తమన్నా-విజయ్ వర్మ ప్రేమ.. ఏకంగా 5000 ఫొటోలు! | Vijay Varma Comments On Relation With Tamannaah Bhatia | Sakshi
Sakshi News home page

Vijay Varma: దానిని దాచి ఉంచాల్సిన అవసరం లేదు

Published Wed, Aug 28 2024 3:41 PM | Last Updated on Wed, Aug 28 2024 3:49 PM

Vijay Varma Comments On Relation With Tamannaah Bhatia

తమన్నా హీరోయిన్‌గా తెలుగులో చాలా ఫేమస్. బోలెడన్ని సినిమాలు చేసింది. అడపాదడపా స్పెషల్ సాంగ్స్‌లోనూ నర్తించింది. ఇప్పటికీ సినిమాలు-వెబ్ సిరీసులు అని బిజీగా ఉన్న తమన్నా.. నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. అప్పుడప్పుడు వీళ్ల జంటగా కనిపించడం లేటు. ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి విజయ్ వర్మ.. తమన్నాతో తన ప్రేమ గురించి, ప్రైవసీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'బంధమేదైనా సరే ఇద్దరు కలిసి సమయాన్ని గడుపుతూ, ప్రేమలో ఉన్నప్పుడు దాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో మా ఇద్దరు ఆలోచనలు ఒకటే. రిలేషన్‌షిప్‌ని దాచడం అంత తేలిక కాదు. ఒకవేళ దాస్తే కలిసి బయటకు వెళ్లడానికి, ఫొటోలు తీసుకోవడానికి అస్సలు వీలుపడదు. ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేయడం నాకు నచ్చదు. మా బంధం గురించి పబ్లిక్‌గా చెప్పినప్పటికీ కొన్ని రహస్యంగానే ఉంచాం'

(ఇదీ చదవండి: సీరియల్ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం.. సీసీటీవీ వీడియో)

'నా దగ్గర మేం తీసుకున్న ఫొటోలు 5000కి పైగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడా వీటిని షేర్ చేయలేదు. అవి మాకు మాత్రమే చెందినవి. ఈరోజుల్లో పక‍్కనోళ్ల జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రతిఒక్కరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఎదుటోళ్ల రిలేషన్‌షిప్ గురించి మాట్లాడుకుంటారు. ఇదో రోగంలా అయిపోయింది. కాబట్టి దాన్ని నేను మార్చలేను' అని విజయ్ వర్మ చెప్పుకొచ్చాడు.

'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ కోసం తొలిసారి కలిసి పనిచేసిన విజయ్ వర్మ-తమన్నా.. షూటింగ్ టైంలో ప్రేమలో పడ్డారు. కలిసున్న ఫొటోలు కొన్ని లీక్ కావడంతో స్వయంగా తమన్నానే రిలేషన్ గురించి బయటపెట్టింది. అప్పటినుంచి పలుమార్లు జంటగా కనిపించారు. మరి నిశ్చితార్థం, పెళ్లి ఎప్పుడనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.

(ఇదీ చదవండి: సినిమా సూపర్ హిట్.. కానీ అద్దె ఇంట్లోకి స్టార్ హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement