విజయవాడ: దుర్గమ్మ ఆలయంలో అధికారుల తీరుతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారికి లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చిన దాతలకు ఉత్సవాల సమయంలో వీఐపీలు వెళ్లే దారిలో అనుమతిస్తారు. ప్రతి ఏటా ఈ పద్ధతిలోనే దాతలకు అనుమతులు కల్పిస్తూ.. పాస్‌లు జారీ చేస్తున్నారు. కానీ ఈ ఏడాది డోనర్ పాసులతో వస్తున్న వారిని వంద రూపాయల టిక్కెట్ లైన్‌లో రావాలంటూ అధికారులు ఆదేశించడంతో.. దాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చిన తమకు కనీస మర్యాద ఇవ్వకపోవడం శోచనీయం అని అంటున్నారు. ఈ ఏడాది ఈఓగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారిణి హయంలో సదుపాయాలు మెరుగుపడతాయని తాము ఊహించామని కానీ.. దాతలకే ఇలాంటి అవమానం జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దుర్గమ్మ ఆలయంలో దాతల ఆవేదన
Published Wed, Oct 5 2016 3:51 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
Advertisement
Advertisement