
సాక్షి,పశ్చిమ గోదావరి : స్టార్ హీరో అల్లు అర్జున్‌పై తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నోరు పారేసుకున్నారు. అల్లు అర్జున్ ఏమైనా పుడింగా? నాకు కేవలం మెగా ఫ్యాన్స్ ఉన్నారని మాత్రమే తెలుసు తప్ప అల్లు అర్జున్‌కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారని తెలియదు’ అని వ్యంగ్యంగా మాట్లాడారు.
‘తనకు ఫ్యాన్స్ ఉన్నారని అల్లు అర్జున్ ఊహించుకుంటున్నారు. తన స్థాయి మరచి మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కేవలం హీరో చిరంజీవి వల్లే అల్లు అర్జున్‌ను మెగా అభిమానులు హీరోగా గుర్తించారు’ అని తెలిపారు.
‘అల్లు అర్జున్ తానేదో పుడింగి లాగా ఫీల్ అయి.. ఇష్టం అయితే వస్తా.. లేదంటే లేదు అంటే.. ఇక్కడా బతిమాలాడే వాళ్లు ఎవరూ లేరు. అల్లు అర్జున్ ప్రచారానికి వస్తే ఎంత.. రాకపోతే ఎంత. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలిచింది
తండ్రి అల్లు అరవింద్ ఎంపీగా నిలబడితే గెలిపించలేని అల్లు అర్జున్.. ఇప్పుడు ఇతరులపై విమర్శలు చేయడం ఏంటి? అని అల్లు అర్జున్‌ను మరింత రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment