![Aamir Khan About Possibility of Third Marriage At Age of 59](/styles/webp/s3/article_images/2024/08/26/Amir-Khan.jpg.webp?itok=Kt-P06Bc)
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఆ మధ్య జోరుగా ప్రచారం నడిచింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. పోనీ, అలాంటి ఉద్దేశం ఏదైనా ఉందా? అన్న ప్రశ్నకు తాజాగా బదులిచ్చాడు. ఓ షోలో మాట్లాడుతూ.. ప్రస్తుతం నా వయసు 59. ఈ సమయంలో మళ్లీ పెళ్లి చేసుకోవడమనేది కష్టమే! ఇప్పుడు నాకంటూ ఎన్నో బంధాలున్నాయి.
ఒకే కుటుంబం..
నా కుటుంబం, పిల్లలు, తోబుట్టువులు.. ఇలా చాలామందితో ఆప్యాయంగా కలిసిమెలిసి ఉంటున్నాను. అందుకు చాలా సంతోషంగా ఉంది. నన్ను నేను మరింత బెటర్‌గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. అలా అని నాకు ఒంటరిగా ఉండటం అస్సలు నచ్చదు. ఒక తోడు కావాలి. నా మాజీ భార్యలు రీనా, కిరణ్‌తో క్లోజ్‌గానే ఉంటాను. మేమంతా ఒకే కుటుంబంలా కలిసుంటాం అని చెప్పుకొచ్చాడు.
సలహా ఇచ్చేందుకు నిరాకరణ
వైవాహిక బంధం గురించి జనాలకు ఏదైనా సలహా ఇస్తారా? అన్న ప్రశ్నకు.. నా రెండు పెళ్లిళ్లు విఫలమయ్యాయి. అలాంటి నన్ను పట్టుకుని పెళ్లి గురించి సలహా ఇవ్వమని అడగొద్దని సూచించాడు. ఇకపోతే ఆమిర్ గతంలో రీనా దత్తాను పెళ్లి చేసుకున్నాడు. 16 ఏళ్లపాటు కలిసున్న వీరు 2002లో విడిపోయారు.
రెండు పెళ్లిళ్లు విఫలం
అనంతరం దర్శకురాలు కిరణ్ రావును పెళ్లాడాడు. కానీ వీళ్లిద్దరు కూడా భార్యాభర్తలుగా కలిసుండలేకపోయారు. విడాకులు తీసుకున్నారు. సినిమాల విషయానికి వస్తే ఆమిర్ ప్రస్తుతం సితారె జమీన్ పర్ మూవీ చేస్తున్నాడు.
చదవండి: ప్రియుడిని పెళ్లాడిన రామ్ చరణ్ హీరోయిన్.. ఫోటోలు వైరల్!
Comments
Please login to add a commentAdd a comment