sunday
-
ఆదివారం ఆమెకు రెస్ట్ ఇద్దామా..!
ఉదయం లేచింది మొదలు.. టీ పెట్టివ్వడం నుంచి కూరగాయలు కోయడం, వంట చేయడం. బట్టలు ఆరేయడం.. ఆరేసినవి మడత బెట్టడం. ఇంటిని సర్దడం.. పిల్లలకు స్నానాలు చేయించడం. వారిని చదివించడం.. ఇలా చూడడానికి అన్నీ చిన్న పనులే.. కానీ అవే ఆమె ముఖాన చిరునవ్వులు మొలిపిస్తాయి. ‘ప్రతీ క్షణం నీకోసం నువ్వు.. వారానికి ఒక్కరోజు నీ ఇల్లాలికి ఇవ్వు’ అన్నట్లు ఆదివారం ‘ఇల్లాలి’కి ఇంటి పనుల్లో సాయమందించాల్సిన అవసరం ఉంది. గంపెడు బాధ్యతలతో ఇంటి బండిని నడిపే ఆమెకు వారంలో ఒక్కరోజైనా విశ్రాంతి కావాలంటున్నారు.. ఆదివారం ఇంటి, వంట పనుల్లో పాలు పంచుకుంటే అనుబంధం మరింత పెరిగే అవకాశమూ ఉంది. నవ్వులు విరియాలంటే..ఆమె ఆరోగ్యవంతురాలైతే.. ఇంటిల్లిపాదికీ ఆరోగ్యమే. కుటుంబం సక్రమంగా నడవడానికి ఆమే ప్రధాన కారణం. అలాంటి ఇల్లాలికి వారంలో ఒక్కరోజైనా విశ్రాంతి కావాలి. వారాంతంలో భార్య చేసే ఇంటి పనుల్లో ఓ చెయ్యి వేస్తే ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆమెకూ విశ్రాంతి దొరుకుతుంది. ఉదయం లేచింది మొదలు.. టీ పెట్టివ్వడం నుంచి కూరగాయలు కోయడం, వంట చేయడం. బట్టలు ఆరేయడం.. ఆరేసినవి మడత బెట్టడం. ఇంటిని సర్దడం.. పిల్లలకు స్నానాలు చేయించడం. వారిని చదివించడం.. ఇలా చూడడానికి అన్నీ చిన్న పనులే.. కానీ అవే ఆమె ముఖాన చిరునవ్వులు మొలిపిస్తాయి. వర్క్ షేరింగ్.. హ్యాపీనెస్ లోడింగ్కలిగే ప్రయోజనాలుఇల్లాలిపై ప్రేమను చూపడంలో అతను ఇంటిపనుల్లో చేసే సహాయం కీలకం. ప్రతి పనిని భారంగా తీసుకోకుండా చేస్తున్నప్పుడు భర్త తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో, పట్టించుకున్నాడో భార్య అర్థం చేసుకుంటుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకునేందుకు దోహద పడుతుంది. భర్త తన కష్టాలను మోస్తున్నాడని, తనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడని నమ్మకం ఏర్పడుతుంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు ఉంటాయి. కుటుంబ పరిస్థితులు, సంఘటనలతో ఇవి తలెత్తుతుంటాయి. వంట చేయడం, దుస్తులు ఉతికి ఆరబెట్టడం వంటి కొన్ని పనులు కలిసి చేయడం వల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలగిపోయే అవకాశం ఉంది.ఇంటిపని మహిళలకే పరిమితమనే భావన నెలకొంది. కానీ, భార్యాభర్తలు ఇంటిపనులు పంచుకోవడం వల్ల దాంపత్యంలో సామరస్యం పెరుగుతుంది.పనులను షేర్ చేసుకున్నప్పుడు త్వరగా పూర్తవుతాయి. మిగిలిన సమయంలో కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవచ్చు. అప్పుడు ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించడం ప్రారంభిస్తారు.ఏమి చేయొచ్చంటే..ఇంట్లోని దుమ్ము దులపడం, వాక్యూమింగ్ చేయడం, నేలలను తుడవడం, బాత్రూం శుభ్రపరచడం, వంటగది శుభ్రపరచడం (పాత్రలు, కౌంటర్‌టాప్‌లు), కూరగాయలు కోయడం, భోజనం తయారీ, దుస్తులు ఉతికి ఆరబెట్టడం, ఆరాక మడతబెట్టడం, అవసరమైనప్పుడు ఇస్త్రీ చేయడం.పిల్లల సంరక్షణలో ఇలా..ఆ రోజు పిల్లలకు కూడా సెలవుదినం కావడం వల్ల స్నానం చేయించి దుస్తులు ధరింపజేయాలి.హోంవర్క్‌లో సహాయం చేయడం, ఆ రోజు పాఠశాలలో ఏదైనా కార్యక్రమం ఉన్నా హాజరు కావడం. ఇంటి ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించడం, పచ్చిక కోయడం, తోటపని చేయడం.ఆదివారం ప్రత్యేకమైన వంటలు చేస్తారు...నా భర్త ఉద్యోగరీత్యా ఉదయమే వెళ్తారు. ఆదివారం సెలవు కావడంతో నాకు సహాయంగా ఉంటారు. కూరగాయలు తరగడం, బట్టలు ఉతికితే ఆరేయడం, వంటగదిని శుభ్రం చేయడం వంటి పనులు చేస్తారు. మా బాబుకు ఇష్టమైన చికెన్ బిర్యానీ చేసి స్వయంగా వడ్డిస్తారు. – సీత స్వప్న, పోచమ్మకుంట, హనుమకొండభాగస్వామికి విశ్రాంతినివ్వాలి..నిత్యం పని ఒత్తిడిలో బిజీగా ఉండే భార్యకు వారాంతపు సెలవు దినంలో విశ్రాంతినివ్వాలి. ఇలా చేయడం వల్ల జీవితభాగస్వామి మానసిక ఒత్తిడికి దూరమవుతుంది. వారాంతపు సెలవు దినంలో ఇంటిపని, గార్డెనింగ్, ఇంటి శుభ్రతలో నిమగ్నమవుతుంటాను. నేనే స్వయంగా పిల్లలకు ఇష్టమైన, ఆరోగ్యకరమైన వంటలు చేసి వడ్డిస్తాను. పిల్లలకు అవసరమైన వస్తువులు కొనిస్తాను. సంతోషంగా గడుపుతాను. – డాక్టర్ బీఆర్ శరవణభవ, ప్రొఫెసర్, హెడ్ ఫార్మ్ డీ, వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, హనుమకొండఇంటి పనుల్లో సాయంగా ఉంటాను..నా జీవితభాగస్వామితో కలిసి ఉదయమే దేవతారాధన చేస్తాను. అనంతరం మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు, నిత్యవసర సరుకులు అందిస్తాను. నా భార్యకు ప్రతీ పనిలోనూ సాయంగా ఉంటాను. వారాంతంలో రుచికరమైన భోజనం సిద్ధం చేసుకొని హైదరాబాద్‌లో ఉన్న మా పిల్లల వద్దకు వెళ్తాం.– మునుగోటి రమేశ్, వరంగల్(చదవండి: ‘ఫాఫో పేరెంటింగ్’ అంటే..? నెట్టింట వైరల్) -
ఆదివారం ఆశవర్కర్లకు సెలవు
సుల్తాన్‌బజార్/అఫ్జల్‌గంజ్: ఆశవర్కర్లకు ఆదివారం సెలవుగా పరిగణించడంతోపాటు పండుగ సెలవులను సైతం మంజూరు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్య–కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్ ప్రకటించారు. ఈ నిర్ణయా న్ని తక్షణమే అమలు చేస్తామన్నారు. ఆశవర్కర్లకు విధించే టా ర్గెట్లతోపాటు స్పూటమ్ డబ్బాలు మోసే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు చె ప్పారు. కుష్టు వ్యాధి నివారణ, పల్స్‌పోలియోకు సంబంధించిన పెండింగ్ డబ్బులను వారికి త్వరలోనే చెల్లిస్తామన్నారు. ఈ మేరకు తెలంగాణ ఆశవర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జయలక్ష్మి సహా ఇతర ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. ఫిక్స్డ్ వేతనం రూ. 18 వేలు, రూ. 50 లక్షల బీమా, రిటైర్మెంట్ ప్రయోజనాలు, పెన్షన్, ప్రమోషన్, హెల్త్‌కార్డు లు, ఏటా 20 రోజుల క్యాజువల్ సెలవులు తదితర సమస్యలపై ప్రతిపాదనలతో ఫైళ్లను ప్రభుత్వానికి సమర్పిస్తామని హామీ ఇచ్చారు. రెండోరోజూ ధర్నా.. నచ్చజెప్పిన పోలీసులు అంతకుముందు జీతాల పెంపు సహా తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆశవర్కర్లు మంగళవారం కూడా ఆందోళన కొనసాగించారు. హైదరాబాద్ కోఠిలోని డీఎంహెచ్ఎస్ చౌరస్తాలో తెలంగాణ ఆశవర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో వందలాది మంది ఆశ వర్కర్లు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రస్తు త అసెంబ్లీ సమావేశాల్లోనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులు రోడ్డుపై బైఠాయించడంతో తీవ్ర ట్రాఫిక్‌జాం ఏర్పడింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు వెంటనే అక్కడికి చేరుకొని నిరసనకారులతో మాట్లాడారు. కావాలంటే డీఎంహెచ్ఎస్ ప్రాంగణంలో నిరసన తెలుపుకోవాలని నచ్చజెప్పారు. దీంతో ఆశవర్కర్లు డీఎంహెచ్ఎస్లో ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో స్పందించిన వైద్య, ఆరోగ్య–కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్ యూనియన్ ప్రతినిధులను చర్చలకు పిలిచారు. చర్చల అనంతరం జాయింట్ డైరెక్టర్ రాజేశం, మరికొందరు అధికారులు నిరసనకారుల వద్దకు వెళ్లి ప్రభుత్వ హామీలను వివరించారు. ఆ పోలీసులను డిస్మిస్ చేయాలి: కేటీఆర్ ఆశవర్కర్లు సోమవారం చేపట్టిన నిరసన సందర్భంగా వారితో అనుచితంగా ప్రవర్తించిన పోలీసులను ప్రభుత్వం వెంటనే డిస్మిస్ చేయాలని బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు డిమాండ్ చేశారు. పో లీసులతో తోపులాటలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రహీంబీ అనే ఆశ వర్కర్‌ను మంగళవారం ఆయన పరామర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్సీలు మహ్మద్ అలీ, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మా జీ మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. -
పార్టీలో ఎంజాయ్ చేసిన స్టార్ హీరోయిన్ చెల్లెలు (ఫోటోలు)
-
భారత క్రికెట్‌కు ‘బ్యాడ్ సండే’
క్రికెట్ మైదానంలో ఆదివారం భారత్‌కు ఏదీ కలిసిరాలేదు! ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ రెండో టెస్టులో రోహిత్ శర్మ సారథ్యంలోని పురుషుల జట్టు ఆ్రస్టేలియా చేతిలో పరాజయం చవిచూడగా... ఆస్ట్రేలియాలోని మరో వేదిక బ్రిస్బేన్‌లో భారత మహిళల జట్టుకూ భారీ ఓటమి ఎదురైంది. అడిలైడ్ ‘పింక్ బాల్’ టెస్టులో పురుషుల జట్టు ప్రభావం చూపలేకపోగా... రెండో వన్డేలో ఓడిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని మహిళల జట్టు కంగారూలకు సిరీస్ కోల్పోయింది. ఇక దుబాయ్‌లో జరిగిన ఆసియా జూనియర్ కప్ అండర్–19 టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన యువ భారత జట్టు తుదిపోరులో బంగ్లాదేశ్ చేతిలో ఓడి టైటిల్‌కు దూరమైంది. మొత్తానికి ఒకే రోజు మూడు వేర్వేరు విభాగాల్లో భారత క్రికెట్ జట్లను పరాజయం పలకరించడంతో ‘హ్యాపీ సండే’ కావాల్సిన చోట ‘బ్యాడ్ సండే’గా మారింది.అడిలైడ్‌లో అదే వ్యథఅడిలైడ్: గులాబీ బంతి పరీక్షలో భారత జట్టు గట్టెక్కలేదు. నాలుగేళ్ల క్రితం అడిలైడ్‌లో జరిగిన ‘పింక్ బాల్’ టెస్టులో ఘోర పరాజయం ఎదుర్కొన్న టీమిండియా... ఇప్పుడు మరోసారి అడిలైడ్ వేదికగా ఓటమి వైపు నిలిచింది. ఆదివారం ముగిసిన ‘డే అండ్ నైట్’ టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. తొలి టెస్టులో చిత్తుగా ఓడిన ఆ్రస్టేలియా... తమకు అచ్చొచి్చన ‘పింక్ బాల్’ టెస్టులో ఘనవిజయంతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ‘ని 1–1తో సమం చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 128/5తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా... 36.5 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (47 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి భారత టాప్ స్కోరర్‌గా నిలవగా... మిగతా వాళ్లు ప్రభావం చూపలేకపోయారు. ఆ్రస్టేలియా బౌలర్లలో కెపె్టన్ కమిన్స్ 5 వికెట్లు పడగొట్టగా... బోలండ్ 3 వికెట్లు, స్టార్క్ 2 వికెట్లు తీశారు. అనంతరం 19 పరుగుల స్వల్ప విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 3.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు మెక్‌స్వీనీ (10 నాటౌట్), ఖ్వాజా (9 నాటౌట్) అజేయంగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో చెలరేగిన ట్రావిస్ హెడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు జరుగుతుంది. మరో 47 పరగులే జోడించి... ప్రధాన ఆటగాళ్లు రెండో రోజే అవుటైనా... రిషబ్ పంత్ (28), నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులో ఉండటంతో... భారత అభిమానులు అడిలైడ్‌లో అద్భుతం జరగకపోతుందా అని ఆశిస్తే... అది అడియాశే అయింది. క్రితం రోజు స్కోరు వద్దే పంత్.. స్టార్క్ బౌలింగ్‌లో స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పుడే పరాజయం ఖాయమైపోగా... నితీశ్ రెడ్డి దూకుడు పెంచి జట్టుకు ఇన్నింగ్స్ ఓటమిని తప్పించాడు. ఈ ఆంధ్ర కుర్రాడు జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లిన తర్వాత 9వ వికెట్ రూపంలో అవుటయ్యాడు. తాజా సిరీస్‌లో ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడుసార్లు భారత్ తరఫున నితీశ్ రెడ్డి టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. అశి్వన్ (7), హర్షిత్ రాణా (0), సిరాజ్ (7) ఇలా ఒకరివెంట ఒకరు పెవిలియన్ చేరిపోవడంతో టీమిండియా ఆలౌటైంది. చేతిలో ఐదు వికెట్లతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన రోహిత్ బృందం క్రితం రోజు స్కోరుకు మరో 47 పరుగులు మాత్రమే జోడించగలిగింది. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి భారత జట్టు కేవలం 81 ఓవర్లు మాత్రమే ఆడింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 180; ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 337; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) కేరీ (బి) బోలండ్ 24; రాహుల్ (సి) కేరీ (బి) కమిన్స్ 7; గిల్ (బి) స్టార్క్ 28; కోహ్లి (సి) కేరీ (బి) బోలండ్ 11; పంత్ (సి) స్మిత్ (బి) స్టార్క్ 28; రోహిత్ (బి) కమిన్స్ 6; నితీశ్ రెడ్డి (సి) మెక్‌స్వీనీ (బి) కమిన్స్ 42; అశి్వన్ (సి) కేరీ (బి) కమిన్స్ 7; హర్షిత్ (సి) ఖ్వాజా (బి) కమిన్స్ 0; బుమ్రా (నాటౌట్) 2; సిరాజ్ (సి) హెడ్ (బి) బోలండ్ 7; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (36.5 ఓవర్లలో ఆలౌట్) 175. వికెట్ల పతనం: 1–12, 2–42, 3–66, 4–86, 5–105, 6–128, 7–148, 8–153, 9–166, 10–175. బౌలింగ్: స్టార్క్ 14–1–60–2; కమిన్స్ 14–0–57–5; బోలండ్ 8.5–0–51–3. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: మెక్‌స్వీనీ (నాటౌట్) 10; ఖ్వాజా (నాటౌట్) 9; మొత్తం (3.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 19. బౌలింగ్: బుమ్రా 1–0–2–0; సిరాజ్ 1.2–0–9–0; నితీశ్ కుమార్ రెడ్డి 1–0–8–0.12 ఇప్పటి వరకు 13 డే అండ్ నైట్ టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా 12 టెస్టుల్లో నెగ్గడం విశేషం. అడిలైడ్‌లో ఆడిన 8 డే నైట్ టెస్టుల్లోనూ ఆ్రస్టేలియా గెలిచి అజేయంగా ఉంది. మరోవైపు ఇప్పటి వరకు ఐదు డే అండ్ నైట్ టెస్టులు ఆడిన భారత జట్టు రెండింటిలో ఓడిపోయింది. ఈ రెండూ అడిలైడ్‌లోనే కావడం గమనార్హం. -
ప్రభుయేసు ఆగమనం
విశ్వవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాస సమాజం యేసుప్రభువు వారి జన్మదినం జరుపుకొనేందుకు నాలుగువారాలు ముందస్తుగా ‘క్రిస్మస్’ వేడుకలు ప్రారంభిస్తున్నారు. దీనినే ‘అడ్వెంట్’ అంటారు. అనగా ఆగమనం/రాకడ/ఆహ్వానం పలుకుటకు ముందస్తుగా ఏర్పాట్లు ప్రారంభించి, డిసెంబరు 24 సాయంత్రంతో ముగిస్తారు.దేవకుమారుడైన యేసుక్రీస్తు ఆగమనానికి ముందస్తు క్రైస్తవ విశ్వాస సమాజం ప్రార్థనలోను, సంఘ సహవాసంతోను కలిసి దేవుని వాక్యానుసారంగా ప్రార్థించుటకు ‘దేవుని మందిరమైన’ సంఘంలో పాల్గొని ‘క్రిస్మస్’ డిసెంబరు 25న క్రీస్తు జన్మదినం కొరకు సిద్ధపడటమే ‘అడ్వంట్’. చీకటిరాత్రి తొలగి అరుణోదయ కాంతి రావటమే ప్రధానాంశం.క్రీ.పూ. 5వ శతాబ్ద కాలంలో ‘మాలకీ’ అనే దేవుని దూత చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు అనగా ప్రవాసులుగా భూమియంతట చెందినవారిని, నిస్సహాయక స్థితిలో ఉన్న వారిని భయభక్తులు కలిగి వుండాలని సందేశిమిచ్చాడు. కానీ వారిని భయభ్రాంతుల నిమిత్తం కాదన్నది వాక్యభావం, అందులో ప్రాముఖ్యంగా నియామ ఏకదినము, చిగురపుట్టను అన్న వచనాలు బలపరుస్తూ క్రీ.పూ 742–687 సంవత్సకాలంలో సింధూర వృక్షం నరకబడిన దానిమొద్దులోనుంచి పరిశుద్ధమైన చిగురు పుట్టునన్న వాక్యం దావీదు వంశావళిలో శాంతి, సమాధానాది ప్రదాతయైన యేసుప్రభువువారు జన్మించునని ముందస్తుగానే ప్రవచించారని వాక్యం స్పష్టీకరించుచున్నది. మలాకీ కాలం క్రీ.పూ. 5వ శతాబ్దం (మలాకీ 4 :1 –6; యెషయా 6 : 13).ఈ ముందస్తు క్రీస్తు ప్రభువువారి జన్మదిన సిద్ధపాటులో ప్రజలు లేక పెండ్లి విందుకు ఆహ్వానించినవారిలో కొందరు బుద్ధిమంతులు వుంటారని, మరికొందరు బుద్ధిహీనులుగా వుంటారని పెండ్లి కుమారుడు వచ్చేవరకు వేచి వున్న బుద్ధిమంతుల దీపము అనగా భక్తిపరులుగా వాక్యానుసారంగా ఎదురుచూస్తారని ఏల అనగా వారి దీపములలో అనగా భక్తిలో నూనెతో సిద్ధపడతారని, (‘నూనె’ భక్తికి సాదృశ్యం), బుద్ధిహీనులు దానికి బదులుగా విరుద్ధమైన సిద్ధపాటు పడతారని వారు బుద్ధిహీనులని యేసుప్రభువులవారు ఇశ్రాయేలీయుల ప్రజలతో ఉపమాన రీతిలో బోధించారని ఈ వాక్యం తెలియజేస్తున్న పరమార్థం (మత్తయి 5 :1–13).కనుక ముందస్తు ఆగమనం కొరకు ఎదురుచూసేవారు ఈ నాలుగువారాలు సంఘము నియమింపబడిన సమయంలో భక్తిపూర్వకంగా వాక్యానుసారమైన ప్రార్థన, సంఘ సహవాసంతో కలిసి ప్రార్థనలలో పాల్గొని పరిశుద్ధంగా అనగా ఆ ప్రార్థనల్లో 100 శాతం నిజాలు, ప్రభువు సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు వుండేలా సిద్ధపడుదురు గాక.– కోట బిపిన్‌చంద్రపాల్ -
సామాన్యులకు సందడి.. ఆదివారం అంగడి..
నగరంలోని ఆదివారం అంగడికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది ఎర్రగడ్డ మార్కెట్. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ అందరూ షాపింగ్ చేసేలా కాటుక బరణి నుంచి కార్ టైర్ల వరకూ అన్నీ లభ్యమవుతాయి. దీంతో ఈ మార్కెట్‌కు రాను రానూ క్రేజ్ పెరిగిపోతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంత సామాన్యులు, మధ్యతరగతి పాలిట ‘సంత’సాన్ని నింపుతోంది. ఈ ఓపెన్ మాల్.. శ్రీమంతులకు ఆటవిడుపు.. ఆదివారం సూర్యోదయం కాకమునుపే ‘గిట్టుబాటు’ అంకెలను గుక్కతిప్పుకోకుండా పలకడంలో అక్కడ వ్యాపారులు పోటీపడుతుంటారు. ఆ రోజు అందరికీ సెలవు. కానీ, వారికి ఈ సెలవు రోజే బతుకు దెరువు. ఎర్రగడ్డ చౌరస్తా మొదలు.. ఫతేనగర్ ఫ్లైఓవర్ వరకూ విస్తరిస్తూ పోతోంది..దీని గురించిన మరిన్నివివరాలు.. – సనత్నగర్శతాబ్దం కాలం క్రితం 15–20 దుకాణాలతో మొదలైన సంత నేడు దాదాపు వెయ్యి మంది చిరువ్యాపారులకు బతుకుదెరువుకు కేంద్రంగా మారింది. రోడ్డే ఈ సంతకు అడ్డా. నాడు ఎర్రగడ్డ చౌరస్తాకే పరిమితమైన వ్యాపారాలు నేడు కిలోమీటరు పొడవున తమ షాపులను విస్తరించారు. చౌరస్తా నుంచి మొదలుకొని సనత్‌నగర్ బస్టాండ్ వరకూ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఆల్ ఇన్ వన్ అంగడి.. చిన్నా.. పెద్దా మాల్ అనే తేడా లేదు.. వాటిల్లో ఉండే ప్రతి వస్తువూ ఇక్కడ లభ్యమవుతోంది. స్రూ్కడ్రైవర్ నుంచి సూట్‌కేస్ వరకూ.. రెడీమేడ్ దుస్తుల నుంచి రేబాన్ గ్లాసెస్ వరకూ, వంటింటి పాత్రల నుంచి వయ్యారాలు ఒలకబోసే అందమైన ఆట»ొమ్మల వరకూ, నాటి గ్రామ్‌ఫోన్‌ల నుంచి నేటి స్మార్ట్ఫోన్ల వరకూ.. ఇలా ప్రతిదీ ఈ సంతలో దొరుకుతాయి. ముఖ్యంగా నిత్యం ఇంట్లో ఉపయోగించే వస్తువులకు ఈ మార్కెట్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఎరగ్రడ్డ–సనత్‌నగర్ మార్గం ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోతూ సందడిగా మారుతోంది.‘సెకండ్స్’కు పెట్టింది పేరు.. ఎర్రగడ్డ సంత అంటే వస్తువులు ‘సెకండ్స్’లో అమ్ముడుపోతాయన్నది వ్యాపార వర్గాలతో పాటు వినియోగదారుల నుంచి వినిపించే మాట. షర్టులు, ఫ్యాంట్లు, గొడుగులు, సీడీలు, ఎలక్ట్రికల్, ఐరన్ వస్తువులు.. ఇలా ఎన్నో రకాల వస్తువులు సెకండ్ హ్యాండ్లో లభిస్తాయి. ఇక ప్రొక్లెయినర్ నుంచి మొబైల్ ఫోన్ వరకూ.. ఎలాంటి యంత్రాలు, వస్తువులకైనా కావాల్సిన విడి భాగాలు (స్పేర్‌పార్ట్స్)కు ఈ సంత ఫేమస్. అందుకే ఎర్రగడ్డ సంతకు ఇంత క్రేజ్. నగరం నలుమూలల నుంచి..కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్, అమీర్‌పేట నుంచే కాకుండా నగరం నలుమూలల నుంచి ఈ మార్కెట్‌ను సందర్శించి తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకుని మరీ వెళ్తుంటారు. ప్రతి వారం 30–40 వేల మంది వినియోగదారులు ఈ మార్కెట్‌ను సందర్శిస్తుంటారని ఓ అంచనా. సీజనల్ వ్యాపారాలకు ఊపునిస్తూ..చలికాలం మొదలైతే ఇక్కడ స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు, మఫ్లర్లు, షాల్స్ అమ్మకాలు భారీగా జరుగుతాయి. ధాన్యపు రాశులు పోసినట్లు రోడ్లపై గుట్టలు పోస్తారు. వర్షాకాలంలో రెయిన్ కోట్లు, రంగురంగుల గొడుగులతో మార్కెట్ నిండిపోతుంది. వేసవి వచి్చందంటే కాటన్ దుస్తుల అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి.వందేళ్ల చరిత్రకు సాక్ష్యం..రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి.. కానీ వందేళ్ల చిత్రకు సాక్ష్యంగా ఇక్కడ మార్కెట్ నిలుస్తోంది. రెండు దశాబ్దాల క్రితం వరకూ పశువుల సంత కూడా ఇక్కడే జరిగేది. వివిధ జిల్లాల నుంచి విభిన్న జాతుల ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలను, వివిధ రకాల పంటలను రైతాంగం ఇక్కడ క్రయవిక్రయాలు జరిపేది. అయితే నగర విస్తరణ, పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా ఇక్కడి పశువులను సంతను మోతీనగర్ సమీపంలోని బబ్బుగూడకు తరలించారు. సాధారణ మార్కెట్ మాత్రం ఇక్కడే కొనసాగుతూ వస్తోంది. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు..వివిధ జాతులకు చెందిన పిల్లులను తెచ్చి అమ్ముతుంటాను. ఎప్పటికప్పుడు తన వద్దకు వచ్చే కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు పెంపుడు జంతువులు తెస్తుంటాం. ఆదివారం వచి్చందంటే ఇక్కడ వ్యాపారం తప్పనిసరి. ఇదే మా కుటుంబ పోషణ.– ఖాన్, వ్యాపారిస్పేర్ పార్ట్స్ కోసం.. మొబైల్ ఫోన్‌కు అవసరమైన స్పేర్‌పార్ట్స్ కోసం ఎల్బీనగర్ నుంచి వచ్చా. ఇక్కడ మార్కెట్లో ఏది కావాలన్నా దొరుకుతుంది.. మొదటిసారి ఇక్కడికి రావడంతో ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ కొనుగోలు చేసే ప్రతి వస్తువునూ ఇక్కడ చూశాను. – మహేష్ ఎల్బీనగర్ -
వెనిస్లో ముంబై స్టైల్ ట్రాఫిక్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చెందిన వీడియోలో ఒక కాలువలో పడవలు.. ఒకదాని వెంట ఒకటి వెళ్తూ ఉన్నాయి. ఈ వీడియో షేర్ చేస్తూ.. ''ముంబై తరహా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడానికి మాత్రమే వెనిస్ వరకు ప్రయాణించారు. ముంబైతో పోలిస్తే ఇది కొంత తక్కువే అని నేను అంగీకరిస్తున్నాను'' అని అన్నారు. దీనికి సండే ఫీలింగ్ అంటూ ఓ హ్యస్టాగ్ కూడా ఇచ్చారు.ఇదీ చదవండి: రాత్రిపూట వెలుగు ఆర్డర్ చేసుకోవచ్చు.. మీరు ఎక్కడంటే అక్కడ!Traveled all the way to Venice only to run into a Mumbai-style traffic jam!(Ok, I admit this traffic pile-up is less stressful…🙂)#SundayFeeling pic.twitter.com/n25G8Y5upk— anand mahindra (@anandmahindra) September 15, 2024 -
Friendship Day: చెరగనిది మా స్నేహబంధం (ఫొటోలు)
-
కాస్త ఎండ.. అంతలోనే విపరీతమైన చలి!
దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగడంతో పాటు విపరీతంగా పొగమంచు కమ్ముకుంటోంది. అయితే చాలా రోజుల తర్వాత ఆదివారం కాస్త ఎండ కనిపించింది. అయితే సాయంత్రానికల్లా మళ్లీ చలి వివరీతంగా పెరిగింది. పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీకి వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సహా 22 రైళ్లు ఆరు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. చలి కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో ఉదయం పూట ఈ వారం పొడవునా తేలికపాటి పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది. జనవరి 9న తేలికపాటి వర్షం లేదా చినుకులు పడవచ్చు. ఢిల్లీలో శీతాకాల సెలవులను జనవరి 12 వరకు పొడిగించారు. అయితే ఇది ఐదవ తరగతిలోపు విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. 6 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల తరువాతనే వీరికి తరగతులు నిర్వహిస్తారు. ఢిల్లీలో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 18.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది శనివారం కంటే మూడు డిగ్రీలు తక్కువ. కనిష్ట ఉష్ణోగ్రత 8.2 డిగ్రీలుగా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత తగ్గడం వల్ల వాయు కాలుష్యం తీవ్రమయ్యింది. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 333గా ఉంది. జమ్మూ డివిజన్లో దట్టమైన పొగమంచు కారణంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. 11 విమానాలు ఆలస్యంగా నడిచాయి. -
Elections 2023: రిజల్ట్ చూద్దాం.. మజా చేద్దాం!
సినిమా కాదు.. క్రికెట్ మ్యాచ్ అంతకంటే కాదు కానీ, ఈ ఆదివారం సిసలైన మజాను కోట్ల మంది ఆస్వాదించబోతున్నారు ఎలాగంటారా?.. డిసెంబర్ 3.. రాజకీయ పార్టీలకు బిగ్డే చార్ పటాకా బద్ధలయ్యే రోజది మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్.. మూడు రాష్ట్రాల్లో రెండు ప్రధాన పార్టీల హోరాహోరీ పోరుపై నెలకొన్న ఆసక్తి ఇక ఇటు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, ప్రధాన పార్టీల నడుమ విజయధీమాలతో తెలంగాణ రాజకీయాలను హీటెక్కించిన వేళ.. ఓడేదెవరు? నెగ్గేదెవరనేది పక్కనపెడితే.. ఈ సూపర్ సండే మాంచి కిక్కు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.. రాజస్థాన్ చెరో దఫా ప్రభుత్వాల్ని ఇక్కడ కాంగ్రెస్-బీజేపీలు గత మూడు దశాబ్దాలుగా ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. అయితే.. గత మూడేళ్లుగా నడుస్తున్న గ్రూప్ రాజకీయాల నేపథ్యంలో ఈసారి రాజస్థాన్‌లో ఎవరు సర్కార్‌ను నెలకొల్పుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇప్పుడున్న రాజస్థాన్ అసెంబ్లీ గడువు జనవరి 14, 2024తో ముగియనుంది. ఈలోపు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసి అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. 200 స్థానాలు ఉన్న రాజస్థాన్ అసెంబ్లీకి.. 199 స్థానాలకు(ఒక దగ్గర అభ్యర్థి మరణంతో ఎన్నిక నిలిపివేశారు) నవంబర్ 25వ తేదీన పోలింగ్ జరిగింది. మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 75.45% పోలింగ్ నమోదైంది. ప్రభుత్వ ఏర్పాటుకు 101 స్థానాలు రావాల్సి ఉంటుంది. ఐదేళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాల ప్రభావం తమను మళ్లీ గెలిపిస్తుందని కాంగ్రెస్.. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో పేరుకుపోవడంతో పాటు తాము ఇచ్చిన ఎన్నికల హామీలకు ప్రజలు పట్టం కడతారని బీజేపీ గెలుపుపై ధీమాతో ఉన్నాయి. ఎగ్జిట్‌పోల్ ఫలితాలు హోరాహోరీ పోటీనే చూపిస్తున్నాయి ఇక్కడ. మధ్యప్రదేశ్ కిందటి ఎన్నికల్లో నెగ్గి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేశామనే సంతోషం కాంగ్రెస్‌కు రెండేళ్లే ఉంది. తిరుగుబావుటా నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిణామాలు.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఇప్పుడున్న అసెంబ్లీ గడువు జనవరి 6, 2024తో ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా.. నవంబర్ 17వ తేదీన పోలింగ్ జరిగింది. మొత్తంగా 5.6 కోట్ల ఓటర్లకుగానూ.. 77.15 శాతం నమోదు అయ్యింది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి.. ప్రభుత్వ ఏర్పాటుకు 116 సీట్లు రావాల్సి ఉంటుంది. మధ్యప్రదేశ్‌లో ఈ ఐదేళ్లలో రెండు ప్రభుత్వాలు వచ్చాయి. గత ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. రెండేళ్లు తిరగకముందే 22 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో కుప్పకూలింది. సరిపడా బలం కమల్‌నాథ్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ వెంటనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసారి ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, కాంగ్రెస్‌లు ధీమాతో ఉన్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో సగం బీజేపీకి అనుకూలంగా.. సగం హంగ్ చూపిస్తుండగా.. ఓటర్ పల్స్ ఎలా ఉండనుందా? అనే ఆసక్తి నెలకొంది. ఛత్తీస్‌గఢ్ వరుసగా మూడు పర్యాయాలు(2003 నుంచి 2018 దాకా) సంపూర్ణ పాలన కొనసాగించిన బీజేపీకి చెక్ పెడుతూ కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే ధీమా కాంగ్రెస్‌లో కనిపిస్తుంటే.. కంచుకోటను చేజిక్కించుకుని తీరతామంటూ బీజేపీ ధీమా కనబరుస్తోంది. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ గడువు జనవరి 3, 2024తో ముగియనుంది. ఈలోపు ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం. రెండు ఫేజ్‌ల్లో నవంబర్ 7న, నవంబర్ 17న పోలింగ్ నిర్వహించింది ఈసీ. మొత్తం కోటి 63 లక్షల ఓటర్లు ఉండగా.. 76 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 46 రావాలి. రూరల్ డెవలప్మెంట్ అనేది ప్రధాన అస్త్రంగా.. సంక్షేమ పథకాలను కాంగ్రెస్ నమ్ముకుంది. మరో వైపు అవినీతి ఆరోపణలు, మత మార్పిడులు, హామీలు నెరవేర్చకపోవడం వంటి అస్త్రాలను బీజేపీ సంధించింది. మరోవైపు.. అద్భుతం జరిగితేనే బీజేపీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ ఈ సారి అధికారం నిలబెట్టుకున్నా సీట్లు తగ్గే అవకాశముందని, ఇవేవీకావు.. బీజేపీ ఏకపక్షంగా నెగ్గుతుందని ఇలా రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి అక్కడ. ఈ తరుణంలో.ఎగ్జిట్ పోల్స్ సైతం ఛత్తీస్‌గఢ్‌లో హోరాహోరీ అంచనా వేస్తుండడంతో ఆసక్తి నెలకొంది. తెలంగాణ గత రెండు దఫాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. హ్యాట్రిక్ కొడతామంటోంది. ఈ పదేళ్లలో ఘోరంగా అవినీతి జరిగిందని.. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో తారాస్థాయికి వెళ్లిందని.. అది తమకు అధికారం కట్టబెడుతుందని ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలు చెప్పుకుంటున్నాయి. సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు.. ఈలోపే ఏకపక్షంగా వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. గెలుపుపై ఎవరికి వాళ్లే వ్యక్తం చేస్తున్న ధీమా పరిణామాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌ను మరిపించడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మూడో అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఇప్పుడున్న అసెంబ్లీ కాలపరిమితి జనవరి 16, 2024తో ముగియనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 30 తేదీన పోలింగ్ జరిగింది. మొత్తం 3.26 కోట్ల ఓటర్లు ఉండగా.. 70 శాతం పైనే ఓటింగ్ నమోదు అయ్యిందని అంచనా. అంటే.. దాదాపు కోటి మంది దాకా పోలింగ్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీకి 119 స్థానాలు ఉండగా.. అధికారం ఏర్పాటు చేయాలంటే 60 సీట్ల మెజారిటీ అవసరం. పదేళ్ల పాలన ప్రచార అస్త్రంగా బీఆర్ఎస్.. అత్యధిక సీట్లతో, మూడోసారి విజయంతో రికార్డు నెలకొల్పుతామని అంటోంది. ఇక ఈ పాలనలోనే జరగని అవినీతి లేదంటూ బీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారంతో కాంగ్రెస్, బీజేపీలు ప్రజల్లోకి వెళ్లాయి. సర్వేలు ఒకలా.. ఎగ్జిట్‌పోల్స్ మరోలా రావడంతో ఓటర్ పల్స్‌పై గందరగోళమే నెలకొంది. పైగా సాయంత్రం ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లడంతో.. తెలంగాణలో ఈసారి ఓటింగ్ గెలుపోటములను ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఏ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇస్తారనే తెలంగాణ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఆ బెట్టింగ్స్ తారాస్థాయికి చేరాయంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఏమేర ఉత్కంఠ నెలకొందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద.. ఈ ఆదివారం డిసెంబర్ 3న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ.. ఫలితాల వెల్లడి.. నాయకుల గెలుపొటములతో.. పార్టల సంబురాలు-నిరుత్సాహాలతో కోట్ల మందికి(ప్రత్యేకించి ఓటర్లకు..) ఇత్యాది పరిణామాలు మస్త్ మజాను అందించబోతున్నాయి! -
దేశంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు
దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు (ఆదివారం, నవంబర్ 26) ఉదయం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం హర్యానాలోని సోనిపట్‌లో ఉదయం 4 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై మూడుగా నమోదైంది. రెండో భూకంప కేంద్రం అస్సాంలోని దర్రాంగ్‌లో భూమికి 22 కిలోమీటర్ల లోతులో ఉంది. ఇది ఉదయం 7:36 గంటలకు సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై మూడుగా నమోదయ్యింది. అయితే ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. తాజాగా సంభవించిన భూకంప తీవ్రత చాలా తక్కువగా ఉండడంతో దాని ప్రభావం కనిపించలేదు. ప్రజలు భయాందోళనకు గురై, ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఎక్కడా ఎలాంటి నష్టం వాటిల్లలేదు. Earthquake of Magnitude:3.0, Occurred on 26-11-2023, 04:00:43 IST, Lat: 29.15 & Long: 76.97, Depth: 5 Km ,Location: Sonipat, Haryana, India for more information Download the BhooKamp App https://t.co/71kQ5wTDF1@Dr_Mishra1966 @KirenRijiju @Indiametdept @ndmaindia @Ravi_MoES pic.twitter.com/AtUSHA5KJ5 — National Center for Seismology (@NCS_Earthquake) November 25, 2023 గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. నవంబర్ 3న నేపాల్‌లో తీవ్ర భూకంపం సంభవించింది. దీని కారణంగా 70 మందికి పైగా జనం మరణించారు. అదే సమయంలో ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌లలో కూడా భూకంపం సంభవించింది. భయాందోళనకు గురైన జనం ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా పలువురు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ స్వల్ప భూకంపాలు భారీ భూకంపాలకు సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: తిరువణ్ణామలైలో ఘనంగా కార్తీక దీపోత్సవం -
నేపాల్‌లో మళ్లీ భూప్రకంపనలు..
నేపాల్‌లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపంలో 157 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. తాజాగా ఆదివారం(ఈరోజు) నేపాల్‌లో 3.6 తీవ్రతతో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఖాట్మండుకు వాయువ్యంగా 169 కి.మీ దూరంలో 10 కి.మీ లోతులో ఆదివారం తెల్లవారుజామున 4.38 గంటలకు భూప్రకంపనలు సంభవించనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకోలేదని పేర్కొంది. దీనికి ముందు శనివారం మధ్యాహ్నం కూడా 3.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని తెలిపింది. శుక్రవారం రాత్రి నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపంలో 157 మంది మృతి చెందారు. గడచిన ఎనిమిదేళ్లలో నేపాల్‌లో సంభవించిన అత్యంత భారీ భూకంపం ఇది. 2015లో నేపాల్‌లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో సుమారు తొమ్మిది వేల మంది మృతి చెందగా, 22 వేల మంది గాయాలపాలయ్యారు. ఇది కూడా చదవండి: ఢిల్లీ సహా ఉత్తర భారతంలోనూ భారీగా భూప్రకంపనలు -
అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు
లాలాపేట (హైదరాబాద్): హైదరాబాద్ నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి సహకరించడం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆయన ఆదివారం తార్నాక డివిజన్ లాలాపేటలోని బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీ వాసులంతా పలు సమ స్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బస్తీ వాసులు కిషన్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడు తూ... హైదరాబాద్ నగరంలోని బస్తీలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్ మొత్తం సింగపూర్, డల్లాస్ అయినట్లు బీఆర్ఎస్ నేతలు మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, బంధులు వంటి పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నాలుగు రైల్వే స్టేషన్ల నిర్మాణం చేపట్టిందన్నారు. చర్లపల్లిలో మరో టెర్మినల్ నిర్మాణంలో ఉందన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లను ఆధునీకరిస్తు న్నామని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ ట్రిపుల్ ఆర్ రోడ్డును రూ.26 కోట్లతో మంజూరు చేశామన్నారు. సర్వే ఆఫ్ ఇండియా దగ్గర రూ.450 కోట్లతో నేషనల్ సైన్స్ సిటీని మంజూరు చేశామని కానీ దాని కోసం 25 ఎకరాల స్థలం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పార్టీ కార్యాలయాలకు తప్ప ఇప్పటివరకు సైన్స్ సిటీకి స్థలం కేటాయించలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి బీజేపీ నేతలు బండ చంద్రారెడ్డి, రాము వర్మ పాల్గొన్నారు. -
సెలవైనా ఠంఛన్‌గా పింఛన్
సాక్షి, అమరావతి: సెలవు రోజైనా ప్రభుత్వం ఠంఛన్‌గా అవ్వాతాతలకు పింఛన్లు పంపిణీ చేసింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి రాష్ట్రవ్యాప్తంగా 51,37,566 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ, వివిధ రకాల చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.1,415.64 కోట్ల మొత్తాన్ని అందజేశారు. అక్టోబరు ఒకటో తేదీ నుంచి పంపిణీకిగాను 65,78,854 మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం మొత్తం రూ.1,813.60 కోట్ల విడుదల చేసింది. ఒకటో తేదీ ఆదివారం సెలవు అయినా.. సాయంత్రానికి 78.09 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయినట్టు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. మిగిలిన వారి కోసం ఐదోతేదీ వరకు వలంటీర్ల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. -
డ్యాన్స్! నువ్వు చేయకపోతే వేరేవాళ్లతో వెళ్లిపోతా..జాగ్రత్త!
‘ఎంత ఇంజినీర్ అయితే మాత్రం.. విస్తరిలో ప్రాజెక్ట్ కట్టాలా?’ అన్నాడు చందర్. గతి తప్పిన ఆలోచనలతో నా చేయి నా ప్రమేయం లేకుండానే విస్తరిలో అన్నాన్ని ఇష్టమొచ్చినట్టు అక్కడక్కడా చిన్నచిన్న ముద్దలుగా పేర్చింది. ప్రతిదాన్నీ కళాదృష్టితో చూసే చందర్కి ఆ ముద్దలు ఇరిగేషన్ ప్రాజెక్టులా కనిపించడంలో తప్పు లేదనిపించింది. దానికి తోడు విస్తరిలో వడ్డించిన పప్పులో పప్పు కన్నా ఎక్కువున్న నీళ్ళు ఆ ముద్దల మధ్య నుండి ఎత్తు నుండి పల్లానికి ప్రవహిస్తున్న తీరు కూడా చందర్ మాటలను సమర్థిస్తున్నట్టుగా ఉంది. ‘అరేయ్.. విజ్జూ..’ అని చందర్ మళ్లీ నా భుజం తట్టడంతో ఊహల్లో నుండి బయటపడ్డ నేను త్వరత్వరగా భోజనం ముగించి అప్పుడే వేసిన పెళ్ళి పందిరి కింద మూలన ఉన్న కుర్చీలో ఒరిగి కూర్చున్నా. చూస్తుండగానే మండుటెండలో కూడా కునుకు పట్టేసింది. నా పక్కన కూర్చుని, పెళ్ళి పందిరి కింద కునుకు తీస్తున్న నాకు నిద్రాభంగం చేస్తూ ‘పొద్దున్నుండి ఎందుకలా ఉన్నావ్?’ అంది నా భార్య శారద. ‘ఏమీ లేదు’ అన్నాన్నేను ఏదో ఉన్నట్టు. ‘ఈ రోజు డాన్స్ చేయాల్సొస్తుందనా!!’ నాకళ్ళల్లోకి చూస్తూ అంది తను. అడ్డంగా తలూపాను ‘కాదు’ అన్నట్టు. వెంటనే ఏదో అర్థం అయినట్టు ‘మన పెళ్ళికి తప్పించుకున్నావ్! మీ చెల్లి పెళ్లికి కూడా నోరు చేసి పక్కకు జరిగావ్. చివరికి నీ కొడుకు మొదటి పుట్టినరోజు.. మీ అమ్మతో నాకు చెప్పించి జారిపోయావ్. కాని రేపు మా తమ్ముడి పెళ్ళి.. ఈరోజు రాత్రి హల్దీలో నేను డాన్స్ చేయాల్సిందే! నేను చేస్తే నువ్వూ నాతో పాటు చేయాలి. ఒకవేళ నువ్ చేయలేదనుకో.. ఆ గుంపులో ఎవడు నా చేయిపట్టుకుని డాన్స్ చేస్తే వాడితో వెళ్ళిపోతా’ అంది శారద నా చెవిలో మెల్లిగా. ఇంతకుముందు అయితే నన్ను డాన్స్ చేయమని అడగడానికి భయపడేది తను. బెదిరిస్తే వింటాడు అనుకుందో లేదా నన్ను బతిమిలాడి విసిగిపోయిందో తెలీదుగాని, నా మనసు చివుక్కుమనేలా మాట్లాడింది ఇప్పుడు. ఏం చెప్పాలో తెలీక ‘సరే’ అన్నాను.. తన కళ్ళల్లోకి చూడకుండా నా కళ్ళల్లో పైకి ఉబికి వస్తున్న నీళ్ళను ఆపుకుంటూ. ఓ రెండు నిమిషాల తర్వాత ‘ఆ అన్నూ కూడా డాన్స్ చేస్తోంది బాబు..’ అంది శారద.. ఫోన్లో ఏదో డాన్స్ వీడియో చూస్తూ. అన్నూ.. నా అక్క కూతురు. తన వయసు రెండు సంవత్సరాలు. రెండు సంవత్సరాల పాపకు చేతనైంది కూడా నీకు చేతగాదా అన్నట్టు ఉన్నాయి శారద చూపులు, మాటలు. నేనేం మాట్లాడలేదు. కొన్నిసార్లు మౌనమే మేలు అనుకుని మౌనంగా ఉండిపోయాను. ఏమీ మాట్లాడకుండా ఉన్నానే గాని, రాత్రి జరగబోయే హల్దీ ఫంక్షన్ గురించిన ఆలోచనలతోనే నా మైండ్ అంతా నిండి పోయింది. ‘ప్రతి ఫ్యామిలీ ఫంక్షన్లో నేను చేయకున్నా తనొక్కతే డాన్స్ చేస్తుంది. కాని తమ్ముడి పెళ్ళి కాబట్టి ఈసారి నాతో జంటగా చేయాలనుకుని ముచ్చట పడుతోంది. నేను చేస్తే నాతో పాటు చేస్తుంది.. లేకపోతే..’ నా మెదడు ఆ ప్రశ్నను పూర్తిచేయడానికి కూడా ఇష్టపడలేదు. ఉండబట్టలేక, వెంటనే ‘నేను చేయకుంటే ఎవరితో చేస్తావ్?’ అంటూ అడిగాను శారదను. ఓ ఐదుసెకన్ల నిశ్శబ్దం. అడిగానే గాని ఆమె వైపు నేను కూడా చూడలేదు. చూసే ధైర్యం లేదు. తను ఎప్పుడూ నన్ను అనే ‘నువ్వు పిరికివాడివి’ అన్న మాటలు ఇంకోసారి గుర్తొచ్చాయి. ఐదుసెకన్ల తర్వాత ‘నీలాంటి వాడితోనే’ అంది.. ఫోన్లోనే మొహం పెట్టి. ‘నాలా ఉంటాడా!!’ ‘అవును నీలాగే ఉంటాడు. కాని మొహంలో కళ ఉంటుంది. నీలా ఎప్పుడూ ఏదో కొల్పోయిన వాడిలా ఉండడు. నవ్వుతూ ఉంటాడు. నేనేం చెప్పినా కాదనడు.’ ‘నిజమా?’ ‘నీ మీద ఒట్టు బాబు!’ శారద గొంతులో వెటకారం, పెదవులపై ఆపుకుంటున్న నవ్వు. ఆ మాటలతో నేల మీద ఓ కన్నీటి బొట్టు రాలింది. అది నాదే అని నేలతల్లికి కూడా తెలిసినట్టుంది.. ‘నేనైనా నీ పరువు కాపాడుతా’ అన్నట్టు ఓ రెండుసెకన్లలో దాన్ని తనలో కలిపేసుకుని మాయం చేసింది. ‘తమ్ముడితోనా.. ఉహూ అయ్యుండదు.. మరెవరు? ఎప్పుడూ వదినా వదినా అంటూ వెంటతిరిగే కిరణా? అవునేమో.. వాడు డాన్స్ బాగా చేస్తాడు. నాలా కాకుండా అందరితో ఇట్టే కలిసిపోతాడు. మంచి స్టైల్ మెయింటేన్ చేస్తాడు. ఫుల్ పోష్‌గా కనిపిస్తాడు. అన్నింటికీ మించి నాలా పిసినారి కాడు. ఆడవాళ్ళు ఇష్టపడే అన్ని లక్షణాలు ఉన్నాయి వాడిలో. అయితే మాత్రం నా శారు..’ అంటూ నా మెదడు మళ్ళీ తనకు తానే ప్రశ్నలు వేసుకుంది. తన కుడి చేతితో ఎవరి చేయినో గట్టిగా పట్టుకుంది శారు. నా హృదయం తట్టుకోలేక పోయింది. కాళ్ళు ఒక్కసారిగా వణికాయి. ‘నేను పిరికివాణ్ణి కాదు’ అని నాకు నేను చెప్పుకుని. ధైర్యం తెచ్చుకుని తలకొద్దిగా పైకిలేపేసరికి అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాను. శారు ‘వేరేవాడితో వెళ్ళిపోతా’ అన్న మాటలు నా మనసుని ముక్కలు చేస్తే, బాధతో నాకు నేను వేసుకుంటున్న ప్రశ్నలు నా మెదడుని మొద్దుబార్చేశాయి. వెంటనే ఒక్కసారిగా కళ్ళు మూతలు పడ్డాయి. దానికితోడు అస్పష్టంగా కిరణ్ గొంతు మళ్ళీ ‘వదినా.. వదినా’ అంటూ ఎక్కడో వినిపించడంతో.. ఒక్కసారిగా విచక్షణ జ్ఞానం కోల్పయినట్టయింది. కుర్చీలో ఉన్న నాకు, సినిమాలో లాగా చేయి నేలకు తాకించగానే ఏదో రాయిలాంటి ఆయుధం దొరికింది. అంతే ఒక్కసారిగా పిడికిలి బిగించి.. పళ్లుకొరికి ఉన్న శక్తినంతా కూడదీసుకుని ‘రేయ్..’ అంటూ పైకి లేచి చేతిలో ఉన్న రాయిని విసురుగా విసిరేశాను... బరువుగా కళ్ళు తెరిచేసరికి అంతా చీకటి.. ‘నేను శారుని చూసి బాధపడకూడదని నా కాళ్ళు తీసేశారా?’ అతికష్టం మీద అనగలిగాను. ‘అబ్బబ్బ.. డాన్స్ చేయాల్సొస్తుందని ఇంత నాటకాలెందుకురా?’ అంది నా చెల్లి సోని.. రూమ్‌లో లైట్వేస్తూ. నా కాలికి చిన్న కట్టు కనిపించింది. ‘ఏంటీ ఇది?’ అని అడిగితే.. ‘ఏంటా? చూడు ఎంత అమాయకుడిలా అడుగుతున్నావో అన్నయ్యా.. బాగా తిని నీ బావమరిది పెళ్ళి పందిరి కింద కుర్చీలో కూర్చుని.. కుంభకర్ణుడిలా నిద్రపోయావా మధ్యాహ్నం అంతా! అదే వింత అనుకుంటే.. ఇంకో వింతలా వదిన చిన్న డాన్స్ చేయమంటే కళ్ళు మూసుకుని దయ్యం పట్టినట్టు ఏదేదో వాగావ్! ఆ తర్వాత ఇదిగో ఈ రాయితో నీ కాలిని నువ్వే పొడుచుకున్నావ్. నీ పిరికితనంతో మా పరువు తీస్తున్నావ్ రా అన్నయ్యా..’ అంటూ రాయి చూపించింది. అందరూ నన్నే నిందిస్తున్నట్టు అనిపించి తట్టుకోలేకపోయాను. అందుకే ‘నేను ఈరోజు డాన్స్ చేయకపోతే మీ వదిన వేరేవాడితో డాన్స్ చేస్తా అందిరా!’ అన్నాను. ‘అవునా.. ఆ అందగాడి పోలికలు కూడా చెప్పి ఉంటుందే!’ ‘అవును.. నీకేలా తెలుసు?’ ఆశ్చర్యపోయాన్నేను. ‘వాడు నాక్కూడా రెండేళ్ళ నుండి తెలుసు. రా చూపిస్తాను ఆ అందగాడిని!’ అంటూ సోని నన్ను మెల్లిగా వాకిట్లోకి తీసుకెళ్ళింది. వాకిలి మొత్తం రంగురంగుల లైట్లతో మెరిసిపోతుంటే.. డీజే పాటలకు బంధువులు అందరూ ఊగిపోతున్నారు. నా కళ్ళు మాత్రం నా శారు కోసం ఆత్రంగా వెతికాయి. నరాలు తెగే ఉత్కంఠలాగా అనిపించింది. అందరి మొహాలకు పసుపు ఉండడంతో శారుని అంతమంది మధ్యలో గుర్తుపట్టలేక పోయాను. ఇంతలో ‘అదిగో వదిన’ అంటూ సోని గుంపు మధ్యలోకి చేయి చూపించింది. ఆ చేయి వెంబడి చూసిన నాకు.. అదిగో అక్కడ కనిపించింది నా శారు. అందరితో కలిసి నవ్వుతూ.. తన తమ్ముడి పెళ్ళికి ఉత్సాహంగా డాన్స్ చేస్తోంది. కానీ నా దృష్టి తను పట్టుకున్న చేయి వైపు మళ్ళింది. తన కుడి చేతితో ఎవరి చేయినో గట్టిగా పట్టుకుంది శారు. నా హృదయం తట్టుకోలేక పోయింది. కాళ్ళు ఒక్కసారిగా వణికాయి. ‘నేను పిరికివాణ్ణి కాదు’ అని నాకు నేను చెప్పుకుని. ధైర్యం తెచ్చుకుని తలకొద్దిగా పైకిలేపేసరికి అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాను. ‘అదిగో ఆ అబ్బాయే.. వదిన డాన్సింగ్ పార్ట్నర్’ అంది సోని నా రెండేళ్ళ కొడుకుని చూపిస్తూ. అప్రయత్నంగా నా కళ్ళ నుండి నీళ్ళు.. నోటి నుండి ‘శారు’ అన్న మాట బయటకొచ్చింది. వినిపించినదానిలా నా వైపు చూసిన శారు ఓ నవ్వు నవ్వింది. ఆ నవ్వు ‘ఇంత అమాయకుడివైతే ఎలా బాబు’ అని నన్ను ప్రశ్నిస్తున్నట్టనిపించింది. (చదవండి: Neeraj Chopra: బంగారు బాలుడు.. మన నీరజ్ చోప్రా) -
ఆదివారం అసలు సెలవు రోజేనా! అంతకు ముందు ఇది ఉందా?
అప్పట్లో మన దేశములో ఆదివారం సెలవు రోజు కాదు. నెలలో పున్నమి, అమావాస్య రోజుల్లో మాత్రమే సెలవులు ఇచ్చేవారట. ఇదే తరువాత రోజుల్లో సామెతగా మారి -'అమావాస్యకో పున్నమికో' అంటుంటాము కదా? ఇక పోతే నేడు మనం సెలవు దినంగా భావించే ఆదివారము ఆంగ్లేయుల కాలం నుండి మొదలయింది . ఆదివారం మనకి చాలా శక్తిమంతమైన దినం. మనకు ఆ రోజు సూర్యారాధన దినము, చాలామంది అప్పట్లో సూర్యారాధన చేసేవాళ్ళు. భారతీయులు మేధస్సుకు, శక్తికి ఈ ఆదివార దీక్ష కారణం అని తెలుసుకున్న తెల్లవారు బలవంతంగా మనకి ఆదివారం సెలవును పులిమారు. ఇపుడు ఆదివారం అంటే సెలవు రోజు, మందు మాంసాల దినంగా మారింది. కానీ అంతకు ముందు ఆ రోజు మనకు ఓ సుదినం . అప్పటిలో వృత్తి విద్యల్లో ఉన్నవాళ్ళకి సెలవులు అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండేవి కావు. విద్యార్థులకు మాత్రం గురుకులాల్లో పక్షానికి నాలుగు దినాలు అనగా పాడ్యమి, ఆష్టమి, చతుర్దశి, పూర్ణీమ అమావాస్య రోజులు అవిద్య దినాలని విద్య నేర్పే వారు కాదు. మనం వాల్మీకి రామాయణములో అశోకవనంలో ఉన్న సీతమ్మను "ప్రతిపద్ పాఠశిలస్య విద్యేవ తనుతాంగతా" అని వర్ణించాడు మహర్షి . పాడ్యమినాడు పాఠాలు చదివే వాడి చదువులాగ సన్నగా చిక్కిపోయిందట సీతమ్మ. కనుక, పాడ్యమినాడు అయితే చదువుగాని, చింతనం గాని ససేమిరా ఉండేవి కావు. ఇక్కడ చింతన అంటే జరిగిన పాఠాన్ని మరొకరితో పాటు చదువడం, పరిశీలించడం తదితరాలు అని. ఐతే అవ కూడా ఆ పాఢ్యమి రోజు చేసేవారు కాదట. ఆదివారం నాడు విధిగా సూర్యోపాసన చేసేవారు. మనకు ప్రపంచములో ఉన్న ఇతర నాగరికతలో కూడా సూర్యారాధన ఉన్న విషయం తెలిసిందే. మన నుండే ఈ సూర్యారాధన ఇతర దేశాలకు వెళ్ళింది. అప్పట్లో దుకాణాలు కూడా పౌర్ణమి, అమావాస్యలకు మూసేసేవారు. ఆదివారం నాడు నేడు జల్సాలు చేస్తున్నట్టు చేయకూడదని మనకు మన వేదాలలోనే కాదు "స్త్రీ తైల మధు మాంసాని యే త్యజంతి రవేర్దినే నవ్యాధిః శోక దారిద్యం సూర్య లోకం స గచ్ఛతి" అంటూ మన సూర్యాష్టకం లో ఉంది. మానవుడు ఏ రోజున ఆ పనులు చేయకూడదని శాస్త్రాలు వక్కాణించాయో.. ఆరోజే ఆచారించి ఎంజాయ్ చేస్తున్నాం. ఆఖరికి ఆయుర్వేద శాస్త్రంలో కొన్ని వ్యాధులు, రుగ్మతలకు ఆదివారం రోజున కచ్చితంగా మద్యం మాంసం తినొద్దని రోగులకు సూచిస్తారు. వాస్తవానికి ఈ విషయాలు అందరికీ చెప్పడానికి శక్తి సరిపోకపోవచ్చు కనీసం తెలుసుకున్న కొందరైనా ఈవిషయాలను గుర్తించి.. ఆచరించినా చాలు. (చదవండి: మనిషి జీవితం విస్తరాకు.. తిన్నాక మరి ఉంచరు! నిన్ను కూడా అంతే ఏమీ లేకుండానే! -
కరీంనగర్లో ఇడ్లీ వడ.. సిరిసిల్లలో పూరి..పెద్దపల్లిలో దోశ
‘రాజేశ్ కరీంనగర్ నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగం చేస్తుంటాడు. నిత్యం ఉదయం తొమ్మిది గంటలకే విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఇంటి నుంచి ఉదయం ఎనిమిది గంటలకే లంచ్ బాక్స్‌తో సహా వచ్చేస్తాడు. మధ్యాహ్నం వరకు ఆకలికి ఆగడం కష్టమని పాఠశాలకు సమీపంలో ఉన్న ఓ టిఫిన్ సెంటర్లో రోజూ అల్పాహారం చేసి వెళ్తుంటాడు. రాజేశ్ ఒక్కడే కాదు.. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 40 వేలకు పైగా మంది పొద్దున్నే టిఫిన్ సెంటర్లలో కడుపు నింపుకుంటున్నారు’. ‘కరీంనగర్లో నివాసం ఉంటున్న మహేందర్ ఫ్యావిులీతో పొద్దున్నే ఊరెళ్లా్లలి. దూర ప్ర యాణం చేయాల్సి ఉంది. తినేందుకు ఇంట్లో టిఫిన్ తయారు చేయాలంటే ఆలస్యం అవుతుంది. దీంతో ఉదయాన్నే టిఫిన్ సెంటర్‌కు వెళ్లాడు. రెండుమూడు రకాల టిఫిన్లు పార్శిల్ తీసుకున్నాడు. అరగంటలో టిఫిన్ తిని బ స్టాండ్‌కు పిల్లలతో సహా బయల్దేరారు. ఒక్క మహేందరే కాదు.. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా రోజూ పది వేల మందికి పైగా టిఫిన్లు హోటళ్ల నుంచి పార్శిల్స్ తీసుకెళ్తున్నారు.’ జీవనయానంలో ఉరుకులు.. పరుగులు సాధారణమైపోయాయి. సమయంతో పోటీపడుతూ.. అంతా రెడీమేడ్ అన్నట్లు తయారైంది. పొద్దున్నే లేవడం.. రెడీ కావడం.. విధులకు బయల్దేరడం.. దారిలో ఇంత టిఫిన్ చేయడం కాలచక్రంలో భాగమైపోయింది. ఈ క్రమంలో టిఫిన్ సెంటర్లకు ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. టిఫిన్ సెంటర్లకు వెళ్లడం.. నచ్చింది కడుపునిండా తినడం పనులకు వెళ్లడం అలవాటైపోయింది. ఇందులో ఉమ్మడి జిల్లావాసులు భిన్నరుచులు ఇష్టపడుతున్నారు. కరీంనగర్ జిల్లావాసులు ఎక్కువగా ఇడ్లీ–వడ కాంబినేషన్‌ను ఇష్టపడుతుండగా.. రాజన్న సిరిసిల్ల జిల్లావాసులు పూరి ఎక్కువగా తింటున్నారు. ఇక జగిత్యాల.. పెద్దపల్లిలో దోశ అంటే మక్కువని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో పొద్దున్నే ఘుమఘుమలాడే అల్పాహార రుచులు.. జిల్లావాసుల అభిరుచులపై సండే స్పెషల్..!! అడుగుకో టిఫిన్ సెంటర్.. ఇప్పుడు పరిస్థితి కరోనా ముందు.. కరోనా తరువాత అన్నట్లు తయారైంది. కరోనా తరువాత ఆహా ర సంబంధ వ్యాపారాలు ఉమ్మడి జిల్లాలో చాలా బాగా నడుస్తున్నాయని పలువురు చెబుతున్నారు. గతంలో పట్టణాల్లో వాడకో రెండు టిఫిన్ సెంటర్లు ఉండగా.. ఇప్పుడు కనుచూపుమేరలోనే రెండుమూడు దర్శనమిస్తున్నాయి. చిన్నతోపుడు బండి నుంచి మొదలుపెడితే.. పెద్దపెద్ద అద్దాల భవనాలలోనూ టిఫిన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక్కోచోట ఒక్కో ప్రత్యేకమైన టిఫిన్‌ను తయారు చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. టిఫిన్ సెంటర్లను బట్టి రూ.20 నుంచి రూ.70 వరకు ధరలు ఉంటున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో చిన్నాపెద్ద కలిపి 250 వరకు టిఫిన్ సెంటర్లు ఉండగా.. పెద్దపల్లి జిల్లాలో 120, జగిత్యాలలో 180, సిరిసిల్లలో 200కు పైగా ఉన్నట్లు అంచనా. వీటితో పాటు మిల్లెట్ ఇడ్లీలు, మిల్లెట్ దోశలు ప్రస్తుతం పలు టిఫిన్ సెంటర్లలో ప్రత్యేకం. ఉద్యోగులు.. యువతే పొద్దున్నే బయట టిఫిన్ చేసేవాళ్లలో ఎక్కువగా ప్రయివేటు ఉద్యోగులు, యువతే ఉన్నట్లు తెలుస్తోంది. వీరి తరువాత పట్టణాలకు పని నిమిత్తం వచ్చేవారు.. పట్ట ణాల్లో నివాసం ఉండేవారు, కాలేజీ యువత ఆసక్తి చూపుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కమాన్, మంకమ్మతోట, జగిత్యాల రోడ్డు, మంచిర్యాల చౌరస్తా ప్రాంతాల్లోని టిఫిన్ సెంటర్లలో రద్దీ ఎక్కువగా ఉంటు ంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని పాతబస్టాండు ప్రాంతంతోపాటు విమల్ టాకీస్ ఏరియా, మార్కెట్ ఏరియా, వేములవాడలో గుడి పరిసరాల్లో, జగి త్యాలలో మార్కెట్ ఏరియా, బస్టాండు ప్రాంతంలోని టిఫిన్ సెంటర్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. పెద్దపల్లిలో జెండాగద్దె, బస్టాండు, గోదావరిఖని ప్రధాన చౌరస్తా ప్రాంతాల్లోని టిఫిన్ సెంటర్లలో రద్దీగా ఉంటుంది. నైట్ టిఫిన్ సెంటర్లు కరీంనగర్ జిల్లాకేంద్రంతో పాటు మిగితా ప్రాంతాల్లోనూ నైట్ టిఫిన్ సెంటర్లు పోటాపోటీగా వెలుస్తున్నాయి. కమాన్, బస్టాండ్, మార్కెట్ ప్రాంతం, జగిత్యాలరోడ్డులో నైట్ టిఫిన్ సెంటర్ల వద్ద రద్దీ కనిపిస్తుంది. హైవేల వెంట మొబైల్ టిఫిన్ సెంటర్లు నోరూరిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం అందుబాటులో ఉంటున్నాయి. ఇడ్లీవడ ఎక్కువగా.. నేను ఆటో డ్రైవర్‌ను. పొద్దున ఏడు గంటలకే ఇంట్లోంచి బయటికి వెళ్తా. అప్పటికి ఇంట్లో ఏం టిఫిన్ సిద్ధం చేయరు. దీంతో మా అడ్డాకి సమీపంలో కానీ.. అందుబాటులో ఉన్నచోట రోజూ టిఫిన్ చేస్తా. వారంలో మూడు,నాలుగు సార్లు ఇడ్లీవడ కాంబినేషన్ తింటా. అది తింటే త్వరగా జీర్ణమవుతుందని నా అభిప్రాయం. – రాజు, ఆటో డ్రైవర్, కరీంనగర్ ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ము ఖ్యం. ప్రస్తుతం ఏదైనా కల్తీగా మారుతోంది. నేను అడ్వోకేట్ ను. పొద్దున లేస్తే చాలా బిజీగా ఉంటాను. అలా అని అరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయను. ఇదివరకు సాధారణ టిఫిన్లు తినేవాన్ని. ఇప్పుడు పెద్దపల్లిలో మిల్లెట్ టిఫిన్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో నేను ప్రతీరోజు మిల్లెట్ ఇడ్లీ లేకుంటే మిల్లెట్ దోశ తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నా. – వీ.ఎస్.మూర్తి, అడ్వోకేట్, పెద్దపల్లి ఉదయం, సాయంత్రం గిరాకీ కరీంనగర్లో మాది పేరున్న టిఫిన్ సెంటర్. ఉదయం సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం 12 వరకు, మళ్లీ 3గంటల ను ంచి రాత్రి 11 గంటలవరకు గిరాకీ ఉంటుంది. ఉదయం ఊతప్ప, సాయంత్రం దోశ మా టిఫిన్ సెంటర్ ప్రత్యేకం. – ప్రసాద్, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు, కరీంనగర్ 20 ఏళ్ల నుంచి ఈ వ్యాపారమే.. సిరిసిల్లలో 20 ఏళ్ల నుంచి టిఫిన్ సెంటర్ ని ర్వహిస్తున్నా. మా ఫ్యామిలీతో పాటు 20మందికి ఉపాధి కల్పిస్తున్నా. మా హోటల్లో పరోటా ఫేమస్. రోజూ బాగానే గిరాకీ ఉంటుంది. ఇతర ప్రాంతాల వారు కూడా సిరిసిల్లకు వచ్చినప్పుడు ఇక్కడే తింటారు. – శ్రీనివాస్, టిఫిన్‌సెంటర్ యజమాని, సిరిసిల్ల -
చాలా రోజుల తర్వాత ట్యాంక్‌బండ్‌పై సండే– ఫన్డే మొదలు (ఫొటోలు)
-
సరదాగా సండే (ఫొటోలు)
-
సరదాగా.. సండేఫన్డే
కవాడిగూడ: నగర వాసుల ఆహ్లాదం కోసం హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ‘సండే..ఫండే’ సందర్శకులతో హుషారుగా సాగింది. సండే ఫండేను గతంలో ప్రారంభించినప్పటికీ కరోనా నేపథ్యంలో నిలిపి వేశారు. 75 వసంతాల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై సండేఫండేను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్‌ను విద్యుత్ కాంతులు, జాతీయ జెండాలతో అలంకరించారు. నగర వాసులు కుటుంబ సమేతంగా హాజరై సందడి చేశారు. చిన్నారులకు ఇష్టమైన తినుబండారాలను కొనుగోలు చేసి ఆనందంగా గడిపారు. యువత జాతీయ జెండాలతో దేశభక్తి చాటుతూ సెలీ్ఫలు దిగారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సందర్శకులకు ఉచితంగా మొక్కలను పంపిణి చేశారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు మైక్ అనౌన్స్మెంట్ చేస్తూ ఎప్పటికప్పుడు పలు సూచనలు, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మొదటి సండే వర్షం ప్రభావం వల్ల సండేఫండేకు అధిక సందర్శకులు హజరు కాలేకపోయారు. సండేఫండే సందర్శంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై పోలీసులు పూర్తిగా రాకపోకలు నిలిపి వేశారు. (చదవండి: జనాభాను మించి ఆధార్! ) -
ట్యాంక్ బండ్ పై మళ్లీ సన్డే ఫన్డే సంబరాలు (ఫోటోలు)
-
మీదీ ఇదే కథా... ఇంకోసారి గుర్తుచేసుకొని ముసిముసిగా మురిసిపొండి!
సాక్షి, హైదరాబాద్: స్నేహితుల దినోత్సవం అంటే అందరికీ పండగే. చిన్ననాటి స్నేహితులు, టీనేజ్ ఫ్రెండ్షిప్ అన్నీ అలలు అలలుగా మన కళ్లముందు కదులుతాయి. ఈ అనుభూతి ఏ ఒక్కరికో మాత్రమే సొంతం కాదు. కుల,మత, పేద, ధనిక ప్రాంత, లింగ భేదం లేకుండా అందరిలోనూ, అందిరికీ కలిగే మధురమైన అద్భుతమైన అనుభూతి స్నేహం. ఇదీ అని వర్ణించలేం. ఎవరి ప్రత్యేకత వారిదే.. అందరికీ ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు!! Happy friendship day. pic.twitter.com/eotbUSQFdB — Charan (@charan_tweetz) August 7, 2022 మన దేశంలో ప్రతీ ఏడాది ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకోవడం ఆనవాయితీ. ఫ్రెండ్షిప్ డే అనగానే శుభాకాంక్షలు చెప్పుకోవడం, పార్టీలు చేసుకోవడం చాలా కామన్. ఈ సందర్భంగా అనేక హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే , కొటేషన్లు, విషెస్ , వీడియోలు హల్ చల్ చేస్తుంటాయి. ఈ సందర్భంగా అలాంటి ఫన్నీ వీడియోలను చూసి ఎంజాయ్ చేయండి! అభిప్రాయ బేధాలు వచ్చినా.. కొట్టుకున్నా.. తిట్టుకున్నా.. ఎండ్ ఆఫ్ ద డే.. ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్. #HappyFriendshipDay pic.twitter.com/hs3ESASVRO — Harish M (@27stories_) August 7, 2022 A good friend multiplies our happiness and divides our sorrow. Grateful to all the wonderful friends in my life ❤! Happy Friendship Day!#friendsforever #friendshipday #friendshipday2022 #happyfriendshipday❤️ #friends #manjulaghattamaneni pic.twitter.com/wBIPbsbYol — Manjula Ghattamaneni (@ManjulaOfficial) August 7, 2022 Friends fight but don't hurt ........💝 #HappyFriendshipDay #FriendshipDay #FriendshipDay2022 pic.twitter.com/vRYa2UnPuq — Suchitra Das (@Suchitra_Dass) August 7, 2022 #FriendshipDay Friends fight but don't hurt ........💝 #CaseTohBantaHai#HappyFriendshipDay #FriendshipDay2022 pic.twitter.com/Kegrh2RALW — Sanju Singh (@Iamsanjusingh1) August 7, 2022 -
సండే ఫన్ డే.. జల విహార్‌లో వీకెండ్ సందడి
-
సర్వోన్నతునికి.. సమాధి సంకెళ్లు వేయగలదా..?
యేసుక్రీస్తు పుట్టిన నాటి నుండీ మానవాళి చరిత్ర ఆయన చుట్టూనే పరిభ్రమిస్తున్నది. కాలం తనకు ముందు, వెనుక క్రీస్తు నామాన్ని ధరించి సాగుతూ ఉన్నది. భూమిమీద మరణాన్ని జయించి, శత్రువు తలను చితగ్గొట్టి, పునరుత్థానుడై, నలభై దినాలు ఈ నేలమీదే సంచరించి, దేవుని రాజ్య విషయాలను బోధించి, అనేక ప్రమాణాలను చూపిన ఏకైక దైవ మానవుడు, దేవుని అద్వితీయ కుమారుడు యేసు ప్రభువు! యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడైన రాజు అని అర్థం. ఈ ‘రక్షకుడు’ రారాజుగా మానవజాతికి శత్రువైన మృత్యువును జయించి, నరకపాత్రులమైన మనం పోగొట్టుకున్న స్వర్గం అనబడే నిత్యానందలోకంలోకి ప్రవేశాన్ని కల్పించాడు! అందుకే .. ఆ పేర్లు! ఆయన ఆరోహణ కోసం వెళ్ళేముందు యెరూషలేములోని ఒలీవా పర్వతసానువులలో తన శిష్యులను కలసి, వారు చేయవలసిన పనులను వారికి వివరించారు. ‘పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చినప్పుడు మీరు శక్తినొందెదరు గనుక ముందుగా యెరూషలేములోనూ, తర్వాత యూదయ, సమరయ దేశములలో, అనంతరం భూదిగంతాల వరకునూ మీరు నాకు సాక్షులైయుందుర’ని వాళ్లతో చెప్పారు. అందుకే, భూ దిగంతాల వరకూ ఈ సత్య శుభవార్త ప్రకటింపబడుతున్నది! వాళ్లు చూస్తుండగానే ఆయన ఆరోహణమై, వాళ్ల కళ్లకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొని పోయింది. వారంతా ఆకాశము తట్టు తేరి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ‘మీ వద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన యేసు ఏరీతిగా పరమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.’ అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయంలో ఈ వివరాలున్నాయి. క్రీస్తు ప్రభువు మృత్యుంజయుడై.. తాను జీవాధిపతి అని, నశించిన దానిని వెదకి రక్షించి నిత్యజీవం ఇవ్వడానికి వచ్చానని రుజువు పరచి ఇప్పటికి ఈ నేల మీద 2000 సంవత్సరాలకు పైగా అయింది! ఆయనకు ముందు చరిత్ర అంతా ‘క్రీస్తుకు పూర్వం’ అని, తర్వాతి కాలమంతా ‘క్రీస్తు శకం’ అని చరిత్ర నమోదు చేస్తున్నది. చరిత్రలో ప్రముఖులైన ఎందరో క్రీస్తును గురించి తమ అభిప్రాయాలను ప్రకటించారు. ఫ్రెంచ్ అధినేత నెపోలియన్ బోనాపార్టే, ప్రపంచ దేశాల స్థాపకుల గురించి చెప్తూ ‘ఈ భూమి మీద సామ్రాజ్యాలను స్థాపించిన అలెగ్జాండర్, సీజర్ , నేను, చార్ల్ మాన్ .. యేసుక్రీస్తుతో ఏ విధముగానూ సరి పోలము .. మా మధ్య ఏ పోలికా లేదు, ఆయన ‘ప్రేమ’ పునాదిగా స్థాపించిన మహా సామ్రాజ్యం అంతమే లేనిది. ఎప్పటికీ నిలిచి ఉండేది! యేసుక్రీస్తు మానవుడు కాదు, మహోన్నతుడు!’ ‘ప్రేమ, సత్యం, త్యాగం అనే దివ్యమైన సద్గుణాలకు ఉన్నతమైన ప్రమాణాలను సాధించి, జీవించి , చూపించిన యేసుక్రీస్తును నేను ప్రేమించకుండా ఎలా ఉండగలను?’ అన్నారు మన గాంధీజీ. అల్బర్ట్ ఐన్‌స్టీన్ మాటల్లో ‘నేను యూదుడనే, గానీ, ఆ నజరేయుని (క్రీస్తు) ప్రకాశవంతమైన ప్రవాహంలో మునిగి పోయాను. క్రీస్తు ప్రభువు వ్యక్తిత్వాన్ని ఏ కలమూ వర్ణించలేదు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వారెవరైనా యేసు సాన్నిహిత్యాన్ని అనుభవించాల్సిందే!’ స్వామి వివేకానంద చెప్పిన మాటలు కూడా చూద్దాం ‘యేసుక్రీస్తు దైవ కుమారుడు గనుకనే, దైవ జ్ఞానాన్ని తన మాటల్లోనూ, కార్యాల్లోనూ చూపించారు, ప్రకటించారు.’ ఇలా ఎందరెందరో క్రీస్తు ప్రభువును గురించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రభువు చెప్పారు... ‘తండ్రి నన్ను ఎలాగో ప్రేమించెనో, నేను మిమ్మును ఆలాగు ప్రేమించితిని. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకని నొకడు ప్రేమింపవలెను అనుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు.’ సిలువ మీద బలియాగం అయిన యేసు క్రీస్తు మృత్యుంజయుడై 40 దినములు ఈ భూమి మీద సంచరించి, అనేకమందికి దర్శనమిచ్చి, వాళ్లు చేయవలసిన విధివిధానాలను చెప్పి ఒలీవాల కొండ మీద తన శిష్యులతో చెప్పవలసిన మాటలు చెప్పి, దాదాపు 500 మంది యెరూషలేము వాస్తవ్యులు చూస్తూ ఉండగానే మేఘాలలోకి ఆరోహణమయ్యారు. అప్పుడు ఇద్దరు దేవదూతలు అక్కడ నిలబడి ఆ ప్రజలకు చెప్పారు.. ‘యేసుక్రీస్తు ఏ విధంగా పరలోకమునకు మేఘాలపై ఆరోహణమై వెళ్లారో, ఆ విధంగానే ఆయన తిరిగి వస్తార’ని! ఆయన కొరకు నమ్మకంగా జీవించిన వారిని మేఘ వాహనం మీద తీసుకుని వెళ్తారు, తర్వాత ఆయన తీర్పు తీర్చే రోజు ఒకటి ఉన్నది. మృత్యుంజయుడు తీర్పు తీర్చే న్యాయాధిపతిగా రాబోయే ఆ క్షణం కొరకు మనం సిద్ధపడాలి. దేవుడు మనకొరకు ఏర్పాటు చేసిన నిత్య రాజ్యమైన ఆ పరలోకానికి పాత్రులమయ్యేందుకు ఆయన చిత్తానుసారంగా ముందుకు సాగుదాం. ఈ పునరుత్థాన పండుగ మనకిచ్చే సందేశం అదే. అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు! దేవుడు మనందరినీ తన పునరుత్థానశక్తితో దీవించును గాక! – ఝాన్సీ కె. వి. కుమారి -
ప్రతి ఆదివారం ఈ రోడ్లకు సెలవు.. నేటి నుంచే అమలు!
సాక్షి ముంబై: నిత్యం వాహనాల రద్దీతో సతమతమయ్యే పాదచారులకు కొంత ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇకపై ప్రతి ఆదివారం ముంబైలోని 13 రోడ్లపై వాహనాల రాకపోకలను మూసివేసి ఆ రోడ్లకు సెల వు ప్రకటించనున్నారు. మార్చి27 ఆదివారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీంతో నేడు ముంబైలోని 13 రోడ్లను వాహనాలు తిరగకుండా మూసివేయనున్నారు. ప్రతి రోజూ వాహనాల రద్దీ తో సతమతమయ్యే పాదచారులకు కాస్త వెసులుబాటు కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ 13 రోడ్లపై ఉదయం 8 గంటల నుంచి 11 గం టల వరకు వాహనాలను అనుమతించరు. ఈ విషయంపై ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ రాజ్వర్ధన్ సిన్హా మాట్లాడుతూ, రోడ్లను వాహనాల రాకపోకలకు మూసివేసి, కేవలం పాదచారుల కోసం మాత్ర మే తెరిచి ఉంచుతామన్నారు. అదేవిధంగా వాహనాల కోసం ప్రత్యామ్నాయ దారుల్ని కేటాయించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ రోడ్లపై ఆదివారం పిల్లలు ఆటలాడుకోవచ్చని, సీనియర్ సిటిజన్లు వ్యాహ్యాళికి వెళ్ళ వచ్చనీ, సైక్లింగ్, యోగా, వ్యాయామం లాంటివి రోడ్ల మీదనే చేసుకోవచ్చన్నారు. ఇక ఈ నిర్ణయంపై ముంబైకర్ల స్పందనను బట్టి మరిన్ని రోడ్లను ఆదివారం మూసివేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. చదవండి: కనువిందు చేసే ట్రెక్కింగ్.. వణుకుపుట్టించే చరిత్ర కొత్త ప్రతిపాదనేం కాదు... నిర్ధారిత సమయాల్లో ప్రధాన రహదారులని మూసివేసే ప్రక్రియ బొగోటా, కొలంబియా లాంటి దేశాల్లో 1974 నుంచే అమలులో ఉంది. ఇందుకోసం ఆ దేశాల్లో ఉద్యమమే జరిగింది. ప్రజల సౌకర్యంకోసం కొన్ని కిలోమీటర్ల వరకు రోడ్లను వాహనాల కోసం మూసి ఉంచుతారు. ఆ దేశాలను స్ఫూర్తిగా తీసుకుని మన దేశంలో కూడా పలు ప్రాంతాల్లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. నగర ప్రాముఖ్యత కలిగిన రోడ్లను వాహన కాలుష్యం లేకుండా, ప్రజల కోసం తెరిచి ఉంచడం వల్ల పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. వాహనాల కోసం మూసివేసిన ఈ రోడ్లపై నడవడం, స్నేహితులతో కలిసి పిచ్చాపాటి మాట్లాడుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. -
సండే ఫన్ డే.. ’జూ’లో భలే ఎంజాయ్..
-
Omicron Alert: ప్రతి ఆదివారం పూర్తి స్థాయిలో లాక్డౌన్!
Omicron Alert: తమిళనాడు రాష్ట్రంలో కోవిడ్- 19 ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఆదివారం పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు పలుఆంక్షలు విధించినప్పటికీ, పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రతి ఆదివారం పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ఈ మేరకు తెల్పింది. దీంతో రెస్టారెంట్లలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంటాయి. ఐతే టేక్అవే, ఫుడ్ డెలివరీ పద్ధతుల్లో మాత్రమే వాటి కార్యకలాపాలు నిర్వహించుకోవల్సి ఉంటుంది. రద్దీగా ఉండే రహదారులు, మార్కెట్లు, మాల్స్‌తోపాటు ఇతర బహిరంగ ప్రదేశాల్లో జనవరి 9 నుంచి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఐతే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సొంత ఊర్లకు వెళ్లేందుకుగానూ తమిళనాడు ప్రభుత్వం 75% ఆక్యుపెన్సీతో ప్రయాణాలకు అనుమతిచ్చింది. అంతేకాకుండా జనవరి 14 - 18 వరకు రద్దీని నివారించేందుకు అన్ని ప్రార్ధనా స్థలాలను ప్రభుత్వం మూసివేసింది. ఐతే ఆదివారం లాక్డౌన్ సమయాల్లో.. విమానాలతో సహా ఇతర పబ్లిక్ రవాణా సేవలు తప్ప, మిగతా అంతటా పూర్తి స్థాయిలో లాక్‌డైన్ అమల్లో ఉంటుంది. వివాహాలు, వేడుకలకు 100 మందికి మించి పాల్గొనరాదు. 1 నుంచి 9 తరగతుల పాఠశాలల మూత, పరిమిత సీటింగ్ కెపాసిటీతో కోచింగ్ సెంటర్లు, పబ్లిక్ రవాణా సేవలపై పరిమితులు జనవరి 31 వరకు పొడిగింపబడ్డాయి. కాగా ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. రోజు వారి కరోనా కేసుల్లో శనివారం ఒక్కరోజే 23,978 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో 23 వేల మార్కును వరుసగా రెండో రోజు కూడా దాటాయి. గడచిన 24 గంటల్లో 11 మంది మృతి చెందగా, 11 వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,31,007 యాక్టివ్ కేసులున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తాజా కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం తమిళనాడుతోపాటు మరో 7 రాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నట్లు పేర్కొంది. జనవరి 9 నుంచి ఆదివారం లాక్‌డైన్ అమల్లో కొచ్చింది. నేడు రెండో ఆదివారం కావడంతో అక్కడ రోడ్లన్నీ నిర్మానుష్యంగా గోచరిస్తున్నాయి. చదవండి: Omicron Alert: కోవిడ్ బారిన పడుతున్న ఐదేళ్లలోపు చిన్నారులు! 30 కోట్లు దాటిన కేసులు! -
ఈ ఆదివారం ట్యాంక్‌బండ్‌పై సండే– ఫన్డే రద్దు.. కారణమిదే!
సాక్షి, లక్డీకాపూల్ : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో కరోనా ప్రబలే ప్రమాదముందనే సంకేతాలతో చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేసిన వైద్యశాఖ అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ట్యాంక్‌బండ్‌పై ఈ నెల 5న జరిగే సండే– ఫన్డేను రద్దు చేస్తున్నట్లు బుధవారం మున్సిపల్ పరిపాలన ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ప్రకటించారు. చదవండి: నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణం -
ట్యాంక్‌బండ్ వద్ద సండే సందడి
-
" సండే'' సరదాగా.. సందడిగా..
-
అదేంటో.. ఆదివారం వస్తే ముక్కలేనిదే ముద్ద దిగట్లా!
సాక్షి, కోవెలకుంట్ల (కర్నూలు): మాంసంలో ఎముక రుచి..పుంటికూర(గోంగూర)లో పుడక రుచి అన్నారు పెద్దలు.. సామెత సంగతేమోగాని ఆదివారం వచ్చిందంటే కొందరికి ముక్కలేనిదే ముద్ద దిగదు. బంధువులు వచ్చినారనో..చిన్నోడు కలవరిస్తున్నాడనో..ఇంట్లో బాలింత ఉందనో..బలం రావాలనో.. ఏదో సాకు చూపి కూరాకు (మాంసం) తెచ్చుకునే వారు ఎక్కువే. జిల్లా జనాభా 44 లక్షలకు పైగా ఉంటే అందులో 70 శాతం మంది మాంస ప్రియులే. వీరిలో చికెన్ తినేవారు కొద్ది మంది అయితే.. మటన్ లాగించేవారు మరికొంత మంది. ధర ప్రియం అయినా చాలా మంది మటన్ కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ప్రతి ఆదివారం జిల్లాలో 40 టన్నుల వినియోగం ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కిలో రూ.600 నుంచి రూ. 800 లెక్కన రూ.3 కోట్ల మటన్‌ను జిల్లా వాసులు ఆరగించేస్తున్నారు అన్నమాట. జిహ్వకో రుచి.. తలకూర, రాగి సంకటిని ఇష్టపడే వారు కొందరైతే..జొన్న రొట్టె, బోటీ రుచి అమోఘం అనే వారు మరికొందరు. కైమాతో వేపుడు చేసుకొని కమ్మగా లాగించేవారు ఇంకొందరు. ఎవరి రుచులు ఎలా ఉన్నా..దేవనకొండ మండలం ఈదులదేవరబండలో చీకులకు సాటిరావు అనే వారు కూడా ఉన్నారు. ఆదివారం వచ్చిందంటే కోసిగి, గాజులదిన్నె, సుంకేసుల ప్రాంతాల్లోనూ కడ్డీ మాంసం నిప్పులపై వేగుతూ మాంసప్రియులను ఊరిస్తూ ఉంటుంది. ఆదోనిలో అల్పాహారంగా ‘పాయ’ ప్రత్యేకంగా నిలుస్తోంది. కోవెలకుంట్లలో మటన్ విక్రయిస్తున్న దృశ్యం ధర అధికమైనా.. సంపూర్ణ పోషక విలువలు, సంతృప్తికరమైన రుచి రెండూ ఒకేదాంట్లో దొరికే తక్కువ పదార్ధాల్లో ఒకటైన మటన్‌ను మాంసం ప్రియులు ఎంతోగానో ఇష్టపడుతున్నారు. ధర అధికమైనా కొనుగోలు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో కిలో రూ.800 అమ్ముతుండగా పల్లె ప్రాంతాల్లో రూ.600 చొప్పున విక్రయిస్తున్నారు. ఎన్ఆర్సీఎం ధ్రువీకరణ జిల్లాలోని పొట్టేళ్ల మాంసం రుచికరంగా ఉంటుంది. ఈ విషయం శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. జిల్లాలో నెల్లూరు జుడిపి, నెల్లూరు బ్రౌన్ అనే రెండు రకాల పొట్టేళ్లు పెంచుతుంటారు. సారవంతమైన నేలల్లో మొలిచే గడ్డిని మేయడంతో వీటి మాంసం రుచికరంగా ఉంటుంది. ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని జాతీయ మాంసం పరిశోధన కేంద్రం(ఎన్ఆర్సీఎం) ధ్రువీకరించింది. ప్రత్యేక సంతలు.. జిల్లాలో 25.90 లక్షల మేకలు, గొర్రెలు ఉన్నాయి. ఆదోని, డోన్, ఆలూరు, మంత్రాలయం, సంజామల, శిరివెళ్ల, కొలిమిగుండ్ల, రుద్రవరం, చాగలమర్రి, దొర్నిపాడు ప్రాంతాల్లో గొర్రెల పెంపకం దారులు అధికంగా ఉన్నారు. పత్తికొండ, నందికొట్కూరులో సోమవారం, ఆలూరులో బుధవారం, ఆదోని, గూడూరులో శుక్రవారం, కోడుమూరు, కల్లూరులో శనివారం, ఎమ్మిగనూరులో ఆదివారం ప్రత్యేక సంతలు జరుగుతాయి. ఈ సంతల్లో జీవాల క్రయవిక్రయాలు సాగుతున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు నంద్యాల, ఆదోని, బనగానపల్లె, డోన్, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల తదితర పట్టణాల్లో 2,500 మటన్ షాపులు ఉన్నాయి. జిల్లాలో 25.90 లక్షల మేకలు, గొర్రెలు ఉన్నాయి. ఆదోని, డోన్, ఆలూరు, మంత్రాలయం, సంజామల, శిరివెళ్ల, కొలిమిగుండ్ల, రుద్రవరం, చాగలమర్రి, దొర్నిపాడు ప్రాంతాల్లో గొర్రెల పెంపకం దారులు అధికంగా ఉన్నారు. పత్తికొండ, నందికొట్కూరులో సోమవారం, ఆలూరులో బుధవారం, ఆదోని, గూడూరులో శుక్రవారం, కోడుమూరు, కల్లూరులో శనివారం, ఎమ్మిగనూరులో ఆదివారం ప్రత్యేక సంతలు జరుగుతాయి. ఈ సంతల్లో జీవాల క్రయవిక్రయాలు సాగుతున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు నంద్యాల, ఆదోని, బనగానపల్లె, డోన్, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల తదితర పట్టణాల్లో 2,500 మటన్ షాపులు ఉన్నాయి. మటన్ అంటే ఇష్టం చికెన్ కంటే మటన్ అంటేనే ఇష్టం. కార్తీకమాసం, శ్రావణ మాసం తప్ప మిగిలిన అన్ని ఆదివారాల్లో క్రమం తప్పకుండా మటన్ తెచ్చుకుంటాం. ఇందులో ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు ఉంటాయి. తినడానికి రుచికరంగా ఉంటుంది. – నాగభూషణంరెడ్డి, కోవెలకుంట్ల 40 కిలోలు అమ్ముతున్నాం బనగానపల్లె మార్కెట్ నుంచి పొట్టేళ్లు తెచ్చుకుంటాం. ప్రతి ఆదివారం 40 కిలోల మటన్ అమ్ముతున్నాం. రెండు నెలల క్రితం వరకు కిలో 660 రూపాయలకు అమ్మేవాళ్లం. ఇప్పుడు రూ. 600లకు విక్రయిస్తున్నాం. – మద్దిలేటి, మటన్ వ్యాపారి, కోవెలకుంట్ల -
చార్మినార్ వద్ద సండే సందడి
-
ట్యాంక్‌బండ్‌పై సందడిగా " సండే ఫన్డే''
-
ఏక్ షామ్.. చార్మినార్‌కే నామ్.. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
సాక్షి, చార్మినార్: చారిత్రక చార్మినార్ కొత్త శోభను సంతరించుకోనుంది. నేటి సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్యాంక్‌బండ్ తరహాలోనే నో ట్రాఫిక్ జోన్‌గా మారనుంది. సందర్శకులకు మాత్రమే అనుమతించనున్నారు. ‘ఏక్ షామ్.. చార్మినార్‌కే నామ్’ కార్యక్రమానికి ఈ ఆదివారం శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు చార్మినార్ పరిసరాల్లోకి వాహనాల అనుమతించబోమని శనివారం నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ మార్గాలు, సందర్శకుల పార్కింగ్ వివరాలను ఆయన వెల్లడించారు. వాహనచోదకులు, సందర్శకులు సహకరించాలని కొత్వాల్ సూచించారు. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా.. అఫ్జల్‌గంజ్, మదీనా నుంచి వచ్చే వాహనాలను గుల్జార్ హౌస్ నుంచి మేతీ కా షేర్, కాలీకమాన్, ఏతిబజార్ వైపు పంపిస్తారు. ఫలక్‌నుమా, హిమ్మత్‌పురా వైపు నుంచి వచ్చే వాటిని పంచ్‌మొహల్లా నుంచి షా ఫంక్షన్ హాల్, మొఘల్‌పురా ఫైర్ స్టేషన్ రోడ్, బీబీ బజార్ వైపు మళ్లిస్తారు. బీబీ బజార్, మొఘల్‌పురా వాటర్ ట్యాంక్, హఫీజ్ ధన్కా మాస్క్ వైపు నుంచి వచ్చే వాహనాలను సర్దార్ మహల్ నుంచి కోట్ల అలీజా, ఏతీ బజార్ చౌక్ వైపు పంపిస్తారు. ముసాబౌలి, ముర్గీ చౌక్, ఘాన్సీ బజార్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను లాడ్ బజార్, మోతీగల్లీల వద్ద నుంచి ఖిల్వత్ రోడ్లోకి పంపుతారు. పార్కింగ్ ప్రాంతాలివీ.. అఫ్జల్‌గంజ్, నయాపూల్ నుంచి వచ్చే సందర్శకులు తమ వాహనాలను సర్దార్ మహల్‌లోని జీహెచ్ఎంసీ ఆఫీస్ లోపల, కోట్ల అలీజాలోని ముఫీద్ ఉల్ ఆనం బాయ్స్ హై స్కూల్లో పార్క్ చేసుకోవాలి. ముర్గీ చౌక్, శాలిబండ నుంచి వచ్చే సందర్శకులు తమ వాహనాలను మోతీగల్లీ పెన్షన్ ఆఫీస్, ఉర్దూ మస్కాన్ ఆడిటోరియం, ఖిల్వత్ గ్రౌండ్స్, చార్మినార్ సమీపంలోని ఏయూ హాస్పిటల్, చార్మినార్ బస్ టెర్మినల్ ఇన్ గేట్ వద్ద పార్క్ చేసుకోవాలి. మదీనా, పురానాపూల్, గోషామహల్ నుంచి వచ్చే సందర్శకులు తమ వాహనాలను కులీ కుతుబ్ షా స్టేడియం, సిటీ కాలేజ్, ఎంజే బ్రిడ్జి వద్ద పార్క్ చేసుకోవాలి. -
చార్మినార్ చెంతా ‘సండే– ఫన్డే’ సందడి
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికి మణిహారంలా నిలిచిన చార్మినార్‌ను సిటిజన్లకు మరింత చేరువ చేసేందుకు మున్సిపల్ పరిపాలన శాఖ చర్యలు చేపట్టింది. ప్రతీ ఆదివారం ‘సండే– ఫన్డే’లో భాగంగా ట్యాంక్‌బండ్‌పై కుటుంబ సమేతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో విహారానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన తరహాలోనే.. చార్మినార్ పరిసరాలు కూడా సిద్ధమవుతున్నాయి. వాహనాల రణగొణ ధ్వనులు లేని వాతావరణంలో పాదచారులు చార్మినార్ చుట్టూ తిరుగుతూ.. చారిత్రక నిర్మాణాన్ని అమూలాగ్రం పరిశీలించే ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, నగర కొత్వాల్ అంజనీకుమార్‌లతో కలిసి మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. చారిత్రక కట్టడాలపై భవిష్యత్ తరాలకు కళ్లకు కట్టినట్లు వివరించాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన తెలిపారు. ‘ఏక్ షామ్.. చార్మినార్‌కే నామ్’ పేరుతో ఈనెల 17న సాయంత్రం 5 గంటల నుంచి ‘సండే– ఫన్డే’ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ట్విటర్ ద్వారా అర్వింద్‌కుమార్ వెల్లడించారు. సందర్శకుల కోసం లాడ్ బజార్ అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటుందన్నారు. పోలీసు బ్యాండ్ మ్యూజిక్, ముషాయిరాలతో పాటు పిల్లల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మొక్కల ఉచిత పంపిణీ కూడా ఉంటుందని చెప్పారు. చదవండి: 18 నుంచి హైదరాబాద్ మెట్రో సువర్ణ ఆఫర్ -
Sunday Funday: సండే-ఫండే’లో స్టాల్ పెడతారా?
సాక్షి, సిటీబ్యూరో: ట్యాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సండే-ఫండేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఎందరో ఉత్సాహం కనబరుస్తున్నారు. దీంతో సండే-ఫండే సందర్భంగా స్టాళ్లు ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు.. ముఖ్యంగా హస్తకళలు, చేనేత సంబంధిత, ఈటరీస్ తదితర స్టాళ్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా హెచ్ఎండీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. స్టాళ్లలో ఉంచే ఉత్పత్తులు, ధరలతోపాటు సంప్రదించాల్సిన వారి వివరాలు తదితరమైనవి ea2ps-maud @telangana.gov.in మరియు hcip hmda@gmail.com చిరునామాలకు మెయిల్ చేయాల్సిందిగా పేర్కొంది. లేదా హెచ్ఎండీఏ బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ కార్యాలయంలో ప్రతి సోమ, మంగళ వారాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లిఖిత పూర్వక విజ్ఞప్తిని అందజేయవచ్చని సూచించింది. లాటరీ ద్వారా ఎంపిక చేసినవారికి నామమాత్రపు ఫీజుతో రెండు వారాల పాటు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. అందరికీ సమాన అవకాశం కల్పించేందుకు కేటగిరీల వారీగా లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. దీంతోపాటు స్థానిక కళాకారులను ప్రోత్సహించేందుకు సంగీతం తదితర కళారూపాలను ప్రదర్శించాలనుకునే వ్యక్తులు, గ్రూపులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని హెచ్ఎండీఏ పేర్కొంది. -
సండే-ఫన్ డే మళ్లీ షురూ!
-
ట్యాంక్ బండ్‌పై 'సన్డే-ఫన్డే' సందడి ఫొటోలు
-
ట్యాంక్ బండ్‌పై ‘సండే-ఫన్ డే’ మళ్లీ షురూ
-
ట్యాంక్ బండ్‌పై ‘సండే-ఫన్ డే’ మళ్లీ షురూ
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్ బండ్‌పై ‘సండే-ఫన్డే’ సందడి మళ్లీ షురూ కానుంది. గణేష్ విగ్రహ నిమజ్జనం కారణంగా గత వారం నిలిపివేసిన సండే ఫండే కార్యక్రమం ఈ ఆదివారం (సెప్టెంబరు 26) తిరిగి మొదలు కానుంది. ఇప్పటికే ప్రజాదరణ పొందిన ఈ ఈవెంట్ మరింత రంగులమయం అవనుంది. పర్యాటకులను ఆకర్షించేందుకు మరింత ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సోషల్ మీడియాలో పలు విషయాలను షేర్ చేశారు. దీని ప్రకారం సెప్టెంబర్ 26, ఆదివారం సాయంత్రం 5 నుంmr రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్ సందర్శకులకు బాణాసంచా ప్రదర్శనతోపాటు తెలంగాణ సాంప్రదాయ జానపద కళల ప్రదర్శన కనులవిందు కానుంది. ముఖ్యంగా తెలంగాణ పోలీస్ బ్యాండ్, ఉత్తమ తెలుగు పాటలను అందించే ఆర్కెస్ట్రా ఉంటాయి. దీంతోపాటు ఒగ్గు డోలు, గుస్సాడి, బోనాలు కోలాటం వంటి జానపద కళల ప్రదర్శనల భారీ సందడి ఉండనుంది. అంతేకాదు తినుబండారాలు, చేనేత వస్త్రాలు, హస్తకళ స్టాల్లు, ప్రభుత్వం, హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ద్వారా ఉచితంగా మొక్కలు పంపిణీ కూడా ఉంది. కాగా ట్యాంక్ బండ్ సందర్శకుల కోసం పార్కింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా, ట్రాఫిక్ ఆంక్షలను కూడా అమలు చేస్తున్నారు. ఈ సమయంలో కేవలం పర్యాటకులను మాత్రమే అనుమతిస్తారు. వాహనాలకు అనుమతి ఉండదు. అయితే కోవిడ్-19 ప్రోటోకాల్‌ను కచ్చితంగా అమలు చేయాలని పలువురు సూచిస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణలు తెలంగాణా పోలీస్ బ్యాండ్ ఆర్కెస్ట్రా - తెలుగు పాటలు ఒగ్గు డోలు, గుస్సాడి , బోనాలు కోలాటం బాణాసంచా వెలుగులు తినుబండారాలు చేనేత, హస్తకళల ప్రదర్శన ఉచిత మొక్కలు పంపిణీ.. ఇంకా ఎన్నో #TankBund Sunday-Funday is back on sept 26th from 5-10 pm Attractions : 1. TS Police Band 2. Orchestra - Telugu songs 3. Oggu Dolu, Gussadi & Bonalu Kolatam 4. Fireworks 5. Eateries 6. Handlooms & handicraft 7. Free saplings by @HMDA_Gov & many more @KTRTRSghmc pic.twitter.com/ikGfZ9EbsE — Arvind Kumar (@arvindkumar_ias) September 23, 2021 -
మ్యాగజైన్ స్టోరీ 17 September 2021
-
ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు
-
కేరళలో మళ్లీ ఆదివారం లాక్ డౌన్
-
ఇది తెలుసా? పబ్లిక్ హాలిడే అయినా జీతం పడుతుంది
ఒకటో తారీఖున ఆదివారామో, సెలవు రోజో వస్తే వేతన జీవులకు గండమే. సెలవు కావడంతో బ్యాంకులు జీతాలు జమ చేయవు. మరుసటి రోజు వరకు ఎదురు చూడాల్సిందే. అయితే ఇకపై ఈ ఇక్కట్లకు చెల్లు చీటి రాసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సండేలతో పాటు ఇతర పబ్లిక్ హాలిడేస్‌లో కూడా బల్క్ పేమెంట్ చేసేందుకు, ఖాతాదారులు చేసే కీలక చెల్లింపులు స్వీకరించేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఎన్ఏసీహెచ్చ్ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌజ్ (NACH) పథకాన్ని ఆగస్టు 1 నుంచి అమల్లోకి తెచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని ప్రకారం ఇకపై ఆదివారాలు, అధికారిక సెలవు రోజుల్లో కూడా శాలరీస్, డివిడెండ్లు, పెన్షన్లు తదితర చెల్లింపులు జరుగుతాయి. చెల్లింపులకు ఓకే వేతనాలు, పెన్షన్ల చెల్లింపులతో పాటు కరెంటు, గ్యాస్, టెలిఫోన్, వాటర్ బిల్లులు, ఈఎంఐ, ప్రీమియం వంటి చెల్లింపులను బ్యాంకులు తీసుకుంటాయి. వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యవంతమైన సేవలు అందించే ప్రక్రియలో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న మరికొన్ని మార్పులు - భారత తపాల శాఖ ఆధీనంలోని పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇప్పటి వరకు ఉచితంగా అందించిన డోర్ స్టెప్ సర్వీసెస్‌ని నిలిపేసింది. ఇకపై ఇంటి వద్దకు వచ్చి పోస్టల్ బ్యాంక్ సర్వీసెస్ అందిస్తే రూ. 20 ప్లస్ జీఎస్టీని వసూలు చేయనుంది. - పరిమితి మించిన తర్వాత ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఇప్పటి వరకు రూ. 15 సర్వీస్ ఛార్జీగా వసూలు చేస్తుండగా ఇప్పుడా మొత్తాన్ని రూ. 17కి పెంచారు. -
ఉత్తరప్రదేశ్ లో సండే లాక్డౌన్
-
సూర్య భగవానుడికి ప్రీతికరమైన ఆదివార వ్రతం
మాఘమాసంలో ఆదివారం వ్రతం ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ మూర్తి. అతనికి ప్రీతికరమైనది ఆదివార వ్రతము. ఈ వ్రతం ఏ ఆదివారమైన చేయవచ్చు. అయితే మాఘమాసంలో అన్ని ఆది వార లైనా వీలుకాక పోతే ఒక ఆది వారమైనా చేయపచ్చు. సూర్యభగవానుడు ఆనంతమైన కిరణాలు కలవాడు. జగత్తుకు వెలుగు ప్రసాదించేవాడు జ్యోతి స్వరూపుడు. దినరాత్రాలు ఏర్పరిచినవాడు. ఆయురారోగ్యాలు ప్రదాయించేవాడు. శుభాలను కలిగించేవాడు.ముల్లోకాలకు చూడామణి.దినమునకు మణి వంటివాడు. అతని పేరు మీద ఏర్పడిన రోజు ఆదివారం. మాఘమాసంలో ఈ ఆదివార వ్రతం చేయడం శుభప్రదం.ఈ వ్రతం వల్ల అనంతమైన లాభాలు కలుగుతాయి. ఇందుకు సంబంధించిన ఒక పురాణ కథ ఉంది.పూర్వం ఉజ్జయినీ నగరంలో ఒక అవ్వ ఉండేది.ఆమెకు ఎవరూ లేరు. దైవభక్తి పరురాలు. తెల్లవారు ఝామునే లేచి ఆవు పేడతో నీళ్లు జల్లి బియ్యపు పిండితో ముగ్గులు వేసేది. స్నానం చేసి శుచిగా దేవుని పూజించేది. అంతవరకు మంచినీళ్ళు కూడా ముట్టేది కాదు. అవ్వ వద్ద ఆవు లేనందున పొరు గింటివారి నుంచి గోమయం తెచ్చుకునేది. అవ్వ ఏ రోగాలు లేకుండా ఆరోగ్యం గాను సంతోషంగాను ఉండడం చూసి పోరుగామె ఈర్ష్య పడేది. నా ఆవు పేడవల్లనే కదా ఆ అవ్వ ఇల్లు అలుకుతున్నాది.సుఖంగాఉంది నేను పేడ ఇవ్వకపోతే అవ్వకు సుఖసంతోషాలు వుండవు అనుకొని పేడ ఇవ్వలేదు. ఇల్లు అలకని కారణంగా అవ్వ ఆ రోజు తిండి తినలేదు.కాకతాళీయంగా ఆ రోజు మాఘపాదివారం.నీరసంగా దినమంతా పస్తు ఉండి నిద్ర పోలేక పోయింది.రాత్రల్లా ఒకే ఆలోచన.రేపు పేడ దొరక్కపోతే ఉపవాసం ఉండాలి.అనుకుంది.కరుణామయుడైన దేవుడు ఈ చిన్నపాటి కోరిక తీర్చడా అనుకుంది. కోడి కూతతో పక్క మీద నుంచి దిగి వీధి గుమ్మం వద్దకు వచ్చింది.ఆమె ఆనందానికి హద్దులు లేవు.గుమ్మం ముందు ధవళ వర్ణం తో మెరిసి పోతున్న ఆవు అక్కడ ఉంది. అవ్వను చూడగానే పేడ వేసింది.అప్పుడే భాస్కరుడి కిరణాలు నేల మీద పడుతు న్నాయి. గోవుకి దండం పెట్టి గోమయంతో ఇల్లంతా అలికి సంతోషంగా నిత్యకర్మలు పూర్తి చేసింది.ఆవు అక్కడ నుంచి కదల్లేదు తను వండుకున్నదే ఆవుకు ముందు పెట్టి తరువాత తను తింది.రాత్రైనా ఆవు కదల లేదు. దేవుడే తన కిచ్చాడని అనుకోని ఇంట్లో కట్టింది. రోజూ ఆవుకు మేత పెడుతోంది పొరుగింటామె ఈ ఆవు అవ్వకు ఎవరిచ్చా రు. బహుశా దొంగలించిందని కక్షతో గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది.గ్రామాధికారి మనుషులు వచ్చి నువ్వు దొంగవు అని నేరం మోపి అవును తోలుకెళ్ళి పోయారు.ఆ రాత్రి ఆమె దేవుడిని తలచుకుంటేనే గడిపింది. అదే రాత్రి సూర్యభగవానుడు గ్రామాధికారికి కలలో కన్పించి ఆ అవ్వ దొంగ కాదు. ఆవునునేనే ఇచ్చాను. తెల్ల వారక మునుపే ఆవును తిరిగి ఆమె ఇచ్చి పరిహారంగా పది రూక లియ్యిఅన్నాడు. కోడి కూతతో లేచి ఈ రోజు అయినా పోరుగామె పేడ ఇస్తుందా లేదా అన్న శంకతో వీధిలోనికివచ్చింది.గ్రామాధికారి మనిషి ఆవును అవ్వ అప్పగించి "అవ్వా! ఈ ఆవు నీదే. నష్ట పరిహారంగా మా యజమాని పదిరూకలిచ్చాడు తీసుకో " అన్నాడు అది మాఘమాసం.ఆదివారం ఆనాటి నుంచి ఆ గ్రామవాసులు ఆదివారం వ్రతం చేయడం మొదలెట్టారు. అన్ని పూజలు వ్రతాలలాగే మాఘపాదివారం నాడు సూర్యోదయానికి ముందు లేచి తలస్నానం చేసి సూర్య భగవానుడి ప్రతిమనుంచి కలశం పెట్టి సూర్యభాగవానుడి షోడషోపచారపూజ చేయాలి ఇలా మాఘమాసంలో ఆదివారాలు ఈ వ్రతం చేయడం వలన జన్మజన్మల సంచిత పాపం నశించి అనంత పుణ్యం లభిస్తుంది. అంతే కాక రోగ భయాలుండవు.సిరిసంపదలతో ఇల్లు కళకళలాడుతుంది. -గుమ్మా ప్రసాద రావు -
మిస్ కాకండి స్టార్ మాలో ఈ సండేని..
సండే అంటే హాలిడే మాత్రమే కాదు.. ఎంటర్ టైనింగ్ డే అంటోంది స్టార్ మా ఛానల్. విలక్షణమైన వినోదాన్ని అందించడంలో ముందుండి, కొత్త రకం కంటెంట్‌తో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తున్న స్టార్ మా ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు "బిగ్ బాస్ ఉత్సవం" పేరుతో ఒక అద్భుతమైన ఈవెంట్ ని ప్రసారం చేస్తోంది. రెండు కళ్ళూ చాలనంత మంది తీసుకొచ్చి ఒకే వేదికపై నిలబెట్టి, వినోదానికి అసలైన అర్ధం చెబుతోంది స్టార్ మా. స్టార్ మా లో ఇప్పటి వరకు నాలుగు సీజన్లు ప్రసారమై ప్రతి సీజన్ అంతకు ముందు సీజన్ కంటే ఎక్కువ స్థాయి వినోదం అందించిన బిగ్ బాస్‌లో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 లో ప్రేక్షకుల్ని అలరించిన హౌస్ మేట్స్ అందరూ ఈ ఈవెంట్ లో ప్రధాన ఆకర్షణ కాబోతున్నారు. ఇంతమంది సెలెబ్రిటీలు ఒక చోట కలవడం, ఇన్నాళ్లకు మళ్ళీ కలిసిన ఆనందాన్ని షేర్ చేసుకోవడం, ఆటలు పాటలు అన్నీ కలిసి ఫిబ్రవరి 14న సాయంత్రం 6 గంటలకు మరపు రాని సాయంత్రంగా మలచబోతోంది "బిగ్ బాస్ ఉత్సవం”.ప్రతి ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు 3 గంటల పాటు స్టార్ట్ మ్యూజిక్, కామెడీ స్టార్స్ షోలు ఎప్పటిలాగే అలరించబోతున్నాయి. కాబట్టి .. మిస్ కాకండి స్టార్ మాలో ఈ సండేని. -
నారాయణమ్మవ్వా
‘ఆకాశవాణి కడప కేంద్రం... ఇపుడు మీరు వినబోయే పాట లక్ష్మి నివాసం చిత్రం లోనిది... గీత రచన శ్రీ ఆరుద్ర. సంగీతం శ్రీ కె.వీ.మహదేవన్. ధనమేరా అన్నిటికీ మూలమ్... ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం....ధనమేరా అన్నిటికీ......... మూ ల...మ్....l ఎం నారాయణమ్మవ్వా కూడు తిన్యావూ? అబుడే ఆకేసుకొని నిమ్మలంగా రేడియో ఇంటా కూకున్యవ్? బట్టీ కాడికి బోలా? అంటా చేతిలో గిన్నె బట్టుకుని వచ్చింది ఎదురింటి సత్తెమ్మ. ‘ల్యా, తిన్లా, నువ్ ఎందో తెచ్చావ్, నాకు పెడ్తవనీ కాస్కోని అట్టే కూకుని వుండాలేమ్మే’ అంది నారాయణమ్మ ఎగతాళిగా నవ్వుతా! ‘నీకు పెట్టకేం లేవ్వా! రోంత చెనిక్కాయ ఊరిబింమ్డి నూరుకుందెమని నీ రోటికాటికి వచ్చినా లే! అద్దో తుమ్మమాను కింద పొయ్యి మీంద, సట్టిలో సంగటికి పెట్టినా! అయితానె గెలికి యేడేదిగా నీగూఢ్ఖ పెడ్తాలే’ అంది సత్తెమ్మ గూడా నవ్వుతా! ‘పెట్టినంత మాట జెప్పినావు లేమ్మే! సాల్లే! నేను తిన్యా గానీ..నువ్ బోయ్ బెన్నా దినుబో, కుడేళ దాటి పాయ’ అంది నారాయణమ్మ. నారాయణమ్మకు నా అనే వోళ్లు ఎవరూ లేరు. భర్త వెంకటయ్య చాల యేండ్ల కిందటే కాలంజేశాడు. పిల్లలు గూఢ్ఖా లేరు. వున్నీకి మాత్తరం తనకి ముసలాయన కాలంలో కట్టిన రెండు బోధ కొట్టాలు వుండాయి. వొక్క దానికి రెండేమిటికి అనీ...వోటి తను ఉండీ, పక్కనున్న కొట్టం ఇంగోటి కాలేజీలో బుద్దిగా సదువుకునే పిల్లోలకి నూటాభై రూపాయల్కి బాడుక్కిచ్చింది. అరబై సంచ్చరాలు దాటినా నారాయణమ్మ ఆరోగ్గింగా ఉంటుంది. చూన్నీకికెప్పుడూ గుళ్లో దేవతికి మల్లే పశాంతంగా చిర్నవ్వతాంటది. నారాయణమ్మ వారొంలో మూడు దినాలు సున్నం బట్టీ బెడుతుంది. మిగతా దినాలు గంపదీసకపొయ్ పచ్చి సున్నం రాళ్ళు గొట్టిదెచ్చుకోనీకీ బోతాది. ఆదోరం వొక దినం మాత్తరమే ఊల్లో రచ్చబండగాడ సిమెంటు పట్టా పర్సుకొనీ, ఓ పక్క కాల్చిన సున్నం రాళ్ళూ, ఇన్గో పక్కన సున్నం పొడి అమ్ముతా....అట్టా కాలం ఎల్లదీస్తుంది. నారాయణమ్మ కొట్టంకి ఎదురుమల్లే వున్న ముప్పై సెంట్ల స్థలమంతా ఆమెదే కావడంతో తుమ్మ కంప పెరిగి, తొండలు గుడ్లు పెట్టి అట్టా ఉత్తగా పడుండడం ఏంటికిలేనీ, సైకిల్ పై ఊరంతా తిరుగతా పాత ఇనప, పిలాస్టికు డబ్బా రేకులకూ, అంటు మాడికాయలూ, తెల్లవాయలూ అమ్ముకుని బతికే సంచారులకీ, చిక్కెంట్రుకలకి పిన్నీసులూ, బుడగలు అమ్ముతా దిరిగే బీద, బిక్కీ జనెంకి ఊల్లో వున్నెంతకాలం వుండనీకి గుడిసెలేసుకునే దానికి ఆ స్థలమిచ్చింది. అందుకే ఆ జనెమంతా నారాయణమ్మవ్వా అంటా ఆదరంగా జూచ్చారు. నారాయణమ్మ ఇచ్చిన తావులో గుడిసెలు బేసుకున్న సంటిబిల్లల తల్లులు బొద్దున్నే బిడ్డలకి నెత్తికి సమురంటి, కొడుపు నిండుతా పాలిచ్చి, సిలవరి సెరవళ్ళో కట్టెల పొయ్యిపై బాగా మసల్నిచ్చిన ఉడుకునీళ్లతో తానం జేపిచ్చి, అక్కడ గుడిసెల మద్దెన వుండే యాపమాన్లకి చీరలతో ఉయ్యాల గట్టి, పిల్లోలని బండేసి, నిద్ర బోంగానే సైగ్గా తప్పుకుని కూలికి బోయేవాళ్లు. కోట్టం దెగ్గరున్నపుడు నారాయణమ్మ గుఢ్ఖా వాళ్ళని ఒక కంట కాపెట్టుకొనుండేది. అందుకే వాళ్లకి అవ్వంటే ఇంగా గౌర్వం. నారాయణమ్మ ఇంటి చుట్టూత పెద్ద పెద్ద శింత, యాపమాన్లూ దండిగా వుండాయి. తనకీ, ఆ మాన్లకి ఏందో దెలీని అనుబంధం ఉందని బో గట్టి నమ్మకం నారాయణమ్మకి. తాను సూడని అశోకొనంలో సీత కాటిన్నూండీ, తాను ఇష్టంగా వినే ఒసేయ్ రాములమ్మ సినిమాలో...‘రామ చక్కని తల్లి రాములమ్మ పాట’ విన్నెప్పుడూ, కార్ణం(కారణము) ల్యాకున్యా...ఎందుకో మాట్రాని మాన్లే ఆడదాని కట్టాలినే నేచ్చగత్తేలు అనిపిచ్చాది తనకి. అసలు తనని అడిగితే, మాన్లన్నీ ఆడియే అనిపిచ్చాది తనకి. ‘మొక్క మొలిచింది, మాను అయ్యింది, పువ్వు పూచిందీ, పిందే పెట్టింది’.....అంటాం గానీ మొలిచాడు, పూచాడూ అనం గదూ! అని తనలో తానే అనుకుంటా...తన ఆలోచనకి తానే నవ్వుకుంటా ఉంటాది. తన కొట్టం ముందురున్న యాప్మాను కిందున్న నడుములెత్తుండే పెద్ద రోట్లో చుట్టు పక్కల వాళ్లందరూ కారమో, పచ్చడో ఎదో ఒకటి ఉదర,బదరా నూరుకుని టిపిను డబ్బాల్లో బెట్టుకుని కూలికి బోయేటోళ్లూ. కొందరు సనువున్నోల్లయితే అవ్వగ్గుడా రోంత గిన్నెలో దీసి, లోపలకు బోయి గుడిసెలో »ñ ట్టి బొయ్యేటోళ్లూ. ఓ దినం ఎదురు గుడిసెలోండే ముత్తాలు..ఊరిబింమ్డి నూరుకోనికి రోలు కడగి పొడి గుడ్డతో రోటిని దుడస్తా..‘రోట్నీండా యాపాకు చెత్త పడ్తంది గానీ, ఎవులన్నా మొగోళ్లకి జెప్పువ్వా! ఆ పక్క వొంగిన కొమ్మలు రోంత నరకమనీ’ అంది. నూన్లో ఏంచి దెచ్చిన ఎండిమిరబకాయల్తో బాటూ, ఒక్క రవ్వ గళ్ళుప్పునూ రెండు తెల్ల వాయలనుగలిపి, తుడిసిన రోట్లో ఏసి దంచతా! అది వింటానే నారాయణమ్మ ఎం కయ్యాల్లో వుందో ముత్తాలు మీదకు తోక దొక్కిన తాచులా ఇంతెత్తున లేచింది. ‘ఏం మే సూచ్చాంటే నీదేందో బో కథలాగుందే! పోనీలే పాప్మని మీకుండనీకి తావిచ్చే బాగుందే నీ కథ’ అంటా తిట్ల దండకం అందుకునింది. ‘ఆ మానుకేమన్న మనం కూడు పెడతాండామా? నీళ్లు బోచ్చాన్నెమా? ఆ మాను. మీ పిలకాయలకే కదూ మే నీడనిచ్యాందీ...’ ఎండ పొద్దన ‘అబ్బా ఉడకబెడతందవ్వా’ అంటా ఆ మానుకిందే గదూ! మంచం వాల్చుకుని చల్లగా ఆరేసుకుని పొడుకుంటావే’ అని దెప్పిపొడుస్తూ తనే మళ్ళీ ఇలా అంది. ‘అసలు యాప్మానుకి ఎందుకు పూజలు జేచ్చారు మే నాకు దెలీకడగుతా! యామన్నా దేవత దాంట్లో దూరుకుని ఉంటదా ఆ మాన్లో, ఇమ్గ యాడా తావు లేనట్లూ. లేదు మ్మే! అట్టా జెప్తే మీ లాంటోళ్లు నరక్కండా వుంటారని గదూ. మే ముత్తాలూ! నీకు దెలీదా? మాన్లలో ఎన్ని మేలు చేసే లచ్చనాలుండాయనీ. సల్లగాలిచ్చాయి, నీడ నిచ్చాయి. కొట్టాన్కి కావల్సిన కట్టే ఇచ్చాది. ఆఖరిన మన కట్టే కాల్చేందుకు గూడా అదే పనికొచ్చాది గదమ్మే’ అంది కోపంగా. ‘రాలినాకు పక్కకు దోసేసి, రోన్ని నీళ్లు బోసి రోలు కడుక్కోనీకి పెద్ద వగలు బడ్తండావే పిల్లవూ, పని అయిపాతానే అట్ట తిప్పుకుంటా లేచి బోకుంటే ఆ పక్కన పాలీసు బండ పెట్టిన గదా! అది రోటి మీంద మూపెట్టరు గానీ! కొమ్మలు నరకమంటంది పిల్ల’ అంది ఇంగా ఇంగా అట్టే గొనుగతా! ‘అబ్బా ఎదో దభిక్కీన ఒక్క మాట జారి అన్యా లే వ్వా తల్లీ! బొరపాటయింది, ఇమ్గ ఎబ్బుడూ అట్టా అన్నులే గానీ! ఇన్గ నన్ను ఇడిసిబెట్టూ’ అంటా నూరుకున్న ఎండిమిరక్కాయల కారం దబా దబా... గిన్నెకెత్తుకుని అట్టే సక్కా అదే పాయ. నారాయణమ్మంటే అందరికి ఎంత అభిమోనమో, అంతే భయం గూడా! తమకి ఆమే పెద్దదిక్కాయే! అదిగాకా ఎక్కడ ఆ స్థలం ఇడ్సమంటాదో అని! అందుకే ఎవరూ ఎదుర్తిగి మాట్లాడనుగూడ్క మాట్లార్రు. నారాయణమ్మకి తన భర్త వెంకటయ్య తరపునుండీ కొందరు దూరెం వర్సెకి దాయాదులుండారు. ఆమెను దగ్గరికి దీచ్చే ఆ స్థలం అంతా కొట్టేయవచ్చు అని వాళ్ళ పథకం. అది అర్ధమైన నారాయణమ్మ వోళ్ళను దగ్గరకిదీసేది గాదు. ‘మంచిగా ఉంటే నేనే వాళ్ళను సూద్దును గదా!’ అని అనుకుంటుంది. ఆ దాయాదులు రబోవూ కాలంలో ఆ ముప్పై సెంట్ల భూమి ఎంత ఇలువ జేచ్చాదో లెక్కలేచ్చా అంతటి ఆచ్చి చేజారి బోద్దెమోని బో బాధబడేవాళ్లు. అసూయతో ఒక దశలో అసల్కి ఆమె వెంకటయ్య భార్యే గాదు, ఉంపుడుగత్తే అని గూడా తెగించి ప్రచారం జేశారు వాళ్లు. దేనికి బెదర్ని నారాయణమ్మ ‘యా నా కొడకనో రమ్మను, సున్నం బట్టిలో యేసి కాలచ్చ ఒక్కొక్కర్నీ’ అనేది ఆవేశంగా. ‘మేంమంతా నీతో బాటూ వుండంగా అట్ట యేం జరగనీయంలే నారాయణమ్మవ్వా’ అంటూ అందరూ అవ్వకి దైర్నం జెప్పేవాళ్ళు. దుడ్లతోనే పెపంచకమంతా నడుచ్చాందని ఎప్పుడూ బాధ పడతాండేది నారాయణమ్మ. కానీ నారాయణమ్మ మనసులో బాగా ఆలోచించి ఒక గట్టి నిర్ణయం దీసుకుని హాయిగా ఉపిరి పీల్చుకునింది. నీళ్లకిబ్బంది బడకుండా తన స్థలంలో నడిమద్దెన బాయి తవ్వించింది. నారాయణమ్మ మనసులాంటి సచ్చమైన, కొబ్బరి నీళ్ల తీర్ణుండే తియ్యటి నీరు రివ్వున ఊరింది. అదేంశిత్రమో ఏ కాలమైనా సరే బాయిలో సగాన్కి పైగా ఎప్పుడూ నీళ్లతో నిండుగా వుండేది. ‘నారాయణమ్మ బాయి’గా అందరి నోళ్ళలో పిలువబడేది. ‘కొళాయిలొచ్చే ఈ రోజుల్లో బాయేందివ్వా’ అని అన్నోళ్లు గూడా తరువాత ‘బో మంచి పని జేశినవ్ వ్వా’ అని మెచ్చుకున్నేరు. ఒకరోజు పొద్దన్నే...వాతావొరణంలో ఏందో మార్పుందని అందరికి అనిపించబట్టే! అయినా రోజులాగే ఎవ్వరి పనుల హడావిడిలో వాళ్లువుండారు. మేస్త్రీ టాకిటేరు దీసుకుని వచ్చేతలికి తయారుగా వుండాలని ఆడోళ్లు బెరీన వంటలు జేయబట్టిరి. మట్టి పనులకు బోయ్యేటోళ్లూ పారా,తట్టా తీసి బయట పెట్టుకున్యారు. ‘పొద్దన్నే ఏందీ నల్లకుక్క అట్టా ఒకటేమైయంగా ఈడీడే తచ్చాడుతా ఏడుచ్చాంది..దీని ధూమ్దగలా! దాని రద్దుకి నారాయణమ్మ తోలన గూడా బేటీకి రాలే’... యపపుల్లతో మోఖం తోమతా పెళ్ళాన్ని పిలిసి,అవ్వ ఏం జేచ్చాన్దో లోపల్కిబోయ్ జుడమన్యాడు పక్కనుండే రాముడు. రాముడికి ఈ మద్దెనే బిల్డింగ్ పని జేచ్చా మిద్దెపై నుండీ కింద బడీ, రెండు కాళ్లు సచ్చుబడిపోయె! సచ్చి బతికిన రాముడంటే అవ్వకి బో జాలి. రాముడు హాస్పటేల్ నుండీ కోలుకొని ఇంటికి దిరిగి వచ్చేందాకా అంతో, ఇంతో వున్నికాడికి డబ్బిచ్చా సాయంగుండీ, దైర్నం జెప్పేది. కష్టకాలంలో తనను అమ్మలా జూసుకునిందని నారాయణమ్మంటే రాముడికీ ఇన్గ వల్లమాలిన అభిమానం. ఎదురుగుండే చంద్రమ్మ గూడా ‘అవ్ బ్బా! అదేందీ! ఇంత పొద్దయింది నారాయణమ్మ అలికిడి లేదూ..శిత్రంగా ఉండాదే! ఈ యాల్కి ఇన్గ అపుడే బట్టీ కాడికి కూడా బోదు ముసల్ది..పా ఎందో సూజ్జం’ అనుకుంట గుడిసెలోకి బోయి ఇద్దరూ ఆడోళ్ళు గోళ్ళున ఏడస్తా బయటికి వచ్చిరి. వెంటనే ఊళ్లో అందరికీ విషయం దెలిసిపాయ. నారాయణమ్మ నిద్దర్లోనే పాణంబాయ. ‘ఏం సుగం సావు సచ్చే ముసల్ది’ అని అందరూ గోడు,గోడున ఏడ్చబట్టే. అవ్వని తన నులక మంచంలోనే అవ్వకి ఇష్టమైన ‘రామబాణం పూల చెట్టూ, యాప్మానూ’ కలిసిన పెద్ద మాను కింద పడుకోబెట్టిరి. దాయాదులంతా అవ్వ సుట్టూత జేరి వగలేడుపులు ఏడ్చబట్టిరి. ఆ ఏడ్పులేమిటికో అందరికీ దెల్సినా ఏమీ జేయలేక అందరూ గమ్మున సూచ్చాండారు. అంతలో రెండు కార్లు రయ్యిన వచ్చి నారాయణమ్మ గుడిసె ముందు ఆగె. దాంట్లోంటి నల్ల సూటూ, బూటూ వేసుకున్న వొక లాయరూ, కొందరు సారోళ్లు కిందకు దిగిరి. నారాయణమ్మకి పూలదండ యేసి..ఎనుదిరిగి, అక్కడ జనాలనందరిని సూచ్చా... ‘నా పేరు రంగనాథ్...నేను లాయర్నీ.... అవ్వ పక్కన కొట్టంలో ఉండే కాలేజీ అబ్బాయి నాకు ఈ విషయం ఫోన్ చేసి చెప్పడంతో నేను ఇక్కడికి వచ్చాను’ ‘నారాయణమ్మ తన స్థలం దురాక్రమణకు గురి కాకుండా, వీలునామా రాసి, ఆ బాధ్యతను మాకు అప్పగించింది. వీళ్లు శాంతినికేతన్ అనాధ శరణాలయం నుంచీ వచ్చారు’ అంటా తనతో పక్కనే నించుకున్న వోళ్ళని పరిచయం జేసి... ‘నారాయణమ్మ వీలునామాలో ఎం రాసిందో మీకు అందరికీ ఇప్పుడు వినిపిస్తాను’ అంటా. నారాయణమ్మ తన స్థలంలో సగభాగంలో అనాధ పిల్లల కోసం, తన లాంటి ముసలి వాళ్ల కోసం వొక ఆశ్రమం కట్టించమని శాంతి నికేతన్ సంస్థ వాళ్లకు రాసిచ్చింది. మిగతా సగం ..... ఇన్నాళ్లు తనని నమ్ముకుని తనని అవ్వా అంటూ ఆదరించిన వాళ్లందరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదనీ...తాన జాగాలోనే స్థిరంగా వుండాలని తన వీలునామాలో రాసింది’ ఇంకా ..... ‘తన అకౌంట్లో వున్న లక్ష రూపాయలనూ బేల్దారి రాముడికి చిల్లర కొట్టు పెట్టుకోనికి ఆర్ధిక సహాయంగా రాసి ఇచ్చింది’. అని లాయర్ సదవొడం ఆపగానే... అందరూ వొక్కసారిగా ‘నారాయణమ్మ వ్వా’ అంటూ నేలపై పడి, పొర్లి పొర్లి ఏడస్తా ‘మా మింద ఇంత జాలి, పేమ ఉండాయనుకోల, మా తల్లికి’ అని ఏడ్చబట్టిరి. అప్పటి దాక ఆశతో వున్న దాయాదులు ‘తూ....నీ..దీనమ్మా! సచ్చా గూడా సాధించి బోయిందిరా ముసిలిది’ అంటా కోపంగా అక్కడి నుండీ లేశి వెళ్ళిపోయిరి. హోరుమని పెద్ద గాలొకటి వీచడంతో.... చెట్టుపై నుండీ వొక్కసారిగా ‘రామబాణం పూలూ, ఎండిన యాపాకూ కింద ప్రశాంతంగా శాశ్వత నిద్రలోన్న అవ్వపై జల జలా రాలుతున్నెయి తమ చివరి వీడ్కోలుగా! -
ఆదివారం అంతే మరి!
సాక్షి, కొడవలూరు: మండల కేంద్రంలోని పీహెచ్సీ తలుపులు ఆదివారం తెరచుకోలేదు. ఫలితంగా కుక్క కాటుకు గురైన బాలుడితో సహా పలువురు రోగులకు ఇక్కట్లు తప్పలేదు. కొడవలూరు మండల కేంద్రంలో పీహెచ్‌సీకి రోజూ 20 నుంచి 30 మంది రోగులు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకెళ్తుంటారు. ఏదైనా అత్యవసరమైనా ప్రాథమిక చికిత్సకు ఇక్కడకే వస్తారు. నిబంధనల ప్రకారం ఆదివారం కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సిబ్బంది విధులు నిర్వహించాలి. అయితే ఈ నిబంధనలు ఇక్కడ అమలు కావడంలేదు. తెరచుకోని పీహెచ్సీ ఆదివారం కూడా పీహెచ్సీలో మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక స్టాఫ్‌నర్స్, ఫార్మాసిస్ట్, ఆయాలు విధిగా ఉండాలి. ఆస్పతికి వచ్చే రోగులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఇవ్వాలి. ఆదివారం పీహెచ్‌సీకి సిబ్బంది రాకపోవడంతో పూర్తిగా మూత పడింది. ఫలితంగా అనేక మంది ఇబ్బంది పడ్డారు. పద్మనాభసత్రానికి చెందిన మూడేళ్ల బాలుడు రామలింగం మహేష్‌ను ఆదివారం కుక్క కరవడంతో వైద్యంకోసం తండ్రి సురేష్ ఉదయం 11 గంటలకు పీహెచ్‌సీకి వచ్చారు. పీహెచ్సీ తలుపులు తెరచుకోకపోవడంతోపాటు సమాధానం చెప్పేందుకు కూడా ఎవరూ లేరు. దీంతో నార్త్‌రాజుపాళెంలోని ప్రైవ్రేట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. పాము కాటైనా పరిస్ధితి ఇంతేనా అంటూ బాలుడి తండ్రి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పలువురు వృద్ధులు పీహెచ్‌సీకి వచ్చి ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఎమ్మెల్యే హెచ్చరించినా.. విడవలూరు మండలం ఊటుకూరులో ఇటీవల బోరు బావిలో బాలుడు పడిపోగా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి దగ్గరుండి బాలుడ్ని వెలికి తీయించి రామతీర్థం వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు లేకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడిని కోవూరు ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. అప్పటికే బాలుడి పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అయినప్పటికీ వైద్య సిబ్బందిలో ఎలాంటి మార్పు రాలేదు. -
ఎంజాయ్ ఏమాయె!
రాయదుర్గం: ఆదివారం వచ్చిందంటే చాలు.. చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేసే రోజులు నగర శివారులో పూర్తిగా కరువయ్యాయి. ఆదివారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు రోడ్డంతా ఆటాపాటలతో సందడి చేసేవారు. వారమంతా పడ్డ కష్టాన్ని మరిచి ఎంజాయ్ చేసేవారు. ఆదివారం వచ్చిందంటే కొన్నాళ్లు రాహ్‌గిరి కార్యక్రమం, ఆ తర్వాత ఫిజికల్ లిటరసీ కార్యక్రమంతో నడిరోడ్డంతా నాలుగు గంటలపాటు సందడిగా ఉండేది. మొదట్లో వంద మంది వస్తే గగనమే అనుకుంటే ఆ తర్వాత వేల సంఖ్యకు చేరుకోవడంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ప్రస్తుతం వీటి సందడి లేకుండా ఆదివారం రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఒకప్పటి రాహ్‌గిరి, ఫిజికల్ లిటరసీ డే వంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇక కలగా మారుతాయా? అని పలువురు చర్చించుకుంటున్నారు. తీరిక లేకుండా నిత్యం బిజీబిజీగా గడిపే వారికి వీకెండ్లో మళ్లీ నడిరోడ్డుపై ఆటాపాటలతో కూడిన సందడి అవసరమని అభిప్రాయపడుతున్నారు. అనంతరం ‘ఫిజికల్ లిటరసీ డే’.. రాహ్గిరిని అంతా మరిచిపోతున్న వేళ ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ చొరవతో కొంతమంది ఔత్సాహికుల తోడ్పాటుతో ఫిజికల్ లిటరసీ డేను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఐటీ కారిడార్‌కు వెళ్లే రోడ్డులోని పుల్లెల గోపీచంద్ అకాడమీ రోడ్డులో షురూ చేశారు. 19 వారాలపాటు ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమం రోడ్డు విస్తరణ కోసం నిలిపివేయాల్సి వచ్చింది. అనంతరం ఈ కార్యక్రమాన్ని జీఎంసీ బాలయోగి స్టేడియం ఎదుటకు మార్చారు. ఇక్కడ కొన్ని వారాల పాటు సాగినా వర్షాలు కురుస్తుండడంతో నిలిపివేశారు. ఆ తర్వాత ఇక ఇలాంటి కార్యక్రమాల కొనసాగింపు సందేహాస్పదంగా మారాయి. ఇప్పటికైనా నిర్వాహకులు పునరాలోచన చేసి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉదయం వేళల్లో నిర్వహించేలా చూడాలని సిటీజనులు కోరుతున్నారు. ప్రభుత్వం ఏం చేయాలి ♦ ఆదివారం ఆటాపాటలతో అంతా సంతోషంగా గడిపేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ♦ శాశ్వత వేదికను ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలి ♦ ఆటాపాటల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి ♦ నిర్వహణకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి ♦ శాశ్వత వేదికలో పాఠశాల విద్యార్థులకు శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి ♦ నిర్వహణ కోసం ప్రత్యేక నియామకాలు చేపట్టాలి ♦ స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారినిప్రోత్సహించాలి మొదట్లో ‘రాహ్‌గిరి’ షురూ.. సైబరాబాద్ పోలీసులు, పలు ఐటీ సంస్థల ప్రతినిధులు, ఇతర ఔత్సాహికుల కలయికతో రాహ్‌గిరి కార్యక్రమం నగరంలో మొదటిసారిగా మొదలైంది. గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ పార్కు నుంచి మైండ్‌స్పేస్ వరకున్న ఎడమవైపు రోడ్డుపై ఆదివారం రోజు ఉదయం పూట పూర్తిగా ఆటాపాటలతో ఎంజాయ్ చేసేవారు. ఆటలతో పాటు పలు పోటీలలో పాల్గొనేవారు. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, యోగా, మెడిటేషన్, కబడ్డీ, గల్లీ క్రికెట్, బ్యాడ్మింటన్, పెయింటింగ్‌లు వేస్తూ సరదాగా గడిపేవారు. 68 వారాల పాటు సాగిన రాహ్‌గిరి.. రోడ్డు విస్తరణ చేపట్టాల్సి రావడంతో నిలిపివేశారు. సర్కారే సమకూర్చాలి.. సండే సందడి మళ్లీ మొదలు కావాలంటే ఒక శాశ్వత వేదిక, నిర్వహణకు అవసరమైన నిధులు ప్రభుత్వమే సమకూర్చాలి. వ్యక్తుల సమూహం ఇలాంటి లాంగ్‌టర్మ్ కార్యక్రమాలు నిర్వహించా లంటే సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వం చొరవ చూపి స్థలం కేటాయించి నిధులు మంజూరు చేసి ఔత్సాహికులతో కమిటీ వేసి నిర్వహణ బాధ్యత అప్పగిస్తే విజయవంతం కావడం ఖాయం. – విశాలరెడ్డి, రాహ్‌గిరి వ్యవస్థాపకురాలు, ఐడెంట్ సిటీ మానవ సంబంధాలు మెరుగు.. ప్రస్తుత యాంత్రిక జీవనంలో అందరూ బిజీబిజీగా గడిపేస్తున్న తరుణంలో రాహగిరి, ఫిజికల్ లిటరసీ డే కార్యక్రమాల నిర్వహణతో మానవ సంబంధాలు, పరిచయాలు పెరుగుతాయి. ప్రతి వ్యక్తిలో ఉల్లాసం, ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఇలాంటి వాటి నిర్వహణ చాలా అవసరం. ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే శాశ్వత ప్రాతిపదికన నిర్వహణ సాధ్యం. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలి.– టి.రామస్వామియాదవ్, కన్వీనర్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ -
జగ్గంపేటలో ఆదివారం వైఎస్ఆర్సీపీ కీలక సమావేశం
-
తొలిరోజు టెట్ ప్రశాంతం
సాక్షి, విశాఖపట్నం : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం నుంచి ఈ నెల 19 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షకు నగరంలో 11 కేంద్రాలను (షీలానగర్, చినముషిడివాడ, పెదగంట్యాడ, శొంఠ్యాం, కొమ్మాది, బక్కన్నపాలెం, గుడిలోవ, పీఎంపాలెం, గంభీరం, ఏవీఎన్ కాలేజీల్లో) ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం సెషన్లో 1990 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 1922 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో 2840 మందికి 2742 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఇలా ఉదయం పరీక్షకు 68 మంది, మధ్యాహ్నం పరీక్షకు 98 మంది వెరసి 166 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందుగా అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలన్న అధికారులు నిబంధన విధించారు. అందుకనుగుణంగానే ఆయా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించలేదు. పెందుర్తి: టీచర్స్ ఎలిజిబిలిటి టెస్ట్(టెట్) పెందుర్తి సమీపంలోని చినముషిడివాడలోని ఇయాన్ డిజిటల్ జోన్–1, జోన్–2 కేంద్రంగా ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. అభ్యర్థులు పరీక్షకు దాదాపు గంట ముందుగానే కేంద్రానికి చేరుకున్నారు. పలువురు అభ్యర్థులు ఆఖరి నిమిషాల్లో కేంద్రానికి రావడంతో ఆత్రుతగా పరుగులు తీశారు. ఆయా కేంద్రాల్లో ఈ నెల 19 వరకు జోన్–1లో 6,750 మంది, జోన్–2లో 17,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్కిరెడ్డిపాలెం(గాజువాక): షీలానగర్ ఆయాన్ సెంటర్లో టెట్ ఆదివారం మధ్నాహ్నం జరిగింది. ఈ పరీక్షకు 600 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. అనకాపల్లి అలకండి గ్రామానికి చెందిన అంధ విద్యార్థి కర్రి స్వాతి టెట్ పరీక్షకు హాజరయ్యారు. -
హైదరాబాద్‌కు ప్రతి ఆదివారం ప్రత్యేక రైలు
పశ్చిమగోదావరి, నరసాపురం : ఇటు జిల్లాలోని డెల్టా, అటు తూర్పుగోదావరి జిల్లా రాజోలు, అమలాపురం, అంతర్వేది చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి ఉపయోగపడే విధంగా నరసాపురం నుంచి హైదరాబాద్‌కు ప్రతి ఆదివారం ప్రత్యేక రైలును ప్రవేశపెట్టారు. ఈ నెల 6వ తేదీ నుంచి ఈ రైలు ప్రారంభమవుతుంది. వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందుగా మే, జూన్ నెలల్లో ఈ రైలును నడపనున్నారు. తరువాత కూడా అదే తరహాలో రద్దీ ఉంటే ఈ సర్వీస్‌ను శాశ్వతంగా కొనసాగిస్తారని నరసాపురం రైల్వేస్టేషన్ మాస్టర్ మధుబాబు తెలిపారు. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు ఈ రైలు హైదరాబాద్ చేరుకుంటుంది. 4 జనరల్ బోగీలతో కలిపి మొత్తం 18 కోచ్‌లు ఉంటాయి. రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉందని స్టేషన్ మాస్టర్ చెప్పారు. ప్రస్తుతం నరసాపురం నుంచి గుంటూరు మీదుగా రాత్రి పూట నరసాపూర్ ఎక్స్‌ప్రెస్, పగటిపూట నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్ నడుస్తున్నాయి. నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఉండి, ఆకివీడు ప్రాంతాల వారు, అటు తూర్పుగోదావరి జిల్లా నుంచి రాజోలు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇవే రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో రెండు నెలలు ముందుగా బుక్ చేసుకున్నా కూడా ఈ రైళ్లలో రిజర్వేషన్ దొరకని పరిస్థితి. పండుగలు, సెలవులు సమయాల్లో అయితే చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఈ నేపథ్యంలో వీకెండ్లో నడపబోతున్న ఈ ప్రత్యేక రైలు ప్రయాణికులకు ఎక్కువగా ఉపయోగపడనుంది. -
మండిన సండే
సాక్షి, హైదరాబాద్ : సూర్యుడు నిప్పులు కురిపించాడు. ఈ ఎండాకాలంలో ఇప్పటివరకు అధిక ఉష్ణోగ్రతలు ఆదివారం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి వెల్లడించారు. ఆదిలాబాద్, నిజామాబాద్‌లో అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. హైదరాబాద్‌లోనూ ఈ సీజన్లో మొదటి సారిగా అధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయిందని పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని, వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. వడదెబ్బతో ఆరుగురి మృతి సాక్షి నెట్వర్క్: వడదెబ్బతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆరుగురు మృతిచెందారు. ఇందులో ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ముగ్గురు మృతి చెందారు. పెద్దఅడిశర్లపల్లి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన మల్లెబోయిన వెంకటయ్య (45) ఆత్మకూర్–ఎస్ మండలం పాత సూర్యాపేటకు చెందిన బైరు యల్లమ్మ (80), అనంతగిరి మండలం లకారం గ్రామానికి చెందిన కూరపాటి మాణిక్యమ్మ (100) వడ గాలుల కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరు ఇళ్ల వద్దనే చికిత్స పొందుతూ ఆదివారం మృత్యువాతపడ్డారు. అలాగే నిజామాబాద్ జిల్లా నవీపేట మండలకేంద్రంలోని సుభాష్‌నగర్ కాలనీకి చెందిన గాండ్ల రుక్మాబాయి(70), కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన కొర్రి ఆశన్న(60), మహబూబాబాద్ జిల్లా కురవి మండలకేంద్రానికి చెందిన రామడుగు వెంకటాచారి(55)అనే వడ్రంగి వడదెబ్బతో మృతిచెందారు. -
ఆదివారం.. భాగ్యనగరంలో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్ : గత రెండు రోజుల నుంచి వరుణుడు హైదారాబాద్‌ను విడవడం లేదు. శుక్రవారం ఈదురు గాలులతో బీభత్సం సృష్టించిన వర్షం ఆదివారం కూడా భాగ్యనగర వాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. తెల్లవారుజామున మూడు గంటల నుంచి వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. ఇబ్రహీంపట్నంలో భారీ వర్షం కురిసింది. వర్షం దెబ్బకు నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో సిటీవాసులు నిరాశకు గురవుతున్నారు. వారంతం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతాకుతలం అవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో వీటి కారణంగా వందలాది ఎకరాల పంట నీట మునిగిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విజయనగరంలో జిల్లాలో ఈదురుగాలుల ధాటికి పూరి గుడిసెలు, రేకుల షెడ్డులు ఎగిరిపడ్డాయి. -
రెండు గ్రామాల్లో ఉద్రిక్తత
♦ ఆదివారం చికెన్షాపు తెరవడంతో మరోమారు గొడవ ♦ దాడిలో ఇద్దరికి గాయాలు సాక్షి, నారాయణవనం: సత్యవేడు నియోజకవర్గంలోని నారయణవనం మండలం సముదాయం, కీళగరం దళితవాడల మధ్య మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం ఉదయం సముదాయంకు చెందిన దొరస్వామి, అతని అల్లుడు దినకరన్ నారాయణవనంలోని కీళగరం క్రాస్ వద్ద చికెన్ షాపును తెరిచారు. దీంతో కీళగరం దళితవాడకు చెందిన యువకులు షాపును ధ్వంసం చేసి వారిపై దాడికి పాల్పడారు. ఈ దాడుల్లో దినకరన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, నలుగురు డీఎస్పీలతో పాటు 10 మంది సీఐలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, ఏఆర్ పొలీసులు, పుత్తూరు సబ్‌డివిజన్‌లోని అన్ని సర్కిళ్ల పోలీసులు నారాయణవనానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు పుత్తూరులో ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. వైఎస్సార్సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం, మండల పార్టీ మన్వీనర్ సొరకాయలు, ఎంపీపీ సుబ్బరాయశెట్టి, డీసీసీబీ డైరెక్టర్ సాయిరవి ఆదివారం సాయంత్రం పోలీసులతో చర్చించారు. అనంతరం సమస్య పరిష్కారానికి పీఎస్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పుత్తూరు సీఐ సాయినాథ్ ప్రకటించారు. గొడవలకు కారకులైన వారి వివరాలను తెలపాలని సీఐ కోరారు. శాంతి భద్రతల దృష్ట్యా రెండుగ్రామాల్లో పోలీస్ పికెటింగ్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం రెండు గ్రామాల మధ్య జరిగిన దాడిలో ఏడుమంది గాయపడిన సంఘటన తెలిసిందే. అమాయకులపై కేసులు వద్దు మండలంలోని సముదాయం, కీళగరం దళితవాడ వాసుల మధ్య నెలకొన్న ఘర్షణల్లో అమాయకులపై కేసులు పెట్టకుండా పోలీసులు న్యాయం చేయాలని సమన్వయకర్త ఆదిమూలం పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఘర్షణలకు దూరంగా ఉన్న వారిపై కేసులు పెట్టొద్దన్నారు. రెండు గ్రామాల్లో పీఎస్ కమిటీæ ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. -
బీచ్‌లో సందర్శకుల సందడి
మొగల్తూరు:పాఠశాలలకు సెలవులు పూర్తయ్యాయి. సోమవారం నుంచి బడులు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పేరుపాలెం బీచ్‌కు సందర్శకులు పోటెత్తారు. పిల్లాపాపలతో కలిసి వచ్చి కెరటాలపై కేరింతలు కొట్టారు. సాయంత్రం వరకూ సాగర తీరంలో ఆనందంగా గడిపారు. -
ఉపాధ్యాయుల వినూత్న నిరసన
భీమవరం టౌన్:ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లోని అసంబద్దతలను తొలగించాలని కోరుతూ ఫ్యాప్టో, జాక్టోల సంయుక్త ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని ఆదివారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రకాశంచౌక్‌లో ఫ్లకార్డులను ప్రదర్శించి, ప్రభుత్వ ఉత్తర్వులను దహనం చేశారు. ఫ్యాప్టో, జాక్టో నాయకులు మాట్లాడుతూ వెబ్‌కౌన్సెలింగ్ రద్దు చేయాలని, ఉపాధ్యాయులకు ఇచ్చిన పనితీరు పాయింట్లును ఉపసంహరించాలని, హేతబద్ధీకరణ పేరుతో పాఠశాల మూసివేతను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ఉపాధ్యాయ సంఘ నాయకుల అక్రమ అరెస్ట్‌ను ఖండించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపీమూర్తి, జిల్లా కార్యదర్శి సీహెచ్ పట్టాభి రామయ్య, పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.దావీదు, యుటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ పి.సీతారామరాజు, పి.శ్రీనివాసరాజు, ఎన్.భాను మహేష్, జి.సుధాకర్, కె.రవిచంద్రకుమార్, కె.వామనమూర్తి, ఆర్ఆర్ శర్మ, ఐవీఆర్ మోహనరావు, సీహెచ్ ప్రసాదరావు, ఎ.లక్ష్మీ నారాయణ, ఎ.సురేష్‌కుమార్, జి.సూర్యసత్యనారాయణ, ఎస్.మధుసూదనరావు, ఎం.వెంకటేశ్వరరావు, కె.చంద్రరావు పాల్గొన్నారు. -
రేపు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం ప్రారంభం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లా కేంద్రమైన ఏలూరులో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని తెలిపారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఇందుకూరి రామకృష్ణంరాజు ఆదివారం ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారన్నారు. ఏలూరు విజయవిహార్ సెంటర్ నుంచి ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లే సందులో కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
నేడు పెట్రోలు బంక్‌లు పనిచేస్తాయి
-
నేడు పెట్రోలు బంక్‌లు పనిచేస్తాయి
కర్నూలు(రాజ్‌విహార్): జిల్లాలో ఉన్న పెట్రోలు బంకులు పనిచేస్తాయని కర్నూలు జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై ఇస్తున్న కమీషన్ మార్జిన్ తమకు పెంచాలనే డిమాండ్‌తో ఆదివారం బంకుల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి బంద్ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. దీంతో 14వ తేదీన అన్ని బంకులు రోజులాగే పనిచేస్తాయని అసోసియేషన్ ప్రకటించింది. -
ముగిసిన మేరీమాత ఉత్సవాలు
వేగేశ్వరపురం (తాళ్లపూడి): మేరీమాత దర్శనమాత అని పుణ్యక్షేత్ర డైరెక్టర్ జి.డేవిడ్ అన్నారు. వేగేశ్వరపురంలోని నిత్య సహాయ గోదావరి మేరీమాత మహోత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో బిషప్ పొలిమెర జయరావుకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పశువుల పాక, (బాలేసు ప్రభు మందిరం), ఫాతిమా మాత విగ్రహాలను ఆవిష్కరించారు. ఫాదర్ ఐ. మైఖేల్, దగాని జేవియర్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా మేరిమాత ఆలయ ప్రాంగణంలోని గెత్సమనే తోటలో ఏసుప్రభువు విగ్రహం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. విజయవాడ కళాదర్శన్ వారితో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఫాదర్ జె.డేవిడ్ మాట్లాడుతూ మేరీమాత కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా వెలుగొందుతోందన్నారు. ఇతరులకు సాయం చేయడం ద్వారా దేవుడి అనుగ్రహం పొందవచ్చన్నారు. వేగేశ్వరపురంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. -
బాస్కెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక
ఏలూరు రూరల్ : త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక పూర్తయిందని జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేష న్ కార్యదర్శి ఎంఎ న్ శ్రీనివాస్‌కుమార్ అన్నారు. ఆదివారం ఏలూరులోని ఏఎస్ఆర్ స్టేడియంలో జిల్లా బాస్కెట్‌బాల్ బాల బాలికల జట్ల ఎంపిక పోటీలు జరిగాయి. పోటీలకు తాడేపల్లిగూడెం, మార్టేరు, భీమవరం, నరసాపురం తదితర ప్రాంతాల నుంచి సుమారు 80 మంది క్రీడాకారులు వచ్చారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని జిల్లా జట్లకు ఎంపిక చేశారు. త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ జట్టు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తాయని చెప్పారు. అసోసియేష న్ కోశాధికారి కె.మురళీకకృష్ణ, గవ్వా శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
దీపం కనెక్షన్లను సద్వినియోగం చేసుకోవాలి
కొవ్వూరు: దీపం పథకం ద్వారా సబ్సిడీపై అందించే గ్యాస్ కనెక్షన్ లను పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ కోరారు. కొవ్వూరులో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ గణపతి హెచ్‌పీ గ్యాస్ రెండో ఏజెన్సీని ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన కనెక్షన్ లు తీసుకున్న వినియోగదారులకు మంత్రి చేతుల మీదుగా స్టౌవ్‌లు అందజేశారు. పొగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కొవ్వూరు, రాజమహేంద్రవరంలో పైలెట్ ప్రాజెక్టుగా ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేయాలని డీలర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ జొన్నలగడ్డ రాధారాణి, నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, హెచ్‌పీసీఎల్ చీఫ్ రీజనల్ మేనేజర్ కె.చంద్రశేఖర్, డెప్యూటీ మేనేజర్ (సేల్స్) వీవీ రవికుమార్, చాగల్లు ఎంపీపీ కోడూరి రమామణి తదితరులు పాల్గొన్నారు. -
ఆక్వా పార్క్ నిర్మాణం ఆపాలంటూ ధర్నా
భీమవరం టౌన్: తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కు పనులను తక్షణం నిలుపుదల చేసి ఫ్యాక్టరీని మరో చోటుకు తరలించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం భీమవరం ఆనంద గ్రూప్ ఆఫ్ కంపెనీల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మెంటే వారితోటలోని సుందరయ్య భవనం నుంచి మండుటెండలో ప్రదర్శనగా బయల్దేరిన సీపీఎం నాయకులు, కార్యకర్తలు పీపీ రోడ్డు ప్రకాశంచౌక్, బాంబే స్వీటు సెంటర్ మీదుగా జువ్వలపాలెం రోడ్డులో ఉన్న ఆనంద గ్రూప్ ఆఫ్ కంపెనీల కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేశారు. తక్షణమే ఆక్వాఫుడ్ పార్కు పనులు నిలిపివేయాలని జనావాసాల నుంచి ఆ ఫ్యాక్టరీని మరో చోటికి తరలించాలని, గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తి వేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం భీమవరం పట్టణ కార్యదర్శి బీవీ వర్మ, జిల్లా కమిటీ సభ్యుడు గొర్ల రామకృష్ణ మాట్లాడుతూ గత మూడేళ్లుగా ఆక్వాఫుడ్ పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా 40 గ్రామాల ప్రజలు ఉద్యమిస్తున్నా ఫ్యాక్టరీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది పోలీసులను మోహరించి గ్రామీణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. పర్యావరణం, ప్రజారోగ్యం, పంట పొలాలు, భూగర్భ జలాలకు హాని చేసే ఆక్వాఫుడ్ పార్కు ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రేవు రామకృష్ణ, ఎం.వైకుంఠరావు, చెల్లబోయిన వేంకటేశ్వరరావు, అల్లూరి అరుణ్, కె.రంగారావు, పి.మంగరాజు తదితరులు పాల్గొన్నారు. -
పెట్రోలియం డీలర్స్‌కి ఝలకిచ్చిన మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ: త్వరలో ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేయాలన్న నిర్ణయానికి ఆయిల్ మంత్రిత్వ శాఖ నో చెప్పింది. పెట్రోలియం డీలర్స్‌కి నిర్ణయానికి మంత్రిత్వ శాఖ రెడ్ సిగ్నల్ వేసింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పెట్రోల్ పంపు ఆపరేటర్ల అసోసియేషన్ ఆదివారాలు మూసివేయాలని నిర్ణయంపై మంత్రిత్వ శాఖ ప్రతికూలంగా స్పందించింది. ఈ చర్య సాధారణ ప్రజలకు తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తుందని వ్యాఖ్యానించింది. పెట్రోలియమ్ మినహాయింపులు లేదా పెట్రోల్ ఔట్ లెట్ల మూసివేసేందుకు అంగీకరించడం లేదని మంత్రిత్వశాఖ వరుస ట్వీట్లలో పేర్కొంది. ఇది ప్రజల అసౌకర్యానికి దారి తీస్తుందని ట్వీట్ చేసింది. అలాగే ఈ ట్వీట్లను రీ ట్వీట్ చేసిన చమురు శాఖ మంత్రి ధర్మాన్ ప్రధాన్ కూడా ఇదే సందేశాన్నిచ్చారు. మేజర్ డీలర్ అసోసియేషన్లు ఈ నిర్ణయంలో భాగస్వాములు కాదని ట్వీట్ చేశారు. మరోవైపు పబ్లిక్ సెక్టార్ ఆయిల్ సంస్థలకు చెందిన 53,223 పెట్రోల్ పంపుల్లో 80 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న బంకుల యాజమాన్యాలు ఈ ప్రక్రియలో పాల్గొనడం లేదని ప్రకటించాయి. అయితే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటకలోని కొన్ని భాగాలు , బెంగళూకు, మహారాష్ట్ర, ముఖ్యంగా ముంబైలోని కొన్ని ప్రాంతాలు ఆదివారం పెట్రోల్ ఔట్ లెట్లను బంద్‌ను పాటించేందుకు అంగీకరించాయి. కాగా ఎనిమిది రాష్ట్రాల్లో మే 14వతేదీ నుంచి ప్రతి ఆదివారం తమ రిటైల్ అవుట్ లెట్లను మూసివేసేందుకు నిర్ణయించినట్టు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్, భారతీయ పెట్రోలియం డీలర్స్ కన్సార్టియం ఇటీవల ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ "మన్ కి బాత్" కార్యక్రమం సందర్భంగా ఇచ్చిన సేవ్ ఆయిల్ పిలుపుకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించిన సంగతి తెలిసిందే. -
పెళ్లికి నిరాకరించిందని యువతిపై కత్తితో దాడి
-
ప్రాణం తీసిన వెలి
లంకమాలపల్లి (పెరవలి): కులపెద్దలు వెలి వేయడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెరవలి మండలం లంకమాలపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మాతా సంజీవ్ (28)పై 2012లో పశువుల పాక దహనం చేసాడని ఆరోపణ ఉంది. దీనిపై నాలుగేళ్లుగా కుల పెద్దల వద్ద పంచాయితీ జరిగింది. ఈ నేపథ్యంలో ఈనెల 11న సంజీవ్ కుటుం బాన్ని కుల పెద్దలు వెలి వేశారు. వీరితో ఎవరూ మాట్లాడకూడదని, సహాయం చేయకూడదని తీర్పు చెప్పారు. అయితే ఈనెల 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా గ్రామంలో జరిగిన వేడుకల్లో సంజీవ్ డ్యాన్సులు వేశాడు. దీనిని చూసిన కుల పెద్దలు సంజీవ్‌ను రానివ్వద్దని హుకుం జారీ చేశారు. దీంతో సంజీవ్ కన్నీటి పర్యంతమయ్యాడు. అవమాన భారం భరించలేక రోజుపాటు ఇంటి నుం చి బయటకు రాలేదు. ఎవరితో మాట్లాడకుండా ఉండలేనని, ఈ బతుకు తనకు వద్దని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కుటుంబ సభ్యుల వద్ద ఆదివారం ఉదయం బోరున విలపించాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం 4 గంటల సమయంలో కుటుంబసభ్యులు తలుపులు బద్దలు కొట్టి సంజీవ్‌ను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెరవలి ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల ను విచారించారు. ‘కులపెద్దలే చంపేశారు’ తన తమ్ముడిని కులపెద్దలే పొట్టన పెట్టుకున్నారని మృతుని అన్న రాజీవ్ కన్నీరుమున్నీరుగా విలపించారు. అంబేడ్కర్ జయంతి వేడుకల్లో తన తమ్ముడు పా ల్గొంటే కుల పెద్ద బీరా చంద్రయ్య తీవ్రంగా అవమానపర్చాడని ఎస్సై నాగరాజుకు ఫిర్యాదు చేశాడు. మిన్నంటిన రోదనలు ‘నాన్నా లే నాన్నా’ అంటూ మృతుని కుమారుడు, కుమార్తె బోరున విలపిం చారు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతు ని భార్య అనూష ఉపాధి కోసం కువైట్‌లో ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగరాజు చెప్పారు. -
యువతిపై కత్తితో దాడి
పశివేదల (కొవ్వూరు రూరల్): పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో యువతిపై ఓ వ్యక్తి పాశవికంగా దాడి చేశాడు. అడ్డుకోవడానికి వెళ్లిన తల్లిదండ్రులు, స్థానికులపై కూడా దాడికి దిగడంతో అతడికి దేహశుద్ధి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కొవ్వూరు మండలం పశివేదలకు చెందిన మావూరి సూరిబాబుకు నలుగురు కుమార్తెలు. వీరిలో ఆఖరి కుమార్తె సరస్వతి రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. రోజూ విధులకు రాజమండ్రి వెళ్లి వస్తుండగా మూడేళ్ల నుంచి కార్ డ్రైవింగ్ స్కూల్ నడుపుతున్న చాగల్లు మండలం గౌరిపలి్లకి చెందిన వరసాల రవిప్రకాష్ ఆమెను పెళ్లి చేసుకోమని వేధించ సాగాడు. వేధింపులు ఎక్కువ కావడంతో గతేడాది డిసెంబర్ 15న ఆమె కొవ్వూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రవిప్రకాష్‌ను మందలించి వదిలివేశారు. అయినా వేధింపులు మానలేదు. ఆదివారం ఈస్టర్ సందర్భంగా చర్చికి వెళుతున్న సరస్వపై ఆమె ఇంటి సమీపంలోనే రవిప్రకాష్ దాడికి పాల్పడ్డాడు. సరస్వతి కేకలు వేయడంతో ఆమె తల్లిదండ్రులతో పాటు స్థానిక యువకులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారిపై కూడా దాడికి దిగాడు. వారంతా కలిసి రవిప్రకాష్‌కు దేహశుద్ధి చేశారు. బాధితురాలు సరస్వతి కొవ్వూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు హెడ్ కానిస్టేబుల్ ఏకే సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రేపటి నుంచి భీమవరంలో జాతీయస్థాయి నాటిక పోటీలు
భీమవరం : కళారంజని నాటక అకాడమీ ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో ఆదివారం నుంచి జాతీయస్థాయి తెలుగు నాటిక పోటీలు నిర్వహించనున్నట్టు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు జవ్వాది దాశరథి శ్రీనివాసరావ్, ప్రధాన కార్యదర్శి పోశింశెట్టి మురళీ శుక్రవారం విలేకరులకు తెలిపారు. స్థానిక పీఎస్ఎం గరల్స్ హైసూ్కల్లోని మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్లోని యిర్రింకి గంగారామ్ కళాప్రాంగణంలో ఆదివారం రాత్రి 6.30 గంటలకు ప్రారంభ సభకు ఎంపీ తోట సీతా రామలక్ష్మి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు), మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తదితరులు హాజరుకానున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా నటుడు, దర్శక, రచయిత ఎంఎస్ చౌదరి, నటుడు, దర్శకుడు, రచయిత లింగం సత్యనారాయణ, నృత్య కళాకారిణి జవ్వాది యామిని నర్సాంబికను సత్కరించనున్నట్టు తెలిపారు. మూడు రోజులు పాటు నిర్వహించే ఈ నాటిక పోటీల్లో 16న కేజేఆర్ కల్చరల్ అసోసియేషన్(సికింద్రాబాద్) వారి ‘మళ్లీమొదలు పెట్టకండి’. జేఆర్కే థియేటర్స్(పెనుమలూరు) వారి ‘యథాప్రజా’ నాటికలు ప్రదర్శిస్తారు. 17న గ్రామీణ కళాకారుల ఐక్యవేదిక(వెనిగండ్ల) వారి ‘మధురస్వప్నం’, నాటకశాల(విజయనగరం) వారి ‘పండుగొచి్చంది’, అభ్యుదయ ఆర్ట్స్(విజయవాడ) వారి ‘ఉయ్యాల’, 18న డీఎల్ కాంతారావు సోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్(తెనాలి) వారి ‘దిష్టి బొమ్మలు’, శ్రీకృష్ణ తెలుగు థియేటర్స్ (న్యూఢిల్లీ) వారి ‘ఇంకెంత దూరం’ నాటికల ప్రదర్శన ఉంటుంది. 18 రాత్రి విజేతలకు బహుమతి ప్రదానం ఉంటుందన్నారు. అలాగే రంగస్థల, సినీ నటుడు, దర్శకుడు పులఖండం నాగేశ్వరరావుకు దివంగత జవ్వాది సూర్యారావు స్మారక పురస్కారం అందించి సత్కరించనున్నట్టు చెప్పారు. -
సహనం.. మన జీవన మార్గం
నిడదవోలు : తన కోపమే తన శత్రువు.. ఏ కార్యమైన శాంతి, సహనంతోనే జయించవచ్చని ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. నిడదవోలు మండలంలోని ఉనకరమిల్లిలో సీతారామ మందిరం వద్ద శ్రీరామనవమి వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆయన ఆధ్యాత్మిక ప్రవచనం చెప్పారు. సుమారు గంటపాటు రామాయణంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు, రా ముడు, సీత అన్యోన్యత, భక్తిమార్గాలను ప్రబోధించేలా ఆయన ప్రసంగం ఆసాం తం ఆకట్టుకుంది. ఓర్పు, సహనం జీవన మార్గం కావాలని, వీటిని ప్రతి ఒక్కరూ అలవర్చుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని చెప్పారు. సీతామాత శాంతి, సహనం మార్గాలతో విజయం సాధించిందన్నారు. ఆలయాలకు వెళ్లి పూజలు చేసినంత మాత్రం ఫలితం సిద్ధించదని, మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా చేసిన పూజ సంపూర్ణంగా ఫలితాని్నస్తుందని చెప్పారు. సీతామాతను మహిళలంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చాగంటి ప్రవచనానికి అధిక సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చారు. -
సీపీఎస్ రద్దుకు జాతీయ స్థాయిలో పోరాటం
భీమవరం టౌన్:కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దుకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఐక్య వేదికలను నిర్మించి పోరాటాన్ని ఉధృతం చేస్తామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సాబ్జి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటీఎఫ్) కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పి.జయకర్ అధ్యక్షతన ఆదివారం జిల్లా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న షేక్ సాబ్జీ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఉన్న పాత పెన్షన్ సౌకర్యాన్ని 2004 తరువాత ఉద్యోగాల్లో చేరిన వారికి రద్దు చేసి సీపీఎస్ విధానం అమలు చేయడం సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్దమన్నారు. పాత పెన్షన్స్కీమ్ను అందరికీ వర్తింప చేయాలని కోరుతూ ఉపాధ్యాయ, ఉద్యోగ కార్మిక సంఘాలతో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం చర్చించడం తప్ప పరిష్కారానికి ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించాఉ. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన నియమ నిబంధనలు డ్రాఫ్ట్ రూల్స్‌ను విద్యాశాఖ కమిషనర్ విడుదల చేసి గత నెల 8వ తేదిన అన్ని సంఘాలతో చర్చించి అభిప్రాయాలు తీసుకుంటారన్నారు. అయితే ఏకపక్షంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని ఆరోపించారు. ఉపాధ్యాయ సంఘాలు ప్రతిపాదించిన విధంగా బదిలీల్లో లాంగ్ స్టాండింగ్ 8 ఏళ్లు ఉంచాలని, వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్దతిలోనే మాన్యుల్ కౌన్సిల్ నిర్వహించాలని, పాయింట్లు కేటాయించడంలో ఫెర్పార్మెన్స్ విధానాన్ని తొలగించి, పాత పద్దతిలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో సమస్య పరిష్కారం కోరుతూ ఫ్యాఫ్టో, జాక్టో సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదిన టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ బహిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. యుటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపీ మూర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యమనేత సుబ్బరాజు శతజయంతి సభను ఈనెల 11న పోడూరు మండలం జిన్నూరులో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతీ ఒక్కరూ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్.జయప్రభ మాట్లాడుతూ మునిసిపల్ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియంతోపాటు తెలుగు మీడియంలోనూ తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీవీ నర్సింహరావు, జిల్లా నాయకులు సీహెచ్.జగన్మోహనరావు, బి.సుబ్బలక్ష్మి, ఏకేవీ రామభద్రం, ఆర్.రవికుమార్, ఎంఐ విజయ్‌కుమార్, పి.శివప్రసాద్, సుబ్రహ్మణ్యం, పి.శ్రీనివాస్, సువర్ణరాజు, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
డీఎన్నార్ కళాశాలలో మోడల్ ఆన్లైన్ ఎంసెట్ పరీక్ష
భీమవరం:పోటీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు మోడల్ పరీక్షలు ఎంతగానో ఉపకరిస్తాయని భీమవరం డీఎన్నార్ కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకటనర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) అన్నారు. కళాశాలలో ఆదివారం నిర్వహించిన మోడల్ ఆన్లైన్ ఎంసెట్ పరీక్షను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. ఎంసెట్ పరీక్షకు నూతనంగా ఆన్లైన్ విధానం చేపడుతున్నందున దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించుట కోసం తమ కళాశాలలో ఆన్లైన్ ఎంసెట్ నమూనా పరీక్ష ఏర్పాటు చేశారన్నారు. ఈ పరీక్షలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వంద మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షా ఫలితాలను విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా తెలియచేస్తామని ప్రిన్సిపాల్ యు.రంగరాజు చెప్పారు. అలాగే ఈ నెల 14వ తేదిన మరోసారి ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తామని మోడల్ ఎంసెట్ కోఆర్డినేటర్ డీడీడీ సూరిబాబు చెప్పారు. దీనికిగాను ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు.ఈ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందిస్తామన్నారు. -
210 దేశాల్లో సేవలు
తాళ్లపూడి : జిల్లాలోని పేద, మధ్యతరగతి ప్రజలకు డయాలసిస్ సేవలు తణుకులో అందజేయడం జరుగుతుందని లయన్స్‌క్లబ్ గవర్నర్ డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి అన్నారు. లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో వేగేశ్వరపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఆదివారం ఉచిత మెగా వెద్య శిబిరాన్ని నిర్వహించారు. మండల లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు కైగాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరాన్ని లయన్స్‌క్లబ్ గవర్నర్ డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 210 దేశాల్లో లయన్స్‌క్లబ్ సేవలు అందజేస్తున్నారన్నారు. ఈ ఏడాది 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. మనదేశంలో 2.40 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని చెప్పారు. వచ్చే మూడేళ్లలో 20 కోట్ల మందికి సాయం చేయాలనేది లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. తణుకు ప్రభుత్వాసుపత్రిలో మధ్యతరగతి ప్రజలకు కేవలం రూ.800కే డయాలసిస్ సేవలు అందిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన శ్రీరమా దంత వైద్యశాల, కిమ్స్ బొల్లినేని హాస్పటల్, నిడదవోలు శ్రీరాజేశ్వరి లయన్స్ కంటి హాస్పటల్ వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. దంత పరీక్షలు, గుండె వ్యాధులకు ఈసీజీ, ఆర్ధోపెడిక్, న్యూరాలజీ, కిడ్నీ, యూరాలజీ, బీపీ, షుగర్, పక్షవాతం తదితర వ్యాధులకు, కంటి పరీక్షలు చేశారు. ఈ వైద్యశిబిరంలో 700 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి అందరికీ ఉచితంగా మందులను అందజేశారు. 60 మందికి కళ్లజోళ్లు ఉచితంగా అందించారు. 10 మందికి ఆపరేషన్ల కోసం సిఫార్సు చేశారు. మండల లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు కైగాల శ్రీనివాసరావు, చార్టర్ ప్రెసిడెంట్ మారిన రామూర్తి, వల్లభనేని శ్రీనివాస్, కె.రవికుమార్, పాపారావు నాయుడు, గర్రే వెంకటరత్నం, వి.చంద్రయ్య పాల్గొన్నారు. -
ఏప్రిల్ 4న మేధావుల సదస్సు
కొవ్వూరు : ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఏప్రిల్ 4న హైదరాబాద్ ఉస్మానియా యునివర్సిటీలో నిర్వహించే మేధావుల సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెట్టె రాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కొవ్వూరు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాదిగలు, మాదిగల ఉపకులాలకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు అధికశాతం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే కార్ లోన్స్‌పై జీవో నంబర్ 25 అమలుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. లిడ్‌క్యాప్ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. -
చేపల పట్టుబడిపై వివాదం
జంగారెడ్డిగూడెం రూరల్: జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురంలోని చెరువులో అక్రమంగా చేపలు పట్టడంపై ఆదివారం పెద్ద ఎత్తున వివా దం చెలరేగింది. వివరాలిలా ఉన్నాయి.. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు ఆదివారం ఉదయం తిరుమలాపురం గ్రామం లోని తామర చెరువులో వలలు వేసి చేపలు పట్టడం ప్రారంభించారు. చెరువును లీజుకు తీసుకున్న హక్కుదారుడు ఊటకూరి శ్రీనివాస్ వీరిని నిలదీశారు. అక్రమంగా చేపలు పట్టడం సరికాదంటూ సూచించారు. అయితే మరలా మధ్యాహ్న సమయంలో కూడా ఏజెన్సీ ప్రాంత వ్యక్తులు చేపలు పట్టేందుకు ఉపక్రమించగా గ్రామస్తులతో కలిసి శ్రీనివాస్ వారిని ప్రశ్నిం చారు. ఈ నేపథ్యంలో చెలరేగిన వివాదంలో ప్రశ్నించిన వారిపై చేపలు పట్టే వ్యక్తులు దాడికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేపలు పట్టిన మడకం కృష్ణను గ్రామస్తులు అదుపులోకి తీసుకుని నిర్బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఎం.కేశవరావు తెలిపారు. -
ఆకట్టుకున్న కరాటే విన్యాసాలు
నిడదవోలు : పట్టణంలోని కాపు కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన నేషనల్ కరాటే పోటీల్లో భాగంగా క్రీడాకారులు చేసిన పలు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వివిధ ఆయుధాలతో ప్రదర్శన చేశారు. చిన్నపిల్లలు సైతం కరాటే డెమోలు ఇచ్చి అబ్బురపరిచారు. రెండు కుర్చీలపై ఒక వ్యక్తి పడుకుని పొట్టపై ఐస్ ఉంచుకోగా కొందరు సుత్తితో బద్దలు కొట్టిన దృశ్యాలు అలరించాయి. మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ రవీలాల్ వానీ, ఏపీ చీఫ్ ఇ న్స్ట్రక్టర్ జీవీ రమణ. రోటరీ క్లబ్ ఉపాధ్యక్షుడు కారింకి సాయిబాబు, మేరుగుపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఉత్కంఠభరితంగా చదరంగం పోటీలు
భీమవరం : చదరంగంపై ఇటీవల అన్ని వయస్సుల వారిలో ఆసక్తి పెరిగిందని చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తోట భోగయ్య అన్నారు. భీమవరం అనసూయ చెస్ అకాడమీలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి మహిళా చదరంగం పోటీల్లో విజేతలకు జ్ఞాపికలను అందచేసిన అనంతరం ఆయన మాట్లాడారు. చెస్‌తో మేథస్సుకు పదును పెడుతుందన్నారు. ఈనాటి విజేతలు జూన్ నెలలో గుంటూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి మహిళా చందరంగం పోటీల్లో పాల్గొంటారన్నారు. అసోసియేషన్ కార కార్యదర్శి మాదాసు కిషోర్ మాట్లాడుతూ ఈ నెల 28న అండర్ 11 జిల్లాస్థాయి బాలబాలికల చదరంగం పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీల్లో విజేతలు కర్నూలులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. మొదటి నాలుగు స్థానాల్లో గెలుపొందిన గ్రంధి సౌమ్యబాల(కాళ్ల), కెఎల్ రోషిణి(ఏలూరు), కామన దివ్య(భీమవరం, గ్రంధి కావ్య(కాళ్ల)లకు మెడల్స్, సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందచేశారు. ఉపాధ్యక్షుడు వేమిరెడ్డి హరికృష్ణ, అల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎర్రకాలువలో పడి దుర్మరణం
జంగారెడ్డిగూడెం రూరల్: జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కేకేఎం ఎర్రకాలువ జలాశయం డ్యామ్‌పై నుంచి యువకుడు ఎర్రకాలువలో పడి ఆదివారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామానికి చెందిన ఎస్కే బాజీ (20) తన సోదరులు సుభానీ, మదీన్, బావమరిది నజీర్‌తో కలిసి ఆదివారం లక్కవరంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ నుంచి మధ్యాహ్న సమయంలో ఈ నలుగురు కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం వద్దకు చేరుకున్నారు. వీరంతా జలాశయం డ్యామ్‌పైకి ఎక్కారు. ఈ సమయంలో ఒక్కసారిగా నీళ్ల నుంచి శబ్దం రావడంతో జలాశయ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు. డ్యామ్ పైకి ఎక్కిన నలుగురిలో బాజీ కనిపించకపోవడంతో స్థానికులు లక్కవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు జాలర్ల సాయంతో గాలింపు చేపట్టి బాజీ మృతదేహాన్ని వెలికితీశారు. బాజీ ఎర్రకాలువలోకి దూకాడా లేదా ప్రమాదవశాత్తు జారీ పడ్డాడా అన్న అనుమానాలు ఉన్నాయి. బాజీ కాలుజారి పడ్డాడని ముగ్గురు యువకులు చెబుతున్నారు. దీనిపై లక్కవరం ఎస్ఐ శ్రీనివాసరావును వివరణ కోరగా బాజీ ఫో¯ŒS మాట్లాడుకుంటూ ప్రమాదవశాత్తు కాలు జారీ ఎర్రకాలువలోకి పడి మృతి చెందాడని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడు బాజీ తాపీపని చేసుకుంటూ జీవిస్తుంటాడు. మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
తీరంలో సన్డే సందడి..
బాపట్ల..వేసవి సమీపించటం...ఆదివారం కావటంతో సూర్యలంక తీరంలో పర్యాటకుల సంఖ్య పెరిగింది. సముద్ర స్నానాలకు వచ్చేవారితో తీరంలో సందడి నెలకొంది. సూర్యలంక సముద్రతీరం స్నానాలకు అనుకూలమైన ప్రదేశం కావటంతో గుంటూరు , కృష్ణా, హైదరాబాద్ ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. పలువురు పర్యాటకులు ఇక్కడే వంటా వార్పు చేసుకుని బంధుమిత్రులతో భోజనాలు చేసి సరదాగా గడిపారు. అడవి పంచాయతీ అధికారులు పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. -
టీడీపీ నేతలపై ఎమ్మెల్యే రాచమల్లు ధ్వజం
ప్రొద్దుటూరు క్రైం: ‘మీరు అసమర్థులు కాబట్టే నేను జలదీక్ష చేయాల్సి వచ్చింది.. మీలో సమర్థత లోపించడంతోనే నేను పాదయాత్రకు పూనుకున్నాను’ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి టీడీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. స్థానిక మున్సిపల్ పార్కులో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మట్లాడారు. నీటి కష్టాలను తొలగించుటకు తాము చేస్తున్న ప్రయత్నాన్ని చూసి పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి మాట్లాడిన తీరు ‘అమ్మా పెట్టనూ పెట్టదు, అడుక్కొని తిననీయదు’ అనే సామెత చందంగా ఉందన్నారు. గండికోట జలాశయం నుంచి మైలవరానికి ఒక టీఎంసీ నీటిని విడుదల చేసి, అక్కడి నుంచి పెన్నా నదికి పంపించాలనే డిమాండ్‌తో దీక్ష చేస్తే.. ప్రజలతో సంబంధం కలిగిన వ్యక్తిగా మల్లేల లింగారెడ్డి తమ దీక్షకు మద్దతు పలకాల్సింది పోయి అసూయతో ఛీప్ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కలెక్టర్‌ను కలిసి నీరు విడుదల చేయించామని ఇక్కడి నాయకులు అంటున్నారని, ఆ నీటిని ప్రజలకు ఇవ్వకుండా ఏం చేశారని ప్రశ్నించారు. సమావేశంలో మున్సిపల్ వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి, ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మండల కన్వీనర్ దేవిప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యూపీలో తప్పని అసంతృప్తి రాజకీయాలు
-
అనంతపల్లిలో ‘హైటెన్షన్’
అనంతపల్లి (నల్లజర్ల) : నల్లజర్ల మండలంలోని అనంతపల్లి జంక్షన్లో ఆది వారం మధ్యాహ్నం లారీ రహదారి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభంపై ఉన్న 11 కేవీ, హైటెన్షన్ లైన్ (హెచ్‌టీ) కలిసిపోవడంతో తీగల నుంచి మంటలు చెలరేగాయి. సమీపంలోని వల్లాల నాగబాబుకు చెందిన కిరాణా దుకాణం, ఇల్లు, చందూరి రామకృష్ణ, అడపా దుర్గారావు, కొండమూరి నాగేశ్వరావు ఇళ్లు, గిరి రామారావుకు చెందిన హోటల్, మీసేవ కేంద్రం పక్కనున్న జ్యూస్ దుకాణంలో సర్వీస్ వైర్లతో పాటు విద్యుత్ మీటర్లు, వైరిం గ్, బోర్డులు మాడిపోయాయి. రిఫ్రిజిరేటర్లు, టీవీలు, ఫ్యాన్లు, గీజర్లు, గ్రైం డర్లు కాలిపోయాయి. ఓ ఇంటి బయట నిలుచుకున్న అడపా ధనలక్షి్మకి, ఆమె చంకలోని షణ్ముఖప్రియకు గాయాలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల నుం చి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సాయంత్రం 6 గంటల సమయంలో విద్యుత్ సిబ్బంది సరఫరాను పునరుద్ధరించారు. ఈ ప్రమాదంతో సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్టు సమాచారం. -
సీపీఎస్ రద్దుకు ఉద్యమం
భీమవరం టౌన్ : భీమవరం కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ హాల్లో ఆదివారం పీ ఆర్టీయూ ఆధ్వర్యంలో కాంట్రిబ్యూ టరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్ ), వేతన వ్యవస్థ, ఉపాధ్యాయ సమస్యలపై జిల్లాస్థాయి విద్యా సదస్సు నిర్వహించారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మత్తి కమలాకరరావు, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరాజు, ఉత్తరాంధ్ర ఉపాధ్యా య ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయు డు మాట్లాడుతూ సీపీఎస్ విధానం రద్దుకు పెద్దెత్తున ఉద్యమం చేపడతామని చెప్పారు. ఈ విధానంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దృష్టికి తీసుకువెళ్లామని, ముఖ్యమంత్రితో ఈ అం శంపై చర్చించామన్నారు. న్యాయం జరగని పక్షంలో సీపీఎస్ రద్దయ్యే వరకూ పోరాటం సాగిద్దామని పిలుపునిచ్చా రు. పీఆర్టీయూ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఆర్.కేశీయమ్మ తదితరులు మాట్లాడుతూ సీపీఎస్ రద్దుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పీఆర్టీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు ఏవీ కాంతారావు, జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ వీరవల్లి వెంకటేశ్రరావు, ఎన్నార్పీ అగ్రహారం హెచ్ఎం ఎంవీ సత్యనారాయణ మాట్లాడారు. ఒకే ఉద్యోగం.. ఒకే పెన్షన్ కావాలి కాంట్రీబ్యుటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీని వాసులనాయుడు డిమాండ్ చేశారు. పీఆర్టీయూ భీమవరం డివిజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విద్యా సదస్సులో పాల్గొనేందుకు వచ్చి న ఆయన విలేకరులతో మాట్లాడారు. సీపీఎస్‌తో 2004 తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారు పదవీ విరమణ అనంతరం రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి రద్దుకు డిమాండ్ చేశామన్నారు. సీపీఎస్‌ను తక్షణం రద్దు చేసి ఒకే ఉద్యోగం, ఒకే పెన్షన్ పథకం అమలు చేయాలని పోరాడుతూనే ఉం టామన్నారు. ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు పోరాట ఫలితంగా త్వరలోనే ఉత్తర్వులు వస్తాయని ఆశాభావం వ్య క్తం చేశారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్‌తో కాంట్రాక్ట్ అధ్యాపకులకు నష్టం లేదని, ఉపాధ్యాయులకు పదోన్నతులు లభి స్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రా క్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు. రూ.398 వేతనంతో పనిచేసిన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మత్తి కమలాకరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరాజు, జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు మాట్లాడు తూ సీపీఎస్ రద్దు కోరుతూ జిల్లా వ్యా ప్తంగా ఆందోళనలకు కార్యాచరణ రూ పొందిస్తామని చెప్పారు. -
జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలు
భీమవరం: క్లబ్లంటే కేవలం ప్లేయింగ్ కార్డ్స్ ఆడుకునే ప్రదేశమనే అపోహ ప్రజల్లో ఉందని అయితే భీమవరం కాస్మో పాటిలిన్ క్లబ్లో నిర్వహిస్తున్న క్రీడలు, సామాజిక సేవాకార్యక్రమాలు అలాంటి అపోహలు తొలగిస్తున్నాయని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) నండూరి సాంబశివరావు అన్నారు. భీమవరం కాస్మోక్లబ్ ఆధ్వర్యంలో కాస్మోపాలిటన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం అల్లూరి రవితేజ మెమోరియల్ నేషనల్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భీమవరం క్లబ్‌లలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. ప్రముఖులను కలుసుకుని సరికొత్త ఆలోచనలు పంచుకోడానికి, సేద తీరడానికి క్లబ్‌లు వేదికగా ఉపయోగపడతాయన్నారు. భీమవరం పట్టణానికి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు రావడానికి ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాలే కారణమని సాంబశివరావు పేర్కొన్నారు. ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ భీమవరం లాంటి చిన్న పట్టణంలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) మాట్లాడుతూ కాస్మోక్లబ్లో నిర్వహిస్తున్న పలు ప్రజాహిత కార్యక్రమాలు ఆదర్శనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్పీ భాస్కర్ భూషన్, క్లబ్ గౌరవాధ్యక్షుడు యు.కృష్ణప్రసాద్, అల్లూరి పద్మనాభరాజు, కార్యదర్శి తటవర్తి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. సాంబశివరావుకు సత్కారం డీజీపీ సాంబశివరావును గజమాల, దుశ్శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. అనంతరం టెన్నిస్ కోర్టులో క్రీడాకారులను పరిచయం చేసుకున్న సాంబశివరావు బెలూన్లు వదిలి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాస్మోక్లబ్ వేదికపై ఉద్దరాజు ధర్మరాజు, అల్లూరి రవితేజ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హోరాహోరీగా క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు భీమవరం: భీమవరం కాస్మోక్లబ్ ఆధ్వర్యంలో కాస్మో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న అల్లూరి రవితేజ మెమోరియల్ నేషనల్ ర్యాకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు ఆదివారం హోరాహోరీగా సాగాయి. మహిళల ఫైనల్ రౌండ్లో సారా యాదవ్ (మధ్యప్రదేశ్), సృష్టిదాస్ (మహారాష్ట్ర)పై 6–4, 6–4 స్కోరుతో విజయం సాధించగా, అద్రిజా బిస్వాస్ (వెస్ ్టబెంగాల్) ప్రగతి ప్రసాద్ (కర్నాటక)పై 6–0, 6–1, ఆనంద్ అల్మాస్ (ఒడిశా) ఎస్.ప్రవీణ (తమిళనాడు)పై 6–2, 6–4, ఆర్.ప్రియాంక (మధ్యప్రదేశ్) గొట్టిపాటి శ్రీలక్ష్మి (కర్నాటక)పై 6–0, 6–2, అక్షయ సురేష్ (తమిళనాడు) రేష్న గణపతి (తమిళనాడు)పై 6–2, 6–0, అవిష్క గుప్త (జార్ఖండ్), ఎన్.పూర్వారెడ్డి (తెలంగాణ)పై 6–0, 6–2, తటవర్తి శ్రేయ (ఏపీ) ఎస్.సమీరపై 6–0, 6–0, షేక్ హుమేరా (తెలంగాణ) రెహానా తస్కీన్ (తెలంగాణ)పై 6–0, 6–0 తేడాతో విజయం సాధించారు. పురుషుల విభాగం ఫైనల్ రౌండ్లో పి.జయేష్ (మహారాష్ట్ర), ఎస్.దుర్గ (తెలంగాణ)పై 7–5, 6–4 తేడాతో విజయం సాధించగా, షేక్ ఓస్మా (ఏపీ) రాజేంద్రప్రసాద్రాయ్ (ఉత్తరప్రసాద్)పై 6–4, 6–1 తేడాతో, త్యేజో ఓజెస్ (తమిళనాడు) అంకం కృష్ణతేజ (తెలంగాణ)పై 4–6, 7–5, 6–4 తేడాతో, చిలకలపూడి తరుణ్ (ఏపీ) ఓజెస్ రాతే (హరియాణ)పై 6–2, 6–0 తేడాతో, చిన్మయ్ ప్రధా¯ŒS (ఒడిశా) యాష్వర్దన్(హరియాణ)పై 6–4, 6–2 తేడాతో, గంటా సాయికార్తీక్ (తెలంగాణ) ఒమిందర్ బాయ్సోయా (హరియాణ)పై 6–3, 6–4 తేడాతో, ఇషాన్ హుస్సేన్ (తమిళనాడు) అజయ్ పృథ్వీ (తెలంగాణ)పై 6–4, 7–5 తేడాతో విజయం సాధించారు. -
వాసవీ మాత.. ఆరాధ్య దేవత
పెనుగొండ (ఆచంట): జైæ వాసవీ.. జై జై వాసవాంబాయనమః స్మరణలు మార్మోగాయి. ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా ఆదివారం కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా పెనుగొండకు తరలివచ్చారు. మూలవిరాట్ నగరేశ్వర మహిషాసురమర్దనీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆత్మార్పణ దినం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టువస్రా్తలు సమర్పించి వెండి పల్లకిపై గ్రామోత్సవం నిర్వహించారు. బజారు రామాలయం నుంచి వాసవీ దీక్షధారులు, 102 కలశాలతో మహిళలు, వాసవీ భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ ఆలయానికి చేరుకున్నారు. దీక్షల విరమణ వాసవీ దీక్షధారులు పెనుగొండ వాసవీ ఆలయంలో, వాసవీ ధాంలో దీక్షలు విరమించారు. మాలధారులు అధికంగా కర్నాటక, కోయంబత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల నుంచి వచ్చారు. వేద పండితులు రామడుగుల నర్సింహమూ ర్తి ఆధ్వర్యంలో సుమారు 815 మంది దీక్షధారులు 102 హోమకుండ కృతువులో పాల్గొని దీక్షలు విరమించారు. ఆలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోయంబత్తూరు భక్తులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. వాసవీ యువజన సంఘం ఆధ్వర్యంలో దీక్ష విరమణ హోమాలు నిర్వహించారు. ఈవో కె.శ్రీనివాస్, ప్రత్యేకాధికారి కుడుపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దేవాదాయశాఖకు చెందిన 15 మంది ఈవోలు, మేనేజర్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ రమణమూర్తి, గ్రంధి రాము, నూలి ప్రభాకరరా వు, యువజన సంఘ నాయకులు పచ్చిపులుసు శంకర్, ఉద్దగిరి శ్రీధర్(దత్తు) తదితరులు పాల్గొన్నారు. అమ్మను కొలిస్తే మోక్షం వాసవీమాతను భక్తిశ్రద్ధలతో కొలిస్తే మోక్షం లభిస్తుందని వాసవీ పెనుగొండ పీఠాధిపతి స్వామీ కృష్ణానందపురి స్వామీజీ అన్నారు. వాసవీ ధాంలో భక్తులనుద్దేశించి మాట్లాడారు. ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజు, ట్రస్ట్ సభ్యులు కేఆర్ కృష్ణ, అశ్వత్ నారాయణ, పిప్పళ్ల వెంకటేశ్వరరావు, స్థానిక ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. -
రెంటికీ చెడ్డ రేవడి
(లక్కింశెట్టి శ్రీనివాసరావు) ఆయనొకప్పుడు జిల్లాలో ఇప్పుడున్న అధికార పార్టీని తన చెప్పు చేతల్లో పెట్టుకున్న నాయకుడు. తెరవెనక మంత్రాంగం నడపడంలో దిట్ట. ఆర్థికంగా స్థితిమంతుడు, పార్టీ అధినేత నుంచి దండిగా భరోసా ఉన్న నాయకుడాయన. ఆయన ఏమి చెబితే అది చేసే అధినేత. ఆయన మాటకు తిరుగులేకుండాపోయేది. అటు మెట్ట, ఇటు కోనసీమలో దాదాపు పార్టీ నేతలు వ్యూహ, ప్రతివ్యూహాలు ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. అటువంటి నాయకుడు పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి సామెత మాదిరిగా తయారైంది. రాజకీయాల్లో మూడు దశాబ్థాల చరిత్ర కలిగిన ఆ నాయకుడు రాజకీయాల్లో ‘బొడ్డు’ఊడని నేతల ముందు నిలవలేకపోతున్నారు. రచ్చ గెలిచి ఇంట గెలవలేక... ఎక్కడైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ ఆ నాయకుడు రచ్చ గెలిచి (పరోక్ష పద్ధతిలో ఎన్నికయ్యారు) ఇంట గెలవలేక నానా పాట్లుపడుతున్నారు. అలాగని రచ్చ గెలిచిన చోటైనా పార్టీలో తన మాట చెల్లుబాటవుతుందా అంటే అదీ లేదు. అతనేమైనా ప్రతిపక్ష పార్టీలో ఉన్నారా అంటే అదీ లేదు. తాను ఉన్న పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్ష పాత్ర పోషించే పరిస్థితి ఏర్పడింది.గల్లీ స్థాయి రాజకీయ నాయకుడైనా పార్టీ అధికారంలో ఉంటే అతని మాటకు తిరుగే ఉండదు. అటువంటిది పార్టీ అధికారంలో ఉంది. రాజకీయంగా మూడు దశాబ్దాల అనభవం ఉంది. పోనీ ఆర్థికంగా ఏమైనా సామాన్యుడా అంటే జిల్లాలో టాప్10లో ఒకరిగా ఉన్నారు. ఇన్ని ఉన్నా అతని మాట అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో వినే నాథుడే లేకుండా పోయాడు. పింఛను కూడా ఇప్పించుకోలేని దీనస్థితి... సొంత నియోజకవర్గం ఒకటి. ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఒకటి. ఈ రెండు నియోజకవర్గాలను తన గుప్పెట్లో పెట్టుకుని పార్టీ రాజకీయాలను శాసించిన నాయకుడాయన. అటువంటి నాయకుడు అర్హత ఉన్నప్పటికీ కనీసం పింఛను కూడా ఇప్పించుకోలేకపోవడంతో అతనిలో చేవతగ్గిపోయిందా అంటున్నారు ఆయన వెనుకనుండే అనుచరులు. పింఛన్ మాటేమిటి తాను పుట్టిపెరిగిన మండలంలో తన భార్యకు దేవస్థానం చైర్మన్ కూడా ఇప్పించుకోలేకపోయారు. ఆ నాయకుడిని నమ్మి వెంట ఉన్న ఒక మహిళా ప్రజాప్రతినిధికి అవమానం జరిగితే ఏదో తన ప్రయత్నంగా ఆందోళనకు వచ్చారు తప్పించి ఏమీ చేయలేక చేతులేత్తేశారు, ఈ విషయాలన్నిటిపైనా అధినేత ముందు పెట్టి తాడోపేడో తేల్చుకుంటానని గట్టిగానే హెచ్చరించారు. ఈ నాయకుడితో రాజకీయ వైరం ఉన్న నాయకుడు పెద్ద రాజకీయ దురంధరుడు కూడా కాదు. తొలిసారి ప్రజలు పట్టంకట్టగా రెడ్డి రాజ్యాన్ని ఏలుతున్న నేత. తండ్రి ద్వారా సంక్రమించిన రాజకీయ వారసత్వంతో చెలరేగిపోతున్నా సీనియర్ నాయకుడైనా కట్టడి చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నా ఫలితం లేక కారాలు, మిరియాలు నూరుతున్నారు. పార్టీపై కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహాన్ని బయట పెట్టలేని పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ గమనించి వచ్చే ఎన్నికల్లో తనకు రాజకీయంగా అండదండలందించిన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే అనుకుంటున్నారు. కానీ అక్కడేమో స్థానికేతరుడైనా ప్రభుత్వంలో కీలకమైన ప్రజాప్రతినిధిగా ఉన్న కోనసీమ నేత తిష్టవేసే పనిలో ఉన్నారు. ఇటీవలనే ఆయన తిరిగి అక్కడి నుంచే పోటీ చేస్తానని కూడా చెప్పారని ఈ నాయకుడి చెవిన పడింది. అప్పటి నుంచి ఏటూ పాలుపోవడం లేదట. అనుకున్నట్టు అనుకూలించకపోతే ఏ ఊరులో ఎవరినైనా పేరుపెట్టి పిలిచే చనువు, అనుబంధం ఉంటడంతో స్వతంత్ర పోరుకైనా సిద్ధపడాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకు ఇంకా రెండేళ్లు ఆగాలి కదా..అప్పుడు చూద్దాం ఏమి జరుగుతుందో. -
20 వేల ఎకరాలకు కంది విత్తనాల పంపిణీ
పెదనిండ్రకొలను (నిడమర్రు) : జిల్లావ్యాప్తంగా 20 వేల ఎకరాల విస్తీర్ణానికి çసరిపడా కంది విత్తనాలు ఉచితంగా రైతులకు పంపిణీ చేయనున్నట్టు వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వై.సాయిలక్షీశ్వరి అన్నారు. ఆదివారం పెదనిండ్రకొలనులో కంది పంట క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. గ్రామంలో వ్యవసాయశాఖ, ఆత్మ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 100 ఎకరాల చేపల చెరువు గట్లపై సాగు చేసిన కంది పంట దిగుబడిని రైతులకు ప్రదర్శించారు. జిల్లాలో చేపల చెరువుల విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో చెరువు గట్లపై కంది సాగు చేయాలని ఆత్మ చైర్మ¯ŒS పసల గంగరామచంద్రం సూచించారు. చెరువు గట్టుపై కంది పంట యాజమాన్య పద్ధతులను అధికారులు వివరించారు. ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, సర్పంచ్ వంగా సీతాకుమారి, తాడేపల్లిగూడెం ఏఎంసీ చైర్మ¯ŒS పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడలో 8న మారధన్ రన్
-
సక్రమంగా అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : అగ్రిగోల్డ్ సంస్థ మొత్తం ఆస్తులపై సమగ్ర విచారణ జరిపి, వేలం ప్రక్రియను సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేష¯ŒS రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముప్పాళ్లతో పాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజమహేంద్రవరం సిటీ కో–ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మీసాల సత్యనారాయణ మాట్లాడారు. బాధితుల ఆత్మహత్యలు నిరోధించడానికి రూ.1,100 కోట్లు తక్షణం అడ్వాన్సుగా ఇవ్వాలని చెబుతూ, బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు కాపాడాల్సిన ప్రభుత్వం పట్టించుకోకుండా అగ్రిగోల్డ్ యాజమాన్యానికి కొమ్ముకాయడం సమంజసం కాదన్నారు. 99 మందికి పైగా బాధితులు చనిపోయినా పాలకులకు పట్టడం లేదని దుయ్యబట్టారు. బాధితులకు న్యాయం జరగకపోతే ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకూ బస్సుయాత్ర నిర్వహించి, ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తామని పేర్కొన్నారు. ఆస్తులు విక్రయించే అధికారం హైకోర్టు ఇచ్చినందున వేలం ప్రక్రియను వేగవంతం చేసి, వెంటనే చెల్లింపులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా అందరూ బాధితులకు అండగా నిలవాలని కోరారు. సీఐడీ వద్ద ఉన్న అగ్రిగోల్డ్ ఖాతాదారుల వివరాలను తక్షణమే ఆ¯ŒSలై¯ŒSలో పెట్టాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఈ.మాలకొండయ్య, ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు గని, సంఘ రాష్ట్ర కోశాధికారి జి.శేషగిరిరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.శేషుకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తీర్మానాలు ఇవే.. ∙ ఇప్పటి వరకూ ప్రభుత్వం కానీ, సీఐడీ కానీ అటాచ్ చేసిన ఆస్తుల వివరాలు, వాటి విలువలు రికార్డు పూర్వకంగా తెలియజేయాలి. ∙ అన్ని జిల్లాల్లోని వెంచర్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి.. ముందుచెప్పిన విధంగా వాటిని డెవలప్మెంట్ చేసి స్వాధీనపర్చాలి. ∙ అగ్రిగోల్డ్ ఆర్థిక కుంభకోణానికి బలై మరణించిన ఖాతాదారులు, ఏజెంట్ల కుటుంబాలను ఆదుకునేందుకు రూ.10 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలి. -
ప్రముఖ న్యూరో సర్జన్ నాగరాజ కడపకు రాక
కడప కార్పొరేషన్: ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పి. నాగరాజ ఆదివారం కడపకు రానున్నారు. ఈ విషయాన్ని బొల్లినేని డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. కడప నగరంలోని బొల్లినేని డయాగ్నోస్టిక్ సెంటర్లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఆయన అందుబాటులో ఉంటారన్నారు. తిమ్మిరులు, నరాల బలహీనత, కీళ్లవాతము, పక్షవాతము, తలనొప్పులు, తల తిరుగుట, నడుము, మెడనొప్పి వంటి సమస్యలు ఉన్న వారు ఆయనను సంప్రదించి చికిత్స పొందాలని సూచించారు. -
అలరించిన సరిగమ పాటల పోటీ
ఆకివీడు : స్థానిక సరిగమ సంగీత పరిషత్ ఆధ్వర్యంలో గ్రామంలోని లయన్స్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సినిమా పాటల పోటీ ఉర్రూతలూగించింది. పోటీలను వైఎస్సార్ సీపీ మండల యువజన కమిటీ అధ్యక్షుడు అంబటి రమేష్ ప్రారంభించారు. లయన్స్ ప్రతినిధి డాక్టర్ ఎంవీ సూర్యనారాయణరాజు జ్యోతి ప్రజ్వలన చేశారు. పాటల పోటీల అనంతరం కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. మద్రాసుకు చెందిన టేకీ బాలాజీ వయోలి న్ కచేరి రంజింపజేసింది. విజేతలను సంగీత పరిషత్ అ««దl్యక్షుడు సింగవరపు కోటేశ్వరరావు ప్రకటించారు. మొదటి బహుమతిని మంజుశ్రీ(నర్సాపురం), ద్వితీయ బహుమతిని పూర్ణిమ(కాకినాడ), తృతీయ బహుమతిని పావని(చిలకలూరిపేట), 4వ బహుమతిని శృతి (హైదరాబాద్), 5వ బహుమతిని బాలాదిత్య(ఆకివీడు), ఆరో బహుమతిని ప్రియాంక(ఆకివీడు), ఏడో బహుమతిని మాధవి అందుకున్నారు. న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ కొణాడ అశోక్ సత్య, భోగిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. సరిగమ పురస్కారాల అందజేత ఇది ఇలా ఉండగా సంగీత పరిషత్ ఆధ్వర్యంలో సరిగమ పురస్కారాలను సినీనటుడు వి.సాయికిరణ్, పారిశ్రామిక వేత్త కేఏ సూర్యనారాయణ రాజులకు అందజేశారు. సరిగమ కళా సత్కారాన్ని హాస్యనటుడు జబర్దస్త్ అప్పారావు, పులగం చిన్నారాయణ, బాలాజీ టేకే, గాయకుడు చంద్రతేజ, రంగస్థల నటుడు తాళాబత్తుల వెంకటేశ్వరరావు, చించినాడ సత్యకుమార్, ఉపాధ్యాయులు ముదునూరి శివరామరాజు, మెడవంకల రత్నకుమార్‌లు అందుకున్నారు. కార్యక్రమంలో పౌరాణిక దర్శక బ్రహ్మ, నంది అవార్డు గ్రహీత పువ్వాడ ఉదయ భాస్కర్, పరిషత్ అధ్యక్షుడు సింగవరపు కోటేశ్వరరావు, కొల్లి వెంకన్నబాబు, మహ్మద్ మదనీ, డాక్టర్ ఎస్.రామరాజు, గుండా రామకృష్ణ, పోశంశెట్టి మురళీ, జుంగా దాసు, జగ్గురోతు విజయ్, పుప్పాల పండు, మహ్మద్ జక్కీ, కందుల సత్యనారాయణ పాల్గొన్నారు. -
హాలీవుడ్ స్థాయిలో తెలుగు సినిమా
ఆకివీడు : తెలుగు చిత్ర పరిశ్రమ హాలివుడ్ స్థాయికి ఎదిగిందని సినీ, బుల్లితెర నటుడు వి.సాయికిరణ్ అన్నారు. సరిగమ సంగీత పురస్కారాన్ని అందుకునేందుకు ఆకివీడు వచ్చిన ఆయన వైఎస్సార్ సీపీ నాయకుడు అట్లూరి రంగారావు నివాసంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సాంకేతిక రంగంలో తెలుగు సినిమాలు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచస్థాయిలో వెలుగొందుతున్నాయని అన్నారు. నువ్వే కావాలి, ప్రేమించు చిత్రాలు, వెంగమాంబ వంటి సీరియళ్లు తనకు మంచి పేరు తెచ్చిపెట్టాయని అన్నారు. ప్రస్తుతం టీవీ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నానన్నారు. నక్షత్రం, ఏసుక్రీస్తుపై తీస్తున్న తొలికిరణం సినిమాల్లో నటిస్తున్నట్టు చెప్పారు. టీవీ సీరియల్స్‌లో నటించడమే మనస్సుకు తృప్తిగా ఉందన్నారు. పౌరాణికంలో శివుడు పాత్ర పోషించాలని కోరిక ఉందని చెప్పారు. ఇప్పటి వరకూ 30కి పైగా సినిమాల్లో నటించానన్నారు. సమావేశంలో అట్లూరి రంగారావు, మహ్మద్ మదనీ, బొబ్బిలి బంగారయ్య, కందుల సత్యనారాయణ పాల్గొన్నారు. -
అంతర్జిల్లా ముఠా అరెస్ట్
భీమడోలు : నడవలేని స్థితిలో ఉన్న ఓ వ్యక్తి నుంచి డిపాజిట్ సొమ్మును కాజేసిన అంతర్జిల్లా జేబు దొంగల ముఠాను ఆదివారం సాయంత్రం భీమడోలు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టే షన్ లో ఆదివారం సాయంత్రం ఎస్సై బి.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పూళ్ల గ్రామానికి చెందిన కూటికుప్పల వాసు అనే వ్యక్తితో పాటు కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వాసు నడవలేని స్థితిలో ఉండడంతో పలువురు దాతలు వైద్య సహాయం, కుటుంబ ఖర్చుల నిమిత్తం రూ.21 వేల నగదు సాయం అందించారు. అవి పెద్ద నోట్లు కావడంతో వాటిని గత నెల 29న పూళ్ల ఆంధ్రాబ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వాసు వెళ్లాడు. నగదుకు సంబంధించి ఓచర్ రాయించుకునే ప్రయత్నంలో ఉండగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం డ్రైవర్స్ కాలనీకి చెందిన నాగ్లూరి లోకేష్‌లతో పాటు ఆవుల సాయి, అంబటి విలాస్, దంబి రాము రమేష్, అంబటి దుర్గాప్రసాద్‌ల బృందం ఖాతాదారుల్లా బ్యాంకులోకి ప్రవేశించి నడవలేని స్థితిలో ఉన్న వాసు జేబులోంచి చాకచక్యంగా రూ.21 వేలను దొంగించారు. అనంతరం వారు అక్కడి నుంచి జారుకున్నారు. నగదు పోవడంతో ఘొల్లుమన్న వాసు అదే రోజు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా.. వాసు ఫిర్యాదు మేరకు బ్యాంకును పరిశీలించిన పోలీసులు అక్కడి సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించగా జేబు దొంగల ముఠా పనేనని గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలిస్తుండగా ఆదివారం భీమడోలు రాషీ్టయ్ర రహదారి కొండ్రెడ్డినగర్ ప్రాంతంలో ఐదుగురు సభ్యులు అనుమానాస్పదంగా సంచరించడాన్ని గుర్తించి ఎస్సై బి.వెంకటేశ్వరరావు పట్టుకున్నారు. వారిని తమదైన శైలిలో ప్రశ్నించగా వాసుకు చెందిన నగదును కాజేసినట్టు వారు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి భీమడోలు కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు ఎస్సై తెలిపారు. హెచ్‌సీ అమీర్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జిల్లా ముఠా అరెస్ట్
భీమడోలు : నడవలేని స్థితిలో ఉన్న ఓ వ్యక్తి నుంచి డిపాజిట్ సొమ్మును కాజేసిన అంతర్జిల్లా జేబు దొంగల ముఠాను ఆదివారం సాయంత్రం భీమడోలు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టే షన్ లో ఆదివారం సాయంత్రం ఎస్సై బి.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పూళ్ల గ్రామానికి చెందిన కూటికుప్పల వాసు అనే వ్యక్తితో పాటు కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వాసు నడవలేని స్థితిలో ఉండడంతో పలువురు దాతలు వైద్య సహాయం, కుటుంబ ఖర్చుల నిమిత్తం రూ.21 వేల నగదు సాయం అందించారు. అవి పెద్ద నోట్లు కావడంతో వాటిని గత నెల 29న పూళ్ల ఆంధ్రాబ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వాసు వెళ్లాడు. నగదుకు సంబంధించి ఓచర్ రాయించుకునే ప్రయత్నంలో ఉండగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం డ్రైవర్స్ కాలనీకి చెందిన నాగ్లూరి లోకేష్‌లతో పాటు ఆవుల సాయి, అంబటి విలాస్, దంబి రాము రమేష్, అంబటి దుర్గాప్రసాద్‌ల బృందం ఖాతాదారుల్లా బ్యాంకులోకి ప్రవేశించి నడవలేని స్థితిలో ఉన్న వాసు జేబులోంచి చాకచక్యంగా రూ.21 వేలను దొంగించారు. అనంతరం వారు అక్కడి నుంచి జారుకున్నారు. నగదు పోవడంతో ఘొల్లుమన్న వాసు అదే రోజు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా.. వాసు ఫిర్యాదు మేరకు బ్యాంకును పరిశీలించిన పోలీసులు అక్కడి సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించగా జేబు దొంగల ముఠా పనేనని గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలిస్తుండగా ఆదివారం భీమడోలు రాషీ్టయ్ర రహదారి కొండ్రెడ్డినగర్ ప్రాంతంలో ఐదుగురు సభ్యులు అనుమానాస్పదంగా సంచరించడాన్ని గుర్తించి ఎస్సై బి.వెంకటేశ్వరరావు పట్టుకున్నారు. వారిని తమదైన శైలిలో ప్రశ్నించగా వాసుకు చెందిన నగదును కాజేసినట్టు వారు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి భీమడోలు కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు ఎస్సై తెలిపారు. హెచ్‌సీ అమీర్ తదితరులు పాల్గొన్నారు. -
సుడిగాలి రేగింది.. అణగారిపోయింది..
సామర్లకోట : సుడిగాలి గురించి చెప్పడమే కానీ, దాని ప్రత్యక్ష వీక్షణం మన ప్రాంతంలో చాలామందికి అరుదే. అమెరికావంటి దేశాల్లో వచ్చే భారీ స్థాయిలో రేగే సుడిగాలులను (టోర్నడోలు) సినిమాలు, వీడియోల్లో మాత్రమే చూస్తూంటాం. ఆ స్థాయిలో కాకపోయినా.. సామర్లకోటలో ఆదివారం రేగిన సుడిగాలి పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. స్థానిక ఏడీబీ రోడ్డులోని ఓ లే–అవుట్లో ఉన్నట్టుండి ఇలా ధూళిని తోడుగా తీసుకుని గాలి సుడి తిరిగింది. అటుగా వెళ్తున్న పలువురు దీనిని ఆసక్తిగా తిలకించారు. కాసేపటి తరువాత ఆ గాలి దానంతట అదే అణగారిపోయింది. సాధారణంగా గాలి అధిక పీడనం నుంచి అల్పపీడనం ఉన్నప్రదేశంలోకి చేరేటప్పుడు ఈవిధంగా సుడి తిరుగుతుంది. -
ముగ్గురు తమిళ కూలీల అరెస్ట్
సిద్దవటం : ఎర్రచందనం అక్రమాలకు పాల్పడుతున్న ముగ్గురు తమిళ కూలీలను ఆదివారం సాయంత్రం అరెస్టు చేశామని ఎస్ఐ అరుణ్‌రెడ్డి తెలిపారు. సిద్దవటం రేంజిలోని రోళ్లబోడు బీటులో నరుకుడు బండ అటవీ ప్రాంతంలో తమిళనాడు రాష్ట్రం తిరుణామలైకి చెందిన కూలీలు ఎర్రచందనం దుంగలు నరికి అక్రమాలకు పాల్పడుతుండగా ఎస్ఐ అనిల్‌కుమార్, పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా వి.విలియమ్సెట్, విలియం రాజ్‌కుమార్, గోవిందన్రామలింగం అనే ముగ్గురు కూలీలు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారని తెలిపారు. -
అదిరిన కేటీఎం బైక్ స్టంట్ షో
భీమవరం యూరోపియన్ రేసింగ్ లెజండ్ కేటీఎం స్టంట్ షో భీమవరం పట్టణంలో యువతను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. స్థానిక కోస్టల్ సిటీ సెంటర్(గీతా మల్టీ ప్లె్లక్స్) ఆవరణలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన స్టంట్ షోలో ప్రొఫెషనల్ స్టంట్ రైడర్స్ అద్భుతమైన స్టంట్రైడ్స్, ట్రిక్స్‌ను కేటీఎం డ్యూక్ బైక్‌లతో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. బైక్ వెనుక చక్రాన్ని గాలిలోకి లేపడం, చేతులు వదిలి నడపడం, బైక్ కింది భాగంలో కూర్చుని నడపడం, ముందు చక్రాన్ని పైకి లేపి కేవలం వెనుకచక్రంతో ముందుకు వెళ్లడం, బైక్‌పై నిలబడి ముందుకు వెళ్లడం వంటి అద్భుత విన్యాసాలు అబ్బుర పరిచాయి. ఈ సందర్భంగా బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రో బైకింగ్ ప్రెసిడెంట్ అమిత్‌నంది మాట్లాడుతూ హై ఫెర్ఫార్మెన్ స రేసింగ్ బైక్‌లకు కేటీఎం బ్రాండ్ ప్రసిద్ధి అన్నారు. వినియోగదారులకు ఉత్తేజకరమైన సాహస అనుభూతులను కేడీఎం బైక్‌లు అందిస్తాయన్నారు. భవిష్యత్తులో ప్రొఫెషనల్ స్టంట్స్‌ని ప్రతి ప్రధాన పట్టణంలో నిర్వహించనున్నామన్నారు. ఇప్పటివరకు స్టంట్ షోలను చెన్నయ్, విజయపూర్, లక్నో, జబల్పూర్, ఔరంగాబాద్, జలంధర్, రాజ్‌కోట్, అహ్మదాబాద్, కాంచీపురం వంటి నగరాల్లో నిర్వహించామన్నారు. -
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
పెంటపాడు : స్థానిక ప్రభుత్వ పోస్టు బేసిక్ స్కూల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన 62వ రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ క్రీడాపోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక చేశారు. వీరు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కాగా ఈ ఎంపిక పోటీల్లో ఓవరాల్ చాంపియన్ గా విశాఖ జట్టు నిలిచినట్టు క్రీడల సమన్వయకర్త, గూడెం డీవైఈవో జి.విలియం తెలిపారు. బాలుర ఫైనల్స్‌లో కర్నూలుపై విశాఖ జట్టు విజయం సాధించింది. బాలికల విభాగంలో తూర్పు గోదావరిపై విశాఖ జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు ఎమ్మెల్సీ రాము సూర్యారావు(ఆర్ఎస్ఆర్) తదితరులు షీల్డ్‌లు అందజేశారు. రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికైన బాలురు : ఎస్.భార్గవ్ (పశ్చిమ గోదావరి), ఎం.పృధ్వీ నాయక్ (కర్నూలు), ఎం.కుమార్(విశాఖ), జి.ఆనంద్ కిషోర్(కృష్ణా), డి.మనోజ్(ప్రకాశం), డి.శ్రీకాంత్(నెల్లూరు), సీహెచ్ రాజు(తూర్పు గోదావరి), ఎస్.దుర్గారావు(విజయనగరం). బాలికల జట్టు : సి.హెచ్.ఎం.ఎల్.ఎస్ శ్రీజ( పశ్చిమ గోదావరి), ఎం.రాధా ప్రశాంతి(విశాఖ), ఎం.భారతి(విజయనగరం), సీహెచ్ వెంకట దివ్య(గుంటూరు), టి.పుష్పజ్యోతి(తూర్పు గోదావరి), కె.హారికా దేవి(శ్రీకాకుళం), పి.గంగోత్రి(అనంతపురం), డి.సునంద(నెల్లూరు). వీరిని ఎమ్మెల్సీతో పాటు జెడ్పీటీసీ కిలపర్తి వెంకటరావు, క్రీడల కన్వీనర్ జి.విలియం, కార్యదర్శి పద్మ సుజాత, సర్పంచ్, ఉపసర్పంచ్లు తాడేపల్లి సూర్యచంద్రకుమారి, నల్లమిల్లి చినగోపిరెడ్డి, రీజనల్ స్పోర్ట్ కో ఆర్డినేటర్ పి.సుధాకర్ అభినందించారు. డిసెంబర్లో చత్తీస్‌గడ్‌లోని జగదల్పూర్లో జరగనున్న జాతీయ స్థాయి అండర్–14 బాల్ బ్యాడ్మింటన్ ఈ జట్లు పాల్గొంటాయని చెప్పారు. క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించిన జిల్లా రైస్ మిల్లర్స్ సంఘ అధ్యక్షుడు చెరకువాడ శ్రీరంగనాథరాజుకు డీవైఈవో జి.విలియం కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ క్రీడాకారుడు చింతకాయల సత్యనారాయణ, ఈశ్వర్, శ్రీనివాస్ కుమార్, మండల మానవత సంస్థ అధ్యక్షుడు తాడేపల్లి మోహన్‌రావు, గ్రామ కార్యదర్శి బాలకృష్ణ, ఏంఈవో పి.శేషు గాంధీరెడ్డి, దాసరి కృష్ణవేణి, అప్పన్న, సతీష్‌కుమార్ పాల్గొన్నారు. -
ఈ శని, ఆదివారాల్లో బ్యాంకులు పనిచేస్తాయ్
-
ఈ శని, ఆదివారాల్లో బ్యాంకులు పనిచేస్తాయ్
కొత్త కరెన్సీ నోట్లు నేటి నుంచే నోట్ల మార్పిడికి మరిన్ని కేంద్రాలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: దేశంలో చెలామణిలో ఉన్న పెద్ద నోట్లను మార్పు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని సదుపాయాలు కల్పించింది. నోట్ల మార్పిడిలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవకుండా వచ్చే శని, ఆదివారాల్లోనూ (వాస్తవానికి రెండవ శనివారం బ్యాంకులకు సెలవు) బ్యాంకులు పనిచేసేలా ఆదేశాలు జారీచేసింది. ప్రజల తాకిడిని దృష్టిలో పెట్టుకొని వచ్చే శని, ఆదివారాల్లో బ్యాంకులు ఫుల్డే పనిచేసేలా ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతోపాటు నేడు, రేపు (గురు, శుక్రవారాల్లోనూ) సాధారణం కంటే ఎక్కువ సమయం బ్యాంకులు పనిచేయాలని ఆదేశించింది. అలాగే ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి వరకు రూ.500, రూ.వెయి నోట్లను మార్చుకునేందుకు మరికొన్ని ప్రాంతాలను పెంచింది. రైల్ టికెట్లు, హైవే - రోడ్ టోల్, వైద్యుల ప్రిస్క్రిప్షన్‌తో ప్రభుత్వ, ప్రైవేట్ ఫార్మసీలో మందులు, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు, రైల్వే కేటరింగ్, పురావస్తు శాఖ చారిత్రక కట్టడాల ప్రవేశ టిక్కెట్ల కొనుగోలుకు కూడా పాత 500, వెయి నోట్లను వినియోగించవచ్చని తెలిపింది. తొలుత ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్వే టికెట్లు, ప్రజా రవాణా, విమాన టికెట్ కౌంటర్లు, పాల కేంద్రాలు, శ్మశానాలు, పెట్రోల్ బంకుల వద్ద నోట్లను మార్చుకోవచ్చని కేంద్రం చెప్పిన సంగతి తెలిసిందే. బ్యాంకులకు కొత్త నోట్లు పాత 500/1000 నోట్లను తొలగించి కొత్త నోట్లను పెట్టేందుకు బ్యాంకులు, ఏటీఎంలను బుధవారం మూసివేశారు. రిజర్వ్ బ్యాంక్ ట్రక్కుల కొద్దీ కొత్త నోట్లను దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు, పోస్టాఫీసులకు పంపిం దని, అన్ని బ్యాంకులు గురువారం పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వెల్లడించారు. కొన్ని ఏటీఎంల నుంచి నగదును కూడా తీసుకోవచ్చన్నారు. పెద్ద నోట్లను పూర్తిస్థాయిలో మార్చేందుకు మరో 2-3 వారాల సమయం పడుతుందన్నారు. ‘ఏటీఎం కార్డు విత్‌డ్రాలపై రోజుకు రూ.2వేల పరిమితి ఉంటుంది. అదే బ్యాంకు ఖాతా నుంచి అరుుతే రోజుకు రూ.10వేలు, వారానికి రూ.20 వేలు తీసుకోవచ్చు. ఈ పరిమితి కొన్ని రోజులపాటు కొనసాగుతుంది. మరింత కరెన్సీ బ్యాంకింగ్ వ్యవస్థకు చేరితే అప్పుడు ఈ పరిమితిపై పునరాలోచన చేస్తాం’ అని చెప్పారు. నోట్ల మార్పిడి వల్ల దేశ ఎకానమీ విసృ్తతమవుతుందని, రెవెన్యూ మూలాలను కూడా పెంచుతుందన్నారు. నోట్ల మార్పిడి వల్ల తొలుత ప్రజలకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలంలో భారీ ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. -
ప్రశాంతంగా పోలీస్ రిక్రూట్మెంట్ రాత పరీక్ష
ఏలూరు అర్బ న్‌భీమవరం టౌ న్ : జిల్లాలో పోలీస్ రిక్రూట్మెంట్ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఏలూరులో 20, భీమవరంలో 18 కేంద్రాల్లో ఆదివారం పరీక్ష నిర్వహించారు. పరీక్షలు జరుగుతున్న విధానాన్ని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్, అడిషనల్ ఎస్పీ ఎ న్.చంద్రశేఖర్, ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, నరసాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు పర్యవేక్షించారు. -
రికార్డు నృత్యం..
జంగారెడ్డిగూడెం : కూచిపూడి నృత్య చరిత్రలో నూతన అధ్యాయం. 500 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఏక కాలంలో శిరస్సున మంచినీటి బాటిళ్లు ధరించి నత్య ప్రదర్శనతో వహ్వా అనిపించారు. ఎక్కడా తడబడకుండా వీరు చేసిన నృత్యం ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్కు ఎక్కింది. ఈ అద్భుత ఘట్టం ఆదివారం జంగారెడ్డిగూడెం జెడ్పీ హైస్కూల్లో ఆవిష్కృతమైంది. స్థానిక అభినయ కూచిపూడి నాట్య అకాడమీ 25వ కూచిపూడి దేశభక్తి గీతాల నృత్య కళాత్సోవాల్లో భాగంగా విద్యార్థినీ, విద్యార్థుల చేత ఈ ప్రదర్శన ఇప్పించారు. రాష్ట్ర భక్తి గీతం ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ అంటూ విద్యార్థినులు 13.56 నిమిషాలు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అబ్బుర పరిచింది. ప్రదర్శనను ఇండియా బుక్ ఆఫ్ రికార్డŠస్ ప్రతినిధి బి.స్వదీప్‌రాయ్ చౌదరి ప్రత్యక్షంగా తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డŠస్లో ఈ నృత్య ప్రదర్శనకు స్థానం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఇండియాలోనే ఈ తరహా ప్రదర్శన ఇదే మొట్టమొదటిదని, అందుకే రికార్డు సాధించిందని వెల్లడించారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రాన్ని కార్యక్రమ నిర్వాహకురాలు, అభినయ కూచిపూడి నాట్య అకాడమీ వ్యవస్థాపకురాలు , నాట్యమయూరి, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత ఎస్.రూపాదేవిని అందించారు. ఈ ప్రదర్శనలో స్థానిక ప్రతిభ, భాష్యం, కిడ్స్, గురుకుల పాఠశాలల విద్యార్థులతో పాటు అభినయ కూచిపూడి నాట్య అకాడమికి చెందిన జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం విద్యార్థులు, ఇండియన్ యూపీ స్కూల్, అక్షర పాఠశాల, సరిపల్లికి చెందిన ఎంవీఆర్ విద్యానికేతన్ చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా సుకవిత నాట్యాచార పసుమర్తి శ్రీనివాసశర్మ, మహిళా కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్ లక్ష్మికుమారి వ్యవహరించారు. తొలుత నటరాజ పూజా కార్యక్రమాలను చిట్రోజు తాతాజీ దంపతులు, బాలాజీరావు దంపతులు నిర్వహించారు. కార్యక్రమాన్ని తిలకించిన ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ అభినయ కూచిపూడి నాట్య అకాడమీకి ప్రభుత్వం నుంచి అకాడమీ ఏర్పాటు కు భూమిని కేటాయిస్తామని ప్రకటించారు. అలాగే అమరావతిలోను అవకాశం ఉంటే రిపబ్లిక్ డే పరేడ్ ఈ ప్రదర్శన ఇచ్చేందుకు అనుమతులు తీసుకుంటానని తెలిపారు. మంత్రి పీతల సుజాత ఫోన్లో అభినందనలు తెలిపారు. నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, ఎంపీపీ కె.మాణిక్యాంబ, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కె.రాంబాబు, మండవ లక్ష్మణరావు, సిటీకేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, షేక్ ముస్తఫా, పెనుమర్తి రామ్‌కుమార్, బండారు సత్యనారాయణ, దల్లి రామాంజనేయరెడ్డి, ప్రముఖ శిల్పి దేవికారాణి ఒడయార్, ఆకాశవాణి ప్రతినిధి బి.జయప్రకాష్, కళాకారులు, అధికారులు కార్యక్రమాన్ని వీక్షించారు. -
ముగిసిన టేబుల్ టెన్నిస్ పోటీలు
వట్లూరు (పెదపాడు) : స్థానిక సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 3 నుంచి ప్రారంభమైన అంతరజిల్లాల టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. టెన్నిస్ అసోసియేషన్, సీఆర్ఆర్ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. పురుషుల విభాగంలో విజేతగా విశాఖపట్నం, రన్నర్‌గా కృష్ణా జిల్లా జట్లు నిలిచాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా జట్లు సెమీస్ జట్లుగా నిలిచాయి. మహిళల విభాగంలో విన్నర్‌గా విశాఖపట్నం, రన్నర్‌గా కృష్ణా విజయం సాధించాయి. జూనియర్ బాలుర విభాగంలో విన్నర్‌గా కృష్ణా, రన్నర్‌గా విశాఖపట్నం సెమీ ఫైనల్ జట్లుగా పశ్చిమ, తూర్పు గోదావరి జట్లు నిలిచాయి. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలలో పాల్గొనేందుకు ఎంపిక చేశారు. -
నేత్రపర్వం.. హనుమద్ కల్యాణం
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం సువర్చలా హనుమద్ కల్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు పర్యవేక్షణలో అర్చకుల బృందం ఈ కల్యాణ తంతును వేదమంత్రాలతో నిర్వహించారు. ఇందుకూరి లీలారాణి, అరిగెల లీలా నాగకాశీ, విశ్వనాథం, నాగలక్ష్మి దంపతులు ఈ కల్యాణ పూజల్లో పాల్గొన్నారు. వార్షిక సప్తాహ పూజల్లో ఆలయ చైర్మ¯ŒS ఇందుకూరి రంగరాజు, లీలారాణి దంపతులు పాల్గొని పూజలు చేశారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు. మంగళవారం ఒక్కరోజు ఆలయానికి రూ.1,41,400 ఆదాయం లభించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. స్వామివారిని హైదరాబాద్‌కు చెందిన ఇందు భారత్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మ¯ŒS కనుమూరి రఘురామ కృష్ణంరాజు, కాకినాడ సుధా ఆగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్ ఇ.రామకృష్ణలు దర్శించుకున్నారు. -
విజయవాడలో ఉత్సాహంగా హ్యాపీ సండే
-
లోవ.. భక్తజన తోవ
అడుగడుగునా స్తంభించిన ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్న భక్తులు తుని రూరల్ : తలుపులమ్మ అమ్మవారిని దర్శించు కునేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో రద్దీ నెలకొంది. భారీ సంఖ్యలో భక్తులు దూర ప్రాంతాల నుంచి వాహనాల్లో తరలిరావడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు తగినంతగా లేకపోవడంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం కష్టంగా మారడంతో, భక్తులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వసతి గదుల లభించని భక్తులు మండుటెండ కారణంగా ఆలయ ప్రాంగణంలోని చెట్ల కింద, కొండ దిగువన ప్రైవేట్ పాకలు, తోటల్లో భోజన ఏర్పాట్లు చేసుకున్నారు. ధర్మకర్తలతో కలసి దేవస్థానం చైర్మ¯ŒS కరపా అప్పారావు వివిధ విభాగాలను పరిశీలించారు. లోవ దేవస్థానానికి భక్తుల ద్వారా రూ.2.99 లక్షల ఆదాయం సమకూరినట్టు ఈఓ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. ఇలాఉండగా బెల్టు షాపులను ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్టు వదిలేశారు. కొండ దిగువన బెల్టు షాపులు విచ్చలవిడిగా వెలిశాయి. దీంతో మందుబాబులు రోడ్లపై చిందులు వేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
సండే నో హాలిడే
వర్క్.. వర్క్.. మండే మార్నింగ్ నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ బిజీ బిజీగా గడిపే జనమంతా, వీకెండ్స్ వచ్చేసరికి సినిమాకో.. పార్టీకో.. వెళ్తారు. ఎంజాయ్ చేస్తారు. మరి, సినిమా తారల సంగతేంటి? వాళ్లది 9 టు 6 జాబ్ కాదుగా. సండే.. మండే.. వీకెండ్స్ అనే తేడా ఉండదు. షెడ్యూల్‌ను బట్టి షూటింగ్ చేయక తప్పదు. స్టార్స్ నుంచి స్మాల్ ఆర్టిస్టుల వరకూ వీకెండ్స్‌లో షూటింగ్ ఉంటే చేస్తారు. ఈ వారాంతంలో చిరంజీవి, మహేశ్‌బాబు, అక్షయ్‌కుమార్ వంటి హీరోలతో పాటు శ్రుతీహాసన్ టు తాప్సీ... చాలామంది తారలు మేకప్ వేసుకున్నారు. ‘సండే నో హాలిడే... అయినా ఓకే’ అంటూ హ్యాపీగా షూటింగ్‌లకు హాజరయ్యారు. చిరంజీవి తాజా చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. రాఘవా లారెన్స్ నృత్య దర్శకత్వంలో చిరు, రాయ్ లక్ష్మీలపై ప్రత్యేక గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవియేమో స్టూడియోలో స్టెప్పులేస్తుంటే.. మహేశ్‌బాబు హైదరాబాద్ రోడ్స్‌పై ఫైట్ చేస్తున్నారు. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో చేస్తున్నారు. పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఛేజింగ్, యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సునీల్ హీరోగా నటిస్తున్న ‘ఉంగరాల రాంబాబు’ సినిమా షూటింగ్ కూడా అన్నపూర్ణలోనే జరుగుతోంది. హైదరాబాద్‌లో శ్రుతీహాసన్ ‘కాటమరాయుడు’ షూటింగ్లో బిజీగా ఉంటే.. మలేసియాలో ‘నామ్ షబానా’ అంటున్నారు తాప్సీ. ‘బేబి’కి ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న ‘నామ్ షబానా’ షూటింగ్‌తో ఆమె బిజీ. ఇందులో తాప్సీది మెయిన్ రోల్. అక్షయ్‌కుమార్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. శింబూతో కలసి చెన్నైలో జరుగుతోన్న ‘అన్బానవన్ అసురాదవన్ అడంగాదవన్’ షూటింగ్లో పాల్గొంటున్నారు తమన్నా. ఇంకా పలువురు తారలు ఈ వీకెండ్ షూటింగులతోనే గడిపారు. -
ఏలూరులో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు
-
రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు ప్రారంభం
ఉండి : రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు ఆదివారం మండలంలోని చినపుల్లేరు శివారు తల్లమ్మచెరువులో ప్రారంభమయ్యాయి. గ్రామంలోని లూథరన్ చర్చి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎస్సై మంతెన రవివర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా ఇటువంటి క్రీడలు ఆడుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కలిదిండి రామకృష్ణంరాజు, పెన్మత్స రామరాజు, సర్పంచ్ కాపా లేయమ్మ రెడ్డియ్య, పెదపుల్లేరు సర్పంచ్ గేదెల మేమలత నరసింహం, ఎంపీటీసీ ఎన్.నిర్మలా సుధాకర్, నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తొలి రోజు పోటీల్లో తల్లమ్మచెరువు ఎ జట్టు జక్కరం జట్టుపై, తల్లమ్మచెరువు బి జట్టుపై చెరుకువాడ, కుముదవల్లి జట్టుపై ఉండి పెదపేట, వెలివర్రు జట్టుపై చెరుకువాడ బి జట్టు, కొడవల్లి బి జట్టుపై కోపల్లె జట్టు విజయం సాధించాయి. -
దుర్గాదేవి నమోస్తుతే!
శరన్నవరాత్రుల్లో భాగంగా ఆదివారం జిల్లా అంతటా దుర్గాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేయడానికి అవతరించిన దుర్గాదేవి నిజరూపంగా భక్తులకు దర్శనం ఇచ్చింది. అర్చకులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. కష్టాల నుంచి తమను గట్టెక్కించామని వేడుకొన్నారు. -
ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్‌ల మూసివేత!
గుంటూరు: ప్రభుత్వ వైఖరికి నిరసనగా మరోసారి పెట్రోల్ బంక్‌ల బంద్ కార్యక్రమం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ బంక్ డీలర్ల అసోసియేషన్ నిర్ణయించింది. శనివారం గుంటూరులో సమావేశమైన అసోసియేషన్ సభ్యులు.. అక్టోబర్ 19, 26 తేదీల్లో సాయంత్రంపూట, నవంబర్ 6న పూర్తిగా పెట్రోల్ బంక్‌లు మూసివేయాలని నిర్ణయించారు. అలాగే.. నెలలో ప్రతి ఆదివారంతో పాటు 2, 4వ శనివారాలు కూడా పెట్రోల్ బంకులు మూసేయాలని సమావేశంలో తీర్మానం చేశారు. -
భీమవరంలో రీతూవర్మ సందడి
భీమవరం :పట్టణంలో ఆదివారం ‘పెళ్లిచూపులు’ ఫేం సినిమా హీరోయిన్ రీతూవర్మ సందడి చేశారు. స్థానికంగా సిరి వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతా రామలక్ష్మి షోరూంను ప్రారంభించగా రీతూవర్మ జ్యోతి ప్రజ్వలన చేశారు. వివిధ విభాగాలను ఎమ్మెల్యే అంజిబాబు సతీమణి పులపర్తి సత్యవతి, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సతీమణి గ్రంధి సత్యరాణి, మునిసిపల్ చైర్మన్ సతీమణి కొటికలపూడి నాగవెంకట సునీత ప్రారంభించారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ టి.శ్రీరామారావు మొదటి కొనుగోలు చేశారు. షోరూం అధినేతలు ఎం.సురేష్, జి.కిరణ్, కిశోర్, శ్యామ్ పాల్గొన్నారు. -
అంజన్న సేవలో హైకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్
జంగారెడ్డిగూడెం రూరల్ :జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని ఆదివారం హైకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్ కొక్కుల శ్రీనివాసరావు, ఆయన సతీమణి ఏలూరు–2 అదనపు జిల్లా జడ్జి కొక్కుల సాయి రమాదేవి దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారి సన్నిధిలో పూజల అనంతరం వేద ఆశ్వీరచనాలు అందజేసి, స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. వీరి వెంట జంగారెడ్డిగూడెం జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎంవీఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. -
వెంకన్న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నేడు
– రేపు సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేషవాహనం, సీఎం పట్టువస్త్రాలు సమర్పణ – సర్వం సిద్ధం చేసిన టీటీడీ – ఉత్సవాల్లో 3500 వేల మంది సిబ్బందితో బందోబస్తు సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ జరగనుంది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు. శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను విష్వక్సేనుడు పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమమోక్తంగా ఈ వేడుక నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టడం సంప్రదాయం. ఇందులో భాగంగా నేటి సాయంకాల వేళలో విష్వక్సేనుడు నిర్ణీత పునీత ప్రదేశంలో ‘భూమి పూజ’(మత్సంగ్రహణం)తో మట్టిని సేకరించి ఛత్రచామర మంగళవాద్యాలతో ఊరేగుతూ తిరిగి ఆలయంలోనికి చేరుకుంటారు. యాగశాలలో ఆ మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో(కుండలు)– శాలి, వ్రహి,యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలతో అంకురార్పణం (బీజావాపం) చేస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాళికల్లోని నవ ధాన్యాలు దిన దినాభివృద్ధి చెందేలా అర్చకులు ప్రార్థిస్తారు. నిత్యం నీరుపోసి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు. రేపు ధ్వజారోహణం, పెద్ద శేషవాహన సేవ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు బుధవారం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల్లోపు మీన లగ్నంలో ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ఆరంభిస్తారు. అనంతరం రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప దర్శనమివ్వనున్నారు. ఇందులో భాగంగా టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, సీవీఎస్వో జి.శ్రీనివాస్ సర్వం సిద్దం సిద్దం చేశారు. బ్రహ్మోత్సవాల్లో మొత్తం 3500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు సిద్దం చేశారు. అనంతపురం రేంజ్ డీఐజీ జె.ప్రభాకరరావు, తిరుపతి అర్బన్‌జిల్లా జయలక్ష్మి తిరుమలలోనే ఉంటూ ఉత్సవాల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. రేపు శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాల సమర్పణ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబునాయుడు సోమవారం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 7.30 నుండి 8 గంటల మధ్య బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలను శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లి సమర్పించి స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు దంపతులు పెద్ద శేషవాహనసేవలో ఉత్సవమూర్తిని దర్శించుకోనున్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్
కొవ్వూరు రూరల్: ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన సంఘటనలో ముగ్గురు తీవ్ర గాయాలపాలైన సంఘటన ఆదివారం కొవ్వూరు మండలం దొమ్మేరు వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపల్లి గ్రామానికి చెందిన కేశవ, ఎం.ధనలక్ష్మి, ఎస్.కుమారి కొవ్వూరు వైపు నుంచి అనంతపల్లి మోటార్ సైకిల్‌పై వెళుతున్నారు. దొమ్మేరు గ్రామంలోని మసీదు సమీపంలోకి వచ్చేసరికి ముందుగా Ðð ళుతున్న వాహనాన్ని ఎడమవైపు నుంచి ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి మార్జిన్లో ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టారు. దీంతో వీరి ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108లో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొవ్వూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్సాహంగా చెస్ ఎంపిక పోటీలు
ఏలూరు రూరల్ : మల్కాపురం ఆశ్రం మెడికల్ కళాశాలలో ఆదివారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్థాయి చెస్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి వైద్య కళాశాల విద్యార్థులు తరలివచ్చారు. పోటీల్లో ప్రతిభచూపిన క్రీడాకారిణులను యూనివర్సిటీ జట్టుకు ఎంపిక చేసినట్టు ఆశ్రం కళాశాల పీడీ శ్రీనివాసరాజు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో పురుషుల జట్టును సోమవారం ఎంపిక చేయనున్నట్టు ప్రకటించారు. -
ఎరువులకు నగదు బదిలీతో నష్టం తప్పదు
ఉంగుటూరు: ఎరువులకు నగదు బదిలీ అమలు చేస్తే కౌలు రైతులు నష్టపోతారని ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. స్థానిక సీఐటీ యూ కార్యాలయంలో ఆదివారం కౌలు రైతు సమావేశం నిర్వహించారు. భూ యాజమానుల ఆధార్ కార్డుల ఆధారంగానే బయోమెట్రిక్ విధానం ద్వారా ఎరువులు విక్రయిస్తే కౌలు రైతులకు ఇబ్బందులు తప్పవన్నారు. కౌలు రైతులకు నష్టం జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. కొద్దిరోజులుగా అల్పపీడనం ప్రభావంతో కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన కౌలు రైతులకు పరిహారం అందించాలన్నారు. జిల్లాలోని పలు మండలాల్లో వరి, అరటి, కూరగాయలు, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. అధికారులు వెంటనే నష్టాన్ని అంచనా వేసి ఇన్పుట్ సబ్సిడీ, బీమా అందజేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 2010 నుంచి ఇప్పటి వరకూ రూ.175 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ రావాల్సి ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా నిధులు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. -
వివాహితపై లైంగిక దాడి
గోపాలపురం : మండలంలోని పెద్దాపురంలో అదివారం రాత్రి ఒక వివాహితపై లైంగిక దాడి జరిగింది. పోలవరం సీఐ కె.బాలరాజు కథనం ప్రకారం.. తాళ్లపూడి మండలం చిడిపికి చెందిన వివాహిత మండలంలోని పెద్దాపురానికి ఆది వారం సొంతపనిమీద వచ్చింది. సాయంత్రం తిరుగు ప్రయాణంలో చిట్యాలవైపు వెళ్తున్న అదే గ్రామానికి చెందిన మోటార్‌సైక్లిస్ట్ నూతంగి పెద్దిరాజును లిఫ్ట్ ఇవ్వాలని కోరింది. దీనిని అవకాశంగా తీసుకున్న పెద్దిరాజు ఆమెను తాడిపూడి కాలువ మీదుగా తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. వివాహిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వెల్లడించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. -
వైభవంగా జగన్నాథ రథయాత్ర
నందిపేట : నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని తల్వేద గ్రామంలో శ్రీ జగన్నాథ రథయాత్ర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తి కీర్తనలతో గ్రామం మారుమోగిపోయింది. అందంగా అలంకరించిన రథం గ్రామంలోని వీరాంజనేయ మందిరం నుంచి ప్రారంభమై ప్రధాన వీధుల గుండా యోగేశ్వర మందిరం వరకు సాగింది. దారి వెంబడి భక్తులు కీర్తనలు చేస్తూ భక్తి పాటలు పాడారు. మహిళలు మంగళహారతులతో జగన్నాతునికి స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి 108 రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. వేలాదిగా జనం ఉత్సవాల్లో పాల్గొన్నారు. -
టూరిజం బోట్లకు అనుమతి
పోలవరం : దాదాపు 15 రోజుల విరామం తరువాత పర్యాటకులను గోదావరి విహారానికి తీసుకువెళ్లేందుకు టూరిజం బోట్లకు అనుమతి లభించింది. దీంతో ఆదివారం టూరిజం బోట్లలో పర్యాటకులు గోదావరి విహారానికి తరలివెళ్లారు. పర్యాటకుల భద్రత పట్ల బోట్ల యజమానులు శ్రద్ధ వహించటం లేదంటూ ఇటీవల బోటులను ఇరిగేషన్‌శాఖ బీఎస్ జి.ప్రసన్నకుమార్ నిలిపివేసిన విషయం తెలిసిందే. బోటుల యజమానులతో రెండు రోజుల క్రిందట సమావేశం నిర్వహించి, నిబంధనలు పాటించేందుకు అంగీకరించిన తరువాత తిరిగి అనుమతి ఇచ్చారు. ప్రధానంగా సమయపాలన పాటించాలని,లై ఫ్ జాకెట్స్ పర్యాటకులందరికీ ఇవ్వాలని, లైసెన్స్‌లు బోటులో సిద్ధంగా ఉంచాలని, ఎవరు అడిగినా చూపించాలని, బోట్లు మధ్యలో ఆగిపోతే పర్యాటకులు ఇబ్బంది పడకుండా ఇతర బోటుల్లో పోలవరం చేర్చాలని నిబంధనలు విధించినట్టు బోటుల తనిఖీ అధికారి ఆర్.కొండలరావు తెలిపారు. -
గజరాజుపై గజానన..
సిద్ధాంతం (పెనుగొండ) : వినాయక చవితి ఉత్సవాలను పోటాపోటీగా నిర్వహించడం ఆనవాయితీ. విగ్రహాలను నిలపడం నుంచి నిమజ్జనం వరకూ ఉత్సవ కమిటీలు ప్రత్యేకతను చాటుకునేందుకు తహతహలాడుతుంటాయి. ఈ క్రమంలోనే ఆదివారం సిద్ధాంతంలోని బూరిగలంక వరసిద్ధి వినాయక యూత్ వారు ఏకంగా కేరళ నుంచి గజరాజును తీసుకువచ్చారు. ఏనుగుపై గణపతిని ఉంచి ఊరంతా ఊరేగించారు. అనంతరం గ్రామంలోని కేదారీఘాట్ వద్ద గోదావరిలో గణపతి విగ్రహాన్ని నిమజ్జనం గావించారు. గజరాజుపై ఊరేగిన గజాననను దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. -
వైఎస్సార్ సీపీలోకి టీడీపీ కార్యకర్తలు
బువ్వనపల్లి (నిడమర్రు) : రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి భవిష్యత్‌పై ఆందోళన కలిగిస్తోందని టీడీపీ నేత, మండల దివ్యాంగుల సంక్షేమ కమిటీæమాజీ అ«ధ్యక్షుడు పొట్నూరి ఉమామహేశ్వరరావు అన్నారు. బువ్వనపల్లిలో గణపవరం సమితి మాజీ అ«ధ్యక్షుడు పుప్పాల ఏసుబాబు నివాసంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో నిడమర్రుకు చెందిన 30 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు వైఎస్సార్ సీపీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారంతా వాసుబాబును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో 70 వేల మంది ఓటర్లు వైఎస్సార్ సీపీ పక్షాన ఉన్నారన్నారు. మిగిలిన వారు చంద్రబాబు మాయమాటలను నమ్మి తప్పు చేశామనే బాధల్లో ఉన్నారని, వారందరినీ కలిసి భవిష్యత్‌పై నమ్మకం కలిగించేందుకే వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ‘గడప గడపకు వైఎస్సార్ ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల ముందు పార్టీ మారేవారు అవసరాల కోసం వచ్చేవారని, ముందుగా పార్టీలోకి వచ్చేవారు స్వచ్ఛమైన, నిజమైన కార్యర్తలని పేర్కొన్నారు. మండల కన్వీనర్ సంకు సత్యకుమార్ తదితరులు మాట్లాడారు. వైఎస్సార్ సీపీలో చేరిన వారిలో కన్నాజి రామకృష్ణ, మీసాల లక్ష్మీనారాయణ, బార్నాల త్రిమూర్తులు, పతివాడ లక్ష్మణస్వామి, పొట్నూరి త్రిమూర్తులు, పతివాడ శ్రీనివాసరావు, గొర్రెల సుబ్బారావు, పొట్నూరి శ్రీనివాసరావు, రెల్లి సత్యనారాయణ, కన్నాజి నాగరాజు, కన్నాజి సత్యనారాయణ, పెద్దిరెడ్డి సత్యనారాయణ, కోరాడ పైడయ్య, అల్లాడి అబ్బులు, ధనుకొండ బుజ్జి, కోడే కాశి, రాఘువులు, నిమ్మల రాము తదితరులున్నారు. -
కొనసాగుతున్న ఉపాధ్యాయులదీక్షలు
ఏలూరు సిటీ : ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన దీక్షలు రెండో రోజు ఆదివారం కొనసాగాయి. దీక్షా శిబిరాన్ని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వీబీవీఎస్ సుబ్రహ్మణ్యం, ఏపీటీఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి గుగ్గులోతు కృష్ణ ప్రారంభించారు. దీక్షలకు మద్దతుగా ఎమ్మెల్సీ రాము సూర్యారావు, జేఏసీ చైర్మన్ ఎల్.విద్యాసాగర్, ఎన్జీవో జిల్లా కార్యదర్శి కె.హరినాథ్, ఐలూ నాయకులు కె.సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖాధికారి ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనలో భాగస్వామి అవుతానని హెచ్చరించారు. విద్యాసాగర్ మాట్లాడుతూ సోమవారం ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా దీక్షల్లో పాల్గొంటారని చెప్పారు. రెండో రోజు దీక్షల్లో పి.ఆంజనేయులు, ఎం.పోతురాజు, ఎన్.శ్రీనివాసరావు, ఎం.రామకృష్ణ, వి.కనకదుర్గ, కె.శ్రీదేవి, బి.సుభాషిణి, జీఎంఎన్ పద్మజ, డి.పూర్ణశ్రీ, డి.పద్మావతి, ఎస్కే బాబావలి, ఎం.జయరాజు, బీజేపీ పుష్పరాజు, జీవీ రంగమోహన్, టీఆర్ రవికుమార్, కె.సత్యనారాయణ, ఎస్.సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
మట్టి వినాయక ప్రతిమలనే పూజించండి
భీమవరం: హిందూ సంప్రదాయం ప్రకారం మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కషి చేసినట్లవుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ వుంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఆదివారం భీమవరంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇటీవల కాలంలో ప్రమాదకరమైన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన వినాయక విగ్రహాలను వాడుతున్నారని, దీనివల్ల పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరేళ్లుగా భీమవరం.కామ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), మునిసిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు(చినబాబు), బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, కార్యక్రమ నిర్వాహకుడు నడింపల్లి వెంకటేశ్వరరాజు, గాదిరాజు సుబ్బరాజు, గోకరాజు వెంకట నర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు, కార్మూరి సత్యనారాయణమూర్తి, పళ్ల ఏసుబాబు పాల్గొన్నారు. -
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు ఆదివారం ఓ భక్తుడు రూ.1,01,116ను విరాళంగా అందజేశారు. తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురానికి చెందిన వీవీ రామకృష్ణారావు, లక్ష్మీకాంతమ్మ దంపతులు ముందుగా చినవెంకన్న, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం విరాళాన్ని ఆలయ కార్యాలయంలో అందజేశారు. ఆలయ ఏఈవో కర్రా శ్రీనివాసరావు దాతలను అభినందించి విరాళం బాండ్ అందజేశారు. -
చినవెంకన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ ఆకుల వెంకట శేషసాయి ఆదివారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు. ఆ తరువాత ఆలయ ఏఈవో కర్రా శ్రీనివాసరావు న్యాయమూర్తికి చినవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట భీమడోలు కోర్టు న్యాయమూర్తి ఎస్.వెంకటేశ్వరరెడ్డి, ఏలూరు కోర్టు ఎక్సైజ్ మెజిస్ట్రేట్ తిరుమలరావు, భీమడోలు సీఐ ఎం.వెంకటేశ్వరరావు తదితరులున్నారు. -
శ్రీవారి సేవలో మంత్రి కొల్లు
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ప్రదక్షిణలు నిర్వహించిన అనంతరం శ్రీవారిని, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తరువాత ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు. అనంతరం ఆలయ ఏఈవో కర్రా శ్రీనివాసరావు ఆయనకు శ్రీవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, టీడీపీ నాయకులు సుంకవల్లి బ్రహ్మయ్య, సోంబాబు, కూరాకుల బుజ్జి పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో మంత్రి కొల్లు
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ప్రదక్షిణలు నిర్వహించిన అనంతరం శ్రీవారిని, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తరువాత ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు. అనంతరం ఆలయ ఏఈవో కర్రా శ్రీనివాసరావు ఆయనకు శ్రీవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, టీడీపీ నాయకులు సుంకవల్లి బ్రహ్మయ్య, సోంబాబు, కూరాకుల బుజ్జి పాల్గొన్నారు. -
రేపు టీయూడబ్ల్యూజే సమావేశం
న్యూశాయంపేట : ఐజేయూ అనుబంధ టీయూడబ్ల్యూజే జిల్లా సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం ఏర్పాటుచేసినట్లు జిల్లా కన్వీనర్ తుమ్మ శ్రీధర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 10గంటలకు ప్రారం¿ý మయ్యే ఈ సమావేశంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, మాజీ సెక్రటరీ జనరల్ కె.శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, విరాహత్ అలీ హాజరవుతారని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడంతో పాటు జిల్లా నూతన కమిటీని ఎన్నుకునేందుకు ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి జిల్లాలోని జర్నలిస్టులు హాజరుకావాలని కోరారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి
దొమ్మేరు (కొవ్వూరు రూరల్): దొమ్మేరులో ఆదివారం వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడి చేయడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయుడు కొక్కిరపాటి శ్రీహరి ఇంట్లో నీరు రోడ్డుపైకి రావడంతో అదే వార్డుకు చెందిన కొక్కిరపాటి సంతోషంతో పాటు మరొకరు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన శ్రీహరి కర్రతో దాడి చేయగా సంతోషం తీవ్రంగా మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. దీనిపై సంతోషం బంధువు కొక్కిరిపాటి హరిబాబు ప్రశ్నించగా శ్రీహరి అతడిపై కూడా దాడి చేసి తలపై గాయపర్చాడు. బాధితులను వారి బంధువులు కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో సంతోషం పరిస్థితి విషమించడంతో రాజమండ్రి ఆస్పత్రికి రిఫర్ చేశారు. సంఘటనపై ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీ సభ్యులు ముదునూరి నాగరాజు, బండి పట్టాభిరామారావు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావును కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేసి తక్షణమే కేసు నమోదు చేస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. దాడి సంఘటనపై కేసు నమోదు దొమ్మేరులో ముగ్గురు వ్యక్తులపై దాడి చేసిన సంఘటనలో ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎసై ్స డి.గంగాభవాని తెలిపారు. కొక్కిరపాటి సంతోషం, కొక్కిరపాటి హరిబాబు, మరో వ్యక్తిపై దాడి చేసి గాయపరచిన కొక్కిరపాటి శ్రీహరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్టు ఎసై ్స తెలిపారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి
దొమ్మేరు (కొవ్వూరు రూరల్): దొమ్మేరులో ఆదివారం వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడి చేయడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయుడు కొక్కిరపాటి శ్రీహరి ఇంట్లో నీరు రోడ్డుపైకి రావడంతో అదే వార్డుకు చెందిన కొక్కిరపాటి సంతోషంతో పాటు మరొకరు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన శ్రీహరి కర్రతో దాడి చేయగా సంతోషం తీవ్రంగా మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. దీనిపై సంతోషం బంధువు కొక్కిరిపాటి హరిబాబు ప్రశ్నించగా శ్రీహరి అతడిపై కూడా దాడి చేసి తలపై గాయపర్చాడు. బాధితులను వారి బంధువులు కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో సంతోషం పరిస్థితి విషమించడంతో రాజమండ్రి ఆస్పత్రికి రిఫర్ చేశారు. సంఘటనపై ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీ సభ్యులు ముదునూరి నాగరాజు, బండి పట్టాభిరామారావు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావును కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేసి తక్షణమే కేసు నమోదు చేస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. దాడి సంఘటనపై కేసు నమోదు దొమ్మేరులో ముగ్గురు వ్యక్తులపై దాడి చేసిన సంఘటనలో ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎసై ్స డి.గంగాభవాని తెలిపారు. కొక్కిరపాటి సంతోషం, కొక్కిరపాటి హరిబాబు, మరో వ్యక్తిపై దాడి చేసి గాయపరచిన కొక్కిరపాటి శ్రీహరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్టు ఎసై ్స తెలిపారు. -
అవినీతికి పాల్పడితే చర్యలు
కడప అర్బన్ : జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో పని చేస్తున్న ఎస్ఐ, సీఐ, ఇతర ఉన్నతాధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే, కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకష్ణ హెచ్చరించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో క్రైం సమీక్షను ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులనుద్దేశించి మాట్లాడుతూ మట్కా, గ్యాంబ్లింగ్, ఎర్రచందనం అక్రమ రవాణా తదితర అసాంఘిక కార్యకలాపాల్లో నేరస్తులతో సంబంధాలు పెట్టుకుని కొందరు పోలీసులు మామూళ్లు వసూళ్లు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నట్లు తన దష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఇక మీదట అవినీతికి పాల్పడితే కొరడా ఝళిపిస్తామన్నారు. అప్రమత్తంగా పని చేయాల్సిందేనన్నారు. పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితులకు సరైన న్యాయం చేసినపుడే ప్రజల్లో పోలీసులకు గౌరవం పెరుగుతుందని చెప్పారు. నేరాలు జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. చోరీలు, ఇతర కేసుల్లో త్వరగా రికవరీ చూపించాలన్నారు. రానున్న వినాయక చవితి, బక్రీద్ పండుగల సందర్బాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని వివరించారు. సమావేశంలో పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, డీఎస్పీలు ఈజీ అశోక్‌కుమార్, పూజిత నీలం, రామకష్ణయ్య, సర్కార్, రాజేంద్ర, ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీలు సుధాకర్, షౌకత్ అలీ, సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, మహిళా పీఎస్ డీఎస్పీ వాసుదేవన్, ఎస్బీ డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, సీఐలు పాల్గొన్నారు -
హోరాహోరీగా బాస్కెట్‌బాల్ పోటీలు
మార్టేరు (పెనుమంట్ర): మార్టేరు వేణుగోపాలస్వామి ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆదివారం ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, మార్టేరు, యానాం జట్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. మార్టేరు–యానాం జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. పోటీల వివరాలు తాడేపల్లిగూడెం జట్టుపై మార్టేరు, నరసాపురం జట్టుపై ఏలూరు, మార్టేరు (బి)జట్టుపై భీమవరం జట్టు విజయం సాధించాయి. రాత్రి జరిగిన పోటీల్లో ఏలూరు బాలికల జట్టుపై మార్టేరు బాలికల జట్టు 10–30 తేడాతో ఘన విజయం సాధించింది. ఉత్సాహపరిచిన మాజీ క్రీడాకారులు అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు సత్తి సుబ్బన్‌రెడ్డి క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహించారు.అప్పలరాజు, జానీ, రామకృష్ణ తదితర క్రీడాకారులకు, న్యాయ నిర్ణేతలకు సూచనలు చేశారు. అలాగే పెద్దసంఖ్యలో విచ్చేసిన మాజీ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాస్ఫూర్తిని రగిలించారు. వైద్యులు జీఎల్ రాజశేఖర్, వైఎస్సార్ సీపీ జిల్లా నాయకుడు అల్లం బులిరెడ్డి, మార్టేరు మర్చంట్స్ అండ్ చాంబర్ అధ్యక్షుడు కొకొల్లు లక్ష్మణరావు, మండల భాజపా అధ్యక్షుడు కొవ్వూరి రామకష్ణారెడ్డి, రోటరీ సభ్యులు పాల్గొన్నారు. -
కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి
ఏలూరు సిటీ : ఉమ్మడి సర్వీస్ రూల్స్ త్వరలో అందుబాటులోకి వస్తాయని, ఉపాధ్యాయులకు పదోన్నతులు రాబోతున్నాయని, విద్యావ్యవస్థ మరింత మెరుగుపడుతుందని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు తెలిపారు. స్థానిక ఎన్ఆర్ పేటలో పీఆర్టీయూ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్సీ రాము సూర్యారావు పాల్గొన్నారు. శ్రీనివాసులనాయుడు మాట్లాడుతూ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తగ్గించి ఒత్తిడి లేకుండా చేయాలని కోరారు. అనవసర పనిభారాన్ని తగ్గించి విద్యాబోధనపై దృష్టిసారించేలా ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలన్నారు. ఏలూరు నగర పాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ గతేడాది లాగే ఈ ఏడాది కూడా నూరు శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల ఉపాధ్యాయులకు నగదు అవార్డులు బహూకరిస్తామని తెలిపారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మత్తె కమలాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరాజు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకటేశ్వరరావు, కేవీవీ సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శులు పి.ఆంజనేయులు, ఏవీ కాంతారావు, కె.కృష్ణకుమార్ పాల్గొన్నారు. -
నేత్రపర్వం.. సహస్ర ఘటాభిషేకం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల క్షేత్రపాలకుడు భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో శివదేవునికి ఆదివారం సహస్ర ఘటాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలంటూ ఈ కార్యక్రమాన్ని చినవెంకన్న దేవస్థానం నిర్వహించింది. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మణిక్యాలరావు ఆదేశాల మేరకు ఈనెల 26 నుంచి జరుగుతున్న వరుణ జపాలు ఆదివారం ఆలయంలో జరిగిన విశేష పూజాధి కార్యక్రమాలతో ముగిశాయి. ముందుగా ఆలయ మండపంలో రుద్రాక్ష మండపాన్ని ఏర్పాటు చేసి గంగా, పార్వతీ సమేత శివదేవుని ఉత్సవమూర్తులను ఉంచి విశేష అలంకరణ చేశారు. పక్కన ఋష్యశంగ ప్రధాన మండప దేవుడ్ని ఏర్పాటుచేశారు. అనంతరం దేవతామూర్తుల ముందు 1,296 కలశాలను ఉంచి పూజాధికాలు ప్రారంభించారు. ఆలయ పండితులు, అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ ఋష్యశృంగ సహిత ప్రధాన మండపారాధన, మహన్యాసం, పంచద్రవ్యారాధన, పంచామత స్నపన, దశవిదస్నానాలు, వారుణానువాక శతానువాదం సహిత శతరుద్రాభిషేకాలు చేశారు. తర్వాత మేళతాళాలు, మంగళవాయిద్యాలు, పండితులు, అర్చకుల వేదమంత్రాల నడుమ గర్భాలయంలో కొలువైన శివదేవుని లింగస్వరూపం నీటిలో మునిగే వరకు కలశాల్లోని జలాలతో అభిషేకించారు. అనంతరం ఋష్యశంగ సహిత వరుణ హోమాలు జరిపి, నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించారు. ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు దంపతులు పాల్గొన్నారు. -
దేవాలయాల్లో దొంగలు పడ్డారు
టంగుటూరు(రాజుపాళెం): దేవాలయాల్లో దొంగలు పడ్డారు. ఒకే రోజు మూడు ఆలయాల్లో చోరీ చేశారు. రాజుపాళెం మండలంలోని టంగుటూరులో రామాలయం, గంగమ్మ, వీరభద్ర దేవాలయాల తాళాలను ఆదివారం తెల్లవారుజామున పగులగొట్టి హుండీలను ఎత్తుకెళ్లారు. వాటిని కుందూ నదికి వెళ్లే రస్తాలో పగులగొట్టి అందులో ఉన్న నగదును దోచుకున్నారు. ఆ హుండీలను అక్కడే వదిలేసి వెళ్లారు. కుందూకు వెళ్లే దారిలో గంగమ్మ, వీరభద్రస్వామి దేవాలయాలు ఉన్నాయి. గంగమ్మ దేవాలయంలో తెల్లవారుజామున రెండు గంటల వరకు గ్రామస్తులు భజన కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాతనే ఈ ఘటన జరిగిందని వారు అనుకుంటున్నారు. గ్రామం మధ్యలో రామాలయం ఉంది. ఈ ఆలయాల చుట్టుపక్కల ఇళ్లు ఉన్నాయి. కడప నుంచి క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించారు. సంఘటన స్థలాన్ని ఏఎస్ఐ మూర్తి పరిశీలించారు. ఈ మూడు ఆలయాల్లో కలిపి మొత్తం రూ.9 వేల వరకు దోచుకెళ్లినట్లు రామాంజనేయులరెడ్డి, నరసింహుడు, రాముడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. దేవాలయాలే టార్గెట్ ఇటీవల వరుసగా జరుగుతున్న చోరీలను పరిశీలిస్తే.. దొంగలు దేవాలయాలను లక్ష్యంగా ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. జిల్లాలో వీరపునాయినిపల్లె మండలంలోని అనిమెల సంగమేశ్వర ఆలయం, రాజుపాళెంలోని శివాలయం, వెల్లాలలోని శివాలయాల్లో ఇటీవల దొంగతనాలు జరిగాయి. వెల్లాలలోని శ్రీచెన్నకేశవ స్వామి ఆలయంలో హుండీ ఎంత సేపటికి తెరుచుకోక పోవడంతో దొంగలు వెనుతిరిగారు. సీసీ కెమెరాల్లో వారి చిత్రాలు నిక్షిప్తమయ్యాయి. దొంగల ఆచూకీపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచకపోతే మరికొన్ని దేవాలయాల్లో జరిగే అవకాశం ఉందని భక్తులు పేర్కొంటున్నారు. ఎక్కువగా గ్రామాల్లోనే జరుగుతున్నాయి. రాత్రి వేళలో పోలీసులు గస్తీని ముమ్మరం చేయాలని వారు కోరుతున్నారు. -
నేడు జిల్లాకు సీఎం రాక
–వి కోట మండలంలో రెయిన్ గన్స్ వినియోగం పరిశీలన –సాయంత్రం బస్టాండులో బహిరంగ సభ –అధికారులు ఏర్పాట్లు పూర్తి చిత్తూరు (కలెక్టరేట్) వి కోట: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం జిల్లాకు రానున్నారు. జిల్లా కలెక్టర్ సిద్దార్థ్‌జైన్ శనివారం ఓ ప్రకటనలో ఈవిషయం తెలిపారు. మధ్యాహ్నం 1.15 గంటలకు అనంతపురం జిల్లా నుంచి సీఎం హెలికాప్టర్లో బయలుదేరి 2 గంటలకు రామకుప్పం మండలం మిట్టపల్లికి చేరుకుంటారు. అక్కడ నుంచి వి కోట మండలం కె.పత్తూరు గ్రామం చేరుకుని బెండుగాని చెరువు పరిధిలో నీరు – చెట్టు, పంటసంజీవని పనులు పరిశీలిస్తారు. 2.25 గంటలకు రెయిన్‌గన్స్ ద్వారా పంటను తడపడం చూస్తారు. పంట సంజీవని వినియోగాన్ని పరిశీలిస్తారు. 3.05 గంటలకు గుమ్మిరెడ్డిపల్లెకు చేరుకుని వేరుశనగ పంటలో బిందు సాగునీటి పద్ధతిని పరిశీలిస్తారు. 3.25 గంటలకు సీఎం బైరుపల్లెలో రెయిన్‌గన్స్ ఉపయోగాన్ని పరిశీలించనున్నారు. 3.35 గంటలకు అదే గ్రామంలో ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలించి, రైతులతో చర్చిస్తారు. 3.55 గంటలకు వి.కోట ఆర్టీసీ బస్టాండు జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత హెలికాఫ్టరులో విజయవాడ వెళతారు. సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. హెలీపాడ్‌ను ఆయన పరిశీలించారు. బందోబస్తుకోసం వచ్చిన పోలీసులకు డ్యూటీలను కేటాయించారు. -
గోదావరిలో పడి విద్యార్థి మృతి
ఆత్రేయపురం : అదుపుతప్పిన విద్యార్థి ఆదివారం సాయంత్రం గౌతమీ గోదావరిలో పడి మరణించాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఆత్రేయపురం గ్రామ శివారు నరసన్నపేటకు చెందిన అంగాని మణికంఠ(16) స్థానిక మహాత్మాగాంధీ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం అతడు గోదావరి వద్ద బహిర్భూమికి వెళ్లాడు. అదుపుతప్పి కాలు జారడంతో గోదావరిలో పడి గల్లంతయ్యాడు. మత్స్యకారుల సహకారంతో అతడి కోసం గాలించగా, అదే ప్రాంతంలో మణికంఠ మృతదేహం లభ్యమైంది. అతడి తల్లిదండ్రులు అంగాని సత్తిపండు, సత్తెమ్మకు ఇద్దరు కుమార్తెలు కాగా, మణికంఠ ఏకైక కుమారుడు. స్నానానికి వెళ్లి వృద్ధురాలు.. సీతానగరం : ముగ్గళ్ల ఘాట్ వద్ద గోదావరి నదిలో పడి ఓ వృద్ధురాలు మరణించింది. వివరాల్లోకి వెళితే.. రఘుదేవపురం పంచాయతీ రాపాకకు చెందిన చిలుకోటి మాణిక్యం(మణెమ్మ)(62) ఆదివారం ముగ్గళ్ల ఘాట్ వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లింది. నదీ ప్రవాహం కారణంగా ఆమె నీటిలో మునిగిపోయింది. స్థానికులు గమనించి ఆమెను ఒడ్డుకు చేర్చారు. కొనఊపిరితో ఉన్న మాణిక్యం ఘాట్‌లోనే కొద్దిసేపటికి మరణించింది. ఆమె భర్త సన్యాసిరావు, పెళ్లయిన కుమార్తె దుర్గ, కుమారుడు శ్రీనివాస్ విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. దీనిపై ఎటువంటి సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు. -
వావ్...కొత్తపల్లి జలపాతం
జి.మాడుగుల: మండలంలో కొత్తపల్లి గ్రామంలోని జలపాతాలకు పలు ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటకులతో ఆదివారం కిక్కిరిసింది. జలపాతాల ప్రాంతాల్లో ప్రభుత్వం తగిన వసతుల ఏర్పాట్లు చేయటంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. జిల్లా నుండి ఇతర జిల్లాల నుండి పర్యాటకులు కుటుంబాలుతో వచ్చి జలకాలాడి రోజుంతా ఆనందంగా గడిపారు. -
ఆక్వాఫుడ్ పార్క్‌పై తుదిపోరుకు సిద్ధంకండి
భీమవరం అర్బన్ : భీమవరం మండలంలోని తుందుర్రు, కంసాల బేతపూడి, జొన్నలగరువు గ్రామాల మధ్య నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా తుది పోరాటానికి సిద్ధం కావాలని పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. భీమవరం మండలంలోని గోదావరి మెగా ఫుడ్ పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాట కమిటీ నాయకులు ఆదివారం జొన్నలగరువు, పెదగరువు, వెంప, కోమటితిప్ప, మత్స్యపురి, మొగల్తూరు మండలంలోని కొత్తోట, వారతిప్ప, శేరేపాలెం గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు సముద్రాల వెంకటేశ్వరరావు, ముచ్చర్ల త్రిమూర్తులు, ఆరేటి వాసు, జవ్వాతి సత్యనారాయణ, తాడి దానియేలు, నన్నేటి నాగరాజు మాట్లాడుతూ ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజల్ని తుది పోరాటానికి సిద్ధం చేసేందుకు ఈ బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. పార్కు యాజమాన్యం ప్రభుత్వ అండ చూసుకుని గ్రామాల ప్రజల్ని కులాల తత్వం తీసుకువచ్చి గ్రూపులు విడదీసి వారి చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తుందని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజలపై తప్పుడు కేసులు పెట్టించి ఫుడ్‌పార్కు నిర్మాణాన్ని చేపట్టడం శోచనీయమన్నారు. ఈ తుది పోరాటానికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమానికి పోరాట కమిటీ నాయకులు బెల్లం సత్తిబాబు, కొత్తపల్లి కాశీవిశ్వనాథం, విమల, చంటిరాజు, రమేష్, మద్దా రాజారత్నం, చీడే భాస్కరరావు, చింతారావు పాల్గొన్నారు. -
పెళ్లికారుకు ప్రమాదం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల క్షేత్రం నుంచి విజయవాడ వెళుతున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న డ్రెయినేజీలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అద్దాలు పగులగొట్టుకుని బయటకు వచ్చారు. ఆదివారం వేకువజామున ద్వారకాతిరుమల కుంకుళ్లమ్మ ఆలయ సమీపంలో ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. విజయవాడకు చెందిన ముగ్గురు క్షేత్రంలో ఓ పెళ్లి ఏర్పాట్లు నిమిత్తం శనివారం రాత్రి శేషాచలకొండపైకి చేరుకున్నారు. ఏర్పాట్ల అనంతరం విజయవాడకు తమ కారులో తిరుగు ప్రయాణమయ్యారు. అయితే సంఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి మలుపులో ఉన్న రోడ్డుమధ్యలోని డివైడర్‌ను కారు ఢీకొట్టింది. దీంతో కారు డ్రెయినేజీలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. -
తీరంలో యువత సందడి
బీచ్‌రోడ్: సాగర తీరంలో ఆదివారం ఒకటే సందడి. యూత్ అంతా వాలిపోయింది.. గత రెండు రోజులుగా నగరం చాలావేడిగా ఉండటంతో సాయంత్రం వేళ ప్రజలంతా బీచ్‌వైపు పరుగులు తీశారు. బీచ్‌లో వైఫై ఫ్రీ కావడంతో స్మార్ట్ ఫోన్లు చేతపట్టి యువతీయువకులంతా ఎంజాయ్ చేశారు. -
‘దేశం మారిందోయ్’ సినిమా షూటింగ్
పాలకొల్లు అర్బన్ : లక్ష్మీ చిత్రాలయ ప్రొడక్షన్ నెం.1 దేశం మారిందోయ్ చిత్రానికి సంబంధించి సన్నివేశాలను స్థానిక కృష్ణాజీ మల్టీప్లెక్స్‌లోనూ, మెయిన్‌రోడ్డులో ఆదివారం దర్శకుడు ఈశ్వరప్రసాద్ చిత్రీకరించారు. నలుగురు హీరోలు, నలుగురు హీరోయిన్లతో పాటు 105 పాత్రలున్న ఈ చిత్రంలో సగంమందికి పైగా నూతన నటీనటులే అని చెప్పారు. యముడు, మానవుడికి మధ్య జరిగే ఆసక్తికర సన్నివేశాలను ఈ నెల 27 నుంచి చిత్రీకరించనున్నట్టు తెలిపారు. దీనికోసం రూ.2 లక్షలతో కృష్ణాజీ మల్టీప్లెక్స్‌లో యమలోకం సెట్టింగ్ వేస్తున్నట్టు చెప్పారు. అలాగే వచ్చే నెల 4వ తేదీ నుంచి ఫిల్మ్ అండ్ యాక్టింగ్ స్కూల్ శిక్షణ తరగతులను స్థానికంగా ప్రారంభిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు. కవురు రాంబాబు, కుక్కల అజయ్‌కుమార్, కవురు సత్యనారాయణ (గాంధీ), కడలి వెంకట నరసింహరావు, కడలి కృష్ణారావు, చిరంజీవి పాల్గొన్నారు. -
మావుళ్లమ్మ సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
భీమవరం: పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మవారిని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి పి.శివశంకరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ ఉప ప్రధానఅర్చకుడు మద్దిరాల మల్లికార్జునశర్మ, అధికారులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి న్యాయమూర్తి శివశంకరరావుకు జ్ఞాపికను అందజేశారు. పట్టణానికి చెందిన పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ నేతల దౌర్జన్యం
-
మార్కెట్‌ను ముంచెత్తిన బీరకాయలు
తాడేపల్లిగూడెం : బీరకాయలు మార్కెట్‌ను ముంచెత్తాయి. దీంతో ధర బాగా తగ్గింది. ఆదివారం తాడేపల్లిగూడెం మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. వారం రోజుల క్రితం కిలో రూ.40 పలికిన బీరకాయలు కిలో రూ.20కి పడిపోయింది. నాసిరకం బీరకాయలు కిలో రూ.8కే లభించాయి. బెండకాయలు కిలో రూ. 12 , దొండకాయలు రూ.24కి అమ్మారు. క్యాబేజీ, దోసకాయలు కిలో రూ.12, కంద కిలో రూ.24కి అమ్మారు. టమాటాలు కిలో రూ.12, బీట్రూట్ కిలో రూ.24కు లభించింది. క్యాప్సికం కిలో రూ.120, బీన్స్ కిలో రూ.80కి విక్రయించారు. కీరా కిలో రూ.32, నాటురకం చిక్కుడుకాయలు కిలో రూ.80, ఇతర రకం చిక్కుడుకాయలు కిలో రూ.16కు లభించాయి. గోరు చిక్కుళ్లు రూ.24, క్యారట్ రూ.40కి విక్రయించారు. తెల్ల వంకాయలు రూ.40, నల్ల వంకాయలు రూ.30కి లభ్యమయ్యాయి. ఉల్లిపాయలు నాలుగు కిలోలు రూ.50కే అమ్మారు. కర్నూలు నుంచి కొత్త ఉల్లిపాయలు వచ్చాయి. 40 లారీల సరుకు వచ్చింది. గుత్తగా క్వింటాలు రూ.400 నుంచి రూ.850 చేసి అమ్మకాలు సాగించారు. పాతరకం మహారాష్ట్ర ఉల్లిపాయలు కిలో రూ.16 చేసి విక్రయించారు. గుత్తగా క్వింటాల్ ఈ రకం ఉల్లిపాయలు రూ. 600 నుంచి రూ.1,200 విక్రయించారు. బంగాళాదుంపలు కిలో రూ.24 పలికాయి. -
పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లి టీడీపీ నేతల దౌర్జన్యం
కడప అర్బన్ : జిల్లాలోని ఒంటిమిట్ట పోలీస్‌స్టేషన్‌కు టీడీపీ నేతలు ఆదివారం వెళ్లి అక్కడి పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. ఒంటిమిట్ట మండలం నరవకాటిపల్లెకు చెందిన హరికృష్ణారెడ్డి, వెంకట సుబ్బమ్మ, శంకర్‌రెడ్డిపై టీడీపీకి చెందిన బ్రహ్మానందరెడ్డి, మరి కొంత మంది దాడి చేసి శనివారం రాత్రి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటనలో బాధితుల ఫిర్యాదు స్వీకరించినప్పటికీ టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు పై ముగ్గురితోపాటు మరో ఇద్దరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. టీడీపీ వర్గీయులపై కేవలం ఘర్షణ కేసు నమోదు చేశారు. ఈ కేసును కూడా ఎందుకు నమోదు చేస్తారని టీడీపీ నేతలు పోలీసుస్టేషన్‌పైకి వెళ్లి అక్కడ సెంట్రీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్, ఇతర సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటన పోలీసు వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పోలీసులు సంఘటనలపై స్పందించే తీరు ఆరోపణలకు తావిస్తోంది. ఒక వైపు హత్యాయత్నం కేసులు, మరోవైపు ఘర్షణ కేసు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ టీడీపీ నేతలు పోలీసుస్టేషన్ పైనే దౌర్జన్యానికి పాల్పడటం గమనార్హం. ఈ సంఘటనపై పోలీసు అధికారులు ప్రత్యేకంగా విచారణ చేసి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
సీపీఎస్ రద్దు కోరుతూ కోటి సంతకాల సేకరణ
భీమవరం : సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో ఆదివారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టిఎఫ్ఐ) పిలుపు మేరకు చేపట్టిన ఈ సంతకాల సేకరణను యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపీమూర్తి తొలి సంతకం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్ రద్దు కోసం ఎస్టీఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే పోరాటాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 29న చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భీమవరం డివిజన్ ఎన్జీవో సంఘ అధ్యక్షుడు కె.కామరాజు మాట్లాడుతూ సీపీఎస్ వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఈ ఉద్యమానికి అన్ని సంఘాలు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సీహెచ్ పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శి పి.సీతారామరాజు, ఎంఐ విజయ్‌కుమార్, పి.శ్రీనివాసరాజు, కె.సాయిరామ్, పీఎస్ విజయరామరాజు, జి.సుధాకర్, రవిచంద్రకుమార్, మల్లుల శ్రీనివాస్, ఆర్.శర్మ, రాజేష్ కుమార్, రవిచంద్రకుమార్ పాల్గొన్నారు. -
భక్తుల సందడి
ఝరాసంగం రూరల్: కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు రాకతో ఆలయ ప్రాంగణం పోటేత్తింది. ఆదివారం సెలవు రోజు శ్రావణ మాసం కావడంతో వివిధ రాష్ట్రాలనుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. భక్తులు వేకువ జమునుంచే దర్శననికి బారులుతీరారు. అమృతగుండంలో పుణ్యస్నానాలు చేసి జలలింగానికి పూజలు చేశారు. అనంతరం పార్వతి సమేత సంగమేశ్వర స్వామిని దర్శించకుని మొక్కలు తీర్చుకున్నారు. శ్రావాణ మాసం పురస్కరించుకు దంపతులు ఆలయ హోమ మండపంలో నిర్వహించిన సామూహిక అభిషేకాల్లో పాల్గొని పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో పంచాయతుల మందిరం, బసవణ్ణ మందిరం, కాశీబాబా మఠం, బలభీముని ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.