తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు రద్దయ్యాయి.
తిరుచానూరు : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు రద్దయ్యాయి. స్థానిక సమాజం వీధిలో నివాసముంటున్న రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కే.రాజాగాంధీ(85) అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతిచెందారు. మాడవీధుల్లో ఎవరైనా మృతి చెందితే ఆలయ నిబంధనల ప్రకారం మృతదేహానికి దహన సంస్కారమయ్యే వరకు అమ్మవారి దర్శనం మినహా నైవేద్యం, పూజలు, ఆర్జిత సేవలు, హారతి, తీర్థం, శఠారీ ఇవ్వకూడదు.
ఈ నేపథ్యంలో దహనసంస్కారాల అనంతరం సాయంత్రం 4.25 గంటలకు ఆలయం, మాఢ వీధుల్లో పుణ్యాహవచనం నిర్వహించి సుప్రభాతం, నిత్య కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం యథావిధిగా పూజలను కొనసాగించారు.