donars
-
ప్లాస్మా దాతలకు కర్ణాటక ప్రోత్సాహకం
బెంగుళూరు : దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. వ్యాధి తీవ్రమయి ఆరోగ్యం క్షీణించిన వారిలో ప్రయోగాత్మకంగా అందిస్తోన్న ప్లాస్మా థెరపీకి ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే దానికి తగ్గట్లు ప్లాస్మా దాతలు తగినంతగా లభించకపోవడంతో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నా అవసరాలకు తగ్గట్లుగా ప్లాస్మా లభించడం లేదు. దీంతో దాతలు ముందుకు రావాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినతులు వెల్లువెత్తుతున్నాయి. ప్లాస్మాదాతలు లేక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా క్రమంగా అధికమవుతుంది. ఈ నేపథ్యంలో దాతలను ప్రోత్సహించేలా కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చింది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు ప్లాస్మాను దానం చేస్తే 5000 రూపాయలను ప్రోత్సాహకంగా అందిస్తామని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి బి శ్రీరాములు ఓ ప్రకటన విడుదల చేశారు. (‘కరోనా నుంచి దేవుడే మనల్ని కాపాడాలి’) దేశంలో అత్యధిక ప్లాస్మా పద్ధతిని ఉపయోగిస్తున్న రెండవ రాష్ర్టం కర్ణాటక అని మంత్రి అన్నారు. దాదాపు 80 శాతం కరోనా రోగులు ఈ పద్ధతి ద్వారా త్వరగా కోలుకున్నారని తెలిపారు. అయితే ప్రాణదాతలుగా గొప్ప దాతృత్వాన్ని ప్రదర్శించాల్సిన సమయంలో దీన్ని కూడా డబ్బుతో పోల్చడంపై వస్తున్న విమర్శలను మంత్రి కొట్టిపారేశారు. ఇది ఎవరినీ అవమానించడం కాదని కేవలం దాతలను ప్రోత్సహించే ఉద్దేశం మాత్రమేనని అన్నారు. రాష్ర్ట రాజధాని బెంగుళూరులో కరోనా తీవ్రరూపం దాలుస్తుంది. అన్‌లాక్ 1 ప్రారంభ దశలో 600 కన్నా తక్కువ ఉన్న కరోనా కేసుల తీవ్రత ఇప్పడు 22 వేలు దాటింది. దీంతో రాష్ర్ట వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 47,000 దాటింది. గత 24 గంటల్లోనే అత్యధికంగా 3176 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. (బాదేసే బిల్లు) -
పల్లె ప్రగతిలో డోనర్స్ డే కార్యక్రమం
పల్లె ప్రగతి కోసం దాతలు ముందుకు వస్తున్నారు. లక్షలాది రూపాయలు విరాళంగా అందిస్తున్నారు. అయితే దాతలు ఇచ్చిన సొమ్మును ఇష్టానుసారం ఖర్చు చేస్తే కుదరదు. విరాళాలు ఇచ్చిన వారు సూచించిన పనులే చేపట్టాల్సి ఉంటుంది. లేకపోతే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవు. సాక్షి, మోర్తాడ్(నిజామాబాద్): పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఆదివారం డోనర్స్ డే, పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు నిర్వహించారు. పల్లెల అభివృద్ధి కోసం దాతలు చాలామంది ముందుకు వచ్చారు. మొదట గ్రామాల అభివృద్ధి కోసమే విరాళాలు సేకరించాలని ప్రభుత్వం భావించినా.. ఆ తర్వాత పాఠశాలల్లో సమస్యల పరిష్కారంపైనా దృష్టి సారించారు. ఆయా పాఠశాలల్లో గతంలో చదువుకున్నవారితో పూర్వ విద్యార్థుల సమ్మేళనాలను నిర్వహించాలని నిర్ణయించి అన్ని గ్రామాల పరిధిలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఆదివారం నిర్వహించిన డోనర్స్ డే, పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో దాతలనుంచి విరాళాలు ఆహ్వానించారు. కొంత మంది వస్తు రూపంలో సాయం అందించగా.. మరికొందరు నగదు సాయం చేశారు. ఇలా ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో రూ. 50 వేల నుంచి రూ.10 లక్షల వరకు విరాళాలు వచ్చినట్లు తెలుస్తోంది. పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమం ఈనెల 12వ తేదీ వరకు కొనసాగనుంది. ఈలోపు మరికొందరు దాతలు ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఇలా వచ్చిన విరాళాల సొమ్ము వినియోగం విషయంలో స్పష్టత లేకపోవడంతో కొంత గందరగోళం నెలకొంది. దీనికి ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టింది. దాతలు ఇచ్చిన విరాళంతో వారు సూచించిన పనులను చేపట్టాలని సూచించింది. అలాగే పాఠశాలల అభివృద్ధికి వచ్చిన విరాళాలనూ పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. దీంతో విరాళం ఇచ్చిన సొమ్మును ఎందుకోసం ఖర్చు చేయాలి అని పంచాయతీ ఉద్యోగులు స్పష్టత తీసుకుంటున్నారు. దాతలు ఫలానా పని చేయాలని సూచిస్తే ఆ పనే చేయాల్సి ఉంటుంది. వారు ఏ పనీ సూచించకపోతే పంచాయతీ తీర్మానం ప్రకారం సొమ్మును ఖర్చు చేయాలి. కలెక్టర్ ఖాతాకు చేరిన నిధులు పంచాయతీలకు.. పల్లెల అభివృద్ధి కోసం ముందుకు వచ్చేవారు విరాళం ఇవ్వడానికి కలెక్టర్ ఖాతా నంబర్‌ను ప్రకటించారు. కలెక్టర్ ఖాతాకు చేరిన నిధులను దాతలు సూచించిన పంచాయతీ ఖాతాకు బదలాయించనున్నారు. విరాళం సొమ్ము పక్కదారి పడితే అభాసు పాలయ్యే ప్రమాదం ఉండడంతో పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. లెక్కలు పక్కాగా ఉంటాయి గ్రామ పంచాయతీలకు ఇచ్చిన విరాళాల లెక్క పక్కాగా ఉంటుంది. పాఠశాలలకు ఇచ్చిన విరాళాలు కూడా పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలి. దాతలు సూచించిన పనులకే నిధులను ఖర్చు చేయనున్నాం. – పీవీ శ్రీనివాస్, డీఎల్పీవో, ఆర్మూర్ -
పారదర్శకతను పక్కన పెట్టిన ‘ఆప్’
సాక్షి, న్యూఢిల్లీ : పలు ఉన్నత ఆశయాలతో ప్రజల ముందుకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుత ఎన్నికల రాజకీయ రంగంలో వాటిని నిలబెట్టుకోలేక ఒక్కొక్కదాన్ని వదిలేస్తూ వస్తోంది. ఈ వైఖరి నచ్చక ఉన్నత ఆశయాలతో పార్టీలోకి వచ్చిన వారు ఒక్కొక్కరే పార్టీకి దూరం కూడా అవుతున్నారు. ముందుగా పార్టీ వెబ్సైట్లో పార్టీకి విరాళాలు ఇచ్చిన దాతల పేర్లను పెట్టిన ఆప్ ఆ తర్వాత వాటిని తొలగించింది. తమ పార్టీకి విరాళాలిచ్చిన భారతీయులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేధిస్తున్న కారణంగా వారి వివరాలను వెబ్సైట్లో పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నాయకుడు, ఢిల్లీ కార్మిక మంత్రి గోపాల్ రాయ్ మీడియాకు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యదర్శి పంకజ్ గుప్తా ఇందుకు పూర్తి భిన్నంగా మాట్లాడారు. ‘ఈ విషయంలో బీజేపీ నుంచి వేధింపులు ఉన్నాయనడం అబద్ధం. వాస్తవానికి పార్టీతోపాటు దాతలు కూడా వారి పేర్లను వెబ్సైట్ ద్వారా వెల్లడించాలనే కోరుకుంటున్నారు. ఆ సమాచారాన్ని ప్రజలు నేరుగా వీక్షించేందుకు వీలుండాలిగానీ దుర్వినియోగం చేయడానికి వీలు ఉండకూడదు. అయితే అందుకు వెబ్‌సైట్‌ను మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. దానికి బ్రాండ్ విడ్త్ సరిపోవడంలేదు. మా సాంకేతిక బృందం సాంకేతిక పరిష్కారం కనుగొనే పనిలో ఉన్నారు. పార్టీ దాతల వివరాలను ఎలాగూ ఎన్నికల కమిషన్‌కు ఇస్తాం కదా!. 98 శాతం దాతలు తెల్సిన వారే’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేశాక దాతల వివరాలను మళ్లీ వెబ్సైట్లో పెడతామన్నట్లుగా ఆయన మాట్లాడారు. 2016 సంవత్సరంలో కూడా డోనర్ల పేర్లను ఆప్ వెబ్సైట్లో పెట్టి ఆ తర్వాత తొలగించింది. ఆ తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో మళ్లీ దాతల పేర్లను పెట్టింది. ఈసారి అలాంటి స్పందన ఉంటుందా అన్నది అనుమానమే! 2014–15 ఆర్థిక సంవత్సరానికి పార్టీకి అందిన వాస్తవ వివరాలకు, ఆదాయం పన్ను శాఖకు సమర్పించిన వివరాలకు పొంతన కుదరడం లేదంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం ఇచ్చిన నివేదికను పురస్కరించుకొని ఎన్నికల కమిషన్ వారం క్రితం అంటే, సెప్టెంబర్ 11వ తేదీనే ఆప్ పార్టీకి నోటీసు ఇవ్వడం, 20 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సిందిగా అందులో కోరడం గమనార్హం. వచ్చిన మొత్తం విరాళాల్లో 13 కోట్ల రూపాయలను ఆప్ తక్కువ చేసి చూపించిందన్నది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆరోపణ. బోర్డే ఆదాయాన్ని లెక్కించడంలో తప్పు చేసిందని, తాము సమర్పించిన రిటర్న్స్‌లో అంకెలు సరిగ్గా ఉండగా, ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటీసులోనే తప్పుడు అంకెలు ఉన్నాయంటూ ఆప్ పార్టీ అధికార పార్టీ ప్రతినిధులు సమర్థించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తమపై కక్షగట్టడం వల్లనే కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమను వేధిస్తున్నాయని వారంటున్నారు. ప్రాంతీయ పార్టీలకు వస్తున్న విరాళాలను, అవి ప్రభుత్వ విభాగాలకు సమర్పిస్తున్న రిటర్న్స్‌ను ‘ది అసోసియేషన్ ఆఫ్ ది డెమోక్రటిక్ రిఫామ్స్’ లాంటి స్వచ్ఛంద సంస్థలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి. కొన్ని పార్టీలు ఇప్పటికీ ఈ విషయంలో పారదర్శకతను పాటిస్తుండగా, ఎక్కువ పార్టీలు పాటించడం లేదని సంస్థ సహ వ్యవస్థాపకుడు, బెంగళూరులోని ఐఐఎం ప్రొఫెసర్ త్రిలోచన్ శాస్త్రి తెలిపారు. 2016–2017 సంవత్సరానికి ఆదాయం పన్ను శాఖ నివేదిక ప్రకారం ఆప్ పార్టీ ఆదాయం 30.8 కోట్ల రూపాయలు. కార్పొరేట్ సంస్థలు, వ్యక్తిగత విరాళాలు, పార్టీ కార్యకర్తల నుంచి వచ్చినట్లు ఆ పార్టీ చూపించిన విరాళాలు 24.7 కోట్ల రూపాయలు. రెండింటి మధ్య వ్యత్యాసం 6.1 కోట్ల రూపాయలు. వాటిలో వ్యక్తుల నుంచి వచ్చిన విరాళాల మొత్తం 20.8 కోట్ల రూపాయలు కాగా, కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చిన విరాళాలు 3.8 కోట్ల రూపాయలు. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు 20 వేల రూపాయలకు మించి వచ్చిన విరాళాల వివరాలను విధిగా వెల్లడించాలి. కానీ ఈరోజుల్లో చాలా రాజకీయ పార్టీలు పారదర్శకంగా వ్యవహరించడం లేదని శాస్త్రి ఆరోపించారు. నేడు అన్ని రాజకీయ పార్టీలు విరాళాలు వచ్చిన సోర్స్ వెల్లడించకుండా దాచాలని కోరుకుంటున్నాయని, అంటే అందులో దాచాల్సిన అంశమేదో కచ్చితంగా ఉన్నట్లేనని, ఏదిఏమైనా పారదర్శకత అత్యవసరమని డెమోక్రటిక్ రిఫామ్స్ సంస్థ వ్యవస్థాపకులు, అహ్మదాబాద్‌లోని ఐఐఎం మాజీ డీన్ జగధీప్ ఛోకర్ వ్యాఖ్యానించారు. అంటే, ఆప్ పార్టీ కూడా విరాళాల సోర్స్‌ను వెల్లడించకుండా ఏదో దాచేందుకు ప్రయత్నిస్తుందన్నది సుస్పష్టం. -
సాక్షి టీవి కథనంతో స్పందించిన దాతలు
-
మావుళ్లమ్మ సన్నిధిలో భక్తుల కిటకిట
భీమవరం (ప్రకాశం చౌక్) : పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ దర్శనం కోసం శుక్రవారం భక్తులు భారీగా తరిలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు చీరలు, జాకెట్ ముక్కలు సమర్పించారు. హైదరాబాద్‌కు చెందిన గరిషే రవీందర్, మంజులా దంపతులు 60 గ్రాముల 800 మిల్లీ గ్రాముల (రాళ్ల, పూసలతో సహా )బంగారం హారం బహుకరించారు. ఆలయ ఈవో నల్ల సూర్యచక్రధరరావు దాతలను అభినందించారు. ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. అలాగే అమ్మవారిని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కుటుంబ సభ్యులతో కలిసి దర్శంచుకున్నారు. -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదాన పథకానికి నగరానికి చెందిన భక్తులు విరాళం అందచేశారు. పటమటకు చెందిన కోనేరు మురళీకృష్ణ, విజయలక్ష్మి దంపతులు భోగి పండుగను పురస్కరించుకుని శుక్రవారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చారు. వారు నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116ల విరాళాన్ని ఈవో సూర్యకుమారికి అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి, ప్రసాదాలను అందజేశారు. -
మావుళ్లమ్మకు బంగారం సమర్పణ
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం మావుళ్లమ్మవారికి పట్టణానికి చెందిన దాతలు గొట్టుముక్కల సుబ్బరాజు, గొట్టుముక్కల అచ్యుతరామరాజు, వత్సవాయి సూర్యు ఉమాభారతి గురువారం 44 గ్రాముల బంగారం సమర్పించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కార్మూరి సత్యనారాయణమూర్తి, ధర్మకర్తలు శిరిగినీడి చంద్రశేఖర్, కట్టా వెంకటేశ్వరరావు,లంకీ శ్రీనివాసరావు, అడ్డాల సత్యనారాయణ,కారెంపూడి ఆదిలక్ష్మి పాల్గొన్నారు -
దుర్గమ్మ ఆలయంలో దాతల ఆవేదన
విజయవాడ: దుర్గమ్మ ఆలయంలో అధికారుల తీరుతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారికి లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చిన దాతలకు ఉత్సవాల సమయంలో వీఐపీలు వెళ్లే దారిలో అనుమతిస్తారు. ప్రతి ఏటా ఈ పద్ధతిలోనే దాతలకు అనుమతులు కల్పిస్తూ.. పాస్‌లు జారీ చేస్తున్నారు. కానీ ఈ ఏడాది డోనర్ పాసులతో వస్తున్న వారిని వంద రూపాయల టిక్కెట్ లైన్లో రావాలంటూ అధికారులు ఆదేశించడంతో.. దాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చిన తమకు కనీస మర్యాద ఇవ్వకపోవడం శోచనీయం అని అంటున్నారు. ఈ ఏడాది ఈఓగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారిణి హయంలో సదుపాయాలు మెరుగుపడతాయని తాము ఊహించామని కానీ.. దాతలకే ఇలాంటి అవమానం జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రక్తనిధికి 30 శాతం రక్తం ఇవ్వాల్సిందే!
–ఏపీ శ్యాక్స్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి కర్నూలు(హాస్పిటల్): ప్రై వేటు రక్తనిధులు క్యాంపుల ద్వారా సేకరించే రక్తంలో 30శాతం రక్తాన్ని ప్రభుత్వ రక్తనిధులకు తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని ఏపీ శ్యాక్స్(ఎయిడ్స్ నియంత్రణ సంస్థ) జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఆదేశించారు. శుక్రవారం ఆమె కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని రక్తనిధిని పరిశీలించారు. రక్తనిధిలోని రక్త ప్యాకెట్ నిల్వలను పరిశీలించారు. రక్తం సేకరించిన తేది, ఎక్స్పైరీ తేదీలను చూశారు. ఇందులో రెండు ప్యాకెట్లు కాలం తీరిపోయి ఉండటాన్ని ఆమె గమనించి సిబ్బందిని మందలించారు. స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు అవసరం మేరకే నిర్వహించాలని, అవసరం లేకుండా చేసి ఇలా రక్తాన్ని వృథా చేయవద్దని సూచించారు. రక్తదాతకు పరీక్ష చేసేటప్పుడు హెచ్ఐవీ పాజిటివ్ వస్తే ఐసీటీసీలో లింక్ చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. మూడు నెలలకు ఒకసారి ఆసుపత్రిలోని హెచ్‌వోడీలతో సమావేశమై వారి రక్తం అవసరాలు ఎంత మేరకు ఉన్నాయో తెలుసుకుంటే డిమాండ్ ఎంత ఉందో తెలుస్తుందన్నారు. రెడ్‌క్రాస్ రక్తనిధి నుంచి 30 శాతం రక్తం ఇవ్వడం లేదని అక్కడున్న వైద్యులు జేడీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆమె వెంటనే రెడ్‌క్రాస్ మెడికల్ ఆఫీసర్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. తాము ఇప్పటికే నెలకు 100 మందికి పైగా తలసీమియా రోగులకు రక్తాన్ని ఉచితంగా ఇస్తున్నామని, అందుకే 30 శాతం రక్తాన్ని ఇవ్వడం లేదని సమాధానం ఇచ్చారు. తలసీమియా రోగులకు ఇచ్చినా నిబంధనల ప్రకారం ప్రభుత్వ రక్తనిధికి 30 శాతం రక్తాన్ని ఇచ్చి తీరాల్సిందేనని ఆమె ఆదేశించారు. అన్ని ప్రైవేటు రక్తనిధులు ఈ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ రూపశ్రీకి సూచించారు. అనంతరం ఆమె ఐసీటీసీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. వారానికి ఒకసారి ఏఆర్టీ సెంటర్‌కు రాని హెచ్ఐవీ బాధితుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించడం లేదని గుర్తించి మందలించారు. ఆమె వెంట ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డివిజనల్ అసిస్టెంట్ పీటర్ పాల్, జిల్లా మేనేజర్ అలీ హైదర్, బ్లడ్‌బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేవతి, ఐసీటీసీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
కన్నీళ్లు తుడుస్తాం
ఆదోని: పట్టణంలోని దివాకర్ రెడ్డి నగర్లో పూరి గుడిసెలో నివాసం ఉంటున్న తపాల నరసమ్మ కష్టాలు పంచుకొని.. కన్నీటిని తుడిచేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ‘‘కష్టాలకే కన్నీళ్లొస్తే..’’ శీర్షికన ‘సాక్షి’లో గరువారం ప్రచురితమైన కథనాన్ని దాతలు నిండు మనసుతో స్పందిస్తున్నారు. ఏడేళ్లలోపు ఇద్దరు పిల్లలు.. ఏ అవయవం పనిచేయక జీవచ్ఛవంలా మారిన భర్త పోషణకు ఆమె సాగిస్తున్న జీవన పోరాటం వేదనా భరితం. ఈ నేపథ్యంలో ఆదోని పట్టణంలోని అంగన్వాడీ సెంటర్–126కు చెందిన ఉపాధ్యాయురాలు ఆమెకు తోచిన ఆర్థిక సాయం అందించారు. చాలా మంది ఆమె ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్ కావాలని ‘సాక్షి’ విలేకరికి ఫోన్ చేశారు. నరసమ్మ ఫోన్ నెంబర్ : 9100315870 ఆంధ్రా బ్యాంకు, ఆదోని ఖాతా నెం.000210100113833(ఐఎఫ్ఎస్సీ కోడ్: ఏఎన్డిబి0000002) -
చినవెంకన్న ఆలయానికి 101 ఎల్ఈడీ బల్బుల బహూకరణ
ద్వారకాతిరుమల : చినవెంకన్న ఆలయానికి ఒక దాత 101 చైనా ఎల్ఈడీ బల్బులను దేవస్థానానికి అందజేశారు. గుడివాడకు చెందిన ఎన్.మీనాకుమారి, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలు శరణాల మాలతీరాణితో కలసి వచ్చి ఈ ల్యాంప్స్‌ను దేవస్థానం ఛైర్మన్ సుధాకరరావుకు అందించారు. ఈ సందర్భంగా సుధాకరరావు మాట్లాడుతూ చైనాలో వ్యాపారం చేస్తున్న మీనాకుమారి అందించిన ఈ ల్యాంప్‌ల విలువ రూ. 2,12,100 అని చెప్పారు. మాలతీరాణి మాట్లాడుతూ చినవెంకన్న ఆలయానికి అశ్వాలు (గుర్రాలు) కూడా ఉంటే బాగుంటుందని, తాను బహుమతిగా ఒక అశ్వాన్ని అందజేస్తానని అన్నారు. నివతరావు, ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు, ఈఈ డీవీ భాస్కర్, రిటైర్డ్ ఈవో వీవీఎస్ఎన్.మూర్తి, ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు వెంపరాల నారాయణమూర్తి, ఉంగుటూరు మండలం బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు శోభారాణి పాల్గొన్నారు. -
పెద్దింటి అమ్మవారికి కాసుల హారం
ఆకివీడు: ఆకివీడు ఇలవేల్పు పెద్దింటి అమ్మవారికి 21 కాసుల బంగారంతో చేయించిన హారాన్ని అయిభీమవరం గ్రామానికి చెందిన కనుమూరు వెంకట కృష్ణంరాజు, సుబ్బలక్ష్మి దంపతులు ఆదివారం సమర్పించారు. రూ.5 లక్షల విలువైన బంగారంతో హారాన్ని తయారుచేయించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించి హారాన్ని బహూకరించారు. అనంతరం అర్చకులు హారాన్ని అమ్మవారికి అలంకరించారు. ఏఎంసీ చైర్మన్ మోటుపల్లి ప్రసాద్, సర్పంచ్ గొంట్లా గణపతి, బొల్లా వెంకట్రావు, కిమిడి నాగరాజు, ఇల్లాపు అప్పారావు, సన్నిధి లక్ష్మణరావు, బోర్డు సభ్యులు, ఆలయ మేనేజర్ ఫణి కిషోర్ పాల్గొన్నారు. -
దాతలచే పెద్దాసుపత్రి అభివృద్ధి
–ఏపీహెచ్ఆర్డీఐకి ప్రతిపాదన –ఎన్టిఆర్ వైద్యసేవ చీఫ్ ర్యాంకో డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్ కర్నూలు(హాస్పిటల్): కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిని వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ దత్తత తీసుకుని అభివృద్ధి చేసినట్లుగా, కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలను దాతలచే అభివృద్ధి చేయాలని ఆసుపత్రి ఎన్టీఆర్ వైద్యసేవ చీఫ్ ర్యాంకో డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఈ మేరకు ఏపీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్సిట్యూట్(ఏపీహెచ్ఆర్డీఐ)కి ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. శనివారం ఆయన తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు గుంటూరు జిల్లా బాపట్లలో ఏపీహెచ్ఆర్డీఐ ఆధ్వర్యంలో ‘హెల్త్ కేర్ ఇన్ ఇండియా–స్ట్రాటెజిక్ పర్సెస్పెక్టీవీస్’ అనే అంశంపై సదస్సు నిర్వహించారన్నారు. సదస్సుకు మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి వైద్యాధికారులు హాజరయ్యారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రులను ఏ విధంగా బలోపేతం చేయాలన్న అంశంపె చర్చించారన్నారు. ఇందులో భాగంగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు డీఎన్బీ కోర్సు ద్వారా స్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ కోర్సులు చేసి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించాలని సూచించారన్నారు. డీఎన్బీ కోర్సు పీజీ, డీఎం,ఎంసీహెచ్ స్థాయి కోర్సుతో సమానమని ది గజిట్ ఆఫ్ ఇండియాలోనే పేర్కొన్నారని తెలిపారు. ఆ దిశగా వైద్యులు డీఎన్బీ ద్వారా స్పెషాలిటి కోర్సులు చేయాలని సూచించారు. దీంతో పాటు ఫైబర్ గ్రిడ్‌తో ఇంటర్నెట్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే గ్రామీణ రోగులను పరిశీలించి, వివరాలను ఆన్లైన్ ద్వారా జిల్లా కేంద్రంలోని స్పెషలిస్టు వైద్యులకు పంపించి, వారి ద్వారా వైద్యసేవలు అందించేందుకు సైతం ప్రతిపాదనలు చేస్తున్నారన్నారు. -
రికవరీ వ్యాన్ అందజేత
పట్నంబజారు (గుంటూరు) : అర్బన్ జిల్లా పరిధిలో ట్రాఫిక్ Sనియంత్రణ కోసం పోలీసులకు ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం రికవరీ వ్యాన్‌ను అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో క్లబ్ అధ్యక్షుడు రాయపాటి శ్రీనివాస్ రూ.19.50 లక్షలు విలువ చేసే ఈ రికవరీ వ్యాన్‌ను అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి అందజేశారు. అనంతరం జెండా ఊపి వ్యాన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ త్రిపాఠి మాట్లాడుతూ పోలీసు శాఖకు సహకరిస్తూ రికవరీ వ్యాన్‌ను అందజేయడం సంతోషకరమన్నారు. క్లబ్అధ్యక్షుడు రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు జె.భాస్కరరావు, బీపీ తిరుపాల్, ఇ.సుబ్బారాయుడు, డీఎస్పీలు కండె శ్రీనివాసులు, కేజీవీ సరిత, పి.శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. -
దాతల స్థానంలో కబ్జాకోర్లు
సందర్భం ముంబై పురపాలక సంస్థ 1888 నాటి శాసనం ద్వారా ఏర్పడక ముందే ఆ నగరం పలు సౌకర్యాలను అందించే వారి కోసం వెతికేది. ఇలా నగరానికి సహాయ పడినవా రిలో ఇద్దరు ఎన్నిక కాని నేత లు.. జంషెడ్జీ జేజేభాయ్, జగ్గునాథ్ సుంకర్‌సేట్ ఉన్నా రు. నగరానికి అవసరమైన ఆసుపత్రుల నుంచి కళాశా లలతోపాటు పలు సంస్థలను నిర్మించడంలో తోడ్ప డటంతో జేజేభాయ్ పేరిట పలు స్మారక స్థూపాలు వెలి శాయి. కాగా, సుంకర్‌సేట్ డబ్బు, భూములను ఇచ్చా రు. ముంబైలో తొలి రైల్వే మార్గాన్ని నిర్మిస్తున్నప్పుడు బుకింగ్ కార్యాలయం కోసం తన నివాసాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించారు కూడా. దానశీలి అయిన సుంకర్‌సేట్ (1803-1865)ని పూర్తిగా విస్మరించారు. ఆయన జ్ఞాపకార్థం ఒక సరైన ప్లాట్ లేదా భూమిని కూడా ముంబై పురపాలక సంస్థ అందజేయలేకపోయింది. తాను జీవించిన శతాబ్దంలో మహాదాతగా వెలిగిన వ్యక్తిని గురించి దానికి పట్టింపు కూడా లేకుండా పోయింది. ఇది ఆయన 150వ వర్థంతి సంవత్సరం. విషాదం ఏమిటంటే పలుకుబడి గలవారు ప్రభుత్వ స్థలాలను కొల్లగొడుతుంటే పురపాలక సం స్థకు కించిత్ అభ్యంతరం కూడా ఉండదు. జేజేభాయ్ ముంబై నగరానికి చేసిన సేవలతో సుప్రసిద్ధులయ్యారు. పలు ప్రజా సంస్థలను ఏర్పర్చ డంలో ఆయన అందించిన తోడ్పాటులో ‘జేజే’ ఒక భాగం. బ్రిటిష్ వారు ఆయనకు సర్ బిరుదును బహూ కరించారు. జీవించి ఉండగానే ఆయనను జ్యేష్ఠుడు అని ప్రకటించారు. ఇక సుంకరసేట్ విషయానికి వస్తే, ఏషి యాటిక్ సొసైటీ మెట్లదారి వద్ద ఆయన భారీ విగ్ర హాన్ని నెలకొల్పి గౌరవించారు. ముంబైలో పలు సంస్థలను నిర్మించడానికి వీరూ, ఇతరులూ చేసిన సహాయాలు ఇప్పటికీ నగరంలో కని పిస్తుంటాయి. నెహ్రూ కోరికపై టాటాలు నిర్మించిన టీఐఎఫ్ఆర్ బహుశా వీటిలో చివరిది. కానీ ముంబై నగరం స్వభావం నేడు విషాదంగా మారిపోయింది. ఇది ఇప్పుడు స్వచ్ఛందంగా ఇచ్చేవారి నగరంలా కాకుం డా, కబ్జా చేసుకునే వారి నగరంలా మారిపోయింది. పాలనాధికారులు, రాజకీయనేతల రూపంలో ఈ కబ్జా దారులు పుట్టుకొస్తున్నారు. బ్రిటిష్ హయాంలో శ్రేష్ట మైన నగరంగా వెలుగొందిన ముంబై నేడు దోచుకునే వారి పాడి ఆవుగా మారిపోయింది. వలస ప్రజల వెల్లువతో స్వప్న నగరంగా భాసిల్లిన ముంబైని అప్పుడు, ఇప్పుడు అని పోల్చి చూడాలి. శతా బ్దం క్రితం చేతిలో నయాపైసా లేకున్నా, కేవలం కల లతో అడుగుపెట్టేవారికి ఈ పెద్ద నగరం విశాల హృద యంతో అక్కున చేర్చుకునేది. దేశంలోనే ఉత్తమ నగ రంగా ఉండేది. నగరంలోని పిల్లలందరికీ ప్రాథమిక విద్య అందజేస్తూ, మానవ వనరుల అభివృద్ధి విధానా న్ని కలిగి ఉండేది. నగరం, దాని భవిష్యత్తు, అభివృద్ధి పైనే అందరూ దృష్టి పెట్టేవారు. అప్పట్లో పాఠశాలలకు వెళ్లే మొత్తం విద్యార్థులలో సగం మంది పురపాలక సంస్థ నిర్వహించే పాఠశాలల్లోనే చదువుకునేవారు. ఇటీవలే ప్రభుత్వ పాఠశాలల్లో ఇ-ఎయిడ్స్ (సహా యకాలు)ని ఉపయోగించడం కోసం బిడ్ ప్రకటించి 25 వేల ట్యాబ్లెట్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు దీనిపై వస్తున్న ఆరోపణ ఏదంటే, శివసేన అజమాయి షీలో ఉన్న బృహన్ ముంబై పురపాలకసంస్థ ఈ ట్యాబ్ లెట్లను ఒక్కోదాన్ని రూ.6,850లకు కొనుగోలు చేసిం ది. వాస్తవానికి దాంట్లో సగం ధరకే అవి లభిస్తున్నాయి. అసలు కన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేసినవారికి రూ.8.5 కోట్లు దండుకునే అవకాశం లభించినట్లే. అలాంటి 11 వేల పాఠశాలల్లో ఉన్న 4.5 లక్షల మంది పిల్లలకు ట్యాబ్‌లను అందించినట్లయితే జరిగే మోసం స్థాయిని ఎవరైనా ఊహించుకోవచ్చు. గ్రామపంచాయితీలు మొదలుకొని స్వయం పాల నా సంస్థల ప్రయోజనాలు గత కొన్ని దశాబ్దాలుగా ఎలా మారుతూ వస్తున్నాయో ఇది తెలియపరుస్తోంది. ముంబై పురపాలక సంస్థ ప్రస్తుతం శివసేన పాడి ఆవుగా మారిపోయిందంటే ఆశ్చర్యపడాల్సింది ఏదీ లేదు. కొని చిన్న రాష్ట్రాల కంటే ఎక్కువ వార్షిక బడ్జెట్‌తో ఉన్న ముంబై పురపాలక సంస్థలో తమ పట్టు నిలుపుకు నేందుకు జరిగే పోటీ తీవ్రంగా ఉంటోందంటే ఆశ్చర్యం లేదు. పైగా, వివిధ స్థాయీ సంఘాలలో కీలక పదవుల కోసం జరిగే ప్రయత్నాలు కూడా అంతే బలంగా ఉంటు న్నాయి. పార్టీ బాస్‌లతో అంటకాగేవారికి మాత్రమే ఆ పదవులు అందుబాటులో ఉంటాయి. మరి పాడి ఆవులు నమ్మినబంట్ల చేతుల్లోనే ఉండాలి కదా! రహదారులనే తీసుకోండి. రుతుపవనాలు మొద లయ్యే తొలిదినాల్లో కురిసే వర్షపుజల్లులకే ముంబై రహ దారులు కకావికలమవుతుంటాయి. ఇక భారీ వర్షాలు కురిస్తే రహదారుల పరిస్థితి చెప్పనవసరం లేదు. నాసి రకం రహదారులే దీనికి కారణం. కాంట్రాక్టర్లు తక్కువ ధరకు బిడ్ దాఖలు చేస్తారు, దురాశాపరులకు చెల్లింపు లు చేస్తుంటారు కాబట్టే నాణ్యత ఉండదు. ఎక్కడ చూసి నా గుంటలే ఉంటాయి. కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెడుతున్నప్పటికీ కొత్త పేర్లతో బిడ్డింగ్ దాఖలు చేయనీ కుండా వారిని ఎవరూ ఆపలేరు. హైకోర్టు నాణ్యత గురించి ఆదేశాలు జారీ చేస్తుంటుంది కానీ, పురపాలక సంస్థ వాటిని లెక్కలోకి కూడా తీసుకోదు. అలాగే రుతుపవనాలకు ముందు మురికి కాలువ ల పూడిక తీయకపోవడం వల్ల ప్రతి సంవత్సరం ముం బై నగరంలో వరద వెల్లువెత్తుతుంటుంది. ప్రతి ఏటా కాంట్రాక్టులను మంజూరు చేస్తారు. పని మాత్రం జర గదు. చెల్లింపులు మాత్రం జరిగిపోతుంటాయి. మురికి నీరు పైకి పొంగటం అనేది కాంట్రాక్టర్ల లోపాలనే ఎత్తి చూపుతున్నప్పటికీ వర్షాలతో సమస్తమూ కొట్టుకుపో తుందని బిడ్ దాఖలు చేసేవారి పరమ విశ్వాసం మరి. బహుశా ఈ ప్రక్రియ వచ్చే సంవత్సరం, ఆ వచ్చే ఏడా ది కూడా పునరావృతమవుతూనే ఉంటుంది. ముంబై పురపాలక సంస్థలో జరుగుతున్న ఇలాంటి అక్రమాల జాబితాను ఇంకా చూపించవచ్చు. కానీ దానివల్ల ఏ ప్రయోజనమూ ఉండదన్నదే వాస్తవం. మహేష్ విజాపుర్కార్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) ఈమెయిల్: mvijapurkar@gmail.com