Bolisetti Srinivas
-
గూడెం ఎమ్మెల్యే మట్టి మాఫియా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మట్టి మాఫియాకు కేంద్రంగా మారింది. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని తాడిపూడి కాల్వ గట్లకు ప్రభుత్వ విప్, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తూట్లు పొడుస్తున్నారు. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వందలాది లారీల మట్టిని స్వాహా చేస్తున్నారు. ఇందులో దాదాపు 300కు పైగా లారీల మట్టితో ఎమ్మెల్యేకు చెందిన స్కూల్ గ్రౌండ్‌ను చదును చేస్తున్నారు. దీని విలువ రూ.1.44 కోట్లు ఉంటుందని అంచనా. నియోజకవర్గంలోని వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట, గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని తెలికిచర్లలో గ్రావెల్ తవ్వకాలకు ఎమ్మెల్యే తెగబడ్డారు. వారం రోజుల క్రితం వరకు జనసేన, టీడీపీ చోటా నేతలు గ్రావెల్ తవ్వకాలు కొనసాగించగా.. ఆ తరువాత ఎమ్మెల్యే బొలిశెట్టి రంగంలోకి దిగి సొంతంగా దందా నిర్వహిస్తున్నారు. జగ్గన్నపేటలో ఉన్న తాడిపూడి గట్లను ఆనవాళ్లు లేకుండా ధ్వంసం చేస్తున్నారు. దీంతోపాటు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వలవల బాబ్జికి గ్రావెల్ వంతు వచ్చింది. సోమవారం నుంచి ఆయనకు చెందిన లేఅవుట్లు, స్థలాలకు జగ్గన్నపేట నుంచే గ్రావెల్ తవ్వకం ప్రారంభమైంది. అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలకు పోలీస్ కౌన్సెలింగ్పార్టీ కోసం తాము తంటాలు పడుతుంటే.. తమ ఊళ్లోకి ఎవరో వచ్చి మట్టి తవ్వకుంటున్నారంటూ జగ్గన్నపేటకు చెందిన ఐదుగురు టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే లారీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే.. అడ్డుకున్న ఐదుగురినీనాలుగు రోజుల నుంచి తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచి పంపుతూ కౌన్సెలింగ్ పేరిట పోలీస్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు.స్పందించని జిల్లా కలెక్టర్ఈ విషయంపై కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఫిర్యాదు చేయడానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ నేత కొట్టు సత్యనారాయణ పలుసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించని పరిస్థితి నెలకొంది. స్థానికులు ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లినా ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. -
ప్రజలు చెప్పుతో కొట్టే రోజు దగ్గరలో ఉంది
-
బొలిశెట్టి నోటి దురుసు.. మళ్లీ అల్లు అర్జున్‌పై కామెంట్స్
పశ్చిమగోదావరి, సాక్షి: తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి తన నోటి దురుసు ప్రదర్శించారు. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ అనుచిత వ్యాఖ్యలు చేసి.. ఆయన అభిమానుల ఆగ్రహానికి గురైన ఈ జనసేన ఎమ్మెల్యే.. మళ్లీ అదే పని చేశారు.‘‘అల్లు అర్జున్ మళ్లీ మాట్లాడితే కౌంటర్ ఇస్తా. నాకు, నా పార్టీతో అల్లు అర్జున్‌కు ఎలాంటి శత్రుత్వం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్‌పై ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. మొన్న ఆయన మాట్లాడితే మాట్లాడాను. మళ్లీ మాట్లాడితే మళ్లీ కౌంటర్ ఇస్తాను’’ అని బొలిశెట్టి మళ్లీ బన్నీ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడారు. అంతకు ముందు.. అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నట్టు నాకు తెలియదు. మెగా కుటుంబం నుంచి విడిపోయి ఎవరైనా ఫ్యాన్స్ బ్రాంచిలు, షామియానా కంపెనీలులాగా పెట్టుకుంటే మేం చెప్పలేం. తనకు ఫ్యాన్స్ ఉన్నారని అల్లు అర్జున్ ఊహించుకుంటున్నారేమో! ఆయన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా మాట్లాడాలి. అలా కాదని.. నేను పెద్ద పుడింగిని, నా కిష్టమైతేనే వస్తా అంటే.. ఎవడికి కావాలి? మానేయ్ వెళ్లిపో.. ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి?.అల్లు అర్జున్ ఏమైనా పుడింగా.. ఆయనకు అసలు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే.. అని ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపాయి. బన్నీ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలను బొలిశెట్టి ఎదుర్కొంటున్నారు. -
స్నేహితుడి కోసం వెళ్లాడు.. అవును అతను పుడింగే..
-
అల్లు అర్జున్ పై నోరు పారేసుకున్న జనసేన MLA బొలిశెట్టి
-
అల్లు అర్జున్ ఏమైనా పుడింగా? అసలు ఫ్యాన్స్ ఉన్నారా?: జనసేన ఎమ్మెల్యే
అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నట్టు నాకు తెలియదు. మెగా కుటుంబం నుంచి విడిపోయి ఎవరైనా ఫ్యాన్స్ బ్రాంచిలు, షామియానా కంపెనీలులాగా పెట్టుకుంటే మేం చెప్పలేం. తనకు ఫ్యాన్స్ ఉన్నారని అల్లు అర్జున్ ఊహించుకుంటున్నారేమో! ఆయన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా మాట్లాడాలి. అలా కాదని.. నేను పెద్ద పుడింగిని, నా కిష్టమైతేనే వస్తా అంటే.. ఎవడికి కావాలి? మానేయ్ వెళ్లిపో.. ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? – జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి తాడేపల్లిగూడెం: ‘అల్లు అర్జున్ ఏమైనా పుడింగా.. ఆయనకు అసలు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే’ అని తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెగా, అల్లు కుటుంబాల మధ్య జరుగుతోన్న వార్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా బొలిశెట్టి స్పందించారు. అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నట్టు తనకు తెలియదన్నారు. మెగా కుటుంబం నుంచి విడిపోయి ఎవరైనా ఫ్యాన్స్ బ్రాంచిలు, షామియానా కంపెనీలులాగా పెట్టుకుంటే మేం చెప్పలేం అని వ్యాఖ్యానించారు. ఉన్నదే మెగా ఫ్యాన్స్, ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అని అంతే తప్ప అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నట్లు తనకు తెలియదన్నారు. తనకు ఫ్యాన్స్ ఉన్నారని అల్లు అర్జున్ ఊహించుకుంటున్నారేమో అని, ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని, జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు. అల్లు అర్జున్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్ అభిమానులు వారి హీరోలను చూసుకుంటున్నారన్నారు. ‘ఆయనను కాదని.. నేను పెద్ద పుడింగిని, నా కిష్టమైతే వస్తా అంటే, మానేయ్ వెళ్లిపో..ఎవడికి కావాలి? అల్లు అర్జున్ను రమ్మని అడిగారా? ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? 21 చోట్ల పోటీ చేస్తే 21 చోట్ల మేం నెగ్గాం’ అని బొలిశెట్టి వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ ఒక చోటకు వెళితే అక్కడ కూడా ఓటమి వచ్చిందన్నారు. అల్లు అర్జున్ తండ్రి ఎంపీగా నిలబడినప్పుడే అర్జున్ నెగ్గించుకోలేకపోయారని, అందరినీ విమర్శించడం మంచిది కాదన్నారు. -
అల్లు అర్జున్‌పై నోరుపారేసుకున్న జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి
సాక్షి,పశ్చిమ గోదావరి : స్టార్ హీరో అల్లు అర్జున్‌పై తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నోరు పారేసుకున్నారు. అల్లు అర్జున్ ఏమైనా పుడింగా? నాకు కేవలం మెగా ఫ్యాన్స్ ఉన్నారని మాత్రమే తెలుసు తప్ప అల్లు అర్జున్‌కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారని తెలియదు’ అని వ్యంగ్యంగా మాట్లాడారు.‘తనకు ఫ్యాన్స్ ఉన్నారని అల్లు అర్జున్ ఊహించుకుంటున్నారు. తన స్థాయి మరచి మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కేవలం హీరో చిరంజీవి వల్లే అల్లు అర్జున్ను మెగా అభిమానులు హీరోగా గుర్తించారు’ అని తెలిపారు. ‘అల్లు అర్జున్ తానేదో పుడింగి లాగా ఫీల్ అయి.. ఇష్టం అయితే వస్తా.. లేదంటే లేదు అంటే.. ఇక్కడా బతిమాలాడే వాళ్లు ఎవరూ లేరు. అల్లు అర్జున్ ప్రచారానికి వస్తే ఎంత.. రాకపోతే ఎంత. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలిచింది తండ్రి అల్లు అరవింద్ ఎంపీగా నిలబడితే గెలిపించలేని అల్లు అర్జున్.. ఇప్పుడు ఇతరులపై విమర్శలు చేయడం ఏంటి? అని అల్లు అర్జున్ను మరింత రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు.