ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారంలో ఏకంగా 15 చిత్రాలు స్ట్రీమింగ్! | Here's The List Of 15 New Movies And Web Series Release In OTT This Week On August Last Week | Sakshi
Sakshi News home page

This Week OTT Movie Releases: ఈ వారంలో ఓటీటీ సినిమాలివే.. ఆ ఒక్కటే కాస్తా స్పెషల్!

Published Mon, Aug 26 2024 8:56 AM | Last Updated on Mon, Aug 26 2024 9:59 AM

This Week Ott Movies Streaming List Here

చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. థియేటర్లలో అలరించేందుకు సరిపోదా శనివారం అంటూ నాని సందడి చేయనున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ మూవీతో పాటు ఒకట్రెండు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే వీటిపై పెద్దగా బజ్‌ లేదు.

దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు. ఈ వారంలో కూడా ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు బోలెడు సిద్ధమైపోయాయి. వీటిలో ఆసక్తి పెంచుతోన్న టాలీవుడ్ మూవీ బడ్డీ. అల్లు శిరీష్‌ నటించిన ఈ చిత్రం ఆగస్టు 30 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు పలు బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాలు, సిరీస్‌లు కూడా వస్తున్నాయి. మరి ఏయే ఓటీటీలో ఏ సినిమా స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్‌

బడ్డీ (తెలుగు సినిమా)- ఆగస్టు 30
ఐసీ 814: ది కాందహార్ హైజాక్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్టు 29
కావోస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్టు 29
పోలైట్ సోసైటీ -(ఇంగ్లీష్ మూవీ)- ఆగస్టు 28
టర్మినేటర్ జీరో-(ఇంగ్లీష్ సిరీస్)- ఆగస్టు 29

జియో సినిమా

అబిగైల్ (ఇంగ్లీష్ సినిమా)- ఆగస్టు 26
గాడ్జిల్లా ఎక్స్‌ కింగ్: ది న్యూ ఎంపైర్(ఇంగ్లీష్ మూవీ)- ఆగస్టు 29
క్యాడేట్స్‌ (హిందీ వెబ్ సిరీస్‌)- ఆగస్టు 30

జీ5
ఇంటరాగేషన్ (హిందీమూవీ)- ఆగస్టు 30
ముర్షిద్ (హిందీ సిరీస్)- ఆగస్టు 30

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌

ఓన్లీ మర్డర్స్ ఇన్‌ ది బిల్డింగ్ సీజన్-4- ఇంగ్లీష్ వెబ్ సిరీస్- ఆగస్టు 27

కానా కానుమ్ కాలంగల్‌ సీజన్-3- తమిళ వెబ్ సిరీస్- ఆగస్టు 30
 

అమెజాన్ ప్రైమ్

ది రింగ్స్‌ ఆఫ్ పవర్ సీజన్-2 (ఇంగ్లీష్ సిరీస్)- ఆగస్టు 29

లయన్స్‌ గేట్ ప్లే

హెన్రీస్ క్రైమ్ (ఇంగ్లీష్)- ఆగస్టు 30
ది సెప్రెంట్‌ క్వీన్‌ సీజన్-2 (ఇంగ్లీష్ సిరీస్)- ఆగస్టు 30

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement