
మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భాగంగా గురువారం నార్వేకు చెందిన కాస్పర్ రాడ్, జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కాస్పర్ రాడ్.. జ్వెరెవ్‌ను (6-3,1-6,6-3)తో ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాడు. మూడు సెట్లలోనే మ్యాచ్‌ను ముగించిన కాస్పర్ రాడ్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే తన ట్రిక్‌తో ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు.
విషయంలోకి వెళితే.. మ్యాచ్ మధ్యలో రాడ్ సర్వీస్ చేయాల్సి ఉంది. జ్వెరెవ్ కోర్టు బయటకు వెళ్లి బంతిని రాడ్‌వైపు విసిరాడు. సాధారణంగా చేతితో అందుకుంటే సరిపోయేది..కానీ కాస్పర్ రాడ్ బంతి కచ్చితంగా తన జేబులో పడేలా ట్రిక్ చేయడం ఆసక్తి కలిగించింది. అతని టైమింగ్ ఎంతలా అంటే.. అతను తన జేబును ఓపెన్ చేయడం..బంతి వెళ్లి అతని పాకెట్‌లో పడడం జరిగిపోయింది. ఇది చూసిన అభిమానులు అతని ట్రిక్స్‌కు మంత్రముగ్దులై లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. దీనికి సంబంధించిన వీడియోను టెన్నిస్ టీవీ తన ట్విటర్‌లో షేర్ చేసింది.
చదవండి: పుట్‌బాల్ ప్రపంచకప్‌కు పోర్చుగల్
Ruud-iculous skills 😍@CasperRuud98 #MiamiOpen pic.twitter.com/3NZCRN3p2b
— Tennis TV (@TennisTV) March 31, 2022