
సాక్షి, భీమ్‌గల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మండలంలోని లింబాద్రి గుట్టకు భక్తులు శనివారం పోటెత్తారు. గుట్టపై గల లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఏకాదశి విశిష్ఠ దినం కావడంతో స్వామి వారి దర్శనానికి సుమారు గంటన్నర పాటు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. ప్రముఖ సీనీ నిర్మాత దిల్ రాజు సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి తీర్థ ప్రసాదాలు అందజేసారు.
Comments
Please login to add a commentAdd a comment