durgamma temple
-
దుర్గమ్మ సన్నిధిలో పోలీసుల క్రౌర్యం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): మూలా నక్షత్రం రోజు బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో సామాన్య భక్తులపై పోలీసులు దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. మహిళలు, వృద్ధులు, బాలలని కూడా చూడకుండా లాగిపడేశారు. పోలీసుల క్రౌర్యానికి ఓ బాలుడు, మహిళ గాయపడ్డారు. రౌడీలు, నేరస్తులతో కూడా పోలీసులు ఈ విధంగా వ్యవహరించరని పలువురు భక్తులు మండిపడ్డారు. ఎన్నో ప్రయాసలకోర్చి దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు పోలీసుల చేష్టలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీఐపీ దర్శనాల రద్దు ఉత్తి మాటే! మూలా నక్షత్రం కావడంతో వీఐపీల దర్శనాలు రద్దు చేశామని, సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని అధికారులు, నేతలు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాల సమర్పణ సమయంలో కూడా మూడు క్యూలైన్లలో భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. అయితే అచరణతో మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. చంద్రబాబు పట్టు వ్రస్తాల సమర్పణ సమయంలోనే 35 నిమిషాలకు పైగా భక్తులకు దర్శనం నిలిపివేశారు. ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలోనూ క్యూలైన్లు ఆపారు. మిగతా వీఐపీలూ పెద్ద సంఖ్యలో రావడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. మాటిమాటికీ క్యూలను ఆపడంతో వినాయకుడి గుడి, కుమ్మరిపాలెం సెంటర్ల నుంచి క్యూలైన్లలో చంటి బిడ్డలను తీసుకొని వచ్చే భక్తులకు దర్శనానికి దాదాపు 6 గంటల సమయం పట్టింది. వీఐపీలకు తోడు ఉత్సవ కమిటీ సభ్యులు, అధికార పార్టీ నేతల సంబందీకులు అనేక మంది కింద ఉన్న క్యూలైన్లలో కాకుండా నేరుగా కొండ పైకి చేరుకున్నారు. దీంతో ఓం టర్నింగ్ వద్ద తీవ్ర తోపులాటలు జరిగాయి. మగ పోలీసులే మహిళలను తోసుకుంటూ వెళ్లటం, కొంతమంది కింద పడిపోవటం వంటి ఘటనలు జరిగాయి. ఆ తోపులాటకు కొందరు విలపించారు. ఏటా మూలా నక్షత్రం రోజున భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారని తెలిసినప్పటికీ, పోలీసుల వద్ద నిరి్ధష్టమైన ప్రణాళిక లేకపోవటమే ఈ విధమైన తోపులాటలు, గందరగోళ పరిస్థితులకు కారణమని భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తి వాతావరణం కాక పోలీసు స్టేషన్లో ఉండే పరిస్థితులను సృష్టిస్తున్నారని ఆలయంలోని సిబ్బంది సైతం వ్యాఖ్యానిస్తున్నారు.బాలుడికి, తల్లికి గాయాలు బుధవారం మూలా నక్షత్రం, సరస్వతి దేవి అలంకారం కావడంతో బెజవాడ దుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం రాత్రి 11 గంటల నుంచే వేలాదిగా భక్తులు వచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి అనుమతించారు. భక్తులకు అడుగడుగునా పోలీసుల నుంచి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఎక్కడెక్కడి నుంచో అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులను సౌకర్యవంతంగా క్యూలో పంపించాల్సిన పోలీసులే వారి పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారు. ఇదే క్రమంలో హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చిన ఒక మహిళ, ఆమె కుమారుడు గాయపడ్డారు. కొండ కింద నుంచి ఐదు గంటలపాటు క్యూలో నడుచుకుంటూ ఆ మహిళ కుటుంబం అమ్మవారి చెంతకు చేరింది. అదే సమయంలో మహిళా పోలీసులు ఆమెను, ఆమె కుమారుడిని తోసేయడంతో వారిద్దరూ ముందు ఉన్న బారికేడ్‌పై పడిపోయారు. బాలుడి తలకు బారికేడ్ బలంగా తగిలింది. చెవికి తీవ్రమైన గాయమైంది. చెంప వాచింది. ఆ బాలుడు నొప్పితో విలవిల్లాడాడు. మహిళ చేతికి గాయమైంది. ఇదేమిటని ప్రశ్నించిన మహిళపై మహిళా పోలీసులు బూతులతో విరుచుకుపడ్డారు. ఆమె చెయ్యిని గిచ్చినట్లుగా ఆ మహిళ మీడియా వద్ద వాపోయారు. కొండపైన ఉన్న హెల్త్ సెంటర్లో సిబ్బంది బాలుడిని పరిశీలించి ఈఎన్టీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. -
వీఐపీలొస్తే భక్తుల దర్శనాలకు బ్రేక్
-
శోభాయమానంగా ఇంద్రకీలాద్రి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయంలో దసరాను పురస్కరించుకుని శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం(3వ తేదీ) నుంచి ఈ నెల 12వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాల్లో అమ్మవారి దర్శనం ఉదయం 3–4 గంటల మధ్యలో ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుంది. దర్శనానికి ఈ ఏడాది సుమారు 15 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని ఆలయ అధికారుల అంచనా. మూలానక్షత్రం రోజు సరస్వతి అలంకారంలో అమ్మవారిని 2.5 లక్షల మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉంది. 5 క్యూలైన్ల ద్వారా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. వీఐపీలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. భక్తులకు రోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్న ప్రసాదం అందిస్తారు. క్యూలైన్లో భక్తులకు వాటర్ ప్యాకెట్లతో పాటు, చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తారు. భక్తుల కోసం 25 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. 12న విజయ దశమిని పురస్కరించుకుని సాయంత్రం కృష్ణా నదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఉత్సవాల నిర్వహణలో పాల్గొనే అన్ని శాఖల అధికారులతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన బుధవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇంద్రకీలాద్రిపై అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.నేడు శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా మహోత్సవాల్లో తొలి రోజైన గురువారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. శ్రీబాలా మంత్రం సమస్త దేవీ మంత్రాల్లోకి ముఖ్యమైనది. విద్యోపాసకులకు మొట్టమొదటిగా బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. -
విజయవాడలో దుర్గమ్మకు తెలంగాణ బోనాలు (ఫోటోలు)
-
విజయవాడ : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
దుర్గమ్మకు పట్టు వ్రస్తాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అత్యంత ప్రాశస్త్యమైన మూలా నక్షత్రం సందర్భంగా శుక్రవారం సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టు వ్రస్తాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్లాదకర వాతావరణం మధ్య క్యాంప్ కార్యాలయం నుంచి ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆలయం వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ పరివేష్టితం నిర్వహించారు. పరివేష్టితం ధారణతో అమ్మ వారి పట్టువ్రస్తాలు, పసుపు, కుంకుమలను ముఖ్యమంత్రి తలపై పెట్టుకుని మంగళవాయిద్యాలు, వేద మంత్రాల మధ్య ఆలయంలోకి ప్రవేశించారు. అంతరాలయంలో శ్రీసరస్వతీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మ వారికి పట్టువ్రస్తాలు సమర్పించారు. వైదిక కమిటీ సభ్యులు, ప్రధాన అర్చకులు లింగంభట్ల దుర్గాప్రసాద్, ఇతర అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు సీఎం వైఎస్ జగన్‌ను వేద మంత్రాలతో ఆశీర్వదించారు. అమ్మవారి తీర్థ ప్రపాదాలు, చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత, దేవదాయ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ముఖ్యమంత్రి కార్యదర్శి రేవు ముత్యాల రాజు, దేవదాయ కమిషనర్ సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్ కుమార్, కల్పలతా రెడ్డి, ఎండీ రుహుల్లా, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, కనకదుర్గ ఆలయం చైర్మన్ కర్నాటి రాంబాబు, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరి గౌతంరెడ్డి, నగర మేయర్ రాయన భాగ్యలక్షి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ టి.కె.రాణా, ఆలయ ఈవో కెఎస్.రామారావు తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తజనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై సోమవారంతో ఆషాఢ మాసోత్సవాలు ముగియనున్నాయి. దీంతో ఆదివారం రికార్డు స్థాయిలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని సారెను సమర్పించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు ఆదివారం నిర్వహించిన ఆర్జిత సేవల్లోనూ ఉభయదాతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయంలో నిర్వహించిన ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీ చక్రనవార్చన, శాంతి కలల్యాణం, చండీహో మం, గణపతి హోమంలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొని తమ నామగోత్రాలతో పూజలు జరిపించుకున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనానికి మూడు గంటలు ఆదివారం కావడంతో అమ్మవారి దర్శనానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు కిటకిటలాడాయి. సర్వ దర్శనంతో పాటు రూ.100, రూ.300 టికెట్ల క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. మరో వైపున అమ్మవారికి సారెను సమర్పించేందుకు విచ్చేసిన భక్తులను సైతం రూ.300, రూ.100 క్యూలైన్లోకి అనుమతించారు. భక్తుల రద్దీతో పలు దఫాలుగా అంతరాలయ దర్శనం నిలిపివేసి ముఖ మండప దర్శనానికి అనుమతించారు. వీఐపీ గేటు వద్ద రూ.500 టికెట్ తీసుకున్న భక్తులు వేచి ఉండేలా ఏర్పాట్లు చేశారు. సారె సమర్పించే భక్తుల రద్దీ తగ్గిన సమయంలో రూ.500 టికెట్ క్యూలైన్‌ను అంతరాలయంలోకి అనుమతించారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సారె సమర్పించిన భక్త బృందాలు దుర్గమ్మకు ఆదివారం పలు భక్త బృందాలు సారెను సమర్పించాయి. దుర్గగుడి పాలక మండలి సభ్యులు కట్టా సత్తెయ్య బృందం, దేవిశెట్టి బాలకృష్ణ బృందం, ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్ష వ్యవస్థాపక పీఠం ఈది ఎల్లారావు శిష్య బృందానికి చెందిన 700 మంది భక్తులు, మొగల్రాజపురం కళావతి బృందానికి చెందిన 50 మంది, పొన్నూరుకు చెందిన ఎం.అరుణ బృందానికి చెందిన 50 మంది భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన 2 వేల మంది భక్తులు అమ్మవారికి సారెను సమర్పించారు. వీరికి ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి సారెను సమర్పించారు. కార్యక్రమంలో డీఈవో గురు ప్రసాద్, పాలక మండలి సభ్యులు కట్టా సత్తెయ్య, దేవిశెట్టి బాలకృష్ణ, బచ్చు మాధవికృష్ణ, కేసరి నాగమణి తదితరులు పాల్గొన్నారు. నెల రోజులుగా జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. సోమవారం ఉదయం 7–30 గంటలకు ఆలయ ఈవో, ఆలయ సిబ్బంది అమ్మవారికి సారెను సమర్పించనున్నారు. అడ్డుకున్న నిఘా సిబ్బంది కనకదుర్గనగర్ పరిసరాల్లో తిరిగే డిప్యూటీ (శ్రీను) అనే వ్యక్తి ఆదివారం ఆలయంలో విధులు నిర్వహించే ఓ వ్యక్తికి ఫోన్ చేసి ముగ్గురు భక్తులకు వీఐపీ దర్శనం చేయించాలని కోరాడు. దీంతో సదరు ఉద్యోగి ఆ ముగ్గురు భక్తులను ఆలయంలోకి తీసుకెళ్తుండగా, నిఘా సిబ్బంది అడ్డుకున్నారు. ఉద్యోగిని మందలించారు. అక్రమ మార్గంలో వీఐపీ దర్శనాలు చేయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
20 కుటుంబాలు ఇళ్ళు హామీ పెట్టి.. బ్యాంకు రుణం తెచ్చి USలో కట్టిన గుడి !
ఈ గుడి కథంతా తెలుగు సినిమా కథలా కనిపిస్తుంది. కాని ఇది యథార్థంగా జరిగిన ఘటన. కాలిఫోర్నియాలో ఒక దేవాలయ నిర్మాణం విషయంలో. ఫేస్ బుక్ లో వల్లీశ్వర్ గుండు (Valliswar Gundu) షేర్ చేసుకున్న కథనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్ట్ యథాతధంగా.. 1974 లో ఉత్తర కాలిఫోర్నియాలో హిందువుల కోసం ఒక దేవాలయం ఉండాలని కొందరు స్థానిక భారతీయులకు ఒక కోరిక కలిగింది. ఆ ఆలోచనకి ఒక రూపం వచ్చి 1977లో ఒక రిజిస్టర్డ్ కమ్యూనిటీగా ఏర్పడింది. ప్లెసంటన్ అనే ప్రాంతంలో షాడో క్లివ్స్ అనే సరస్సు ప్రక్కన ఓ నాలుగెకరాల స్థలంలో దేవాలయం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికి తొలి విరాళంగా 50 వేల డాలర్లు (రూ. 4.50 లక్షలు అప్పట్లో) ఇచ్చిన భక్తుడు ఒక గుజరాతీ. ఆయన పేరు గులు అద్వాణి. రకరకాల 'సాంకేతిక కారణాలు ' చూపిస్తూ స్థానిక పాలనా సంస్థ ఈ నిర్మాణానికి అభ్యంతరాలు తెలిపింది. ప్లెసంటన్ పౌరులు మూడు వేల సంతకాలతో తమ నిరసన వ్యక్తం చేశారు. రెండేళ్ళపాటు పోరాడారు. ప్రయోజనం శూన్యం. ఆ భూమి క్రయాన్ని రద్దు చేసుకున్నారు. అక్కడికి తూర్పుగా తొమ్మిది మైళ్ళ దూరంలో నాలుగెకరాల భూమి కొన్నారు. సరైన రోడ్లు లేవు. విద్యుత్ నీటి సదుపాయాలు సరిగ్గా లేవు. అక్కడే 1983లో దేవాలయం కట్టాలనుకున్నచోట ఒక పాత ఇల్లు కొని, తమ కార్యాలయం చేసుకున్నారు. ఆ కార్యాలయానికి ప్రక్కనే ఆలయ క్షేత్ర భూమిలో సర్వశక్తిమంతురాలైన శ్రీ కనక దుర్గాదేవి మందిరానికి భూమి పూజ జరిగింది. గత నాలుగు దశాబ్దాలకు పైగా దేవాలయ అభివృద్ధిలో పాత్రధారిగా, అలుపెరగని సేవకురాలిగా, అన్ని పరిణామాలకి సాక్షిగా అనునిత్యం తరిస్తున్న నీలంరాజు విజయలక్ష్మి జ్ఞాపకాల్లోకి తొంగి చూస్తే..సంభ్రమం, ఆశ్చర్యం కలిగించే అద్భుతాలు ఎన్నో!. (నీలంరాజు విజయలక్ష్మి) అప్పుడే అద్భుతం జరిగింది! ఆమె మాటల్లో చెప్పాలంటే … 1982 ఆగష్టులో గణపతి స్థపతి గారు వచ్చి చూసి, అమ్మవారు ఉన్న చోట ఆగమ శాస్త్రం ప్రకారం ఏయే దేవతా విగ్రహాలు ఉండాలో చెప్పారు. 'పద్మశ్రీ' గ్రహీత ముత్తయ్య స్థపతి కూడా చూసి, కొన్ని సూచనలు చేశారు. దక్షిణభారత, ఉత్తర భారత శైలులు రెండిటినీ కమిటీ పరిగణనలోకి తీసుకుంది. ఆ సూచనల ప్రకారం విష్ణ్వాలయానికి చోళ శైలి గోపురం, శివాలయానికి కళింగ శైలి గోపురం ఎంచుకున్నారు. గణేశ, శివ, కార్తికేయ, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు, హనుమ, కాల భైరవులకు నల్లని గ్రానైట్ విగ్రహాలు, రామకృష్ణులు, దశ భుజ దుర్గలకు పాలరాతి విగ్రహాలు ఎంచుకున్నారు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది ! 1980 ప్రాంతంలో ఈ కమిటీ సారథుల్లో ఒకరైన శ్రీ ముత్తురామన్ అయ్యర్ శాన్ఫ్రాన్సిస్కోలో శివ-సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమెరికన్ స్వామీజీ తానే చొరవ తీసుకొని గణేశ, కార్తికేయ విగ్రహాలు ఇచ్చారు. కాని ఆలయం లేదు కదా! అందుకని వాటిని భక్తుల ఇళ్ళల్లో ఉంచి, వాటికి నిత్య పూజాభిషేకాలు జరిగేలా చూశారు. సరిగ్గా ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. గుడి కట్టడానికి నిధులు కావాలి. భారతీయ స్టేట్ బ్యాంకు వారు "రుణం ఇస్తాం. హామీ ఏం పెడతారు?" అని అడిగారు. అంతే.. 20 మంది భక్తులు తమ ఇళ్ళను హామీగా పెట్టేందుకు ముందుకు వచ్చారు. దాదాపు అయిదు లక్షల డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.60 లక్షలు) రుణం తీసుకున్నారు. తరువాత ఇంకో అద్భుతం జరిగింది ! 1984 ప్రథమార్థంలో అమెరికా వచ్చిన ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుని కమిటీ సభ్యులు కలిసి "టీటీడా వారి చేత మాకు శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం, స్వామి వారి అలంకారాలు ఇప్పించండి స్వామీ" అని కోరటం, వివేకానందుడి ఆహార్యంలో దర్శనమిచ్చిన ముఖ్యమంత్రి తక్షణం "అలాగే " అని హామీ ఇవ్వటం చకచక జరిగిపోయింది. సరిగ్గా నెల తిరక్కుండా టీటీడీ నుంచి ఆగమ శాస్త్రానుసారం ఏకశిల గ్రానైట్ మీద చెక్కిన శ్రీనివాసుడి విగ్రహం, అలంకార సామగ్రి, వస్త్రాలు, పాత్రలు (మొత్తం లక్ష రూపాయల విలువ) కాలిఫోర్నియా చేరిపోవటం జరిగింది. తమిళనాడు ప్రభుత్వం మంచి శిల్పుల్ని, కొన్ని విగ్రహాల్ని ఇస్తామని వాగ్దానం చేసింది. అప్పటికి చేతిలో ఉన్న విరాళాలతో కమిటీ 1984 ఏప్రిల్ దేవాలయ నిర్మాణానికి నిర్మాణానికి ఉపక్రమించింది. మళ్ళీ అమెరికా వచ్చిన ముఖ్యమంత్రి శ్రీఎన్.టి.రామారావు 1984 జూన్ 13 న ఆలయ సముదాయానికి శంకుస్థాపన చేశారు. (నాడు పూజలో పాల్గొన్న ఎన్టీఆర్) నా భక్తుడు నా కోసం వస్తాడు నన్ను పంపించు.. అప్పుడింకో అద్భుతం జరిగింది ! ఈ ఆలయ నిర్మాణానికి తపిస్తున్న భక్తుడు ముత్తురామన్ అయ్యర్ గారికి న్యూయార్క్ గణేశ దేవాలయ వ్యవస్థాపకులు అలిగప్పన్ గారు ఫోన్ చేసి, "మీకు అమ్మవారి విగ్రహం కావాలి కదా! మద్రాసు (చెన్నై)లో దేవీ భక్తుడు రిటైర్డ్ ఇంజినీర్ డాక్టర్ రాజు గారితో మాట్లాడండి" అని చెప్పారు. తరువాత ఆ ఇంజినీరే ఫోన్ చేశారు. ముత్తురామన్, తన భార్య గీతతో కలిసి మద్రాసు వెళ్తే, ఆ ఇంజినీర్, "ముత్తుస్వామి అనే భక్తుడు అమెరికాలో దేవాలయం కోసం వచ్చి నా విగ్రహం అడుగుతారు. నన్ను పంపించు" అని అమ్మవారు కొన్నేళ్ళక్రితమే తనకు చెప్పిందంటూ తన డైరీ చూపించారు. వాళ్ళ ఇంటి పెరట్లో ఉన్న ఆ విగ్రహం కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి స్పర్శతో దివ్యత్వాన్ని సంతరించుకున్నదని అంటూ ఆ విగ్రహాన్ని అమెరికా పంపించే ఏర్పాటు చేశారు. అలా వచ్చిన అమ్మవారికి ముందు తాత్కాలిక వసతి కల్పించారు. తర్వాత ప్రతిష్ట చేశారు. శివలింగాన్ని, మరి కొన్ని విగ్రహాల్ని తమిళనాడు ప్రభుత్వం ఇచ్చింది. ఇతర పాలరాతి విగ్రహాల్ని కమిటీయే సమకూర్చుకుంది. 1983 లో ప్రముఖ సితార విద్వాంసుడు పండిట్ రవి శంకర్ శంకుస్థాపన చేసినా, ఈ ఆలయ సముదాయం నిర్మాణ పనులు మాత్రం అమ్మవారి విగ్రహం వచ్చాకనే వేగంగా పుంజుకున్నాయి. అయితే నిధులు లేక మొత్తం సముదాయానికి పైకప్పు నిర్మాణం చాలాకాలం పట్టింది. అలాంటి రోజుల్లో, చెదురుమదురుగా వచ్చే భక్తులు శివలింగం ముందర పైసలు (సెంట్లు) వేసేవారు. అలా 99 సెంట్లు ఎప్పుడు సమకూరితే అప్పుడే అయిదు లీటర్ల పాలు కొని శివుడికి క్షీరాభిషేకం చేసేవాళ్ళు. అంతదాకా జలాభిషేకాలే ! మూడు నాలుగేళ్ళు అలాగే జరిగింది. రాధాకృష్ణులు, శ్రీరామ పరివారం, నవగ్రహాలు, హనుమ, కాలభైరవ ... అందరూ స్థిరపడ్డాక, 1986లో తొలి కుంభాభిషేకంలో ఈ మందిరాల మీద హెలికాప్టర్లోంచి పుష్ప వృష్టితో కూడా అర్చించారు. నిత్య పూజలతో పాటు కళ్యాణం, అభిషేకం వంటి సేవలన్నీ మొదలయ్యాయి. నలభయ్యేళ్ళు గడిచాయి. ఇప్పుడు 11 మంది అర్చకులు, ఆరుగురు ముఖ్య సిబ్బంది, ఇతరసహాయకులు, వారాంతాల్లో, ఇతర పర్వ దినాల్లో వచ్చి సేవలందించే వందమంది దాకా స్వచ్ఛంద సేవ చేసే భక్తులతో ప్రకాశిస్తున్న ఈ దేవాలయంలో ప్రతి పన్నెండేళ్ళకోసారి కుంభాభిషేకాలు జరుగుతున్నాయి. పాలతో అభిషేకం చేయలేని స్థితి నుంచి నిత్యాన్నదానం ఇచ్చే.. మళ్ళీ ఓ అద్భుతం ! క్రమంగా ఆలయ అవసరాలు పెరుగుతున్నాయి. "ఏం చేద్దాం ?" అనుకుంటున్న రోజుల్లో అమెరికా వాసులైన ఆకెళ్ళ సోదరులు ముందుకు వచ్చి, ఆలయానికి అనుకుని ఉన్న భూమిని తమ తల్లిదండ్రులు ఆకెళ్ళ మనోరమ, ఆకెళ్ళ శాస్త్రి గారి పేరు మీద విరాళంగా ఇచ్చారు. ఆ తరువాత డాక్టర్ హనుమరెడ్డి లక్కిరెడ్డి, డాక్టర్ పేరయ్య సూదనగుంట వంటి దాతలు సహా అనేక మంది విరాళాలతో ఆలయ సముదాయం భవనాలు, సదుపాయాలు విస్తరించాయి. ఇక్కడ ప్రముఖ పండితుల ప్రవచనాలు, క్రతువులు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘నిత్య కళ్యాణం పచ్చ తోరణం’గా ఈ దేవతా క్షేత్రం భాసిల్లుతోంది. ఒకప్పుడు శివలింగానికి పాలతో అభిషేకం చేసే స్తోమత లేని ఈ ఆలయంలో నేడు ప్రతి రోజూ అన్న ప్రసాదాలే. పర్వ దినాల్లో మూడువేల మందిదాకా భక్తులకు అన్న ప్రసాదాలు లభిస్తున్నాయి. ప్రతి జనవరి 1 నాడు ఎన్నో వేలమంది భక్తులు ఇక్కడి దేవతలను సేవిస్తుంటారు.. ఇప్పుడు కాలిఫోర్నియాలో అతి పెద్ద దేవాలయంగా లివర్ మోర్లో భక్తుల సేవలందుకుంటున్నది ఈ శివ-విష్ణు దేవాలయం (Hindu Cultural and Community Centre). “తొలి భూమిపూజ నాడు దీపం వెలించే భాగ్యం నాకు లభించింది. అప్పట్నుంచీ, నేను మా వారు శ్రీనివాస రావు గారు ఈ సముదాయంలోని అన్ని ఆలయాల అభివృద్ధిలో పాత్రధారుల మయిపోయాం. మేనేజ్మెంటు కమిటీలో రక రకాల బాధ్యతల్లో ఉన్నాం. కొన్ని సంవత్సరాల పాటు నేను ప్రతిరోజూ 30 మైళ్ళ (50 కి.మీ) దూరం నుంచి దేవాలయానికి సేవలకోసం వచ్చేదాన్ని. ఇప్పుడు మంగళ, శుక్రవారాలు, పర్వదినాలు ....! అనేక అద్భుతాలతో, అనేకమంది దాతల విరాళాలతో, సేవలతో నిర్మాణమయింది ఈ దేవాలయం. గత నాలుగున్నర దశాబ్దాలలో ఇందులో ప్రతి మందిరంలోనూ మా చేత ఏదో ఒక పాత్రను ధరింపజేసి, ఈ దేవాలయంతో మా అనుబంధాన్ని అమ్మవారు సుసంపన్నం చేస్తోంది. పన్నెండేళ్ళకోసారి చొప్పున ఇప్పటిదాకా జరిగిన నాలుగు కుంభాభిషేకాల్లో ఉన్నాను. ఏనాడూ అమ్మవారు నన్ను విశ్రాంతి తీసుకోనివ్వలేదు. ఎంతకాలం ఆమె ఇలా శక్తినిస్తే, అంతవరకూ సేవిస్తూనే ఉంటాను..." అంటారు భక్తురాలు విజయలక్ష్మి. (చదవండి: ధర్మచక్ర ప్రవర్తనా పూర్ణిమ) -
Vijayawada: దుర్గమ్మకు భారీగా దసరా ఆదాయం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో రూ.16 కోట్ల మేర ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ భ్రమరాంబ తెలిపారు. ఇంద్రకీలాద్రి మహా మండపం ఆరో అంతస్తులో ఆమె సోమవారం విలేకరులకు ఉత్సవ ఆదాయ వ్యయాలను వివరించారు. హుండీ కానుకల ద్వారా రూ.9.11 కోట్లు, దర్శన టికెట్ల ద్వారా రూ.2.50 కోట్లు, ప్రసాదాల విక్రయాలతో రూ.2.48 కోట్లు, ఆర్జిత సేవల టికెట్ల ద్వారా రూ.1.03 కోట్లు, తలనీలాల ద్వారా రూ.20 లక్షలు, విరాళాలు ఇతరత్రా కలిపి రూ.16 కోట్ల ఆదాయం సమకూరిందని వివరించారు. ఉత్సవాల ఏర్పాట్లు, ప్రొవిజన్స్, ఇతర ఖర్చులకు రూ.10.50 కోట్ల మేర వెచ్చించామని తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ, వైదిక కమిటీ సభ్యుడు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, ఈఈలు కోటేశ్వరరావు, రమా పాల్గొన్నారు. 26 నుంచి కార్తిక మాసోత్సవాలు ఈ నెల 26 నుంచి నవంబర్ 23వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై కార్తిక మాసోత్సవాలను వైభవంగా నిర్వహి స్తామని ఈఓ భ్రమరాంబ తెలిపారు. 23వ తేదీన ధనత్రయోదశి సందర్భంగా మహాలక్ష్మి యాగం, 24న దీపావళి సందర్భంగా అమ్మవారి ప్రధాన ఆలయంలో ధనలక్ష్మి పూజ, సాయంత్రం ఏడు గంటలకు ఆలయ ప్రాంగణంలో దీపావళి వేడుకలు నిర్వహిస్తామన్నారు. 25వ తేదీ సూర్యగ్రహణం నేపథ్యంలో ఉదయం 11 గంటలకు ఆలయాన్ని మూసివేసి, 26 ఉదయం ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామన్నారు. నవంబర్ ఎనిమిదో తేదీన చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం ఎనిమిది గంటలకు అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాలను మూసివేసి మరుసటిరోజు ఉదయం పూజల అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. నవంబర్ 4 నుంచి భవానీ మండల దీక్షలు నవంబర్ నాలుగో తేదీ నుంచి భవానీ మండల దీక్షలు, 24వ తేదీ నుంచి అర్ధమండల దీక్షలు ప్రారంభమవుతాయని ఈఓ తెలిపారు. డిసెంబర్ 15వ తేదీ నుంచి భవానీ దీక్ష విరమణలు ప్రారంభమై 19వ తేదీ పూర్ణాహుతితో ముగుస్తాయని పేర్కొన్నారు. డిసెంబర్ ఏడో తేదీన సత్యనారాయణపురం రామకోటి నుంచి కలశజ్యోతుల మహోత్సవం ప్రారంభమవుతుందని తెలిపారు. (క్లిక్ చేయండి: గుండెకు ‘ఆరోగ్యశ్రీ’ అండ) -
దుర్గమ్మను దర్శించుకున్న సాయిధరమ్ తేజ్..
Sai Dharam Tej And His Family: హీరో సాయిధరమ్ తేజ్ కుటుంబ సమేతంగా సోమవారం విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి ప్రసాదాలను, శేషవ్రస్తాలను బహూకరించారు. ఎప్పుడూ విజయవాడ వచ్చిన తప్పకుండా అమ్మవారిని దర్శించుకుంటానని సాయి ధరమ్ తేజ్ తెలిపాడు. చాలా ప్రశాంత వాతావరణంలో దర్శనం జరిగిందన్నాడు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకొని కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కు లు చెల్లించుకున్నట్లు సాయిధరమ్‌తేజ్ కుటుంబ సభ్యులు తెలిపారు. -
భక్తులు పెద్ద మనసుతో క్షమించాలి: డీజీపీ
సాక్షి, విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు బుధవారం దర్శించకున్నారు. దర్శనానంతరం మంత్రి మాట్లాడుతూ.. 'అమ్మవారి కృపా కటాక్షాలు, ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించా. మంగళవారం మూలా నక్షత్రం రోజున లక్ష మందికి పైగా మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నిన్న అధిక సంఖ్యలో భక్తులు వచ్చినా చివరి భక్తుడి వరకు దర్శనం కల్పించాము. అందుకు సహకరించిన రెవెన్యూ, పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను' అని మంత్రి వెల్లంపల్లి అన్నారు. భక్తులు పెద్ద మనసుతో క్షమించాలి: డీజీపీ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని డీజీపీ గౌతమ్ వాంగ్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనం పొందారు. దర్శనానంతరం డీజీపీ మాట్లాడుతూ.. దసరా నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. వాటిని భక్తులు పెద్ద మనసుతో క్షమించాలి. దసరా శరన్నవరాత్రిలో పోలీసుల పాత్ర చాలా కీలకమైంది. విధి నిర్వహణ నిర్వహిస్తున్న పోలీసులందరికీ నా కృతజ్ఞతలు. దసరా నవరాత్రి ఉత్సవాలలో పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను సీపీ బత్తిన శ్రీనివాసులు ముందుండి జరిపించడం చాలా సంతోషకరంగా ఉంది' అని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. చదవండి: (ఇంద్రకీలాద్రిపై వర్షం.. భక్తుల హర్షం) -
దుర్గమ్మకు కానుకగా రూ. 5 లక్షల స్వర్ణ హారం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు రూ.5 లక్షల విలువైన బంగారు డైమండ్ కంఠాభరణాన్ని శుక్రవారం కానుకగా సమర్పించారు. హైదరాబాద్‌కు చెందిన మహాలక్ష్మయ్య దంపతులు శనివారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చి ఆలయ ఈవో భ్రమరాంబ, ప్రధాన అర్చకులు లింగంభోట్ల దుర్గాప్రసాద్‌లకు డైమండ్ హారాన్ని అందచేశారు. దాతలకు అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అధికారులు, పాలక మండలి సభ్యురాలు కటకం శ్రీదేవి అమ్మవారి చిత్రపటం, ప్రపాదం, శేషవస్త్రాలను అందజేశారు. ఈవోకు బంగారు హారాన్ని అందచేస్తున్న దాతలు -
దసరా ఉత్సవాల దృష్ట్యా దుర్గగుడి ఆలయ కమిటీ నిర్ణయాలు
సాక్షి,విజయవాడ: దసరా ఉత్సవాలు విజయవాడలో ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడి కూడా అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దుర్గగుడి ఆలయ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా టైం స్లాట్ ప్రకారమే దర్శనాలు ఉంటాయని తెలిపింది. రోజుకు 10 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉన్నట్లు పేర్కొంది. భక్తుల ఉచిత దర్శనాల కోసం 2 క్యూలైన్లు ఏర్పాటు చేయగా, ఆన్లైన్లో టైం స్లాట్ ప్రకారం రూ.100, రూ.300 దర్శన టికెట్లు అందుబాటులో ఉంచునుంది. కాగా ఆన్లైన్ టికెట్ల కోసం http://aptemples.ap.gov.in వెబ్సైట్ ఏర్పాటు చేశారు. చదవండి: ఆయనే విద్యార్థి.. ఆయనే గురువు -
21న దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: దసరా పండుగ సందర్భంగా ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ మేరకు దేవదాయ శాఖ ఉత్త్తర్వులిచ్చింది. ఈనెల 17 నుంచి 25 వరకు ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. -
దుర్గమ్మను దర్శించిన మోహన్ భగవత్..
-
దుర్గమ్మను దర్శించిన మోహన్ భగవత్..
సాక్షి, విజయవాడ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ విజయవాడ దుర్గమ్మను శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో, అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం తీర్ధ ప్రసాదాలను అందచేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనం పొందారు. భగవత్‌కు ఆలయ అధికారులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనకు దుర్గ గుడిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల వివరాలను అధికారులు వివరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలోని విజ్ఞాన విహార్ పాఠశాలలో నేటి నుంచి మూడు రోజులు జరగనున్న ఆర్ఎస్ఎస్ రాష్ట్ర పదాధికారుల సమావేశాన్ని మోహన్ భగవత్ ప్రారంభిస్తారు. ఆయన మూడురోజులూ ఈ సమావేశాల్లో పాల్గొంటారు. మంగళగిరి రూరల్ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసం సందడి
-
ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసం సందడి
-
ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసం సందడి
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం సందడి నెలకొంది. శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి శుక్రవారం పెద్దసంఖ్యలో అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం మొదటి వారం నుండే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించుకొని అమ్మవారి దర్శనానికి భక్తులు వస్తున్నారు. దుర్గమ్మని దర్శించుకోవడం ఆనందంగా ఉందని భక్తులు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఇంద్రకీల్రాదిపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. శ్రావణ శోభకు కరోనా దెబ్బ.. శ్రావణ మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. మహిళలు ఈ మాసం అత్యంత శుభ ప్రదమైనదిగా భావించి నోములు, వ్రతాలు నోచుకుని, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇక పెళ్లిళ్లు తది తర శుభకార్యాలకు ఇది దివ్యమైన మాసం. ఈ నెల రోజులు నగరంలో పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. ప్రతి ఏడాది అన్ని రకాల వ్యాపారాలు జోరుగా సాగుతాయి. అయితే కరోనా ఎఫెక్ట్‌తో శ్రావణం మూగబోయే పరిస్థితి నెలకొంది. -
ప్లైఓవర్‌పై రయ్ రయ్..
-
దుర్గమ్మ గుడిలో ట్రైల్ రన్
-
విజయవాడ: దుర్గమ్మ దర్శనానికి గ్రీన్ సిగ్నల్
-
తలసాని ఎఫెక్ట్; దుర్గగుడిలో నిషేధాజ్ఞలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ పవిత్రతను కాపాడేందుకు దేవస్థానం అధికారులు నిషేధాజ్ఞలను అమలులోకి తీసుకొచ్చారు. ఏపీ పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో దుర్గగుడి ఆలయ ప్రాంగణంలోని ఈవో ఛాంబర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు పాలన సరిగాలేదని, ప్రజలు అసంతృప్తితో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. తలసాని వ్యాఖ్యలతో రాజకీయ దుమారం లేచింది. ఈ నేపథ్యంలో ఈవో కోటేశ్వరమ్మ దుర్గగుడి ఆలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయానికి వచ్చే ప్రముఖలు ఇక్కడ మీడియా సమావేశాలు ఏర్పాటు చేయకూడదన్నారు. ఆలయ ప్రాంగణంలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు, వ్యక్తిగత, వ్యాపారానికి సంబంధించి బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని ఆంక్షలు విధించారు. దుర్గగుడి ప్రతిష్టను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈవో కోరారు. -
అమ్మవారి ఆరగింపు
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెల్లవారుజామున బాలభోగ నివేదనతో పాటు మధ్యాహ్నం మహానివేదన సమర్పిస్తారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు వంటశాల నుంచి నివేదనలను ఆలయానికి తీసుకువచ్చి దుర్గా మల్లేశ్వరస్వామివార్లతో పాటు ఉపాలయాలలోని దేవతామూర్తులకు సమర్పిస్తారు. ఈ ప్రసాదాలను మహా మండపం ఆరో అంతస్తులో ఉన్న వంటశాలలో తయారుచేస్తారు. అమ్మవారికి నివేదనను సకాలంలో సమర్పించేందుకు వీలుగా ఉప ప్రధాన అర్చకులు కోటప్రసాద్, అర్చకులు రంగావఝల శ్రీనివాసశాస్త్రి పర్యవేక్షకులుగా ఉంటారు. తొలిపూజ – నివేదన లోక కళ్యాణార్థమే తెల్లవారుజామున 2–30 గంటలకు అమ్మవారి ఆలయం తెరిచిన తరువాత తొలిపూజను లోకకళ్యాణార్థం చేస్తారు. అర్చనానంతరం అమ్మవారికి బాలభోగంగా దద్ధ్యోదనాన్ని ఉదయం ఆరు గంటలకు నివేదన చేస్తారు. ఉదయం 8–30 గంటలకు కట్టె పొంగలి, బూందీ లడ్డూ, ఉదయం 10–30 గంటలకు పులిహోర, సాయంత్రం 4–30 గంటలకు సెనగలు, పాలు సమర్పిస్తారు. ఉదయం 11–40 గంటలకు అన్ని దర్శనాలను నిలిపివేసిన, ఆలయాన్ని శుభ్రం చేసి, మహానివేదనగా అన్నం, రెండు కూరలు, పప్పు, సాంబారు, పాయసం, గారెలను అమ్మవారికి నివేదిస్తారు. అమ్మవారికి సమర్పించిన చిత్రాన్నాన్ని ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. తాజాగా ఈ సంవత్సరం దసరా ఉత్సవాల నుంచి అమ్మవారికి అప్పాలను నివేదించి, భక్తులకు ఉచితంగా అందచేయనున్నారు. దసరా ఉత్సవాలలో ప్రత్యేకం... సాధారణ రోజులలో మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన సమర్పిస్తుండగా, దసరా ఉత్సవాల సమయంలో మాత్రం సాయంత్రం 6–30 గంటలకు మహా నివేదన సమర్పిస్తారు. ఉదయం ఏడు గంటలకు వడలు, పది గంటలకు అమ్మవారికి రాజభోగాలుగా చక్కెర పొంగలి, పులిహోర, పాయసం, రవ్వకేసరి, పరమాన్నం, బూందీ లడ్డూ, గారెలను సమర్పిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు పంచభోగాలను నివేదిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు అన్ని దర్శనాలను నిలిపివేసిన తర్వాత ఆలయాన్ని శుభ్రం చేసి మహానివేదన సమర్పిస్తారు. అనంతరం పంచహారతులు, చతుర్వేద స్వస్తి జరుగుతుంది. దసరా ఉత్సవాలలో మహానివేదనతో పాటు మరికొన్ని వంటకాలను అమ్మవారికి నివేదనగా సమర్పిస్తున్నామని ఆలయ అర్చకులు చెబుతున్నారు. దసరా ఉత్సవాలు – అలంకారాలు – నివేదనలు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి– స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి (మైసూర్‌పాక్, పులిహోర) ఆశ్వయుజ శుద్ధ విదియ – బాలాత్రిపుర సుందరీదేవి (లడ్డూ, పెసర వడ) ఆశ్వయుజ శుద్ధ తదియ– గాయత్రీదేవి (సున్నుండలు, అరటికాయ బజ్జీ) ఆశ్వయుజ శుద్ధ చవితి – లలితాత్రిపుర సుందరీదేవి (కొబ్బరి లవుజు, మినప వడ) ఆశ్వయుజ శుద్ధ పంచమి – సరస్వతీదేవి (జాంగ్రీ, ఆవడ) ఆశ్వయుజ శుద్ధ షష్ఠి – అన్నపూర్ణాదేవి (గోధుమ హల్వా, సెనగ వడ) ఆశ్వయుజ శుద్ధ సప్తమి – మహాలక్ష్మీదేవి (చక్కెర పొంగలి, బొబ్బర్ల గారె) ఆశ్వయుజ శుద్ధ అష్టమి – దుర్గాదేవి (పాయసం, బూందీ) ఆశ్వయుజశుద్ధ నవమి/దశమి – మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరీదేవి (అప్పాలు, పెసర పునుగులు) – ఉప్పులూరు శ్యామ్ ప్రకాష్, విజయవాడ -
దుర్గమ్మను దర్శించుకున్న కర్ణాటక సీఎం