
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ముందుగా భారత మహిళల జట్టు ‘షూటౌట్’లో 1–2తో ఇంగ్లండ్ జట్టు చేతిలో ఓడిపోగా... అనంతరం భారత పురుషుల జట్టు 2–0 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టుపై విజయం సాధించింది. భారత జట్టు తరఫున మన్‌దీప్ సింగ్ (32వ నిమిషంలో), దిల్‌ప్రీత్ సింగ్ (39వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.
ఇంగ్లండ్–భారత్ మహిళల జట్ల మధ్య మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున నవ్‌నీత్ కౌర్ (53వ నిమిషంలో), రుతుజా (57వ నిమిషంలో)... ఇంగ్లండ్ తరఫున పెయిజ్ గిలోట్ (40వ నిమిషంలో), టెసా హొవార్డ్ (56వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు.
తొలి ఐదు షాట్‌లు ముగిశాక రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత ఆరో షాట్‌లో రెండు జట్ల క్రీడాకారిణులు విఫలమయ్యారు. ఏడో షాట్‌లో భారత ప్లేయర్ లాల్‌రెమ్‌సియామి గురి తప్పగా... ఇంగ్లండ్ ప్లేయర్ సోఫీ హామిల్టన్ బంతిని లక్ష్యానికి చేర్చడంతో భారత్‌కు ఓటమి ఖరారైంది.
Comments
Please login to add a commentAdd a comment