Miami Open tennis
-
సినెర్ ఖాతాలో మయామి మాస్టర్స్ టైటిల్
ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ మూడో ప్రయత్నంలో మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఫ్లోరిడాలో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సినెర్ 6–3, 6–1తో దిమిత్రోవ్ (బల్గేరియా)పై గెలిచాడు. 2021, 2023లలో రన్నరప్‌గా నిలిచిన సినెర్ ఈసారి మాత్రం టైటిల్‌ను వదల్లేదు. సినెర్‌కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 16 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టైటిల్‌తో సినెర్ ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ ప్లేయర్‌గా నిలిచాడు. -
మయామి ఓపెన్ చాంపియన్ కోలిన్స్
ఈ ఏడాది ఆటకు వీడ్కోలు పలకనున్న అమెరికా టెన్నిస్ ప్లేయర్ డానియల్ కోలిన్స్ అద్భుతం చేసింది. మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోరీ్నలో చాంపియన్‌గా నిలిచింది. ఫ్లోరిడాలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 30 ఏళ్ల కోలిన్స్ 7–5, 6–3తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్)పై గెలిచింది.కోలిన్స్‌కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 16 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మార్టినా నవ్రతిలోవా, క్రిస్ ఎవర్ట్, వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్, స్లోన్ స్టీఫెన్స్ తర్వాత మయామి ఓపెన్ టైటిల్ నెగ్గిన ఆరో అమెరికన్ ప్లేయర్‌గా కోలిన్స్ గుర్తింపు పొందింది. -
Miami Masters: ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న జోడీ
మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఫ్లోరిడాలో సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 4–6, 7–6 (7/4), 10–4తో బొలెలీ–వావాసోరి (ఇటలీ) జోడీని ఓడించింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ (భారత్)–వీనస్ (న్యూజిలాండ్) జంట 6–7 (5/7), 4–6తో డోడిగ్ (క్రొయేషియా)–ఆస్టిన్ (అమెరికా) ద్వయం చేతిలో ఓడింది. -
Miami Open 2023: 13వ ప్రయత్నంలో సఫలం
ఫ్లోరిడా: ఎట్టకేలకు చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ పెట్రా క్విటోవా నిరీక్షణ ముగిసింది. ప్రతిష్టాత్మక మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 ప్రీమియర్ టోర్నమెంట్లో 33 ఏళ్ల క్విటోవా తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. గతంలో 12 సార్లు ఈ టోర్నీలో పాల్గొని ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయిన క్విటోవా 13వ ప్రయత్నంలో ఏకంగా టైటిల్ సాధించడం విశేషం. ప్రపంచ ఏడో ర్యాంకర్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్)తో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ క్విటోవా గంటా 42 నిమిషాల్లో 7–6 (16/14), 6–2తో విజయం సాధించింది. క్విటోవా కెరీర్లో ఇది 30వ సింగిల్స్ టైటిల్‌కాగా, డబ్ల్యూటీఏ–1000 విభాగంలో తొమ్మిదోది. ఈ గెలుపుతో క్విటోవా 2021 సెప్టెంబర్ తర్వాత మళ్లీ ప్రపంచ టాప్–10 ర్యాంకింగ్స్‌లోకి రానుంది. రెండు వారాల క్రితం ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో విజేతగా నిలిచి సూపర్ ఫామ్‌లో ఉన్న రిబాకినా ఫైనల్లో తొలి సెట్లో గట్టిపోటీ ఇచ్చింది. చివరకు 22 నిమిషాలపాటు జరిగిన టైబ్రేక్‌లో క్విటోవా పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో క్విటోవా దూకుడుకు రిబాకినా చేతులెత్తేసింది. కేవలం రెండు గేమ్‌లు మాత్రమే ఆమె గెల్చుకుంది. విజేతగా నిలిచిన క్విటోవాకు 12,62,220 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 10 కోట్ల 36 లక్షలు), రన్నరప్ రిబాకినాకు 6,62,360 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 కోట్ల 43 లక్షలు) లభించాయి. -
సూపర్ టైమింగ్.. ఎవరికి సాధ్యం కాని ఫీట్ అందుకున్నాడు
మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భాగంగా గురువారం నార్వేకు చెందిన కాస్పర్ రాడ్, జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కాస్పర్ రాడ్.. జ్వెరెవ్‌ను (6-3,1-6,6-3)తో ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాడు. మూడు సెట్లలోనే మ్యాచ్‌ను ముగించిన కాస్పర్ రాడ్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే తన ట్రిక్‌తో ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు. విషయంలోకి వెళితే.. మ్యాచ్ మధ్యలో రాడ్ సర్వీస్ చేయాల్సి ఉంది. జ్వెరెవ్ కోర్టు బయటకు వెళ్లి బంతిని రాడ్వైపు విసిరాడు. సాధారణంగా చేతితో అందుకుంటే సరిపోయేది..కానీ కాస్పర్ రాడ్ బంతి కచ్చితంగా తన జేబులో పడేలా ట్రిక్ చేయడం ఆసక్తి కలిగించింది. అతని టైమింగ్ ఎంతలా అంటే.. అతను తన జేబును ఓపెన్ చేయడం..బంతి వెళ్లి అతని పాకెట్లో పడడం జరిగిపోయింది. ఇది చూసిన అభిమానులు అతని ట్రిక్స్‌కు మంత్రముగ్దులై లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. దీనికి సంబంధించిన వీడియోను టెన్నిస్ టీవీ తన ట్విటర్లో షేర్ చేసింది. చదవండి: పుట్‌బాల్ ప్రపంచకప్‌కు పోర్చుగల్ Ruud-iculous skills 😍@CasperRuud98 #MiamiOpen pic.twitter.com/3NZCRN3p2b — Tennis TV (@TennisTV) March 31, 2022 -
తగ్గేదేలేదంటున్న టెన్నిస్ స్టార్ జకోవిచ్
వ్యాక్సిన్ తీసుకునే విషయంలో టెన్నిస్ మాజీ నెంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ మొండి వైఖరి వీడటం లేదు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఘోర అవమానం ఎదురైనా.. ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు కోల్పోయినా అతని వైఖరిలో ఏమాత్రం మార్పులేదు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో వ్యాక్సిన్ వేసుకోని కారణంగా బహిష్కరణకు గురైనప్పటికీ.. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తూ వ్యాక్సిన్‌కు ససేమిరా అంటున్నాడు జోకర్. ఇదే క్రమంలో తాజాగా మరో రెండు కీలక టోర్నీలకు దూరమయ్యాడు. అమెరికా వేదికగా ఈ నెలాకరున ప్రారంభంకానున్న ఇండియన్ వెల్స్ టోర్నీతో పాటు మియామి టోర్నీల నుంచి అతను తప్పుకున్నాడు. వ్యాక్సిన్ వేసుకోని విదేశీయులను తమ దేశంలోకి అనుమతించేది లేదని అమెరికా స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో జకోవిచ్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు. వ్యాక్సిన్ తీసుకునే విషయంలో తనను బలవంతం చేస్తే, ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమేనంటూ ఈ మాజీ నంబర్ వన్ ఆటగాడు గతంలో స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే, ఇప్పటివరకు 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలిచిన జకోవిచ్.. స్పానిష్ బుల్ రఫెల్ నదాల్ (21) తర్వాత అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. నదాల్ రికార్డును అధిగమించాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి అని తెలిసినా, జకో ఏమాత్రం బెట్టు వీడటం లేదు. వ్యాక్సిన్ విషయంలో జకో వైఖరి ఇలానే కొనసాగితే జూన్‌లో జరగబోయే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడేది కూడా అనుమానమే. చదవండి: బీసీసీఐ ద్వంద్వ వైఖరి.. కోహ్లి విషయంలో అలా, రోహిత్ కోసం ఇలా..! -
మయామి ఓపెన్ చాంప్ హుర్కాజ్
ఫ్లోరిడా: పురుషుల టెన్నిస్ స్టార్స్ ఫెడరర్, రాఫెల్ నాదల్, జొకోవిచ్, డొమినిక్ థీమ్ గైర్హాజరీలో మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో పోలాండ్ ప్లేయర్ హుబర్ట్ హుర్కాజ్ చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో హుర్కాజ్ 7–6 (7/4), 6–4తో ఇటలీకి చెందిన 19 ఏళ్ల జానిక్ సినెర్‌పై గెలుపొందాడు. హుర్కాజ్ కెరీర్లో ఇదే తొలి మాస్టర్స్ సిరీస్ టైటిల్. విజేతగా నిలిచిన హుర్కాజ్‌కు 3,00,110 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 22 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. టైటిల్ గెలిచే క్రమంలో ఐదో ర్యాంకర్ సిట్సిపాస్ (గ్రీస్)పై, ఎనిమిదో ర్యాంకర్ ఆండ్రీ రుబెŠల్వ్ (రష్యా)పై, 11వ ర్యాంకర్ షపోవలోవ్ (కెనడా)పై, 19వ ర్యాంకర్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)పై నెగ్గడం విశేషం. ఈ విజయంతో హుర్కాజ్ సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 21 స్థానాలు పురోగతి సాధించి 37వ ర్యాంక్ నుంచి 16వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. -
మెయిన్ ‘డ్రా’కు ప్రజ్నేశ్
మయామి: భారత నంబర్‌వన్ సింగిల్స్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ మయామి ఓపెన్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో మెయిన్ డ్రాకు అర్హత సంపాదించాడు. ఇటీవల ఇండియన్ వెల్స్లోనూ మెయిన్ డ్రా చేరిన అతను వారం వ్యవధిలో వరుసగా రెండో మాస్టర్స్ టోర్నీలో ఈ ఘనత సాధించాడు. గురువారం జరిగిన రెండో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అతను 6–4, 6–4తో బ్రిటన్‌కు చెందిన క్లార్క్‌ను కంగుతినిపించాడు. ఈ వారమే కెరీర్ బెస్ట్ సింగిల్స్ 84వ ర్యాంకుకు ఎగబాకిన ప్రజ్నేశ్ వరుస సెట్లలో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వకుండా చెలరేగాడు. శుక్రవారం జరిగే మెయిన్ డ్రా తొలి రౌండ్ మ్యాచ్‌లో 29 ఏళ్ల భారత ఆటగాడు జేమ్ మునర్ (స్పెయిన్)తో తలపడతాడు. -
క్వార్టర్స్‌లో సానియా జంట
మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)–బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో సానియా–స్ట్రికోవా ద్వయం 1–6, 6–1, 10–4తో ‘సూపర్ టైబ్రేక్’లో తిమియా బాబోస్ (హంగేరి)–అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా) జోడీపై గెలిచింది. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు తమ సర్వీస్‌లను మూడేసి సార్లు కోల్పోయాయి. అయితే సూపర్ టైబ్రేక్‌లో సానియా–స్ట్రికోవా జంట పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో వానియా కింగ్ (అమెరికా)–ష్వెదోవా (కజకిస్తాన్)లతో సానియా–స్ట్రికోవా తలపడతారు.