పోరాడారు గెలిచారు | Nadal-Lopez lead Spain back to World Group | Sakshi
Sakshi News home page

పోరాడారు గెలిచారు

Published Sun, Sep 18 2016 1:04 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

పోరాడారు గెలిచారు

పోరాడారు గెలిచారు

డబుల్స్‌లోనూ భారత జంటకు ఓటమి
ఓడినా ఆకట్టుకున్న పేస్-సాకేత్ జంట
3-0తో  స్పెయిన్  విజయం ఖరారు
వరల్డ్ గ్రూప్‌నకు నాదల్ బృందం అర్హత
నేడు నామమాత్రపు రివర్స్ సింగిల్స్ 

డేవిస్ కప్‌లో అత్యధికంగా 43 డబుల్స్ విజయాలు సాధించిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించేందుకు భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ మరికొంత కాలం ఎదురుచూడాల్సిందే. స్పెరుున్ జట్టుతో జరుగుతున్న వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌లో శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో భారత జోడీ పేస్-సాకేత్ మైనేని తమ శక్తిమేర పోరాడినా ఫలితం లేకపోరుుంది. రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన రాఫెల్ నాదల్-మార్క్ లోపెజ్ ద్వయం కీలకదశలో మెరుపులు మెరిపించి విజయాన్ని దక్కించుకుంది. ఈ గెలుపుతో స్పెరుున్ 3-0తో భారత్‌పై విజయాన్ని ఖాయం చేసుకుంది. వచ్చే ఏడాది జరిగే వరల్డ్ గ్రూప్ పోటీలకు అర్హత సాధించింది. ఫలితం తేలిపోవడంతో నేడు జరిగే రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు నామమాత్రమే.

న్యూఢిల్లీ: ఊహించిన ఫలితమే వచ్చింది. పటిష్టమైన స్పెరుున్ జట్టు డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ పోటీలకు అర్హత సాధించింది. భారత్‌తో జరుగుతున్న వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌లో స్పెరుున్ 3-0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. తొలి రోజు రెండు సింగిల్స్‌లలో విజయాలు సాధించిన స్పెరుున్ అదే జోరును డబుల్స్‌లోనూ కొనసాగించింది.

శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో రాఫెల్ నాదల్-మార్క్ లోపెజ్ జంట 4-6, 7-6 (7/2), 4-6, 4-6తో లియాండర్ పేస్-సాకేత్ మైనేని జోడీపై గెలిచింది. తొలి సెట్‌ను కోల్పోరుునా... రెండో సెట్‌లో, నాలుగో సెట్‌లో వెనుకబడినా... కీలకదశలో తమ ఆధిపత్యాన్ని చాటుకొని నాదల్-లోపెజ్ జంట సత్తా చాటుకుంది. 3 గంటల 23 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పేస్-సాకేత్ జోడీకి విజయావకాశాలు లభించినా... రియో ఒలింపిక్స్ డబుల్స్ స్వర్ణ పతక విజేతలు నాదల్-లోపెజ్ పట్టువదలకుండా పోరాడి విజయాన్ని దక్కించుకున్నారు.

 వరుసగా ఐదు గేమ్‌లు
అపార అనుభవజ్ఞుడు లియాండర్ పేస్, యువ తరంగం సాకేత్ మైనేనితో తొలిసారి జతకట్టి బరిలోకి దిగాడు. సమన్వయలేమితో ఆరంభంలో భారత జంట తడబడగా... నాదల్, లోపెజ్ జోడీ జోరుగా ఆడటంతో భారత జంట 1-4తో వెనుకబడిపోరుుంది. అరుుతే కాస్త అవగాహన కుదిరాక పేస్-సాకేత్ ఆటతీరులో మార్పు కనిపించింది. సాకేత్ కచ్చితమైన సర్వీస్‌లు, కళ్లు చెదిరే రిటర్న్ షాట్‌లతో రాణించగా... పేస్ నెట్‌వద్ద అప్రమత్తంగా ఉన్నాడు. ఏడో గేమ్‌లో లోపెజ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి, ఆ తర్వాత పేస్ తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో భారత్ 4-4తో స్కోరును సమం చేసింది. తొమ్మిదో గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన భారత జంట పదో గేమ్‌లో తమ సర్వీస్‌ను కాపాడుకొని అనూహ్యంగా తొలి సెట్‌ను సొంతం చేసుకుంది.

ఆధిక్యం చేజార్చుకొని...
తొలి సెట్‌ను నెగ్గిన ఉత్సాహంలో రెండో సెట్‌లోనూ పేస్-సాకేత్ సమన్వయంతో ఆడారు. మూడో గేమ్‌లోనే లోపెజ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాక, తమ సర్వీస్‌ను కాపాడుకొని 3-1తో ముందంజ వేశారు. ఆ తర్వాత భారత జంట 5-4తో ఆధిక్యంలో ఉన్న దశలో సాకేత్ సర్వీస్‌లో భారత్‌కు సెట్ గెల్చుకునే అవకాశం లభించింది. అరుుతే 14 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత నాదల్, ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ టైటిల్ విజేత లోపెజ్ కీలకదశలో మెరిశారు. సాకేత్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన స్పెరుున్ జంట స్కోరును 5-5తో సమం చేసింది. ఆ తర్వాత రెండు జోడీలు సర్వీస్‌లు కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో స్పెరుున్ జంట పైచేరుు సాధించింది.

మూడో సెట్ ఆరంభంలోనే బ్రేక్ పారుుంట్ సాధించిన స్పెరుున్ జంట 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ సెట్‌ను కై వసం చేసుకుంది. నాలుగో సెట్‌లో సాకేత్, పేస్ అద్భుతంగా ఆడుతూ 4-2తో ఆధిక్యాన్ని సంపాదించారు. అరుుతే ఏడో గేమ్‌లో సాకేత్ సర్వీస్‌ను బ్రేక్ చేయడంలో సఫలమైన నాదల్-లోపెజ్ ద్వయం తమ సర్వీస్‌ను నిలబెట్టుకొని 4-4తో స్కోరును సమం చేసింది. తొమ్మిదో గేమ్‌లో పేస్ సర్వీస్‌ను కూడా బ్రేక్ చేసిన స్పెరుున్ జంట పదో గేమ్‌లో తమ సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను హస్తగతం చేసుకుంది.

మా శక్తినంతా కూడదీసుకొని పోరాడాం. నాదల్-లోపెజ్ రియో ఒలింపిక్స్‌లో డబుల్స్‌లో స్వర్ణం సాధించిన సంగతి మర్చిపోవద్దు. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే డేవిస్ కప్‌లో డబుల్స్‌లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించేవాడిని. అరుుతే ఈ రికార్డును భారత్‌లోనే సాధించాలని ఉంది. ఈ రికార్డు సాధించేవరకు రిటైరవ్వను.      -పేస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement