
న్యూఢిల్లీ: భారత హాకీ రెగ్యులర్ కెప్టెన్ రాణి రాంపాల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) మహిళల ప్రొ లీగ్‌లో స్పెయిన్‌తో జరిగే పోటీలకూ దూరమైంది. దీంతో సీనియర్ గోల్‌కీపర్ సవితకే జట్టు పగ్గాలు అప్పగించారు. సొంతగడ్డపై జరిగే లీగ్ పోరులో సవిత నేతృత్వంలోని భారత మహిళల జట్టు స్పెయిన్‌ను ఎదుర్కొంటుంది. ఈ నెల 26, 27 తేదీల్లో భువనేశ్వర్‌లో ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి.
మహిళల హాకీ జట్టు: సవిత (కెప్టెన్), దీప్‌గ్రేస్ ఎక్కా, గుర్జీత్ కౌర్, నిక్కీ ప్రధాన్, ఉదిత, ఇషిక చౌదరి, రజని, బిచుదేవి, నిషా, సలిమా టేటే, సుశీలా చాను, జ్యోతి, మోనిక, నేహా, నవ్‌జ్యోత్ కౌర్, నమిత టొప్పొ, వందన కటారియా, షర్మిలా, నవ్‌నీత్ కౌర్, లాల్‌రెమ్సియామి, సంగీత, రాజ్విందర్ కౌర్. స్టాండ్‌బైలు: రష్మిత, అక్షత, సోనిక, మరియాన, ఐశ్వర్య.
Comments
Please login to add a commentAdd a comment