hockey league
-
విజయంతో ముగింపు
రూర్కెలా: పురుషుల ప్రొ హాకీ లీగ్ భారత అంచె పోటీలను టీమిండియా విజయంతో ముగించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 4–0 గోల్స్ తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. భారత్ తరఫున నీలకంఠ శర్మ (14వ ని.లో), ఆకాశ్‌దీప్ సింగ్ (15వ ని.లో), గుర్జంత్ సింగ్ (38వ ని.లో), జుగ్రాజ్ సింగ్ (60వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో భారత జట్టు 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. -
FIH Pro League: ‘షూటౌట్’లో భారత్ విజయం
FIH Pro League 2023-24- భువనేశ్వర్: పురుషుల ప్రొ హాకీ లీగ్ టోర్నీలో భారత జట్టు నాలుగో విజయం అందుకుంది. స్పెయిన్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా సడెన్‌డెత్ ‘షూటౌట్’లో 8–7తో గెలిచింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున జర్మన్‌ప్రీత్ సింగ్ (1వ ని.లో), అభిషేక్ (35వ ని.లో)... స్పెయిన్ తరఫున జోస్ బస్టెరా (3వ ని.లో), బొర్యా లకెలా (15వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. స్కోర్లు సమమయ్యాక విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ను నిర్వహించారు. ‘ షూటౌట్’లో తొలి ఐదు ప్రయత్నాల్లో ఇరు జట్ల ఆటగాళ్లు సఫలమయ్యారు. దాంతో ‘సడెన్‌డెత్’ షూటౌట్‌ను నిర్వహించారు. ‘సడెన్‌డెత్’లో స్పెయిన్ ప్లేయర్ మిరాలెస్ తీసుకున్న మూడో షాట్‌ను భారత గోల్‌కీపర్ శ్రీజేష్ నిలువరించాడు. ఆ వెంటనే భారత్ తరఫున లలిత్ ఉపాధ్యాయ్ గోల్ చేయడంతో టీమిండియా విజయం ఖరారైంది. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో భారత్ ఐదు మ్యాచ్‌ల ద్వారా 10 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉంది. రేపు జరిగే మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ ఆడుతుంది. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ బోణీ చెన్నై: ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు గెలుపు బోణీ కొట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బ్లాక్ హాక్స్ 7–15, 12–15, 15–10, 15–11, 20–18తో ముంబై మెటోర్స్ జట్టును ఓడించింది. తొలి రెండు సెట్లు ఓడిపోయిన బ్లాక్ హాక్స్ ఆ తర్వాత అద్భుత ఆటతీరుతో పుంజుకొని వరుసగా మూడు సెట్లు నెగ్గి విజయాన్ని అందుకుంది. భ్లాక్ హాక్స్ విజయంలో అష్మతుల్లా, హేమంత్, లాల్ సుజన్ కీలకపాత్ర పోషించారు. గుల్వీర్ సింగ్‌కు స్వర్ణం టెహ్రాన్: ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్ను భారత్ స్వర్ణ పతకంతో ముగించింది. సోమవారం జరిగిన పురుషుల 3000 మీటర్ల రేసులో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ (8ని:07.48 సెకన్లు) పసిడి పతకం గెలిచాడు. మహిళల 3000 మీటర్లలో అంకిత (9ని:26.22 సెకన్లు) రజత పతకం సాధించింది. ఈ పోటీల్లో భారత్‌కు మొత్తం నాలుగు స్వర్ణాలు, ఒక రజతం లభించాయి. -
FIH Pro League: ‘షూటౌట్’లో భారత్ గెలుపు
రూర్కెలా: సొంతగడ్డపై ప్రొ హాకీ లీగ్ దశను భారత పురుషుల జట్టు విజయంతో ముగించింది. ఆస్ట్రేలియా జట్టుతో బుధవారం జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా ‘షూటౌట్’లో 4–3 గోల్స్ తేడాతో గెలుపొందింది. అంతకుముందు నిర్ణీత సమయం పూర్తయ్యాక రెండు జట్లు 2–2తో సమఉజ్జీగా నిలిచాయి. రెగ్యులర్ టైమ్‌లో భారత్ తరఫున వివేక్ సాగర్ ప్రసాద్ (2వ ని.లో), సుఖ్జీత్ సింగ్ (47వ ని.లో)... ఆస్ట్రేలియా తరఫున నాథన్ ఎఫార్మస్ (37వ ని.లో), టిమ్ హోవర్డ్ (52వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ‘షూటౌట్’లో తొలి ఐదు షాట్లలో భారత్ నుంచి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్ సఫలమవ్వగా... హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్ విఫలమయ్యారు. ఆస్ట్రేలియా తరఫున జేక్ హార్వీ, క్రెయిగ్ మరైస్, జాక్ వెల్చ్ గోల్స్ చేయగా... జేక్ వెటన్, నాథన్ ఎఫార్మస్ గురి తప్పారు. దాంతో ‘షూటౌట్’లో రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. ‘సడెన్‌డెత్’లో తొలి షాట్‌ను హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలచగా... ఆస్ట్రేలియా ప్లేయర్ జాక్ వెల్చ్ షాట్‌ను భారత గోల్‌కీపర్ శ్రీజేశ్ నిలువరించడంతో టీమిండియా విజయం ఖాయమైంది. -
మూడు రోజుల వ్యవధిలో విశ్వవిజేతకు రెండోసారి షాకిచ్చిన భారత్
రూర్కెలా: ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా ప్రపంచ చాంపియన్ జర్మనీ జట్టుతో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 6–3 గోల్స్‌తో గెలిచింది. మూడు రోజుల వ్యవధిలో జర్మనీపై భారత్‌కిది రెండో గెలుపు కావడం విశేషం. ఈ విజయంతో భారత్ 17 పాయింట్లతో ‘టాప్’లోకి వచ్చింది. భారత్ తరఫున సెల్వం కార్తీ (24వ, 46వ ని.లో), అభిషేక్ (22వ, 51వ ని.లో) రెండు గోల్స్ చొప్పున సాధించగా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (26వ ని.లో), జుగ్రాజ్ (21వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. జర్మనీ తరఫున గ్రామ్‌బుష్ (3వ ని.లో), పీలాట్ (23వ ని.లో), హెల్విగ్ (33వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. -
హర్మన్‌ప్రీత్ ‘హ్యాట్రిక్’ ఆసీస్‌పై భారత్ విజయం
Men's Pro Hockey League:- రూర్కెలా: కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ‘హ్యాట్రిక్’ నమోదు చేయడంతో... ప్రొ హాకీ లీగ్‌లో భారత జట్టు 5–4 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా జట్టును బోల్తా కొట్టించింది. టీమిండియా సారథి హర్మన్‌ప్రీత్ సింగ్ 13, 14, 55వ నిమిషాల్లో పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచగా... జుగ్రాజ్ సింగ్ (17వ ని.లో), సెల్వం కార్తీ (25వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఆస్ట్రేలియా తరఫున జోషువా బెల్ట్జ్ (3వ ని.లో), విలోట్ (43వ ని.లో), బెన్ స్టెయినెస్ (53వ ని.లో), టిమ్ హోవర్డ్ (57వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. రెండు జట్లకు పది చొప్పున పెనాల్టీ కార్నర్లు రాగా... భారత్ మూడింటిని, ఆసీస్ రెండింటిని గోల్స్‌గా మలిచాయి. సోమవారం జరిగే మరో లీగ్ మ్యాచ్‌లో జర్మనీతో భారత్ ఆడుతుంది. చదవండి: Virat Kohli 75th Century: కింగ్ ఈజ్ బ్యాక్.. ఆ ఇద్దరు దిగ్గజాల తర్వాత కోహ్లికే సాధ్యమైంది! -
భారత్ ఘన విజయం
భువనేశ్వర్: ఆద్యంతం అటాకింగ్‌తో ప్రత్యర్థిపై చెలరేగిన భారత జట్టు ప్రొ హాకీ లీగ్‌లో కీలక విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 7–4 గోల్స్ తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. తొలి క్వార్టర్లో కివీస్ ఆధిక్యం ప్రదర్శించినా, ఆ తర్వాత భారత్ జోరు ముందుకు నిలవలేకపోయింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ల ద్వారా రెండు గోల్స్ (7వ నిమిషం, 19వ ని.) సాధించగా, కార్తీ సెల్వమ్ (17వ ని., 38వ ని.) మరో రెండు గోల్స్ కొట్టాడు. రాజ్‌కుమార్ పాల్ (31వ ని.), సుఖ్జీత్ సింగ్ (50వ ని.), జుగ్రాజ్ సింగ్ (53వ ని.) భారత్‌కు మిగతా గోల్స్ అందించారు. న్యూజిలాండ్ తరఫున సైమన్ చైల్డ్ (2వ ని.), స్యామ్ లేన్ (9వ ని.), స్మిత్ జేక్ (14వ ని.), నిక్వుడ్స్ (54వ ని.) గోల్స్ చేశారు. -
ప్రొ హాకీ లీగ్.. మూడో స్థానంతో బారత్ ముగింపు
రోటర్‌డామ్: ప్రొ హాకీ లీగ్ 2021–2022 సీజన్‌ను భారత పురుషుల జట్టు మూడో స్థానంతో ముగించింది. నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–2 గోల్స్‌తో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో విజయంతో నెదర్లాండ్స్ చాంపియన్‌గా నిలిచింది. భారత్ తరఫున అభిషేక్ తొలి నిమిషంలోనే గోల్ చేయగా... ఏడో నిమిషంలో నెదర్లాండ్స్ జట్టుకు జాన్సెన్ గోల్ అందించి స్కోరును సమం చేశాడు. 45వ నిమిషంలో జోరిట్ క్రూన్ గోల్‌తో నెదర్లాండ్స్ విజయాన్ని ఖాయం చేసుకుంది. తొమ్మిది జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో భారత్ మొత్తం 16 మ్యాచ్‌లు ఆడి 30 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకుంది. ఎనిమిది మ్యాచ్‌ల్లో నిర్ణీత సమయంలోపు గెలిచిన భారత్, రెండింటిలో ‘షూటౌట్’ ద్వారా విజయం అందుకుంది. ‘షూటౌట్’లో రెండు మ్యాచ్‌ల్లో, నిర్ణీత సమయంలోపు నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ ఓటమి పాలైంది. మరోవైపు మహిళల ప్రొ హాకీ లీగ్‌లో అర్జెంటీనాతో మ్యాచ్ లో భారత్ 2–3తో ఓడిపోయింది. ఈ విజయంతో అర్జెంటీనా టైటిల్‌ను ఖరారు చేసుకుంది. చదవండి: Matteo Berrettini: 'నన్ను పెళ్లి చేసుకుంటావా'.. టెన్నిస్ స్టార్‌కు వింత అనుభవం -
హాకీలో భారత్ మహిళల సంచలనం
రోటర్‌డామ్ (నెదర్లాండ్స్): ప్రొ హాకీ మహిళల లీగ్‌లో భారత జట్టు సంచలనం సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత అర్జెంటీనా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ‘షూటౌట్’లో 2–1తో గెలిచింది. ‘షూటౌట్’లో భారత్ తరఫున నేహా గోయల్, సోనిక స్కోరు చేశారు. షర్మిలా దేవి, మోనిక విఫలమయ్యారు. అర్జెంటీనా క్రీడాకారిణుల ఐదు షాట్లలో భారత గోల్‌కీపర్, కెప్టెన్ సవితా పూనియా నాలుగింటిని నిలువరించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. అంతకుముందు రెగ్యులర్ సమయం ముగిసేసరికి రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ రెండు గోల్స్, లాల్రెమ్సియామి ఒక గోల్ చేశారు. అర్జెంటీనా తరఫున అగస్టీనా మూడు గోల్స్‌తో హ్యాట్రిక్ సాధించింది. ఫలితం తేలడానికి ‘షూటౌట్’ నిర్వహించగా భారత్ పైచేయి సాధించింది. ఇదే వేదికపై జరిగిన పురుషుల ప్రొ లీగ్‌లో భారత జట్టు 1–4తో ‘షూటౌట్’లో నెదర్లాండ్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. -
FIH Hockey Pro League: విజయంతో భారత్ ముగింపు
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌లో స్వదేశీ అంచె మ్యాచ్‌లను భారత పురుషుల జట్టు విజయంతో ముగించింది. జర్మనీ జట్టుతో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో అమిత్ రోహిదాస్ సారథ్యంలోని భారత్ 3–1తో గెలిచింది. టీమిండియా తరఫున సుఖ్జీత్ సింగ్ (19వ ని.లో), వరుణ్ (41వ ని.లో), అభిషేక్ (54వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. జర్మనీ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను బోయెకెల్ (45వ ని.లో) సాధించాడు. తొమ్మిది జట్లు బరిలో ఉన్న ఈ లీగ్‌లో 12 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత్ 27 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... జర్మనీ 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లను ఆంట్వర్ప్లో బెల్జియంతో జూన్ 11, 12న... రోటర్‌డామ్‌లో నెదర్లాండ్స్‌తో జూన్ 18, 19న తలపడుతుంది. చదవండి: IPL 2022: దీపక్ చహర్ ఔట్.. సీఎస్కే అధికారిక ప్రకటన -
చివరి వరకు వెనుకబడి.. ఆఖర్లో అద్భుతం
భువనేశ్వర్: ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా స్పెయిన్ పురుషుల జట్టుతో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతం చేసింది. ఒక దశలో 1–4తో వెనుకబడి ఓటమి ఖాయమనుకున్న స్థితి నుంచి టీమిండియా అనూహ్యంగా తేరుకుంది. వరుసగా నాలుగు గోల్స్ సాధించి చివరకు 5–4తో విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ మరో ఎనిమిది సెకన్లలో ముగుస్తుందనగా హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ స్ట్రోక్‌ను లక్ష్యానికి చేర్చి భారత్‌ను గెలిపించాడు. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (15వ, 60వ ని.లో) రెండు గోల్స్ చేయగా... శిలా నంద్ లాక్రా (41వ ని.లో), షంషేర్ సింగ్ (43వ ని.లో), వరుణ్ కుమార్ (55వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. స్పెయిన్ జట్టుకు కెప్టెన్ మార్క్ మిరాలెస్ (20వ, 23వ, 40వ ని.లో) మూడు గోల్స్, పౌ కునిల్ (14వ ని.లో) ఒక గోల్ అందించారు. మహిళల జట్టూ గెలిచింది... మహిళల ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా స్పెయిన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 2–1తో విజయం సాధించింది. ఆట 18వ నిమిషంలో మార్టా సెగూ గోల్‌తో స్పెయిన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 20వ నిమిషంలో జ్యోతి గోల్‌తో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది. అనంతరం 52వ నిమిషంలో నేహా చేసిన గోల్‌తో భారత్ 2–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. ప్రొ లీగ్‌లో భారత్‌కిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. ఇటీవల ఒమన్‌లో చైనాతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలుపొందింది. -
భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌గా సవిత
న్యూఢిల్లీ: భారత హాకీ రెగ్యులర్ కెప్టెన్ రాణి రాంపాల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) మహిళల ప్రొ లీగ్‌లో స్పెయిన్‌తో జరిగే పోటీలకూ దూరమైంది. దీంతో సీనియర్ గోల్‌కీపర్ సవితకే జట్టు పగ్గాలు అప్పగించారు. సొంతగడ్డపై జరిగే లీగ్ పోరులో సవిత నేతృత్వంలోని భారత మహిళల జట్టు స్పెయిన్‌ను ఎదుర్కొంటుంది. ఈ నెల 26, 27 తేదీల్లో భువనేశ్వర్‌లో ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మహిళల హాకీ జట్టు: సవిత (కెప్టెన్), దీప్గ్రేస్ ఎక్కా, గుర్జీత్ కౌర్, నిక్కీ ప్రధాన్, ఉదిత, ఇషిక చౌదరి, రజని, బిచుదేవి, నిషా, సలిమా టేటే, సుశీలా చాను, జ్యోతి, మోనిక, నేహా, నవ్‌జ్యోత్ కౌర్, నమిత టొప్పొ, వందన కటారియా, షర్మిలా, నవ్‌నీత్ కౌర్, లాల్రెమ్సియామి, సంగీత, రాజ్విందర్ కౌర్. స్టాండ్‌బైలు: రష్మిత, అక్షత, సోనిక, మరియాన, ఐశ్వర్య. -
Indian Team: భారత్ ఘనవిజయం
FIH Hockey Pro League- పాచెఫ్స్ట్రోమ్ (దక్షిణాఫ్రికా): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) పురుషుల ప్రొ లీగ్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. ఫ్రాన్స్ జట్టుతో మంగళవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి క్వార్టర్లో భారత్‌ను గోల్ చేయనీకుండా నిలువరించిన ఫ్రాన్స్ ఆ తర్వాత చేతులెత్తేసింది. భారత్ తరఫున ‘డ్రాగ్ ఫ్లికర్’ హర్మన్‌ప్రీత్ సింగ్ (21వ ని.లో), వరుణ్ కుమార్ (24వ ని.లో), షంషేర్ సింగ్ (28వ ని.లో), మన్దీప్ సింగ్ (32వ ని.లో), కెరీర్లో 200వ మ్యాచ్ ఆడిన ఆకాశ్‌దీప్ సింగ్ (41వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. బుధవారం జరిగే మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ ఆడుతుంది. చదవండి: Ranji Trophy 2022: టీమిండియాలో స్థానం కోసం పోరాటం.. ప్రత్యర్థులుగా రహానే, పుజారా! -
భారత్, న్యూజిలాండ్ ప్రొ హాకీ లీగ్ మ్యాచ్‌లు రద్దు
న్యూఢిల్లీ: వచ్చే నెలలో 23, 24వ తేదీల్లో భువనేశ్వర్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన రెండు ప్రొ హాకీ లీగ్ మ్యాచ్‌లు రద్దయ్యాయి. న్యూజిలాండ్ ప్రభుత్వం లాక్డౌన్ మార్గనిర్దేశకాలను అనుసరించి ప్రస్తుత పరిస్థితుల్లో తాము విదేశాల్లో పర్యటించే అవకాశం లేదని... అందుకే భారత్‌తో జరిగే రెండు ప్రొ హాకీ లీగ్ మ్యాచ్‌లను, చైనాలో మహిళల హాకీ జట్టు పర్యటనను రద్దు చేసుకుంటున్నామని న్యూజిలాండ్ హాకీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇయాన్ ఫ్రాన్సిస్ తెలిపారు. -
భారత్ చేతిలో ఆసీస్ షూటౌట్
భువనేశ్వర్: గోల్ కీపర్ శ్రీజేశ్ అడ్డుగోడగా నిలవడంతో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆస్ట్రేలియాపై భారత హాకీ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ప్రొ హాకీ లీగ్ సీజన్–2లో భాగంగా శనివారం ఇక్కడి కళింగ స్టేడియంలో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–1తో పెనాల్టీ షూటౌట్లో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. దాంతో శుక్రవారం ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. నిర్ణీత 60 నిమిషాల ఆటలో ఇరు జట్లు కూడా 2–2 గోల్స్‌తో సమంగా నిలిచాయి. భారత తరఫున రూపిందర్ పాల్ సింగ్ (25వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (27వ నిమిషంలో) చెరో గోల్ చేయగా... ఆసీస్ ఆటగాళ్లలో ట్రెంట్ మిట్టన్ (23వ నిమిషంలో), అరాన్ జలేవ్స్కీ (46వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. ఫలితంగా మ్యాచ్ షూటౌట్‌కు దారి తీసింది. -
భారత్‌కు వరుసగా రెండో ఓటమి
భువనేశ్వర్: ప్రొ హాకీ లీగ్ రెండో సీజన్లో భారత పురుషుల జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గత మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ బెల్జియం చేతిలో భంగపడ్డ భారత్... శుక్రవారం ఇక్కడి కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 3–4 గోల్స్ తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆస్ట్రేలియా చేతిలో పోరాడి ఓడింది. భారత్ తరఫున రాజ్ కుమార్ (36వ, 47వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... రూపిందర్ సింగ్ (52వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. ఆసీస్ తరఫున డైలాన్ (6వ నిమిషంలో), టామ్ (18వ నిమిషంలో), లెచ్లాన్ (41వ నిమిషంలో), జాకబ్ (42వ నిమిషంలో) తలా ఒక గోల్ చేశారు. మ్యాచ్ మొదటి మూడు క్వార్టర్స్‌లో పెద్దగా ప్రభావం చూపని భారత ఆటగాళ్లు చివరి క్వార్టర్లో పుంజుకున్నారు. ఐదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి ఆసీస్ ఆధిక్యాన్ని 3–4కు తగ్గించారు. ఆట మరో 35 సెకన్లలో ముగుస్తుందనగా లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్ గా మలచడంలో భారత ప్లేయర్లు విఫలమవ్వడం తో కంగారూల గెలుపు ఖాయమైంది. నేడు ఆస్ట్రేలియాతో భారత్ రెండో లీగ్ మ్యాచ్‌ను ఆడనుంది. -
భారత్‌కు తొలి ఓటమి
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ హాకీ లీగ్‌లో భారత పురుషుల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ప్రపంచ చాంపియన్ బెల్జియం జట్టుతో ఆదివారం జరిగిన రెండో రౌండ్ రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత్ తరఫున వివేక్ సాగర్ ప్రసాద్ (15వ ని.లో), అమిత్ రోహిదాస్ (17వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. బెల్జియం జట్టు తరఫున మాక్సిమి ప్లెనెవాక్స్ (17వ, 26వ ని.లో) రెండు గోల్స్ సాధించగా... అలెగ్జాండర్ హెండ్రిక్స్ (3వ ని.లో) మరో గోల్ చేశాడు. మొత్తం తొమ్మిది జట్లు పాల్గొంటున్న ప్రొ హాకీ లీగ్‌లో రెండు రౌండ్లు ముగిశాక ప్రస్తుతం బెల్జియం 14 పాయింట్లతో అగ్రస్థానంలో, భారత్ ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. మూడో రౌండ్లో భాగంగా భువనేశ్వర్‌లోనే ఆస్ట్రేలియాతో భారత్ ఈనెల 21, 22 తేదీల్లో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. -
ప్రపంచ చాంపియన్‌కు భారత్ షాక్
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ హాకీ లీగ్‌లో భారత పురుషుల జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. నెదర్లాండ్స్‌తో తొలి రౌండ్ రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన టీమిండియా... ప్రపంచ చాంపియన్ బెల్జియంతో శనివారం రెండో రౌండ్ తొలి మ్యాచ్‌లో 2–1తో సంచలన విజయం సాధించింది. ఆట రెండో నిమిషంలో మన్దీప్ సింగ్ గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. 33వ నిమిషంలో బొకార్డ్ గోల్‌తో బెల్జియం స్కోరును సమం చేసింది. ఆ తర్వాత 47వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను రమణ్‌దీప్ సింగ్ గోల్‌గా మలచడంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్ విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు ఇదే వేదికపై ఈ రెండు జట్లు మళ్లీ తలపడతాయి. -
ఆరంభం అదిరింది
భువనేశ్వర్: ప్రొ హాకీ లీగ్ రెండో సీజన్లో భారత్ అదిరే అరంభం చేసింది. శనివారం ఇక్కడి కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5–2 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసి టోరీ్నలో శుభారంభం చేసింది. రెండో క్వార్టర్ మినహా మిగిలిన క్వార్టర్స్‌లో భారత ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. చక్కటి సమన్వయంతో కదులుతూ ప్రత్యర్థి గోల్ పోస్టుపై దాడులు చేశారు. భారత ఆటగాళ్లలో రూపిందర్ సింగ్ (12వ, 46వ నిమిషంలో) రెండు గోల్స్ చేయగా... గుర్జంత్ సింగ్ (1వ నిమిషంలో), మన్దీప్ సింగ్ (34వ నిమిషంలో), లలిత్ ఉపాధ్యాయ్ (36వ నిమిషంలో) తలా ఒక గోల్ చేశారు. నెదర్లాండ్స్ తరఫున జిప్ జాన్‌స్సెన్ (14వ నిమిషంలో), జెరాన్ (28వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. నేడు ఇదే వేదికపై నెదర్లాండ్స్‌తో భారత్ రెండో మ్యాచ్ ఆడుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1 ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
గుర్బాజ్ సింగ్‌కు రూ.67 లక్షలు
న్యూఢిల్లీ: క్రమశిక్షణారాహిత్యంతో దాదాపు ఏడాది కాలంగా భారత జట్టుకు దూరమైనా... మిడ్‌ఫీల్డర్ గుర్బాజ్ సింగ్ హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) వేలంలో తన ప్రత్యేకత నిలబెట్టుకున్నాడు. బుధవారం జరిగిన వేలంలో రాంచీ రేస్ జట్టు గుర్బాజ్‌ను 99 వేల డాలర్లకు (సుమారు రూ. 67 లక్షలు) సొంతం చేసుకుంది. 2017 సీజన్ కోసం ఈ వేలం జరిగింది. టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లూ దాదాపుగా తమ వద్ద ఉన్న ఆటగాళ్లనే కొనసాగించాలని నిర్ణయించున్నాయి. దాంతో ప్రధాన ఆటగాళ్లు పోగా... మిగిలిన కొన్ని ఖాళీల కోసం ఈ వేలంను నిర్వహించారు. గుర్బాజ్ తర్వాత 75 వేల డాలర్లతో (రూ. 51 లక్షలు) జర్మనీ ఫార్వర్డ్ క్రిస్టోఫర్ రూర్ రెండో స్థానంలో నిలిచాడు. అతడిని కూడా రాంచీ జట్టు ఎంచుకుంది. భారత యువ ఆటగాళ్లలో 18 ఏళ్ల హార్దిక్ సింగ్‌ను పంజాబ్ జట్టు 39 వేల డాలర్లకు (రూ. 27 లక్షలు) తీసుకోవడం విశేషం.