savitha
-
మంత్రి సవిత తక్షణం మహిళలకు క్షమాపణలు చెప్పాలి
-
శాసన మండలిలో మంత్రి సవిత వివాదాస్పద వ్యాఖ్యలు
-
మహిళలకు మంత్రి సవిత క్షమాపణలు చెప్పాలి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో డీబీటీ డబ్బుల ద్వారా మహిళలు గంజాయి, మద్యానికి బానిసలు అయ్యారని మంత్రి వ్యాఖ్యలు చేయడంపై ఎమ్మెల్సీలు మండిపడ్డారు. మంత్రి సవిత.. తక్షణమే రాష్ట్ర మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ..‘సభలో మంత్రి సవిత తీవ్ర అభ్యంతరమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సవిత తక్షణమే రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణ చెప్పాలి. మంత్రి పదే పదే సభలో కాపుల గురించి ప్రస్తావించారు. కాపులు ఓటేశారు కాబట్టే కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ ఆరు నెలల్లో కాపులకు ఏం చేశారో మీరు సమాధానం చెప్పాలి. పది వేల కోట్లు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఒక్క రూపాయి ఇవ్వలేదు. దేశంలో ఎవరూ చేయనంత సంక్షేమం కాపులకు వైఎస్ జగన్ చేశారు. బటన్ నొక్కడం వల్ల మహిళలు గంజాయికి, మద్యానికి అలవాటు పడ్డారనడం దుర్మార్గం అని మండిపడ్డారుఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ..‘సభలో బాధ్యత గల మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. అనుచితమైన వ్యాఖ్యలతో కించపరిచేలా మాట్లాడుతున్నారు. మంత్రి సవిత మహిళలను అవమానించేలా మాట్లాడారు. సంక్షేమాన్ని అద్భుతంగా అమలు చేసిన నాయకుడు వైఎస్ జగన్. మహిళలు గంజాయి, మద్యానికి బానిసలైపోయారనడం దారుణం. సభ్య సమాజం తలదించుకునేలా మంత్రి సవిత వ్యాఖ్యానించారుఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ.. ఎస్సీ, బీసీ, మైనార్టీలను అవమానించేలా కూటమి నేతల వైఖరి ఉంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్..హోంమంత్రిని చులకన చేసి మాట్లాడారు. దళిత హోంమంత్రి పదవిలో ఉండటం వల్లే చులకనగా మాట్లాడారని మేం భావిస్తున్నాం. మంత్రి సత్యకుమార్ ముస్లిం, మైనార్టీలను కించపరిచేలా మాట్లాడారు. ఈరోజు మంత్రి సవిత.. మహిళలు గంజాయి, మద్యానికి అలవాటైపోయారంటున్నారు. మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక పెద్దలు ఉన్నారని మేం భావిస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు. ప్రతీ ప్రైవేట్ స్కూల్లో 25 శాతం పేదలకు సీట్లు కేటాయించాలని చట్టం చెబుతోంది. వైఎస్ జగన్ అమ్మఒడి ద్వారా పేదలు చదువుకునేలా చర్యలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్ధుల కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలి.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. మంత్రి సవిత వ్యాఖ్యలు చాలా హేయమైనవి. ఒక మహిళా మంత్రిగా ఉండి ఇలా మాట్లాడటం సిగ్గుచేటు. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు కనీస విలువ లేదు. వైఎస్ జగన్ మహిళలకు పెద్దపీట వేశారు. మహిళలను కించపరిచే సంస్కృతి చంద్రబాబుది. 2014-19లో సాక్షాత్తూ చంద్రబాబు సీఎంగా మహిళలను కించపరిచేలా మాట్లాడారు. నోటితో చెప్పలేని విధంగా బాలకృష్ణ మహిళలను అవమానపరిచారు. తక్షణమే మహిళలందరికీ మంత్రి సవిత క్షమాపణ చెప్పాలి.ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ..‘సోషల్ మీడియా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోంది. అమాయకులను స్టేషన్లకు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు, పవన్, హోంమంత్రి చెబుతున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన పెట్టిన తప్పుడు పోస్టులపై ఎందుకు మాట్లాడరు. మంత్రులను చెప్పులతో కొడతానని పవన్ మాట్లాడలేదా?. వైఎస్ జగన్‌పై నోటికొచ్చినట్లు పవన్ మాట్లాడలేదా?. పవన్ కళ్యాణ్ చేసింది నేరం కాదా?. మేం మాట్లాడితేనే నేరమా?. ప్రజా గొంతుకై మాట్లాడితే మాగొంతు నొక్కేస్తారా. కేసులకు మేం భయపడం.. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం అని అన్నారు. -
మహిళలపై మంత్రి సవిత అభ్యంతరకర వ్యాఖ్యలు
అమరావతి, సాక్షి: శాసన మండలిలో ఇవాళ ఏపీ మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గతంలో టీబీటీ(Direct Benefit Transfer)నిధుల ద్వారా వచ్చిన సొమ్ముతో.. రాష్ట్రంలో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారని అన్నారామె.జగన్మోహన్రెడ్డి టీబీటీ పథకాల వల్ల రాష్ట్రంలో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారు అంటూ మంత్రి సవిత ప్రసంగించారు. దీంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించ పరిచేలా మంత్రి సవిత మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు..మంత్రి సవిత వ్యాఖ్యలు పై చైర్మన్ మోషేన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శాంతిచకపోవడంతో మండలిని వాయిదా వేశారాయన. ఇదిలా ఉంటే.. నిన్న ఇదే మండలిలో మెడికల్ కాలేజీలపై చర్చ సమయంలో హజ్ యాత్రను ఉద్దేశించి మంత్రి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు సైతం తీవ్ర దుమారం రేపాయి. -
మంత్రి సవిత Vs ఎంపీ పార్థసారథి.. మరోసారి భగ్గుమన్న విభేదాలు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. రొద్దంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి సవిత ఆవిష్కరించగా, ఎంపీ బీకే పార్థసారథిని ఎందుకు ఆహ్వానించలేదంటూ ఆయన వర్గీయుల నిరసనకు దిగారు. హిందూపురం టీడీపీ ఎంపీ బీకే పార్థసారథి వర్గీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి మధ్య అధిపత్య పొరు కొనసాగుతోంది.కాగా, పెనుకొండ నియోజకవర్గంలో అన్నింటా ఆధిపత్యం చాటుకోవాలని మంత్రి ప్రయత్నిస్తుండగా.. పట్టు నిలుపుకోవాలని బీకే వ్యూహాలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కేడర్ రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఇదివరకే ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడిగానూ ఉన్న బీకే పార్థసారథిని కాదని సవిత ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని గెలిచిన సంగతి తెలిసిందే.మంత్రి పదవినీ కూడా దక్కించుకున్న సవిత.. ప్రస్తుతం ఆమె నియోజకవర్గంలో తన వర్గాన్ని బలోపేతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం మద్యం షాపుల టెండర్లలో సైతం ఎంపీ వర్గీయులు పాల్గొనకూడదంటూ మంత్రి వర్గీయులు అడ్డుపడటంతో గతంలో పెనుకొండ ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణ తలెత్తిన సంగతి తెలిసిందే. -
మంత్రి వర్సెస్ ఎంపీ
పెనుకొండ: మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి మధ్య వర్గపోరు తీవ్ర రూపం దాల్చుతోంది. సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందే ప్రారంభమైన ఈ వర్గపోరు ప్రస్తుతం ముదిరి పాకాన పడుతోంది. పెనుకొండ నియోజకవర్గంలో అన్నింటా ఆధిపత్యం చాటుకోవాలని మంత్రి ప్రయత్నిస్తుండగా.. పట్టు నిలుపుకోవాలని బీకే వ్యూహాలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కేడర్ రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఇదివరకే ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడిగానూ ఉన్న బీకే పార్థసారథిని కాదని సవిత ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని గెలిచారు. మంత్రి పదవినీ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె నియోజకవర్గంలో తన వర్గాన్ని బలోపేతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. చౌక దుకాణాల డీలర్íÙప్పులు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, వివిధ పనులకు సంబంధించిన కాంట్రాక్టులు, పోలీసుస్టేషన్లో పంచాయితీలు ..ఇలా ప్రతి దాంట్లోనూ తన వర్గీయులకే పెద్దపీట వేస్తున్నారు. చివరకు ఉద్యోగుల బదిలీల్లోనూ తన మాటే నెగ్గేలా చూసుకున్నారు. ప్రస్తుతం మద్యం షాపుల టెండర్లలో సైతం ఎంపీ వర్గీయులు పాల్గొనకూడదంటూ మంత్రి వర్గీయులు అడ్డుపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం పెనుకొండ ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణ తలెత్తింది. పట్టు కోసం బీకే ప్రయత్నాలు అన్నింటా తన పెత్తనమే సాగేలా మంత్రి సవిత వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ బీకేతో పాటు ఆయన వర్గీయులు రగిలిపోతున్నారు. నియోజకవర్గంలో ఎలాగైనా తన పట్టు నిలుపుకోవాలని బీకే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మద్యం టెండర్లలో తన వర్గీయులను మంత్రి అనుచరులు అడ్డుకోవడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన.. పెనుకొండలోని తన స్వగృహంలో మకాం వేసి పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి తన వర్గీయులూ దరఖాస్తులు వేసేలా చొరవ తీసుకున్నారు. అన్ని షాపులూ తమకే దక్కుతాయని అప్పటి వరకు సంతోషంగా ఉన్న మంత్రి వర్గీయులు.. పోలీసుల సహకారంతో బీకే వర్గీయులు కూడా పోటీగా దరఖాస్తులు వేయడంతో కంగుతిన్నారు. ఈ వ్యవహారం మద్యం షాపులు కేటాయించేనాటికి ఎటు వెళుతుందోనని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. సామాజిక వర్గాలపై కన్ను హిందూపురం ఎంపీగా గెలిచినప్పటికీ సొంత ఇలాకా పెనుకొండలో తన మార్కు రాజకీయం కొనసాగించడానికి బీకే పార్థసారథి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఎంపీ ల్యాడ్స్ నిధులనే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి పనులు చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. అలాగే బలమైన సామాజిక వర్గాల వారికి అవసరమైన పనులు చేసిపెట్టి.. వారి అండ కోసమూ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పరిగిలో వాల్మీకి కల్యాణ మండపానికి రూ. కోటి, సోమందేపల్లిలో ఉప్పర (సగర) కులస్తుల కల్యాణ మండపానికి రూ.కోటి మంజూరు చేయించినట్లు చర్చ సాగుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన మంత్రి సవిత అనుచరులు సోమందేపల్లిలో స్థల వివాదం ముందుకు తీసుకురావడంతో శంకుస్థాపన ఆగిపోయింది. అనంతరం సగర కులస్తులు ఎంపీని కలసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. నోరు మెదపని పార్టీ పెద్దలు పెనుకొండ నియోజకవర్గంలో ఎంపీ బీకే, మంత్రి సవిత మధ్య వర్గ పోరు విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఇతర ముఖ్య నేతల దృష్టికి వెళ్లినా ఎవరూ నోరు మెదపడం లేదన్న చర్చ పార్టీ నాయకుల్లో సాగుతోంది. అయితే..ఇక్కడి పరిణామాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. -
మంత్రి సవితమ్మ అండతో రెచ్చిపోతున్న కలప దొంగలు..
-
మంచి ఫిటింగ్, డిజైన్, ప్రింట్లతో.. ఈ తరం మెచ్చేలా డ్రెస్ డిజైనింగ్..
ఇంటి పనులతోనే రోజంతా గడిచిపోతుంటుంది. అభిరుచిని మెరుగుపరుచుకోవాలన్నా సమయమే సరిపోదనిపిస్తుంది. కానీ, కొందరు మాత్రమే ఉన్న కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమతోపాటు మరికొందరికి ఉపాధి అవకాశాలను అందిస్తుంటారు. ఈ కోవకే చెందుతారు సవిత ఆలంపల్లి. తెలంగాణలోని జహీరాబాద్ వాసి అయిన సవిత కాటన్ ఫ్యాబ్రిక్‌పైన సహజసిద్ధమైన పువ్వులు, ఆకులతో సహజమైన ప్రింట్లను తీసుకువస్తుంది. అదే ఫ్యాబ్రిక్‌ని ఉపయోగిస్తూ మోడ్రన్ డ్రెస్సులను డిజైన్ చేస్తోంది. వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ, బెంగళూరులో స్టూడియో ఏర్పాటు చేసి, సెల్ఫ్ మేడ్ బిజినెస్ ఉమన్‌గా తనని తాను నిరూపించుకుంటుంది. ఆసక్తిని ఉపాధిగా మలుచుకునేందుకు చేసిన ప్రయాణంలో తాను వేసిన అడుగుల గురించి ఆనందంగా వివరించింది.‘‘డిగ్రీ వరకు చదువుకున్న నేను పెళ్లయ్యాక మావారు రామకృష్ణతో కలిసి అమెరికాకు వెళ్లాను. గృహిణిగానే కొన్నాళ్లు ఉండిపోయాను. న్యూయార్క్ ఎఫ్ఐటిలో ఫ్యాషన్ డిజైనింగ్‌కి సంబంధించిన కోర్స్ చేశాను. పదేళ్ల క్రితం ఇండియా వచ్చి బెంగళూరులో స్థిరపడ్డాం. రోజంతా ఇంటిపనులు, పిల్లల పనులు ఉన్నా నా కోసం కొంత సమయాన్ని కేటాయించుకునేదాన్ని.ఫాస్ట్ ఫ్యాషన్‌లో ఉపయోగించే ఫ్యాబ్రిక్ తీవ్రమైన కాలుష్యానికి గురి చేస్తుందని తెలుసుకున్నాను. అప్పటినుంచి నా వంతుగా ఏదైనా చేయాలనుకుని ప్రయత్నాలు చేస్తుండేదాన్ని. ఫ్లోర్ క్లీనర్స్, సుగంధ ద్రవ్యాలు వంటివి ఇంట్లో తయారు చేస్తుండేదాన్ని. వాటివల్ల ఇంట్లో వాళ్లు కూడా చాలా మెచ్చుకునేవారు. ఎకో ప్రింటింగ్, సస్టెయిన్‌బుల్ ఫ్యాబ్రిక్స్ పైన వర్క్ చేయడం మొదలుపెట్టాను. ప్రకృతి ద్వారా లభించే వస్తువులతో రోజూ ఏదో ఒక ప్రయోగం చేస్తుండేదాన్ని. ఆకులు – పువ్వులు..పూజలు, ఇతర సంప్రదాయ వేడుకలలో పువ్వులు, ఆకులను కూడా ఉపయోగిస్తుంటాం. సాధారణంగా వాటిని ఉడకబెట్టి, టై అండ్ డై చేస్తుంటారు. నేను వాటిని ఎండబెట్టి, కొన్నింటిని తాజాగా ఉన్నప్పుడే ఫ్యాబ్రిక్ మీద చల్లి, దగ్గరగా చుట్టి, కొన్ని రోజులు అలాగే ఉంచి ప్రయోగాలు చేసేదాన్ని. ప్రయత్నాలు చేయగా చేయగా ఫ్యాబ్రిక్‌పైన రకరకాల డిజైన్స్ అమితంగా నన్ను ఆకట్టుకున్నాయి. మోదుగ, శంఖపుష్ప, పారిజాత.. వంటివే కాదు అరుదుగా పూసే పువ్వులనూ సేకరిస్తాను. వాటిని ఎండబెట్టి నిల్వ ఉంచుతాను. మామిడి, జామ, మందార ఆకులనూ డిజైన్‌కు వాడుతుంటాను. ఏ మాత్రం రసాయనాలు లేని ప్రయోగం ఇది.ఇంటి నుంచి స్టూడియో వరకు..రసాయనాలతో పండించే పత్తి కాకుండా వర్షాధార పంటద్వారా వచ్చే కాటన్ ఫ్యాబ్రిక్‌ను కలెక్ట్ చేసి, నా ప్రయత్నాలను ఇంకా విరివిగా చేయడం మొదలుపెట్టాను. సస్టెయిన్‌బుల్ డ్రెస్సులు అంటే చాలావరకు వదులుగా ఉండే దుస్తులు అనుకుంటారు. కానీ, మంచి ఫిటింగ్, డిజైన్, ప్రింట్లతో ఈ తరం మెచ్చేలా డ్రెస్ డిజైనింగ్ చేయాలనుకున్నాను.కార్పొరేట్ ఉమెన్‌కు నప్పే విధంగా, అలాగే టీనేజ్ కలెక్షన్స్ కూడా ప్రిపేర్ చేస్తుంటాను. ఎకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్, ప్రింటింగ్.. డ్రెస్సులు ధరిస్తే ఒంటికి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. ప్రకృతికి దగ్గరగా ఉన్నామన్న అనుభూతి సొంతం అవుతుంది. ఏడెనిమిదేళ్లుగా సస్టెయినబిలిటీ మీద రకరకాల ప్రయోగాలు చేసి, ఐదేళ్ల క్రితం ‘టింక్టోరియా’ పేరుతో బెంగళూరులో స్టూడియో ఏర్పాటు చేశాను. ఆకులలో ఉండే జీవాన్ని టింక్టోరియా అంటారు.దానిని ఫ్యాబ్రిక్ మీదకు తీసుకురావాలని చేసిన ప్రయత్నం కాబట్టి అదే పేరును నా డిజైన్స్‌కు పెట్టాను. ఇంటినుంచి స్టూడియోదాకా మారేందుకు చేసిన రకరకాల ప్రయోగాల వల్ల ఇప్పుడు నాతోపాటు మరో ఐదుగురు మహిళలకు ఉపాధి అవకాశాలు లభించాయి. మేమంతా కలిసి ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌కు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం పని చేస్తుంటాం.అవగాహనకు వర్క్‌షాప్స్..ఎకోప్రింటింగ్ పట్ల ప్రజలలో అవగాహన కల్పించడానికి హైదరాబాద్, బెంగళూరు ఇతర క్రాఫ్ట్ ఎగ్జిబిషన్స్లలో ఉచితంగా వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాను. స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటాను. అక్కడి వచ్చి, ఆసక్తితో నేర్చుకుంటాను అనేవారు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి ప్రింటింగ్ ్రపాసెస్ అడుగుతుంటారు. చాలా మందికి ఆకులతోనూ, పువ్వులతోనూ డిజైన్ చేస్తారని తెలియదు. ఈ డిజైన్ ఉతికితే పోతుందేమో అనుకుంటారు. కానీ, సరైన విధంగా చేస్తే రంగు ఏ మాత్రం పోదు.ముందు కుంకుడుకాయ రసంతో ఫ్యాబ్రిక్‌ను శుభ్రం చేస్తాం. ఆ తర్వాత ఆకులను, పువ్వులను అనుకున్న డిజైన్స్‌లో అమర్చి, దగ్గరగా చుట్టి, ఆవిరిమీద ఉంచుతాం. ఆ తర్వాత బయటకు తీసి, ఒకరోజంతా అలాగే ఉంచుతాం. ఆ తర్వాత పూర్తిగా విప్పి, క్లాత్‌ని శుభ్రం చేస్తాం. సరైన డిజైన్ రావడానికి 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది. షిబోరి, టై అండ్ డై, కలంకారీ డిజైన్స్‌తోపాటు నేతకారులతో ముందే మాట్లాడి ఫ్యాబ్రిక్ డిజైన్‌లో మోటిఫ్ ప్రింట్స్ వచ్చేలా గైడెన్స్ ఇస్తుంటాను.కొన్ని రకాల ఆకులు, పువ్వుల ప్రింటింగ్‌లో థ్రెడ్ వర్క్ కూడా ఉంటుంది. ప్రకృతిపైన ప్రేమ, ఇష్టంతో నన్ను నేను కొత్తగా మార్చుకునే క్రమంలో ఎంచుకున్న మార్గం ఇది. ఇంట్లో వాడాల్సిన కెమికల్స్ స్థానంలో ఏ మాత్రం రసాయనాలు లేని వస్తువులను తయారు చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటాను. ఈ విధానం వల్ల ఐదారేళ్లలో నాదైన ఓ కొత్త ప్రపంచాన్ని నిర్మించుకున్నాను అనిపిస్తుంది’ అని ఆనందంగా వివరిస్తారు సవిత. – నిర్మలారెడ్డిఇవి చదవండి: Devika Manchandani: పాకశాస్త్ర ప్రవీణ! వంటలపై ఇష్టం ఎక్కడిదాకా వెళ్లిందంటే? -
సైకిల్లో అనంత ఘోష.. కిష్టప్పతో ఆయనకు కష్టమేనా? తారాస్థాయికి టికెట్ పంచాయితీ!
పార్టీ పాతాళంలో ఉన్నా.. నాయకుల మధ్య ఫైటింగ్ మాత్రం తప్పడంలేదట పచ్చ పార్టీలో. ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగు తమ్ముళ్ళు శత్రువుకు శత్రువు.. తనకు మిత్రుడు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టిక్కెట్ తనకు ఇవ్వకపోతే తన మనిషికైనా ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీలోని శత్రువుకు మాత్రం ఇవ్వవద్దని గట్టిగా చెబుతున్నారట. ఇంతకీ ఆ శత్రువులు, మిత్రులు ఎవరో చూద్దాం. సారథికి సొంత పార్టీనుంచే వెన్నుపోటు ఒకప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో భాగంగా ఉన్న శ్రీసత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బీకే పార్థసారథి వ్యవహరిస్తున్నారు. ఈయన గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా జెడ్పీ ఛైర్మన్ గా, హిందూపురం ఎంపీగా, పెనుకొండ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ప్రస్తుతం పెనుకొండ నియోజకవర్గం పార్టీ ఇంఛార్జిగా కూడా వ్యవహరిస్తున్న బీకే పార్థసారథికి సొంతపార్టీ నేతలే కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కూతురు, కురుబ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సవిత ఇప్పుడు బీకే పార్థసారథికి చుక్కలు చూపిస్తున్నారు. పెనుకొండ నియోజకవర్గంలో సవిత విస్తృతంగా పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు తనకే టిక్కెట్ ఇస్తున్నట్లు ఆమె ప్రచారం చేసుకుంటున్నారు. తమ్ముళ్ల కళ్లలో టిక్కెట్ల ఆనందం మరోవైపు హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా చాలాకాలంగా పెనుకొండ నియోజకవర్గంపై కన్నేశారు. ఆయన సొంత ఊరు గోరంట్ల పెనుకొండ నియోజకవర్గ పరిధిలోకి రావడంతో తనకు ఎంపీ టిక్కెట్ వద్దు. పెనుకొండ అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని నిమ్మల కిష్టప్ప పార్టీ అధినేతను కోరారు. ఒకవేళ తనకు టిక్కెట్ ఇవ్వని పక్షంలో సవితకు మద్దతు ఇవ్వాలని తాజాగా మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప భావిస్తున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాను ఎంపీగా ఉన్న సమయంలో బీకే పార్థసారథి తనను ఏ మాత్రం పట్టించుకోలేదని. కనీసం ప్రొటోకాల్ కూడా పాటించకుండా అవమానించినందున పార్థసారథికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పార్టీ శ్రేణులతో స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో టీడీపీ మహిళా నేత సవిత దూకుడుగా ముందుకెళ్తున్నారు. పార్థసారథికి పోటీగా పెనుకొండలో ప్రత్యేకంగా టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా మద్దతు ఇస్తున్నందున ఖచ్చితంగా తనకే టిక్కెట్ వస్తుందని ఆమె చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలపై బీకే పార్థసారథి కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేనే గొప్ప.. నాకే కావాలి గత పాతికేళ్లుగా టీడీపీలో ఉంటూ అనేక పదవులు అనుభవించానని ఇప్పుడు కూడా శ్రీసత్యసాయి జిల్లా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తూ పెనుకొండ ఇంఛార్జి బాధ్యతలు చూస్తున్న తనకే అధిష్టానం ఆశీస్సులు ఉంటాయని బీకే పార్థసారథి భావిస్తున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నందున తన అనుమతితోనే ఎవరైనా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని లేకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ తనకు వ్యతిరేకంగా సవిత, నిమ్మలకిష్టప్ప గ్రూపులు పనిచేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు చంద్రబాబు, నారా లోకేష్ వద్ద ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నట్లు పెనుకొండ టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
సవిత శ్రీ అరుదైన ఘనత.. నిరాశపరిచిన హారిక! ఐదో స్థానంలో అర్జున్
FIDE World Rapid Championship- అల్మాటీ (కజకిస్తాన్): ‘ఫిడే’ ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో మహిళల ఈవెంట్లో భారత్‌కు చెందిన 15 ఏళ్ల టీనేజర్ సవిత శ్రీ గ్రాండ్మాస్టర్లను ఢీకొట్టి కాంస్య పతకం సాధించింది. విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి తర్వాత వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన మూడో భారత క్రీడాకారిణిగా సవిత శ్రీ నిలిచింది. మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ అయిన సవిత ఈ టోర్నీలో 36వ సీడ్‌గా బరిలోకి దిగి మూడో స్థానంలో నిలిచింది. బుధవారం జరిగిన మూడు రౌండ్లలో ఆమె 1.5 పాయింట్లు సాధించింది. దీంతో మొత్తం 8 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది. తొమ్మిదో రౌండ్లో జాన్సయ అబ్దుమలిక్ (కజకిస్తాన్) చేతిలో ఓడటంతో ఆమె రజత అవకాశానికి గండి పడింది. నిరాశపరిచిన హారిక పదో రౌండ్లో క్వియాన్యున్ (సింగపూర్)పై గెలిచిన సవిత... ఆఖరి రౌండ్లో దినార సదుకసొవా (కజకిస్తాన్)తో గేమ్‌ను డ్రా చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ సీనియర్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి కూడా 8 పాయింట్లు సాధించినప్పటికీ సూపర్ టై బ్రేక్ స్కోరు ఆధారంగా ఏపీ అమ్మాయి ఆరో స్థానంలో నిలిచింది. ద్రోణవల్లి హారిక 29వ స్థానంతో నిరాశపరిచింది. విజేత కార్ల్సన్ ఓపెన్ కేటగిరీలో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ (9) ఐదో స్థానంలో నిలిచాడు. 8 రౌండ్లలో గెలిచి 3 ఓడిన అర్జున్ 2 రౌండ్లు డ్రా చేసుకున్నాడు. ఈ విభాగంలో ఇందులో ప్రపంచ నంబర్‌వన్, చాంపియన్ కార్ల్సన్ (10) విజేతగా నిలిచాడు. భారత సీనియర్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 77వ స్థానంలో నిలిచాడు. చదవండి: IND v SL 2023: విరామం... విశ్రాంతి... వేటు..! Ind Vs SL T20 Series: సెంచరీ బాదినా కనబడదా? నువ్వు ఐర్లాండ్ వెళ్లి ఆడుకో! ఇక్కడుంటే.. -
శ్రీసత్యసాయి జిల్లా: టీడీపీ నేత సవిత ఇంట్లో తనిఖీలు చేస్తున్న సీబీఐ
-
టీడీపీ నేత సవిత ఇంట్లో సీబీఐ అధికారుల సోదాలు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: పెనుకొండలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. టీడీపీ నేత సవిత ఇంట్లో సీబీఐ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. బెంగళూరు నుంచి సీబీఐ అధికారులు నేరుగా టీడీపీ నేత సవిత ఇంటికి చేరుకున్నారు. సోదాల్లో ఇప్పటికే పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సవితకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. రైల్వే కాంట్రాక్టు పనుల్లో అక్రమాలపై భాగంగానే ఈ సోదాలు చేపట్టారు. టీడీపీ నేత సవిత భర్త వెంకటేశ్వరరావు రైల్వే కాంట్రాక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. -
టీడీపీ నేత సవిత ఇంట్లో సీబీఐ తనిఖీలు
-
భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌గా సవిత
న్యూఢిల్లీ: భారత హాకీ రెగ్యులర్ కెప్టెన్ రాణి రాంపాల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) మహిళల ప్రొ లీగ్‌లో స్పెయిన్‌తో జరిగే పోటీలకూ దూరమైంది. దీంతో సీనియర్ గోల్‌కీపర్ సవితకే జట్టు పగ్గాలు అప్పగించారు. సొంతగడ్డపై జరిగే లీగ్ పోరులో సవిత నేతృత్వంలోని భారత మహిళల జట్టు స్పెయిన్‌ను ఎదుర్కొంటుంది. ఈ నెల 26, 27 తేదీల్లో భువనేశ్వర్‌లో ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మహిళల హాకీ జట్టు: సవిత (కెప్టెన్), దీప్గ్రేస్ ఎక్కా, గుర్జీత్ కౌర్, నిక్కీ ప్రధాన్, ఉదిత, ఇషిక చౌదరి, రజని, బిచుదేవి, నిషా, సలిమా టేటే, సుశీలా చాను, జ్యోతి, మోనిక, నేహా, నవ్‌జ్యోత్ కౌర్, నమిత టొప్పొ, వందన కటారియా, షర్మిలా, నవ్‌నీత్ కౌర్, లాల్రెమ్సియామి, సంగీత, రాజ్విందర్ కౌర్. స్టాండ్‌బైలు: రష్మిత, అక్షత, సోనిక, మరియాన, ఐశ్వర్య. -
అందుకే ఇన్ని సాహసాలు చేస్తున్నాను: సవితారెడ్డి
‘‘జీవితంలో ఏదీ అసాధ్యం కాదు. అన్నీ సుసాధ్యమే. నూటికి నూరుపాళ్లు అనుకున్నది సాధించవచ్చు. నీ కలను నిజం చేసుకోవడానికి నీవే శ్రమించాలి. లక్ష్యాన్ని చేరే వరకు నీ ప్రయత్నాన్ని ఆపవద్దు. అప్పుడు విజయం నీదై తీరుతుంది. అనారోగ్యం నిన్ను చూసి పారిపోతుంది. ఇందుకు అసలైన నిర్వచనం ఈ సాహసి జీవితం. ‘‘సాహసం చేయకపోతే జీవితంలో అనేక అనుభవాలకు, ఆనందాలకూ దూరంగా ఉండిపోతాం. అందుకే సాహసించాల్సిందే’’ అంటున్న ఈ సాహసి పేరు సవితారెడ్డి. ఆమె ఫ్యాషన్ డిజైనర్, అడ్వెంచరస్ టూరిస్ట్. హైదరాబాద్ కొంపల్లిలో ఉంటారు. మసాబ్ ట్యాంకు నుంచి రాజేంద్రనగర్, హెచ్‌సీయూ, నార్సింగి, రోడ్ నంబర్ 45 నుంచి ఐకియా, ఖాజాగూడల్లో ఉదయం పూట జనసంచారం తక్కువగా ఉన్న సమయంలో విశాలమైన రోడ్ల మీద సైక్లింగ్ చేస్తూ కనిపిస్తారు. ఈమె గత ఏడాది రెండు కాళ్లకు సర్జరీ చేయించుకున్నారు. ఫిట్నెస్ను తిరిగి సాధించుకోవడానికి సైక్లింగ్ ప్రాక్టీస్ చేస్తూ కశ్మీర్‌లోని ‘గ్రేట్ లేక్స్ ఆఫ్ కశ్మీర్’ట్రెకింగ్ టూర్‌కి సిద్ధమవుతున్నారు. మహిళకు సెలవేది? ఒక సామాన్యమైన కుటుంబం లో మహిళ జీవితం ఎలా ఉంటుంది? పిల్లల స్కూళ్లకు, కాలేజ్‌లకు సెలవులుంటాయి. భర్త ఆఫీస్‌కి సెలవులుంటాయి. తనకు మాత్రం సెలవు ఉండదు. తనకంటూ ఒక ఆటవిడుపు ఉండాలని కోరుకున్నా సరే సాధ్యపడదు. ఆ మహిళ గృహిణి అయినా ఉద్యోగి అయినా, ఎంటర్ప్రెన్యూర్ అయినా సరే... ఈ కుటుంబచిత్రమ్లో పెద్ద తేడా ఏమీ ఉండదు. మహిళలు ఆ రొటీన్ నుంచి బయటకు వచ్చి కొద్దిగా రెక్కలు తగిలించుకోవాలంటారు సవిత. ఈ విషయంలో హైదరాబాద్ మహిళ ఓ అడుగు ముందుకేసిందని కూడా అన్నారామె. మహిళ తన సంతోషం కోసం ఇంకా ఇంకా గొంతు విప్పాలనేదే నా కోరిక. అందుకే ఇన్ని సాహసాలు చేస్తున్నాను. మరింత మందిని ప్రోత్సహిస్తున్నానని చెప్పారు సవిత. దేశమంతా పెరిగాను! సవిత తండ్రి ఎయిర్‌ఫోర్స్ అధికారి కావడంతో ఆమె బాల్యం దేశంలోని అనేక ప్రదేశాల్లో సాగింది. దాదాపుగా ముప్పై ఏళ్ల కిందట ఫ్యాషన్ డిజైనింగ్ ఒక కోర్సు రూపంలో యూనివర్సిటీ కరిక్యులమ్‌లో చేరిన తొలి రోజుల్లో, ఏ మాత్రం ఉపాధికి భరోసా కల్పించలేని ఆ కోర్సులో చేరాలనుకోవడమే పెద్ద సాహసం. అలాంటి రోజుల్లో ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారామె. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో సొంతంగా తన పేరుతోనే ఫ్యాషన్ డిజైనింగ్ యూనిట్ ప్రారంభించారు. ‘‘పాతికేళ్ల పాటు చాలా సీరియెస్‌గా ఫ్యాషన్ ఇండస్ట్రీ కోసం పని చేశాను. నా యూనిట్ చూసుకుంటూ మధ్యలో కార్ ర్యాలీలు, ట్రెక్కింగులతో జీవితాన్ని సంతోషంగా గడిపాననే చెప్పాలి. 2017లో ఎవరెస్ట్ బేస్ క్యాంపు అధిరోహించాను. అయితే అన్ని రోజులూ ఒకేరకంగా ఉండవు కదా! ఆ తర్వాతి ఏడాది కాళ్లు నాకు పరీక్ష పెట్టాయి. మాల్ అలైన్మెంట్ సమస్యతో బౌడ్ లెగ్స్గా మారిపోయాయి. ట్రెకింగ్ కాదు కదా మామూలుగా నడవడం కూడా కష్టమైంది. ఆ క్షణంలో నేను రిస్క్ తీసుకోవడానికే సిద్ధమయ్యాను. హై టిబియల్ ఆస్టియోటమీ సర్జరీ చేయించుకున్నాను. మోకాళ్ల నుంచి మడమల మధ్య ఉండే ఎముకను వంపు తీసి సరిచేసి ప్లేట్ అమర్చి స్క్రూలతో బిగిస్తారన్నమాట. గత ఏడాది ఆగస్టులో ఒక కాలికి, నవంబరులో మరో కాలికి సర్జరీ అయింది. కొంతకాలం వీల్ చెయిర్‌కి పరిమితమయ్యాను. తర్వాత వాకర్‌తో రోజులు గడిచాయి. ఇక ఇప్పుడు నా ఫిట్‌నెస్‌ని తిరిగి తెచ్చుకోవాలి. అందుకే ఈ సైక్లింగ్. వారంలో మూడు రోజులు సైక్లింగ్ రోజుకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు, మరో మూడు రోజులు గంటపాటు వాకింగ్... ఇదీ ఇప్పుడు నా రొటీన్. ఈ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో కశ్మీర్లో ట్రెకింగ్‌కి సిద్ధమవుతున్నాను’’ అని చెప్పారు సవిత. ఇంత సాహసం అవసరమా? ‘‘నలభై ఎనిమిదేళ్ల వయసులో ఆ సర్జరీ అవసరమా, మందులతో రోజులు వెళ్లదీయవచ్చు కదా’ అని అడిగే వాళ్లకు నేను చెప్పే సమాధానం ‘అవసరమే’ అని. ఏ వయసులోనైనా మనిషి జీవితం తన చేతుల్లోనే ఉండాలి. అనారోగ్యం కారణంగా మరొకరి మీద ఆధారపడే పరిస్థితిలోకి జారిపోకూడదు. పైగా నలభై ఎనిమిది అంటే... అభిరుచులను కట్టిపెట్టి జీవితాన్ని నిస్సారంగా గడిపే వయసు కాదు. నాకు ఇష్టమైన కార్ ర్యాలీ, ట్రెకింగ్ వంటివేవీ చేయలేనప్పుడు, భారంగా అడుగులేసుకుంటూ రోజులు గడిపే జీవితం నాకు అవసరమా... అనేది నా ప్రశ్న. అందుకే ఈ సర్జరీలో సక్సెస్ రేట్ ఫిఫ్టీ– ఫిఫ్టీ అని తెలిసినప్పటికీ నేను రిస్క్ తీసుకోవడానికే సిద్ధపడ్డాను. మనం అనుకున్నట్లు జీవించడానికి అనారోగ్యాన్ని అధిగమించడానికి మొదట మానసికంగా సిద్ధం కావాలి. ఇప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా, ఫిట్‌గా ఉన్నాను. నా డిజైనింగ్ స్టూడియోని నడుపుకుంటున్నాను. నా ట్రెకింగ్ ఇంటరెస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోగలను కూడా’’ అని ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వుతో చెప్పారు సవిత. – వాకా మంజులారెడ్డి -
మాస్కులు తయారు చేసిన భారత ప్రథమ మహిళ
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రథమ మహిళ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సతీమణి సవితా కోవింద్ కరోనాపై వ్యతిరేక పోరులో తనవంతు చేయూతను అందించారు. కరోనా మహమ్మారిపై భారత్ చేస్తున్న కృషికి ఆమె బాసటగా నిలిచారు. నిరాశ్రయుల కోసం బుధవారం రాష్ట్రపతి భవన్‌లోని శక్తి హాత్ వద్ద స్వయంగా కుట్టు మిషన్‌పై ఫేస్ మాస్క్‌లు కుట్టారు. వీటిని ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డు ద్వారా వివిధ ప్రదేశాలలో ఆశ్రయం పొందుతున్న వారికి అందజేయనున్నారు. సవితా స్వయంగా మాస్కులు తయారు చేస్తూ.. కరోనాపై వ్యతిరేక పోరాటంలో దేశంలోని ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలనే సందేశాన్ని ఇచ్చారు. అయితే మాస్కులు కుడుతున్న సమయంలోనూ ఆమె ముఖానికి మాస్కు ధరించడం విశేషం. ( ఆ ఎడిటర్‌ను పెళ్లి చేసుకోవాలని ఉంది: వర్మ) ఇక దేశ వ్యాప్తంగా కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. 130 కోట్ల మందికి పైగా ఉన్న దేశంలో కరోనాను కట్టడి చేయడం కత్తి మీద సాములాగా తయారయింది. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు దేశంలో మే 3 వరకు లాక్డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అలాగే ప్రతి ఒక్కరూ భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత, ముఖానికి మాస్క్‌లు ధరించడం వంటి ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని వైద్యులు తెలియజేస్తూనే ఉన్నారు. కాగా భారత్‌లో కరోనా కేసులు గురువారం ఉదయం నాటికి 20, 471 నమోదవ్వగా.. 652 మంది మృత్యువాత పడ్డారు. 3960 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. (‘రాజీనామా చేయమంటున్నారు.. కానీ..’ ) -
ఇంగ్లండ్‌తో హాకీ సిరీస్‌కు రజని
న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇతిమరపు రజని తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈనెల 27 నుంచి అక్టోబర్ 4 వరకు ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టును శుక్రవారం ప్రకటించారు. స్టార్ ఫార్వర్డ్ రాణి రాంపాల్ కెప్టెన్‌గా, గోల్‌కీపర్ సవిత వైస్ కెపె్టన్‌గా నియమితులయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన రజని జట్టులో రెండో గోల్‌కీపర్‌గా వ్యవహరిస్తుంది. గాయం కారణంగా ఆటకు దూరమైన మిడ్‌ఫీల్డర్ నమిత టొప్పొ పునరాగమనం చేసింది. ఇటీవల టోక్యోలో జరిగిన ఒలింపిక్ టెస్టు ఈవెంట్ విజేతగా నిలిచిన భారత్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ముఖ్యంగా రాణి రాంపాల్, గుర్జీత్ కౌర్, నవ్‌నీత్ కౌర్‌లు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. జట్టు వివరాలు: రాణి రాంపాల్ (కెపె్టన్), సవిత (వైస్ కెపె్టన్), ఇతిమరపు రజని, దీప్ గ్రేస్ ఎక్కా, గుర్జీత్ కౌర్, రీనా ఖోఖర్, సలీమా తెతె, సుశీలా చాను, నిక్కీ ప్రధాన్, మోనిక, నేహా గోయల్, లిలిమా మింజ్, నమిత, వందన, నవ్‌నీత్ కౌర్, నవ్‌జ్యోత్ కౌర్, షరి్మలా దేవి, లాల్రెమ్సియామి. -
స్వర్ణాలు నెగ్గిన గుకేశ్, సవితశ్రీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత చెస్ క్రీడాకారులు మెరిశారు. స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ క్యాడెట్ చెస్ చాంపియన్‌షిప్ అండర్ –12 ఓపెన్ విభాగంలో డి.గుకేశ్... బాలికల విభాగంలో సవితశ్రీ స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత గుకేశ్ 10 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చెన్నైకు చెందిన 12 ఏళ్ల గుకేశ్ కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గుకేశ్ మొత్తం పది విజయాలు సాధించి, ఒక గేమ్‌లో ఓడిపోయాడు. అండర్–12 బాలికల విభాగంలో చెన్నై అమ్మాయి సవితశ్రీ 10 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. ఆమె తొమ్మిది గేమ్‌ల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకుంది. ఈ మెగా ఈవెంట్లో అండర్–8, అండర్–10, అండర్–12 విభాగాల్లో పోటీలను నిర్వహించారు. 86 దేశాల నుంచి 861 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఓవరాల్‌గా చైనా రెండు స్వర్ణాలు, కాంస్యంతో తొలి స్థానంలో నిలువగా... రెండు స్వర్ణాలతో భారత్ రెండో స్థానంలో... స్వర్ణం, రజతం, రెండు కాంస్యాలతో అమెరికా మూడో స్థానంలో నిలిచాయి. -
ఆబార్షన్లపై ఐర్లాండ్‌లో రేపే రిఫరెండం
ఒక భారతీయ మహిళ విషాదభరితమైన మరణం ఐర్లాండ్ చట్టాలనే మారుస్తుందా ? గర్భస్రావంపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ఐరిష్ మహిళలు అయిదేళ్లుగా చేస్తున్న పోరాటం ఎలాంటి మలుపు తిరగబోతోంది ? ఐర్లాండ్‌లో అబార్షన్లపై నిషేధాన్ని రద్దు చేయాలా ? వద్దా ? అనే అంశంపై అత్యంత కీలకమైన రాజ్యాంగ సవరణకు వీలుగా ఈ నెల 25 శుక్రవారం రిఫరెండం జరుగుతున్న వేళ ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తల్లి ప్రాణంతో పాటు, పుట్టబోయే బిడ్డ ప్రాణానికి అత్యంత విలువను ఇస్తూ గర్భస్రావంపై అత్యంత కఠినమైన చట్టాలు ఇప్పటివరకు ఆ దేశంలో అమల్లో ఉన్నాయి. ఈ చట్టాల కారణంగా కర్ణాటకకు చెందిన సవిత హలప్పనవర నిండు ప్రాణం బలైపోయింది. ఆమె మృతి దేశంలో ఎందరినో కదలించడంతో ప్రభుత్వం రిఫరెండంకు సిద్ధమైంది. అయిదేళ్ల క్రితం ఏం జరిగిందంటే ? కర్ణాటకకు చెందిన దంత వైద్యురాలు సవిత హలప్పనవర (31) ఆమె భర్త ప్రవీణ్‌లు ఐర్లాండ్‌లో నివాసం ఉంటున్నారు. మూడో నెల గర్భవతిగా ఉన్న సవిత విపరీతమైన నడుం నొప్పి రావడంతో 2012 అక్టోబర్ 21న గాల్వే ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భస్రావం చెయ్యక తప్పనిపరిస్థితి ఏర్పడిందని నిర్ధారించారు. అయితే అప్పటికే గర్భస్థ శిశువు గుండెకొట్టుకోవడం ప్రారంభం కావడంతో చట్టపరంగా అబార్షన్ చేయడానికి వీల్లేదని భావించిన వైద్యులు సహజంగా గర్భస్రావం అయిపోతుందేమోనని రెండు, మూడు రోజులు వేచి చూశారు. ఈ లోపే ఆమె గర్భాశయానికి ఇన్ఫెక్షన్ సోకి సెప్టిక్‌గా మారి సవిత ప్రాణాల మీదకి వచ్చింది. దీంతో ఆమెకి మందుల ద్వారా అబార్షన్ చేశారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఐసీయూలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన సవిత అక్టోబర్ 28న తుది శ్వాస విడిచింది. ఐర్లాండ్‌లోని కఠినమైన చట్టాలే సవిత ప్రాణాలు తీశాయంటూ ఆమె కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. సవిత మృతితో దేశవ్యాప్తంగా మహిళలు రోడ్డెక్కారు. తల్లి ప్రాణం మీదకి వస్తున్నా లెక్కచేయకపోవడమేమిటంటూ నినదిస్తూ నిరసన ప్రదర్శనలకు దిగారు. చట్టాల్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటూ దేశవ్యాప్తంగా ఆ సమయంలో ఆందోళనలు మిన్నంటాయి. సవిత మృతిపై ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిషన్ గాల్వే ఆస్పత్రి సిబ్బందిని క్షుణ్ణంగా విచారించి సరైన సమయంలో అబార్షన్ చేసి ఉంటే సవిత ప్రాణాలు దక్కి ఉండేవని, గర్భస్రావం చట్టాన్ని సవరించాలంటూ గట్టిగా సిఫారసు చేసింది. మరోవైపు గర్భస్రావంపై నిషేధాన్ని సమర్థిస్తున్న కొందరు సంప్రదాయవాదులు సవిత కేసు సాకుతో చట్టాలను నీరుకార్చే ప్రయత్నం చేయవద్దంటూ నిరసనలకు దిగారు. దీంతో ప్రభుత్వం సవిత మృతి వెనుక నిజానిజాలను తెలుసుకోవడానికి రెండో కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ గాల్వే ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సవిత ప్రాణాలు పోయాయని నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం అబార్లషన్లపై ప్రజాభిప్రాయ సేకరించాలని నిర్ణయించింది. సవితను గుర్తుకు తెచ్చుకోండి : ఓటర్లకు తండ్రి విజ్ఞప్తి ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్న ఈ కాలంలో తమ కుమార్తె దేశం కాని దేశంలో అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో మరణించడం సవిత తల్లిదండ్రుల్ని కుంగదీసింది. తాము సర్వస్వాన్ని కోల్పోయి జీవచ్ఛవాల్లా బతుకుతున్నామని సవిత తండ్రి అందనప్ప ఎలగి కన్నీరుమున్నీరవుతున్నారు. ఐర్లాండ్‌వాసులు ఓటు వేసే ముందు తమ కుమార్తెను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని, తమ పరిస్థితి మరే తల్లిదండ్రులకు రాకూడదని ఆయన అంటున్నారు. సవిత మరణంతో అబార్షన్ల విషయంలో ఐర్లాండ్వాసుల దృక్కోణంలో మార్పు వచ్చిందన్న అభిప్రాయమైతే వినిపిస్తోంది. మరి రిఫరెండంలో ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపిస్తారో మరో రోజులో తేలిపోనుంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
అబార్షన్ల కోసం ‘యెస్’ క్యాంపెయిన్..
డబ్లిన్ : సరిగ్గా ఆరేళ్ల క్రితం.. ఐర్లాండ్‌లో మరణించిన భారత సంతతి దంత వైద్యురాలు సవితా హలప్పనావర్ ఫొటో ప్రస్తుతం ఐర్లాండ్ పత్రికల పతాక శీర్షికల్లో దర్శనమిస్తోంది. ఆమె మరణం ఎంతో మంది మహిళలను కదిలించింది... యెస్ క్యాంపెయిన్ పేరిట జరుగతున్న ఉద్యమానికి చిరునామాగా మారింది. ఎందుకంటే ఆమె ఏ రోడ్డు ప్రమాదంలోనో, అనారోగ్యంతోనో మరే ఇతర కారణాల వల్లో మరణించలేదు... అక్కడి కఠినమైన చట్టాలు ఆమెను బలవంతంగా హత్య చేశాయి. యెస్ క్యాంపెయిన్... క్యాథలిక్ దేశంగా పేరున్న ఐర్లాండ్.. స్వలింగ సంపర్కుల వివాహానికి అనుమతించి, చట్టబద్ధం చేసిన తొలి దేశంగా ప్రసిద్థికెక్కింది. అదే విధంగా మైనారిటీ వర్గానికి చెందిన గేను ప్రధానిగా ఎన్నుకుని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. అయితే కాలానుగుణంగా చట్టాల్లో మార్పులు చేస్తున్న ఐరిష్ ప్రభుత్వం మహిళల విషయంలో మాత్రం కఠినంగానే వ్యవహరిస్తోంది. క్యాథలిక్ దేశానికి చెందిన మహిళలనే కారణాన్ని చూపి అబార్షన్లకు అనుమతివ్వకుండా.. ఎంతో మంది మహిళల మరణాలకు కారణమవుతోంది. అయితే ఆరేళ్ల క్రితం అనారోగ్య కారణాల వల్ల గర్భస్రావానికి అనుమతివ్వాలంటూ సవిత ఐరిష్ ప్రభుత్వాన్ని కోరింది. కానీ అందుకు వారు నిరాకరించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. అప్పట్లో సంచలనం సృష్టించిన సవిత మరణం.. గర్భస్రావాల వ్యతిరేక చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఐరిష్ మహిళల్లోని పోరాట పటిమను మరింత దృఢపరిచింది. యెస్ క్యాంపెయిన్ పేరిట అబార్షన్ల వ్యతిరేక చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి ఊపిరులూదింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈనెల(మే) 25న నిర్వహిస్తున్న రెఫరెండంలో ఓటు వేసేందుకు బ్రిటన్, ఇతర దేశాల్లో స్థిరపడిన మహిళలు కూడా రాబోతున్నారు. ఆ నిషేధం ఎత్తివేయాలి... ఐర్లాండ్ రాజ్యాంగంలోని ఎనిమిదో అధికరణకు సవరణ చేయాలన్నదే యెస్ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం. ఈ అధికరణ ప్రకారం గర్భస్థ శిశువుల జీవించే హక్కు పేరిట ఐర్లాండ్ ప్రభుత్వం అబార్షన్లపై నిషేధం విధించింది. ఈ కారణంగా ఎంతో మంది మహిళలు అబార్షన్ల కోసం ఇంగ్లండ్, ఇతర దేశాలకు వెళ్లాల్సి వస్తోంది. అలా వెళ్లలేని స్తోమత లేనివారు మరణిస్తున్నారు. అయితే సవిత కేసు పత్రికల్లో ప్రముఖంగా ప్రచారమవడంతో అబార్షన్లపై ఉన్న నిషేధ చట్టాన్ని పూర్తిగా ఎత్తివేయాలంటూ ఐరిష్ మహిళలు ముందుకొచ్చారు. అమె ఫొటోతో క్యాంపెయిన్ నిర్వహిస్తూ తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. అసలేం జరిగింది...? భారత సంతతికి చెందిన సవితా హలప్పనావర్ ఐర్లాండ్‌లో దంత వైద్యురాలిగా పనిచేసేవారు. 17 వారాల గర్భవతైన సవిత.. నడుము నొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరారు. గర్భస్రావం కావడంతో వెంటనే అబార్షన్ చేసి పిండాన్ని తొలగించాల్సిందిగా ఆమె కుటుంబ సభ్యులు కోరారు. కానీ ఐర్లాండ్ చట్టాల ప్రకారం అబార్షన్ చేయడం నేరం. దీంతో వారం రోజుల అనంతరం తీవ్ర రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల కారణంగా సవిత మరణించింది. సంతోషంగా ఉంది : సవిత తండ్రి ఆరేళ్ల క్రితం మరణించిన తన కూతురును, ఆమె మరణానికి గల కారణాన్ని గుర్తుపెట్టుకున్న ఐరిష్ మహిళలకు సవిత తండ్రి కృతఙ్ఞతలు తెలిపారు. తన కూతురి ఫొటోను యెస్ క్యాంపెయిన్‌కు వాడుకోవడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ఒకవేళ ఐరిష్ ప్రభుత్వం అబార్షన్లపై నిషేధాన్ని ఎత్తివేస్తే ఎంతో మంది మహిళల చిరునవ్వుల్లో తన కూతురు బతికే ఉంటుందంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. మే 25న నిర్వహించబోతున్న ఓటింగ్‌లో ఐరిష్ మహిళలంతా పాల్గొనాలంటూ ఆయన పిలుపునిచ్చారు. -
రాష్ట్రపతి కుటుంబంపై నిర్లక్ష్యమా?
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భార్య సవితా కోవింద్, కుమార్తె స్వాతిని అనుమతి లేని పడవలో కృష్ణా నదిలో విహారానికి తీసుకెళ్లడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై రాష్ట్రపతి భవన్‌కు నివేదిక ఇచ్చేందుకు వివరాలు సేకరిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి గుబులు పట్టుకుంది. ఆ ఒక్క బోటుకు అప్పటికప్పుడు అనుమతి ఇచ్చామనే వాదనను తెరపైకి తెచ్చింది. అస్పష్టమైన వివరాలతో ఉన్న ఆ ప్రకటన ప్రభుత్వ తప్పిదాన్ని చెప్పకనే చెబుతోంది. కృష్ణా నదిలో ఇటీవలే అనుమతి లేని పడవ బోల్తాపడి 22 మంది పర్యాటకులు దుర్మరణం పాలయ్యారు. అయినప్పటికీ రాష్ట్రపతి కుటుంబ సభ్యులను అనుమతి లేని బోటులో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విజయవాడలోని పున్నమీ ఘాట్ నుంచి భవానీ ద్వీపానికి తీసుకువెళ్లింది. అనుమతి లేకుండా పడవలు నడుపుతున్న ‘చాంపియన్ యాచ్ క్లబ్’పై గతేడాది విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. బోట్లను సీజ్ చేసి జలవనరుల శాఖకు అప్పగించారు. తరువాత కృష్ణా జిల్లాకు చెందిన కీలక మంత్రి ఒత్తిడితో ఆ బోట్లను విడిచిపెట్టారు. తాజాగా నవంబర్ 12న కృష్ణా నదిలో బోటు ప్రమాదం జరిగాక పర్యాటక శాఖ అధికారులు దాడులు నిర్వహించి బోట్లను సీజ్ చేశారు. ఇవేవీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి సతీమణి, కుమార్తెను అదే చాంపియన్ యాచ్ క్లబ్ బోటులోనే పున్నమి ఘాట్ నుంచి భవానీ ద్వీపానికి తీసుకెళ్లింది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై రాష్ట్రపతి భవన్ వర్గాలు తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. దీనిపై నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ ఉదంతంపై గురువారం ఆరా తీశాయి. ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ అనుమతి లేని పడవలో రాష్ట్రపతి కుటుంబ సభ్యులను తీసుకెళ్లడంపై కేంద్ర ప్రభుత్వం వివరణ కోరడంతో రాష్ట్ర ప్రభుత్వంలో గుబులు మొదలైంది. ఈ ఉదంతం ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెస్తుందని భావిస్తున్నారు. దీన్ని ఎలా కప్పిపుచ్చాలన్న దానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడింది. ఎట్టకేలకు గురువారం సాయంత్రానికి ఓ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. రాష్ట్రపతి సతీమణి, కుమార్తెను భవానీ ద్వీపానికి తీసుకువెళ్లేందుకు అప్పటికప్పుడు, అంటే బుధవారం ఉదయం 11 గంటలకు ఆ బోటుకు తాత్కాలిక అనుమతి ఇచ్చామని తెలిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కీలకమైన విషయాలను విస్మరించడం సందేహాస్పదంగా మారింది. అప్పటికప్పుడు అనుమతి ఇచ్చారట! నిబంధనల ప్రకారం బోటుకు మొదట రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు అనుమతి ఇవ్వాలి. బోటు నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉందా లేదా అన్నది రెవెన్యూ అధికారులు పరిశీలించాలి. ఏదైనా ప్రమాదం జరిగితే నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అన్నది అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీ చేయాలి. అనంతరం బోటు సైజు, సామర్థ్యాన్ని జలవనరుల శాఖ పరిశీలించి నిర్ణీత రూటులో ప్రయాణించేందుకు అనువైనదా కాదా అన్నది చూడాలి. అన్నీ సురక్షితంగా, సక్రమంగా ఉంటేనే అనుమతి ఇవ్వాలి. రాష్ట్రపతి కుటుంబ సభ్యులు ప్రయాణించిన బోటు విషయంలో అన్ని నిబంధనలు పాటించారా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం తన ప్రకటనలో వెల్లడించలేదు. కేవలం జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అప్పటికప్పుడు తాత్కాలిక అనుమతి ఇచ్చారని పేర్కొనడం గమనార్హం. రాష్ట్రపతి కుటుంబ సభ్యుల విషయంలోనే ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఇక సామాన్య పర్యాటకులు పరిస్థితి ఏమిటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
దుర్గమ్మ సన్నిధిలో ప్రథమ మహిళ
సాక్షి, విజయవాడ: దేశ ప్రథమ మహిళ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సతీమణి సవిత కోవింద్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. రాష్ట్రపతి దంపతులు బుధవారం అమరావతికి వచ్చిన విషయం తెలిసిందే. అమరావతిలో జరిగిన ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి పాల్గొనగా.. ఆయన సతీమణి సవిత దుర్గమ్మ సేవలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయ పండితులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకున్న సవిత కోవింద్‌కు పండితులు తీర్ధప్రసాదాలు అందించారు. అంతకుముందు ఆమె స్థానిక స్వరాజ్య మైదానంలో జరుగుతున్న గులాబీల ప్రదర్శనను తిలకించారు. -
కొట్టి... ఇంటి నుంచి గెంటేసి
ఉత్తమ నడవడికతో సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో కొద్దిరోజులుగా తెలుస్తూనే ఉంది. తాజాగా ఓ మాజీ ఎమ్మెల్యే భార్యను ఇంటి నుంచి బయటకు గెంటేసిన వైనం కర్ణాటక రాజధానిలోనే చోటుచేసుకుంది. బెంగళూరు: బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎం.పి.కుమారస్వామి, ఆయన భార్య సవిత కుటుంబ కలహాలతో మరోసారి రోడ్డెక్కారు. చిక్కమగళూరు జిల్లాలోని మూడిగేరె నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గతంలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యే ఎంపి.కుమార స్వామి కుటుంబం ఇక్కడి హెచ్ఎస్ఆర్ లేఔట్ మొదటి సెక్టార్లో నివాసముంటోంది. ఆయనకు మరో మహిళకు అక్రమ సంబంధం ఉందని, దీనిని ప్రశ్నించడంతో ఆదివారం రాత్రి ఇంటి నుంచి గెంటి వేసి ఇంటికి తాళం వేసుకొని వెళ్లాడని భార్య సవిత ఆరోపించారు. న్యాయం జరగాలని కోరుతు ఎం.పి.కుమారస్వామి ఇంటి వద్ద నిరహార దీక్ష చేపట్టారు. సవిత సోమవారం మీడియాతో ఆమె మాట్లాడుతూ నవంబర్ 14 తేదీ వరకు తనను బాగానే చూసుకున్నాడని, మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అడగటంతో అప్పటి నుంచి తనను ఇంట్లో తీవ్రంగా కొట్టడం వేధించడం మొదలుపెట్టాడని వాపోయారు. చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని మీడియా ముందు తెలిపారు. ఎలాగైనా తన నుంచి విడాకులు తీసుకుని ఆ మహిళతో కాపురం పెట్టాలని చూస్తున్నాడని, తాను భర్తను వదిలి ఉండనని చెప్పారు. తాను పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్ళనని, తనకు న్యాయం జరిగే వరకు ఇంటి ముందే నిరహార దీక్ష చేస్తానని అన్నారు. కాగా గొడవ జరిగిన వెంటనే కుమరస్వామి అక్కడ నుంచి వెళ్లిపోగా, సవిత కూడా ఆదివారం రాత్రి అక్కడ నుంచి బెంగళూరు వెళ్లిపోయారు. నిన్న ఉదయం తిరిగి ఇంటికి వచ్చేసరికి... తాళం వేసి ఉండటంతో ఆమె అక్కడే బైఠాయించారు. మరోవైపు సవిత ఆరోపణలను కుమాస్వామి ఖండించారు. మరో మహిళతో అక్రమ సంబంధం అంటూ నిరాధార ఆరోపణలు చేస్తోందని, అవన్నీ అవాస్తవమని ఆయన తెలిపారు. తన ఆస్తి కోసమే సవిత ఇదంతా చేస్తోందని, తాను కూడా ఆమెతో విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అప్పట్లో అసెంబ్లీ వద్దే గొడవ 2008లో కుమారస్వామితో సవితకు వివాహమైంది. సంసారం సజావుగానే సాగినా, ఈ ఏడాది జనవరి నెల 23 తేదీన తన భర్త కుమారస్వామి మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని భార్య సవిత విధానసౌధ వద్దనున్న ఎమ్మెల్యే భవనం వద్దకు వచ్చి పెద్ద గొడవ చేయడంతో వివాదం రచ్చకెక్కింది. అప్పట్లో ఈ విషయం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్ళింది. ఇక పైన ఎటువంటి తప్పు చేయనని, తన భార్యతో మంచిగానే ఉంటానని కుమారస్వామి ప్రమాణ పత్రం రాసిచ్చారు. కాని ఇటీవల వేరొక మహిళతో మళ్లీ తిరుగుతున్నావని భర్తను నిలదీశారు. తానీష్టం వచ్చినట్లు ఉంటానని, ఇష్టం ఉంటే ఉండు, లేదంటే విడాకులిచ్చి వెళ్ళి పొమ్మని వేధిస్తున్నాడని ఆమె తెలిపారు. గతంలో తాను గొడవ చేసినప్పుడు పత్రికల్లో వచ్చిన వార్త చిత్రాలను చూపారు. -
'గీతే.. మా అమ్మాయి సవిత'
లక్నో: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం స్వదేశం తిరిగొచ్చిన గీత.. ఇక తల్లిదండ్రులు ఎవరన్నది గుర్తించాల్సి ఉంది. గీత తమ అమ్మాయే అంటూ గతంలో నాలుగు కుటుంబాలు ముందుకురాగా.. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ జంట తమ కూతురేనని చెబుతున్నారు. ప్రతాప్‌గఢ్ జిల్లా మహేష్గంజ్కు చెందిన రామ్రాజ్ గౌతమ్, అనరా దేవి.. గీత తమ అమ్మాయేననంటూ అలహాబాద్ డివిజనల్ కమిషనర్ రాజన్ శుక్లాను ఆశ్రయించారు. దీన్ని నిరూపించేందుకు విచారణకు, అవసరమైన పరీక్షలకు సిద్ధమని చెప్పారు. వీరికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సిందిగా శుక్లా ఆదేశించారు. గీతను చూసేందుకు రామ్రాజ్ దంపతులు ఢిల్లీ వెళ్లారు. గీతే తమ కూతురు 'సవిత' అని, 11 ఏళ్ల కిందట తప్పిపోయిందని చెబుతూ పాత ఫొటోలను చూపించారు. ఇంతకుముందు తెలంగాణ, బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌కు చెందిన నాలుగు కుటుంబాల వారు గీత తమ అమ్మాయే అని చెప్పారు. పుట్టుకతోనే చెవిటి, మూగ అయిన గీత 2003లో దారితప్పి పాకిస్థాన్ సరిహద్దులు దాటింది. సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం గీతను భారత్‌కు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే గీత.. తల్లిదండ్రులమని చెప్పిన బిహార్‌కు చెందిన మహతోస్ దంపతులను గుర్తించలేకపోయింది. వీరికీ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. -
సవితకు పింఛన్ వచ్చింది
నిజామాబాద్ నగరానికి అతి సమీపంలో ఉన్న నర్సింగ్‌పల్లి గ్రామానికి చెందిన అంధురాలు సవితకు విలాంగుల కోటాలో ఎట్టకేలకు అధికారులు పింఛన్ మంజూరు చేశారు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రగతినగర్ : నిజామాబాద్ నగరానికి అతి సమీపంలో ఉన్న నర్సింగ్‌పల్లి గ్రామానికి చెందిన అంధురాలు సవిత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎట్టకేలకు అధికారులు ఆ మెకు పింఛన్ మంజూరు చేశారు. వికలాంగుల కోటాలోసవితకు గతంలో రూ. 500 రూపాయల పింఛన్ వచ్చేది. మూడేళ్ల క్రితం ఆమె సదరం శిబిరా నికి హాజరైంది. సదరం నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పుట్టు గుడ్డి అయిన సవితకు 30 శాతం మాత్రమే అంధత్వం ఉందని ధ్రువీకరించారు. మరోవైపు సమగ్ర సర్వేలో సిబ్బంది సవితకు బదులుగా ఆమె సోదరి కి అంధత్వం ఉందని నమోదు చేశా రు. దీంతో అధికారులు పింఛన్ నిలిపివేశారు. అప్పటి నుంచి సవిత పడరాని కష్టాలు పడింది. ‘సాక్షి’ ఈ నె ల రెండున ‘సర్వే లోపం..అంధురాలికి శాపం’ అనే శీర్షికతో ఓ పేరిట కథనాన్ని ప్రచురించింది. స్పందించిన కలెక్టర్ ప్రపంచ వికలాంగుల దినోత్స వం రోజున సవితకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ యన ఆదేశం మేరకు కదిలిన అధికారులు తిరిగి సర్వే నిర్వహించి సవిత అంధురాలని నిర్ధారించారు. అప్పటినుంచి ఎదురు చూస్తున్న సవితకు సో మవారం శుభవార్త చేరింది. ఉదయమే గ్రామ సర్పంచ్ పింఛన్ మంజూరు అయిందని వచ్చి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. సవిత వెంటనే పంచాయతీ కార్యాలయానికి వెళ్లి రెండు నెలల పింఛన్ మూడు వేల రూపాయలు అందుకుంది. ఆనందబాష్పాలు రాల్చుతూ తనకు పిం ఛన్ రావడానికి కృషి చేసిన ‘సాక్షి’కి, మంజూరు చేసిన కలెక్టర్‌కు కృత జ్ఞతలు తెలిపింది. తనలాంటి వారందరికీ అండగా నిలవాలని విన్నవించింది.