
తెలుగు సీనియర్ నటుడు నరేశ్ పేరు చెప్పగానే పవిత్ర లోకేశ్ గుర్తొస్తుంది. ఎందుకంటే కొన్నాళ్ల క్రితం నుంచి ఈమెతోనే కలిసుంటున్నాడు. ఈ విషయమై నరేశ్ మూడో భార్య రమ్య రఘపతి అప్పట్లో బాహాటంగా గొడవపడటం, ఇదంతా కోర్టుల వరకు వెళ్లడం జరిగింది. ఇదంతా మీకే తెలిసే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఓ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ పెళ్లి గురించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ వారం ఏకంగా 15 చిత్రాలు రిలీజ్)
'సుందరకాండ' అనే సినిమా టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. దీని తర్వాత మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలోనే ఒకరు పెళ్లి చేసుకుంటే బెటరా? పెళ్లి చేసుకోకపోతే బెటరా అని నరేశ్‌ని అడగ్గా.. 'ఇప్పుడున్న జనరేషన్ ఏమో అసలు పెళ్లి వద్దు అంటున్నారు. మా జనరేషన్ ఏమో ఇంకోటి కావాలని అంటున్నారు' అని నవ్వుతూ సమాధానం చెప్పేశారు.
నరేశ్ తన మూడో భార్య రమ్య రఘపతికి గత కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు. నటి పవిత్రతో కలిసి ఉంటున్నారని టాక్. ఈ క్రమంలోనే నరేశ్-పవిత్ర లోకేశ్ జంటగా గతేడాది 'మళ్లీ పెళ్లి' అనే సినిమా కూడా రావడం విశేషం. అలాంటిది ఇప్పుడు నరేశ్.. ప్రస్తుత యువత పెళ్లి ఆలోచనపై అలా సెటైర్ వేసేశారు.
(ఇదీ చదవండి: ఈ వయసులో మూడో పెళ్లి కష్టమేమో! కానీ..: ఆమిర్ ఖాన్)
Comments
Please login to add a commentAdd a comment