
మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది.
ఫ్లోరిడాలో సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 4–6, 7–6 (7/4), 10–4తో బొలెలీ–వావాసోరి (ఇటలీ) జోడీని ఓడించింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ (భారత్)–వీనస్ (న్యూజిలాండ్) జంట 6–7 (5/7), 4–6తో డోడిగ్ (క్రొయేషియా)–ఆస్టిన్ (అమెరికా) ద్వయం చేతిలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment