
న్యూఢిల్లీ: ఈ ఏడాది డేవిస్ కప్ టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టు వరల్డ్ గ్రూప్–1లోనే కొనసాగనుంది. డెన్మార్క్‌తో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 4–0తో నెగ్గింది. శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ ద్వయం 6–7 (4/7), 6–4, 7–6 (7/4)తో నీల్సన్–టార్పెగార్డ్ జంటను ఓడించి భారత్‌కు 3–0తో విజయాన్ని ఖాయం చేసింది. భారత్ విజయం ఖరారు అయినప్పటికీ రివర్స్ సింగిల్స్‌ను నిర్వహించారు. రామ్‌కుమార్ 5–7, 7–5, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో ఇంగిల్డ్‌సెన్‌పై గెలిచి భారత ఆధిక్యాన్ని 4–0కు పెంచాడు. అనంతరం నామ మాత్రమైన ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు.
చదవండి: Pak vs Aus: ఒకవైపు వార్న్ మరణం.. ఇప్పుడు ఇది అవసరమా వార్నర్ ?
Comments
Please login to add a commentAdd a comment