శ్రీవారి సేవలో మంత్రి కొల్లు | srivari sevalo minister kollu | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో మంత్రి కొల్లు

Published Sun, Sep 4 2016 7:03 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

శ్రీవారి సేవలో మంత్రి కొల్లు

శ్రీవారి సేవలో మంత్రి కొల్లు

ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ప్రదక్షిణలు నిర్వహించిన అనంతరం శ్రీవారిని, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తరువాత ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు. అనంతరం ఆలయ ఏఈవో కర్రా శ్రీనివాసరావు ఆయనకు శ్రీవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, టీడీపీ నాయకులు సుంకవల్లి బ్రహ్మయ్య, సోంబాబు, కూరాకుల బుజ్జి పాల్గొన్నారు. 
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement