
హీరోయిన్ తమన్నా (Tamannaah Bhatia) ఇంట్లో మాతా కీ చౌకీ నిర్వహించారు. నవరాత్రుల్లో భాగంగా చేసే ఈ పూజ.. ఇప్పుడు తమన్నా ఇంట్లో జరిగింది. పూజ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి తమన్నా సంప్రదాయ డ్యాన్స్ కూడా చేయడం విశేషం.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్ పేరు మార్చుకోబోతున్నాడా?)
ఈ మొత్తం పూజకు సంబంధించిన వీడియోని తమన్నా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వేడుకకు బాలీవుడ్ యువ నటి రషా తడానీ (Rasha Thadani) కూడా హాజరైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్నిరోజుల క్రితం విజయ్ వర్మతో (Vijay Verma) తమన్నాకు బ్రేకప్ అయిందనే రూమర్స్ వినిపించాయి.
ఇప్పుడు తమన్నా ఇంట్లో చేసిన పూజ కార్యక్రమంలో విజయ్ కనిపించకపోవడంతో బ్రేకప్ పై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లే. సినిమాల విషయానికొస్తే ఓదెల 2 (Odela 2 Movie) అనే తెలుగు సినిమాలో తమన్నా ప్రధాన పాత్ర పోషించింది. ఇది మరికొన్నిరోజుల్లో థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?)