సినిమా సూపర్ హిట్.. కానీ అద్దె ఇంట్లోకి స్టార్ హీరోయిన్ | Stree 2 Fame Shraddha Kapoor Rents Hrithik Roshan House In Juhu, Know Reason Inside | Sakshi
Sakshi News home page

Shraddha Kapoor: స్టార్ హీరో ఇంట్లో అద్దెకు ప్రభాస్ హీరోయిన్

Published Wed, Aug 28 2024 12:35 PM | Last Updated on Wed, Aug 28 2024 1:29 PM

Stree 2 Fame Shraddha Kapoor Rent Hrithik Roshan House In Juhu

హీరోహీరోయిన్లు అనగానే.. వాళ్లకేంటి బోలెడన్ని డబ్బులున్నాయని అనుకుంటారు. అది నిజమే కానీ కొందరు హీరోయిన్లు చాలావరకు అద్దెకు ఉంటుంటారు. మన దగ్గర చాలామందికి సొంతిళ్లు ఉంటాయి. బాలీవుడ్‌లో మాత్రం రెంట్ కల్చర్ ఎక్కువే. ఇప్పుడు స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ అదే ఫాలో అయిపోయింది. స్టార్ హీరో ఇంటిని అద్దెకు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: కారు ప్రమాదం.. నెలలోనే కోలుకున్న యంగ్ కమెడియన్)

ప్రభాస్ 'సాహో'లో హీరోయిన్‌గా చేసిన శ్రద్ధా కపూర్.. తాజాగా 'స్త్రీ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ మూవీ ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇదలా పక్కనబెడితే శ్రద్ధా.. ఇప్పుడు ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న హీరో హృతిక్ రోషన్ ఇంటిని అద్దెకు తీసుకునే ప్లాన్‍‌లో ఉందట. బీచ్‌కి ఎదురుగా ఉంటే ఈ బిల్డింగ్‌లో హీరో అక్షయ్ కుమార్ అపార్ట్‌మెంట్ ఉండటం విశేషం.

శ్రద్ధా కపూర్ ఇల్లు మారడానికి కారణం ఉంది. 1987లో శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్.. జుహూలోనే ఓ ఇంటిని కొన్నారు. దాన్ని ఇప్పుడు కాస్త విస్తరించి రీ మోడలింగ్ చేయాలనుకుంటున్నారు. అందుకే వేరే ఇంట్లో కొన్నాళ్ల పాటు అద్దెకు ఉండాలి. అలా ఇప్పుడు హృతిక్ ఇంట్లోకి శ్రద్ధా కపూర్ రానుందనమాట.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌పై నోరుపారేసుకున్న జనసేన ఎమ్మెల్యే)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement