అంజన్న సేవలో హైకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్
జంగారెడ్డిగూడెం రూరల్ :జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని ఆదివారం హైకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్ కొక్కుల శ్రీనివాసరావు, ఆయన సతీమణి ఏలూరు–2 అదనపు జిల్లా జడ్జి కొక్కుల సాయి రమాదేవి దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారి సన్నిధిలో పూజల అనంతరం వేద ఆశ్వీరచనాలు అందజేసి, స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. వీరి వెంట జంగారెడ్డిగూడెం జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎంవీఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు.