చినవెంకన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి | chiina venkanna sevalo high court justice | Sakshi

చినవెంకన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి

Sep 4 2016 7:06 PM | Updated on Sep 4 2017 12:18 PM

చినవెంకన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి

చినవెంకన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్‌ ఆకుల వెంకట శేషసాయి ఆదివారం సందర్శించారు.

ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్‌ ఆకుల వెంకట శేషసాయి ఆదివారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు. ఆ తరువాత ఆలయ ఏఈవో కర్రా శ్రీనివాసరావు న్యాయమూర్తికి చినవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట భీమడోలు కోర్టు న్యాయమూర్తి ఎస్‌.వెంకటేశ్వరరెడ్డి, ఏలూరు కోర్టు ఎక్సైజ్‌ మెజిస్ట్రేట్‌ తిరుమలరావు, భీమడోలు సీఐ ఎం.వెంకటేశ్వరరావు తదితరులున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement