తో నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచి తొమ్మిదోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. 3 గంటల 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. పలుమార్లు సుదీర్ఘ ర్యాలీలు (53, 19, 22, 31, 16 షాట్లు) సాగాయి. అయితే కీలకదశలో జొకోవిచ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి పైచేయి సాధించాడు. ఈ సెర్బియా స్టార్ 12 ఏస్‌లు సంధించడంతోపాటు జ్వెరెవ్ సరీ్వస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు జ్వెరెవ్ 16 ఏస్‌లు కొట్టినా, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు, 50 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ‘ఇంకొక్క మ్యాచే మిగిలి ఉంది. దానినీ జయిద్దాం. ఆ చివరి మ్యాచ్‌లో నా సర్వశక్తులూ ఒడ్డి పోరాడతా’ అని గతంలో మూడుసార్లు యూఎస్ చాంపియన్‌గా నిలిచిన 34 ఏళ్ల జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. మరో సెమీఫైనల్లో రెండో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) 6–4, 7–5, 6–2తో 12వ సీడ్ ఫిలిక్స్ ఉగర్ అలియాసిమ్ (కెనడా)పై నెగ్గి జొకోవిచ్‌తో అమీతుమీకి సిద్ధమయ్యాడు. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 5–3తో మెద్వెదేవ్పై ఆధిక్యంలో ఉన్నాడు. పురుషుల టెన్నిస్ చరిత్రలో ఒకేరోజు రెండు రికార్డులు సృష్టించేందుకు సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ విజయం దూరంలో నిలిచాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోరీ్నలలో విజేతగా నిలిచిన జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌లోనూ టైటిల్ సాధిస్తే... రాడ్ లేవర్ (1969లో) తర్వాత ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. అంతేకాకుండా అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన ప్లేయర్‌గా జొకోవిచ్ కొత్త చరిత్ర లిఖిస్తాడు. ప్రస్తుతం జొకోవిచ్, ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) 20 చొప్పున గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో సమంగా ఉన్నారు. రాడుకాను చరిత్ర సృష్టించేనా? మహిళల సింగిల్స్ విభాగంలో ఎవరూ ఊహించని విధంగా ఇద్దరు టీనేజర్లు, అన్‌సీడెడ్ క్రీడాకారిణులు లేలా ఫెర్నాండెజ్ (కెనడా–19 ఏళ్లు), ఎమ్మా రాడుకాను (బ్రిటన్–18 ఏళ్లు) టైటిల్ పోరుకు అర్హత పొందారు. సెమీఫైనల్స్‌లో లేలా ఫెర్నాండెజ్ 7–6 (7/3), 4–6, 6–4తో రెండో సీడ్ సబలెంకా (బెలారస్)పై... రాడుకాను 6–1, 6–4తో 17వ సీడ్ మరియా సాకరి (గ్రీస్)పై గెలిచి తమ కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ఫైనల్‌కు చేరారు. ఓపెన్ శకంలో క్వాలిఫయర్ హోదాలో ఫైనల్ చేరిన తొలి ప్లేయర్‌గా... వర్జీనియా వేడ్ (1977లో వింబుల్డన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి బ్రిటన్ ప్లేయర్‌గా రాడుకాను గుర్తింపు పొందింది. ఫైనల్లో లేలాపై రాడుకాను గెలిస్తే గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన తొలి క్వాలిఫయర్‌గా చరిత్ర సృష్టిస్తుంది. లేలా, రాడుకాను -
స్వర్ణ పతక విజేతను ఓడించి.. ఫైనల్లో జొకోవిచ్.. గెలిస్తే..
Novak Djokovic In US Open 2021 Finals: సెర్బియన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ యూఎస్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. సెమీ ఫైనల్లో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో టాప్ సీడ్ జొకోవిచ్.. 4-6, 6-2, 6-4, 4-6, 6-2 తేడాతో నాలుగో సీడ్ జ్వెరెవ్‌పై చేయి సాధించి ఫైనల్‌కు చేరుకున్నాడు. ఆర్థుర్ ఆషే స్టేడియంలో ఆదివారం జరుగనున్న ఫైనల్ మ్యాచ్‌లో అతడు.. రష్యన్ ప్లేయర్ డానిల్ మెద్వెదేవ్‌తో తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌లో గనుక జొకోవిచ్ విజయం సాధిస్తే... ఇప్పటికే ఆస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిళ్లను గెలిచిన అతడు.. క్యాలెండర్ స్లామ్ తన పేరిట లిఖించుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో ఆల్‌టైమ్ గ్రేటెస్టు దిగ్గజాలు ఫెడరర్ (స్విట్జర్లాండ్), నాదల్ (స్పెయిన్)లను అధిగమించే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో సెమీస్‌లో గెలిచిన అనంతరం జొకోవిచ్ మట్లాడుతూ.. ‘‘ఈ క్షణాలు ఎంతో మధురం. ఇంకా ఒకే ఒక్క మ్యాచ్ మిగిలింది. గెలిచేద్దాం. తుదిపోరులో విజయం సాధించేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను’’ అని పేర్కొన్నాడు. చదవండి: వారెవ్వా ఎమ్మా: యూఎస్ ఓపెన్‌లో సంచలనం Is @DjokerNole the most mentally tough player in tennis history? He takes us inside the 🧠 of a legend. pic.twitter.com/AiUfGDQYDT — US Open Tennis (@usopen) September 11, 2021 -
అయ్యో... జొకోవిచ్
టోక్యో: పురుషుల టెన్నిస్ చరిత్రలో అరుదైన ‘గోల్డెన్ స్లామ్’ ఘనతను సాధించాలని ఆశించిన వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు నిరాశ ఎదురైంది. టోక్యో ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ జొకోవిచ్ సెమీఫైనల్లో ఓటమి పాలయ్యాడు. అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) అద్భుత ఆటతీరుతో 1–6, 6–3, 6–1తో జొకోవిచ్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ పరాజయంతో జొకోవిచ్ కాంస్య పతకం కోసం పోరాడనున్నాడు. ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) నెగ్గడంతోపాటు ఒలింపిక్ స్వర్ణాన్ని సాధిస్తే దానిని ‘గోల్డెన్ స్లామ్’ ఘన తగా పరిగణిస్తారు. గతంలో మహిళల విభా గంలో స్టెఫీ గ్రాఫ్ (1988లో) మాత్రమే ఈ ఘనత సాధించింది. ఈ ఏడాది జొకోవిచ్ ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ టోర్నీలలో విజేతగా నిలిచాడు. -
Alexander Zverev: జ్వెరెవ్ అదరహో...
మాడ్రిడ్: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో బలమైన ప్రత్యర్థులను ఓడిస్తూ సాగిన జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ప్రయాణం ఘనంగా ముగిసింది. క్వార్టర్స్‌లో నాదల్‌ను, సెమీస్‌లో థీమ్‌ను ఓడించిన జ్వెరెవ్... ఫైనల్లోనూ అదే ప్రదర్శనను కనబరచి చాంపియన్‌గా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన టైటిల్ పోరులో జ్వెరెవ్ 6–7 (6/8), 6–4, 6–3తో మాటియో బెరెటిని (ఇటలీ)పై గెలిచాడు. మాడ్రిడ్ ఓపెన్‌ను జ్వెరెవ్ గెలవడం రెండో సారి. 2018లో అతను తొలిసారి ఈ టైటిల్‌ను నెగ్గగా...అతని కెరీర్లో ఇది నాలుగో మాస్టర్స్–1000 టైటిల్. మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించిన ప్రపంచ పదో ర్యాంకర్ బెరెటిని కీలక సమయాల్లో తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. తొలి సెట్లో ఇద్దరు ప్లేయర్లు కూడా హోరాహోరీగా తలపడటంతో టై బ్రేక్‌కు దారి తీసింది. ఇందులో నెగ్గిన బెరెటిని తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో సెట్లో బెరెటిని సర్వ్ చేసిన తొమ్మిదో గేమ్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్... ఆ తర్వాత తన గేమ్‌ను నిలబెట్టుకొని సెట్‌ను 6–4తో సొంతం చేసుకున్నాడు. ఇక నిర్ణాయక మూడో సెట్లో పూర్తి ఆధిపత్యం కనబర్చిన జ్వెరెవ్ ఆ సెట్‌ను గెలవడంతో లాంఛనం పూర్తి చేశాడు. మ్యాచ్‌లో బెరెటిని 50 అనవసర తప్పిదాలు చేయడంతో పాటు... మూడో సెట్లో జ్వెరెవ్ సర్వీస్‌ను రెండు సార్లు బ్రేక్ చేసే అవకాశం లభించినా వాటిని జారవిడిచి మ్యాచ్‌ను కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ్వెరెవ్ 3,15,160 యూరోల ప్రైజ్‌మనీ (సుమారు రూ. 2 కోట్ల 81 లక్షలు)ని అందుకున్నాడు. పురుషుల డబుల్స్ విభాగంలో జరిగిన ఫైనల్లో మార్సెల్ గ్రనోలర్స్ (స్పెయిన్)– హరసియో జెబలోస్ (అర్జెంటీనా) జంట 1–6, 6–3, 10–8తో నికోలా మెక్టిక్–మాటె పవిచ్ (క్రొయేషియా) జోడిపై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. -
జ్వెరెవ్ చేతిలో రాఫెల్ నాదల్కు షాక్
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్కు మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ ఆరో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–4తో టాప్ సీడ్, ఐదుసార్లు మాజీ చాంపియన్ నాదల్‌పై నెగ్గి సెమీఫైనల్ చేరాడు. క్లే కోర్టులపై నాదల్‌పై జ్వెరెకిదే తొలి విజయం కావడం విశేషం. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ సర్వీస్‌ను జ్వెరెవ్ మూడుసార్లు బ్రేక్ చేశాడు. ఇప్పట్లో బాచ్ ‘టోక్యో’ పర్యటన కష్టమే... టోక్యో ఒలింపిక్స్ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ ఈ నెలలో జపాన్‌కు రావడం కష్టమేనని ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షురాలు సీకో హషిమోటో పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం మే 11 వరకు టోక్యోతోపాటు మరో మూడు నగరాల్లో విధించిన అత్యవసర పరిస్థితిని ఈనెల 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. దాంతో థామస్ బాచ్ పర్యటన వాయిదా పడే అవకాశముంది. -
తక ధిమి థీమ్...
అనుభవం అద్భుతం చేసింది. నమ్మకం ముందుకు నడిపించింది. ఓటమి అంచుల నుంచి గట్టెక్కించింది. చివరకు విజేత హోదాలో ట్రోఫీని ముద్దాడేలా చేసింది. చరిత్ర పుటల్లోనూ స్థానం కల్పించింది. కెరీర్లో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరి మూడుసార్లూ రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్న ఆస్ట్రియా యోధుడు డొమినిక్ థీమ్ ఎట్టకేలకు నాలుగో ప్రయత్నంలో గ్రాండ్‌స్లామ్ చాంపియన్ అయ్యాడు. కెరీర్లో తొలిసారిగా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తన మిత్రుడు అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో సుదీర్ఘంగా సాగిన యూఎస్ ఓపెన్ తుది సమరంలో థీమ్ పైచేయి సాధించాడు. తొలి రెండు సెట్లు ఓడిపోయి... మూడో సెట్లో ఆరంభంలోనే సర్వీస్ కోల్పోయి వెనుకబడిన థీమ్ ఆ తర్వాత అనూహ్య ఆటతీరుతో మ్యాచ్ గతిని మార్చేశాడు. చివరకు నిర్ణాయక సెట్లో ఒకదశలో 3–5తో ఓటమి అంచుల్లో నిలిచి ఆ వెంటనే కోలుకొని స్కోరును సమం చేసి చివరకు టైబ్రేక్‌లో విజయాన్ని అందుకున్నాడు. తన గ్రాండ్‌స్లామ్ టైటిల్ కలను నిజం చేసుకున్నాడు. న్యూయార్క్: ఒకదశలో నాలుగోసారి అందివచ్చిన ‘గ్రాండ్’ టైటిల్ అవకాశం డొమినిక్ థీమ్ నుంచి చేజారిపోతుందా అనిపించింది. కానీ గత మూడు ‘గ్రాండ్’ ఫైనల్స్‌లో ఎదురైన ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న థీమ్ నేలకు కొట్టిన టెన్నిస్ బంతిలా పైకి వచ్చాడు. తొలి రెండు సెట్లు కోల్పోయి... ఐదో సెట్లో 3–5తో వెనుకబడి... పరాజయం ముంగిట నిలిచిన ఈ ఆస్ట్రియా ఆటగాడు తన స్వశక్తిపై, తన ఆటతీరుపై నమ్మకం కోల్పోకుండా ఆఖరి పాయింట్ వరకు పోరాడితే పోయేదేమీ లేదులే అనుకుంటూ ముందుకు సాగిపోయాడు. చివరకు చిరస్మరణీయ విజయంతో చాంపియన్‌గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ డొమినిక్ థీమ్ 4 గంటల 2 నిమిషాల పోరాటంలో 2–6, 4–6, 6–4, 6–3, 7–6 (8/6)తో ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచాడు. విజేత థీమ్‌కు 30 లక్షల డాలర్లు (రూ. 22 కోట్లు), రన్నరప్ జ్వెరెవ్‌కు 15 లక్షల డాలర్లు (రూ. 11 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన 27 ఏళ్ల థీమ్ 1949 తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్లో తొలి రెండు సెట్లు ఓడిపోయి, ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 1949లో యూఎస్ నేషనల్ చాంపియన్‌షిప్ పేరుతో జరిగిన టోర్నీ ఫైనల్లో పాంచో గొంజాలెజ్ (అమెరికా) తన సహచరుడు టెడ్ ష్రోడెర్పై ఈ తరహాలో గెలిచాడు. 1968 నుంచి ప్రొఫెషనల్ ఆటగాళ్లకు కూడా గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడేందుకు అనుమతి ఇవ్వడంతో అప్పటి నుంచి టెన్నిస్‌లో ఓపెన్ శకం మొదలైంది. శుభారంభం లభించినా... కెరీర్లో తొలి ‘గ్రాండ్’ ఫైనల్ ఆడుతున్న జ్వెరెవ్ తొలి గేమ్ నుంచే ఆకట్టుకున్నాడు. మూడో గేమ్‌లో, ఏడో గేమ్‌లో థీమ్ సర్వీస్‌లను బ్రేక్ చేసిన జ్వెరెవ్ తొలి సెట్ గెలిచేశాడు. రెండో సెట్లో మూడు, ఐదో గేముల్లో మళ్లీ థీమ్ సర్వీస్‌లను బ్రేక్ చేసిన 23 ఏళ్ల జ్వెరెవ్ సెట్‌ను దక్కించుకున్నాడు. మూడో సెట్ మూడో గేమ్‌లో థీమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అటునుంచి జ్వెరెవ్ తన సర్వీస్‌లను నిలబెట్టుకొని ఆధిక్యాన్ని కాపాడుకొని ఉంటే చాంపియన్ అయ్యేవాడు. కానీ థీమ్ నెమ్మదిగా తేరుకున్నాడు. మూడో సెట్‌ను, నాలుగో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్లో ఎనిమిదో గేమ్‌లో థీమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్ 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. తాను సర్వీస్ చేసిన తొమ్మిదో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను నిలబెట్టుకొని ఉంటే సెట్‌ను 6–3తో నెగ్గి విజేతగా నిలిచేవాడు. కానీ జ్వెరెవ్ తొమ్మిదో గేమ్‌ను థీమ్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత స్కోరు 6–6తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో థీమ్‌దే పైచేయిగా నిలిచింది. ► 5 ఓపెన్ శకం (1968 నుంచి) మొదలయ్యాక గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో తొలి రెండు సెట్లు కోల్పోయి ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి టైటిల్ సాధించిన ఐదో ప్లేయర్‌గా థీమ్ నిలిచాడు. గతంలో గాస్టన్ గాడియో (గిలెర్మో కొరియాపై 2004 ఫ్రెంచ్ ఓపెన్‌లో); అగస్సీ (ఆండ్రీ మెద్వెదేవ్పై 1999 ఫ్రెంచ్ ఓపెన్‌లో); ఇవాన్ లెండిల్ (మెకన్రోపై 1984 ఫ్రెంచ్ ఓపెన్‌లో); జాన్ బోర్గ్ (మాన్యుయెల్ ఒరాన్టెస్పై 1974 ఫ్రెంచ్ ఓపెన్‌లో) ఈ ఘనత సాధించారు. ► 1 1990 తర్వాత జన్మించి పురుషుల సింగిల్స్ విభాగంలో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ విజేతగా నిలిచిన తొలి ప్లేయర్ థీమ్. ► 1 పురుషుల టెన్నిస్‌లో తొలిసారి వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ల ఫైనల్ ఫలితాలు ఐదు సెట్లపాటు (2019 వింబుల్డన్; 2019 యూఎస్ ఓపెన్, 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్, 2020 యూఎస్ ఓపెన్) సాగిన మ్యాచ్‌ల ద్వారా వచ్చాయి. ► 2 థామస్ ముస్టర్ (1995లో ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన రెండో ఆస్ట్రియా ఆటగాడిగా థీమ్ నిలిచాడు. ► 2 గ్రాండ్‌స్లామ్ టోర్నీల చరిత్రలో ఫైనల్లో టైబ్రేక్ ద్వారా ఫలితం రావడం ఇది రెండోసారి మాత్రమే. 2019 వింబుల్డన్ ఫైనల్లో ఫెడరర్‌పై జొకోవిచ్ టైబ్రేక్‌లో గెలిచాడు. వింబుల్డన్‌లో గతేడాదే చివరి సెట్లో స్కోరు 12–12 వద్ద సమం అయ్యాక ఫలితాన్ని టైబ్రేక్‌లో తేల్చాలని నిర్ణయం తీసుకున్నారు. ► 6 ఆరేళ్ల వ్యవధి తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో పురుషుల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించాడు. చివరిసారి 2014 యూఎస్ ఓపెన్‌లో మారిన్ సిలిచ్ రూపంలో కొత్త విజేత వచ్చాడు. 2015 నుంచి ఈ ఏడాది యూఎస్ ఓపెన్ ముందు వరకు జరిగిన గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో జొకోవిచ్, నాదల్, ఫెడరర్, ఆండీ ముర్రే, వావ్రింకాలలో ఎవరో ఒకరు విజేతగా నిలుస్తూ వచ్చారు. ► 1 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల్లో జ్వెరెవ్ తొలిసారి తొలి రెండు సెట్లు గెలిచి ఆ తర్వాత మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే తొలి సారి. గతంలో అతను తొలి రెండు సెట్లు గెలిచాక 24 సార్లు మ్యాచ్‌ల్లో నెగ్గాడు. ఎలాగైతేనేం గట్టెక్కాను. ఫైనల్లో నా శరీరం ఒకదశలో అలసిపోయినా గెలుస్తానన్న నా నమ్మకమే చివరి వరకు నడిపించింది. తుది ఫలితంతో చాలా చాలా ఆనందంగా ఉన్నాను. 2014 నుంచి జ్వెరెవ్‌తో పరిచయం ఉంది. ఆ తర్వాత ఇద్దరం మంచి మిత్రులయ్యాం. ఎన్నో గొప్ప మ్యాచ్‌లు ఆడాం. వాస్తవానికి ఫైనల్లో ఇద్దరు విజేతలు ఉండాల్సింది. మా ఇద్దరికీ టైటిల్ గెలిచే అర్హత ఉంది. నా కెరీర్ కూడా ఫైనల్ మాదిరిగానే ఎత్తుపల్లాలతో సాగుతోంది. అయితే అంతిమ ఫలితం మాత్రం నాకు నచ్చింది. –డొమినిక్ థీమ్ తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన థీమ్‌కు అభినందనలు. అతను మరిన్ని తప్పిదాలు చేసి ఉంటే నా చేతిలో విన్నర్స్ ట్రోఫీ ఉండేది. కానీ నేను రన్నరప్ ట్రోఫీతో ప్రసంగిస్తున్నాను. టోర్నీ ప్రారంభానికి ముందు నా తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ రావడంతో వారు నా వెంట రాలేకపోయారు. అయితే వారు కరోనా నుంచి కోలుకున్నందుకు సంతోషంగా ఉన్నాను. తొలి రెండు సెట్లు గెలిచాక కూడా ఓడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. నాకింకా 23 ఏళ్లే కాబట్టి భవిష్యత్‌లో తప్పకుండా నేను కూడా గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని ఎత్తుకుంటానన్న నమ్మకం ఉంది. –అలెగ్జాండర్ జ్వెరెవ్ -
యూఎస్ ఓపెన్‌లో కొత్త చరిత్ర
న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో కొత్త చాంపియన్ అవతరించాడు. ఆస్ట్రేలియా స్టార్ క్రీడాకారుడు, రెండో సీడ్ డొమనిక్ థీమ్ చాంపియన్‌గా నిలిచాడు. భారతకాలమాన ప్రకారం ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఫైనల్లో థీమ్ 2-6, 4-6, 6-4, 6-3, 7-6(8/6) తేడాతో జర్మనీ ప్లేయర్, ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై గెలిచి యూఎస్ ఓపెన్‌ను కైవసం చేసుకున్నాడు. ఇది థీమ్‌కు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. గతంలో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో ఓడిపోయిన థీమ్.. ఈసారి మాత్రం టైటిల్‌ను సాధించే వరకూ వదిలిపెట్టలేదు. తొలి రెండు సెట్లను కోల్పోయినా ఇక మిగతా మూడు సెట్లను తన ఖాతాలో వేసుకుని ట్రోఫీని ముద్దాడాడు.(చదవండి: నమో నయోమి) ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన థీమ్.. అంతకుముందు 2018, 2019ల్లో ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గానే సరిపెట్టుకున్నాడు. అయితే ఈసారి టైటిల్‌ను సాధించే వరకు థీమ్ తన పోరాటాన్ని ఆపలేదు. వరుసగా రెండు సెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడ్డ సమయంలో థీమ్ ఇరగదీశాడు. ప్రత్యర్థి జ్వెరెవ్ నుంచి అద్భుతమైన ఏస్‌లో దూసుకొస్తున్నా ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఒక్కో గేమ్‌ను కైవసం చేసుకుంటూ వరుసగా రెండు సెట్లను గెలిచాడు.ఆపై చివరిసెట్ను టైబ్రేక్‌లో గెలిచి టైటిల్ సాధించాడు. యూఎస్ ఓపెన్‌లో ఒక ఆటగాడు తొలి రెండు సెట్లు కోల్పోయిన తర్వాత తేరుకుని టైటిల్ గెలవడం ఆ టోర్నీ ఓపెన్ ఎరాలో ఇదే తొలిసారి. ఫలితంగా థీమ్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఐదో సెట్లో హోరాహోరీ టైటిల్ నిర్ణయాత్మక ఐదో సెట్లో ఇరువురి మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ ఇద్దరూ ఎక్కడా తగ్గకుండా నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డారు. ఇరువురు సమానంగా గేమ్‌లను గెలుచుకుంటూ స్కోరును కాపాడుకుంటూ వచ్చారు. దాంతో మ్యాచ్ ఫలితం టైబ్రేక్‌కు దారి తీసింది. ట్రైబ్రేకర్‌లో ఎనిమిది పాయింట్లతో ముందంజ వేసిన థీమ్.. జ్వెరెవ్‌ను ఆరు పాయింట్లకు పరిమితం చేసి టైటిల్‌ను ఎగురేసుకుపోయాడు. ఇక తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి చేరి టైటిల్ సాధిద్దామనుకున్న జ్వెరెవ్‌కు ఆశలకు బ్రేక్ పడింది. ఇరువురి మధ్య నాలుగు గంటలకు పైగా సాగిన పోరాటంలో చివరకు థీమ్ పైచేయి సాధించి ప్రతిష్టాత్మక ట్రోఫీని దక్కించుకున్నాడు. -
సూపర్ జ్వెరెవ్
మూడేళ్ల క్రితం జర్మనీ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ప్రపంచ మూడో ర్యాంకర్‌గా ఎదిగిన సమయంలో పురుషుల సింగిల్స్ విభాగంలో నయా తార అవతరించాడని టెన్నిస్ క్రీడా పండితులు విశ్లేషించారు. కానీ గత మూడేళ్లలో 23 ఏళ్ల జ్వెరెవ్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరి తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. అయితే ఏడు నెలలు తిరిగేలోపు జ్వెరెవ్ మరో మెట్టు ఎక్కాడు. తన అత్యుత్తమ ‘గ్రాండ్’ సెమీస్ ప్రదర్శనను సవరించి ఈసారి ఏకంగా ‘గ్రాండ్’గా ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు కేవలం విజయం దూరంలో నిలిచాడు. మరోవైపు మూడేళ్లుగా ‘బిగ్ త్రీ’ ఫెడరర్, నాదల్, జొకోవిచ్ నీడలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఆస్ట్రియా స్టార్ డొమినిక్ థీమ్ తన గ్రాండ్‌స్లామ్ టైటిల్ కలను సాకారం చేసుకోవడానికి నాలుగోసారి సిద్ధమయ్యాడు. జ్వెరెవ్, థీమ్ మధ్య ఫైనల్లో ఎవరు గెలిచినా తొలిసారి గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరిస్తారు. న్యూయార్క్: తమ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కలను నిజం చేసుకోవడానికి పురుషుల టెన్నిస్ భవిష్యత్ ఆశాకిరణాలు అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) ఒక్క విజయం దూరంలో నిలిచారు. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో వీరిద్దరూ తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్స్‌లో ఐదో సీడ్ జ్వెరెవ్ 3 గంటల 23 నిమిషాల్లో 3–6, 2–6, 6–3, 6–4, 6–3తో 20వ సీడ్ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్)పై, రెండో సీడ్ థీమ్ 2 గంటల 55 నిమిషాల్లో 6–2, 7–6 (9/7), 7–6 (7/5)తో గత ఏడాది రన్నరప్, మూడో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా)పై గెలుపొందారు. ముఖాముఖి రికార్డులో థీమ్ 7–2తో జ్వెరెవ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. వీరిద్దరు గ్రాండ్‌స్లామ్ టోర్నీ మ్యాచ్‌ల్లో మూడు సార్లు తలపడగా... మూడు సార్లూ్ల థీమ్‌నే విజయం వరించింది. రెండు సెట్లు చేజార్చుకొని... కరెనో బుస్టాతో జరిగిన సెమీఫైనల్లో జ్వెరెవ్ తొలి రెండు సెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతున్న దశలో పుంజుకున్నాడు. శక్తిమంతమైన సర్వీస్‌లతో, పదునైన రిటర్న్ షాట్లతో ఒక్కసారిగా విజృంభించాడు. మూడో సెట్లోని నాలుగో గేమ్‌లో బుస్టా సర్వీస్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్ ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్ నెగ్గాడు. నాలుగో సెట్లోని ఏడో గేమ్‌లో బుస్టా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ జర్మనీ యువతార 4–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత 6–4తో సెట్‌ను గెల్చుకున్నాడు. నిర్ణాయక ఐదో సెట్లోనూ జ్వెరెవ్ నియంత్రణ కోల్పోకుండా ఆడాడు. తొలి గేమ్‌లో, ఆ తర్వాత తొమ్మిదో గేమ్‌లో బుస్టా సర్వీస్‌లను బ్రేక్ చేసిన జ్వెరెవ్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. జ్వెరెవ్ తన కెరీర్లో తొలిసారి వరుసగా తొలి రెండు సెట్లను కోల్పోయి... ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు నెగ్గి విజయాన్ని అందుకోవడం ఇదే ప్రథమం. మ్యాచ్ మొత్తంలో 24 ఏస్‌లు సంధించాడు. 8 డబుల్ ఫాల్ట్‌లతోపాటు 57 అనవసర తప్పిదాలు చేశాడు. అయితే 71 విన్నర్స్ కొట్టడం, నెట్ వద్దకు 50 సార్లు దూసుకొచ్చి 37 సార్లు పాయింట్లు గెలవడం, ఎనిమిది బ్రేక్ పాయింట్లు సంపాదించడం జ్వెరెవ్‌కు విజయాన్ని అందించాయి. తడబడి... నిలబడి... ఇప్పటికే మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో ఓడిపోయిన డొమినిక్ థీమ్ ఈసారి ఎలాగైనా విన్నర్స్ ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉన్నాడు. గతేడాది రన్నరప్ మెద్వెదేవ్‌తో జరిగిన సెమీఫైనల్లో థీమ్ ఆటలో ఇది స్పష్టంగా కనిపించింది. రెండో సెట్లో, మూడో సెట్లో సెట్ పాయింట్లు కాపాడుకున్న విధానం అతని సానుకూల దృక్పథాన్ని సూచిస్తోంది. రెండో సెట్లో మెద్వెదేవ్ తన సర్వీస్‌లో 5–4తో ఆధిక్యంలో ఉన్నపుడు సర్వీస్ నిలబెట్టుకొని ఉంటే సెట్ గెలిచేవాడు. కానీ థీమ్ అతని సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత టైబ్రేక్‌లో పైచేయి సాధించాడు. ఇక మూడో సెట్లో ఒకదశలో థీమ్ 2–5తో వెనుకబడ్డాడు. కానీ థీమ్ ఒత్తిడికి లోనుకాకుండా మెద్వెదేవ్ సర్వీస్‌ను తొమ్మిదో గేమ్‌లో బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని స్కోరును 6–6తో సమం చేశాడు. మళ్లీ టైబ్రేక్‌లో తన ఆధిపత్యం చాటుకొని గెలిచాడు. సిగెముండ్–జ్వొనరేవా జంటకు ‘డబుల్స్’ మహిళల డబుల్స్ విభాగంలో అన్‌సీడెడ్ జోడీ లౌరా సిగెముండ్ (జర్మనీ)–వెరా జ్వొనరేవా (రష్యా) విజేతగా నిలిచింది. 80 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ఈ జంట 6–4, 6–4తో మూడో సీడ్ నికోల్ మెలికార్ (అమెరికా)–యిఫాన్ షు (చైనా) జోడీపై విజయం సాధించింది. విజేత సిగెముండ్–జ్వొనరేవా ద్వయంకు 4,00,000 డాలర్లు (రూ. 2 కోట్ల 94 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 6 యూఎస్ ఓపెన్ చరిత్రలో సెమీఫైనల్ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు కోల్పోయి ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు నెగ్గి ఫైనల్ చేరిన ఆరో క్రీడాకారుడు జ్వెరెవ్. గతంలో జొకోవిచ్ (2011లో ఫెడరర్‌పై); ఆండీ రాడిక్ (2003లో నల్బందియాన్పై); జాన్ బోర్గ్ (1980లో యోహాన్ క్రీక్‌పై); వైటస్‡ జెరులైటిస్ (1979లో రోస్కో ట్యానర్పై); మాన్యుయెల్ ఒరాంటెస్ (1975లో గిలెర్మో విలాస్‌పై) ఈ ఘనత సాధించారు. 2 ఫైనల్లో థీమ్ విజయం సాధిస్తే థామస్ ముస్టర్ (1995లో ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన రెండో ఆస్ట్రియా ప్లేయర్‌గా నిలుస్తాడు. అంతేకాకుండా యూఎస్ ఓపెన్ నెగ్గిన తొలి ఆస్ట్రియా ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. 26 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో 26 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన తొలి జర్మనీ ప్లేయర్‌గా జ్వెరెవ్ గుర్తింపు పొందాడు. 1994లో చివరిసారి మైకేల్ స్టిచ్ రూపంలో జర్మనీ ఆటగాడు ఈ టోర్నీలో ఫైనల్ చేరి ఫైనల్లో ఆండ్రీ అగస్సీ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. 2 ఫైనల్లో జ్వెరెవ్ గెలిస్తే బొరిస్ బెకర్ (1989లో) తర్వాత యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన రెండో జర్మనీ ప్లేయర్‌గా నిలుస్తాడు. అంతేకాకుండా 1991 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన జర్మనీ క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు. 1991లో చివరిసారి జర్మనీ క్రీడాకారులు బొరిస్ బెకర్ (ఆస్ట్రేలియన్ ఓపెన్), మైకేల్ స్టిచ్ (వింబుల్డన్) ఈ ఘనత సాధించారు. -
జ్వెరెవ్ జోరు
న్యూయార్క్: ‘బిగ్ త్రీ’ నీడలో ఇన్నాళ్లూ గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో వెనుకబడిపోయిన జర్మనీ యువతార అలెగ్జాండర్ జ్వెరెవ్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా మరో అడుగు వేశాడు. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో 23 ఏళ్ల జ్వెరెవ్ తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 27వ సీడ్ బొర్నా చోరిచ్ (క్రొయేషియా)తో జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ 1–6, 7–6 (7/5), 7–6 (7/1), 6–3తో గెలుపొందాడు. 1995లో బోరిస్ బెకర్ తర్వాత యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరిన తొలి జర్మనీ ప్లేయర్‌గా జ్వెరెవ్ నిలిచాడు. జూనియర్‌స్థాయి నుంచి తన ప్రత్యర్థిగా ఉన్న చోరిచ్తో 3 గంటల 25 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జ్వెరెవ్ తొలి సెట్లో తేలిపోయాడు. మూడు డబుల్ ఫాల్ట్‌లు, 12 అనవసర తప్పిదాలు చేయడంతోపాటు తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి సెట్‌ను చేజార్చుకున్నాడు. అయితే రెండో సెట్ నుంచి జ్వెరెవ్ గాడిలో పడ్డాడు. ఈ సెట్లో ఇద్దరూ ఒక్కోసారి తమ సర్వీస్‌లను కోల్పోయారు. చివరకు టైబ్రేక్‌లో జ్వెరెవ్ పైచేయి సాధించాడు. మూడో సెట్లోనూ ఇద్దరూ ఒక్కోసారి తమ సర్వీస్‌లను కోల్పోయారు. చివరకు టైబ్రేక్‌లోనే ఫలితం వచ్చింది. ఈసారీ జ్వెరెవ్ ఆధిక్యం కనబరిచాడు. టైబ్రేక్‌లో రెండు సెట్లను కోల్పోయిన చోరిచ్ నాలుగో సెట్లో తడబడ్డాడు. ఎనిమిదో గేమ్‌లో చోరిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 5–3తో ఆధిక్యంలోకి వెళ్లిన జ్వెరెవ్ ఆ తర్వాత తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 6–3తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. కెరీర్లో 20 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన జ్వెరెవ్ కేవలం రెండోసారి మాత్రమే సెమీఫైనల్ దశకు అర్హత సాధించాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలిసారి అతను సెమీస్ చేరి డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో ఓడిపోయాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్లో చోటు కోసం సెమీఫైనల్లో 20వ సీడ్ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్)తో జ్వెరెవ్ ఆడతాడు. బుస్టా పోరాటం... ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)తో తొలి సెట్లో 6–5తో ఆధిక్యంలో ఉన్న దశలో జొకోవిచ్ కోపంలో బంతిని వెనక్కి కొట్టడం... అదికాస్తా లైన్ జడ్జికి తగలడంతో... నిర్వాహకులు జొకోవిచ్పై అనర్హత వేటు వేశారు. దాంతో పూర్తిస్థాయి మ్యాచ్ ఆడకుండానే కరెనో బుస్టా క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. అయితే క్వార్టర్ ఫైనల్లో కరెనో బుస్టాకు 12వ సీడ్ డెనిస్ షపోవలోవ్ (కెనడా) నుంచి గట్టిపోటీ ఎదురైంది. 4 గంటల 8 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో కరెనో బుస్టా 3–6, 7–6 (7/5), 7–6 (7/0), 0–6, 6–3తో గెలుపొంది సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఒసాకా అలవోకగా... కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన జపాన్ క్రీడాకారిణి నయోమి ఒసాకా సెమీఫైనల్ చేరింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ ఒసాకా 6–3, 6–4తో షెల్బీ రోజర్స్ (అమెరికా)పై గెలిచి సెమీఫైనల్లో 28వ సీడ్ జెన్నిఫర్ బ్రేడీ (అమెరికా)తో పోరాటానికి సిద్ధమైంది. షెల్బీ రోజర్స్‌తో 80 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఒసాకా ఏడు ఏస్‌లు సంధించి, మూడు బ్రేక్ పాయింట్లు సాధించింది. సెమీస్‌లో సెరెనా అమెరికా స్టార్ సెరెనా వరుసగా 11వ సారి యూఎస్ ఓపెన్‌లో సెమీస్ చేరింది. బుధవారం రాత్రి జరిగిన క్వార్టర్స్‌లో మూడో సీడ్ సెరెనా 4–6, 6–3, 6–2తో స్వెతానా పిరన్కోవా (బల్గేరియా)పై గెలిచింది. తొలి సెట్‌ను కోల్పోయిన సెరెనా వెంటనే కోలుకుంది. రెండో సెట్లోని ఎనిమిదో గేమ్‌లో పిరన్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 6–3తో సెట్‌ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో సెట్లోని తొలి గేమ్‌లో, ఏడో గేమ్‌లో పిరన్కోవా సర్వీస్‌లను బ్రేక్ చేసిన సెరెనా ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. -
బరిలో దిగుతానో... లేదో!
న్యూయార్క్: ఈ ఏడాది జరిగే యూఎస్ ఓపెన్‌లో ఆడాలా... వద్దా... అనే సందిగ్ధంలోనే ఉన్నానని జర్మనీ టెన్నిస్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ తెలిపాడు. ప్రస్తుతం అమెరికాలో కరోనా విజృంభణ తీవ్రంగా ఉండటమే అందుకు కారణమని 23 ఏళ్ల జ్వెరెవ్ వ్యాఖ్యానించాడు. ఒక టెన్నిస్ వెబ్సైట్ ఇంటర్వూ్యలో అతను మాట్లాడుతూ ‘ప్రస్తుతం అమెరికా పరిస్థితి బాగా లేదు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో యూఏస్ ఓపెన్‌లో ఆడే విషయంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. నా టీమ్‌తో చర్చించి త్వరలోనే ఈ విషయంపై స్పష్టతనిస్తా’ అని పేర్కొన్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియాకు చెందిన మహిళల ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ, పురుషుల సింగిల్స్ ఆటగాడు నిక్ కిరియోస్ టోర్నీలో ఆడటం లేదని ప్రకటించారు. యూఎస్ ఓపెన్ ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరుగనుంది. -
సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటానని చెప్పి..
-
సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటానని చెప్పి..
బెర్లిన్: కరోనా మహమ్మారి విషయంలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ ఈ వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌తో ఇబ్బందుల్లో పడిన వర్ధమాన టెన్నిస్ క్రీడాకారుల కోసం నిధులు సేకరించాలనే సదుద్దేశంతో జొకోవిచ్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ టోర్నీ నిర్వహించగా, అది వారి పాలిట శాపంగా మారింది. ఈ ఎగ్జిబిషన్ టోర్నీలో పాల్గొన్న ప్రపంచ 19వ ర్యాంకర్ గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా), క్రొయేషియా ఆటగాడు బోర్నా చోరిచ్, నొవాక్ ఫిట్నెస్ కోచ్ మార్కో పానిచిలు సైతం ఈ మహమ్మారి బారిన పడ్డారు. కాగా, ఇదే టోర్నీల్లో పాల్గొన్న మిగతా వారిని సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించగా, జర్మనీకి చెందని అలెగ్జాండర్ జ్వెరెవ్ దానిని అతిక్రమించాడు. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిన జ్వెరెవ్ ఎంచక్కా పార్టీ చేసుకున్నాడు. ఒక క్లబ్లో విపరీతమైన జన సందోహంలో జ్వెరెవ్ పార్టీ చేసుకుని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో విమర్శల పాలయ్యాడు. అసలు ఆ ఆడ్రియా టూర్లో భాగంగా ఎగ్జిబిషన్ టోర్నీలో పాల్గొన్నందుకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన జ్వెరెవ్.. మాట వరసకు చెప్పాలి కదా అనే సూత్రాన్ని మాత్రమే పాటించినట్లున్నాడు. ఒకసారి ప్రజలకు, అభిమానులకు క్షమాపణలు చెప్పి సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటానన్న జ్వెరెవ్.. ఏకంగా క్లబ్‌లోనే సందడి చేశాడు. జనం మధ్యలో దూరి డ్యాన్స్ మరీ చేశాడు. దాంతో నెటిజన్లు జ్వెరెవ్‌ను ఏకిపారేస్తున్నారు.(జొకోవిచ్‌నూ వదలని మహమ్మారి) ‘ఒక ప్రైవేట్ క్లబ్లో జ్వెరెవ్ చిందులు వేస్తూ కనిపించడం క్లియర్‌గా కనిపించింది. ఇదేనా సెల్ఫ్ ఐసోలేషన్’ అంటూ ఒకరు విమర్శించగా, ‘ఆరు రోజుల క్రితం ఏమి చెప్పావ్ జ్వెరెవ్.. ఇప్పుడు ఏమి చేస్తున్నావ్’ అంటూ మరొకరు మండిపడ్డారు. ‘ ఆటగాళ్లు రూల్స్ ఫాలో కావడం లేదు అనే దానికి ఇదొక ఉదాహరణ. ఇది చాలా బాధపెట్టే అంశం. మిగతా వారిని కూడా ప్రమాదంలోకి నెట్టడం భావ్యమా’ అని మరొకరు విమర్శించారు ‘పబ్లిక్కు సంబంధించి గైడ్‌లైన్స్ ఉన్నప్పుడు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తావా.. ఇదే ఒక సెలబ్రెటీగా నువ్వు ఇచ్చే సందేశం’ అని అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు. -
వారెవ్వా థీమ్
పెద్దగా అంచనాలు లేవు... గ్రాండ్ స్లామ్ హార్డ్ కోర్టులపై గత రికార్డు చూసుకున్నా క్వార్టర్స్ దాటని ఆటతీరు... ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్లో అన్‌సీడెడ్ ఆటగాడు అలెక్స్ బోల్ట్‌పై ఐదు సెట్ల పాటు పోరాడి అతికష్టం మీద గెలుపు ఇలా చెమటోడుస్తూ సాగిన డొమినిక్ థీమ్ ఏ దశలోనూ టైటిల్ ఫేవరెట్‌గా కనబడలేదు. అయితే క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్ వన్ రాఫెల్ నాదల్‌ను ఓడించి అందరి కళ్లను తన వైపు తిప్పుకున్న అతను... తాజాగా సెమీస్ పోరులో జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై నాలుగు సెట్లలో విజయం సాధించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచి వారెవ్వా అనిపించాడు. ఆదివారం జరిగే పురుషుల ఫైనల్లో నొవాక్ జొకోవిచ్‌తో అమీతుమీకి థీమ్ సిద్ధమయ్యాడు. మెల్బోర్న్: రాడ్ లేవర్ ఎరీనాలో కిక్కిరిసిన జనం మధ్య మరోసారి మూడు గంటలకు పైగా సాగిన పోరులో ఐదో సీడ్ డొమినిక్ థీమ్ మరో అద్భుత విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో థీమ్ 3–6, 6–4, 7–6 (7/3), 7–6 (7/4)తో అలెగ్జాండర్ జ్వెరెవ్(జర్మనీ)ను చిత్తు చేశాడు. దాంతో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆ స్ట్రియా ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా థీమ్‌కు ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్ ఎంట్రీ కావడం విశేషం. 2018, 2019లలో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరి నాదల్ చేతిలో ఓడాడు. ఆదివారం జరిగే ఫైనల్ పోరులో 17వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన జొకోవిచ్‌తో ఫైట్‌కు థీమ్ సిద్ధమయ్యాడు. తొలి సెట్‌ను కోల్పోయినా... 3 గంటల 42 నిమిషాల పాటు సాగిన ఈ పోరును థీమ్ తడబడుతూ ఆరంభించాడు. తొలి సెట్ మొదటి గేమ్‌లోనే తన సర్వీస్‌ను కోల్పోయాడు. అయితే ఆ మరుసటి గేమ్‌లో ప్రత్యర్థి జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 1–1తో సమం చేశాడు. అయితే ఎనిమిదో గేమ్‌లో థీమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్... అనంతరం తన గేమ్‌ను కాపాడుకోవడంతో 6–3తో తొలి సెట్‌ను గెల్చుకున్నాడు. ఇక రెండో సెట్లో దూకుడు కనబర్చిన 26 ఏళ్ల థీమ్ గ్రౌండ్ స్ట్రోక్ షాట్లతో జ్వెరెవ్‌ను ముప్పతిప్పలు పెట్టాడు. అంతేకాకుండా అతడి సర్వీస్‌ను రెండు సార్లు బ్రేక్ చేసిన థీమ్ 6–4తో సెట్‌ను సొంతం చేసుకోవడంతో... రెండు సెట్లు ముగిసే సరికి ఇరు ఆటగాళ్లు 1–1తో సమంగా నిలిచారు. కీలకమైన మూడో సెట్ టై బ్రేక్‌కు దారితీయగా... అక్కడ క్రాస్ కోర్టు, బ్యాక్ హ్యాండ్ షాట్లతో హోరెత్తించిన థీమ్... టై బ్రేక్‌ను సొంతం చేసుకొని తొలిసారి మ్యాచ్‌లో 2–1తో ఆధిక్యంలో నిలిచాడు. నాలుగో సెట్లో ఇద్దరు కూడా తమ సర్వీస్‌లను 12 గేమ్‌ల పాటు నిలుపుకోవడంతో... సెట్ మరోసారి టై బ్రేక్‌కు దారితీసింది. ఇక్కడ వరుసగా మూడు అనవసర తప్పిదాలు చేసిన జ్వెరెవ్ మూడు పాయింట్లను ప్రత్యర్థికి కోల్పోయాడు. ఈ ఆధిక్యాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న థీమ్ ఫోర్ హ్యాండ్ విన్నర్‌తో టై బ్రేక్‌ను గెలుచుకోవడంతో పాటు తుది పోరుకు అర్హత సాధించాడు. థీమ్ ఈ మ్యాచ్‌లో 10 ఏస్‌లు సంధించి... నాలుగు డబుల్ ఫాల్ట్స్ చేయగా... జ్వెరెవ్ 16 ఏస్‌లు కొట్టి మూడు డబుల్ ఫాల్ట్స్ చేశాడు. మ్యాచ్ ఆసాంతం జ్వెరెవ్ 200 కి.మీ పైబడిన వేగంతో సర్వీస్ చేసినా... కీలక సమయంలో చేసిన అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను దూరం చేసుకున్నాడు. మహిళల డబుల్స్ విజేత మ్లదెనోవిచ్–బబోస్ జోడీ మహిళల డబుల్స్ విభాగంలో చాంపియన్స్‌గా రెండో సీడ్ క్రిస్టినా మ్లదెనోవిచ్ (ఫ్రాన్స్)– టిమియా బబోస్ (హంగేరీ) జోడీ నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మ్లదెనోవిచ్–బబోస్ జంట 6–2, 6–1తో టాప్ సీడ్ సు వి హెయ్ (చైనీస్ తైపీ)–బార్బోరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) ద్వయంపై వరుస సెట్లలో విజయం సాధించింది. మ్లదెనోవిచ్–బబోస్ ద్వయానికి ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. నేడు మహిళల సింగిల్స్ ఫైనల్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)*సోఫియా కెనిన్ (అమెరికా) మధ్యాహ్నం 2 గంటల నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం