టోక్యో: పురుషుల టెన్నిస్ చరిత్రలో అరుదైన ‘గోల్డెన్ స్లామ్’ ఘనతను సాధించాలని ఆశించిన వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు నిరాశ ఎదురైంది. టోక్యో ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ జొకోవిచ్ సెమీఫైనల్లో ఓటమి పాలయ్యాడు. అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) అద్భుత ఆటతీరుతో 1–6, 6–3, 6–1తో జొకోవిచ్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ పరాజయంతో జొకోవిచ్ కాంస్య పతకం కోసం పోరాడనున్నాడు. ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) నెగ్గడంతోపాటు ఒలింపిక్ స్వర్ణాన్ని సాధిస్తే దానిని ‘గోల్డెన్ స్లామ్’ ఘన తగా పరిగణిస్తారు. గతంలో మహిళల విభా గంలో స్టెఫీ గ్రాఫ్ (1988లో) మాత్రమే ఈ ఘనత సాధించింది. ఈ ఏడాది జొకోవిచ్ ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ టోర్నీలలో విజేతగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment