దుర్గమ్మ సన్నిధిలో ప్రథమ మహిళ | Savita Kovind, The First Lady of India Visits Kanakadurga Temple | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సన్నిధిలో ప్రథమ మహిళ

Published Wed, Dec 27 2017 4:00 PM | Last Updated on Wed, Dec 27 2017 4:00 PM

 Savita Kovind, The First Lady of India Visits Kanakadurga Temple

సాక్షి, విజయవాడ: దేశ ప్రథమ మహిళ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సతీమణి సవిత కోవింద్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. రాష్ట్రపతి దంపతులు బుధవారం అమరావతికి వచ్చిన విషయం తెలిసిందే. అమరావతిలో జరిగిన ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి పాల్గొనగా.. ఆయన సతీమణి సవిత దుర్గమ్మ సేవలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆలయ పండితులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకున్న సవిత కోవింద్‌కు పండితులు తీర్ధప్రసాదాలు అందించారు. అంతకుముందు ఆమె స్థానిక స్వరాజ్య మైదానంలో జరుగుతున్న గులాబీల ప్రదర్శనను తిలకించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement