వైభవంగా ఆంజనేయస్వామి కల్యాణం | hanuman kalayanam | Sakshi
Sakshi News home page

వైభవంగా ఆంజనేయస్వామి కల్యాణం

Published Sun, Jul 24 2016 10:40 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

వైభవంగా ఆంజనేయస్వామి కల్యాణం

వైభవంగా ఆంజనేయస్వామి కల్యాణం

ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) :హేలాపురి బ్రాహ్మణ యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం నుంచి ప్రారంభమైన శ్రీ నవగ్రహ పాశుపత సహిత రుద్రయాగంలో భాగంగా ఆదివారం శ్రీ సువర్చలా సమేత శ్రీ ఆంజనేయ స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం సూర్యగ్రహ శాంతి యాగం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. స్థానిక అగ్రహారంలోని పేరయ్య కోనేరు ప్రాంగణంలో ఉదయం 8 గంటలకు గణపతి పూజ, గోపూజ, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహవనం పూజలు నిర్వహించారు. అనంతరం సూర్యగ్రహ జప, తర్పణ, అభిషేక, అర్చన, సూర్యగ్రహ మహాసౌర, అరుణ హోమం, అనంతరం సూర్య నమస్కారాలు కార్యక్రమాలు జరిపారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి కల్యాణం అనంతరం రాత్రి 8.30 గంటలకు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి చతుర్వేద స్వస్తి పలికారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. చెరుకుపల్లి విశ్వనాథ శర్మ బ్రహ్మత్వంలో నిర్వహించిన యాగ కార్యక్రమాలను హేలాపురి బ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెంపటి శ్రీరామ రవికుమార్‌ శర్మ, నండూరి రాఘవ శర్మ పర్యవేక్షించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement