పశ్చిమగోదావరి, సాక్షి: తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి తన నోటి దురుసు ప్రదర్శించారు. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ అనుచిత వ్యాఖ్యలు చేసి.. ఆయన అభిమానుల ఆగ్రహానికి గురైన ఈ జనసేన ఎమ్మెల్యే.. మళ్లీ అదే పని చేశారు.
‘‘అల్లు అర్జున్ మళ్లీ మాట్లాడితే కౌంటర్ ఇస్తా. నాకు, నా పార్టీతో అల్లు అర్జున్‌కు ఎలాంటి శత్రుత్వం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్‌పై ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. మొన్న ఆయన మాట్లాడితే మాట్లాడాను. మళ్లీ మాట్లాడితే మళ్లీ కౌంటర్ ఇస్తాను’’ అని బొలిశెట్టి మళ్లీ బన్నీ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడారు. అంతకు ముందు..
అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నట్టు నాకు తెలియదు. మెగా కుటుంబం నుంచి విడిపోయి ఎవరైనా ఫ్యాన్స్ బ్రాంచిలు, షామియానా కంపెనీలులాగా పెట్టుకుంటే మేం చెప్పలేం. తనకు ఫ్యాన్స్ ఉన్నారని అల్లు అర్జున్ ఊహించుకుంటున్నారేమో! ఆయన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా మాట్లాడాలి. అలా కాదని.. నేను పెద్ద పుడింగిని, నా కిష్టమైతేనే వస్తా అంటే.. ఎవడికి కావాలి? మానేయ్ వెళ్లిపో.. ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి?.అల్లు అర్జున్ ఏమైనా పుడింగా.. ఆయనకు అసలు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే.. అని ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపాయి. బన్నీ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలను బొలిశెట్టి ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment