మయామి ఓపెన్‌ చాంప్‌ హుర్కాజ్‌  | Miami Open Masters Series Champion Was Hubert‌‌ | Sakshi
Sakshi News home page

మయామి ఓపెన్‌ చాంప్‌ హుర్కాజ్‌ 

Published Tue, Apr 6 2021 10:10 AM | Last Updated on Tue, Apr 6 2021 10:52 AM

Hubert‌ Hurkaz‌ Was Champion Of Miami Open‌ Masters‌ Series - Sakshi

ఫ్లోరిడా: పురుషుల టెన్నిస్‌ స్టార్స్‌ ఫెడరర్, రాఫెల్‌ నాదల్, జొకోవిచ్, డొమినిక్‌ థీమ్‌ గైర్హాజరీలో మయామి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీలో పోలాండ్‌ ప్లేయర్‌ హుబర్ట్‌ హుర్కాజ్‌ చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో హుర్కాజ్‌ 7–6 (7/4), 6–4తో ఇటలీకి చెందిన 19 ఏళ్ల జానిక్‌ సినెర్‌పై గెలుపొందాడు. హుర్కాజ్‌ కెరీర్‌లో ఇదే తొలి మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌. విజేతగా నిలిచిన హుర్కాజ్‌కు 3,00,110 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 22 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

టైటిల్‌ గెలిచే క్రమంలో ఐదో ర్యాంకర్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)పై, ఎనిమిదో ర్యాంకర్‌ ఆండ్రీ రుబెŠల్‌వ్‌ (రష్యా)పై, 11వ ర్యాంకర్‌ షపోవలోవ్‌ (కెనడా)పై, 19వ ర్యాంకర్‌ మిలోస్‌ రావ్‌నిచ్‌ (కెనడా)పై నెగ్గడం విశేషం. ఈ విజయంతో హుర్కాజ్‌ సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 21 స్థానాలు పురోగతి సాధించి 37వ ర్యాంక్‌ నుంచి 16వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement