Davis Cup World Group
-
Davis Cup 2022: తొలి సింగిల్స్‌లో ప్రజ్నేశ్ పరాజయం
లిల్లీహ్యామర్ (నార్వే): డేవిస్‌కప్ టీమ్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1లో భాగంగా నార్వేతో శుక్రవారం మొదలైన పోటీలో భారత్‌కు శుభారంభం లభించలేదు. యూఎస్ ఓపెన్ రన్నరప్, ప్రపంచ రెండో ర్యాంకర్ కాస్పర్ రూడ్‌తో జరిగిన తొలి సింగిల్స్‌లో ప్రపంచ 335వ ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కనీస పోరాట పటిమ కనబర్చకుండానే చేతులెత్తేశాడు. కేవలం 62 నిమిషాల్లో ముగిసిన తొలి సింగిల్స్‌లో 23 ఏళ్ల కాస్పర్ రూడ్ 6–1, 6–4తో 32 ఏళ్ల ప్రజ్నేశ్ను ఓడించి నార్వేకు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ నాలుగు ఏస్‌లు సంధించినా తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. రెండో సింగిల్స్ విక్టర్ దురాసోవిచ్, రామ్‌కుమార్ రామనాథన్ మధ్య జరుగుతుంది. నేడు డబుల్స్ మ్యాచ్‌తోపాటు రెండు రివర్స్ సింగిల్స్ జరుగుతాయి. -
వరల్డ్ గ్రూప్–1లోనే భారత్.. డెన్మార్క్‌పై ఘన విజయం
న్యూఢిల్లీ: ఈ ఏడాది డేవిస్ కప్ టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టు వరల్డ్ గ్రూప్–1లోనే కొనసాగనుంది. డెన్మార్క్‌తో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 4–0తో నెగ్గింది. శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ ద్వయం 6–7 (4/7), 6–4, 7–6 (7/4)తో నీల్సన్–టార్పెగార్డ్ జంటను ఓడించి భారత్‌కు 3–0తో విజయాన్ని ఖాయం చేసింది. భారత్ విజయం ఖరారు అయినప్పటికీ రివర్స్ సింగిల్స్‌ను నిర్వహించారు. రామ్‌కుమార్ 5–7, 7–5, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో ఇంగిల్డ్సెన్పై గెలిచి భారత ఆధిక్యాన్ని 4–0కు పెంచాడు. అనంతరం నామ మాత్రమైన ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. చదవండి: Pak vs Aus: ఒకవైపు వార్న్ మరణం.. ఇప్పుడు ఇది అవసరమా వార్నర్ ? -
బోపన్న జంట ఓటమి
ఎడ్మాంటన్ (కెనాడా): డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్‌నకు భారత్ అర్హత సాధించే అవకాశాలు క్లిష్టమయ్యాయి. కెనడాతో జరుగుతున్న ప్లే–ఆఫ్ పోరులో కీలకమైన డబుల్స్‌లో రోహన్ బోపన్న–పురవ్ రాజా జోడి ఓటమి చవిచూసింది. దీంతో భారత్ 1–2తో వెనుకబడింది. ఇక భారత్ ముందంజ వేయాలంటే రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సిందే. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న–రాజా జోడి 5–7, 5–7, 7–5, 3–6తో నెస్టర్–పొస్పిసిల్ జంట చేతిలో పరాజయం పాలైంది. చివరి నిమిషంలో జట్టులో చేరిన పురవ్ రాజా నెట్ వద్ద బాగా ఆడినా ఐదుసార్లు తన సర్వీస్‌ను కోల్పోవడం గమనార్హం. -
పోరాడారు గెలిచారు
♦ డబుల్స్‌లోనూ భారత జంటకు ఓటమి ♦ ఓడినా ఆకట్టుకున్న పేస్-సాకేత్ జంట ♦ 3-0తో స్పెయిన్ విజయం ఖరారు ♦ వరల్డ్ గ్రూప్‌నకు నాదల్ బృందం అర్హత ♦ నేడు నామమాత్రపు రివర్స్ సింగిల్స్ డేవిస్ కప్‌లో అత్యధికంగా 43 డబుల్స్ విజయాలు సాధించిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించేందుకు భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ మరికొంత కాలం ఎదురుచూడాల్సిందే. స్పెరుున్ జట్టుతో జరుగుతున్న వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌లో శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో భారత జోడీ పేస్-సాకేత్ మైనేని తమ శక్తిమేర పోరాడినా ఫలితం లేకపోరుుంది. రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన రాఫెల్ నాదల్-మార్క్ లోపెజ్ ద్వయం కీలకదశలో మెరుపులు మెరిపించి విజయాన్ని దక్కించుకుంది. ఈ గెలుపుతో స్పెరుున్ 3-0తో భారత్‌పై విజయాన్ని ఖాయం చేసుకుంది. వచ్చే ఏడాది జరిగే వరల్డ్ గ్రూప్ పోటీలకు అర్హత సాధించింది. ఫలితం తేలిపోవడంతో నేడు జరిగే రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు నామమాత్రమే. న్యూఢిల్లీ: ఊహించిన ఫలితమే వచ్చింది. పటిష్టమైన స్పెరుున్ జట్టు డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ పోటీలకు అర్హత సాధించింది. భారత్‌తో జరుగుతున్న వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌లో స్పెరుున్ 3-0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. తొలి రోజు రెండు సింగిల్స్‌లలో విజయాలు సాధించిన స్పెరుున్ అదే జోరును డబుల్స్‌లోనూ కొనసాగించింది. శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో రాఫెల్ నాదల్-మార్క్ లోపెజ్ జంట 4-6, 7-6 (7/2), 4-6, 4-6తో లియాండర్ పేస్-సాకేత్ మైనేని జోడీపై గెలిచింది. తొలి సెట్‌ను కోల్పోరుునా... రెండో సెట్లో, నాలుగో సెట్లో వెనుకబడినా... కీలకదశలో తమ ఆధిపత్యాన్ని చాటుకొని నాదల్-లోపెజ్ జంట సత్తా చాటుకుంది. 3 గంటల 23 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పేస్-సాకేత్ జోడీకి విజయావకాశాలు లభించినా... రియో ఒలింపిక్స్ డబుల్స్ స్వర్ణ పతక విజేతలు నాదల్-లోపెజ్ పట్టువదలకుండా పోరాడి విజయాన్ని దక్కించుకున్నారు. వరుసగా ఐదు గేమ్‌లు అపార అనుభవజ్ఞుడు లియాండర్ పేస్, యువ తరంగం సాకేత్ మైనేనితో తొలిసారి జతకట్టి బరిలోకి దిగాడు. సమన్వయలేమితో ఆరంభంలో భారత జంట తడబడగా... నాదల్, లోపెజ్ జోడీ జోరుగా ఆడటంతో భారత జంట 1-4తో వెనుకబడిపోరుుంది. అరుుతే కాస్త అవగాహన కుదిరాక పేస్-సాకేత్ ఆటతీరులో మార్పు కనిపించింది. సాకేత్ కచ్చితమైన సర్వీస్‌లు, కళ్లు చెదిరే రిటర్న్ షాట్లతో రాణించగా... పేస్ నెట్‌వద్ద అప్రమత్తంగా ఉన్నాడు. ఏడో గేమ్‌లో లోపెజ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి, ఆ తర్వాత పేస్ తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో భారత్ 4-4తో స్కోరును సమం చేసింది. తొమ్మిదో గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన భారత జంట పదో గేమ్‌లో తమ సర్వీస్‌ను కాపాడుకొని అనూహ్యంగా తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. ఆధిక్యం చేజార్చుకొని... తొలి సెట్‌ను నెగ్గిన ఉత్సాహంలో రెండో సెట్లోనూ పేస్-సాకేత్ సమన్వయంతో ఆడారు. మూడో గేమ్‌లోనే లోపెజ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాక, తమ సర్వీస్‌ను కాపాడుకొని 3-1తో ముందంజ వేశారు. ఆ తర్వాత భారత జంట 5-4తో ఆధిక్యంలో ఉన్న దశలో సాకేత్ సర్వీస్‌లో భారత్‌కు సెట్ గెల్చుకునే అవకాశం లభించింది. అరుుతే 14 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత నాదల్, ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ టైటిల్ విజేత లోపెజ్ కీలకదశలో మెరిశారు. సాకేత్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన స్పెరుున్ జంట స్కోరును 5-5తో సమం చేసింది. ఆ తర్వాత రెండు జోడీలు సర్వీస్‌లు కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో స్పెరుున్ జంట పైచేరుు సాధించింది. మూడో సెట్ ఆరంభంలోనే బ్రేక్ పారుుంట్ సాధించిన స్పెరుున్ జంట 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ సెట్‌ను కై వసం చేసుకుంది. నాలుగో సెట్లో సాకేత్, పేస్ అద్భుతంగా ఆడుతూ 4-2తో ఆధిక్యాన్ని సంపాదించారు. అరుుతే ఏడో గేమ్‌లో సాకేత్ సర్వీస్‌ను బ్రేక్ చేయడంలో సఫలమైన నాదల్-లోపెజ్ ద్వయం తమ సర్వీస్‌ను నిలబెట్టుకొని 4-4తో స్కోరును సమం చేసింది. తొమ్మిదో గేమ్‌లో పేస్ సర్వీస్‌ను కూడా బ్రేక్ చేసిన స్పెరుున్ జంట పదో గేమ్‌లో తమ సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను హస్తగతం చేసుకుంది. మా శక్తినంతా కూడదీసుకొని పోరాడాం. నాదల్-లోపెజ్ రియో ఒలింపిక్స్‌లో డబుల్స్‌లో స్వర్ణం సాధించిన సంగతి మర్చిపోవద్దు. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే డేవిస్ కప్‌లో డబుల్స్‌లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించేవాడిని. అరుుతే ఈ రికార్డును భారత్‌లోనే సాధించాలని ఉంది. ఈ రికార్డు సాధించేవరకు రిటైరవ్వను. -పేస్ -
భారత్‌కు మళ్లీ నిరాశ
న్యూఢిల్లీ : గత నాలుగేళ్లుగా డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్‌లో చోటు కోసం ప్రయత్నిస్తున్న భారత టెన్నిస్ జట్టుకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆదివారం ముగిసిన వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 1-3తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ చెక్ రిపబ్లిక్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో మళ్లీ ఆసియా, ఓసియానియా గ్రూప్-1కే పరిమితమైంది. భారత ఆశలు సజీవంగా నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన తొలి రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లో ఢిల్లీ కుర్రాడు యూకీ బాంబ్రీ 3-6, 5-7, 2-6తో ప్రపంచ 40వ ర్యాంకర్ జిరి వెసిలీ చేతిలో పరాజయం చవిచూశాడు. చెక్ రిపబ్లిక్ విజయం ఖాయం కావడంతో సోమ్‌దేవ్, రోసోల్ మధ్య రెండో మ్యాచ్‌ను నిర్వహించలేదు. మరోవైపు తాజా విజయంతో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన చెక్ రిపబ్లిక్ వరల్డ్ గ్రూప్‌లో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లకు అర్హత సాధించింది. ‘డబుల్స్‌లో పేస్-బోపన్న ఓడటం వల్లే భారత్ మూల్యం చెల్లించుకుంది. ఓవరాల్‌గా ఈ ఫలితం నన్ను నిరాశపర్చింది. తొలి రోజు స్కోరు 1-1తో ఉన్న తర్వాత రెండో రోజు డబుల్స్‌లో కచ్చితంగా గెలుస్తామని భావించాం. కానీ సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన ఘోరంగా ఉంది. వారి నుంచి ఇలాంటి ఆటతీరును అస్సలు ఊహించలేదు’ అని భారత నాన్ ప్లేయింగ్ కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్ వ్యాఖ్యానించారు. -
భారత్ ప్రత్యర్థి చెక్ రిపబ్లిక్
- డేవిస్‌కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ ‘డ్రా’ విడుదల - స్వదేశంలో సెప్టెంబరు 18 నుంచి 20 వరకు మ్యాచ్ లండన్: ప్రతిష్టాత్మక డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీల్లో భారత్ పురుషుల టెన్నిస్ జట్టుకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. ఈ ఏడాది సెప్టెంబరు 18 నుంచి 20 వరకు జరిగే ఈ మ్యాచ్‌లో టాప్ సీడ్, మాజీ చాంపియన్ చెక్ రిపబ్లిక్‌తో భారత్ తలపడుతుంది. భారత్‌లోనే జరిగే ఈ మ్యాచ్‌కు వేదికను (న్యూఢిల్లీ లేదా పుణే) వచ్చే నెలలో ఖరారు చేసే అవకాశముంది. 2012, 2013లలో డేవిస్ కప్ టైటిల్‌ను నెగ్గిన చెక్ రిపబ్లిక్... 1980లో అవిభాజ్య చెకోస్లోవేకియా రూపంలో తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. ప్రపంచ 6వ ర్యాంకర్ థామస్ బెర్డిచ్తోపాటు 44వ ర్యాంకర్ జిరీ వాసెలీ, 54వ ర్యాంకర్ లుకాస్ రోసోల్ చెక్ రిపబ్లిక్ జట్టు తరఫున బరిలోకి దిగే అవకాశముంది. డబుల్స్‌లో ఫ్రాంటిసెక్ సెర్మాక్ (70వ ర్యాంకర్), రోమన్ జెబావీ (106వ ర్యాంకర్) ఉన్నారు. వీరే కాకుండా గతంలో భారత స్టార్ ప్లేయర్ లియాండర్ పేస్‌కు భాగస్వాములుగా ఉన్న రాడెక్ స్టెపానెక్, లూకాస్ లూహీ కూడా జట్టులో ఉండే అవకాశముంది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ముగిసిన ఐదు రోజులకే డేవిస్ కప్ పోటీ ఉన్నందున బెర్డిచ్లాంటి స్టార్ ప్లేయర్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండే అవకాశముంది. ఒకవేళ అలా జరిగితే భారత్‌కూ విజయావకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ముఖాముఖి రికార్డులో చెక్ రిపబ్లిక్ 3-0తో భారత్‌పై ఆధిక్యంలో ఉంది. 1997లో చెక్ రిపబ్లిక్ చేతిలో 2-3తో ఓడిన భారత్... 1986లో, 1926లో చెకోస్లోవేకియా చేతిలో 1-4తో పరాజయం పాలైంది.