డీఎన్నార్‌లో జాతీయ సమైక్యతా ర్యాలీ
భీమవరం : భీమవరం డీఎన్నార్ కళాశాల ఎన్‌సీసీ సీనియర్ డివిజన్ విభాగం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో ఆదివారం జాతీయ సమైక్యతా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కళాశాల పాలకవర్గ కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు, జెండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల త్యాగఫలాలను దేశప్రజలు స్వేచ్ఛగా స్వాతంత్య్రం అనుభవిస్తున్న తరుణంలో కొంతమంది తీవ్రవాదులు స్వేచ్చా, స్వాతంత్య్రాలకు భంగం కలిగించడం ఆందోళన కలిగిస్తుందన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ పి.రామకృష్ణంరాజు మాట్లాడుతూ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందన్నారు. కళాశాల వద్ద ప్రారంభమైన ర్యాలీ జువ్వలపాలెం రోడ్డు, అం»ే డ్కర్ సెంటర్, ప్రకాశం చౌక్, తాలూకాఫీస్ సెంటర్, ఫుట్‌పాత్ బ్రిడ్జి మీదుగా కళాశాలకు చేరింది. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్‌సీసీ ఆఫీసర్ డాక్టర్ ఎ.వీరయ్య, వి.మణికంఠ, బి.వాసవి, సాయికిరణ్, వై.సాయిరాం, పి.దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.