special pooja
-
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నేతల ప్రత్యేక పూజలు
-
లడ్డూ పాపం చంద్రబాబుదే
-
రుషికొండలో గుడివాడ అమర్నాథ్, వరుదు కల్యాణి ప్రత్యేక పూజలు..
-
Watch Live: చంద్రబాబు పాపానికి ప్రక్షాళనకు రాష్ట్రం వ్యాప్తంగా ప్రత్యేక పూజలు
-
ప్రత్యేక పూజలో పాల్గొన్న అంబటి రాంబాబు..
-
చంద్రబాబు పాపాలను కడగాలి
-
సైకాలజీ చదివిన బ్యూటీ.. ప్రత్యేక పూజలు ఎందుకు చేయించుకున్నట్లో? (ఫోటోలు)
-
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు
జగిత్యాల, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఉదయం రోడ్డు మార్గంలో గట్టుకు చేరుకున్న ఆయనకు.. ఆలయ పూజారులు సాదరంగా స్వాగతం పలికారు. పవన్‌కు కొండగట్టు ఆలయం మొదటి నుంచి ఒక సెంటిమెంట్‌గా ఉంది. ఎన్నికల ప్రచారానికి ముందు కూడా ఆయన ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.అంతకు ముందు తుర్కపల్లి దగ్గర బీజేపీ-జనసేన శ్రేణులు ఆయనకు స్వాగతం పలికాయి. ఆ సమయంలో కారుపైకి అభివాదం చేసిన ఆయన.. తెలంగాణలో రెండు పార్టీల పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
Anasuya Bharadwaj Photos: ఇంట్లో పూజ చేయించిన యాంకర్ అనసూయ (ఫొటోలు)
-
విశాఖ: రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్ పూజలు
CM Jagan Vizag Tour Updates విశాఖలో సీఎం జగన్ శారదా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ శారదా పీఠంలో రాజశ్యామల యాగం పూర్ణాహుతి మన్యుసుక్త హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్ ప్రత్యేక పూజలు ►రాజ్యశ్యామల అమ్మవారి యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీ శారద స్వరూప రాజ్యశ్యామల అమ్మవారి ఉత్సవ విగ్రహాలను దర్శించుకున్న సీఎం జగన్మోహన్రెడ్డి రాజ శ్యామల అమ్మవారి దీక్ష పీఠం వద్ద పూజలో పాల్గొన్న సీఎం జగన్ శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తో కలిసి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి వన దుర్గ అమ్మవారిని దర్శించుకున్న సీఎం జగన్ ► శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ ► శారదా పీఠంలో రాజశ్యామల యాగం పూర్ణాహుతి ►పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ శారదా పీఠంలో సీఎం జగన్‌కు సాదర స్వాగతం ► శారదాపీఠంలో ఉత్తరాధికారి స్వాత్మానందం సరస్వతి... పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతిలను కలిసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి శారదా పీఠంలో సీఎం జగన్ శారదాపీఠం చేరుకున్న సీఎం జగన్మోహన్రెడ్డి స్వాగతం పలికిన మంత్రులు బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్,. వెస్ట్ ఇంచార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ విశాఖ విమానాశ్రయం నుంచి శారదా పీఠానికి బయలుదేరిన సీఎం జగన్మోహన్ రెడ్డి వేపగుంట జంక్షన్ దాటిన సీఎం కాన్వాయ్ కాసేపట్లో శారదా పీఠానికి చేరుకుని వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్ విశాఖ చేరుకున్న సీఎం జగన్ ►కాసేపట్లో రోడ్డు మార్గం గుండా చినముషిడివాలోని శ్రీశారదా పీఠానికి.. ►పీఠం వారికోత్సవ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్ ►అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం జగన్ ►పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి పీఠంలోని దేవతామూర్తులకు సీఎం జగన్ ప్రత్యేక పూజలు ►రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొననున్న సీఎం జగన్ ►దాదాపు గంట పాటు పీఠంలోని పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం జగన్ -
దైవసన్నిధిలో హీరో ప్రభాస్.. స్పెషల్ పూజలు కూడా (ఫొటోలు)
-
Nayanthara - Vignesh Shivan: న్యూబిగినింగ్స్ అంటూ నయనతార దంపతుల పూజలు! (ఫోటోలు)
-
సిద్దిపేటలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు
-
రేపు కోనాయిపల్లికి సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రేపు సిద్ధిపేటకు వెళ్లనున్నారు. అక్కడి కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఎన్నికల్లో నామినేషన్లు వేసే ముందు ప్రతిసారి కేసీఆర్ ఈ ఆలయంలో పూజలు చేస్తూ వస్తున్నారు. అయితే.. ఈసారి వరుస బీఆర్ఎస్ సభలు.. మధ్యలో యాగం, సమయాభావ పరిస్థితులు, పైగా రేపు శనివారం కావడంతో ఈసారి ముందుగానే ఈ ఆలయంలో పూజలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల9వ తేదీన గజ్వేల్‌తో పాటు కామారెడ్డి లోనూ కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. అదే రోజు సాయంత్రం కామారెడ్డి బీఆర్ఎస్ ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం లోని కోనాయిపల్లి గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. కేసీఆర్‌కు ఇది సెంటిమెంట్ దేవాలయం. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్కడ పూజలు చేసిన తర్వాతే నామినేషన్ వేస్తారు. 1985లో మొదటిసారి సిద్ధిపేట ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లలో జరిగిన ఎన్నికల సమయంలో.. ఈ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించి, నామినేషన్ వేశారు. అన్ని సందర్భాల్లో ఆయన విజయం సాధించారు. మరో విశేషం ఏంటంటే.. 2001లో టీడీపీకి, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి, ఆపై ఈ ఆలయంలోనే పూజలు చేసి టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీ ప్రకటన చేశారాయన. -
రెండో రోజు ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేక పూజలు
-
తిరుమల : అంగరంగ వైభవంగా పుష్పపల్లకీ సేవ (ఫోటోలు)
-
తిరుమలలో నేడు ఆణివార ఆస్థానం
సాక్షి, తిరుపతి: తిరుమలలో ఇవాళ(సోమవారం, జులై 17) శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం జరగనుంది. ఈ నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను సైతం రద్దు చేసింది. ఇక సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా.. బంగారం వాకిలిలో ఆస్థానం నిర్వహిస్తారు అర్చకులు. ఆపై స్వామివారికి రూపాయి హారతి ఇస్తారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పుష్ప పల్లకిలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు. సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినానికి శ్రీవారి ఆలయం ఇప్పటికే ముస్తాబయ్యింది. ఉదయం బంగారువాకిలి ముందు ఘంటా మండపంలో ఉభయదేవేరుల సమేతంగా మలయప్పస్వామివారు గరుత్మంతుడికి అభిముఖంగా, మరో పీఠంపై స్వామివారి విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేయనున్నారు. ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించనున్నారు. ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. గతంలో ఆణివార ఆస్థానం రోజు నుండి శ్రీవారి ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యేది. అయితే టీటీడీ ఏర్పడ్డాక ఏప్రిల్ నుండి ఆదాయ వ్యయాలు అనుసరిస్తూ వస్తోంది. జియ్యంగార్ల వస్త్ర సమర్పణ తిరుమల పెద జియ్యర్ స్వామి వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేస్తారు. వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరిస్తారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరిస్తారు. ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో ‘పరివట్టం’ కట్టుకొని బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్యైశ్వర్యోభవ అని స్వామిని ఆశీర్వదిస్తారు. భక్తులకు శుభవార్త భక్తుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించి రూ.300 దర్శన టికెట్లను రోజుకు 4వేలు చొప్పున అదనంగా విడుదల చేస్తామని, ఇప్పటికే రోజుకు 20వేల టికెట్లను కేటాయించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణకు నిబంధనల ప్రకారమే శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇదీ చదవండి: వాళ్లకు డబ్బులు ఇవ్వకండి.. భక్తులకు ఈవో సూచన -
Anchor Suma: భర్తతో కలిసి లక్ష్మీ పూజలో పాల్గొన్న సుమ (ఫొటోలు)
Anchor Suma: భర్తతో కలిసి లక్ష్మీ పూజలో పాల్గొన్న సుమ (ఫొటోలు) -
సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు
-
హైదరాబాద్: పంజాగుట్ట సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు
-
విశాఖలో గురు పౌర్ణమి ప్రత్యేక పూజలు
-
తిరుత్తణి ఆలయంలో కేతిరెడ్డి పూజలు
సాక్షి, చెన్నై: పది నెలల పాలనలోనే.. పదేళ్ల ప్రగతి ముఖ్యమంత్రి అనే నినాదంతో సీఎం స్టాలిన్ పరిపాలనను కీర్తిస్తూ తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి తిరుత్తణి సుబ్రమణ్య స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి బంగారు రథాన్ని లాగారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంచిపెట్టారు. వెంకటేశ్ నాయుడు, భూపతి, దేవయ్య లింగయ్య తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం తమిళనాడును అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి నిరంతర కృషి చేస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తమిళనాడు రాష్టం రాబోయే కాలంలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కలిసి.. తమిళనాడులో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో 40కి 40 స్థానాల్లో స్టాలిన్‌ను గెలిపించాలన్నారు. సీఎం స్టాలిన్‌ను దేశానికి ప్రధానిని చేసి దక్షిణాది నాయకత్వంలో దేశాన్ని ముందుకు తీసుకొనే ప్రయత్నం చేయాలని కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఆకాంక్షించారు. -
జాతర సందడిలో తంత్రగాళ్ల ప్రత్యేక పూజలు
-
50 రకాల వంటకాలతో పునీత్‌కు పాలశాస్త్రం పూజలు
బెంగళూరు: పునీత్ రాజ్‌కుమార్ సమాధికి కుటుంబ సభ్యులు ఐదు రోజుల పాలశాస్త్రం పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కంఠీరవ స్టూడియోలోని పునీత్ సమాధి వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు ఆయన ఇష్టపడే ఇడ్లి, రాగిముద్ద, నాటుకోడి సాంబారుతో పాటు 50 రకాల వంటకాలను సమాధిపై పెట్టి పూజలు చేశారు. భార్య అశ్విని, కూతుర్లు ధృతి, వందితా, అన్నలు శివరాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులు, మంత్రి గోపాలయ్య పాల్గొన్నారు. తమిళ నటుడు పరామర్శ: తమిళ నటుడు శివ కార్తికేయన్ మంగళవారం బెంగళూరు నాగవారలోని శివరాజ్‌కుమార్ నివాసానికి వెళ్లారు. భార్య, కూతుర్లను పరామర్శించి, కంఠీవర స్టూడియోకు వెళ్లి సమాధికి పూజలు చేశారు. నేటి నుంచి పునీత్ సమాధి దర్శనాలు బనశంకరి: బుధవారం నుంచి పునీత్ రాజ్‌కుమార్ సమాధి దర్శనానికి అవకాశం కల్పిస్తారు. మంగళవారం పునీత్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు పాల పూజల అనంతరం పునీత్ అన్న శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ... అప్పు సమాధి దర్శనానికి బుధవారం నుంచి అభిమానులను అనుమతి ఇస్తామని తెలిపారు. చదవండి: (పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన హీరో నాగార్జున) -
లింబాద్రి గుట్టపై దిల్ రాజు ప్రత్యేక పూజలు
సాక్షి, భీమ్‌గల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మండలంలోని లింబాద్రి గుట్టకు భక్తులు శనివారం పోటెత్తారు. గుట్టపై గల లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఏకాదశి విశిష్ఠ దినం కావడంతో స్వామి వారి దర్శనానికి సుమారు గంటన్నర పాటు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. ప్రముఖ సీనీ నిర్మాత దిల్ రాజు సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి తీర్థ ప్రసాదాలు అందజేసారు.