మావుళ్లమ్మకు బంగారం సమర్పణ
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం మావుళ్లమ్మవారికి పట్టణానికి చెందిన దాతలు గొట్టుముక్కల సుబ్బరాజు, గొట్టుముక్కల అచ్యుతరామరాజు, వత్సవాయి సూర్యు ఉమాభారతి గురువారం 44 గ్రాముల బంగారం సమర్పించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కార్మూరి సత్యనారాయణమూర్తి, ధర్మకర్తలు శిరిగినీడి చంద్రశేఖర్, కట్టా వెంకటేశ్వరరావు,లంకీ శ్రీనివాసరావు, అడ్డాల సత్యనారాయణ,కారెంపూడి ఆదిలక్ష్మి పాల్గొన్నారు