Rohan Bopanna
-
యూకీ జోడీ సంచలనం
దోహా: ఖతర్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్స్ యూకీ బాంబ్రీ, రోహన్ బోపన్నలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో యూకీ బాంబ్రీ (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీ ఏకంగా ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జంటను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... రోహన్ బోపన్న (భారత్)–నునో బోరెజెస్ (పోర్చుగల్) ద్వయం క్వార్టర్ ఫైనల్లో ఇంటిదారి పట్టింది. ప్రపంచ నంబర్‌వన్ జంట మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడార్)–మాట్ పావిక్ (క్రొయేషియా)లతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ–డోడిగ్ 2–6, 6–3, 10–8తో విజయం సాధించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ–డోడిగ్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్విస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. అయితే ‘సూపర్ టైబ్రేక్’లో యూకీ–డోడిగ్ ద్వయం పైచేయి సాధించింది. జూలియన్ క్యాష్–లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్)లతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న–బోర్జెస్ 4–6, 7–6 (7/5), 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఓటమి పాలయ్యారు. -
బోపన్న జోడీ సంచలనం
దోహా: ఖతర్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–నునో బోర్జెస్ (పోర్చుగల్) జోడీ సంచలన విజయంతో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో బోపన్న–బోర్జెస్ ద్వయం 7–6 (7/2), 7–6 (7/4)తో రెండో సీడ్ సిమోన్ బొలెలీ–ఆండ్రియా వావాసోరి (ఇటలీ) జంటను బోల్తా కొట్టించింది. 89 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఏడు ఏస్‌లు సంధించింది. మ్యాచ్ మొత్తంలో రెండు జంటలు తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్‌లు అనివార్యమయ్యాయి. టైబ్రేక్‌లో బోపన్న–బోర్జెస్ పైచేయి సాధించి విజయాన్ని అందుకోవడంతోపాటు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు. -
‘నంబర్ వన్’గా సహజ.. సుమిత్, బోపన్నలకు షాక్!
సాక్షి, హైదరాబాద్: రెండు నెలల విరామం తర్వాత తెలంగాణ టెన్నిస్ క్రీడాకారిణి సహజ యామలపల్లి(Sahaja Yamalapalli) మళ్లీ టాప్–300లోకి దూసుకు వచ్చింది. సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ-WTA) తాజా సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సహజ ఏకంగా 21 స్థానాలు పురోగతి సాధించి 294వ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంక్ సహజదే కావడం విశేషం. ఫలితంగా ఆమె మళ్లీ భారత నంబర్‌వన్ ప్లేయర్‌గా నిలిచింది. తొమ్మిది స్థానాలు పడిపోయిన అంకిత రైనా 295వ ర్యాంక్‌కు చేరుకోగా... తెలంగాణకే చెందిన మరో ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక 332వ ర్యాంక్‌లో ఉంది. ఇక 2024 నవంబర్ 286వ స్థానంలో నిలిచిన సహజ ఆ తర్వాత ర్యాంకింగ్స్‌లో పడిపోయి 300 నుంచి బయటకు వచ్చింది. అయితే గతవారం బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ100 టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకోవడంతో ఆమె ర్యాంక్ మెరుగైంది. నగాల్ ర్యాంక్ 106 న్యూఢిల్లీ: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్ సుమిత్ నగాల్(Sumit Nagal) ర్యాంక్ దిగజారింది. పది నెలల తర్వాత అతను టాప్–100లో చోటు కోల్పోయాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో నగాల్ 15 స్థానాలు పడిపోయి 106వ ర్యాంక్‌లో నిలిచాడు. గత ఏడాది ఫిబ్రవరిలో టాప్–100లోకి వచ్చిన నగాల్ గత వారం వరకు వందలోపు కొనసాగాడు. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓడిపోవడంతో నగాల్ ర్యాంక్ పడిపోయింది. భారత్‌కే చెందిన శశికుమార్ ముకుంద్ 365వ ర్యాంక్‌లో, రామ్‌కుమార్ రామనాథన్ 406వ ర్యాంక్‌లో, కరణ్ సింగ్ 496వ ర్యాంక్‌లో ఉన్నారు.టాప్–20లో చోటు కోల్పోయిన బోపన్న మరోవైపు పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న(Rohan Bopanna) ఐదు స్థానాలు పడిపోయి 21వ ర్యాంక్‌లో నిలిచాడు. గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్‌లో విజేతగా నిలిచిన బోపన్న ఈసారి తొలి రౌండ్లోనే వెనుదిరగడం అతని ర్యాంక్‌పై ప్రభావం చూపింది. టాప్–100లో భారత్ నుంచి ఆరుగురు ఉండటం విశేషం. యూకీ బాంబ్రీ 47వ ర్యాంక్‌లో ఎలాంటి మార్పులేదు. శ్రీరామ్ బాలాజీ 64వ ర్యాంక్‌లో ఉండగా... హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రితి్వక్ చౌదరీ ఏడు స్థానాలు పడిపోయి 79వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అర్జున్ ఖడే 83వ ర్యాంక్‌లో, జీవన్ నెడుంజెళియన్ సరిగ్గా 100వ ర్యాంక్‌లో ఉన్నారు. -
దేశవాళీ టోర్నీలు పెంచాలి
టెన్నిస్ క్రీడకు మరింత ఆదరణ లభించాలంటే... దేశవాళీ టోర్నీలు విరివిగా నిర్వహించాలని భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న అభిప్రాయపడ్డాడు. టెన్నిస్ సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న 44 ఏళ్ల బోపన్న... భారత్‌లో టెన్నిస్ భవిష్యత్తు, యువ ఆటగాళ్ల ముందున్న సవాళ్లు, తన సహచరుడు మాథ్యూ ఎబ్డెన్తో విడిపోయి కొత్త భాగస్వామితో కలిసి ఆడనుండటం తదితర అంశాలపై స్పష్టత ఇచ్చాడు. బోపన్న పంచుకున్న వివరాలు అతడి మాటల్లోనే...» మన దేశంలో టెన్నిస్ భవిష్యత్తు కోసం మొదట అఖిల భారత టెన్నిస్ సంఘాన్ని క్రమబద్దీకరించాలి. దాని ఆధ్వర్యంలో జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా టోర్నమెంట్లు నిర్వహించాలి. దేశవాళీ సర్క్యూట్‌ను బలంగా నిర్మించాలి. ‘ఫ్యూచర్స్’, ‘చాలెంజర్స్’ వంటి టోర్నీలు అవసరమే అయినా... వాటితో పాటు దేశవాళీ టోర్నీలు కూడా చాలా ముఖ్యం. » జూనియర్ స్థాయిలో రాణించిన ఎందరో ప్లేయర్లు 18 ఏళ్ల తర్వాత ఏ టోర్నీల్లో పాల్గొనాలో తెలియక ఆటకు స్వస్తి చెబుతున్నారు. తదుపరి స్థాయిలో పోటీపడేందుకు ప్రతి ఒక్కరికీ ఆర్థిక పరమైన వెసులుబాటు ఉండదు. పెద్ద టోర్నీల కోసం ప్రయాణాలు చేయడం అంటే ఖర్చుతో కూడుకున్న పని. దీంతో ప్రతిభావంతులు ఆటకు దూరం అవుతున్నారు. దేశవాళీ టోర్నీల్లో పెద్దగా నగదు ప్రోత్సాహకాలు ఉండకపోవడం ఇందుకు కారణం. అందుకే దీన్ని మరింత బలోపేతం చేసి ఒక వ్యవస్థగా మార్చాలి. » గత రెండేళ్లుగా అందరూ నా రిటైర్మెంట్ గురించి అడుగుతున్నారు. అయితే అదే సమయంలో రెండేళ్లుగా నేను అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సీజన్ ముగింపు టోర్నీలకు అర్హత సాధించాను. అంటే, సీజన్ ఆసాంతం బాగా ఆడాననే కదా అర్థం. మరి అలాంటప్పుడు వీడ్కోలు ఆలోచనలు ఎందుకు వస్తాయి. » ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నా.. శారీరకంగా మానసికంగా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం. ఇలాంటప్పుడు రిటైర్మెంట్ ఆలోచన కూడా దరిచేరనివ్వను. » కెరీర్ చరమాంకంలో ఉన్నాననే విషయాన్ని పట్టించుకోను. గత 12 నెలల కాలంలో మెరుగైన ప్రదర్శన కనబర్చాను. శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. » సహచరుడు మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసింది. చాన్నాళ్లుగా మేం కలిసి ఆడుతున్నాం. ఎందుకు విడిపోవాలనుకున్నాడో ఎబ్డెన్కే తెలియాలి. అతడి కారణాలు అతడికి ఉంటాయి. గత ఏడాది యూఎస్ ఓపెన్ సమయంలో అతను వేరే ఆటగాడితో కలిసి ఆడనున్నట్లు మొదట చెప్పాడు. ఆ తర్వాత తిరిగి నాతో కలిసి కోర్టులో అడుగుపెట్టాడు. ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కావడం లేదు. » ఎబ్డెన్ తన నిర్ణయం ఆలస్యంగా వెల్లడించడంతో నికోలస్ బారియెంటాస్ (కొలంబియా)తో కలిసి ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడాలని నిర్ణయించుకున్నా. డిఫెండింగ్ చాంపియన్ కావడంతో సీడింగ్ లభించనుంది. గతంలో నికోలస్‌తో ప్రత్యరి్థగా తలపడ్డాను. అతడి బేస్‌లైన్ గేమ్ బలంగా ఉంటుంది. » బారియోంటాస్తో కలిసి ప్రస్తుతానికి రెండు టోర్నీలు ఆడాలని నిర్ణయించుకున్నా. అడిలైడ్ ఓపెన్‌తో పాటు, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కలిసి ఆడుతాం. ఈ రెండు టోర్నీల తర్వాత ర్యాంకింగ్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పాయింట్లు కాపాడుకోకపోతే మాస్టర్స్ టోర్నీ ‘డ్రా’లలో అవకాశం లభించదు. అందుకే ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాతే దీనిపై స్పష్టత వస్తుంది. -
విజయంతో ముగించిన బోపన్న–ఎబ్డెన్ జోడీ
ట్యూరిన్: భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న 2024 సీజన్‌ను విజయంతో ముగించాడు. సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచింది. ‘బాబ్ బ్రయాన్ గ్రూప్’లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించిన బోపన్న–ఎబ్డెన్ ద్వయం... శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 7–5, 6–7 (6/8), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో కెవిన్ క్రావిట్జ్–టిమ్ ప్యూట్జ్ (జర్మనీ) జంటను ఓడించింది. ఈ క్రమంలో బోపన్న (44 ఏళ్ల 8 నెలలు) ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో విజయం సాధించిన అతి పెద్ద వయసు్కడిగా రికార్డు నెలకొల్పాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన క్రావిట్జ్–ప్యూట్జ్ జోడీ ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకుంది. 2023లో ఎబ్డెన్తో జతకట్టిన బోపన్న ఈ టోరీ్నలో చివరిసారి అతనితో కలసి ఆడాడు. వచ్చే సీజన్లో వీరిద్దరు వేర్వేరు భాగస్వాములతో బరిలోకి దిగుతారు. ఓవరాల్‌గా బోపన్న–ఎబ్డెన్ జంట ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్‌తో కలిపి నాలుగు ఏటీపీ టోరీ్నల్లో టైటిల్స్ గెల్చుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను కూడా సాధించింది. -
పోరాడి ఓడిన బోపన్న జోడీ
షాంఘై: భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నకు మరో టోర్నీలో నిరాశ ఎదురైంది. షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్ ఏటీపీ–1000 టోర్నీ నుంచి రోహన్ బోపన్న (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ బోపన్న–డోడిగ్ జోడీ 6–7 (5/7), 6–2, 12–14తో ‘సూపర్ టైబ్రేక్’లో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నికోలా మెక్టిక్ (క్రొయేషియా) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది. గంటా 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–డోడిగ్ నాలుగు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన బోపన్న–డోడిగ్‌లకు 34,100 డాలర్ల (రూ. 28 లక్షల 63 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మూడో రౌండ్లో జొకోవిచ్ 6–1, 6–2తో ఫ్లావియో కొబోలి (ఇటలీ)పై గెలుపొందాడు. టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ), మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. -
బోపన్న జోడీ గెలుపు
న్యూఢిల్లీ: షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్ ఏటీపీ–1000 టెన్నిస్ టోర్నలో రోహన్ బోపన్న (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీ శుభారంభం చేసింది. చైనాలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–డోడిగ్ ద్వయం 6–4, 6–3తో పాబ్లో కరెనో బుస్టా–పెడ్రో మారి్టనెజ్ (స్పెయిన్) జోడీపై విజయం సాధించింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సరీ్వస్‌ను ఒకసారి కోల్పోయిన బోపన్న, డోడిగ్ ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
బోపన్న జోడీకి చుక్కెదురు
చైనా ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ రోహన్ బోపన్నకు నిరాశ ఎదురైంది. బీజింగ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో రెండో సీడ్ బోపన్న (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంట తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–డోడిగ్ జంట 5–7, 6–7 (4/7)తో సెరున్‌డొలో (అర్జెంటీనా)–నికోలస్ జారీ (చిలీ) ద్వయం చేతిలో ఓడిపోయింది. బోపన్న–డోడిగ్‌లకు 15,960 డాలర్ల (రూ. 13 లక్షల 35 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
US Open 2024: సెమీస్‌లో ఓడిన బోపన్న జోడీ
యూఎస్ ఓపెన్ 2024లో భారత్ పోరాటం ముగిసింది. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో 8వ సీడ్ బోపన్న-అల్దిలా సుత్జియాది(ఇండోనేషియా) జోడీ 3-6, 4-6 తేడాతో అమెరికా జంట డొనాల్డ్ యంగ్-టేలర్ టౌన్సెండ్ చేతిలో ఓటమిపాలైంది. సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న- సుత్జియాది జోడీ నాలుగో సీడ్ మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)-క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై 7-6(7-4), 2-6, 10-7 తేడాతో విజయం సాధించి సెమీస్‌కు చేరింది.అంతకుముందు పురుషుల డబుల్స్‌లోనూ బోపన్న- ఎబ్డెన్ జోడీ మూడో రౌండ్లో అనూహ్యంగా ఓటమి పాలైంది. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన బోపన్న – ఎబ్డెన్ జోడీ.. మాగ్జిమో గొంజాలెజ్, అండ్రెస్ మొల్తెనీ జోడీ చేతిలో 1-6, 5-7 తేడాతో ఖంగుతింది.పురుషులు సింగిల్స్ విషయానికొస్తే.. వరల్డ్ నెంబర్‌వన్ జనెక్ సినర్ క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టాడు. సెమీస్ బెర్త్ కోసం సినర్ మాజీ ఛాంపియన్ డానిల్ మెద్వెదెవ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. -
నిరాశపరిచిన బోపన్న-బాలాజీ జోడీ.. తొలి రౌండ్లోనే ఔట్
ప్యారిస్ ఒలింపిక్స్-2024 టెన్నిస్‌లో భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీ జోడీ మొదటి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. సోమవారం జరిగిన తొలి రౌండ్లో ఫ్రాన్స్‌కు చెందిన గేల్ మోన్ఫిల్స్, ఎడ్వర్డ్ రోజర్-వాసెలిన్ జోడీ చేతిలో 7-5, 6-2 తేడాతో బోపన్న-శ్రీరామ్ జంట ఓటమి పాలైంది.టెన్నిస్ మెన్స్ సింగిల్స్‌లో సుమిత్ నాగల్ తొలి రౌండ్లో నిష్క్రమించడంతో అందరి ఆశలు రోహన్ బోపన్న, శ్రీరామ్‌లపై ఉండేవి. ఇప్పుడు వీరిద్దరూ కూడా వరుస సెట్లలో ఓడిపోయి నిరాశపరిచారు. తొలి సెట్లో ఫ్రెంచ్ జోడీకి బోపన్న, బాలాజీ గట్టిపోటీని అందించగా.. రెండో సెట్ లో భారత జోడీ ఏమాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. -
బోపన్న జోడీ ఓటమి
సించ్ చాంపియన్‌షిప్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ 6–7 (1/7), 6–7 (3/7)తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)–ఖచనోవ్ (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది. బోపన్న–ఎబ్డెన్‌లకు 18,690 పౌండ్ల (రూ. 19 లక్షల 75 వేలు) ప్రైజ్‌మనీ, 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
స్వియాటెక్ ఫటాఫట్...
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ‘హ్యాట్రిక్’ టైటిల్‌పై గురి పెట్టిన ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ ఆ దిశగా మరో అడుగు వేసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ అదరగొట్టింది. రష్యా ప్లేయర్ అనస్తాసియా పొటపోవాతో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ స్వియాటెక్ (పోలాండ్) 6–0, 6–0తో ఘనవిజయం సాధించింది. కేవలం 40 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్ మూడు ఏస్‌లు సంధించింది. ప్రత్యర్థి సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. 13 విన్నర్స్ కొట్టిన ఆమె నెట్ వద్ద ఆరు పాయింట్లు గెలిచింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–1, 6–2తో ఎలిసబెట్టా కొకైరెట్టో (ఇటలీ)పై, ఐదో సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 6–4, 6–2తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అల్కరాజ్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), తొమ్మిదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అల్కరాజ్ 6–3, 6–3, 6–1తో అగుర్ అలియాసిమ్ (కెనడా)పై, సిట్సిపాస్ 3–6, 7–6 (7/4), 6–2, 6–2తో మాటియో అర్నాల్డి (ఇటలీ)పై గెలుపొందారు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్ మ్యాచ్‌లో విజయం కోసం తీవ్రంగా శ్రమించాడు. 4 గంటల 29 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ 7–5, 6–7 (6/8), 2–6, 6–3, 6–0తో లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ పురుషుల డబుల్స్‌లో రెండో సీడ్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఆదివారం జరిగిన తొలి రౌండ్లో బోపన్న–ఎబ్డెన్ జోడీ 7–5, 4–6, 6–4తో ఒర్లాండో లుజ్–మార్సెలో జొర్మాన్ (బ్రెజిల్) జంటను ఓడించింది. రెండో రౌండ్లో బోపన్న–ఎబ్డెన్లతో ఆడాల్సిన సెబాస్టియన్ బేజ్ (అర్జెంటీనా)–థియాగో వైల్డ్ (బ్రెజిల్) టోర్నీ నుంచి వైదొలిగారు. దాంతో బోపన్న–ఎబ్డెన్ రెండో రౌండ్ మ్యాచ్ ఆడకుండానే నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో)లతో బోపన్న–ఎబ్డెన్ ఆడతారు. -
రష్మిక ఓటమి.. సుమిత్ నగాల్ ర్యాంక్ 93...
ఫ్లోరిడా: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ–75 మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక మెయిన్ ‘డ్రా’కు చేరుకోలేకపోయింది. క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్ మ్యాచ్‌లో రష్మిక 3–6, 0–6తో అకాషా ఉర్హోబో (అమెరికా) చేతిలో ఓడిపోయింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయింది. సుమిత్ నగాల్ ర్యాంక్ 93... అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ (ఏటీపీ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ ర్యాంక్ దిగజారింది. తాజా ర్యాంకింగ్స్‌లో సుమిత్ 11 స్థానాలు పడిపోయి 93వ ర్యాంక్‌లో నిలిచాడు. డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న రెండు స్థానాలు పడిపోయి నాలుగో ర్యాంక్‌లో ఉన్నాడు. భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీ 55వ ర్యాంక్‌లో, శ్రీరామ్ బాలాజీ 83వ ర్యాంక్‌లో, విజయ్ సుందర్ ప్రశాంత్ 98వ ర్యాంక్‌లో ఉన్నారు. -
‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’
మోంటెకార్లో: భారత ఆటగాడు రోహన్ బోపన్న 44 ఏళ్ల వయసులో టెన్నిస్ వరల్డ్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఇటీవలే నంబర్‌వన్‌కు చేరాడు. సింగిల్స్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ కూడా తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన అతి పెద్ద వయస్కుడిగా (36 ఏళ్లు) గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య తమ వయసుకు సంబంధించిన ఆసక్తికర సంభాషణ జరిగింది. ‘టెన్నిస్ మనకు ఎంతో నేర్పించింది. అనుభవం మంచి విజయాలు అందిస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత ఉంది‘ అని బోపన్న వ్యాఖ్యానించగా... ‘అనుభవం మాత్రమే కాదు. ప్రతీ రోజు ఆట పట్ల అంకితభావం చూపడమే మనల్ని ఈ స్థానంలో నిలిపింది’ అని జొకోవిచ్ బదులిచ్చాడు. ఇద్దరు నంబర్‌వన్ ఆటగాళ్లు కలిసిన అరుదైన ఘట్టం సెర్బియా, భారత టెన్నిస్‌కు సంబంధించి ప్రత్యేకమైందన్న జొకోవిచ్...త్వరలోనే భారత గడ్డపై ఆడాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ తమ సంభాషణను నమస్తేతో జొకోవిచ్ ముగించాడు. -
మళ్లీ నంబర్‌వన్‌గా బోపన్న.. తన రికార్డు తానే తిరగరాసుకున్నాడు
ఫ్లోరిడా: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. గతవారం రెండో ర్యాంక్‌లో నిలిచిన 44 ఏళ్ల రోహన్ బోపన్న తన భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. దాంతో సోమ వారం విడుదల చేసిన ఏటీపీ తాజా ర్యాంకింగ్స్‌లో బోపన్న ఒక స్థానం మెరుగుపర్చుకొని టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్ సుమిత్ నగాల్ కెరీర్ బెస్ట్ 95వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. గత వారం 97వ ర్యాంక్‌లో నిలిచిన సుమిత్ రెండు స్థానాలు పురో గతి సాధించాడు. భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్ 61 స్థానాలు ఎగబాకి 349వ ర్యాంక్‌లో నిలిచాడు. -
బోపన్న–ఎబ్డెన్ జోడీకి మయామి మాస్టర్స్ టైటిల్
ఫ్లోరిడా: ప్రతిష్టాత్మక మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ టైటిల్ సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–7 (3/7), 6–3, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంటపై నెగ్గింది. బోపన్న–ఎబ్డెన్‌లకు 4,47,300 డాలర్ల (రూ. 3 కోట్ల 72 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఒక గంట 42 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బోపన్న ద్వయం ఆరు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్విస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. బోపన్న కెరీర్లో ఇది 26 డబుల్స్ టైటిల్‌కాగా... ‘మాస్టర్స్ సిరీస్’లో ఆరో టైటిల్ కావడం విశేషం. 44 ఏళ్ల బోపన్న గతంలో ‘మాస్టర్స్ సిరీస్’లో ఇండియన్ వెల్స్ (2023), మోంటెకార్లో ఓపెన్ (2017), మాడ్రిడ్ ఓపెన్ (2015), పారిస్ ఓపెన్ (2012), పారిస్ ఓపెన్ (2011) టైటిల్స్ సాధించాడు. లియాండర్ పేస్ (2012లో) తర్వాత మయామి ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా బోపన్న గుర్తింపు పొందాడు. ఈ విజయంతో బోపన్న సోమవారం విడుదల చేసే డబుల్స్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటాడు. -
ఫైనల్లో బోపన్న జోడీ
ఫ్లోరిడా: ప్రతిష్టాత్మక మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నిలో భారత స్టార్ రోహన్ బోపన్న డబుల్స్ విభాగంలో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 6–1, 6–4తో నాలుగో సీడ్ మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)–హొరాసియో జెబలాస్ (అర్జెంటీనా) జంటపై విజయం సాధించింది. 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ రెండు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశారు. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 3–6, 7–6 (7/3), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆ్రస్టేలియా)–సెమ్ వెర్బీక్ (నెదర్లాండ్స్) జోడీపై గెలిచింది. భారత్‌కే చెందిన మహేశ్ భూపతితో కలిసి బోపన్న చివరిసారి 2012లో మయామి ఓపెన్ టోర్నీ డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించి ఓడిపోయాడు. -
క్వార్టర్ ఫైనల్లో బోపన్న జోడీ
మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోరీ్నలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 7–5, 7–6 (7/3)తో హుగో నిస్ (మొనాకో)–జాన్ జిలెన్స్కీ (పోలాండ్) జోడీపై గెలిచింది. 99 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్విస్‌ను ఒకసారి బ్రేక్ చేశారు. -
Miami Masters: ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న జోడీ
మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఫ్లోరిడాలో సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 4–6, 7–6 (7/4), 10–4తో బొలెలీ–వావాసోరి (ఇటలీ) జోడీని ఓడించింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ (భారత్)–వీనస్ (న్యూజిలాండ్) జంట 6–7 (5/7), 4–6తో డోడిగ్ (క్రొయేషియా)–ఆస్టిన్ (అమెరికా) ద్వయం చేతిలో ఓడింది. -
వరల్డ్ నంబర్ వన్ బోపన్న జోడీకి తొలి రౌండ్లోనే షాక్
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ జోడీ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) తొలి రౌండ్లోనే నిష్కమించింది. సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–7 (1/7), 6–4, 8–10తో సాండర్ జిలీ–జొరాన్ వ్లిజెన్ (బెల్జియం) జోడీ చేతిలో ఓడిపోయింది. గంటా 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట నాలుగు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి రౌండ్లో ఓడిన బోపన్న–ఎబ్డెన్ జంటకు 18,640 డాలర్ల (రూ. 15 లక్షల 42 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
బోపన్న జోడీకి షాక్
దుబాయ్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీకి నిరాశ ఎదురైంది. దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో ఈ జోడీ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–3, 3–6, 8–10తో బెహర్ (ఉరుగ్వే)–పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో ఓడిపోయింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట ఆరు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. యూకీ–హాస్ జంట సంచలనం మరోవైపు ఇదే టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జంట సంచలన విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో యూకీ–హాస్ జోడీ 6–4, 7–6 (7/1)తో మూడో సీడ్ జేమీ ముర్రే (బ్రిటన్)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంటను బోల్తా కొట్టించింది. -
ATP Rankings: నంబర్‌వన్ బోపన్న
లండన్: సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 21 ఏళ్ల తర్వాత మళ్లీ భారత ప్లేయర్ నంబర్‌వన్ ర్యాంక్‌ను అధిరోహించాడు. సోమవారం విడుదల చేసిన అధికారిక తాజా ర్యాంకింగ్స్‌లో రోహన్ బోపన్న రెండు స్థానాలు ఎగబాకి తన కెరీర్లో తొలిసారి టాప్ ర్యాంక్‌లో నిలిచి చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. టెన్నిస్ చరిత్రలోనే నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్న అతిపెద్ద వయసు్కడిగా బోపన్న (43 ఏళ్ల 330 రోజులు) ప్రపంచ రికార్డు సృష్టించాడు. అమెరికా దిగ్గజం మైక్ బ్రయాన్ (41 ఏళ్ల 76 రోజులు; 2019లో) పేరిట ఉన్న రికార్డును అతను బద్దలు కొట్టాడు. గత శనివారం ఆస్ట్రేలియన్ ఓపెన్ టోరీ్నలో బోపన్న ఆ్రస్టేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్తో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో టైటిల్ నెగ్గి తన కెరీర్లో పురుషుల డబుల్స్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో బోపన్న, ఎబ్డెన్ 8,450 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ తక్కువ టోరీ్న లు ఆడినందుకు బోపన్నకు టాప్ ర్యాంక్ ఖరారుకాగా, ఎబ్డెన్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. చివరిసారి భారత్ నుంచి లియాండర్ పేస్ 2000 మార్చి 13న ... మహేశ్ భూపతి 1999 జూన్ 14న ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచారు. బెంగళూరుకు చెందిన బోపన్న 2003లో ప్రొఫెషనల్‌గా మారాడు. తన 21 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో బోపన్న ఇప్పటిదాకా పురుషుల డబుల్స్‌లో 19 మంది వేర్వేరు భాగస్వాములతో ఆడి 25 టైటిల్స్ సాధించడంతోపాటు 504 మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. 2016లో బెంగళూరులో తన పేరిట టెన్నిస్ అకాడమీని స్థాపించి కుర్రాళ్లకు శిక్షణ ఇస్తున్నాడు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో బోపన్న సరికొత్త చరిత్ర..
ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత వెటరన్ రోహన్ బోపన్న సరికొత్త చరిత్ర సృష్టించాడు. 43 ఏళ్ల బోపన్న.. మాథ్యూ ఎబ్డెన్తో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్-2024 పురుషుల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. శనివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పురుషుల డబుల్స్ ఫైనల్లో రోహన్ బోపన్న- మాథ్యూ ఎబ్డెన్ జోడీ 7-6 (7-0), 7-5తో ఇటలీ ద్వయం సిమోన్ బొలెల్లి- ఆండ్రియా వావోసోరిపై విజయం సాధించింది. రోహన్ బోపన్న కెరీర్ లో ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఈ విజయంతో ఓ అరుదైన ఘనతను బోపన్న తన పేరిట లిఖించుకున్నాడు. టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన అతి పెద్ద వయసు ఆటగాడిగా రోహన్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు అమెరికా టెన్నిస్ ప్లేయర్ మైక్ బ్రియాన్ (41 ఏండ్ల 76 రోజులు) పేరిట ఉండేది. తాజా విజయంతో బోపన్న(43 ఏళ్ల 329 రోజులు) మైక్ బ్రియాన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక అద్బుత విజయం అందుకున్న బోపన్న-ఎబ్డెన్‌ల జోడీకి ట్రోఫీతో పాటు రూ.6.06 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. మరోవైపు మహిళల సింగిల్స్ టైటిల్‌ను అరియానా సబలెంకా సొంతం చేసుకుంది. ఫైనల్లో చైనాకు చెందిన ఝెంగ్ కిన్వెన్ను 6-3, 6-2తో సబలెంకా చిత్తు చేసింది. చదవండి: ENG Vs IND 1st Test: ఎంత పని చేశావు భరత్.... కోపంతో ఊగిపోయిన బుమ్రా! వీడియో వైరల్ -
క్రీడారంగంలో పద్మ పురస్కారాలు వీరికే..
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రద్మ పురస్కారాలను ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను మొత్తం 132 మంది ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీటిలో ఐదు పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ఈ ఏడాది క్రీడారంగం నుంచి మొత్తం ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. వెటరన్ టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చినప్ప, హాకీ క్రీడాకారుడు హర్బిందర్ సింగ్, పూర్ణిమా మహతో (ఆర్చరీ), సతేంద్ర సింగ్ లోహియా (స్విమ్మింగ్), గౌరవ్ ఖన్నా (బ్యాడ్మింటన్), ఉదయ్ విశ్వనాథ్ దేశ్‌పాండేలను (మల్లఖంబ-కోచ్) పద్మశ్రీ అవార్డులు వరించాయి. -
తన రికార్డు తానే బ్రేక్ చేసిన బోపన్న.. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో..
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న- మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జంట సంచలన విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఓపెన్-2024 మెన్స్ డబుల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్లో థామస్- ఝాంగ్ ఝిషేన్ జోడీని ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అయితే, తొలి సెట్‌ను 6-3తో గెలిచిన బోపన్న- ఎబ్డెన్ జోడీ.. రెండో సెట్ మాత్రం 3-6తో కోల్పోయింది. ఈ క్రమంలో నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన మూడో సెట్లో ఇరు జోడీలు అత్యుత్తమ ప్రదర్శనతో పోటాపోటీగా ముందుకు సాగాయి. ఈ నేపథ్యంలో టై బ్రేకర్‌కు దారితీయగా.. బోపన్న- ఎబ్డెన్ ద్వయం ధామస్- ఝిషేన్ జంటను 7-6తో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో రోహన్ బోపన్న తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన అత్యంత ఎక్కువ వయసు గల ప్లేయర్(43 ఏళ్లు)గా మరోసారి చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంటే.. బోపన్న ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. 2023లో ఎబ్డెన్తో కలిసి బోపన్న యూఎస్ ఓపెన్ ఫైనల్ ఆడాడు. 2013లోనూ ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తుదిపోరుకు బోపన్న అర్హత సాధించడం విశేషం. కాగా కెరీర్ చరమాంకంలో బోపన్న ఉన్నత శిఖరానికి చేరుకున్న విషయం తెలిసిందే. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో బోపన్న నంబర్‌వన్ ర్యాంక్ సొంతం చేసుకోవడం ఖరారైంది. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ చేరి మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు బోపన్న. అలా వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ జోడీగా బుధవారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జంట 6–4, 7–6 (7/5)తో మాక్సిమో గొంజాలెజ్–ఆండ్రెస్ మోల్టెని (అర్జెంటీనా) జోడీపై గెలిచింది. దాంతో ఈనెల 29న విడుదలయ్యే ఏటీపీ తాజా ర్యాంకింగ్స్‌లో బోపన్న, ఎబ్డెన్ వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ జోడీగా అవతరిస్తుంది. ఈ క్రమంలో టెన్నిస్ చరిత్రలోనే నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలవనున్న అతిపెద్ద వయస్కుడిగా రోహన్ బోపన్న (43 ఏళ్ల 330 రోజులు) రికార్డు నెలకొల్పనున్నాడు. వాళ్ల తర్వాత ఇక... పురుషుల డబుల్స్‌లో ప్రస్తుతం ఈ రికార్డు అమెరికా దిగ్గజం మైక్ బ్రయాన్ (41 ఏళ్ల 76 రోజులు; 2019లో) పేరిట ఉంది. మహిళల డబుల్స్‌లో అమెరికా ప్లేయర్ లీసా రేమండ్ (39 ఏళ్లు; 2012లో)... పురుషుల సింగిల్స్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ (36 ఏళ్ల 320 రోజులు; 2018లో)... మహిళల సింగిల్స్‌లో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ (35 ఏళ్ల 124 రోజులు; 2017లో) వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన అతి పెద్ద వయస్కులుగా రికార్డు సృష్టించారు. గర్వంగా ఉంది ‘నంబర్‌వన్ ర్యాంక్ అందుకోనుండటంతో గర్వంగా అనిపిస్తోంది. నా జీవితంలో ఇదో ప్రత్యేక క్షణం. ఈస్థాయికి చేరుకోవడానికి కోచ్‌లు, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల పాత్ర ఎంతో ఉంది’ అని బోపన్న వ్యాఖ్యానించాడు. -
43 ఏళ్ల వయస్సులో సరికొత్త చరిత్ర.. రోహన్ బొప్పన్న పై సచిన్ ప్రశంసలు
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బొప్పన్న సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యంత వృద్ధ వయసులో పురుషుల డబుల్స్‌లో నెం1 ర్యాంక్‌ను అందుకున్న టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. 43 ఏళ్ల వయస్సులో రోహన్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ డబుల్స్‌లో విజయనంతరం బోపన్న నంబర్ వన్‌గా నిలిచాడు. బుధవారం జరిగిన క్వార్టర్స్‌లో అర్జెంటీనా జోడీ మాక్సిమో గొంజాలెజ్, ఆండ్రెస్ మోల్టెనీని మాథ్యూ ఎబ్డెన్-బోపన్న జోడి చిత్తు చేసింది. ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో బొప్పన్న జోడి 6-4, 7-6 స్కోరుతో విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది.ఇక లేటు వయస్సులో వరల్డ్‌నెం1గా నిలిచిన బొప్పన్నపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం రోహన్ ప్రశంసించాడు. "వయస్సు ఒక సంఖ్య మాత్రమే. కానీ 'నంబర్ 1' అనేది మరొక సంఖ్య కాదు. అభినందనలు రోహన్! పురుషుల డబుల్స్‌లో ఈ వయస్సులో నెం1గా నిలవడం నిజంగా గ్రేట్"అని ఎక్స్(ట్విటర్)లో సచిన్ రాసుకొచ్చాడు. చదవండి: బజ్‌బాల్‌తో మాకు సంబంధం లేదు.. గెలవాలంటే అదొక్కటే: రోహిత్ Age is just a number but ‘Number 1’ is not just another number. Congratulations Rohan! Being the oldest World Number 1 in Men’s Doubles is a stellar feat. #AusOpen #AO2024 pic.twitter.com/5rEBxdl1km — Sachin Tendulkar (@sachin_rt) January 24, 2024 -
రన్నరప్‌గా బోపన్న జోడి
కొత్త ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించాలనుకున్న భారత వెటరన్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నకు నిరాశే ఎదురైంది. అడిలైడ్ ఇంటర్నేషనల్ ఏటీపీ –250 టోర్నీలో బోపన్న – మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడి రన్నరప్‌గా సరిపెట్టుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్ రాజీవ్ రామ్ (అమెరికా) – జో సాలిస్బరీ ద్వయం 7–5, 5–7, 11–9తో రెండో సీడ్ బోపన్న – ఎబ్డెన్పై విజయం సాధించింది. బోపన్న జంట 12 ఏస్‌లు సంధించినా లాభం లేకపోయింది. తొలి సెట్లో ఒక దశలో 4–0తో ఆధిక్యంలో ఉండి కూడా బోపన్న టీమ్ దానిని చేజార్చుకుంది. రెండో సెట్లో స్కోరు 5–5తో సమంగా ఉన్న సమయంలో ప్రత్యర్థి గేమ్‌ను బ్రేక్ చేసి ముందంజ వేసిన రోహన్ – ఎబ్డెన్ ఆ తర్వాత సెట్‌ను గెలుచుకున్నారు. మూడో సెట్ టైబ్రేకర్‌తో చివరకు రాజీవ్ – సాలిస్‌బరీదే పైచేయి అయింది. ఒక గంటా 38 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో 5 డబుల్ ఫాల్ట్‌లు చేసి కూడా ఈ జంట గట్టెక్కింది. -
పదేళ్ల తర్వాత కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో బోపన్న
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న పదేళ్ల విరామం తర్వాత మళ్లీ కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్ కు చేరుకున్నాడు. సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ సెమీఫైనల్లో నిష్క్రమించింది. ఈ ప్రదర్శనతో ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో బోపన్న మూడు స్థానాలు ఎగబాకాడు. 43 ఏళ్ల బోపన్న 2013లో చివరిసారి కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. ఈ ఏడాది బోపన్న–ఎబ్డెన్ ద్వయం ఏడు టోర్నీల్లో ఫైనల్ చేరి రెండింటిలో టైటిల్ నెగ్గి, ఐదింటిలో రన్నరప్‌గా నిలిచింది. -
సెమీస్‌లో ఓడిన బోపన్న జోడీ
టురిన్ (ఇటలీ): పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టే లియా) జోడీ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 5–7, 4–6తో గ్రానోలెర్స్ (స్పెయిన్)–జెబలాస్ (అర్జెంటీనా) జోడీ చేతిలో ఓడిపోయింది. 79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట 11 ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసి, తమ సర్విస్‌ను రెండుసార్లు కోల్పోయింది. సెమీస్‌లో ఓడిన బోపన్న–ఎబ్డెన్ జోడీకి 3,22,000 డాలర్ల (రూ. 2 కోట్ల 68 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. ఓవరాల్‌గా ఈ సీజన్లో బోపన్న–ఎబ్డెన్ జోడీ 21 టోర్నీలు ఆడింది. . ఏడు టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రెండు టోర్నీల్లో టైటిల్ సాధించి, ఐదు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. -
సెమీస్‌లో బోపన్న జోడీ
టురిన్ (ఇటలీ): ఈ ఏడాది తమ అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తూ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ... పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన రెడ్ గ్రూప్ చివరి లీగ్ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–4, 7–6 (7/5)తో ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ చాంపియన్స్ వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జంటపై గెలిచింది. ఈ గెలుపుతో రెడ్ గ్రూప్ నుంచి బోపన్న–ఎబ్డెన్; రాజీవ్ రామ్ (అమెరికా)–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీలు సెమీఫైనల్‌కు అర్హత పొందాయి. ఈ సీజన్లో బోపన్న–ఎబ్డెన్ జోడీ 40 మ్యాచ్‌ల్లో గెలిచింది. సీజన్ ముగింపు టోరీ్నలో బోపన్న ఆడటం ఇది నాలుగోసారి (2023, 2015, 2012, 2011) కాగా, ఎబ్డెన్ తొలిసారి బరిలోకి దిగాడు. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా), రెండో ర్యాంకర్ అల్కరాజ్ (స్పెయిన్), మెద్వెదెవ్ (రష్యా), యానిక్ సినెర్ (ఇటలీ) సెమీఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. -
ATP Finals 2023: చరిత్ర సృష్టించిన రోహన్ బోపన్న
టురిన్ (ఇటలీ): పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) సెమీఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. రింకీ హిజికాటా–జేసన్ కుబ్లెర్ (ఆ్రస్టేలియా) జంటతో బుధవారం జరిగిన రెడ్ గ్రూప్ రెండో లీగ్ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–4, 6–4తో గెలిచింది. ఈ విజయంతో 43 ఏళ్ల బోపన్న ఏటీపీ ఫైనల్స్ టోర్నీ చరిత్రలో మ్యాచ్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న, ఎబ్డెన్ 12 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశారు. నాలుగు జోడీలు ఉన్న రెడ్ గ్రూప్‌లో రాజీవ్ రామ్ (అమెరికా)–జో సాలిస్బరీ (బ్రిటన్) ద్వయం వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సెమీఫైనల్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్), బోపన్న–ఎబ్డెన్ జోడీలు చెరో విజయంతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. నేడు ఈ రెండు జోడీల మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్ విజేత సెమీఫైనల్ చేరుకుంటుంది. సెమీస్‌లో సినెర్ ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో గ్రీన్ గ్రూప్ నుంచి యానిక్ సినెర్ (ఇటలీ) సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) చివరిదైన మూడో లీగ్ మ్యాచ్‌లో 7–6 (7/1), 4–6, 6–1తో హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్)ను ఓడించి సెమీఫైనల్ రేసులో నిలిచాడు. జొకోవిచ్‌తో మ్యాచ్‌లో హుర్కాజ్ ఒక సెట్ నెగ్గడంతో ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన సినెర్ గ్రీన్ గ్రూప్ నుంచి టాప్ లేదా రెండో స్థానంతో సెమీఫైనల్‌కు చేరుకోవడం ఖరారైంది. ఈ టోర్నీ చరిత్రలో సెమీఫైనల్ చేరిన తొలి ఇటలీ ప్లేయర్‌గా సినెర్ గుర్తింపు పొందాడు. సినెర్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో హోల్గర్ రూనె (డెన్మార్క్) గెలిస్తే మాత్రం జొకోవిచ్ లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తాడు. సినెర్ విజయం సాధిస్తే జొకోవిచ్‌కు కూడా సెమీఫైనల్ బెర్త్ లభిస్తుంది. మరోవైపు రెడ్ గ్రూప్ నుంచి మెద్వెదెవ్ (రష్యా) సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. -
బోపన్న జోడీ ఓటమితో మొదలు
టురిన్ (ఇటలీ): పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌ను రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీccతో ప్రారంభించింది. రాజీవ్ రామ్ (అమెరికా)–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీతో జరిగిన రెడ్ గ్రూప్ తొలి లీగ్ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 3–6, 4–6తో ఓడిపోయింది. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించి తమ సvస్ను రెండుసార్లు కోల్పోయింది. -
రన్నరప్ బోపన్న–ఎబ్డెన్ జోడీ
పారిస్: ఈ ఏడాది మూడో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీకి నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో బోపన్న–ఎబ్డెన్ ద్వయం రన్నరప్‌గా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జంట 2–6, 7–5, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–వాసెలిన్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఎనిమిది ఏస్‌లు సంధించింది. రన్నరప్‌గా నిలిచిన బోపన్న–ఎబ్డెన్‌లకు 1,48,760 యూరోల (రూ. కోటీ 32 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది బోపన్న–ఎబ్డెన్ జోడీ ఏడు టోర్నీలలో ఫైనల్ చేరి రెండింటిలో టైటిల్ సాధించి, ఐదింటిలో రన్నరప్‌గా నిలిచింది. ఈనెల 12 నుంచి 19 వరకు ఇటలీలో జరిగే సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌కు కూడా బోపన్న–ఎబ్డెన్ అర్హత సాధించారు. -
సెమీఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం
ఆద్యంతం నిలకడగా ఆడిన రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ బోపన్న–ఎబ్డెన్ జోడీ 6–3, 6–2తో ఐదో సీడ్ మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)–హొరాసియో జెబలాస్ (అర్జెంటీనా) జంటను ఓడించింది. 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు మూడుసార్లు ప్రత్యర్థి సర్విస్‌ను బ్రేక్ చేశారు. -
రన్నరప్‌గా బోపన్న జోడీ.. ప్రైజ్‌మనీ ఎంతంటే!
షాంఘై: ఈ ఏడాది మూడో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీకి నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోరీ్నలో బోపన్న–ఎబ్డెన్ ద్వయం రన్నరప్‌గా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జంట 7–5, 2–6, 7–10తో గ్రానోలెర్స్ (స్పెయిన్)–జెబలాస్ (అర్జెంటీనా) ద్వయం చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన బోపన్న–ఎబ్డెన్‌లకు 2,31,660 డాలర్ల (రూ. కోటీ 93 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు... టైటిల్ నెగ్గిన గ్రానోలెర్స్–జెబలాస్లకు 4,36,730 డాలర్ల (రూ. 3 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తాజా ఫలితంతో బోపన్న –ఎబ్డెన్ జోడీ టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. షాంఘై మాస్టర్స్ టోర్నీ విజేత హుర్కాజ్ పోలాండ్ టెన్నిస్ స్టార్ హుబెర్ట్ హుర్కాజ్ తన కెరీర్లో రెండో మాస్టర్స్ సిరీస్ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో హుర్కాజ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో 17వ ర్యాంకర్ హుర్కాజ్ 6–3, 3–6, 7–6 (10/8)తో ఏడో ర్యాంకర్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)పై గెలిచాడు. విజేత హుర్కాజ్‌కు 12,62,220 డాలర్ల (రూ. 10 కోట్ల 52 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది. -
సెమీస్‌లో బోపన్న జోడీ
న్యూఢిల్లీ: షాంఘై ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నీ లో రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. చైనాలో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–4, 6–2తో అరెవాలో (ఎల్‌సాల్వడార్)–జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్) జంటపై గెలిచింది. 61 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ పది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
భళా బోపన్న..! 43 ఏళ్ల వయస్సులో సత్తాచాటుతూ!
ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల డబుల్స్ సెమీఫైనల్ మ్యాచ్.. 43 ఏళ్ల 6 నెలల వయసులో ఒక ‘కుర్రాడు’ టెన్నిస్ కోర్టులో సత్తా చాటుతున్నాడు. అతని ఆట పార్ట్నర్ను కూడా అబ్బురపరుస్తోంది. చూస్తే మూడు పదులు ఇంకా దాటలేదేమో అనిపిస్తోంది. చివరకు అద్భుతమైన ఆటతో పార్ట్నర్తో కలసి అతను ఫైనల్‌కు చేరాడు. తద్వారా అతి పెద్ద వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. అతనే రోహన్ బోపన్న. భారత టెన్నిస్‌కు సంబంధించి తనదైన ముద్ర వేసిన అతను.. పేస్–భూపతి ద్వయం తర్వాత అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికీ సత్తా చాటుతూ డబుల్స్‌లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం వరుస పరాజయాలు బోపన్నను కలవరపరచాయి. ఒక ఏడాదైతే అప్పటికి అతను ఆడిన ఏడు మ్యాచ్‌లలోనూ ఓటమిపాలయ్యాడు. సముద్రం ఒడ్డున నిలబడి అతను ‘నేను అసలు ఎందుకు ఆడుతున్నాను? ఎవరి కోసం ఆడుతున్నాను? కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోతున్నా. ఇంట్లో భార్యా, పసిపాపను వదిలి ప్రపంచమంతా తిరుగుతున్నాను. ఇక ఆటను ఆపేసి తిరిగి వెళ్లిపోతాను’ అంటూ రోదించాడు. కానీ ఆ తర్వాత అతనిలో పట్టుదల పెరిగింది. ఆపై విజయాలు నడిచొచ్చాయి. గత రెండేళ్లలో అతను తన కెరీర్లో అత్యుత్తమ దశను చూశాడు. ఇప్పుడు అదే గుర్తు చేస్తే ‘నేను ఇంకా ఎందుకు ఆడకూడదు? ఈ విజయాలను ఇలాగే కొనసాగిస్తా’ అంటూ సగర్వంగా చెప్పగలగడం అతని మారిన ఆటకు, దృక్పథానికి నిదర్శనం. యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఓడినా.. 43 ఏళ్ల వయసులో కోర్టులో అతని ఆట, కదలికలు నభూతో అనిపించాయి. 2019లో మోకాలిలో మృదులాస్థి పూర్తిగా కోల్పోయి రోజుకు మూడు పెయిన్ కిల్లర్లపై ఆధారపడిన అతను ఇప్పుడు ఈ రకంగా చెలరేగడం బోపన్న పట్టుదలను, పోరాటాన్ని చూపిస్తోంది. తండ్రి అండతో ఆటలో అడుగులు.. కర్నాటకలోని కూర్గ్.. అందమైన కాఫీ తోటలకు ప్రసిద్ధి. అక్కడే ఎంజీ బోపన్న, మల్లిక నివాసం. వారి ఇద్దరు పిల్లల్లో రోహన్ ఒకడు. చిన్నతనంలో ఫుట్‌బాల్, హాకీలాంటి ఆటలను ఇష్టపడినా ఏదైనా ఒక వ్యక్తిగత క్రీడాంశంలో తన కొడుకును తీర్చిదిద్దాలనేది అతని తండ్రి కోరిక. సరిగ్గా చెప్పాలంటే ప్రొఫెషనల్ క్రీడాకారుడిని చేయడమే ఆయన ఆలోచన. దాంతో 11 ఏళ్ల రోహన్‌ను ఆయన టెన్నిస్ వైపు మళ్లించాడు. ఆ అబ్బాయి కూడా అంతే ఉత్సాహంగా ఆటకు సిద్ధమయ్యాడు. స్టార్ ప్లేయర్ మహేశ్ భూపతి తండ్రి సీజీ భూపతి బెంగళూరులో అప్పటికే గుర్తింపు పొందిన కోచ్. తన కుమారుడికి అతడే సరైన శిక్షకుడిగా భావించిన ఎంజీ బోపన్న వెంటనే అక్కడ చేర్పించాడు. ఆటలో ఓనమాలు నేర్చుకొని కొంత మెరుగైన తర్వాత సహజంగానే జూనియర్ స్థాయి పోటీల్లో రోహన్ సత్తా చాటడం మొదలుపెట్టాడు. నాలుగేళ్లు జాతీయ స్థాయిలో విజయాల తర్వాత సీనియర్ దశలోకి అతను ప్రవేశించాడు. ఆఫ్రో ఏషియన్ క్రీడలతో మొదలు.. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) నిర్వహించే వరుస టోర్నీల్లో పాల్గొంటూ తన ఆటకు పదును పెట్టుకున్న రోహన్ 23 ఏళ్ల వయసులో పూర్తి స్థాయి ప్రొఫెషనల్‌గా మారి సర్క్యూట్‌లోకి అడుగు పెట్టాడు. అయితే ఊహించినట్లుగానే చెప్పుకోదగ్గ విజయాలు రాలేదు. చాలా సందర్భాల్లో ఆరంభ రౌండ్లలోనే వెనుదిరగడం రొటీన్‌గా మారిపోయింది. సింగిల్స్‌లో ఫలితాలు ఇలా రావడంతో మరో వైపు డబుల్స్‌పై కూడా బోపన్న దృష్టి పెట్టాడు. 2003లో హైదరాబాద్‌లో జరిగిన ఆఫ్రో ఏషియన్ క్రీడల్లో తన గురువు కొడుకు, తాను అభిమానించే మహేశ్ భూపతితో కలసి అతను డబుల్స్ బరిలోకి దిగాడు. సింగిల్స్, డబుల్స్ విభాగాలు రెండింటిలోనూ స్వర్ణాలు గెలవడంతో అతనికి భారత టెన్నిస్ వర్గాల్లో తగిన గుర్తింపు లభించింది. ఆ తర్వాత పలు అంతర్జాతీయ ఫ్యూచర్స్ టోర్నీలో ఆడుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. 26 ఏళ్ల వయసు.. సాధారణంగా టెన్నిస్ ప్రపంచంలో ఈ వయసు వచ్చేసరికే చాలా మంది ఆటగాళ్లు తమ సత్తాను ప్రదర్శించి ఒక స్థాయికి చేరుకొని ఉంటారు. ఆ వయసులో మొదటిసారి గ్రాండ్‌స్లామ్ ఆడటం అంటే బాగా ఆలస్యమైనట్లే. కానీ బోపన్న కెరీర్‌కి సంబంధించి అదే కీలక మలుపు. 2006 గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విభాగంలో తొలిసారి రోహన్ బరిలోకి దిగాడు. క్వాలిఫయింగ్‌లో ఒక మ్యాచ్ గెలిచి మెయిన్ డ్రా వరకు చేరలేకపోయినా.. ఈ మేజర్ టోర్నీ అనుభవం అతనికి ఎంతో మేలు చేసింది. భారత డేవిస్ కప్ జట్టులో సభ్యుడిగా కూడా ఆడి దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న తన తండ్రి కోరికనూ నెరవేర్చడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని రోహన్ ఒకసారి చెప్పుకున్నాడు. సింగిల్స్‌లో అప్పుడప్పుడూ మంచి ఫలితాలే వస్తున్నా పెద్ద విజయాలు లేకపోవడం రోహన్‌ను అసంతృప్తికి గురి చేస్తూ వచ్చింది. మరో వైపు తీవ్రమైన భుజం గాయంతో అతను కొంతకాలం బాధపడ్డాడు. కోలుకున్న తర్వాత అతను తీసుకున్న ఒక నిర్ణయం అతని కెరీర్‌ను ఇంత సుదీర్ఘంగా నిలబెట్టింది. 17 ఏళ్లుగా సర్క్యూట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టింది. సింగిల్స్‌ను వదిలి డబుల్స్‌పై పూర్తిగా దృష్టి పెట్టేలా చేసింది. చదవండి: WC 2023: ఒకప్పుడు పసికూన.. ఇప్పుడు వరల్డ్‌క్లాస్ జట్లకు కూడా దడ పుట్టించగలదు -
బోపన్న చివరిపోరు...
లక్నో: ప్రపంచ పురుషుల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ డేవిస్ కప్‌లో తన ప్రస్థానాన్ని ముగించడానికి భారత డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న సిద్ధమయ్యాడు. మొరాకోతో నేడు మొదలయ్యే వరల్డ్ గ్రూప్–2 డేవిస్ కప్ మ్యాచ్‌లో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. 2002లో తొలిసారి డేవిస్‌కప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 43 ఏళ్ల బోపన్న 32 మ్యాచ్‌లు ఆడి 22 మ్యాచ్‌ల్లో విజయం అందుకున్నాడు. తొలి రోజు శనివారం రెండు సింగిల్స్ జరుగుతాయి. యాసిన్ దిల్మీతో శశికుమార్ ముకుంద్, ఆడమ్ మౌన్డిర్తో సుమిత్ నగాల్ ఆడతారు. ఆదివారం ఒక డబుల్స్‌తోపాటు రెండు రివర్స్ సింగిల్స్‌ను నిర్వహిస్తారు. డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న–యూకీ బాంబ్రీ జోడీ ఇలియట్ బెన్‌చిట్రి–యూనస్ లారూసి జంటతో ఆడుతుంది. రివర్స్ సింగిల్స్‌లో యాసిన్ దిల్మీతో సుమిత్ నగాల్, ఆడమ్ మౌన్డిర్తో శశికుమార్ ముకుంద్ తలపడతారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ మ్యాచ్‌కు సంబంధించి ‘డ్రా’ వివరాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా డేవిస్‌కప్ కెరీర్‌ను ముగిస్తున్న రోహన్ బోపన్నను సన్మానించారు. -
బోపన్న జోడీ రన్నరప్‌తో సరి
న్యూయార్క్: పురుషుల టెన్నిస్ చరిత్రలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాలని ఆశించిన భారత స్టార్ రోహన్ బోపన్నకు నిరాశ ఎదురైంది. శుక్రవారం రాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగం ఫైనల్లో బోపన్న–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ పరాజయం చవిచూసింది. డిఫెండింగ్ చాంపియన్స్, మూడో సీడ్ రాజీవ్ రామ్ (అమెరికా)–జో సాలిస్బరీ (బ్రిటన్) ద్వయం 2 గంటల్లో 2–6, 6–3, 6–4తో బోపన్న–ఎబ్డెన్ జంటను ఓడించి వరుసగా మూడో ఏడాది యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తద్వారా 1930 తర్వాత ఈ టోర్నీలో వరుసగా మూడేళ్లు డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి జోడీగా రాజీవ్ రామ్–సాలిస్బరీ ద్వయం గుర్తింపు పొందింది. జాన్ డోగ్–జార్జి లాట్ (అమెరికా) జోడీ 1928, 1929, 1930లలో వరుసగా మూడేళ్లు ఈ టోర్నీలో డబుల్స్ టైటిల్ గెలిచింది. విజేత రాజీవ్–సాలిస్బరీ జోడీకి 7 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 80 లక్షలు)... రన్నరప్ బోపన్న–ఎబ్డెన్ జంటకు 3 లక్షల 50 వేల డాలర్లు (రూ. 2 కోట్ల 90 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తాజా ఫలితంతో 43 ఏళ్ల 6 నెలల వయసున్న బోపన్న తన కెరీర్లో రెండోసారి పురుషుల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. 2010 యూఎస్ ఓపెన్‌లో ఐజామ్ ఖురేషి (పాకిస్తాన్)తో కలిసి ఆడిన బోపన్న డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచాడు. అయితే మిక్స్డ్ డబుల్స్‌లో మాత్రం రోహన్ బోపన్న ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాడు. 2017లో దబ్రౌస్కీ (కెనడా)తో కలిసి బోపన్న ఫ్రెంచ్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలిచాడు. బ్రేక్ పాయింట్ అవకాశాలు వృథా... రాజీవ్, సాలిస్బరీలతో జరిగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం తొలి సెట్లో గెలిచి ఆత్మవిశ్వాసంతో కనిపించింది. అయితే రాజీవ్–సాలిస్బరీ ఆందోళన చెందకుండా రెండో సెట్లో పుంజుకున్నారు. ఆరో గేమ్‌లో బోపన్న–ఎబ్డెన్ సర్విస్‌ను బ్రేక్ చేసి 5–2తో ఆధిక్యంలోకి వెళ్లారు. అదే జోరులో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచారు. నిర్ణాయక మూడో సెట్లో బోపన్న జోడీ కీలకదశలో తడబడింది. 2–1తో ఆధిక్యంలో ఉన్నదశలో మూడో గేమ్‌లో మూడుసార్లు ప్రత్యర్థి సర్విస్‌ను బ్రేక్ చేసే అవకాశం వచ్చినా దీనిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. సర్విస్‌ను నిలబెట్టుకున్న రాజీవ్–సాలిస్బరీ ద్వయం స్కోరును 2–2తో సమం చేయడంతోపాటు ఐదో గేమ్‌లో బోపన్న జంట సర్విస్‌ను బ్రేక్ చేసి, ఆరో గేమ్‌లో తమ సర్విస్‌ను కాపాడుకొని 4–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరకు 6–4తో రాజీవ్–సాలిస్బరీ జోడీ సెట్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకుంది. -
యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఎంట్రీ.. రోహన్ బొపన్న సరికొత్త రికార్డు
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బొపన్న ఓపెన్ శకంలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూఎస్ ఓపెన్-2023 పురుషుల డబుల్స్ విభాగంలో ఆరో సీడ్ బొపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందిన విషయం తెలిసిందే. తద్వారా ఈ జోడీ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 7–6 (7/3), 6–2తో పియరీ హ్యూజ్ హెర్బర్ట్–నికోలస్ మహుట్ (ఫ్రాన్స్) జంటను ఓడించింది. 94 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బొపన్న జోడీ తన ప్రత్యర్థి జంట సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. రాజీవ్ రామ్ (అమెరికా)–సాలిస్బరీ (బ్రిటన్); ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో బొపన్న జంట తలపడుతుంది. తాజా ఫలితంతో 43 ఏళ్ల బొపన్న ఓపెన్ శకంలో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరిన పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. తన కెరీర్లో పురుషుల డబుల్స్ విభాగంలో బొపన్న గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి మాత్రమే. 2010లో ఐజామ్ ఖురేషి (పాకిస్తాన్)తో జతకట్టి యూఎస్ ఓపెన్లోనే ఫైనల్ చేరిన బోపన్న తుది పోరులో బాబ్ బ్రయాన్–మైక్ బ్రయాన్ (అమెరికా) ద్వయం చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు. NO OTHER male player (Singles or Doubles) at his age (43 yrs 6 months) has reached Grand Slam FINAL in the Open era before! You are special Rohan Bopanna | @rohanbopanna ❤️ https://t.co/JCcq55SDwd pic.twitter.com/AmZwxVfhhi — India_AllSports (@India_AllSports) September 7, 2023 Bopanna/Ebden make an amazing comeback from 2-4 down to take the 1st set 7-6 (3). #USOpen https://t.co/E6Y5XA12ae — India_AllSports (@India_AllSports) September 7, 2023 -
అల్కరాజ్ అలవోకగా...
న్యూయార్క్: గత పదిహేనేళ్లుగా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో వరుసగా రెండేళ్లు ఒకే ప్లేయర్‌కు టైటిల్ దక్కలేదు. ఈ ఘనత సాధించేందుకు ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ చేరువయ్యాడు. సీజన్ నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఈ స్పెయిన్ స్టార్ అలవోక విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 12వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 2 గంటల 30 నిమిషాల్లో 6–3, 6–2, 6–4తో గెలుపొందాడు. మూడు ఏస్‌లు సంధించిన అల్కరాజ్ మూడు డబుల్ ఫాల్ట్‌లు కూడా చేశాడు. నెట్‌వద్దకు 35 సార్లు దూసుకొచ్చిన అతను 28 సార్లు పాయింట్లు గెలిచాడు. నాలుగుసార్లు జ్వెరెవ్ సర్విస్‌ను బ్రేక్ చేసిన అల్కరాజ్ తన సర్విస్‌ను ఒక్కసారి కూడా కోల్పోలేదు. 2020లో ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన జ్వెరెవ్ నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 35 అనవసర తప్పిదాలు చేశాడు. మరో క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) 6–4, 6–3, 6–4తో ఎనిమిదో సీడ్, తన దేశానికే చెందిన ఆండ్రీ రుబ్లెవ్‌ను ఓడించి ఈ టోర్నీలో నాలుగోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఫైనల్లో చోటు కోసం డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్తో మెద్వెదెవ్ తలపడతాడు. 2021లో చాంపియన్‌గా నిలిచిన మెద్వెదెవ్ ... 2020లో సెమీఫైనల్లో, 2019లో ఫైనల్లో ఓడిపోయాడు. వొండ్రుసోవాకు కీస్ షాక్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, ఈ ఏడాది వింబుల్డన్ చాంపియన్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) పోరాటం ముగిసింది. 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–1, 6–4తో వొండ్రుసోవాను బోల్తా కొట్టించి ఈ టోర్నీలో 2018 తర్వాత మళ్లీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 86 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో కీస్ మూడుసార్లు వొండ్రుసోవా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. సెమీఫైనల్స్‌లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్)తో కీస్; ముకోవా (చెక్ రిపబ్లిక్)తో కోకో గాఫ్ (అమెరికా) తలపడతారు. -
బోపన్న జోడి ఓటమి.. ఫైనల్లో జబర్, వొండ్రుసోవా
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ఆన్స్ జబర్ (ట్యునీషియా), మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో గత ఏడాది రన్నరప్, ప్రపంచ ఆరో ర్యాంకర్ జబర్ 6–7 (5/7), 6–4, 6–3తో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్)పై నెగ్గగా... వొండ్రుసోవా 6–3, 6–3తో ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)ను ఓడించింది. ఫైనల్ శనివారం జరుగుతుంది. జబర్‌తో 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకా ఏకంగా 45 అనవసర తప్పిదాలు, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకుంది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్)ను బోల్తా కొట్టించిన స్వితోలినా సెమీఫైనల్లో మాత్రం తడబడింది. ఒక్కఏస్ కూడా కొట్టలేకపోయిన స్వితోలినా నెట్ వద్దకు 21 సార్లు దూసుకొచ్చి ఆరుసార్లు పాయింట్లు గెలిచింది. బోపన్న జోడీ ఓటమి పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ 5–7, 4–6తో టాప్ సీడ్ వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జంట చేతిలో ఓడిపోయింది. సెమీస్‌లో ని్రష్కమించిన బోపన్న జోడీకి లక్షా 50 వేల పౌండ్లు (రూ. కోటీ 61 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. నేడు జరిగే పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో యానిక్ సినెర్ (ఇటలీ)తో జొకోవిచ్ (సెర్బియా); మెద్వెదెవ్ (రష్యా)తో అల్కరాజ్ (స్పెయిన్) తలపడతారు. ఈ మ్యాచ్‌లను సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. చదవండి: #KylianMbappe: ప్రధాని నోట 'ఎంబాపె' మాట..'నీకు భారత్‌లో మస్తు క్రేజ్' జ్యోతి ‘స్వర్ణ’ చరిత్ర.. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా ఆంధ్రప్రదేశ్ అమ్మాయి -
సెమీస్‌లో బోపన్న జోడి.. మహిళల సింగిల్స్‌లో ఈసారి కొత్త చాంపియన్
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భాగంగా పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–7 (3/7), 7–5, 6–2తో టాలన్ గ్రీక్స్పూర్–బార్ట్ స్టీవెన్స్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది. 2015 తర్వాత వింబుల్డన్ టోర్నీలో బోపన్న డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో ఈసారి కొత్త చాంపియన్ ఆన్స్ జబర్, ఎలీనా రిబాకినా వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ఈసారి కొత్త చాంపియన్ అవతరించనుంది. ట్యునిషియా క్రీడాకారిణి, ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆన్స్ జబర్ ధాటికి డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్) క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో గత ఏడాది రన్నరప్ ఆన్స్ జబర్ 6–7 (5/7), 6–4, 6–1తో రిబాకినాను బోల్తా కొట్టించి వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జబర్ తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయినా... వెంటనే తేరుకొని వరుసగా రెండు సెట్లు గెలిచి విజయం దక్కించుకుంది. ఎనిమిది ఏస్‌లు సంధించిన జబర్ నెట్ వద్దకు 11 సార్లు దూసుకొచ్చి 9 సార్లు పాయింట్లు గెలిచింది. మరోవైపు రిబాకినా 22 సార్లు నెట్ వద్దకు వచ్చి 10 సార్లు మాత్రమే పాయింట్లు నెగ్గింది. 35 విన్నర్స్ కొట్టిన జబర్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. రిబాకినా 20 అనవసర తప్పిదాలు చేసింది. సెమీస్‌కు చేరుకున్న సబలెంకా మరో క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) అలవోక విజయంతో రెండోసారి వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. 87 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకా 6–2, 6–4తో 25వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై గెలిచింది. రెండో సెట్లో ఒకదశలో సబలెంకా 2–4తో వెనుకబడినా ఆందోళన చెందకుండా పట్టుదలతో ఆడి వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో స్వితోలినా (ఉక్రెయిన్)తో వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్); ఆన్స్ జబర్‌తో సబలెంకా తలపడతారు. సెమీస్‌లో ప్రవేశించిన సబలెంకా, అల్కారాజ్ తొలిసారి సెమీస్‌లోకి అల్కరాజ్, మెద్వెదెవ్ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ అల్కరాజ్ (స్పెయిన్), మూడో ర్యాంకర్ మెద్వెదెవ్ (రష్యా) తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో మెద్వెదెవ్ 2 గంటల 58 నిమిషాల్లో 6–4, 1–6, 4–6, 7–6 (7/4), 6–1తో క్రిస్టోఫర్ యుబాంక్స్ (అమెరికా)పై, అల్కరాజ్ 7–6 (7/3), 6–4, 6–4తో ఆరో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్)పై గెలిచారు. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో యానిక్ సినెర్ (ఇటలీ)తో జొకోవిచ్ (సెర్బియా); మెద్వెదెవ్‌తో అల్కరాజ్ ఆడతారు. Welcome back to the semi-finals, @SabalenkaA 👏 The No.2 seed powerfully gets past Madison Keys in straight sets, 6-2, 6-4#Wimbledon pic.twitter.com/tPuQdJzmoc — Wimbledon (@Wimbledon) July 12, 2023 చదవండి: #BrijBhushanSharan: 'చుప్'.. మైక్ విరగ్గొట్టి రిపోర్టర్‌తో దురుసు ప్రవర్తన #NovakDjokovic: 46వసారి సెమీస్‌లో.. ఫెదరర్ రికార్డు సమం -
Wimbledon 2023: మూడో రౌండ్‌కు చేరుకున్న బోపన్న జోడీ
వింబుల్డన్-2023 పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్ రోహన్ బోపన్న తన ఆస్ట్రేలియా భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్తో కలిసి రౌండ్ ఆఫ్ 16కు (మూడో రౌండ్) చేరుకున్నాడు. ఈ ఇండో-ఆస్ట్రేలియన్ ద్వయం కేవలం 69 నిమిషాల్లోనే ఇంగ్లీష్ జోడీ, వైల్డ్ కార్ట్ ఎంట్రీ అయిన జాకబ్ ఫియర్న్లీ-జోహన్నస్ జోడీపై వరుస సెట్లలో (7-5, 6-3) విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీకి శుభారంభం లభించనప్పటికీ.. ఆతర్వాత బలంగా పుంజుకుంది. ఈ టోర్నీలో ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన బోపన్న ద్వయం.. తదుపరి రౌండ్లో డేవిడ్ పెల్ (నెదర్లాండ్స్)-రీస్ స్టాల్డర్ (యూఎస్ఏ) జోడీతో తలపడనుంది. ప్రస్తుతం వింబుల్డన్‌లో భారత్ తరఫున బోపన్న మాత్రమే బరిలో ఉన్నాడు. ఈ టోర్నీలో బోపన్న 2013, 2015లో అత్యుత్తమంగా సెమీస్ వరకు (డబుల్స్) చేరుకున్నాడు. మిక్స్డ్ డబుల్స్‌లో తొలి రౌండ్లోనే ఓడిన బోపన్న జోడీ మిక్స్డ్ డబుల్స్‌లో బోపన్న జోడీ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. తొలి రౌండ్లో బోపన్న (భారత్)–డబ్రౌస్కీ (కెనడా) జోడీ 7–6 (7/5), 3–6, 4–6తో డోడిగ్ (క్రొయేషియా)–లతీషా చాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్), జీవన్ నెడుంజెళియన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీలు తొలి రౌండ్లోనే నిష్క్రమించాయి. సాకేత్–యూకీ ద్వయం 4–6, 6–4, 4–6తో ఫొకినా (స్పెయిన్)–మనారినో (ఫ్రాన్స్) జంట చేతిలో... బాలాజీ–జీవన్ జోడీ 6–7 (5/7), 4–6తో డోడిగ్ (క్రొయేషియా)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) ద్వయం చేతిలో పరాజయం పాలయ్యాయి. -
Madrid Open: రన్నరప్‌గా బోపన్న జోడి
మాడ్రిడ్: ఏటీపీ మాస్టర్స్ 1000 టెన్నిస్ టోర్నీ మాడ్రిడ్ ఓపెన్‌లో టైటిల్ సాధించేందుకు బరిలోకి దిగిన భారత ఆటగాడు రోహ న్ బోపన్నకు నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన ఫైనల్లో ఏడో సీడ్ బోపన్న – మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడి ఓటమిపాలైంది. డబుల్స్‌లో జత కట్టిన సింగిల్స్ స్పెషలిస్ట్‌లు, రష్యాకు చెందిన కరెన్ ఖచనోవ్ – ఆండ్రీ రుబ్లెవ్ 6–3, 3–6, 10–3 స్కోరుతో బోపన్న – ఎబ్డెన్పై విజయం సాధించారు. 69 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో బోపన్న – ఎబ్డెన్ ద్వయం 4 ఏస్‌లు సంధించగా, రష్యా జంట 3 ఏస్‌లు కొట్టింది. -
Madrid Open 2023: అద్భుత ప్రదర్శన.. ఫైనల్లో బోపన్న జోడీ
మాడ్రిడ్: ఈ సీజన్లో తమ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ నాలుగో టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో భాగంగా గురువారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 5–7, 7–6 (7/3), 10–4తో ‘సూపర్ టైబ్రేక్’లో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జోడీని ఓడించింది. మాడ్రిడ్ మాస్టర్స్ టోర్నీలో బోపన్న ఫైనల్ చేరడం ఇది మూడోసారి. 2015లో ఈ టోర్నీలో టైటిల్ నెగ్గిన బోపన్న, 2016లో రన్నరప్‌గా నిలిచాడు. ఏడేళ్ల తర్వాత మరోసారి ఈ టోర్నీ లో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఈ సీజన్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో, దోహా ఓపెన్‌లో టైటిల్ సాధించి, రోటర్‌డామ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. బోరిస్ గెల్ఫాండ్‌పై అర్జున్ గెలుపు టెపి సెగెమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ శుభారంభం చేశాడు. స్వీడన్లో గురువారం మొదలైన ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లు జరుగుతాయి. తొలి రౌండ్లో 19 ఏళ్ల అర్జున్ 41 ఎత్తుల్లో ఇజ్రాయెల్ గ్రాండ్‌మాస్టర్ బోరిస్ గెల్ఫాండ్‌పై గెలుపొందాడు. 54 ఏళ్ల గెల్ఫాండ్ 2012 ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో విశ్వనాథన్ ఆనంద్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. -
బాక్సర్ నిశాంత్ దేవ్ సంచలనం
తాష్కెంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ నిశాంత్ దేవ్ సంచలన విజయంతో శుభారంభం చేశాడు. తాష్కెంట్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో బుధవారం జరిగిన 71 కేజీల తొలి రౌండ్ బౌట్లో నిశాంత్ దేవ్ 5–0తో సర్ఖాన్ అలియెవ్ (అజర్బైజాన్)పై గెలుపొందాడు. 2021 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నిశాంత్ దేవ్ క్వార్టర్ ఫైనల్ చేరగా... ఇదే టోర్నీలో అలియెవ్ కాంస్య పతకం సాధించాడు. Madrid Open:: ప్రపంచ నంబర్‌వన్ జోడీకి బోపన్న ద్వయం షాక్ రెండు నెలల వ్యవధిలో రెండోసారి ప్రపంచ నంబర్‌వన్ జోడీని బోల్తా కొట్టిస్తూ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జోడీ 6–3, 6–2తో ప్రపంచ నంబర్‌వన్ వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) ద్వయంపై గెలిచింది. మార్చిలో ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ ఫైనల్లో కూలాఫ్–స్కప్‌స్కీ జంటను ఓడించి బోపన్న ద్వయం విజేతగా నిలిచింది. -
Madrid Open Masters 2023: క్వార్టర్ ఫైనల్లో బోపన్న జోడీ
ఈ సీజన్లో తమ నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తూ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–4, 1–6, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో మార్సెలో మెలో (బ్రెజిల్)–అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) జంటను ఓడించింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న, ఎబ్డెన్ ద్వయం ఐదు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. -
‘పారిస్’ టికెట్ల కోసం 40 లక్షల మంది దరఖాస్తు
Paris Olympics 2024: వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలను ప్రత్యక్షంగా తిలకించేందుకు రెండో దశలో 40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే నెలలో ఆన్లైన్ లాటరీ ద్వారా 13 లక్షల మందిని ఎంపిక చేస్తారు. తొలి దశలో 32 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. సెమీస్‌లో బోపన్న జోడీ బార్సిలోనా: బార్సిలోనా ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–2, 6–4తో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–ఎడ్వర్డ్ రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంటను ఓడించింది. 64 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో బోపన్న, ఎబ్డెన్ రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు. మే 28న అహ్మదాబాద్‌లో ఐపీఎల్ ఫైనల్ న్యూఢిల్లీ: ఐపీఎల్ 16వ సీజన్ ప్లే ఆఫ్ దశ షెడ్యూల్‌ను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. మే 23న క్వాలిఫయర్–1 మ్యాచ్‌కు... మే 24న ఎలిమినేటర్ మ్యాచ్‌కు చెన్నైలోని ఎం.ఎ.చిదంబరం స్టేడియం వేదికగా నిలుస్తుంది. మే 26న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం క్వాలిఫయర్–2 మ్యాచ్‌కు, మే 28న ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. -
Barcelona Open: నాలుగో సీడ్ జోడీపై బోపన్న ద్వయం గెలుపు
బార్సిలోనా ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోరీ్నలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 7–6 (7/4), 3–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో నాలుగో సీడ్ మాట్ పావిచ్–నికోలా మెక్టిక్ (క్రొయేషియా) జోడీపై సంచలన విజయం సాధించింది. 97 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం మూడు ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. -
Jyothi Yarraji: జ్యోతి యర్రాజీకి స్వర్ణం
బెంగళూరు: ఇండియన్ గ్రాండ్‌ప్రి మీట్లో ఆంధ్రప్రదేశ్ మహిళా అథ్లెట్ జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకం సాధించింది. బెంగళూరులో సోమవారం జరిగిన ఈ మీట్లో జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా నిలిచింది. వైజాగ్‌కు చెందిన జ్యోతి అందరికంటే వేగంగా 13.44 సెకన్లలో గమ్యానికి చేరింది. తెలంగాణకు చెందిన అగసార నందిని కాంస్య పతకం గెలిచింది. నందిని 13.85 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇది కూడా చదవండి: బోపన్న జోడీ శుభారంభం మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ శుభారంభం చేసింది. మొనాకోలో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 3–6, 6–3, 10–8తో రాఫెల్ మటోస్ (బ్రెజిల్)–డేవిడ్ వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) జంటపై విజయం సాధించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న, ఎబ్డెన్ ఎనిమిది ఏస్‌లు సంధించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో కెవిన్ క్రావిట్జ్–టిమ్ ప్యూట్జ్ (జర్మనీ)లతో బోపన్న, ఎబ్డెన్ తలపడతారు. చదవండి: IPL 2023: ఓవరాక్షన్‌కు తప్పదు భారీ మూల్యం! ‘ఆవేశ్’ ఖాన్‌కు ఊహించని షాక్! IPL 2023: కాస్త హుందాగా ప్రవర్తించు గంభీర్! మీకు మా కోహ్లి చేతిలో ఉందిలే! ఏంటి రాహుల్ భయ్యా ఇది..? ఓహో టెస్లుల్లా ఆడుతున్నందుకేనా.. 17 కోట్లు! -
Indian Wells Masters: బోపన్న కొత్త చరిత్ర...
కాలిఫోర్నియా: నాలుగు పదుల వయసు దాటినా తనలో సత్తా తగ్గలేదని భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న మరోసారి నిరూపించుకున్నాడు. ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో తన భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి బోపన్న పురుషుల డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–3, 2–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ వెస్టీ కూల్‌హాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జోడీని ఓడించింది. ఈ గెలుపుతో 43 ఏళ్ల బోపన్న ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. డానియల్ నెస్టర్ (కెనడా) పేరిట ఉన్న రికార్డును బోపన్న బద్దలు కొట్టాడు. 2015లో నెస్టర్ 42 ఏళ్ల వయసులో సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. గంటా 24 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బోపన్న ద్వయం తొమ్మిది ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. విజేతగా నిలిచిన బోపన్న–ఎబ్డెన్ జోడీకి 4,36,730 డాలర్ల (రూ. 3 కోట్ల 60 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ వెస్లీ కూల్‌హాఫ్–నీల్ స్కప్సీ జంటకు 2,31,660 డాలర్ల (రూ. 1 కోటీ 91 లక్షలు) ప్రైజ్‌మనీ, 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 5: బోపన్న కెరీర్లో ఇది ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్. గతంలో అతను మోంటెకార్లో (2017 లో), మాడ్రిడ్ (2015లో), పారిస్ ఓపెన్ (2012, 2011లో) మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ సాధించాడు. మరో ఐదు మాస్టర్స్ సిరీస్ టోర్నీలలో రన్నరప్‌గా నిలిచాడు. 24: బోపన్న కెరీర్లో ఇది 24వ డబుల్స్ టైటిల్. ఈ ఏడాది రెండోది. ఈ సీజన్లో ఎబ్డెన్తోనే కలిసి బోపన్న దోహా ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. ఈ విజయం ఎంతో ప్రత్యేకం. ఇండియన్ వెల్స్ టోర్నీకి టెన్నిస్ స్వర్గధామం అని పేరు ఉంది. ఎన్నో ఏళ్లుగా నేను ఈ టోర్నీలో ఆడుతున్నాను. విజేతలెందరినో చూశాను. ఈసారి నేను చాంపియన్‌గా నిలిచినందుకు ఆనందంగా ఉంది. –రోహన్ బోపన్న విన్నర్స్ ట్రోఫీతో బోపన్న–ఎబ్డెన్ జోడీ -
43 ఏళ్ల వయసులో భారత టెన్నిస్ స్టార్ కొత్త చరిత్ర
భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. కాలిఫోర్నియాలో జరిగిన ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీలో బోపన్న–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం టైటిల్‌ను కొల్లగొట్టింది. ఈ జంట ఫైనల్లో కుహ్లోఫ్- స్కుప్సికిటో ద్వయంపై 6-3, 2-6, 10-8 తేడాతో విజయం సాధించింది. తద్వారా ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్‌ను సాధించిన అతి పెద్ద వయస్కుడిగా(43 ఏళ్లు) రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో కెనడాకు చెందిన డానియెల్ నెస్టర్ రికార్డును బోపన్న బద్దలు కొట్టాడు. నెస్టర్ 42 ఏళ్ల వయసులో 2015 సిన్సినాటి మాస్టర్స్ టోర్నీని గెలుచుకున్నాడు. ఇక బోపన్న కెరీర్లో ఇది ఐదో ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్. కాగా బోపన్న 2017 మాంటేకార్లో ఏటీపీ మాస్టర్స్ టైటిల్ తర్వాత మళ్లీ టోర్నీ విజేతగా నిలవడం ఇదే. మ్యాచ్ విషయానికి వస్తే బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ జోడి.. కుహ్లోఫ్- స్కుప్సికిటో ద్వయంపై 6-3, 2-6, 10-8 తేడాతో విజయం సాధించారు. తొలి సెట్‌ను 6-3తో గెలిచినప్పటికి రెండో సెట్‌ను ప్రత్యర్థికి కోల్పోయారు. ఇక కీలకమైన మూడో సెట్లో బోపన్న జోడి ఫుంజుకొని 10-8 తేడాతో సెట్‌ను కైవసం చేసుకోవడంతో పాటు టైటిల్‌ను కొల్లగొట్టారు. Indian Wells CHAMPS! The moment 43-year-old @rohanbopanna & 35-year-old Matthew Ebden take the title in #TenisParadise 🌴 🏆 pic.twitter.com/9NEeF8MrYD — Tennis TV (@TennisTV) March 19, 2023 చదవండి: టెస్టు చరిత్రలో లంక తరపున అత్యంత చెత్త రికార్డు క్లబ్ మేనేజర్‌తో గొడవ.. పీఎస్జీని వీడనున్నాడా? -
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టోర్నీ ఫైనల్లో బోపన్న జోడీ
ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న మూడో టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కాలిఫోర్నియాలో జరుగుతున్న ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీలో బోపన్న–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జోడీ 7–6 (8/6), 7–6 (7/2)తో జాన్ ఇస్నెర్–జాక్ సాక్ (అమెరికా) ద్వయంపై గెలుపొందింది. గంటా 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ తమ సరీ్వస్‌లో తొమ్మిదిసార్లు బ్రేక్ పాయింట్లు కాపాడుకోవడం విశేషం. ఇటీవల దోహా ఓపెన్‌లో బోపన్న–ఎబ్డెన్ జంట టైటిల్ సాధించగా... రోటర్‌డామ్ ఓపెన్‌లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. బెంగళూరుకు చెందిన 43 ఏళ్ల బోపన్న ఇప్పటి వరకు కెరీర్లో 55 టోరీ్నల్లో ఫైనల్‌కు చేరగా...23 టోరీ్నల్లో టైటిల్స్ నెగ్గి, 32 టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచాడు. Matt Ebden and Rohan Bopanna are through to the @BNPPARIBASOPEN men's doubles final 💪 This is @mattebden's first ATP Masters 1000 final 👏#GoAussies #TennisParadisehttps://t.co/mpsSu4K0tT — TennisAustralia (@TennisAustralia) March 18, 2023 -
బోపన్న–ఎబ్డెన్ జోడీకి టైటిల్
భారత సీనియర్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన కెరీర్లో 23వ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. దోహాలో శుక్రవారం జరిగిన ఖతర్ ఓపెన్ ఏటీపీ–250 టోరీ్నలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ విజేతగా నిలిచింది. గంటా 39 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–7 (5/7), 6–4, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో కాన్స్టంట్ లెస్టిన్ (ఫ్రాన్స్)–బోటిక్ జాండ్‌షుల్ప్ (నెదర్లాండ్స్) జోడీపై గెలిచింది. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన బోపన్న జోడీ ఆ తర్వాత రెండో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. అనంతరం నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో తొలుత పది పాయింట్లు స్కోరు చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది.బోపన్న–ఎబ్డెన్‌లకు 72,780 డాలర్ల (రూ. 60 లక్షల 32 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. -
సెమీఫైనల్లో రోహన్ బోపన్న జోడీ
ఖతర్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దోహాలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 1–6, 6–4, 11–9తో భారత్‌కే చెందిన సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ జంటను ఓడించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. సాకేత్–యూకీలకు 12,750 డాలర్ల (రూ. 10 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఫైనల్లో బోపన్న జోడీ
ఏబీఎన్ ఆమ్రో ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌లో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–4, 6–4తో కెవిన్ క్రాయిట్జ్–టిమ్ పుయిట్జ్ (జర్మనీ) ద్వయంపై గెలుపొందింది. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశారు. -
భార్యతో టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న.. ఫోటోలు వైరల్
-
'బోపన్న.. మీ భార్య చాలా అందంగా ఉంది'
ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో భారత్‌కు చెందిన టెన్నిస్ ప్లేయర్లు రోహన్ బోపన్న, సానియా మీర్జా ఓడిపోయిన సంగతి తెలిసిందే. రాడ్ లావర్ ఎరీనాలో బ్రెజిల్‌కు చెందిన రాఫెల్ మాటోస్, లూయిసా స్టెఫానీ జోడీ బోపన్న-సానియా జోడీని వరుస సెట్లలో 6-7, 2-6తో ఓడించింది. ఈ గేమ్‌తో సానియా మీర్జా గ్రాండ్‌స్లామ్ కెరీర్ ముగిసింది. ఇదిలా ఉంటే.. సానియా మీర్జా చివరి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ చూడడం కోసం ఆమె ఫ్యామిలీతో పాటు బోపన్న ఫ్యామిలీ కూడా హాజరయ్యారు. మ్యాచ్‌లో బోపన్న భార్య సుప్రియ అన్నయ్య స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. బ్లాక్ డ్రెస్‌లో సుప్రియ హాట్ లుక్స్‌తో అదరగొట్టింది. అంతేకాదు మ్యాచ్ సమయంలో తన భర్త బోపన్న-సానియా జోడిని ఎంకరేజ్ చేస్తూ నిలబడి చప్పట్లు కొట్టడం కనిపించింది. బోపన్న భార్యను చూసిన ఒక వ్యక్తి ట్విటర్ వేదికగా ఆమె అందాన్ని పొగడకుండా ఉండలేకపోయాడు. ''బోపన్న మీ భార్య చాలా అందంగా ఉంది.. ప్రపంచంలో అంతటి అందమైన మహిళను ఎప్పుడూ చూడలేదు.'' అంటూ ట్వీట్ చేశాడు. సదరు వ్యక్తి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కాగా ట్వీట్‌పై బోపన్న స్పందించాడు. ''మీరు చెప్పిన విషయాన్ని నేను అంగీకరిస్తున్నా'' అంటూ లవ్ ఎమోజీ సింబల్ జత చేశాడు.కాగా బోపన్న, సుప్రియ అన్నయ్యల వివాహం 2012లో జరిగింది. I agree 😉🥰... https://t.co/XVUjZWI1Rm — Rohan Bopanna (@rohanbopanna) January 28, 2023 చదవండి: వరల్డ్‌కప్ ఫైనల్.. బిడ్డ ఆట చూడడం కోసం ఇన్వర్టర్ కొన్న తల్లి కథ -
భావోద్వేగానికి లోనైన సానియా.. ఇక్కడే మొదలు, ఇక్కడే ముగింపు అంటూ..
Sania Mirza Gets Emotional Video: ‘‘నా ప్రొఫెషనల్ కెరీర్ ఇక్కడే.. 2005లో 18 ఏళ్ల వయసులో మెల్బోర్న్లో మొదలైంది.. ఇక్కడే నా గ్రాండ్‌స్లామ్ కెరీర్ ముగిసిపోతోంది కూడా. రాడ్ లావెర్ ఎరీనా నాకు ఎంతో ప్రత్యేకం. నా చిన్నారి కుమారుడి సమక్షంలో ఇలా ఇక్కడ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడతానని అస్సలు ఊహించలేదు. ఇంతకంటే మరో గొప్ప చోటు ఎక్కడా ఉండదు’’ అంటూ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భావోద్వేగానికి లోనయ్యారు. ఆస్ట్రేలియా ఓపెన్-2023 మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఓటమి తర్వాత తన కెరీర్‌లోని మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ఓటమితో ముగింపు కాగా ఇప్పటికే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన హైదరాబాదీ సానియా మీర్జా కెరీర్లో ఇదే ఆఖరి గ్రాండ్‌స్లామ్. మరో భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నతో కలిసి ఫైనల్ చేరుకున్న సానియా మెల్బోర్న్లో జరిగిన శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఓటమిని మూటగట్టుకున్నారు. బ్రెజిల్ జంట లూసియా స్టెఫానీ- రఫేల్ మాటోస్ చేతిలో ఓడిపోయిన భారత జోడీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక బ్రెజిల్ ద్వయానికి కూడా ఇదే తొలి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ కావడం విశేషం. కన్నీళ్లు పెట్టుకున్న సానియా.. 36 ఏళ్ల సానియా మీర్జా కెరీర్లో ఇది 11వ గ్రాండ్ స్లామ్ ఫైనల్. కాగా సానియా ఇప్పటి వరకు 43 డబుల్స్ టైటిళ్లు గెలిచారు. ఇందులో ఆరు గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు ఉన్నాయి. నంబర్ 1గా.. కానీ అదొక్కటే లోటు మహిళల డబుల్స్‌లో మూడు, మిక్స్డ్ డబుల్స్‌లో మూడుసార్లు విజేతగా నిలిచారు. అంతేగాక మహిళల డబుల్స్ కేటగిరీలో సానియా 91 వారాల పాటు నంబర్ 1 ర్యాంకులో కొనసాగారు. అయితే కెరీర్లో ఒక్కసారి కూడా ఆమె మేజర్ సింగిల్స్ టైటిల్ గెలవలేకపోయారు. ఇదే సానియా కెరీర్లో పెద్దలోటు అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు తన కుమారుడు ఇజహాన్ ఎదుట ఆడిన ఫైనల్లో ఓడిపోయిన సానియా కన్నీళ్లు పెట్టుకుంటూ వీడ్కోలు పలికారు. వి లవ్ యూ! ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులు.. ‘‘మేము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము సానియా’’ అని ట్వీట్ చేశారు. కాగా వచ్చే నెలలో దుబాయ్ వేదికగా జరుగనున్న డబ్లూటీఏ 1000 ఈవెంట్ తర్వాత సానియా తన టెన్నిస్ కోర్టుకు పూర్తిగా దూరం కానున్నారు. సానియా మీర్జా గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు- భాగస్వాములు ►2006- ఆస్ట్రేలియా ఓపెన్- మిక్స్డ్ డబుల్స్- మహేశ్ భూపతి ►2012- ఫ్రెంచ్ ఓపెన్- మిక్స్డ్ డబుల్స్- మహేశ్ భూపతి ►2014- యూఎస్ ఓపెన్- మిక్స్డ్ డబుల్స్- బ్రూనో సోర్స్ ►2015- వింబుల్డన్- మహిళల డబుల్స్- మార్టినా హింగిస్ ►2015- యూఎస్ ఓపెన్- మహిళల డబుల్స్- మార్టినా హింగిస్ ►2016- ఆస్ట్రేలియా ఓపెన్- మహిళల డబుల్స్- మార్టినా హింగిస్ చదవండి: Axar Patel: పెళ్లి పీటలెక్కిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్.. ఫొటోలు వైరల్ Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే! టాస్ గెలిస్తే... “My professional career started in Melbourne… I couldn’t think of a better arena to finish my [Grand Slam] career at.” We love you, Sania ❤️@MirzaSania • #AusOpen • #AO2023 pic.twitter.com/E0dNogh1d0 — #AusOpen (@AustralianOpen) January 27, 2023 -
Australian Open: ఆశలు గల్లంతు! ఫైనల్లో సానియా-బోపన్న జోడి ఓటమి
మెల్బోర్న్: కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న హైదరాబాద్ వెటరన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో చుక్కెదురైంది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో సానియా మీర్జా-బోపన్న జోడి ఓటమి పాలైంది. బ్రెజిల్ జంట స్టెఫానీ-రఫెల్ చేతిలో 6-7, 2-6 తేడాతో భారత జోడి ఓడిపోయింది. ఇప్పటికే మహిళల డబుల్స్‌లోనూ సానియా-అనా డానిలినా (కజకిస్తాన్) జంట నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అయితే, సీనియర్ ఆటగాడు బోపన్న సాయంతో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో విజయం సాధించి టైటిల్‌తో సానియాకు ఘనంగా వీడ్కోలు పలకాలని అభిమానులు ఆకాంక్షించగా వారి ఆశలు అడియాశలయ్యాయి. ఇక బ్రెజిల్ జంట స్టెఫానీ-రఫెల్‌కు ఇది తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 2009 (మిక్స్డ్), 2016 (డబుల్స్)లలో సానియా విజేతగా నిలిచింది. (చదవండి: 'జొకోవిచ్.. మీ తండ్రి చేసిన పని సిగ్గుచేటు')) -
Australia Open: ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో సానియా- బోపన్న జోడీ
Australian Open Mixed Doubles: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ సెమీ ఫైనల్లో సానియా మీర్జా–రోహన్ బోపన్న (భారత్) జోడి అదరగొట్టింది. బుధవారం నాటి సెమీస్ మ్యాచ్‌లో థర్డ్ సీడ్ ద్వయం నీల్ స్కుప్స్కి(గ్రేట్ బ్రిటన్), డిసిరే(యూఎస్ఏ)ను ఓడించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. ప్రత్యర్థిపై 7-6, 6-7, (10-6) తేడాతో విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది. అలా సెమీస్‌కు చేరి.. ఇదిలా ఉంటే.. సానియా మీర్జా–రోహన్ బోపన్న ద్వయం కోర్టులోకి అడుగు పెట్టకుండానే మిక్స్డ్ డబుల్స్‌లో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జోడీతో తలపడాల్సిన ఒస్టాపెంకో (లాత్వియా)–వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) జోడీ గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో భారత జంటను విజేతగా ప్రకటించారు. ఇలా సెమీస్‌కు చేరుకున్న సానియా- బోపన్న జోడీ మెరుగైన ప్రదర్శనతో ఇప్పుడు ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. కాగా కెరీర్లో చివరి గ్రాండ్ స్లామ్ ఆడుతున్న సానియా మీర్జా.. బోపన్న సాయంతో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లోనూ విజయం సాధించి టైటిల్‌తో ఘనంగా వీడ్కోలు పలకాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: ICC ODI Rankings: నంబర్ వన్ బౌలర్‌గా సిరాజ్ ICC ODI Rankings: కోహ్లిని వెనక్కునెట్టిన గిల్.. హిట్‌మ్యాన్ ఏ స్థానంలో ఉన్నాడంటే..? In a fitting farewell, @MirzaSania's last dance will take place on the grandest stage! She and @rohanbopanna 🇮🇳 have qualified for the Mixed Doubles Final!@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/qHGNOvWMoC — #AusOpen (@AustralianOpen) January 25, 2023 -
Vietnam Open 2022: సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ జోడీ జోరు
హో చి మిన్ సిటీ: వియత్నాం ఓపెన్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ జోరు కొనసాగుతోంది. గతవారం ఛత్తీస్‌గఢ్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో టైటిల్ నెగ్గిన సిక్కి–రోహన్ ద్వయం వియత్నాం ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి, ఢిల్లీ ప్లేయర్ రోహన్ కపూర్ 21–19, 21–17తో మూడో సీడ్ చాన్ పెంగ్ సూన్–చెయ యీ సీ (మలేసియా) జోడీపై సంచలన విజయం సాధించారు. 34 ఏళ్ల చాన్ పెంగ్ సూన్ 2016 రియో ఒలింపిక్స్‌లో మిక్స్డ్ డబుల్స్‌లో రజత పతకం సాధించడం విశేషం. నేడు జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్ రెహన్ నౌఫల్–లీసా కుసుమవతి (ఇండోనేసియా) జోడీతో సిక్కి రెడ్డి–రోహన్ తలపడతారు. Tel Aviv Tennis Tournament: టైటిల్‌కు గెలుపు దూరంలో... టెల్ అవీవ్: భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న ఈ ఏడాది మూడో టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. టెల్ అవీవ్ ఏటీపీ–250 టోర్నీలో బోపన్న (భారత్)– మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం 4–6, 7–6 (7/3), 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో డూంబియా–రెబూల్ (ఫ్రాన్స్) జోడీపై గెలిచింది. 42 ఏళ్ల బోపన్న ఈ ఏడాది పుణే ఓపెన్, అడిలైడ్ ఓపెన్లలో డబుల్స్ టైటిల్స్ సాధించాడు. -
క్వార్టర్స్‌లో బోపన్న జోడీ
న్యూఢిల్లీ: టెల్ అవీవ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ శుభారంభం చేసింది. బుధవారం ఇజ్రాయెల్‌లో జరిగిన తొలి రౌండ్లో టాప్ సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం 4–6, 7–6 (7/4), 10–6తో వైషయ్ ఒలియెల్ (ఇజ్రాయెల్)–మెద్జెదోవిచ్ (సెర్బియా) జోడీ పై గెలిచింది. గంటా 28 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఐదు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. చదవండి: Vietnam Open Badminton: ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ జోడీ -
Cincinnati Masters: పోరాడి ఓడిన బోపన్న జోడీ
సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీ నుంచి రోహన్ బోపన్న (భారత్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. 2 గంటల 22 నిమిషాల పాటు జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం 6–7 (6/8), 7–6 (14/12), 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో షపోవలోవ్ (కెనడా)–ఖచనోవ్ (రష్యా) జోడీ చేతిలో ఓడింది. బోపన్న–మిడిల్‌కూప్ జోడీకి 14,700 డాలర్ల (రూ. 11 లక్షల 65 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
ప్రిక్వార్టర్స్‌లో సానియా జోడీ
టొరంటో: కెనడియన్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మహిళల డబుల్స్‌లో శుభారంభం చేసింది. అమెరికా ప్లేయర్ మాడిసన్ కీస్‌తో జతకట్టిన సానియా తొలి రౌండ్లో 6–4, 3–6, 10–6తో అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్)–జిల్ టెయిక్మన్ (స్విట్జర్లాండ్) జంటపై విజయం సాధించింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా జోడీ... టాప్‌సీడ్ వెరొనిక కుడెర్మెటోవా (రష్యా)– ఎలైజ్ మెర్టెన్స్ (బెల్జియం) జంటతో తలపడుతుంది. మరో వైపు మాంట్రియల్ ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న జోడీ కూడా ప్రిక్వార్టర్స్ చేరింది. తొలి రౌండ్లో బోపన్న–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) ద్వయం 7–6 (7/5), 4–6, 10–6తో డెనిస్ షపొవలోవ్ (కెనడా)– కరెన్ కచనొవ్ (రష్యా) జంటపై గెలిచింది. ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ పొలండ్‌కు చెందిన జెలిన్స్కీ–హుర్కాజ్ జంటతో తలపడుతుంది. -
HAMBURG: రన్నరప్ బోపన్న జంట
న్యూఢిల్లీ: తన కెరీర్లో 22వ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నకు నిరాశ ఎదురైంది. హాంబర్గ్ యూరోపియన్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంట రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జర్మనీలో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం 2–6, 4–6తో అన్‌సీడెడ్ లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్)–హెలియోవారా (ఫిన్లాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. విజేతగా నిలిచిన గ్లాస్‌పూల్–హెలియోవారా జోడీకి 1,08,770 యూరోల (రూ. 88 లక్షల 69 వేలు) ప్రైజ్‌మనీ, 500 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ బోపన్న జంటకు 58 వేల యూరోల (రూ. 47 లక్షల 29 వేలు) ప్రైజ్‌మనీ, 300 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
HAMBURG OPEN 2022: ఫైనల్లో బోపన్న జంట
న్యూఢిల్లీ: హాంబర్గ్ యూరోపియన్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–మాట్వి మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. జర్మనీలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో నాలుగో సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం 3–6, 6–3, 10–3తో టాప్ సీడ్ మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)–హొరాసియో జెబాలస్ (అర్జెంటీనా) జంటపై సంచలన విజయం సాధించింది. లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్)–హెలియోవారా (ఫిన్లాండ్), టిమ్ పుయెట్జ్ (జర్మనీ)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం తలపడుతుంది. 42 ఏళ్ల బోపన్న తన కెరీర్లో ఇప్పటివరకు 21 డబుల్స్ టైటిల్స్ సాధించగా... ఈ ఏడాది రెండు టోర్నీలలో విజేతగా నిలిచాడు. -
సెమీస్‌లో పోరాడి ఓడిన బోపన్న జంట
సించ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–షపోవలోవ్ (కెనడా) జంట పోరాటం ముగిసింది. లండన్‌లో ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 5–7, 7–6 (7/4), 4–10తో ‘సూపర్ టైబ్రేక్’లో గ్లాస్‌పూల్ (బ్రిటన్)–హ్యారీ హెలియోవారా (ఫిన్లాండ్) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. బోపన్న జంటకు 35,370 పౌండ్లు (రూ. 33 లక్షల 70 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. చదవండి: Matteo Berrettini: 'నన్ను పెళ్లి చేసుకుంటావా'.. టెన్నిస్ స్టార్‌కు వింత అనుభవం -
పోరాడి ఓడిన బోపన్న జోడీ..
స్టుట్గార్ట్ (జర్మనీ): బాస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జంట పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 6–7 (1/7), 6–7 (5/7)తో మూడో సీడ్ హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్)–మ్యాట్ పావిచ్ (క్రొయేషియా) జంట చేతిలో ఓడిపోయింది. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసేందుకు పదిసార్లు అవకాశం లభించినా బోపన్న–షపోవలోవ్ ఒక్కసారీ సద్వినియోగం చేసుకోలేకపోయారు. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న–షపోవలోవ్ 6–4, 3–6, 11–9తో నెదోవ్‌యెసోవ్ (కజకిస్తాన్)–ఐజామ్ ఉల్ హఖ్ ఖురేషీ (పాకిస్తాన్)లపై విజయం సాధించారు. సెమీస్‌లో ఓడిన బోపన్న జోడీకి 11,480 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 9 లక్షల 43 వేలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చదవండి: Mary Kom: కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలిగిన భారత దిగ్గజ బాక్సర్ -
సెమీస్‌లోనే ముగిసిన బోపన్న పోరాటం
పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న అద్భుత పోరాటం సెమీస్‌లో ముగిసింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో 16వ సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ 6–4, 3–6, 6–7 (8/10) స్కోరుతో 12వ సీడ్ మార్సెలో అరివలో (సాల్వేడార్)–జీన్ జులియెన్ రోజర్ (నెదర్లాండ్స్) జంట చేతిలో పరాజయం చవిచూసింది. ఈ టోర్నీలో గత మ్యాచ్‌ల్లో సూపర్ టైబ్రేకర్‌లో ప్రత్యర్థి ద్వయంపై ఆధిపత్యం కనబరిచి నెగ్గుకొచ్చిన భారత్–డచ్ జంటకు ఇక్కడ మాత్రం కలిసిరాలేదు. 2 గంటల 7 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో బోపన్న జోడీ తొలి సెట్ చేజిక్కించుకుంది కానీ రెండో సెట్‌ను కోల్పోయింది. ఆఖరి సెట్ మాత్రం హోరాహోరీగా జరగడంతో టైబ్రేక్‌దాకా వచ్చింది.అయితే ఇందులో బోపన్న–మిడిల్‌కూప్ ఆటలు సాగలేదు. దీంతో 12 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ పురుషుల డబుల్స్‌లో టైటిల్ పోరుకు చేరాలనుకున్న బోపన్న ఆశలు సెమీస్‌లోనే గల్లంతయ్యాయి. చివరిసారిగా బోపన్న... ఐజముల్ హక్ ఖురేషీ (పాకిస్తాన్)తో కలిసి 2010 యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. -
French Open 2022: వారెవ్వా.. రోహన్ బోపన్న తొలిసారి..
భారత టెన్నిస్ సీనియర్ స్టార్ రోహన్ బోపన్న తన కెరీర్లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో బోపన్న(భారత్)- మిడిల్‌కూప్(నెదర్లాండ్స్) ద్వయం 4-6, 6-4, 7-6(10/3)తో సూపర్ ట్రై బ్రేక్‌లో లాయిడ్ గ్లాస్‌పూల్(బ్రిటన్)- హెలియోవారా(ఫిన్లాండ్) జోడీపై గెలిచింది. ఈ విజయంతో 42 ఏళ్ల బోపన్న ఏడేళ్ల విరామం తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్‌కు అర్హత సాధించాడు. చివరసారి బోపన్న 2015లో వింబుల్డన్ టోర్నీలో సెమీ ఫైనల్ చేరాడు. The first men’s doubles semi-final is set! 🇸🇻🇳🇱Arevalo/Rojer 🆚 Bopanna/Middelkoop 🇮🇳🇳🇱#RolandGarros pic.twitter.com/66zNDLzmgZ — Roland-Garros (@rolandgarros) May 30, 2022 -
2022 BMW Open: క్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట ఓటమి
బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ నుంచి రోహన్ బోపన్న (భారత్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంట క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. మ్యూనిక్‌లో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం 3–6, 4–6తో మటోస్ (బ్రెజిల్)–డేవిడ్ వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) జోడీ చేతిలో ఓడింది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన బోపన్న జంటకు 4,950 యూరోల (రూ. 3 లక్షల 98 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
పోరాడి ఓడిన బోపన్న–జేమీ ముర్రే జంట
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–జేమీ ముర్రే (బ్రిటన్) జంట పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–జేమీ ముర్రే ద్వయం 6–3, 6–7 (4/7), 9–11తో టాప్ సీడ్ జో సాలిస్బరీ (బ్రిటన్)–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ చేతిలో ఓడింది. బోపన్న–జేమీ ముర్రే జంటకు 76,560 యూరోల (రూ. 63 లక్షల 19 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 360 పాయింట్లు లభించాయి. -
జ్యోతి సురేఖకు నిరాశ.. బొపన్న, సానియా జంటలకు షాక్!
ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ఆర్చరీ జట్ల ఎంపిక కోసం నిర్వహిస్తున్న సెలెక్షన్ ట్రయల్స్‌లో ఆంధ్రప్రదేశ్ స్టార్ ప్లేయర్ జ్యోతి సురేఖ విఫలమైంది. సోనిపట్‌లో మంగళవారం జరిగిన మహిళల కాంపౌండ్ విభాగం ట్రయల్స్‌లో సురేఖ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఎలిమినేషన్ రౌండ్లోనే నిష్క్రమించింది. సురేఖ 2014, 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం, రజతం సాధించింది. ఇతర క్రీడాంశాలు బొపన్న జంట ఓటమి కాలిఫోర్నియా: మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–షపోవలోవ్ (కెనడా) ద్వయం 2–6, 1–6తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన బోపన్న జంటకు 61,100 డాలర్ల (రూ. 46 లక్షల 19 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సానియా జోడీ పరాజయం కాలిఫోర్నియా: మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నీ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా మీర్జా (భారత్)–కిర్‌స్టెన్ ఫ్లిప్కెన్స్ (బెల్జియం) ద్వయం 3–6, 6–7 (3/7)తో జావోజువాన్ యాంగ్ (చైనా)–ఎకతెరీనా (రష్యా) జోడీ చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో మనిక బత్రా–అర్చన జంట ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) దోహా కంటెండర్ టోర్నీ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మనిక బత్రా–అర్చన కామత్ (భారత్) ద్వయం 13–11, 8–11, 11–5, 13–11తో సూ వాయ్ యామ్–లీ హో చింగ్ (హాంకాంగ్) జోడీని ఓడించి సెమీఫైనల్‌కు చేరింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మనిక 5–11, 2–11, 4–11తో యింగ్ హాన్ (జర్మనీ) చేతిలో... పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సత్యన్ (భారత్) 11–5, 8–11, 7–11, 4–11తో కార్ల్సన్ (స్వీడన్) చేతిలో ఓడిపోయారు. చదవండి: Kane Williamson: వెయ్యిసార్లు చూసినా అదే నిజం.. చెత్త అంపైరింగ్! పాపం కేన్ మామ! -
క్వార్టర్ ఫైనల్లో సానియా జోడీ.. టాప్ సీడ్ జంటను ఓడించి బొపన్న జోడి సంచలనం
మియామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–కిర్‌స్టెన్ ఫ్లిప్కెన్స్ (బెల్జియం) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. కాలిఫోర్నియాలో సోమవారం జరిగిన మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా–ఫ్లిప్కెన్స్ జోడీ 6–2, 6–4తో డెసిరె క్రాజిక్ (అమెరికా)–డెమీ షుర్స్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ మూడు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. టాప్ సీడ్ జోడీని ఓడించి క్వార్టర్స్‌కు... మియామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జంట సంచలనం సృష్టించింది. కాలిఫోర్నియాలో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 6–3, 7–6 (7/3)తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జంట పావిచ్–మెక్టిక్ (క్రొయే షియా)ను బోల్తా కొట్టించింది. ఈ ఓటమితో పావిచ్ వచ్చే వారం విడుదల చేసే డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను కోల్పోనున్నాడు. -
వరల్డ్ గ్రూప్–1లోనే భారత్.. డెన్మార్క్‌పై ఘన విజయం
న్యూఢిల్లీ: ఈ ఏడాది డేవిస్ కప్ టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టు వరల్డ్ గ్రూప్–1లోనే కొనసాగనుంది. డెన్మార్క్‌తో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 4–0తో నెగ్గింది. శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ ద్వయం 6–7 (4/7), 6–4, 7–6 (7/4)తో నీల్సన్–టార్పెగార్డ్ జంటను ఓడించి భారత్‌కు 3–0తో విజయాన్ని ఖాయం చేసింది. భారత్ విజయం ఖరారు అయినప్పటికీ రివర్స్ సింగిల్స్‌ను నిర్వహించారు. రామ్‌కుమార్ 5–7, 7–5, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో ఇంగిల్డ్సెన్పై గెలిచి భారత ఆధిక్యాన్ని 4–0కు పెంచాడు. అనంతరం నామ మాత్రమైన ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. చదవండి: Pak vs Aus: ఒకవైపు వార్న్ మరణం.. ఇప్పుడు ఇది అవసరమా వార్నర్ ? -
డేవిస్ కప్‌లో రామ్‌కుమార్, యూకీ బాంబ్రీ గెలుపు
న్యూఢిల్లీ: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 ప్లే–ఆఫ్ టైలో భాగంగా డెన్మార్క్‌తో జరుగుతున్న పోరులో శుక్రవారం భారత్ 2–0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్ 6–3, 6–2తో క్రిస్టియాన్ సిగ్స్గార్డ్పై అలవోక విజయం సాధించాడు. ప్రపంచ 170వ ర్యాంకర్ రామ్‌కుమార్ కేవలం 59 నిమిషాల్లోనే 824వ ర్యాంకింగ్ ప్లేయర్‌పై గెలిచాడు. సుదీర్ఘ విరామానంతరం... 2017 తర్వాత మళ్లీ డేవిస్ కప్ బరిలోకి దిగిన యూకీ బాంబ్రీ రెండో సింగిల్స్‌లో 6–4, 6–4తో మికేల్ టొర్పెగార్డ్ను ఓడించాడు. నేడు జరిగే డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జోడీ గెలిస్తే చాలు భారత్ రివర్స్ సింగిల్స్ ఆడే అవకాశం లేకుండానే విజయం సాధిస్తుంది. ఇదే జరిగితే భారత్ వరల్డ్ గ్రూప్–1లో స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. చదవండి: national chess championship 2022: విజేతగా అర్జున్.. తొలి తెలంగాణ ఆటగాడిగా రికార్డు -
Qatar Open: రన్నరప్ బోపన్న–షపోవలోవ్ జోడీ
Qatar Open: ఖతర్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–షపోవలోవ్ (కెనడా) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. దోహాలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–షపోవలోవ్ జోడీ 6–7 (4/7), 1–6తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జంట చేతిలో ఓడిపోయింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–షపోవలోవ్ ఐదు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. రన్నరప్‌గా నిలిచిన బోపన్న–షపోవలోవ్ జోడీకి 29,240 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 21 లక్షల 80 వేలు) లభించింది. ఫైనల్లో సాకేత్ జంట సాక్షి, హైదరాబాద్: బెంగళూరు ఓపెన్–2 ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని తన భాగస్వామి రామ్‌కుమార్ రామనాథన్‌తో కలిసి డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బెంగళూరులో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–1, 7–6 (7/3)తో కుకావుడ్ (ఫ్రాన్స్)–ఆండ్రూ హారిస్ (ఆ్రస్టేలియా) జోడీపై గెలిచింది. మరో సెమీఫైనల్లో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట 4–6, 6–4, 3–10తో ‘సూపర్ టైబ్రేక్’లో అర్జున్ ఖడే (భారత్)–ఎర్లెర్ (ఆస్ట్రియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. చదవండి: Ind Vs Wi 3rd T20: మూడో టీ20కి స్టార్ ప్లేయర్లు దూరం... మరో కీలక సిరీస్‌కు కూడా డౌటే.. ఎందుకంటే! -
బోపన్న–రామ్‌కుమార్ సంచలన విజయం.. డబుల్స్ టైటిల్
Rohan Bopanna Ramkumar- పుణే: దక్షిణాసియాలో జరిగే ఏకైక ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్ టాటా ఓపెన్‌లో భారత సీనియర్ స్టార్ రోహన్ బోపన్న, యువతార రామ్‌కుమార్ రామనాథన్ మెరిశారు. వీరిద్దరు జతగా బరిలోకి దిగి టాటా ఓపెన్ డబుల్స్ విభాగంలో టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–రామ్‌కుమార్ ద్వయం 6–7 (10/12), 6–3, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ లూక్ సావిల్లె–జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జోడీపై సంచలన విజయం సాధించింది. బోపన్న–రామ్ జంటకు 16,370 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 12 లక్షల 22 వేలు)లభించింది. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట ఏడు ఏస్‌లు సంధించి ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. ఈ ఏడాది బోపన్న–రామ్ జోడీకిది రెండో డబుల్స్ టైటిల్ కావడం విశేషం. గత నెలలో అడిలైడ్ ఓపెన్‌లోనూ బోపన్న–రామ్ జంట విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా బోపన్న కెరీర్లో ఇది 21వ డబుల్స్ టైటిల్‌కాగా రామ్ ఖాతాలో ఇది రెండో డబుల్స్ టైటిల్. చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. -
Sania Mirza: ‘టాప్స్’లో సానియా మీర్జా
టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కోర్ గ్రూప్‌లో సీనియర్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పేరును కూడా చేర్చారు. ఈ సీజన్ తర్వాత రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన సానియా... ఒలింపిక్స్ సన్నాహక అథ్లెట్లలో లేకున్నా కూడా ఈ ఏడాది ఆసియా క్రీడలను దృష్టిలో ఉంచుకొని ఆమెకు అవకాశం కల్పించారు. ఈ జాబితాలో రోహన్న బోపన్న, రామ్‌కుమార్ రామనాథన్, అంకితా రైనాలకు కూడా చోటు దక్కింది. -
సెమీ ఫైనల్లో రామ్‌కుమార్–బోపన్న
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న–రామ్‌కుమార్ రామనాథన్ జోడీ సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. సింగిల్స్‌లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. గురువారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–రామ్‌కుమార్ ద్వయం 7–6 (7/3), 7–6 (7/4)తో అలెగ్జాండర్ ఎర్లెర్ (ఆస్ట్రియా)–జిరి వెసెలీ (చెక్ రిపబ్లిక్) జంటపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రియా–చెక్ జోడీతో భారత జంటకు హోరాహోరీ పోరు ఎదురైంది. దీంతో రెండు సెట్లలోనూ టైబ్రేక్ తప్పలేదు. మరో భారత జోడీ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం కూడా సెమీస్ చేరింది. క్వార్టర్స్‌లో వీరి ప్రత్యర్థులు గియన్లుకా మగెర్ (ఇటలీ)–ఎమిల్ రుసువూరి (ఫిన్లాండ్) గాయంతో వైదొలగడంతో విష్ణు–శ్రీరామ్ జంట వాకోవర్‌తో సెమీస్ చేరింది. సెమీఫైనల్లో ఈ జోడీ... ఆస్ట్రేలియాకు చెందిన ల్యూక్ సవిల్లే–జాన్ ప్యాట్రిక్ స్మిత్ జంటతో, బోపన్న–రామ్‌కుమార్ జంట ఫ్రాన్స్‌కు చెందిన సాడియో డౌంబియా–ఫాబిన్ రెబొల్ ద్వయంతో తలపడతాయి. సాకేత్ మైనేని–ముకుంద్ శశికుమార్ జంట 6–3, 5–7, 3–10తో ల్యూక్ సవిల్లే– జాన్ ప్యాట్రిక్ జోడీ చేతిలో ఓడింది. సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ 3–6, 2–6తో ఎనిమిదో సీడ్ స్టెఫానో ట్రవాగ్లియా (ఇటలీ) చేతిలో పరాజయం చవిచూశాడు. ప్రపంచ 93వ ర్యాంకర్ ధాటికి 29 ఏళ్ల యూకీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు. వరుస సెట్లలోనే చేతులెత్తేశాడు. తొలి రౌండ్లో స్టెఫానో... భారత్‌కు చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌ను ఓడించాడు. తాజా విజయంతో ఇటలీ ప్లేయర్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలిరౌండ్లోనే ప్రజ్నేశ్ గుణేశ్వరన్, అర్జున్ ఖడేలు కూడా ఓడిపోవడంతో ఈ టోర్నీ సింగిల్స్‌లో భారత్ పోరాటం ముగిసింది. ఇతర మ్యాచ్‌ల్లో స్వీడెన్కు చెందిన ఎలీస్ యెమెర్ టాప్ సీడ్ అస్లన్ కరత్సెవ (రష్యా)కు షాకిచ్చాడు. 163వ ర్యాంకులో ఉన్న యెమెర్ 6–2, 7–6 (7/3)తో ప్రపంచ 15వ ర్యాంకర్ కరత్సెవను కంగుతినిపించి క్వార్టర్స్ చేరాడు. సాకేత్ మైనేనికి వైల్డ్‌కార్డ్ బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేనికి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించింది. దీంతో ఈ నెల 7 (సోమవారం) నుంచి జరిగే ఈ టోర్నీలో 34 ఏళ్ల తెలుగు ఆటగాడు నేరుగా మెయిన్ డ్రాలో పోటీపడతాడు. -
భళా బోపన్న... అడిలైడ్ ఓపెన్ డబుల్స్ టైటిల్ సొంతం
అడిలైడ్: నాలుగు పదుల వయసు దాటినా తనలో ఇంకా చేవ తగ్గలేదని నిరూపిస్తూ భారత వెటరన్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన కెరీర్లో 20వ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన అడిలైడ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో రోహన్ బోపన్న–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జంట చాంపియన్‌గా నిలిచింది. 81 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ బోపన్న–రామ్‌కుమార్ ద్వయం 7–6 (8/6), 6–1తో టాప్ సీడ్ మార్సెలో మెలో (బ్రెజిల్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీపై సంచలన విజయం సాధించింది. బెంగళూరుకు చెందిన 41 ఏళ్ల బోపన్న కెరీర్లో ఇది 20వ డబుల్స్ టైటిల్. 2020లో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)తో కలసి దోహా ఓపెన్ టైటిల్ సాధించాక బోపన్న ఖాతాలో చేరిన మరో టైటిల్ ఇదే కావడం విశేషం. మరోవైపు చెన్నైకి చెందిన 27 ఏళ్ల రామ్‌కుమార్ కెరీర్లో ఇదే తొలి టైటిల్ కావడం గమనార్హం. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూట్లో బోపన్న–రామ్‌కుమార్ కలసి ఆడటం ఇదే ప్రథమం. 55 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్లో రెండు జోడీలు తమ సర్వీస్‌లను నిలబెట్టుకున్నాయి. దాంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో భారత జోడీ పైచేయి సాధించి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో మాత్రం భారత జంట ఆధిపత్యం కనబరిచింది. రెండుసార్లు ప్రత్యర్థి జోడీ సర్వీస్‌లను బ్రేక్ చేసి తమ సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. విజేతగా నిలిచిన బోపన్న–రామ్‌కుమార్ జంటకు 18,700 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 13 లక్షల 89 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. నేడు మొదలయ్యే అడిలైడ్ ఓపెన్–2 టోర్నీలో రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్)తో కలసి బోపన్న బరిలో దిగుతుండగా... మరోవైపు రామ్‌కుమార్‌తోపాటు భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్, యూకీ బాంబ్రీ మెల్బోర్న్లో జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడనున్నారు. చదవండి: సాయిప్రణీత్‌కు కరోనా పాజిటివ్ -
Rohan Bopanna-Ramkumar: టైటిల్‌కు విజయం దూరంలో...
అడిలైడ్: కొత్త ఏడాదిని టైటిల్‌తో శుభారంభం చేసేందుకు భారత టెన్నిస్ జోడీ రోహన్ బోపన్న–రామ్‌కుమార్ విజయం దూరంలో నిలిచింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న అడిలైడ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో బోపన్న–రామ్‌కుమార్ ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. బోపన్న కెరీర్లో ఇది 48వ ఏటీపీ టోర్నీ డబుల్స్ ఫైనల్‌కాగా... రామ్‌కుమార్ తన కెరీర్లో తొలిసారి ఏటీపీ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో అన్‌సీడెడ్ బోపన్న–రామ్‌కుమార్ జంట 6–2, 6–4తో నాలుగో సీడ్ శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–తొమిస్లావ్ బిర్కిచ్ (బోస్నియా హెర్జెగోవినా) జోడీపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో టాప్ సీడ్ ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–మార్సెలో మెలో (బ్రెజిల్) జంటతో బోపన్న–రామ్‌కుమార్ ద్వయం తలపడుతుంది. శాంటియాగో–బిర్కిచ్లతో 58 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో బోపన్న, రామ్‌కుమార్ ఎని మిది ఏస్‌లు సంధించారు. రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను ఒక్కసారీ కోల్పోలేదు. 41 ఏళ్ల బోపన్న తన కెరీర్లో 19 డబుల్స్ టైటిల్స్ సాధించి, 28 సార్లు రన్నరప్‌గా నిలిచాడు. (చదవండి: కోహ్లిని స్టార్క్‌తో పోల్చిన ఆసీస్ మీడియా.. కౌంటరిచ్చిన వసీం జాఫర్) -
Rohan Bopanna:సెమీఫైనల్లో బోపన్న–షపోవలోవ్ జోడీ
సెయింట్ పీటర్స్బర్గ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–షపోవలోవ్ (కెనడా) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. రష్యాలో జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–షపోవలోవ్ జోడీ 6–4, 5–7, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో ఖచనోవ్–రుబ్లెవ్ (రష్యా) జంటపై నెగ్గింది. 87 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో బోపన్న జోడీ ఆరు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. -
Rohan Bopanna: బోపన్న జోడీ సంచలనం
St Petersburg Open: సెయింట్ పీటర్స్బర్గ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జంట క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. రష్యాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 7–5, 6–4తో రెండో సీడ్ రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)–బెన్ మెక్లాచ్లన్ (జపాన్) జోడీపై విజయం సాధించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట పది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. చదవండి: IND vs PAK: ఆటా? మతవిద్వే షపు సయ్యాటా? -
క్వార్టర్ ఫైనల్లో బోపన్న–షపోవలోవ్ జంట
Indian Wells Masters 2021: ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జంట క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కాలిఫోర్నియాలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 7–5, 6–3తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్–అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) జోడీపై గెలిచింది. 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి ద్వయం సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. చదవండి: KKR vs DC, IPL 2021: కోల్‌కతా ‘సిక్సర్’తో... -
ఫిన్లాండ్తో ‘డేవిస్’ పోరుకు బోపన్న
సీనియర్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న భారత డేవిస్ కప్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇటీవల అఖిల భారత టెన్నిస్ సంఘంతో ఒలింపిక్స్ విషయమై బోపన్న గొడవ పడ్డాడు. ఇది పతాక స్థాయికి చేరడంతో అతన్ని భవిష్యత్తులో జట్టులోకి ఎంపిక చేయరనే వార్తలు వచ్చాయి. అయితే సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఫిన్లాండ్ వేదికగా ఫిన్లాండ్తో జరిగే వరల్డ్ గ్రూప్–1 పోరులో పాల్గొనే భారత జట్టులో బోపన్నను ఎంపిక చేశారు. ఈ పోటీలో డబుల్స్‌లో దివిజ్ శరణ్–బోపన్న జంట ఆడుతుంది. -
ఏఐటీఏపై బోపన్న విమర్శలు, సానియా మద్దతు
2012 లండన్ ఒలింపిక్స్‌కు ముందు... లియాండర్ పేస్‌తో డబుల్స్ ఆడేది లేదని మహేశ్ భూపతి, రోహన్ బోపన్న పట్టు... బలవంతంగా మిక్స్డ్ డబుల్స్‌లో పేస్ భాగస్వామిగా సానియా మీర్జా... పురుషాధిక్య ప్రపంచంలో తనను బలి పశువును చేశారని సానియా తీవ్ర వ్యాఖ్య! 2016 రియో ఒలింపిక్స్‌కు ముందు... పేస్‌తో కలిసి ఆడనని, డబుల్స్‌లో సాకేత్ మైనేనితోనే బరిలోకి దిగుతానని బోపన్న పట్టు... అలా కుదరదంటూ బలవంతంగా జోడీని ఎంపిక చేసిన ఏఐటీఏ!! 2020 టోక్యో ఒలింపిక్స్‌కు ముందు... ఇంకా వివాదమేమీ లేదు, అంతా బాగుందనే అనిపించిది. కానీ అలా అయితే అది భారత టెన్నిస్ ఎలా అవుతుంది...ఆటలకు ముందు వ్యాఖ్యల దుమారం రేగింది!!! న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో తాను పాల్గొనే అవకాశాల విషయంలో అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) అందరినీ తప్పుదోవ పట్టించిందని టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న వ్యాఖ్యానించాడు. సుమిత్ నగాల్‌కు జోడీగా తాను ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలు లేవని తెలిసి కూడా అధికారులు ఇలా వ్యవహరించారని అతను విమర్శించాడు. బోపన్న వ్యాఖ్యలకు సానియా మీర్జా మద్దతు పలకగా... ఏఐటీఏ ప్రతిగా స్పందిస్తూ ఇద్దరి విమర్శలను ఖండించింది. నేపథ్యమిదీ... ఒలింపిక్స్ పురుషుల డబుల్స్‌లో పాల్గొనే జోడీగా రోహన్ బోపన్న–దివిజ్ శరణ్‌ల పేర్లను ఏఐటీఏ ప్రకటించింది. అయితే వీరిద్దరి ‘సంయుక్త ర్యాంక్’ 113 కాగా... అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) నిబంధనల ప్రకారం తక్కువ ర్యాంక్ కారణంగా వీరు అర్హత సాధించలేకపోయారు. ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో పలువురు తప్పుకోవడంతో అనూహ్యంగా సుమిత్ నగాల్ అర్హత సాధించాడు. దాంతో దివిజ్ స్థానంలో నగాల్‌ను చేర్చి కొత్తగా ఈ జోడీని పరిశీలించమంటూ ఐటీఎఫ్‌ను ఏఐటీఏ కోరింది. చివరకు బోపన్న–నగాల్ జోడీకి కూడా అవకాశం దక్కలేదు. ఇదే విషయంపై వ్యాఖ్య చేసిన బోపన్న... అసలు ఏఐటీఏ అలాంటి ప్రయత్నమే చేయలేదని విమర్శించాడు. ‘నగాల్‌తో నా జోడీని ఐటీఎఫ్ అసలు అంగీకరించనే లేదు. గాయం తదితర బలమైన కారణం ఉంటే తప్ప చివరి తేదీ అయిన జూన్ 22 తర్వాత ఎలాంటి మార్పులు అంగీకరించబోమని ఐటీఎఫ్ స్పష్టం చేసింది. అయినా సరే మాకేదో అవకాశం ఉందని, తామేదో చేస్తున్నట్లుగా ఆటగాళ్లు, ప్రభుత్వం, మీడియా... ఇలా అందరినీ ఏఐటీఏ తప్పుదోవ పట్టించింది’ అని బోపన్న ట్వీట్ చేశాడు. దీనిని మద్దతుగా సానియా...‘అవునా...ఇదే నిజమైతే చాలా ఘోరం. సిగ్గు పడాల్సిన విషయం. దీని ప్రకారం చూస్తే మనిద్దరం కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో పతకం సాధించే అవకాశం కూడా కోల్పోయాం. నీతో పాటు సుమిత్ పేరు పంపించినట్లు నాకు కూడా చెప్పారు’ అని ట్వీట్ చేసింది. అయితే ఈ విమర్శలన్నింటికీ ఏఐటీఏ కొట్టి పారేసింది. బోపన్న, సానియా వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితం. వారికి అసలేం తెలీదు. అర్హత గురించి రూల్ బుక్ చదివి మాట్లాడితే బాగుండేది. డబుల్స్ జోడీని మార్చమంటూ మేం ఐటీఎఫ్కి విజ్ఞప్తి చేశాం. అయితే ప్రత్యేక పరిస్థితుల్లోనే అది సాధ్యమవుతుందని వారు మాకు చెప్పారు. అయినా సరే డెడ్‌లైన్ ముగియడానికి ఏడు గంటల ముందు వరకు కూడా సమాచారం ఇస్తామని చెప్పి మేమూ వేచి చూసేలా చేశారు. ఇందులో తప్పుదోవ పట్టించడం ఏముంది. దాని వల్ల మాకేంటి లాభం. బోపన్న ఒలింపిక్స్‌లో ఆడాలని అతనికి సహాయం చేసేందుకే ప్రయత్నించాం. అంతగా అనుకుంటే అతను సొంతంగా తన ర్యాంకింగ్‌తో అర్హత సాధించాల్సింది. –అనిల్ ధుపార్, ఏఐటీఏ కార్యదర్శి -
Wimbledon 2021: సూపర్ సబలెంకా
లండన్: కెరీర్లో 14 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడినా... ఒక్కసారీ నాలుగో రౌండ్ దాటలేకపోయిన బెలారస్ భామ అరీనా సబలెంకా 15వ ప్రయత్నంలో మాత్రం సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సబలెంకా క్వార్టర్ ఫైనల్లో 6–4, 6–3తో 21వ సీడ్ ఆన్స్ జెబర్ (ట్యూనిషియా)పై గెలిచింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా మూడు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. 27 విన్నర్స్ కొట్టిన ఆమె నెట్ వద్దకు 20 సార్లు దూసుకొచ్చి 11సార్లు పాయింట్లు సాధించింది. తొలి సెట్లో 5–4తో ఆధిక్యంలో ఉన్నదశలో దాదాపు పది నిమిషాలపాటు జరిగిన పదో గేమ్‌లో జెబర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి సబలెంకా తొలి సెట్‌ను కైవసం చేసుకుంది. రెండో సెట్లో సబలెంకా రెండో గేమ్‌లో, ఎనిమిదో గేమ్‌లో జెబర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. తాజా విజయంతో నటాషా జ్వెరెవా (1998), అజరెంకా (2011, 20112) తర్వాత వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన మూడో బెలారస్ క్రీడాకారిణిగా సబలెంకా గుర్తింపు పొందింది. ప్లిస్కోవా జోరు... ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో ఎనిమిదో సీడ్, మాజీ నంబర్‌వన్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–2తో గోలూబిచ్ (స్విట్జర్లాండ్)పై... టాప్ సీడ్, వరల్డ్ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–1, 6–3తో తొమ్యానోవిచ్ (ఆస్ట్రేలియా)పై గెలిచి ఈ టోర్నీలో తొలిసారి సెమీఫైనల్‌కు చేరారు. మరో క్వార్టర్ ఫైనల్లో 2018 చాంపియన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) 6–2, 6–3తో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించి నాలుగోసారి సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంది. 2012లో సెమీస్ చేరిన కెర్బర్ 2016లో రన్నరప్‌గా నిలిచింది. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో బార్టీతో కెర్బర్; ప్లిస్కోవాతో సబలెంకా తలపడతారు. రెండో సీడ్ మెద్వెదేవ్‌కు షాక్ పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ మెద్వెదేవ్ (రష్యా) 6–2, 6–7 (2/7), 6–3, 3–6, 3–6తో 14వ సీడ్ హుబర్ట్ హుర్కాజ్ (పోలాండ్) చేతిలో ఓడిపోయాడు. ఈ గెలుపుతో హుబర్ట్ తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరాడు. నేడు జరిగే పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఫుచోవిచ్ (హంగేరి)తో జొకోవిచ్ (సెర్బియా); హుబర్ట్తో ఫెడరర్ (స్విట్జర్లాండ్); షపోవలోవ్ (కెనడా)తో ఖచనోవ్ (రష్యా); ఫీలిక్స్ (కెనడా)తో బెరెటిని (ఇటలీ) తలపడతారు. రోహన్ బోపన్న–సానియా మీర్జా (భారత్) మిక్స్డ్ డబుల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)–ఆండ్రియా క్లెపాక్ (స్లొవేనియా) జోడీతో మ్యాచ్‌లో బోపన్న–సానియా జంట తొలి సెట్‌ను 3–6తో కోల్పోయింది. ఆ తర్వాత వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపి వేశారు. -
పురుషుల డబుల్స్‌లో భారత్‌కు దక్కని ‘టోక్యో’ బెర్త్
న్యూఢిల్లీ: పురుషుల టెన్నిస్ డబుల్స్ విభాగంలో భారత జోడీ రోహన్ బోపన్న–దివిజ్ శరణ్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. డబుల్స్ కంబైన్డ్ ర్యాంకింగ్స్‌లో బోపన్న (38), దివిజ్ శరణ్ (75) జోడీ 113వ ర్యాంక్‌లో ఉంది. టాప్–24 జోడీలకు మాత్రమే టోక్యో బెర్త్‌లు లభిస్తాయి. అనూహ్య పరిణామాలు చోటు చేసుకొని భారీ సంఖ్యలో క్రీడాకారులు వైదొలిగితే తప్ప బోపన్న–దివిజ్ జంటకు టోక్యోలో ఆడే అవకాశం లేనట్టే. 1988 సియోల్ ఒలింపిక్స్ క్రీడల్లో పురుషుల డబుల్స్ ఈవెంట్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ప్రతీ ఒలింపిక్స్‌లో పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించారు. పురుషుల డబుల్స్‌లో ఈసారి భారత ప్రాతినిధ్యం లేకపోవడంతో మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా బరిలో దిగే చాన్స్ లేకుండాపోయింది. సానియా ఇక మహిళల డబుల్స్‌లో మాత్రమే పోటీపడనుంది. -
French Open: మరో స్టార్ ప్లేయర్ దూరం
రొమేనియా: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరమైన స్టార్ ప్లేయర్ల జాబితాలో మరొకరు చేరారు. పురుషుల సింగిల్స్‌లో 2015 చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్), మాజీ నంబర్‌వన్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఈ మెగా ఈవెంట్‌కు దూరంకాగా ... తాజాగా మహిళల సింగిల్స్‌లో 2018 చాంపియన్, మూడో ర్యాంకర్ సిమోనా హలెప్ బరిలోకి దిగడంలేదని ప్రకటించింది. కాలిపిక్క గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హలెప్ తెలిపింది. ఈనెల 30న ఫ్రెంచ్ ఓపెన్ మొదలవుతుంది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట ఓటమి జెనీవా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–ఫ్రాంకోస్కుగర్ (క్రొయేషియా) పోరాటం ముగిసింది. స్విట్జర్లాండ్‌లో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ బోపన్న–స్కుగర్ ద్వయం 3–6, 6–3, 11–13తో ‘సూపర్ టైబ్రేక్’లో గొంజాలో ఎస్కోబార్ (కొలంబియా)–ఏరియల్ బెహర్ (ఉరుగ్వే) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. క్వార్టర్స్‌లో ఓడిన బోపన్న జంటకు 4,710 యూరోల (రూ. 4 లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఓడిన బొపన్న జంట: ప్రైజ్‌మనీ రూ. 6.69 లక్షలు
రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్ నుంచి రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపవలోవ్ (కెనడా) జంట తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. బోపన్న–షపవలోవ్ ద్వయం 4–6, 4–6తో డానియల్ (న్యూజిలాండ్)–ఫిలిప్ ఓస్వాల్డ్ (ఆస్ట్రియా) జోడీ చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్లో ఓడిన బోపన్న జంటకు 7,500 యూరోల (రూ. 6 లక్షల 69 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
బోపన్న జంట ఓటమి
రోమ్: ఇటాలియన్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జంట పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 6–4, 5–7, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఫాబ్రిస్ మార్టిన్–జెరెమీ చార్డీ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన బోపన్న జంటకు 30 వేల యూరోలు (రూ. 26 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఇదే టోర్నీ సింగిల్స్ విభాగంలో షపోవలోవ్ క్వార్టర్ ఫైనల్ చేరాడు. మూడో రౌండ్లో షపోవలోవ్ 6–7 (5/7), 6–1, 6–4తో యుగో హంబర్ట్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. -
యూఎస్ ఓపెన్ ఆడతా: బోపన్న
న్యూఢిల్లీ: ఐదు నెలల విరామం తర్వాత మళ్లీ కోర్టులో అడుగుపెట్టేందుకు భారత డబుల్స్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న సిద్ధమవుతున్నాడు. తన భాగస్వామి డెనిస్ షపోవలోవ్ (కెనడా)తో కలిసి యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ బరిలో దిగుతానని పేర్కొన్నాడు. ఈ మేరకు ప్రొఫెషనల్ సర్క్యూట్లో సత్తా చాటేందుకు తనను తాను సన్నద్ధం చేసుకుంటున్నానని బోపన్న చెప్పాడు. ‘డెనిస్ యూఎస్‌లోని ఐఎంజీ అకాడమీలోనే ఉన్నాడు. యూఎస్ ఓపెన్ కన్నా ముందు న్యూయార్క్‌లో సిన్సినాటి ఓపెన్ ఆడాలని మేం నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత రోమ్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీల్లోనూ పాల్గొంటాం’ అని ప్రపంచ 37వ ర్యాంకర్ బోపన్న పేర్కొన్నాడు. యూఎస్ వెళ్లేందుకు కోవిడ్–19 పరీక్ష కూడా చేయించుకోనున్నాడు. అనూహ్యంగా దొరికిన ఈ విరామ సమయంలో ఎన్నాళ్లుగానో నేర్చుకోవాలనుకున్న ‘అయ్యంగార్ యోగా’ను ప్రాక్టీస్ చేసినట్లు బోపన్న పేర్కొన్నాడు. దీనిద్వారా తన శరీరం దృఢంగా మారిందని, తన కాళ్లు బలంగా మారడం వల్ల ఆటాడే సమయంలో మోకాళ్లపై ఎక్కువగా భారం పడబోదని పేర్కొన్నాడు. బెంగళూరు స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులకు 24 నెలల పాటు స్కాలర్షిప్ అందించే ప్రక్రియ మొదలుపెట్టామని అతను వెల్లడించాడు. -
బోపన్న టెన్నిస్ స్కాలర్షిప్స్
బెంగళూరు: భారత డబుల్స్ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న టెన్నిస్ స్కాలర్షిప్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాడు. ఆటతోపాటు చదువు నేర్పే ఈ కార్యక్రమం కోసం ఒక్కో విద్యార్థిపై రూ. 10 లక్షలు ఖర్చు చేయనున్నట్లు తెలిసింది. బెంగళూరులోని ‘ద స్పోర్ట్స్ స్కూల్’ సహ భాగస్వామిగా ఉన్న ఈ ప్రాజెక్టులో అండర్–12, 14, 16 విభాగాల్లోని బాలబాలికల ప్రతిభ, అఖిల భారత టెన్నిస్ సంఘం ర్యాంకింగ్ ఆధారంగా ఒక్కో కేటగిరీలో 20 మందిని ఎంపిక చేస్తారు. వీరికి అత్యున్నత టెన్నిస్ శిక్షణతో పాటు విద్య కూడా అందజేస్తారు. ఇది భారత టెన్నిస్‌ను మార్చే కార్యక్రమంగా బోపన్న అభివర్ణించాడు. ప్రపంచంలోనే ఇది గొప్ప ఉపకారవేతనమని చెప్పాడు. 100 శాతం స్కాలర్షిప్ అందజేస్తామని, అమెరికా టెన్నిస్ కాలేజ్‌లో కూడా 70 లేదంటే 80 శాతం మొత్తాన్నే స్కాలర్‌షిప్‌గా అందజేస్తారని... ఇక్కడ మాత్రం పూర్తి మొత్తం ఇస్తామని రోహన్ బోపన్న చెప్పాడు. తను జూనియర్ స్థాయిలో ఉన్నప్పుడు తనకు అందుబాటులో లేని సౌకర్యాలు, సామాగ్రి ఇప్పుడు శిక్షణ పొందేవాళ్లకు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పాడు. -
బోపన్న జంట ఓటమి
న్యూఢిల్లీ: రోటర్‌డామ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జంట పోరాటం ముగిసింది. నెదర్లాండ్స్‌లో జరిగిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 7–5, 2–6, 8–10తో ‘సూపర్ టైబ్రేక్’లో హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్)–జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోయింది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట ఏడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. సెమీస్‌లో ఓడిన బోపన్న జోడీకి 180 ర్యాంకింగ్ పాయింట్లతోపాటు 32,080 యూరోలు (రూ. 24 లక్షల 85 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
క్వార్టర్స్‌లో బోపన్న జంట
న్యూఢిల్లీ : రోటర్‌డామ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జంట శుభారంభం చేసింది. నెదర్లాండ్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 7–6 (7/0), 6–7 (5/7), 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గంటా 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ 12 ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)–హొరియా టెకావ్ (రొమేనియా) ద్వయంతో బోపన్న జంట ఆడుతుంది. -
బోపన్న భాగస్వామిగా ఆస్ట్రేలియా ఓపెన్ బరిలో..
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత మహిళల టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భాగస్వామి మారాడు. ఈ టోర్నీలో అమెరికా ఆటగాడు రాజీవ్ రామ్‌తో కలిసి ఆడాల్సిన సానియా... ఇప్పుడు భారత్‌కు చెందిన డబుల్స్ నంబర్‌వన్ రోహన్ బోపన్నతో కలిసి బరిలోకి దిగనుంది. రాజీవ్ రామ్ గాయపడటంతో అతను ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి వైదొలిగాడు. దాంతో బోపన్నతో కలిసి సానియా ఆడాలని నిర్ణయించుకుంది. రియో ఒలింపిక్స్ తర్వాత సానియా, బోపన్న కలిసి ఆడనుండటం ఇదే తొలిసారి. ఆ్రస్టేలియన్ ఓపెన్ ఈనెల 20న ప్రారంభమవుతుంది. -
ఖతర్ ఓపెన్ విజేత బోపన్న జంట
దోహా (ఖతర్): భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ ప్లేయర్ రోహన్ బోపన్న కొత్త ఏడాదిని టైటిల్‌తో మొదలుపెట్టాడు. ఖతర్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్లో బోపన్న (భారత్)–వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్) ద్వయం విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో బోపన్న–కూలాఫ్ జంట 3–6, 6–2, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో ల్యూక్ బామ్‌బ్రిడ్జ్ (ఇంగ్లండ్)–శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో) జోడీని ఓడించింది. టైటిల్ నెగ్గిన బోపన్న జంటకు 76,870 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 54 లక్షల 50 వేలు)తోపాటు 250 ఏటీపీ ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. శుక్రవారమే జరిగిన సెమీఫైనల్లో బోపన్న–కూలాఫ్ జంట 7–5, 6–2తో రెండో సీడ్ హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్)– స్కుగోర్ (క్రొయేషియా) జోడీపై గెలిచింది. ఓవరాల్‌గా 39 ఏళ్ల బోపన్నకు కెరీర్లో ఇది 19వ డబుల్స్ టైటిల్. తెలంగాణ జిమ్నాస్ట్ సురభికి మూడు పతకాలు గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ జిమ్నాస్ట్ సురభి ప్రసన్న మూడు పతకాలు సాధించింది. శుక్రవారం జరిగిన అండర్–17 బాలికల మూడు ఈవెంట్లలో సురభి రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించింది. ఆల్ అరౌండ్ వ్యక్తిగత విభాగంలో సురభి 39.85 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకోగా... టేబుల్ వాల్ట్, బ్యాలెన్సింగ్ బీమ్ ఈవెంట్స్‌లో ఆమె రెండో స్థానంలో నిలిచి రెండు రజత పతకాలను సొంతం చేసుకుంది. -
సెమీస్‌లో బోపన్న జంట
దోహా (ఖతర్): భారత డబుల్స్ నంబర్‌వన్ ప్లేయర్ రోహన్ బోపన్న దోహా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్) ద్వయం 6–3, 6–4తో వావ్రింకా (స్విట్జర్లాండ్)–ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా) జోడీపై విజయం సాధించింది. ఇదే టోరీ్నలో దివిజ్ శరణ్ (భారత్)–ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జంట తొలి రౌండ్లో ఓడిపోయింది. దివిజ్–సితాక్ ద్వయం 6–7 (4/7), 2–6తో జెరెమి చార్డీ–ఫాబ్రిస్ మారి్టన్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓటమి పాలైంది. -
క్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట
దోహా (ఖతర్): కొత్త ఏడాదిని భారత టెన్నిస్ డబుల్స్ నంబర్‌వన్ ఆటగాడు రోహన్ బోపన్న విజయంతో ప్రారంభించాడు. దోహా ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్లో బోపన్న (భారత్)–వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్) జంట క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–కూలాఫ్ ద్వయం 6–3, 6–2తో మార్కో సెచినాటో–లొరెంజో సొనెగో (ఇటలీ) జోడీపై విజయం సాధించింది. 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం ప్రత్యర్థి జోడీ సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసి తమ సరీ్వస్‌ను ఒకసారి కోల్పోయింది. -
పాక్‌తో పోరుకు బోపన్న దూరం
న్యూఢిల్లీ: పాకిస్తాన్ జట్టుతో ఈనెల 29, 30 తేదీల్లో జరగాల్సిన డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్ నుంచి భారత టెన్నిస్ డబుల్స్ నంబర్‌వన్ ప్లేయర్ రోహన్ బోపన్న వైదొలిగాడు. భుజం గాయం కారణంగా తాను అందుబాటులో ఉండటం లేదని భారత జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్‌కు బోపన్న సమాచారం ఇచ్చాడు. 39 ఏళ్ల బోపన్న స్థానంలో జీవన్ నెడుంజెళియన్ జట్టులోకి వచ్చాడు. -
దివిజ్, బోపన్నజోడీలు ఓటమి
టోక్యో: జపాన్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్లో భారత డబుల్స్ అగ్రశ్రేణి క్రీడాకారులు దివిజ్ శరణ్, రోహన్ బోపన్న జోడీలకు ఓటమి ఎదురైంది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో దివిజ్ శరణ్–ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జంట 6–7 (5/7), 3–6తో రెండో సీడ్ నికొలస్ మహుట్–వాసెలిన్ (ఫ్రాన్స్) ద్వయం చేతిలో... రోహన్ బోపన్న–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జోడీ 4–6, 7–5, 9–11తో నికోలా మెక్టిక్–ఫ్రాంకో స్కుగోర్ (క్రొయేషియా) జంట చేతిలో ఓడిపోయాయి. క్వార్టర్స్‌లో ఓడిన దివిజ్, బోపన్న జంటలకు 15,500 డాలర్ల (రూ. 11 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సెమీస్‌లో ఓడిన బోపన్న జంట
న్యూఢిల్లీ: మాంట్రియల్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో అన్‌సీడెడ్ రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జంట పోరాటం ముగిసింది. కెనడాలో ఆదివారం జరిగిన పురుషుల డబు ల్స్ సెమీఫైనల్లో బోపన్న–షపోవలోవ్ ద్వ యం 6–7 (3/7), 6–7 (7/9)తో రాబిన్ హాస్–వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్) జోడీ చేతి లో ఓడిపోయింది. గంటా 36 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట నాలుగు ఏస్‌లు సంధించింది. రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. సెమీస్‌లో ఓడిన బోపన్న జంటకు 76,300 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 54 లక్షల 11 వేలు)తోపాటు 360 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
బోపన్న జంట సంచలనం
మాంట్రియల్ (కెనడా): రోజర్స్ కప్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జోడీ సంచలన విజయంతో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అన్‌సీడెడ్ బోపన్న–షపోవలోవ్ ద్వయం 4–6, 6–1, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో నాలుగో సీడ్ నికోలస్ మహుట్–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంటను ఓడించింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం తొమ్మిది ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. బాసిలాష్విలి (జార్జియా)– స్ట్రఫ్ (జర్మనీ), ఎడ్మండ్ (బ్రిటన్)–టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) జోడీల మధ్య జరిగే తొలి రౌండ్ మ్యాచ్ విజేతతో ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట తలపడుతుంది. -
క్వార్టర్ ఫైనల్స్‌కు ఫెదరర్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో స్విస్ దిగ్గజం, మూడో సీడ్ రోజర్ ఫెదరర్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్‌లో ఆదివారం ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఫెదరర్ 6–2, 6–3, 6–3తో వరుస సెట్లలో లెనార్డో మేయర్(అర్జెంటీనా)ను చిత్తు చేశాడు. గంటా 45 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఫెడెక్స్ 4 ఏస్‌లు సంధించి 30 విన్నర్లు కొట్టాడు. మరోవైపు 4 డబుల్ఫాల్ట్స్తోపాటు 31 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. కాగా, మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నెం.12 సెవత్సోవా(లాత్వియా) అనూహ్య పరాజయం పాలైంది. ఆమె 2–6, 0–6తో ప్రపంచ 38వ ర్యాంకర్ వాండ్రొసోవా(చెక్ రిపబ్లిక్) చేతిలో కంగుతింది. ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో పెట్రా మాట్రిచ్(క్రొయేషియా) 5–7, 6–2, 6–4తో కనెపి(ఎస్తోనియా)పై చెమటోడ్చి నెగ్గగా, జొహన్నా కొంటా(బ్రిటన్) 6–2, 6–4తో వెకిచ్(క్రొయేషియా)ను చిత్తు చేసింది. బొపన్న జోడీ ఓటమి పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు రోహన్ బొపన్న జోడీ ఓటమిపాలైంది. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో బొపన్న(భారత్)–మారియస్ కొపిల్(రొమేనియా) ద్వయం 6–1, 5–7, 6–7(8/10)తో సెర్బియా జోడీ లజోవిచ్–తిపాసరవిచ్ చేతిలో ఓడింది. తొలి సెటన్ను సునాయాసంగా గెల్చుకున్న బొపన్న జోడీ రెండో సెట్‌ను కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో సెట్లో టైబ్రేక్‌లో చేతులెత్తేసి ఇంటిబాట పట్టింది. -
ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జంట
ఫ్లోరిడా: మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–షపోవలోవ్ (కెనడా) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 7–5, 2–6, 10–6తో ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా)–ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జోడీపై గెలిచింది. 89 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట ఐదు ఏస్‌లు సంధించింది. ఇదే టోర్నీ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నయోమి ఒసాకా (జపాన్) మూడో రౌండ్లో ఓటమి చవిచూసింది. చైనీస్ తైపీ క్రీడాకారిణి సెయి సు వె 4–6, 7–6 (7/4), 6–3తో ఒసాకాపై సంచలన విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. -
విజేత బోపన్న–దివిజ్ జంట
పుణే: ప్రొఫెషనల్ సర్క్యూట్లో జతకట్టిన తొలిసారే భారత టెన్నిస్ డబుల్స్ స్టార్స్ రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జంట టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. శనివారం ముగిసిన టాటా ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్లో టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ బోపన్న–దివిజ్ జోడీ విజేతగా నిలిచింది. 63 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–దివిజ్ ద్వయం 6–3, 6–4తో ల్యూక్ బాంబ్రిడ్జ్–జానీ ఒమారా (బ్రిటన్) జోడీపై గెలిచింది. భారత జంట మూడు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. బోపన్న కెరీర్లో ఇది 18వ డబుల్స్ టైటిల్‌కాగా... దివిజ్ శరణ్‌కు నాలుగోది. స్వదేశంలో మాత్రం దివిజ్‌కిదే తొలి టైటిల్ కావడం విశేషం. టైటిల్ నెగ్గిన బోపన్న–దివిజ్ జంటకు 29,860 డాలర్ల (రూ. 20 లక్షల 77 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. టైటిల్ గెలిచే క్రమంలో ఈ భారత జంట క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్స్‌లో మారథాన్ సూపర్ టైబ్రేక్‌లలో విజయం సాధించింది. పేస్–వరేలాలతో క్వార్టర్స్ మ్యాచ్‌లో మూడో సెట్‌ను 17–15తో... బోలెలీ–డోడిగ్‌లతో జరిగిన సెమీస్‌లో 15–13తో భారత జంట గెలిచింది. తాజా విజయం వచ్చే వారం మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌కు ముందు కావాల్సినంత ఆత్మ విశ్వాసం ఇచ్చిందని 38 ఏళ్ల బోపన్న వ్యాఖ్యానించాడు. గతేడాది జకార్తా ఆసియా క్రీడల్లో బోపన్న–దివిజ్ జంట స్వర్ణ పతకం నెగ్గిన అనంతరం 2020 టోక్యో ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ప్రొఫెషనల్ సర్క్యూట్‌లోనూ జతకలిసి ఆడాలని నిర్ణయం తీసుకున్నారు. -
టాటా ఓపెన్ ఫైనల్లో దివిజ్–బోపన్న జంట
పుణే: ఈ ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించేందుకు భారత టెన్నిస్ జంట దివిజ్ శరణ్–రోహన్ బోపన్న విజయం దూరంలో నిలిచింది. టాటా ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్లో దివిజ్–బోపన్న ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ దివిజ్–బోపన్న జంట 6–3, 3–6, 15–13తో ‘సూపర్ టైబ్రేక్’లో సిమోన్ బొలెలీ (ఇటలీ)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీపై గెలిచింది. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట మూడు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. నేడు జరిగే ఫైనల్లో ల్యూక్ బాంబ్రిడ్జ్–జానీ ఒమారా (బ్రిటన్)లతో దివిజ్–బోపన్న తలపడతారు. -
బోపన్న జోడీ ఓటమి
పారిస్: ఏటీపీ మాస్టర్స్ టోర్నీ పారిస్ ఓపెన్ డబుల్స్ విభాగంలో భారత ఆటగాళ్లు రోహన్ బోపన్న, దివిజ్ శరణ్‌లకు నిరాశ ఎదురైంది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో రోహన్ బోపన్న–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జోడీ 6–7, 3–6 తో ఒలివర్ (ఆస్ట్రియా)–మాట్ పావిక్ (క్రొయేషియా) జంట చేతి లో ఓడింది. దివిజ్ శరణ్–అర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) ద్వయం 4–6, 3–6తో మైక్ బ్రయన్–జాక్ సోక్ (అమెరికా) చేతిలో ఓడింది. సెమీస్‌లో సాకేత్ జోడి... మరోవైపు షెన్జెన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ జోడీ సెమీ ఫైనల్ చేరింది. చైనాలో జరుగుతోన్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ జోడీ 6–4, 6–3తో రిగలె టి–డీ వూ (చైనా) జంటపై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. మరో క్వార్టర్స్‌లో అర్జున్ కడే (భారత్)–సంచయ్ రతివతన (థాయ్‌లాండ్) ద్వయం 6–7, 7–5, 10–2తో యిన్ పెంగ్ (తైవాన్) సోంచట్ రతివతన (థాయ్‌లాండ్) జంటపై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. -
క్వార్టర్స్‌లో బోపన్న జంట
బీజింగ్: చైనా ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–రోజర్ వాసెలిన్ (నెదర్లాండ్స్) ద్వయం శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–వాసెలిన్ జంట 6–2, 7–6 (7/5)తో కైల్ ఎడ్మండ్ (బ్రిటన్)–మార్టన్ ఫక్సోవిక్స్ (హంగేరి) జోడీపై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ లుకాస్ కుబోట్ (పోలాండ్)–మార్సెలో మెలో (బ్రెజిల్) ద్వయంతో బోపన్న జంట తలపడుతుంది. -
డబుల్స్‌లోనూ నిరాశే
క్రాల్‌జివో (సెర్బియా): విజయావకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన డబుల్స్ మ్యాచ్‌లో భారత జంట ఓడిపోయింది. డేవిస్‌కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్‌లో భాగంగా శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న–సాకేత్ మైనేని జోడీ 6–7 (5/7), 2–6, 6–7 (4/7)తో నికోలా మిలోజెవిచ్–డానిలో పెట్రోవిచ్ (సెర్బియా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. ఈ గెలుపుతో ఆతిథ్య సెర్బియా జట్టు 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఫలితం తేలిపోవడంతో ఆదివారం జరిగే రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు నామమాత్రం కానున్నాయి. రెండు గంటల 22 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో భారత జోడీ కీలకదశలో అనవసర తప్పిదాలు చేసి మ్యూలం చెల్లించుకుంది. మూడో సెట్లో 5–3తో ఆధిక్యంలో ఉండి సెట్ పాయింట్ కూడా సంపాదించిన భారత జంట దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. సెట్ పాయింట్‌ను కాపాడుకోవడంతోపాటు సెర్బియా ద్వయం సాకేత్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత రెండు జంటలు తమ సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో మూడో సెట్లో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో సెర్బియా జోడీ పైచేయి సాధించడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. సెర్బియా చేతిలో ఓడినప్పటికీ వచ్చే ఏడాది కొత్త పద్ధతిలో, కొత్త నిబంధనలతో 18 జట్ల మధ్య నిర్వహించనున్న డేవిస్ కప్ ఫైనల్స్ ఈవెంట్‌కు భారత్ అర్హత సాధించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో 24 జట్ల మధ్య ఇంటా, బయటా పద్ధతిలో క్వాలిఫయింగ్ ఈవెంట్ జరుగనుంది. క్వాలిఫయింగ్ టోర్నీలో నెగ్గిన 12 జట్లు నవంబర్‌లో జరిగే ఫైనల్స్‌కు అర్హత పొందుతాయి. ఈ సీజన్లో సెమీస్‌కు చేరిన నాలుగు జట్లకు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. మరో రెండు జట్లకు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) వైల్డ్ కార్డు ఇస్తుంది. -
ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం
-
బోపన్న–దివిజ్ జంటకు స్వర్ణం
పాలెంబాంగ్: టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ ఆసియా క్రీడల టెన్నిస్‌లో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ (భారత్) జంట స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–దివిజ్ జోడీ 6–3, 6–4తో అలెగ్జాండర్ బుబ్లిక్–డెనిస్ యెవ్సెయెవ్ (కజకిస్తాన్) ద్వయంపై గెలుపొందింది. తమ కెరీర్లో తొలిసారి ఏషియాడ్ డబుల్స్ స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. సెమీఫైనల్లో ప్రజ్నేశ్ 2–6, 2–6తో డెనిస్ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. -
కాంస్యంతోనే సరిపెట్టుకున్న అంకితా రైనా
సాక్షి, న్యూఢిలీ : మంచి ప్రదర్శనలతో దూసుకుపోతున్న ఇండియన్ టెన్నిస్ స్టార్ అంకితా రైనా సెమీఫైనల్లో ఓటమి పాలయ్యారు. చైనా ప్లేయర్ జంగ్ షౌల్‌తో రెండు గంటలకు పైగా జరిగిన మ్యాచ్‌లో వరుస సెట్ల (4-6, 6-7)లో ఓడిపోయారు. దాంతో కాంస్య పతకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా, ఏషియన్ గేమ్స్‌లో మహిళల టెన్నిస్ సింగిల్స్‌లో పతకం గెలుపొందిన రెండో ప్లేయర్‌గా అంకిత నిలిచారు. అంతకు ముందు 2006, 2010 ఏషియన్ గేమ్స్‌లో సానియా మీర్జా వరుసగా రజతం, కాంస్య పతకాలు గెలుపొందారు. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయం అయింది. పురుషుల టెన్నిస్ డబుల్స్‌లో బోపన్న-శరణ్ జోడీ ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో జపాన్ జోడీ ఉసుంగు-షమబుకరోపై గెలిచి భారత్‌కు పతకం ఖరారు చేసిందీ ద్వయం. కాగా, నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, తొమ్మిది కాంస్య పతకాలు సాధించిన భారత్.. మొత్తం 16 పతకాలతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. -
క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న జంట
ఫీవర్ ట్రీ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో రోహన్ బోపన్న (భారత్)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంట క్వార్టర్స్‌కు చేరింది. లండన్‌లో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–వాసెలిన్ ద్వయం 6–3, 7–6 (7/3)తో కెవిన్ (దక్షిణాఫ్రికా)–జూలియన్ (ఫ్రాన్స్) జంటను ఓడించింది. 72 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ ఐదు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి జంట సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. ఇదే టోర్నీ సింగిల్స్ తొలి రౌండ్లో నేడు మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)తో బాంబ్రీ తలపడతాడు. -
పోరాడి ఓడిన బోపన్న జంట
మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–ఎడువార్డో రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంటకు నిరాశ ఎదురైంది. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో బోపన్న–వాసెలిన్ ద్వయం 6–4, 6–7 (4/7), 5–10తో ‘సూపర్ టైబ్రేక్’లో రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంట చేతిలో ఓడిపోయింది. రెండో రౌండ్లో నిష్క్రమించిన బోపన్న జోడీకి 24,020 యూరోల (రూ. 19లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
క్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట పరాజయం
బార్సిలోనా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్) జంట క్వార్టర్ ఫైనల్లో ఓడింది. డబుల్స్ క్వార్టర్స్‌లో బోపన్న–వాసెలిన్ ద్వయం 6–4, 6–7 (9/11), 11–13తో ‘సూపర్ టైబ్రేక్’లో కబాల్–రాబర్ట్ ఫరా (కొలంబియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. బోపన్న జోడీకి 20,540 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 16 లక్షల 74 వేలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగం రెండో రౌండ్లో మాజీ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) 2–6, 6–1, 3–6తో క్వాలిఫయర్ క్లిజాన్ (స్లొవేకియా) చేతిలో ఓటమి చవిచూశాడు. -
బోపన్న జంటకు నిరాశ
మోంటెకార్లో: కెరీర్లో పదోసారి మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరుకోవాలని ఆశించిన భారత డబుల్స్ నంబర్‌వన్ రోహన్ బోపన్నకు నిరాశ ఎదురైంది. మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీలో బోపన్న–వాసెలిన్ (ఫ్రాన్స్) జోడీకి సెమీఫైనల్లో ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–వాసెలిన్ ద్వయం 6–7 (4/7), 6–4, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఒలివర్ మరాచ్ (ఆస్ట్రియా)–ప్యాట్ మావిచ్ (క్రొయేషియా) జంట చేతిలో పరాజయం పాలైంది. గంటా 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట మూడు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. గతేడాది పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే)తో కలిసి ఈ టోర్నీ టైటిల్ నెగ్గిన బోపన్న ఈసారి మాత్రం సెమీస్‌లోనే నిష్క్రమించడం గమనార్హం. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో బోపన్న–వాసెలిన్ 7–5తో ఆధిక్యంలో ఉన్నా వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నారు. సెమీస్‌లో ఓడిన బోపన్న జంటకు 71,130 యూరోలు (రూ. 57 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. నాదల్ 12వసారి... మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 12వ సారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీస్‌లో నాదల్ 6–4, 6–1తో దిమిత్రోవ్ (బల్గేరియా)ను ఓడించాడు. నేడు జరిగే ఫైనల్లో నిషికోరి (జపాన్)తో నాదల్ ఆడతాడు. -
సెమీస్‌లో బోపన్న ద్వయం
మోంటెకార్లో: భారత డబుల్స్ టెన్నిస్ నంబర్‌వన్ రోహన్ బోపన్న మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–వాసెలిన్ (ఫ్రాన్స్) జంట 6–4, 6–4తో సెబాస్టియన్ కబాల్–రాబర్ట్ ఫరా (కొలంబియా) జోడీపై విజయం సాధించింది. 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట ఆరు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయిన ఈ ఇండో–ఫ్రెంచ్ జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. శనివారం జరిగే సెమీఫైనల్లో ఒలివర్ మరాచ్ (ఆస్ట్రియా)–మ్యాట్ పావిచ్ (క్రొయేషియా)లతో బోపన్న–వాసెలిన్ తలపడతారు. నాదల్ 13వసారి... మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో పదిసార్లు చాంపియన్ రాఫెల్ నాదల్ 13వ సారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నాదల్ 6–0, 6–2తో ఐదోసీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను చిత్తుగా ఓడించాడు. -
క్వార్టర్స్‌లో బోపన్న జోడీ
క్లే కోర్టు సీజన్ తొలి మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్ మోంటెకార్లో ఓపెన్‌లో భారత డబుల్స్ నంబర్‌వన్ రోహన్ బోపన్న–రోజర్ వాసెలిన్ (నెదర్లాండ్స్) జంట క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మొనాకోలోని మోంటెకార్లోలో జరుగుతున్న ఈ టోర్నీ ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ 3–6, 6–4, 11–9తో ఏడో సీడ్ జేమీ ముర్రే (బ్రిటన్)–బ్రూనో సోరెస్ (బ్రెజిల్)ద్వయంపై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో జాన్ సెబాస్టియన్–రాబర్ట్ ఫరాతో బోపన్న జంట తలపడనుంది. -
ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ
న్యూఢిల్లీ: క్లే కోర్టు సీజన్‌లోని తొలి మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో మోంటెకార్లో ఓపెన్‌లో భారత డబుల్స్ నంబర్‌వన్ రోహన్ బోపన్న శుభారంభం చేశాడు. తన భాగస్వామి రోజర్ వాసెలిన్ (నెదర్లాండ్స్)తో కలిసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మొనాకోలోని మోంటెకార్లోలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–వాసెలిన్ ద్వయం 6–1, 7–5తో జెమీ సెరాటని (అమెరికా)–ఆండ్రియా సెప్పి (ఇటలీ) జంటను ఓడించింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ మూడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి ద్వయం సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో 10 సార్లు చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన రెండో రౌండ్లో నాదల్ 6–1, 6–3తో బెడెన్ (స్లొవేనియా)పై అలవోకగా గెలిచాడు. తొమ్మిదో సీడ్, మాజీ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 7–6 (7/2), 7–5తో బొర్నా కొరిచ్ (క్రొయేషియా)పై కష్టపడి గెలిచి మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. -
‘మిక్స్డ్’ ఫైనల్లో బోపన్న జంట ఓటమి
మెల్బోర్న్: కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ నెగ్గాలని ఆశించిన భారత స్టార్ రోహన్ బోపన్నకు అనుకున్న ఫలితం రాలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బోపన్న–తిమియా బాబోస్ (హంగేరి) జంట మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా)–మాట్ పావిక్ (క్రొయేషియా) ద్వయంతో ఆదివారం జరిగిన ఫైనల్లో బోపన్న–బాబోస్ జంట 6–2, 4–6, 9–11తో ‘సూపర్ టైబ్రేక్’లో ఓడిపోయింది. గతేడాది దబ్రౌస్కీతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ నెగ్గిన బోపన్న ఈసారి ఆమెను ప్రత్యర్థిగా ఎదుర్కొన్నాడు. చెరో సెట్ గెలిచిన తర్వాత నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో బోపన్న జంట 9–8తో మ్యాచ్ పాయింట్ సాధించినా... ఆ తర్వాత వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. విజేత దబ్రౌస్కీ–పావిక్ జంటకు లక్షా 75 వేలు (రూ. 90 లక్షల 30 వేలు), రన్నరప్ బోపన్న–బాబోస్ జోడీకి 90 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 46 లక్షల 44 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
మిక్స్డ్ ఫైనల్లో బోపన్న జోడి
మెల్బోర్న్:ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంగా రోహన్ బోపన్న(భారత్)- తైమియా బాబోస్(హంగేరి) జంట ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో బోపన్న ద్వయం 7-5, 5-7, 10-6 తేడాతో మార్సిలో డిమోలైనర్(బ్రెజిల్)- మార్టినెజ్ సాంచెజ్(స్పెయిన్) జంటపై గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది. తొలి సెట్‌ను గెలిచిన బోపన్న జంట.. రెండో సెట్‌ను కోల్పోయింది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో తిరిగి పుంజుకున్న బోపన్న ద్వయం ఆ సెట్‌ను గెలవడమే కాకుండా ఫైనల్‌కు చేరింది.టై బ్రేక్‌కు దారి తీసిన మూడో సెట్లో ఆధిక్యంలో నిలిచిన బోపన్న జంట ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. శనివారం జరిగే తుది పోరులో బోపన్న-బాబోస్ జోడి.. గాబ్రియేలా డాబ్రోస్కి-మేట్ పావిచ్ జంటతో అమీతుమీ తేల్చుకోనుంది. -
తొలిరౌండ్లోనే బోపన్న జంట ఓటమి
పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) జంట తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. పారిస్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–క్యువాస్ ద్వయం 2–6, 6–7 (7/9)తో యువాన్ సెబాస్టియన్ కాబల్–రాబర్ట్ ఫరా (కొలంబియా) జోడీ చేతిలో ఓడిపోయింది. 77 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో బోపన్న–క్యువాస్ జంటకు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. తమ సర్వీస్‌ను మాత్రం రెండుసార్లు కోల్పోయింది. -
క్వార్టర్స్‌లో బోపన్న జంట ఓటమి
చైనా ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) జంట పోరాటం ముగిసింది. బీజింగ్‌లో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–క్యువాస్ ద్వయం 5–7, 6–7 (6/8)తో టాప్ సీడ్ హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్)–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. క్వార్టర్స్‌లో ఓడిన బోపన్న జోడీకి 24,755 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 16 లక్షల 12 వేలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
బోపన్న జంట శుభారంభం
న్యూఢిల్లీ: చైనా ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బీజింగ్‌లో జరిగిన తొలి రౌండ్లో బోపన్న–క్యువాస్ ద్వయం 6–0, 6–4తో మావో జిన్ గాంగ్–జె జాంగ్ (చైనా) జోడీపై గెలిచింది. 53 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట నాలుగు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. యూకీ ఓటమి మరోవైపు చైనీస్ తైపీలో జరుగుతున్న ఏటీపీ చాలెంజర్ టోర్నీలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో యూకీ బాంబ్రీ 3–6, 3–6తో జాన్ మిల్మన్ (ఆస్ట్రేలియా) చేతిలో... సుమీత్ నాగల్ 4–6, 2–6తో మరియస్ కోపిల్ (రొమేనియా) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్ శరణ్ (భారత్)–స్కాట్ లిప్స్కీ (అమెరికా) ద్వయం 6–1, 6–4తో జియు చెన్ హంగ్–చెంగ్ యు యు (చైనీస్ తైపీ) జోడీపై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరింది. మరో మ్యాచ్‌లో విష్ణువర్ధన్–జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) జంట 2–6, 4–6తో జేమ్స్ సెరెటాని (అమెరికా)–మార్క్ పాల్మన్స్ (ఆస్ట్రేలియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
‘మిక్స్డ్’లో సానియా జంటకు చుక్కెదురు
మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో సానియా–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) ద్వయం 7–5, 3–6, 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఒస్టాపెంకో (లాత్వియా)–ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. రెండో రౌండ్లో పదో సీడ్ రోహన్ బోపన్న–పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) ద్వయం 7–5, 4–6, 4–6తో ఫాబియో ఫాగ్నిని–సిమోన్ బొలెలీ (ఇటలీ) జంట చేతిలో... దివిజ్ శరణ్–ఆండ్రీ బెగెర్మన్ (జర్మనీ) జోడీ 4–6, 4–6తో ఫెలిసియానో లోపెజ్–మార్క్ లోపెజ్ (స్పెయిన్) జంట చేతిలో ఓడిపోగా... తొలి రౌండ్లో లియాండర్ పేస్–పురవ్ రాజా (భారత్) జోడీ 6–1, 6–3తో జాంకో టిప్సరెవిచ్–విక్టర్ ట్రయెస్కీ (సెర్బియా) జంటపై విజయం సాధించింది. -
రన్నరప్ బోపన్న జంట
మాంట్రియల్ (కెనడా): కెరీర్లో ఐదో మాస్టర్స్ సిరీస్ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నకు నిరాశ ఎదురైంది. రోజర్స్ కప్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో రోహన్ బోపన్న–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంట రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో బోపన్న–డోడిగ్ ద్వయం 4–6, 6–3, 6–10తో హెర్బర్ట్–మహుట్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడింది. రన్నరప్ బోపన్న–డోడిగ్ జంటకు 1,35,630 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 86 లక్షల 95 వేలు)తోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. ఫైనల్లో ఫెడరర్ 3–6, 4–6తో 20 ఏళ్ల అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) చేతిలో ఓడాడు. -
శభాష్.. బోపన్న
►ఫ్రెంచ్ ఓపెన్ ‘మిక్స్డ్’ టైటిల్ కైవసం ►దబ్రోవ్స్కీతో కలసి చాంపియన్‌గా నిలిచిన భారత ప్లేయర్ ►కెరీర్లో తొలిగ్రాండ్‌స్లామ్ టైటిల్ పారిస్: భారత డబుల్స్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న కెరీర్లో అపూర్వ విజయం సాధించాడు. కెనడా క్రీడాకారిణి గాబ్రియేలా దబ్రోవ్స్కీతో కలసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. బోపన్న కెరీర్లో ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. పోరాడి నెగ్గిన బోపన్న జంట.. ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్‌లో భాగంగా గురువారం జరిగిన ఫైనల్లో ఏడోసీడ్ బోపన్న జంట 2–6, 6–2, 12–10తో అన్నా లీనా గ్రోన్‌ఫెల్డ్(జర్మీనీ)– రాబెర్ట్ ఫరా (కొలంబియా)పై సంచలన విజయం సాధించింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు మ్యాచ్పాయింట్లను కాచుకుని మరీ ఇండో–కెనడియన్ జంట విజేతగా నిలవడం విశేషం. కెరీర్లో రెండోగ్రాండ్స్లామ్ ఆడుతున్న బోపన్న.. మిక్సడ్లో మాత్రం తొలిసారే చాంపియన్‌గా నిలిచాడు. తొలిసెట్ ఆరంభ గేమ్‌ల్లో ఇరుజోడీలు తమ సర్వీస్‌ను నిలబెట్టుకున్నారు. అయితే మూడోగేమ్‌లో బోపన్న జంట సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫరా జంట.. 2–1తో ఆధిక్యంలో నిలిచింది. అనంతరం ఏడోగేమ్లోనూ మరోసారి బోపన్న జంట సర్వీస్‌ను బ్రేక్ చేసి 5–2తో ఆధిక్యంలో నిలిచింది. అదే జోరులో కేవలం 22 నిమిషాల్లో తొలిసెట్‌ను కైవసం చేసుకుంది. రెండోసెట్ ఆరంభంలోనూ బోపన్న జంట కుదరుకోలేదు. మూడోగేమ్‌లో ప్రత్యర్థి దూకుడుగా ఆడడంతో బోపన్న జంట సర్వీస్‌ను కోల్పోయి 1–2తో వెనుకంజలో నిలిచింది. తర్వాతి గేమ్ నుంచి ఇండో–కెనడియన్ జంట తమ సిసలైన ఆటతీరును ప్రదర్శించింది. వరుసగా మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసింది. సుదీర్ఘంగా సాగిన ఎనిమిదో గేమ్‌లో ఓ బ్రేక్ పాయింట్ అవకాశాన్ని చేజార్చుకున్న బోపన్న జంట.. వెంటనే దూకుడుగా ఆడి సెట్‌ను కైవసం చేసుకుంది. దీంతో 1–1 సెట్లతో మ్యాచ్ సమమైంది. ఈ క్రమంలో మ్యాచ్ సూపర్ టైబ్రేకర్‌కు దారి తీసింది. ఈ సెట్ ఆరంభంలో 3–0తో ముందంజలో నిలిచిన ఇండో–కెనడియన్ జోడీ.. అనంతరం ఒత్తిడికి లోనైంది. ఈ దశలో ప్రత్యర్థి పుంజుకుని వరుసగా ఐదు పాయింట్లు సాధించి 5–3తో ముందంజలో నిలిచింది. ఈ క్రమంలో బోపన్న జంట మరోసారి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వరుసగా మూడు పాయింట్లు సాధించి 6–5తో ముందంజలో నిలిచింది. అనంతరం ఫరా జోడీ పుంజుకుని మరో మూడు పాయింట్లు సాధించడంతో 8–6తో మ్యాచ్ ఉత్కంఠస్థితిలో నిలిచింది. ఈ దశలో ఇరుజోడీలు తీవ్రంగా పోరాడడంతో మ్యాచ్‌లో ఆధిక్యం చాలాసార్లు మారుతూ వచ్చింది. చివరికి 10–10తో మ్యాచ్ సమంగా ఉన్న దశలో వరుసగా రెండుపాయింట్లు సాధించిన బోపన్న–దబ్రోవ్‌స్కీ జంట సెట్‌తోపాటు చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. -
బోపన్న సాధించాడు..
పారిస్: భారత టెన్నిస్ సంచలనం రోహన్ బోపన్న తన కెరీర్ లో నూతన అధ్యాయాన్ని లిఖించాడు. ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ను సాధించడం ద్వారా కొత్త చరిత్రను సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్ లో భాగంగా మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్లో గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా)తో కలిసి టైటిల్ ను చేజిక్కించుకున్నాడు. గురువారం జరిగిన తుది పోరులో రోహన్ బోపన్న- దబౌస్కీ జోడి 2-6, 6-2, 12-10 తేడాతో అనాలెనా గ్రోన్‌ఫెల్డ్ (జర్మనీ)–రాబర్ట్ ఫరా (కొలంబియా)పై గెలిచి టైటిల్ ను సొంతం చేసుకున్నారు. హోరాహోరీగా జరిగిన పోరులో అత్యంత ఆత్మవిశ్వాసం కనబరిచిన బోపన్న-దబౌస్కీ జోడి కడవరకూ పోరాడి టైటిల్ ను సాధించారు. తొలి సెట్ ను కోల్పోయినప్పటికీ, ఆ తరువాత రెండు సెట్లలో ఈ జోడి చెలరేగి ఆడింది. ప్రధానంగా చివరి సెట్ మాత్రం నువ్వా-నేనా అన్న రీతిలో ఉత్కంఠభరింతగా సాగింది. అయితే ఒత్తిడిన అధిగమించిన బోపన్న జోడి చివరకు విజేతగా నిలిచింది. తాజా టైటిల్ తో భారత దిగ్గజ టెన్నిస్ ఆటగాళ్ల జాబితాలో బోపన్న చేరిపోయాడు. అంతకుముందు భారత తరపున లియాండర్, మహేశ్ భూపతి, సానియా మీర్జాలకు మాత్రమే గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను సాధించగా, ఆ తరువాత స్థానంలో బోపన్న నిలిచాడు. 2010లో తొలిసారి యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ లో ఫైనల్ కు చేరిన బోపన్న.. అప్పుడు గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సాధించడంలో విఫలమయ్యాడు. -
‘మిక్స్డ్’ ఫైనల్లో బోపన్న జంట
పారిస్: భారత్ తరఫున గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్ గెలిచిన నాలుగో ప్లేయర్‌గా గుర్తింపు పొందేందుకు రోహన్ బోపన్న మరో విజయం దూరంలో నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తన భాగస్వామి గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా)తో కలసి బోపన్న ఫైనల్లోకి అడుగు పెట్టాడు. సెమీఫైనల్లో ఏడో సీడ్ బోపన్న–దబ్రౌస్కీ జంట 7–5, 6–3తో మూడో సీడ్ హలవకోవా (చెక్ రిపబ్లిక్)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జోడీపై గెలిచింది. గురువారం జరిగే ఫైనల్లో అనాలెనా గ్రోన్‌ఫెల్డ్ (జర్మనీ)–రాబర్ట్ ఫరా (కొలంబియా) జంటతో బోపన్న–దబ్రౌస్కీ ద్వయం తలపడుతుంది. 2010 యూఎస్ ఓపెన్‌లో ఐజామ్ ఖురేషీ (పాకిస్తాన్)తో కలసి బోపన్న పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచాడు. గతంలో భారత్ తరఫున లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా మాత్రమే గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ గెలిచారు. నేటి మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ మ.గం. 3.25 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
బోపన్న జంట శుభారంభం
రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) జంట రెండో రౌండ్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–క్యువాస్ ద్వయం 6–4, 6–2తో సిమోన్ బొలెలీ–ఆండ్రియా సెప్పి (ఇటలీ) జోడీపై గెలిచింది. -
బోపన్న కూడా సాధించాడు
మోంటెకార్లో మాస్టర్స్ టోర్నీలో డబుల్స్ టైటిల్ సొంతం మోంటెకార్లో (మొనాకో): రెండేళ్ల విరామం తర్వాత భారత డబుల్స్ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న ఓ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీలో తన భాగస్వామి పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే)తో కలిసి బోపన్న డబుల్స్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. 74 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో అన్‌సీడెడ్ బోపన్న–క్యువాస్ ద్వయం 6–3, 3–6, 10–4తో ‘సూపర్ టైబ్రేక్’లో ఏడో సీడ్ ఫెలిసియానో లోపెజ్–మార్క్ లోపెజ్ (స్పెయిన్) జంటను ఓడించింది. విజేతగా నిలిచిన బోపన్న–క్యువాస్ జోడీకి 2,53,950 యూరోల (రూ. కోటీ 76 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో బోపన్న–క్యువాస్ జోడీ ‘సూపర్ టైబ్రేక్’లో విజయం సాధించడం గమనార్హం. 49 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో డబుల్స్ టైటిల్ నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్‌గా బోపన్న గుర్తింపు పొందాడు. గతంలో మహేశ్ భూపతి (2003లో), లియాండర్ పేస్ (2005లో) ఒక్కోసారి ఈ టైటిల్ గెలిచారు. బెంగళూరుకు చెందిన 37 ఏళ్ల బోపన్న కెరీర్లో ఇది నాలుగో మాస్టర్స్ సిరీస్ డబుల్స్ టైటిల్. గతంలో అతను మాడ్రిడ్ ఓపెన్‌ను (2015లో ఫ్లోరిన్ మెర్జియాతో) ఒకసారి, పారిస్ ఓపెన్‌ను రెండుసార్లు (2012లో మహేశ్ భూపతితో, 2011లో ఐజామ్ ఖురేషీతో) గెలిచాడు. ఓవరాల్‌గా బోపన్న కెరీర్లో ఇది 16వ డబుల్స్ టైటిల్‌కాగా ఈ ఏడాది రెండోది. చెన్నై ఓపెన్‌లో భారత్‌కే చెందిన జీవన్ నెడుంజెళియన్‌తో కలిసి బోపన్న టైటిల్ సాధించాడు. -
‘మోంటెకార్లో’ ఫైనల్లో బోపన్న జంట
న్యూఢిల్లీ: భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన భాగస్వామి పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే)తో కలిసి మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–క్యువాస్ ద్వయం 6–4, 6–3తో రొమైన్ అర్నియోడో (మొనాకో)–హుగో నిస్ (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఐదు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఫెలిసియానో లోపెజ్–మార్క్ లోపెజ్ (స్పెయిన్)లతో బోపన్న–క్యువాస్ తలపడతారు. చరిత్రకు విజయం దూరంలో: మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో తొమ్మిదిసార్లు విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్) 11వ సారి ఫైనల్‌కు చేరాడు. సెమీస్‌లో నాదల్ 6–3, 6–1తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై గెలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్లో అల్బెర్ట్ రామోస్ (స్పెయిన్)తో ఆడతాడు. నాదల్ విజేతగా నిలిస్తే ఓపెన్ శకంలో (1968 నుంచి) ఒకే టోర్నీని పదిసార్లు గెలిచిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. -
సంచలన విజయంతో సెమీస్‌లోకి బోపన్న జంట
మోంటెకార్లో (మొనాకో): డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జంట హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్)–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా)పై సంచలన విజయం సాధించి... మోంటెకార్లో మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–క్యువాస్ జోడీ 3–6, 6–3, 13–11తో ‘సూపర్ టైబ్రేక్’లో కొంటినెన్–జాన్ పీర్స్ జంటను బోల్తా కొట్టించింది. శనివారం జరిగే సెమీఫైనల్లో అర్నియోడో (మొనాకో)–హుగో నిస్ (ఫ్రాన్స్)లతో బోపన్న–క్యువాస్ ఆడతారు. మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 2–6, 6–3, 7–5తో రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించాడు. -
క్వార్టర్స్‌లో బోపన్న జోడి
మోంటెకార్లో (మొనాకో): మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో భారత ఆటగాడు రోహన్ బోపన్న క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బోపన్న–పాల్బో క్యువాన్ (ఉరుగ్వే) జోడి 6–7, 6–4, 10–6 స్కోరుతో రాజీవ్ రామ్ (అమెరికా) – రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జంటపై నెగ్గింది. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట
మోంటెకార్లో (మొనాకో): క్లే కోర్టు సీజన్‌లోని తొలి టోర్నమెంట్ మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత డబుల్స్ నంబర్‌వన్ ప్లేయర్ రోహన్ బోపన్న శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) ద్వయం 6–3, 7–6 (9/7), 10–2తో ‘సూపర్ టైబ్రేక్’లో మార్సిన్ మట్కోవ్‌స్కీ (పోలాండ్)–అలెగ్జాండర్ పెయా (ఆస్ట్రియా) జంటపై గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో రాజీవ్ రామ్ (అమెరికా)–రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జంటతో బోపన్న–క్యువాస్ జోడీ ఆడుతుంది. -
ప్రపంచ గ్రూప్ ప్లేఆఫ్‌కు భారత్
► డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న–బాలాజీ జంట విజయం ► ఉజ్బెకిస్తాన్‌పై భారత్‌కు 3–0 ఆధిక్యం బెంగళూరు: అనుభవజ్ఞుడైన రోహన్ బోపన్న... అరంగేట్రం చేసిన శ్రీరామ్ బాలాజీ జోడీ కుదిరింది. వీరిద్దరూ ఆద్యంతం సమన్వయంతో రాణించి అదరగొట్టారు. ఫలితంగా ఉజ్బెకిస్తాన్‌తో జరుగుతున్న డేవిస్ కప్ టెన్నిస్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 రెండో రౌండ్ పోటీలో భారత్ 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. తద్వారా వరుసగా నాలుగో ఏడాది ప్రపంచకప్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత సాధిం చింది. ఈ ఏడాది సెప్టెంబరులో వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ జరుగుతుంది. శనివారం ఏకపక్షంగా జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న–బాలాజీ ద్వయం 6–2, 6–4, 6–1తో దస్తోవ్–ఫెజీవ్ జంటపై గెలిచింది. తమ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన డబుల్స్ మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌కు నిరాశే ఎదురైంది. మ్యాచ్‌లో ఏ దశలోనూ భారత జంటకు పోటీ ఎదురుకాలేదు. తన కెరీర్లో తొలి డేవిస్ కప్ మ్యాచ్ ఆడిన బాలాజీ సర్వీస్ అద్భుతంగా చేయడంతోపాటు నెట్ వద్ద అప్రమత్తంగా ఉన్నాడు. మరో వైపు అపార అనుభవజ్ఞుడైన బోపన్న శక్తివంతమైన సర్వీస్‌లు చేయడంతోపాటు సింగిల్ హ్యాండెడ్ రిటర్న్ షాట్లతో అలరించాడు. మ్యాచ్ మొత్తంలో భారత జంట 16 ఏస్‌లు సంధించడం విశేషం. ఆదివారం రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. -
డబుల్స్ జోడీపై నిర్ణయం తీసుకోలేదు
డేవిస్ కప్ కెప్టెన్ మహేశ్ భూపతి బెంగళూరు: ఉజ్బెకిస్తాన్‌తో జరిగే డేవిస్ కప్ మ్యాచ్‌లో భారత డబుల్స్ జోడీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి తెలిపారు. ఆసియా ఓషియానియా జోన్ గ్రూప్–1 రెండో రౌండ్ మ్యాచ్ ఈనెల 7 నుంచి 9 వరకు జరగనుంది. అయితే జట్టు తరఫున నలుగురు సింగిల్స్ ఆటగాళ్లను భూపతి ఎంచుకోవడంతో డబుల్స్ జోడీపై ఆసక్తి పెరిగింది. లియాండర్ పేస్, రోహన్ బోపన్నలను రిజర్వ్‌లుగా ఉంచారు. ‘విజయాలతో మూడు పాయింట్లు ఎలా సాధించాలనే దానిపైనే మా దృష్టి ఉంది. ఏ ఒక్క మ్యాచ్ గురించో ఆలోచించడం సరికాదు. చాలా రోజులుగా డబుల్స్ మ్యాచ్ గురించే చాలా మంది మాట్లాడుతున్నారు. మరో రెండు రోజుల దాకా స్పష్టత రాదు’ అని భూపతి తేల్చారు. అయితే యూకీ బాంబ్రీ గాయం కారణంగా దూరం కావడంతో పేస్, బోపన్నలో ఒకరు తుది జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇస్టోమిన్ దూరం: మరోవైపు ఉజ్బెకిస్తాన్ స్టార్ ప్లేయర్, ప్రపంచ 71వ ర్యాంకర్ డెనిస్ ఇస్టోమిన్ గాయం కారణంగా భారత్‌తో జరిగే మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఎడమ పాదంలో గాయమవడంతో అతను రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకోనున్నాడని ఉజ్బెకిస్తాన్ కెప్టెన్ పీటర్ లెబెడ్ తెలిపారు. క్వార్టర్ ఫైనల్లో శ్యామ్ న్యూఢిల్లీ: థాయ్‌లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ (49 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రౌండ్లో థాయ్‌లాండ్ బాక్సర్ థాని నరీన్రామ్పై శ్యామ్ గెలుపొందాడు. శ్యామ్‌తోపాటు మనోజ్ కుమార్ (69 కేజీలు), రోహిత్ టోకస్ (64 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. అయితే వికాస్ కృషన్ (75 కేజీలు), శివ థాపా (60 కేజీలు), దేవేంద్రో సింగ్ (52 కేజీలు)తొలి రౌండ్లోనే ఓడిపోయారు. -
రిజర్వ్ సభ్యులుగా పేస్, బోపన్న
తుది జట్టులో నలుగురూ సింగిల్స్ ఆటగాళ్లే: భూపతి న్యూఢిల్లీ: డేవిస్ కప్ కోసం నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి నొప్పింపక... తానొవ్వక పద్ధతిని అవలంభించాడు. లియాండర్ పేస్, రోహన్ బోపన్న ఈ ఇద్దరు డబుల్స్ ఆటగాళ్లలో ఒకరికి తీపి, మరొకరికి చేదు పంచలేక ఆ ఇద్దరినీ రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంచుకున్నాడు. తుది జట్టు కోసం అతను పూర్తిగా నలుగురు సింగిల్స్ ఆటగాళ్లనే తీసుకున్నాడు. ప్రస్తుతానికైతే రామ్‌కుమార్ రామనాథన్, యూకీ బాంబ్రీ, ప్రజ్నేశ్ గున్నేశ్వరన్, శ్రీరామ్ బాలాజీలు తుది జట్టు సభ్యులని భూపతి ప్రకటించాడు. ఒకవేళ అప్పటి అవసరానికి అనుగుణంగా డబుల్స్ కోసం బోపన్న, పేస్లలో ఒకరిని తీసుకుంటారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ తప్పకుండా తీసుకుంటామని మ్యాచ్ మొదలయ్యేందుకు ముందు ఆ అవకాశముంటుం దని బదులిచ్చాడు. డేవిస్‌కప్ ఆసియా ఓసియానియా పోరులో భాగంగా భారత్ వచ్చే నెల 7 నుంచి 9వ తేదీ వరకు ఉజ్బెకిస్తాన్‌తో తలపడనుంది. ప్రస్తుతం డేవిస్ కప్‌లో రికార్డు డబుల్స్ విజయాలపై కన్నేసిన పేస్ తనకా అవకాశం వస్తుందో రాదో తెలుసుకునేందుకు ఇంకొంత కాలం నిరీక్షించక తప్పదేమో! 42 విజయాలతో పేస్, నికోలా పీట్రాంజెలి (ఇటలీ) రికార్డును సమం చేసిన సంగతి తెలిసిందే. -
లియాండర్ పేస్ భవితవ్యం తేలేది నేడే...
డేవిస్‌కప్ టెన్నిస్ చరిత్రలో అత్యధిక డబుల్స్ విజయాలు సాధించిన ప్లేయర్‌గా గుర్తింపు పొందడానికి లియాండర్ పేస్ కేవలం ఒక విజయం దూరంలో ఉన్నాడు. ఈ రికార్డు సాధించేందుకు పేస్‌కు మరో అవకాశం ఇస్తారా లేదా అనేది నేడు తేలిపోనుంది. ఏప్రిల్ 7 నుంచి 9 వరకు ఉజ్బెకిస్తాన్‌తో బెంగళూరులో జరిగే ఆసియా ఓసియానియా పోటీలో భారత్ తలపడనుంది. నలుగురు సభ్యులతో కూడిన తుది జట్టును మంగళవారం నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి ప్రకటించనున్నారు. ఒకే డబుల్స్ స్పెషలిస్ట్‌ను ఎంపిక చేస్తే మాత్రం రోహన్ బోపన్న లేదా పేస్లలో ఒకరికే తుది జట్టులో స్థానం లభిస్తుంది. -
బోపన్న జంట పరాజయం
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న–పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. జొకోవిచ్–విక్టర్ ట్రయెస్కీ (సెర్బియా) జంటతో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో బోపన్న జోడీ 6–2, 3–6, 7–10 తేడాతో ఓడిపోయింది. చెరో సెట్ గెల్చుకున్నాక నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో బోపన్న జంట 4–2తో ఆధిక్యంలోకి వెళ్లినా చివరికి 7–10తో ఓటమి పాలైంది. -
రన్నరప్ బోపన్న జంట
దుబాయ్: నాలుగోసారి దుబాయ్ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నకు నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన ఈ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–మట్కోవ్‌స్కీ (పోలాండ్) జంటకు ఓటమి ఎదురైంది. 79 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)–హŸరియా టెకావ్ (రొమేనియా) ద్వయం 4–6, 6–3, 10–3తో ‘సూపర్ టైబ్రేక్’లో బోపన్న–మట్కోవ్‌స్కీ జోడీపై గెలిచి విజేతగా నిలిచింది. రోజర్–టెకావ్ జంటకు 1,57,570 డాలర్లు (రూ. కోటీ 5 లక్షలు), బోపన్న–మట్కోవ్‌స్కీ జోడీకి 77,140 డాలర్లు (రూ. 51 లక్షల 46 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
సెమీస్‌లో బోపన్న జంట
దుబాయ్: భారత డబుల్స్ నంబర్‌వన్ రోహన్ బోపన్న దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–మార్సిన్ మట్కోవ్‌స్కీ (పోలాండ్) ద్వయం 6–3, 6–4తో మెర్జియా (రొమేనియా)–ట్రయెస్కీ (సెర్బియా) జోడీపై విజ యం సాధించింది. అంతకుముందు తొలి రౌండ్లో బోపన్న–మట్కోవ్‌స్కీ 5–7, 6–3, 11–9తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–గ్రానోలెర్స్ (స్పెయిన్)లపై గెలిచారు. -
చెమట చిందించి...
► ప్రిక్వార్టర్స్‌లోకి రాఫెల్ నాదల్ ► జ్వెరెవ్‌పై ఐదు సెట్ల పోరులో నెగ్గిన స్పెయిన్ స్టార్ ► ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ మెల్బోర్న్: మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్కు ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో శనివారం అసలు సిసలు సవాల్ ఎదురైంది. జర్మనీ యువతార అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో తొమ్మిదో సీడ్ నాదల్ 4–6, 6–3, 6–7 (5/7), 6–3, 6–2తో విజయం సాధించి ఊపిరి పీల్చుకున్నాడు. 4 గంటల 5 నిమిషాలపాటు జరిగిన ఈ హోరాహోరీ పోరులో నాదల్ గట్టెక్కడానికి తన అనుభవాన్నంతా రంగరించాల్సి వచ్చింది. 19 ఏళ్ల జ్వెరెవ్ తొలి సెట్‌ను, మూడో సెట్‌ను సొంతం చేసుకొని సంచలనం సృష్టించేలా అనిపించాడు. కానీ 30 ఏళ్ల నాదల్ పట్టుదలతో పోరాడి వరుసగా చివరి రెండు సెట్లు నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. కెరీర్లో ఏడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న జ్వెరెవ్ కీలకదశలో తడబడ్డాడు. 19 ఏస్‌లు కొట్టిన జ్వెరెవ్, 11 డబుల్ ఫాల్ట్‌లు, 74 అవనసర తప్పిదాలు కూడా చేసి మూల్యం చెల్లించుకున్నాడు. మరోవైపు నాదల్ 11 ఏస్‌లు సంధించి, జ్వెరెవ్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ‘జ్వెరెవ్ ఎంతటి ప్రతిభావంతుడో అందరికీ తెలుసు. ఈ ఆటకు అతను భవిష్యత్ ఆశాకిరణం. ఐదు సెట్ల మ్యాచ్‌లో నెగ్గినందుకు ఆనందంగా ఉంది’ అని విజయానంతరం నాదల్ వ్యాఖ్యానించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ గేల్ మోన్ ఫిల్స్ (ఫ్రాన్స్ )తో నాదల్ ఆడతాడు. పురుషుల సింగిల్స్ ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) 6–2, 7–6 (7/5), 3–6, 6–3తో గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్ )పై, మోన్ ఫిల్స్ 6–3, 7–6 (7/1), 6–4తో కోల్‌ష్రైబర్ (జర్మనీ)పై, ఎనిమిదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–1, 4–6, 6–4, 6–4తో బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్ )పై, 11వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 6–3, 6–2, 6–4తో 20వ సీడ్ ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను బోల్తా కొట్టించిన డెనిస్ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్ ) అదే జోరును కొనసాగిస్తూ... మూడో రౌండ్లో 6–4, 4–6, 6–4, 4–6, 6–2తో కరెనో బుస్టా (స్పెయిన్ )పై విజయం సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో 13వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్ ) 7–5, 6–7 (6/8), 7–6 (7/3), 6–4తో 21వ సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్ )పై, 15వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6–3, 6–2, 6–4తో 18వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్ )పై గెలిచారు. సెరెనా సులువుగా... మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా), ఐదో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), తొమ్మిదో సీడ్ జొహనా కొంటా (బ్రిటన్ ) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టగా... ఆరో సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా) మూడో రౌండ్లోనే నిష్క్రమించింది. సెరెనా 6–1, 6–3తో నికోల్ గిబ్స్ (అమెరికా)పై, ప్లిస్కోవా 4–6, 6–0, 10–8తో ఒస్టాపెంకో (లాత్వియా)పై, జొహనా కొంటా 6–3, 6–1తో మాజీ నంబర్‌వన్ వొజ్నియాకి (డెన్మార్క్)పై నెగ్గారు. సిబుల్కోవా 2–6, 7–6 (7/3), 3–6తో మకరోవా (రష్యా) చేతిలో ఓడింది. 2 గంటల 33 నిమిషాలపాటు జరిగిన మరో మ్యాచ్ లో గావ్రిలోవా (ఆస్ట్రేలియా) 6–3, 5–7, 6–4తో 12వ సీడ్ బాసిన్ స్కీ (స్విట్జర్లాండ్)ను ఓడించింది. 16వ సీడ్ స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 7–5తో 21వ సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్ )పై, బ్రాడీ (అమెరికా) 7–6 (7/4), 6–2తో 14వ సీడ్ వెస్నినా (రష్యా)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మిక్స్‌డ్‌లో సానియా జంట శుభారంభం మరోవైపు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారులు సానియా మీర్జా,రోహన్ బోపన్న తమ భాగస్వాములతో కలిసి శుభారంభం చేశారు. తొలి రౌండ్లో సానియా మీర్జా–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంట 7–5, 6–4తో రెండో సీడ్ లారా సిగెమండ్ (జర్మనీ)–మాట్ పావిక్ (క్రొయేషియా) ద్వయంపై సంచలన విజయం సాధించగా... రోహన్ బోపన్న–గాబ్రియెలా దబ్రౌస్కీ (కెనడా) జోడీ 6–4, 6–7 (5/7), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)–కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జంటపై గెలిచింది. బాలుర సింగిల్స్ తొలి రౌండ్లో సిద్ధాంత్ బంతియా (భారత్) 6–2, 6–7 (3/7), 5–7తో అలెగ్జాండర్ క్రానోక్రాక్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోగా... బాలికల సింగిల్స్ తొలి రౌండ్లో జీల్ దేశాయ్ (భారత్) 6–4, 3–6, 7–5తో కైట్లిన్ స్టెయిన్స్ (ఆస్ట్రేలియా)పై గెలిచింది. -
చెన్నై ఓపెన్ ఫైనల్లో దివిజ్–పురవ్ జోడీ
చెన్నై: స్వదేశంలో తొలి ఏటీపీ డబుల్స్ టైటిల్ గెలిచేందుకు దివిజ్ శరణ్–పురవ్ రాజా (భారత్) జంట మరింత చేరువైంది. చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ఈ జోడీ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో దివిజ్ శరణ్–పురవ్ రాజా ద్వయం 6–4, 6–2తో గిలెర్మె దురాన్–ఆండ్రీస్ మోల్తెని (అర్జెంటీనా) జంటపై విజయం సాధించింది. గతంలో దివిజ్–పురవ్ బొగోటా ఓపెన్ (2013లో), లాస్ కబోస్ ఓపెన్ (2016లో) టోర్నీలలో విజేతగా నిలిచారు. శనివారం జరిగే రెండో సెమీఫైనల్లో రోహన్ బోపన్న–జీవన్ (భారత్) జంట నికొలస్ మోన్రో (అమెరికా)–అర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జోడీతో ఆడుతుంది. -
కనీస సమాచారం ఇవ్వలేదు!
భారత జట్టు నుంచి తొలగించడంపై బోపన్న స్పందన బెంగళూరు: డేవిస్ కప్ జట్టునుంచి తనను అకారణంగా తప్పించడంపై భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టును ప్రకటించిన విషయం తనకు మీడియా ద్వారానే తెలిసిందని అతను అన్నాడు. ‘న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు నేను అందుబాటులో ఉండగలనా అని మెయిల్ పంపించారు. నేను సిద్ధమేనని రెండు రోజుల్లోనే జవాబిచ్చాను. కానీ జట్టును ఎంపిక చేసినట్లు గానీ, నన్ను తప్పించిన విషయం గానీ ‘ఐటా’ లేదా కోచ్ జీషాన్ అలీ ఎవరూ సమాచారం ఇవ్వలేదు. అసలు ఏ ప్రాతిపదికన జట్టును ఎంపిక చేశారో కూడా తెలీదు’ అని బోపన్న వ్యాఖ్యానించాడు. మరోవైపు రాబోయే సీజన్లో బోపన్న డబుల్స్‌లో కొత్త భాగస్వామితో బరిలోకి దిగనున్నాడు. ఉరుగ్వేకు చెందిన పాబ్లో క్వాస్తో కలిసి అతను ఆడతాడు. ప్రపంచ 28వ ర్యాంకర్ బోపన్న, గత రెండేళ్లుగా రొమేనియా ఆటగాడు ఫ్లోరిన్ మెర్జియాతో కలిసి ఆడాడు. వీరిద్దరు కలిసి రెండు టైటిల్స్ గెలుచుకోగా, మరో ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచారు. -
'నన్ను ఎందుకు తప్పించారు?'
న్యూఢిల్లీ:తనను భారత డేవిస్ కప్ జట్టు నుంచి తప్పించడంపై టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు భారత డేవిస్ కప్ జట్టు నుంచి ఎందుకు తప్పించారో వివరణ ఇవ్వాలంటూ ప్రశ్నించాడు. డేవిస్ కప్ కు అఖిల భారత టెన్నిస్ సంఘం(ఏఐటీఏ) సెలక్షన్ తీరు తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్న బోపన్న.. ర్యాంకులు ప్రాతిపదికన ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టాడు. ఐటాకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారిని ఎంపిక చేసి, మిగతా వారిపై వేటు వేయడం ఎంత వరకూ సమంజసమని నిలదీశాడు. అయితే దీనిపై భారత డేవిస్ కప్ కోచ్, సెలక్షన్ కమిటీ సభ్యుడు జీషన్ అలీ మాత్రం ఇందులో ఎటువంటి తప్పిదం జరగలేదన్నారు. ప్రతీసారి సెలక్టర్లు ర్యాంకులు ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాల్సిన అవసరం లేదంటూ సర్దుకునే యత్నం చేశారు. న్యూజిలాండ్ తో పోరుకు ఎవరైతే కచ్చితంగా కుదురుతారో వారినే ఎంపిక చేసినట్లు జీషన్ తెలిపారు. ఐదుగురు సభ్యులతో కూడిన భారత డేవిస్ కప్ జట్టులో రోహన్ బోపన్నకు స్థానం దక్కని సంగతి తెలిసిందే. ఇందులో లియాండర్ పేస్ , సాకేత్ మైనేని, రామ్ నాథన్ రామ్ కుమార్, ప్రజ్ఞేష్ గున్నేశ్వరన్, యుకీ బాంబ్రీలతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో ముగ్గురు సింగిల్స్ ఆటగాళ్లతో పాటు, ఇద్దరు డబుల్స్ స్పెషలిస్టులను ఏఐటీఏ ఎంపిక చేసింది. ఇక్కడ వ్యక్తిగత డబుల్స్ ర్యాంకింగ్స్ లో లియాండర్ 59వ ర్యాంకులో ఉండగా, బోపన్న 28వ ర్యాంకులో ఉన్నాడు. డేవిస్ కప్ అర్హతలో భాగంగా ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు పుణేలో జరిగే ఆసియా ఓసియానియా టోర్నీలో న్యూజిలాండ్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.