in bvrm
-
ఉపాధ్యాయుల వినూత్న నిరసన
భీమవరం టౌన్:ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లోని అసంబద్దతలను తొలగించాలని కోరుతూ ఫ్యాప్టో, జాక్టోల సంయుక్త ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని ఆదివారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రకాశంచౌక్‌లో ఫ్లకార్డులను ప్రదర్శించి, ప్రభుత్వ ఉత్తర్వులను దహనం చేశారు. ఫ్యాప్టో, జాక్టో నాయకులు మాట్లాడుతూ వెబ్‌కౌన్సెలింగ్ రద్దు చేయాలని, ఉపాధ్యాయులకు ఇచ్చిన పనితీరు పాయింట్లును ఉపసంహరించాలని, హేతబద్ధీకరణ పేరుతో పాఠశాల మూసివేతను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ఉపాధ్యాయ సంఘ నాయకుల అక్రమ అరెస్ట్‌ను ఖండించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపీమూర్తి, జిల్లా కార్యదర్శి సీహెచ్ పట్టాభి రామయ్య, పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.దావీదు, యుటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ పి.సీతారామరాజు, పి.శ్రీనివాసరాజు, ఎన్.భాను మహేష్, జి.సుధాకర్, కె.రవిచంద్రకుమార్, కె.వామనమూర్తి, ఆర్ఆర్ శర్మ, ఐవీఆర్ మోహనరావు, సీహెచ్ ప్రసాదరావు, ఎ.లక్ష్మీ నారాయణ, ఎ.సురేష్‌కుమార్, జి.సూర్యసత్యనారాయణ, ఎస్.మధుసూదనరావు, ఎం.వెంకటేశ్వరరావు, కె.చంద్రరావు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ప్రారంభం
భీమవరం : చదరంగం ద్వారా మేధోసంపత్తిని పెంపొందించుకునే అవకాశం ఉందని, ఈ క్రీడ పట పిల్లలను ప్రోత్సహించాలని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తల్లిదండ్రులకు సూచించారు. భీమవరం వెస్ట్‌బెర్రీ స్కూల్లో నాలుగు రోజలపాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి బాలబాలికల చదరంగం పోటీలను బుధవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. పోటీల నిర్వహణకు అనసూయ చెస్ అకాడమీ, జిల్లా చెస్ అసోసియేషన్, వెస్ట్‌బెర్రీ స్కూల్ అందిస్తున్న సహకారం ప్రశంసనీయమన్నారు. తోట సీతారామలక్ష్మి రాష్ట్ర చెస్ అసోసియేషన్అధ్యక్షుడు వైడీ రామారావు పావులను కదిపి క్రీడను ప్రారంభించారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ రమేష్, ఆర్గనైజర్ మాదాసు కిశోర్, అసోసియేషన్ పట్టణాధ్యక్షుడు గమిని రవి పవన్‌కుమార్, స్కూల్ డైరెక్టర్ ఎన్.మహేష్, స్కూల్ ప్రిన్సిపాల్ గుజ్జుల సునీత, కిడ్జ్ స్కూల్ కరస్పాండెంట్ కె.శ్రీలతాదేవి, గమిని రమ్య, అల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రజా వ్యతిరేక విధానాలపై సమర శంఖం
టీడీపీ అరాచకాలు, ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరించింది. భీమవరంలో నిర్వహించిన నియోజకవర్గ ప్లీనరీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, కొట్టు సత్యనారాయణ మాట్లాడారు. ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. భీమవరం: తెలుగుదేశం పార్టీ అరాచకాలు, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కంకణబద్ధులు కావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) పిలుపునిచ్చారు. మంగళవారం భీమవరం కిరాణా మర్చంట్స్ అసోసియేష న్ భవనంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ అధ్యక్షతన నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ముందుగా దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. అనంతరం ముఖ్య అతిథి ఆళ్ల నాని మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో ప్రజాసమస్యలను సుదీర్ఘంగా చర్చించి వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ప్లీనరీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. టీడీపీ నాయకులు దోచుకు–దాచుకో పద్ధతిలో అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. అధికారులపై దాడులు, ఇసుక, మట్టి మాఫియా వంటి దుశ్చర్యలతో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారని ధ్వజ మెత్తారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చకుండా ప్రజల ను మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని మంత్రి లోకేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగ న్మోహ న్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. లోకేశ్‌కు రాజకీయ పరిజ్ఞానం లేకనే అవాకులు చవాకులు పేలుతున్నారని, టీడీపీని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని లోకేశ్ గ్రహిం చాలని నాని హితవు చెప్పారు. భీమవరం మండలం తుందుర్రులో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్మిస్తున్న గోదావరి ఆక్వా మెగా ఫుడ్‌పార్క్‌పై జిల్లాస్థాయి ప్లీనరీలో చర్చించి తీర్మానం చేసి రాష్ట్రస్థాయిలో చర్చకు పెడతామన్నారు. వచ్చే నెలలో జిల్లాస్థాయి ప్లీనరీ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్లీనరీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించి తీర్మానాలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వంపై పోరుబాట పట్టేందుకు జూ న్ 16 నుంచి మూడురోజులపాటు జిల్లాస్థాయిలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్లు నాని చెప్పారు. నియోజకవర్గస్థాయిల్లోని ప్రధాన సమస్యలను జిల్లాస్థాయి ప్లీనరీలో చర్చించి అవసరం మేరకు సమస్యల ప్రాధాన్యతను బట్టి రాష్ట్రస్థాయి ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు జగ న్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళతామని నాని చెప్పారు. టీడీపీ పాలనలో రాష్ట్రం నిర్వీర్యం రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయించుకోలేని దుస్థితిలో సీఎం చంద్రబాబు ఉన్నారని పార్టీ శ్రీకాకుళం జిల్లా ఇ న్చార్జ్ కొయ్యే మోషే న్‌రాజు విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ నాయకులకే అన్నట్టు పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. హామీలను గాలికొదిలి రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, దీంతో విసుగుచెందిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించడానికి కంకణబద్ధులై ఉన్నారన్నారు. చంద్రబాబుది అవినీతి పాలన దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండగా చంద్రబాబు అవినీతి పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని నియోజకవర్గ ప్లీనరీ పరిశీలకుడు, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తీవ్రంగా దుయ్యబట్టారు. పార్టీ జిల్లా మహిళ అధ్యక్షురాలు వి.సాయిబాలపద్మ, ఉండి, నియోజకవర్గ కన్వీనర్లు పాతపాటి సర్రాజు, కవురు శ్రీనివాస్, పార్టీ యూత్ రాష్ట్ర కార్యదర్శి పేరిచర్ల విజయనర్సింహరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మానుకొండ ప్రదీప్‌కుమార్, యూత్ జిల్లా అధ్యక్షుడు మంతెన యోగీంద్రకుమార్, నాయకులు వేగేశ్న కనకరాజు సూరి, మేడిది జాన్సన్, కోడే యుగంధర్, తిరుమాని ఏడుకొండలు, గాదిరాజు సుబ్రహ్మణ్యంరాజు, చినమిల్లి వెంకట్రాయుడు, కోటిపల్లి బాబు, గుండా చిన్న, భూసారపు సాయి సత్యనారాయణ, ఆకుల సుబ్బలక్ష్మి, పాలవల్లి మంగ, బొక్కా సూర్యకుమారి, గుండా జయప్రకాష్‌నాయుడు, నాగరాజు శ్రీనివాసరాజు, మద్దాల అప్పారావు, నూకల కనకరావు, పేరిచర్ల సత్యనారాయణరాజు, కామన నాగేశ్వరరావు, ముల్లి నర్సింహమూర్తి, బొల్లెంపల్లి శ్రీనివాస్, గూడూరి ఓంకారం, సుంకర బాబూరావు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. తీర్మానాలివే.. నియోజకవర్గంలోని వివిధ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి తీర్మానాలు చేశారు. గృహ నిర్మాణాల్లో అవినీతి, యనమదుర్రు డ్రెయి న్కాలుష్యం, కంపోస్ట్యార్డ్ సమస్య, రక్షిత మంచినీటి పథకాల అభివృద్ధి వంటి అంశాలపై తీర్మానాలు చేశారు. ఇది దోపిడి రాజ్యం: మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం నియోజవర్గంలో టీడీపీ పాలనలో దోపిడి రాజ్యం సాగుతోందని నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ దుయ్యబట్టారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా పేదల ఇళ్ల నిర్మాణం కోసం 82 ఎకరాలు సేకరిస్తే ప్రస్తుత ఎమ్మెల్యే రామాంజనేయులు ఎనిమిదేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేకపోయారని విమర్శించారు. ప్రస్తుతం జీప్లస్–3 విధానంలో ఇళ్లు నిర్మిస్తామంటూ సుమారు రూ. 450 కోట్లు దోచుకోడానికి వ్యూహరచన చేశారని ఆరోపించారు. తన హయాంలో యనమదుర్రు కాలువను డెల్టా ఆధునీకరణ పథకంలో ప్రక్షాళన చేపడితే ప్రస్తుతం మున్సిపాలిటీ చెత్తతో పూడ్చుతున్నారని విమర్శించారు. భీమవరం మండలంలో తాగునీటి సమస్యను తీరుస్తానంటూ రైతుల నుంచి సేకరించిన భూమిలో ఎమ్మెల్యే రామాంజనేయులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. బైపాస్ రోడ్డుకు రైల్వే గేటు ఏర్పాటుచేయించలేకపోవడంతో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘యనమదుర్రు’ ప్రక్షాళనకు యాక్షన్ ప్లాన్
భీమవరం: కాలుష్య కాసారంలా మారిన యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళనకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ పరిశ్రమల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. భీమవరం విష్ణు కళాశాలల ఆడిటోరియంలో మంగళవారం యనమదుర్రు డ్రెయిన్ కాలుష్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు, ప్రజాప్రతినిధిలు, వివిధ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి పితాని మాట్లాడుతూ కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, ప్రతి పరిశ్రమ వద్ద తప్పనిసరిగా ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుచేసేలా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. జిల్లాలో డ్రెయిన్ల కాలుష్యానికి పరిశ్రమల వ్యర్థాలతో పాటు ఆయా మున్సిపాలిటీలు, పంచాయతీలు చెత్తాచెదారాలతో నింపడం, ఆక్వా సాగు కూడా కారణమవుతున్నాయన్నారు. పరిశ్రమలల్లోని ట్రీట్మెంట్ ప్లాంట్లు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం నిజమని పేర్కొన్నారు. ఆక్వాతో భూగర్భ, నదీ జలాలు కలుషితమవుతున్నాయని, ఆక్వాకు ప్రభుత్వం అనుకూలం తప్ప పూర్తిస్థాయిలో ప్రోత్సహించడం లేదని చెప్పారు. పలు గ్రామాలు, పట్టణాల్లో డంపింగ్ యార్డులు లేకపోవడం కూడా కాలుష్యానికి కారణమవుతున్నాయన్నారు. తుందుర్రులో ఆక్వాపార్క్ వ్యతిరేక ఉద్యమంతో మిగిలిన ఫ్యాక్టరీల్లోనూ కాలుష్యం వెలువడకుండా అధికారులు చర్యలు చేపట్టారని స్పష్టం చేశారు. వచ్చేనెల 10వ తేదీలోపు యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళనకు సంబంధించి ప్రణాళిక రూపురేఖలను సిద్ధం చేయాలని పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించామని మంత్రి పేర్కొన్నారు. కాలుష్యపాపం తలాపిడికెడు: కలెక్టర్ యనమదుర్రు డ్రెయిన్ కాలుష్యానికి అందరూ కారకులేనని, తలాపాపం తిలాపిడికెడు అన్నట్టుగా మారిందని కలెక్టర్ భాస్కర్ అన్నారు. పరిశ్రమలు ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటుచేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం ఖర్చును భరించనున్నాయని చెప్పారు. యనమదుర్రు డ్రెయిన్ పరిధిలోని 21 పరిశ్రమలను గుర్తించి వాటిలో ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి కాలుష్య నియంత్రణ మండలి చర్యలు చేపట్టిందన్నారు. సమావేశంలో ఫ్యాక్టరీస్ సంచాలకుడు జి.బాలకిశోర్, పర్యావరణ శాఖ జాయింట్ చీఫ్ ఇంజినీర్ ఎంవీ భాస్కరరావు, పర్యావరణ సీనియర్ ఇంజినీర్ పి.రవీంద్రనాథ్, పర్యావరణ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్.వెంకటేశ్వర్లు, నరసాపురం సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, కొవ్వూరు ఆర్డీఓ బి.శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఎస్ఈ కె.శ్రీనివాసరావు, శెట్టిపేట ఈఈ జి.శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు, ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సీహెచ్ నాగనర్సింహరావు, డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నీటి కాలుష్యంతో కేన్సర్..డెల్టా ప్రాంతంలో నీటి కాలుష్యంతో కేన్సర్ రోగులు పెరుగుతున్నారు. యనమదుర్రు డ్రెయిన్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయకుంటే ఈ ప్రాంత ప్రజల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ప్రక్షాళనలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి.–పులపర్తి రామాంజనేయులు, భీమవరం ఎమ్మెల్యే మున్సిపాలిటీల చెత్త కూడా..నిడదవోలు-నరసాపురం కాలువలో పాలకొల్లు, నరసాపురం మున్సిపాలిటీల మురుగు నీరు, చెత్తాచెదారాలు కలుస్తున్నాయి. మృతదేహాలను సైతం కాలువల్లో వేయడం కలుషితానికి కారణమవుతోంది. యనమదుర్రు డ్రెయిన్ కాలుష్యానికి పరిశ్రమల యజమానుల నిర్లక్ష్యమే కారణం. –బండారు మాధవనాయుడు, నర్సాపురం ఎమ్మెల్యే అధ్యయనాలు చేస్తున్నా అమలు శూన్యం..జిల్లాలోని పంట కాలువలు, డ్రెయిన్ల కలుషితంపై ప్రభుత్వం అధ్యయనాలు చేస్తున్నా వాటి ప్రక్షాళనకు చేస్తున్న చర్యలు శూన్యం. జిల్లాలో కొల్లేరు, యనమదుర్రు, గోస్తనీ, గొంతేరు కాలుష్య కారకంగా మారడానికి పరిశ్రమలే కారణం. ఆక్వా సాగుతోనూ డ్రెయిన్, కాలువ జలాలు కలుషితమవుతున్నాయి.–బి.బలరాం, సీపీఎం జిల్లా కార్యదర్శి మత్స్య సంపద మాయం..యనమదుర్రు డ్రెయిన్ కాలుష్య కాసారంలా మారడంతో మత్స్య సంపద పూర్తిగా మాయమైపోయింది. గతంలో డ్రెయిన్‌పై ఆధారపడి 30 గ్రామాల్లోని సుమారు 80 వేల మంది మత్స్యకారులు జీవనం సాగించేవారు. భీమవరం మండలం కొత్తపూసలమర్రులోని ఆనంద గ్రూప్ రొయ్యల మేత పరిశ్రమ వల్ల వాతావరణం కూడా కాలుష్యమవుతోంది. –రామకృష్ణ, మత్స్యకార సంఘ నాయకుడు నీటిమీద రాతలుగా..జిల్లాలో డ్రెయిన్ల ప్రక్షాళనకు ప్రభుత్వం, అధికారులు చేస్తున్న ప్రకటనలు నీటిమీద రాతలుగా మిగులుతున్నాయి. ఆక్వా సాగుతో భూగర్భ జలాలు కలుషితమై తాగునీటికీ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆక్వా అక్రమ సాగుకు అధికారులే అనుమతులు ఇస్తున్నారు. వివిధ పరిశ్రమల్లో ట్రీట్మెంట్ ప్లాంట్లు లేకపోయినా పట్టించుకోవడం లేదు.–డేగ ప్రభాకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి మున్సిపల్, పంచాయితీల చెత్త కాలువల్లోనే..డెల్టా ప్రాంతంలోని వివిధ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు మురుగునీటిని పంట కాలువల్లో కలపడంతోపాటు చెత్తను కూడా వేస్తున్నారు. దీంతో జల కాలుష్యం పెరుగుతోంది. నీటి కాలుష్యం వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలి. –పొత్తూరి రామాంజనేయరాజు, జిల్లా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ -
ఆక్వా పార్క్ నిర్మాణం ఆపాలంటూ ధర్నా
భీమవరం టౌన్: తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కు పనులను తక్షణం నిలుపుదల చేసి ఫ్యాక్టరీని మరో చోటుకు తరలించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం భీమవరం ఆనంద గ్రూప్ ఆఫ్ కంపెనీల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మెంటే వారితోటలోని సుందరయ్య భవనం నుంచి మండుటెండలో ప్రదర్శనగా బయల్దేరిన సీపీఎం నాయకులు, కార్యకర్తలు పీపీ రోడ్డు ప్రకాశంచౌక్, బాంబే స్వీటు సెంటర్ మీదుగా జువ్వలపాలెం రోడ్డులో ఉన్న ఆనంద గ్రూప్ ఆఫ్ కంపెనీల కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేశారు. తక్షణమే ఆక్వాఫుడ్ పార్కు పనులు నిలిపివేయాలని జనావాసాల నుంచి ఆ ఫ్యాక్టరీని మరో చోటికి తరలించాలని, గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తి వేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం భీమవరం పట్టణ కార్యదర్శి బీవీ వర్మ, జిల్లా కమిటీ సభ్యుడు గొర్ల రామకృష్ణ మాట్లాడుతూ గత మూడేళ్లుగా ఆక్వాఫుడ్ పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా 40 గ్రామాల ప్రజలు ఉద్యమిస్తున్నా ఫ్యాక్టరీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది పోలీసులను మోహరించి గ్రామీణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. పర్యావరణం, ప్రజారోగ్యం, పంట పొలాలు, భూగర్భ జలాలకు హాని చేసే ఆక్వాఫుడ్ పార్కు ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రేవు రామకృష్ణ, ఎం.వైకుంఠరావు, చెల్లబోయిన వేంకటేశ్వరరావు, అల్లూరి అరుణ్, కె.రంగారావు, పి.మంగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా కోసం అఖిలపక్ష సమావేశం
భీమవరం : రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ స్వయంగా అప్పటి ప్రధాని ప్రకటించినా నేటి కేంద్ర ప్రభుత్వం దానిని అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ భీమవరంలో జూన్‌లో అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ పనబాక లక్ష్మి తెలిపారు. దీనికి సంబంధించి శనివారం భీమవరం నియోజకవర్గ ఇంచార్జ్ యార్లగడ్డ రాము ఏర్పాటు చేసిన జిల్లా పార్టీ నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ్టతోనే సాధ్యమన్నారు. దీనికి నిరంతరం పోరాటం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు రఫీవుల్లా బేగ్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, యార్లగడ్డ రాము, గాదిరాజు లచ్చిరాజు, కొల్లి అప్పారావు, కె. సత్తిబాబు,జె ట్టి గురునాథరావు, బోకూరి విజయరాజు, కరీముల్లా బాషా తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ సేవలతో ఆక్వాలో సిరులు
భీమవరం: ఆక్వా రంగం మరింత అభివృద్ధి సాధించాల్సి ఉందని, ఇందుకు చైనా మాదిరిగా ఇక్కడి రైతులు డిజిటల్ సేవలు ఉపయోగించుకోవాలని కలెక్టర్ కె.భాస్కర్ అన్నారు. భీమవరంలో మంగళవారం ఏర్పాటుచేసిన మత్స్య రంగంలో ఏకీకృత డిజిటల్ సేవల ఏర్పాటుపై వర్క్‌షాపులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. డిజిటల్ సేవల వాడకం వల్ల ఐదు శాతం ఖర్చు పెరిగినా 25 శాతం వరకూ ఆదాయం పెరుగుతుందని చెప్పారు. డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు మత్స్యశాఖ వద్ద నిధులు ఉన్నాయన్నారు. అధికారులు, ఆక్వా రైతులు దీనిపై ప్రత్యేక దృష్టిపెడితే సాగును లాభదాయకంగా చేసుకోవచ్చని చెప్పారు. ఆక్వా రైతులకు డిజిటల్ సేవలందించడానికి రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాను ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారన్నారు. డిజిటల్ సేవల ద్వారా చెరువుల తవ్వకాల నుంచి ధరల వరకూ రైతులు సులభంగా తెలుసుకోవచ్చన్నారు. దీనిలో భాగంగానే ప్రభుత్వం వెబ్‌పోర్టల్, యాప్‌లను రూపొందిస్తోందని చెప్పారు. బీమా వర్తింపుతో లాభాలు వరి మాదిరిగా ఆక్వాకు బీమా పథకం వర్తింపజేస్తే రైతులు నాణ్యమైన సీడ్, ఫీడ్ వాడి మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉందని కలెక్టర్ అన్నారు. బీమా కంపెనీలు రైతులు ఏ విధమైన మేతలు, సీడ్ వాడుతున్నారని పరిశీలిస్తారని, దీంతో రైతులు తప్పనిసరిగా నాణ్యమైన రొయ్య పిల్లలు, మేతలు వాడాల్సి ఉంటుందన్నారు. తద్వారా దిగుబడులు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతుల వినతులు వనీమా సాగుకు చట్టబద్ధత కల్పించాలని, ఆక్వా సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటుచేయాలని రైతులు కోరారు. సీడ్, ఫీడ్, తల్లి రొయ్యల పెంపకం, సింగిల్ విండో విధానం అమలు చేయాలన్నారు. మార్కెట్ సెస్‌ను రద్దుచేయాలని, ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. మత్స్యశాఖ డీడీ యాకూబ్ బాష, ఎఫ్డీఓ రామలింగాచారి, ఎంపెడా అసిస్టెంట్ డైరెక్టర్ బ్రహ్మేశ్వరరావు, గాదిరాజు సుబ్బరాజు, యిర్రింకి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ సేవలతో ఆక్వాలో సిరులు
భీమవరం: ఆక్వా రంగం మరింత అభివృద్ధి సాధించాల్సి ఉందని, ఇందుకు చైనా మాదిరిగా ఇక్కడి రైతులు డిజిటల్ సేవలు ఉపయోగించుకోవాలని కలెక్టర్ కె.భాస్కర్ అన్నారు. భీమవరంలో మంగళవారం ఏర్పాటుచేసిన మత్స్య రంగంలో ఏకీకృత డిజిటల్ సేవల ఏర్పాటుపై వర్క్‌షాపులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. డిజిటల్ సేవల వాడకం వల్ల ఐదు శాతం ఖర్చు పెరిగినా 25 శాతం వరకూ ఆదాయం పెరుగుతుందని చెప్పారు. డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు మత్స్యశాఖ వద్ద నిధులు ఉన్నాయన్నారు. అధికారులు, ఆక్వా రైతులు దీనిపై ప్రత్యేక దృష్టిపెడితే సాగును లాభదాయకంగా చేసుకోవచ్చని చెప్పారు. ఆక్వా రైతులకు డిజిటల్ సేవలందించడానికి రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాను ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారన్నారు. డిజిటల్ సేవల ద్వారా చెరువుల తవ్వకాల నుంచి ధరల వరకూ రైతులు సులభంగా తెలుసుకోవచ్చన్నారు. దీనిలో భాగంగానే ప్రభుత్వం వెబ్‌పోర్టల్, యాప్‌లను రూపొందిస్తోందని చెప్పారు. బీమా వర్తింపుతో లాభాలు..వరి మాదిరిగా ఆక్వాకు బీమా పథకం వర్తింపజేస్తే రైతులు నాణ్యమైన సీడ్, ఫీడ్ వాడి మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉందని కలెక్టర్ అన్నారు. బీమా కంపెనీలు రైతులు ఏ విధమైన మేతలు, సీడ్ వాడుతున్నారని పరిశీలిస్తారని, దీంతో రైతులు తప్పనిసరిగా నాణ్యమైన రొయ్య పిల్లలు, మేతలు వాడాల్సి ఉంటుందన్నారు. తద్వారా దిగుబడులు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతుల వినతులు..వనీమా సాగుకు చట్టబద్ధత కల్పించాలని, ఆక్వా సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటుచేయాలని రైతులు కోరారు. సీడ్, ఫీడ్, తల్లి రొయ్యల పెంపకం, సింగిల్ విండో విధానం అమలు చేయాలన్నారు. మార్కెట్ సెస్‌ను రద్దుచేయాలని, ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. మత్స్యశాఖ డీడీ యాకూబ్ బాష, ఎఫ్డీఓ రామలింగాచారి, ఎంపెడా అసిస్టెంట్ డైరెక్టర్ బ్రహ్మేశ్వరరావు, గాదిరాజు సుబ్బరాజు, యిర్రింకి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్ రద్దుకు ఉద్యమం
భీమవరం టౌన్ : భీమవరం కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ హాల్లో ఆదివారం పీ ఆర్టీయూ ఆధ్వర్యంలో కాంట్రిబ్యూ టరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్ ), వేతన వ్యవస్థ, ఉపాధ్యాయ సమస్యలపై జిల్లాస్థాయి విద్యా సదస్సు నిర్వహించారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మత్తి కమలాకరరావు, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరాజు, ఉత్తరాంధ్ర ఉపాధ్యా య ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయు డు మాట్లాడుతూ సీపీఎస్ విధానం రద్దుకు పెద్దెత్తున ఉద్యమం చేపడతామని చెప్పారు. ఈ విధానంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దృష్టికి తీసుకువెళ్లామని, ముఖ్యమంత్రితో ఈ అం శంపై చర్చించామన్నారు. న్యాయం జరగని పక్షంలో సీపీఎస్ రద్దయ్యే వరకూ పోరాటం సాగిద్దామని పిలుపునిచ్చా రు. పీఆర్టీయూ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఆర్.కేశీయమ్మ తదితరులు మాట్లాడుతూ సీపీఎస్ రద్దుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పీఆర్టీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు ఏవీ కాంతారావు, జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ వీరవల్లి వెంకటేశ్రరావు, ఎన్నార్పీ అగ్రహారం హెచ్ఎం ఎంవీ సత్యనారాయణ మాట్లాడారు. ఒకే ఉద్యోగం.. ఒకే పెన్షన్ కావాలి కాంట్రీబ్యుటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీని వాసులనాయుడు డిమాండ్ చేశారు. పీఆర్టీయూ భీమవరం డివిజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విద్యా సదస్సులో పాల్గొనేందుకు వచ్చి న ఆయన విలేకరులతో మాట్లాడారు. సీపీఎస్‌తో 2004 తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారు పదవీ విరమణ అనంతరం రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి రద్దుకు డిమాండ్ చేశామన్నారు. సీపీఎస్‌ను తక్షణం రద్దు చేసి ఒకే ఉద్యోగం, ఒకే పెన్షన్ పథకం అమలు చేయాలని పోరాడుతూనే ఉం టామన్నారు. ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు పోరాట ఫలితంగా త్వరలోనే ఉత్తర్వులు వస్తాయని ఆశాభావం వ్య క్తం చేశారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్‌తో కాంట్రాక్ట్ అధ్యాపకులకు నష్టం లేదని, ఉపాధ్యాయులకు పదోన్నతులు లభి స్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రా క్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు. రూ.398 వేతనంతో పనిచేసిన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మత్తి కమలాకరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరాజు, జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు మాట్లాడు తూ సీపీఎస్ రద్దు కోరుతూ జిల్లా వ్యా ప్తంగా ఆందోళనలకు కార్యాచరణ రూ పొందిస్తామని చెప్పారు. -
మావుళ్లమ్మ సన్నిధిలో వరుణ్ సందేశ్
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మవారిని సినీ హీరో వరుణ్‌సందేశ్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. బీజేపీ నేత కనుమూరి రఘురామకృష్ణంరాజు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానిక వెంకటేశ్వర బుక్స్ అండ్ స్టేషనరీ యజమాని ప్రసాద్ ఎల్జీ 43 అంగుళాల ఎల్ఈడీ టీవీను ఆలయానికి బహూకరించారు. పాలకొల్లుకు చెందిన గుర్రం అమరకృష్ణ, ఫణి సత్యవతి 5 గ్రాములు, కొత్తపల్లి సూర్యప్రకాష్ (లాలు) 4 గ్రాములు, తటవర్తి పురుషోత్తం గుప్త, తారా దంపతులు 3.660 గ్రాముల బంగారం విరాళంగా సమర్పించారు. -
బయోటెక్నాలజీతో అధిక ఉత్పత్తి
భీమవరం : వ్యవసాయ రంగంలో బ యోటెక్నాలజీని ఉపయోగించడం ద్వారా అధిక ఉత్పత్తిని సాధించవచ్చ ని, బయోటెక్నాలజీపై మరిన్ని పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉందని ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ డాక్టర్ శంకర్‌లాల్ గార్గే అన్నారు. స్థానిక ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో రెం డు రోజులు పాటు నిర్వహించే ‘ఎమర్జింగ్ మల్టీడిసిప్లీన్ రీసెర్చ్ అండ్ కం ప్యూటేషనల్ ఇంటెలిజెన్స్ సదస్సును గురువారం ఆయన ప్రారంభించారు. అమెరికాలో బయోటెక్నాలజీని ఉపయోగించి 30 శాతం పెట్రోలియం ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించారన్నారు. పర్యావరణ శుద్ధికి, పరిరక్షణకు బయోటెక్నాలజీ మొక్కలను పారిశ్రామిక వాడలతో పాటు అన్ని చోట్లా విస్తృతంగా నాటాలన్నారు. కళాశాల పీజీ కోర్సెస్ డైరెక్టర్ డాక్టర్ ఐ.హేమలత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ గోకరాజు మురళీరంగరాజు, డైరెక్టర్ ఎస్వీ రంగరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.పార్థసారథివర్మ, సీఈవో ఎస్ఆర్కే నిశాంత్‌వర్మ, డాక్టర్ పీఆర్కే రాజు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎస్ఎన్ రాజు, బి.మధుసూదన్ పాల్గొన్నారు. -
సహజ వనరులపైనే దేశాభివృద్ధి
భీమవరం : దేశం అభివృద్ధి చెందడానికి సహజ వనరులపై ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుందని, దానిలో భూవనరులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఓఎన్జీసీ జనరల్ మేనేజర్ ఏవీవీఎస్ కామరాజు చెప్పారు. భీమవరం డీఎన్నార్ కళాశాలలో శనివారం జియాలజీ విభాగం ఆధ్వర్యంలో కృష్ణా గోదావరి, ప్రాణహిత గోదావరి పరిసరాల్లో చమురు, సహజ వాయువుఅన్వేషణ అనే అంశంపై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. చమురు ఉత్పత్తి సంస్థల్లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ దేశంలోనే అతిపెద్దదని, ఇంధన వనరుల్లో ఆసియాలో ఐదోస్థానంలో ఉందన్నారు. ఇంధన వనరులైన చమురు, గ్యాస్, బొగ్గు, అణుశక్తి ఖనిజాలు అపారంగా లభిస్తే ఆ దేశం అభివృద్ధికి ఎంతగానో తోడ్పతాయని కామరాజు వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సహజవాయు నిక్షేపాలు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో విస్తరించి ఉన్నాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ పి.రామకృష్ణంరాజు మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు ఎంతో ప్రతిష్టాత్మకమైన జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఓఎన్జీసీ సంస్థల్లో ఉద్యోగాలు సాధించారన్నారు. రాష్ట్రంలో బీఎస్సీ కోర్సులో జియాలజీతో పాటు కంప్యూటర్స్, మేథమెటిక్స్ ఉన్న గ్రూపు కలిగింది డీఎన్నార్ కళాశాలేనన్నారు. ఈ తరహా కోర్సులు మన దేశంలో కేవలం నాలుగు కళాశాలల్లో మాత్రమే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ డెప్యూటీ జనరల్ మేనేజర్ రత్నం, కళాశాల జియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఎ.సురేంద్ర, అధ్యాపకులు పాల్గొన్నారు. -
మావుళ్లమ్మకు బంగారం సమర్పణ
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం మావుళ్లమ్మవారికి పట్టణానికి చెందిన దాతలు గొట్టుముక్కల సుబ్బరాజు, గొట్టుముక్కల అచ్యుతరామరాజు, వత్సవాయి సూర్యు ఉమాభారతి గురువారం 44 గ్రాముల బంగారం సమర్పించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కార్మూరి సత్యనారాయణమూర్తి, ధర్మకర్తలు శిరిగినీడి చంద్రశేఖర్, కట్టా వెంకటేశ్వరరావు,లంకీ శ్రీనివాసరావు, అడ్డాల సత్యనారాయణ,కారెంపూడి ఆదిలక్ష్మి పాల్గొన్నారు -
అదిరిన కేటీఎం బైక్ స్టంట్ షో
భీమవరం యూరోపియన్ రేసింగ్ లెజండ్ కేటీఎం స్టంట్ షో భీమవరం పట్టణంలో యువతను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. స్థానిక కోస్టల్ సిటీ సెంటర్(గీతా మల్టీ ప్లె్లక్స్) ఆవరణలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన స్టంట్ షోలో ప్రొఫెషనల్ స్టంట్ రైడర్స్ అద్భుతమైన స్టంట్రైడ్స్, ట్రిక్స్‌ను కేటీఎం డ్యూక్ బైక్‌లతో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. బైక్ వెనుక చక్రాన్ని గాలిలోకి లేపడం, చేతులు వదిలి నడపడం, బైక్ కింది భాగంలో కూర్చుని నడపడం, ముందు చక్రాన్ని పైకి లేపి కేవలం వెనుకచక్రంతో ముందుకు వెళ్లడం, బైక్‌పై నిలబడి ముందుకు వెళ్లడం వంటి అద్భుత విన్యాసాలు అబ్బుర పరిచాయి. ఈ సందర్భంగా బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రో బైకింగ్ ప్రెసిడెంట్ అమిత్‌నంది మాట్లాడుతూ హై ఫెర్ఫార్మెన్ స రేసింగ్ బైక్‌లకు కేటీఎం బ్రాండ్ ప్రసిద్ధి అన్నారు. వినియోగదారులకు ఉత్తేజకరమైన సాహస అనుభూతులను కేడీఎం బైక్‌లు అందిస్తాయన్నారు. భవిష్యత్తులో ప్రొఫెషనల్ స్టంట్స్‌ని ప్రతి ప్రధాన పట్టణంలో నిర్వహించనున్నామన్నారు. ఇప్పటివరకు స్టంట్ షోలను చెన్నయ్, విజయపూర్, లక్నో, జబల్పూర్, ఔరంగాబాద్, జలంధర్, రాజ్‌కోట్, అహ్మదాబాద్, కాంచీపురం వంటి నగరాల్లో నిర్వహించామన్నారు. -
రేపటి నుంచి టీటీ టోర్నమెంట్
భీమవరం: భీమవరంలో తొలిసారిగా నాల్గో ఏపీ స్టేట్ రాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ గురువారం నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తామని ఏపీ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పి.విశ్వనాథరావు చెప్పారు. స్థానిక కాస్మో పాలిటన్ క్లబ్లో మంగళవారం టోర్నమెంట్ వివరాలను విలేకరులకు వెల్లడించారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా మెన్, ఉమెన్, యూత్, జూనియర్, సబ్ జూనియర్, క్యాడెట్ స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. సీనియర్ టేబుల్ టెన్నిస్ కోచ్ వీఆర్ ముక్కామల చీఫ్ రిఫరీగా వ్యవహరిస్తారన్నారు. భీమవరం వంటి పట్టణంలో పోటీలు నిర్వహించడంతో జిల్లాలో టేబుల్ టెన్నిస్‌కు మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటారని, వారికి పూర్తిస్థాయిలో భోజన, వసతి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు రామరాజు, టి.కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
చదరంగం పోటీలు ప్రారంభం
భీమవరం : రాష్ట్రస్థాయి అమెచ్యూర్ చదరంగం పోటీలు స్థానిక ఏఎస్ఆర్ నగర్లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో అనసూయ చెస్ అకాడమీ నేతృత్వంలో ఈ పోటీలను మాజీ మంత్రి యర్రా నారాయణ స్వామి ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించనున్నారు. చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తోట భోగయ్య, కార్యదర్శి మాదాసు కిశోర్ మాట్లాడుతూ విజేతలుగా నిలిచిన వారిని నవంబర్ 5న ముంబైలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు రాష్ట్రం తరఫున ఎంపిక చేస్తామన్నారు. చెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ రమేష్ పాల్గొన్నారు. -
స్మార్ట్ సర్వే పూర్తిగాక మంజునాథన్ నివేదిక ఆలస్యం
భీమవరం టౌన్: ప్రజాసాధికర సర్వే పూర్తికాకపోవడంతో మంజునాథన్ కమీషన్ నివేదిక ఆలస్యమైందని కాపు కార్పోరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ పేర్కొన్నారు. కాపులను బిసి జాబితాలో చేర్చే ప్రక్రియకు ప్రజాసాధికార సర్వే రిపోర్టు మంజునాథన్ కమీషన్‌కు అవసరమని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చలమలశెట్టి రామానుజయ మాట్లాడారు. కాపులను బిసి జాబితాలో చే ర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్దితో ఉన్నారన్నారు. బిసిలకు రిజర్వేషన్ శాతాన్ని పెంచే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని పేర్కొన్నారు. తమిళనాడు, కర్నాటక, కేరళ మాదిరిగా ఇక్కడ బిసిలకు అదనంగా రిజర్వేషన్లు కల్పిస్తారని చెప్పారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 3.70 లక్షల మంది కాపు కార్పోరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకుంటే 50 వేల మందికి రూ.858 కోట్లు రుణాలుగా ఇచ్చామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోపు మరో 70 వేల మందికి రుణాలు మంజూరు చేస్తామన్నారు. విదేశాల్లో ఉన్నత చదువుల నిమిత్తం 400 మందిని పంపామన్నారు. సివిల్ సర్వీసెస్‌కు సంబంధించి 500 మందిని చదివిస్తున్నామని తెలిపారు. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ చదుదువుతున్న కాపు విద్యార్థులకు ఈ ఏడాది నుంచి ఉపకార వేతనాల పథకం అమలు చేయనున్నామని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులను చదివిస్తున్నామని నిరుద్యోగులకు జాబ్ గ్యారంటీ స్కీమ్ కింద రుణ మేళాలు ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఎంఎస్ఎంఈ గ్రూపు కింద 3 నుంచి 5 మంది కలిసి పరిశ్రమలు స్థాపించుకునే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద అర్భన్ ఏరియాలో 5 వేల మంది, రూరల్‌లో 10 వేల మంది మహిళలకు మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి, ఆ సమయంలో నెలకు రూ.2వేలు భృతి చెల్లిస్తామన్నారు. శిక్షణ అనంతరం కాపు కార్పోరేషన్ ద్వారా ఉచితంగా ఉపాధి సామాగ్రిని అందచేస్తామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, నాయకులు కోళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు ప్రారంభం
భీమవరం : జేఎన్టీయూకే యూనివర్శిటీ బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక పోటీలు స్థానిక డీఎన్నార్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ స్పోర్ట్స్ కమిటీ సెక్రటరీ డాక్టర్ జి.శ్యామ్‌కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది నిర్వహించే బ్యాడ్మింటన్ పోటీలకు జట్లను ఎంపిక చేస్తున్నట్టు చెప్పారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు వచ్చేనెలలో తమిళనాడు మధురై కామరాజు యూనివర్శిటీలో జరగనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్శిటీ టోర్నమెంట్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ యు.రంగరాజు, సెలక్షన్ కమిటీ సభ్యుడు వై.నానిప్రసాద్, సీహెచ్ ^è ంద్రశేఖర్, సెలక్షన్ కమిటీ సెక్రటరీ పి.నర్సింహరాజు, బి.నర్సింహరాజు, పి.కిరణ్‌కుమార్ వర్మ తదితరులు పాల్గొన్నారు. -
జాగ్రత్తలతో మాతాశిశు మరణాల నివారణ
భీమవరం టౌన్: గర్భిణులు ఆరోగ్యçృరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటిని ముందుగానే గుర్తించి వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తే మాతాశిశువులు క్షేమంగా ఉంటారని సీనియర్ వైద్యులు తెలిపారు. భీమవరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఐఎంఏ, గైనకాలజిస్టుల అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘అత్యంత ప్రమాదకరస్థితిలో గర్భం’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ డీవీ చలపతిరావు, కార్యదర్శి డాక్టర్ ఇర్రింకి లక్ష్మి, గర్భిణి, స్త్రీల వైద్య అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ సుంకర నరసవాణి సదస్సుకు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. విజయవాడకు చెందిన ఐవీఎఫ్ క్లినిక్ డాక్టర్ వి.పద్మజ మాట్లాడుతూ మహిళలు గర్భం దాల్చినపుడు శరీరంలో వ్యతిరేక కణాలు ఉత్పత్తి అయి కొన్ని సమస్యలు ఏర్పడతాయన్నారు. శిశువు ఎదుగుదల లేకపోవడం, నెలలు నిండకుండానే ప్రసవం సంభవిస్తుందన్నారు. ఇటువంటి సమస్యలను ఏ విధంగా నివారించాలి, గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను వివరించారు. ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల గైనిక్ డిపార్ట్మెంట్ హెచ్‌వోడీ డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ గర్భిణులకు వచ్చే షుగర్ వ్యాధుల గురించి వివరించారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గైనిక్ డిపార్ట్మెంట్ మాజీ హెచ్‌వోడీ డాక్టర్ కె.రమాదేవి మాట్లాడుతూ గర్భిణులకు అధిక రక్తపోటు ఏర్పడితే నియంత్రించేందుకు కనుగొన్న నూతన వైద్య పద్ధతులను వివరించారు. రాజమండ్రి తపని హాస్పటల్స్ డాక్టర్ డి.పద్మజ మాట్లాడుతూ ప్రసవం సమయంలో తల్లికి జరిగే ప్రమాదాలు, అందుకు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డాక్టర్ ఇర్రింకి లక్ష్మి మాట్లాడుతూ గర్భస్రావానికి దారి తీసే పరిస్థితులు, నివారణ మార్గాలను తెలిపారు. ఏలూరు ఆశ్రం హాస్పటల్ గైనిక్ డిపార్ట్మెంట్ హెచ్‌వోడీ డాక్టర్ కె.వందన మాట్లాడుతూ ప్రసవానంతరం జరిగే రక్తస్రావాలు, దానికి కారణాలు, నివారణ మార్గాలు చెప్పారు. డాక్టర్ మేళం జగదీశ్వరి, డాక్టర్ సుంకర నరసవాణి తదితరులు మాట్లాడారు. సదస్సుకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ మెంబర్, పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి పర్యవేక్షణాధికారిగా వ్యవహరించారు. జిల్లా నలుమూలల నుంచి గైనకాలజిస్టులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. -
‘మలబార్’లో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ ప్రదర్శన
భీమవరం : మగువలకు వన్నె తెచ్చే ఎన్నో రకాల బంగారు, వజ్రాభరణాలు భీమవరంలోనే అందుబాటులోకి రావడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ అన్నారు. శనివారం స్థానిల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షాపులో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్లు ఫియాజ్, దీపక్ మాట్లాడుతూ ఈనెల 20 వరకూ ఆర్టిస్ట్రీ బ్రాండెండ్ జ్యువెలరీ ప్రదర్శన, అమ్మకం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయబాబు, ప్రమీల, జయశ్రీ, విజయలక్ష్మి, సుభాషిణి పాల్గొన్నారు. -
బొజ్జగణపయ్యా.. బహురూపాయ..
భీమవరం టౌన్ : భీమవరం గునుపూడిలో వేంచేసియున్న విద్యా గణపతిని మంగళవారం గజపుష్పమాలలతో అలంకరించారు. కంఠంశెట్టి దుర్గాప్రసాద్, నూతత గోపాలకృష్ణమూర్తి సహకారంతో ఈ అలంకరణ చేసినట్టు అర్చకుడు కొమ్ము శ్రీనివాస్ తెలిపారు. అలాగే స్థానిక సుంకరపద్దయ్య వీధిలో వేంచేసియున్న వినాయక స్వామివారిని మంగళవారం వివిధ రకాల కాయగూరలతో శాకాంబరీ అలంకారం చేశారు. అర్చకులు బ్రహ్మజ్యోషు్యల మణికంఠశర్మ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద వినాయకుడు అయి భీమవరం (ఆకివీడు) : శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాల ఆవరణలో వేద వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రోజూ వేద విద్యార్థులు వినాయకుడి వద్ద నాలుగు వేదాలను వల్లిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారని పాఠశాల ప్రిన్సిపాల్ లింగాల సత్యనారాయణమూర్తి తెలిపారు. -
హాకీ జిల్లా జట్లు ఎంపిక
భీమవరం టౌన్ : వచ్చేనెల 7 నుంచి 10వ తేదీ వరకూ నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి గ్రౌండ్స్‌లో జరిగే రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొనే జిల్లా సబ్ జూనియర్ బాలుర టీమ్‌ను భీమవరం సెయింట్ మేరీస్ హైస్కూల్ గ్రౌండ్లో ఎంపిక చేశారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 110 మంది క్రీడాకారులు సెలక్షన్స్‌కు హాజరయ్యారు. అలాగే అనంతపురం జిల్లా ఆర్డీటీ గ్రౌండ్లో ఈ నెల 29 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ జరిగే సబ్ జూనియర్ బాలికల, జూనియర్ బాలికల రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొనే పశ్చిమ టీమ్‌లను ఎంపిక చేశారు. 80 మంది క్రీడాకారిణులు సెలక్షన్స్‌కు హాజరయ్యారు. సెయింట్ మేరీస్ హెచ్ఎం సిస్టర్ వలసమ్మ జార్జి ఆధ్వర్యంలో జిల్లా టీమ్‌ను జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరేటి ప్రకాష్ ఎంపిక చేశారు. వ్యాయామ ఉపాధ్యాయులు అల్లు అప్పారావు, పి.దుర్గారావు, డీజెఆర్ఎల్ శేఖర్‌బాబు, కె.జేమ్స్, నాయుడు పాల్గొన్నారు. సబ్ జూనియర్బాలుర టీమ్ జి.యశ్వంత్ గణేష్, బి.దుర్గ ప్రసాద్, వి.భరత్‌కుమార్, పి.పవన్ కళ్యాణ్, పి.జేజే సాయి శ్రీకర్, కె.సందీప్, కె.జయరాం విష్ణు, ఎన్.కమల్ యువన్(భీమవరం సెయింట్ మేరీస్), బి.సాయి సత్యం నాయుడు (భీమవరం), డి.రాజేష్ (శృంగవృక్షం జెడ్పీ), జె.సూరిబాబు(కృష్ణయ్యపాలెం జెడ్పీ), డి.విజయ్‌కుమార్ (కాకరపర్రు జెడ్పీ), సీహెచ్ నారాయణ శేషు, జి.శ్యామ్స్టీవ్, కె.జోయల్, ఎండీ అసానుద్దీన్ (సెయింట్ మేరీస్ భీమవరం), పి.సారా మణికంఠ(కాకరపర్రు జెడ్పీ), కె.సందీప్ రాజా(భీమవరం), ఫస్ట్ స్టాండ్‌బై ్రMీ డాకారులుగా ఎన్.ఎడ్వర్డ్, సాయి శ్రీరాం(సెయింట్ మేరీస్ భీమవరం) ఎంపికయ్యారు. సబ్ జూనియర్ బాలికల టీమ్ కె.జయాచౌదరి, కె.సంజన, ఎ.రిషిక లక్ష్మి, పి.చార్మిత, టి.భాను సాయిశ్రీ (సెయింట్ మేరీస్ భీమవరం), ఎన్.నళినాక్షి, బి.అర్జు (బీవీబీ టీపీగూడెం), టి.దుర్గా భవాని(శృంగవృక్షం జెడ్పీ), పి.అశ్రిత (సెయింట్ మేరీస్ భీమవరం), పి.మౌనిక (కాకరపర్రు జెడ్పీ), పి.అంబిక (కృష్ణయ్యపాలెం జెడ్పీ), ఫస్ట్స్టాండ్బైగా కె.వర్ష(సెయింట్ మేరీస్ భీమవరం), పి.దుర్గా భవాని(శృంగవృక్షం జెడ్పీ), పి.చాతుర్య(సెయింట్ మేరీస్ భీమవరం) ఎంపికయ్యారు. జూనియర్ బాలికల టీమ్ ఎ.ధరణి, ఎ.రిషిత, కె.రమ్య నాగలక్ష్మి (నారాయణకాలేజి భీమవరం), కె.శృతి (భీమవరం), కె.భరణి (పెనుగొండ), పి.మౌనిక, కె.శారద (టీపీ గూడెం), ఎ.మాధురి (కృష్ణయ్యపాలెం). -
పుష్పాలంకరణలో విద్యా గణపతి
భీమవరం టౌన్ : భీమవరం గునుపూడిలో వేంచేసియున్న విద్యా గణపతిని సోమవారం చామంతి, జాజి, కనకాంబరం, బంతి, మొరియం పుష్పాలతో అలంకరించారు. నాచు చినబాబు, తుందుర్రు సూరిబాబు సహకారంతో ఈ అలంకరణ చేసినట్టు అర్చకుడు కొమ్ము శ్రీనివాస్ తెలిపారు. -
12న జిల్లా హాకీ జట్టు ఎంపిక
భీమవరం : జూనియర్, సబ్ జూనియర్ బాలికల 7వ అంతర్ జిల్లాల హాకీ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టును ఈనెల 12నlభీమవరం సెయింట్æమేరీస్ స్కూల్లో ఎంపిక చేయనున్నట్టు జిల్లా హాకీ క్రీడా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆరేటి రామకృష్ణప్రకాష్, గద్దే సతీష్‌బాబు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 29వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు అనంతపురంలో అంతర్ జిల్లాల పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జూనియర్ విభాగంలో పాల్గొనే క్రీడాకారులు 1998కి ముందు, సబ్ జూనియర్ విభాగంలో పాల్గొనేవారు 2001కి ముందు జన్మించి ఉండాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 94922 95396 నంబర్లో సంప్రదించాలని ఆర్గనైజింగ్ సెక్రటరీ అల్లు అప్పారావు పేర్కొన్నారు. -
గణపతికి ఫల అలంకరణ
భీమవరం టౌన్ : భీమవరం గునుపూడి విద్యాగణపతిని గురువారం 15 రకాల పండ్లతో అలంకరించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక అలంకరణలో స్వామి దర్శనమిచ్చారు. ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. గునుపూడి బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు చెరుకుమిల్లి సంతోష్, కార్యదర్శి బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యశర్మ, కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.