తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన నమిత.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. ప్రస్తుతం రాజకీయాల్లోనూ కాస్త బిజీ. మరోవైపు భర్త, పిల్లలతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా కృష్ణాష్టమి సందర్భంగా గుడికి వెళ్లిన ఈమెకు చేదు అనుభవం ఎదురైంది. వీడియో పోస్ట్ చేసి మరీ ఈ విషయాన్ని బయటపెట్టింది. గుడికి వెళ్లిన తనని అడ్డుకున్నారని చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: వీళ్లు పెళ్లి వద్దంటున్నారు.. మాకు మాత్రం మరొకటి: నరేశ్)
'అందరికీ నమస్కారం. కృష్ణాష్టమి సందర్భంగా మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయానికి.. కుటుంబంతో కలిసి దర్శనం కోసం వెళ్లాను. అయితే నాతో పాటు ఫ్యామిలీని ఆలయ అధికారులు అడ్డుకున్నారు. హిందూ కుల ధ్రువీకరణ పత్రం అడిగారు. నాతో దురుసుగా, అహంకారంగా మాట్లాడారు. నేను పుట్టుకతోనే హిందువును. అలాంటి నాపై అగౌరవంగా ప్రవర్తించిన సిబ్బందిని శిక్షించాలి' అని నమిత చెప్పుకొచ్చారు.
దీనిపై ఆలయ సిబ్బంది వెర్షన్ మరోలా ఉంది. పై అధికారులు చెప్పడం వల్లే అలా చేశామని, కొంత సమయం ఎదురుచూడమని చెప్పామని, దురుసుగా ఏం ప్రవర్తించలేదని మర్యాదగానే మాట్లాడమని చెప్పినట్లు క్లారిటీ ఇచ్చారు. నెటిజన్లు మాత్రం నమితకు మద్ధతుగా నిలుస్తున్నారు. అధికారుల్ని క్షమించమని ఆమెకు రిక్వెస్ట్ పెడుతున్నారు.
(ఇదీ చదవండి: 'ముంజ్య' సినిమా రివ్యూ (ఓటీటీ))
Comments
Please login to add a commentAdd a comment