బోపన్న జంట ఓటమి | Rohan Bopanna-Purav Raja Jodi's loss the game | Sakshi
Sakshi News home page

బోపన్న జంట ఓటమి

Published Mon, Sep 18 2017 12:41 AM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM

బోపన్న జంట ఓటమి

బోపన్న జంట ఓటమి

ఎడ్మాంటన్‌ (కెనాడా): డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌నకు భారత్‌ అర్హత సాధించే అవకాశాలు క్లిష్టమయ్యాయి. కెనడాతో జరుగుతున్న ప్లే–ఆఫ్‌ పోరులో కీలకమైన డబుల్స్‌లో రోహన్‌ బోపన్న–పురవ్‌ రాజా జోడి ఓటమి చవిచూసింది. దీంతో భారత్‌ 1–2తో వెనుకబడింది. ఇక భారత్‌ ముందంజ వేయాలంటే రెండు రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సిందే.

భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన డబుల్స్‌ మ్యాచ్‌లో బోపన్న–రాజా జోడి 5–7, 5–7, 7–5, 3–6తో నెస్టర్‌–పొస్పిసిల్‌ జంట చేతిలో పరాజయం పాలైంది. చివరి నిమిషంలో జట్టులో చేరిన పురవ్‌ రాజా నెట్‌ వద్ద బాగా ఆడినా ఐదుసార్లు తన సర్వీస్‌ను కోల్పోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement