కారు ప్రమాదం.. నెలలోనే కోలుకున్న యంగ్ కమెడియన్ | Actor Sangeeth Prathap Comments After Car Accident | Sakshi
Sakshi News home page

Sangeeth Prathap: ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న నటుడు

Aug 27 2024 4:32 PM | Updated on Aug 27 2024 4:49 PM

Actor Sangeeth Prathap Comments After Car Accident

'ప్రేమలు' సినిమాతో తెలుగులోనూ బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంగీత్ ప్రతాప్. స్వతహాగా ఎడిటర్ అయిన ఇతడు.. మలయాళంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అయితే జూలై 27న రాత్రి ఇతడు ప్రయాణిస్తున్న కారుకి ప్రమాదం జరిగింది. అప్పటినుంచి చికిత్స తీసుకుంటున్నాడు. అలాంటిది నెలలోనే పూర్తిగా కోలుకున్న సంగీత్ ప్రతాప్.. ఇన్ స్టాలో పెద్ద పోస్ట్ పెట్టాడు. అసలేం జరిగింది? ఇప్పుడు పరిస్థితి ఏంటనేది క్లారిటీ ఇచ్చేశాడు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్-8లోకి రాజ్ తరుణ్? ఎట్టకేలకు ఓ క్లారిటీ)

'గత నెలలో ఇదే రోజున కారు ప్రమాదం జరగ్గానే నా జీవితం తలక్రిందులైంది. తొలుత నాకు ఏం కాలేదని అనుకున్నా. కానీ నర్స్ వచ్చి చెప్పిన తర్వాత నేనెంత ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడ్డానో అర్థమైంది. ఆ రోజు నుంచి నాలో బాధ, భయం, డిప్రెషన్ ఇలా చాలా ఎమోషన్స్‪‪‌కి గురయ్యాను. ఈ యాక్సిడెంట్ తర్వాత నా ఆలోచన మారిపోయింది. ఇంతకుముందు భవిష్యత్ గురించి చాలా భయాలుండేవి. కానీ జీవితం మనం కంట్రోల్‌లో ఉండదని అర్థమైంది. నచ్చినట్లు బ్రతికాలని ఫిక్స్ అయ్యాను'

'ఇన్ని రోజులు కంటికి రెప్పలా చెప్పాలంటే ఓ పిల్లాడిలా నన్ను చూసుకుంది నా భార్య. దీనికి బదులుగా ఆమెకు ఎంత ప్రేమ తిరిగిచ్చినా తక్కువే. తల్లిదండ్రులు, స్నేహితులు నాకు అండగా నిలిచారు. వాళ్లు చెప్పిన మాటలు, మెసేజులు వల్ల నాకు చాలా విషయాల్లో క్లారిటీ వచ్చింది. అలా ఈ రోజు మళ్లీ సాధారణ జీవితాన్ని తిరిగి మొదలుపెట్టాను. నాకెంతో ఇష్టమైన సెట్‌కి వెళ్లిపోయాను. కాస్త ఇబ్బందిగానే ఉంది. కొన్నిరోజుల్లో అంతా సెట్ అయిపోతుందిలే. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను' అని సంగీత్ ప్రతాప్ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: చేదు అనుభవం.. హీరోయిన్‌ నమితకి గుడిలోకి నో ఎంట్రీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement