పెళ్లికారుకు ప్రమాదం | ACCIDENT TO MARRIAGE CAR | Sakshi

పెళ్లికారుకు ప్రమాదం

Aug 21 2016 10:00 PM | Updated on Sep 4 2017 10:16 AM

పెళ్లికారుకు ప్రమాదం

పెళ్లికారుకు ప్రమాదం

పెళ్లి ఏర్పాట్ల నిమిత్తం వెళుతున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల  క్షేత్రం నుంచి విజయవాడ వెళుతున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న డ్రెయినేజీలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అద్దాలు పగులగొట్టుకుని బయటకు వచ్చారు. ఆదివారం వేకువజామున ద్వారకాతిరుమల కుంకుళ్లమ్మ ఆలయ సమీపంలో ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. విజయవాడకు చెందిన ముగ్గురు క్షేత్రంలో ఓ పెళ్లి ఏర్పాట్లు నిమిత్తం శనివారం రాత్రి శేషాచలకొండపైకి చేరుకున్నారు.

ఏర్పాట్ల అనంతరం విజయవాడకు తమ కారులో తిరుగు ప్రయాణమయ్యారు. అయితే సంఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి మలుపులో ఉన్న రోడ్డుమధ్యలోని డివైడర్‌ను కారు ఢీకొట్టింది. దీంతో కారు డ్రెయినేజీలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement