Krishna Janmashtami
-
చేదు అనుభవం.. హీరోయిన్ నమితకి గుడిలోకి నో ఎంట్రీ
తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన నమిత.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. ప్రస్తుతం రాజకీయాల్లోనూ కాస్త బిజీ. మరోవైపు భర్త, పిల్లలతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా కృష్ణాష్టమి సందర్భంగా గుడికి వెళ్లిన ఈమెకు చేదు అనుభవం ఎదురైంది. వీడియో పోస్ట్ చేసి మరీ ఈ విషయాన్ని బయటపెట్టింది. గుడికి వెళ్లిన తనని అడ్డుకున్నారని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: వీళ్లు పెళ్లి వద్దంటున్నారు.. మాకు మాత్రం మరొకటి: నరేశ్)'అందరికీ నమస్కారం. కృష్ణాష్టమి సందర్భంగా మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయానికి.. కుటుంబంతో కలిసి దర్శనం కోసం వెళ్లాను. అయితే నాతో పాటు ఫ్యామిలీని ఆలయ అధికారులు అడ్డుకున్నారు. హిందూ కుల ధ్రువీకరణ పత్రం అడిగారు. నాతో దురుసుగా, అహంకారంగా మాట్లాడారు. నేను పుట్టుకతోనే హిందువును. అలాంటి నాపై అగౌరవంగా ప్రవర్తించిన సిబ్బందిని శిక్షించాలి' అని నమిత చెప్పుకొచ్చారు.దీనిపై ఆలయ సిబ్బంది వెర్షన్ మరోలా ఉంది. పై అధికారులు చెప్పడం వల్లే అలా చేశామని, కొంత సమయం ఎదురుచూడమని చెప్పామని, దురుసుగా ఏం ప్రవర్తించలేదని మర్యాదగానే మాట్లాడమని చెప్పినట్లు క్లారిటీ ఇచ్చారు. నెటిజన్లు మాత్రం నమితకు మద్ధతుగా నిలుస్తున్నారు. అధికారుల్ని క్షమించమని ఆమెకు రిక్వెస్ట్ పెడుతున్నారు.(ఇదీ చదవండి: 'ముంజ్య' సినిమా రివ్యూ (ఓటీటీ)) View this post on Instagram A post shared by Namitha Vankawala (@namita.official) -
కృష్ణ ప్రేయసిగా, అచ్చమైన రాధగా తమన్నా లుక్స్ వైరల్
-
రాష్ట్ర ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు: మాజీ సీఎం జగన్
-
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజధాని ఢిల్లీలో గోపాల కృష్ణుని జన్మదిన వేడుకల కోసం ప్రముఖ బిర్లా ఆలయాన్ని అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధుర, బృందావనంలలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి.మధురలోని శ్రీ కృష్ణుని ఆలయం నేడు (సోమవారం) 20 గంటల పాటు తెరిచి ఉంటుందని, భక్తులకు నిరంతరాయంగా దర్శనం ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈరోజు ఉదయం 5.30 గంటలకు మంగళ హారతి, పంచామృత అభిషేకం, పుష్ప సమర్పణలతో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ పండితుడు నృత్య గోపాల్ దాస్ నేతృత్వంలోని నేటి అర్ధరాత్రి మహా అభిషేక వేడుక రాత్రి 11 గంటలకు ప్రారంభమై, 12.40 వరకు కొనసాగనుంది. తెల్లవారుజామున రెండు గంటలకు శయన హారతి నిర్వహించనున్నారు. #WATCH पन्ना, मध्य प्रदेश: श्री कृष्ण जन्माष्टमी के मद्देनजर जुगल किशोर जी मंदिर को रंग-बिरंगी लाइटों से सजाया गया। pic.twitter.com/BaKVkcGfpc— ANI_HindiNews (@AHindinews) August 25, 2024ఢిల్లీలోని బిర్లా ఆలయంలో పూల మాలలు, నెమలి ఈకలతో ప్రత్యేక అలంకరణ చేశారు. విద్యుత్ కాంతులు వెదజల్లే ఆకర్షణీయమైన రంగురంగుల లైట్లు ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణునికి ప్రత్యేక దుస్తులు ధరింపజేశారు. జన్మాష్టమి వేళ బిర్లా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఇక్కడ జరిగే భజన కీర్తనలు, శ్రీకృష్ణ లీలలను భక్తులు తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు పహారా కాస్తున్నారు.#WATCH अहमदाबाद (गुजरात): श्री कृष्ण जन्माष्टमी से पहले इस्कॉन मंदिर में तैयारी चल रही हैं। pic.twitter.com/YplKgI5FpJ— ANI_HindiNews (@AHindinews) August 25, 2024నోయిడాలోని ఇస్కాన్ టెంపుల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఆలయం వద్ద ఉదయం నుంచే భక్తుల రద్దీ నెలకొంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు జన్మాష్టమి నాడు ఇస్కాన్ ఆలయానికి వస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆలయం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
"కృష్ణ భక్తి" ఎంతపనైనా చేస్తుంది అంటే ఇదే కదా..ఏకంగా 88..
"గోకులాష్టమి" లేదా "కృష్ణాష్టమి" ఈ నెల సెప్టెంబర్ 7న పలెల్లోనూ, నగరాల్లోనూ కనుల పండుగగా జరిగింది. ఆయా ప్రాంతాల సంప్రదాయాన్ని అనుసరించి వేడుకగా చేసుకున్నారు ఈపండుగను. ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో కృష్ణుడిపై తమ భక్తిని చాటుకున్నారు. జ్ఞానానికి ప్రతీకగా, జీవుల కష్టాల నుంచి బయటపడేలా చేసే భగవద్గీత వంటి మహోన్నత గ్రంథాన్ని అందిచిని గురువుగా.. "కృష్ణం వందే జగద్గురుం" అని మారుమ్రోగిపోయేలా కృష్ణుడి పుట్టిన రోజుని వేడుకగా చేసుకున్నారు. చిన్ని కృష్ణా, వెన్నదొంగ, కన్నయ్య, రావయ్య మా ఇంటికి రమ్మంటూ రంగవల్లులతో కృష్ణుని పాదాలను వేసి మరీ ఆహ్వానిస్తూ బంధువార సపరిమేతంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు ప్రజలు. అలాగే కృష్ణుడు జన్మస్థలమైన గుజరాత్లో మరింత వీనుల విందుగా జరిగింది. తగ్గేదేలే అన్నట్లుగా భక్తులు ఈ పండుగను నూతనోత్సహంతో చేసుకోవడమే గాక తమ చిన్నారులను కన్నయ్యలుగా మార్చి సంబరపడ్డారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో పంథాలో తమదైన రీతిలో ఈ వేడుకను చేసుకుంటే..మంగళూరుకి చెందిన ఓ మహిళ అందరూ ఆశ్చర్యచకితుల్ని చేసేలా పండుగను సెలబ్రేట్ చేసుకుంది. కృష్ణ భక్తి అంటే ఏంటో..దానికున్న శక్తి ఏంటో చాటి చెప్పింది. మంగళూరుకి చెందిన ఓ మహిళ కృష్ణుడు జన్మ తిథి అష్టమి కలిసి వచ్చేలా 88 రకాల పిండి వంటలను నైవేద్యంగా పెట్టి ఔరా! అనిపించింది. కృష్ణుడుపై ఉన్న అపారమైన భక్తి ఎంతటి సాహసానికైనా లేదా ఎంతటి అనితరసాధ్యమైన పనికి అయినా పురికొల్పి చేయగలిగే శక్తిని ఇస్తుంది అని చెప్పడానికి ఆమె ఓ ఉదాహరణ. అందుకు సంబంధించని ఫోటోని ఓ కార్డియాలజిస్ట్ వైద్యుడు కామత్ నెట్టింట షేర్ చేశారు. ఆ మహిళ తన పేషెంట్ అని, ఆమెకు కృష్ణుడిపై ఉన్న భక్తి తేటతెల్లమయ్యేలా ఎంతలా శ్రమ ఓర్చి మరీ ఆ కన్నయ్యకు ఇలా విందు ఏర్పాటు చేసింది. కృష్ణునికి నివేధించే ఛపన్ భోగ్లో ఉండే వంటకాలకు మించి చేసిందని ప్రశంసించారు. ఆమెను చూసినా, ఆమె కృష్ణ భక్తిని చూసినా తనకు చాలా గర్వంగా అనిపిస్తుందన్నారు. ఆమె గతేడాది కృష్ణాష్టమి రోజున తాను చేసిన పిండి వంటల రికార్డును ఆమే బ్రేక్ చేసిందని ట్విట్టర్లో రాసుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. మీరు ఓ లుక్కేయండి. Proud of her and her devotion to lord Krishna. She is my patient. She has again broken her previous record. 88 dishes were prepared last night for Gokulashtami. #janamashtami pic.twitter.com/SDoh3JKTvM — Dr P Kamath (@cardio73) September 7, 2023 (చదవండి: అత్యంత ఖరీదైన కాఫీ..తయారీ విధానం తెలిస్తే..షాకవ్వడం ఖాయం!) -
వెన్న దొంగకు ఇష్టమైన.. గోపాల్‌కాలా ఎలా చేయాలంటే..
కృష్ణుడు వెన్న దొంగ ఎందుకయ్యాడు ?..అంటే వెన్న... రుచి మాములుగా ఉండదు. అది అందర్నీ దొంగల్ని చేస్తుంది. దీంతో చేసే స్వీట్లు అన్ని ఇన్నీ కావు. వాటి రుచే వేరు. ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా ఆ చిన్న కృష్ణుడి కోసం పాలు... పెరుగు... వెన్న... మీగడలు సిద్ధం చేసుకోండి. పాత్ర పెట్టండి...స్టవ్ వెలిగించండి. వండే లోపు వెన్న మాయవుతుందేమో! జర జాగ్రత్త! ఆ చిన్ని గోపాలుడి కంటపడకుండా..ఆయన ఇష్టంగా ఆరగించే గోపాల్కాలాని పెరుగుతో ఇలా చకచక చేసేయండి. గోపాల్కాలాకి కావలసినవి: అటుకులు – కప్పు పెరుగు – అర కప్పు కీర ముక్కలు – కప్పు తాజా కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు అల్లం తురుము – టీ స్పూన్ పచ్చి మిర్చి – 1 (తరగాలి) తరిగిన కొత్తిమీర – అర కప్పు దానిమ్మ గింజలు – టేబుల్ స్పూన్ కిస్మిస్ – టేబుల్ స్పూన్ ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి. పోపు కోసం: వెన్న – టేబుల్ స్పూన్ ఆవాలు – అర టీ స్పూన్ జీలకర్ర – అర టీ స్పూన్ కరివేపాకు – 2 రెమ్మలు, పచ్చి మిర్చి – 1 (తరగాలి), ఇంగువ – చిటికెడు (టీ స్పూన్ లో ఎనిమిదో వంతు) తయారీ విధానం: అటుకులను నీటిలో వేసి కడిగి వెంటనే తీసి మరొక పాత్రలో వేసుకోవాలి. అందులో అడుగున చేరిన నీటిని కూడా పూర్తిగా వంపేయాలి. ∙శుభ్రం చేసిన అటుకులు, కీర ముక్కలు, కొబ్బరి తురుము, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం తరుగు, దానిమ్మ గింజలు, కిస్మిస్, కొత్తిమీర అన్నింటినీ పెద్ద పాత్రలో వేసి గరిటతో కలపాలి. అందులో పెరుగు, ఉప్పు వేసి మరోసారి కలిపి పక్కన పెట్టుకోవాలి.∙పెనంలో వెన్న వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేసి కలిపి దించేయాలి. ఈ పోపును అటుకుల మిశ్రమంలో వేసి కలిపితే గోపాల్‌కాలా రెడీ. (చదవండి: పన్నీర్ పాడవ్వకుండా ఉండాలంటే..ఇలా చేయండి!) -
విశిష్టుడు, సర్వలోకహితుడైన "కృష్ణుడు" ధర్మపక్షపాతి
కృష్ణుడు పుట్టినరోజును కృష్ణజన్మాష్టమి, గోకులాష్టమి అని పిలుస్తారు. దేవకి, వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా శ్రావణ మాసంలో కృష్ణపక్షమి, అష్టమితిధి రోజు పుట్టినట్లుగా పురాణాలు,ఇతిహాసాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కృష్ణభక్తులంతా వేడుకలు జరుపుకొనే విశిష్టమైన రోజు కృష్ణాష్టమి. 'భగవద్గీత' ద్వారా లోకానికి గొప్ప ఉపదేశం చేసిన మూలంగా కృష్ణుడిని 'జగద్గురువు'గా భావిస్తారు, కృష్ణం వందే జగద్గురుమ్... అంటూ పూజిస్తారు. శ్రీకృష్ణుడి లీలలు అనంతం. అవన్నీ ఆనందదాయకం, జ్ఞానప్రదాయకం. మానవ జీవన క్రమంలో సుఖవంతంగా, జయప్రదంగా జీవించాలంటే కృష్ణతత్త్వాన్ని అర్థం చేసుకొని ఆచరించాలని పెద్దలు చెబుతారు. నర-నారాయణ (అర్జునుడు-కృష్ణుడు) సంవాదంలో నరునికి బోధించినట్లుగా కనిపించే 'భగవద్గీత' నరలోకం మొత్తానికి నారాయణుడు (కృష్ణుడు) చేసిన జ్ఞానబోధగా భావించాలని పండితులు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. మనిషి మరణించినప్పుడు తల దగ్గర పెట్టి వినిపించే విషాదగీతం కాదు భగవద్గీత. మానవులకు కర్తవ్య బోధ చేస్తూ కార్యోన్ముఖులను చేసే 'విజయగీత'. వ్యక్తిత్వ వికాసానికి ఇంతకు మించిన ఉద్గ్రంథం ఇంకొకటి లేదని ప్రపంచ మేధావులంతా ఏకమై చెప్పారు. అందుకే, 'గీత' భారతీయ భాషలతో పాటు అనేక అంతర్జాతీయ భాషలలో అనువాదమైంది. అది చదివిన పిమ్మట అనేక దేశాలవారు కృష్ణతత్త్వం వెంట పరుగులు తీస్తున్నారు. భారతదేశానికి తరలి వస్తున్నారు. ధర్మం, వృత్తిధర్మం, స్వధర్మం వైపు నడవండని గీతాచార్యుడైన కృష్ణుడు చెప్పాడు. స్వధర్మం ఏంటో తెలుసుకోవడంలోనే జ్ఞాన వికాసం దాగివుంది. తెలుసుకున్న తర్వాత ఆచరించడంలో వివేకం దాగివుంటుంది. ఈ మనోయోగం పట్టాలంటే భగవద్గీతను చదివి తీరాల్సిందే. కౌరవ-పాండవ యుద్ధంలో కృష్ణుడు పాండవుల వైపు నిలుచున్నాడు. అది అధర్మానికి - ధర్మానికి మధ్య జరిగిన యుద్ధం కాబట్టి వివేకవంతుడు, విశిష్టుడు, సర్వలోకహితుడైన కృష్ణుడు ధర్మపక్షపాతిగా పాండవుల వైపే నిల్చొని, వారికి విజయం కలిగించాడు. అధర్ములకు అపజయాన్ని చూపించి గుణపాఠం నేర్పాడు. కృష్ణాష్టమి నాడు కృష్ణుడిని తలుచుకోవడం, కొలుచుకోవడమంటే? కృష్ణతత్త్వాన్ని తెలుసుకోవడమే. కృష్ణతత్త్వం తెలియాలంటే జయదేవుడు రచించిన అష్టపదులు, లీలాశుకుడి 'శ్రీకృష్ణ కర్ణామృతం', నారాయణతీర్ధుడి తరంగాలు చదివి, అనుభవించండని మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య తెలియజేశారు. 'జగదాష్టమి'గా గుజరాతీయులు కృష్ణజన్మాష్టమిని విశిష్టంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజు ప్రపంచంలోని భక్తులంతా నాట్యం, నాటకం (రూపకం),ఉపాసన,ఉపవాసాలు మొదలైన వివిధ మార్గాల్లో తమ భక్తిని చాటుకుంటారు. ఇది తరతరాల నుంచి వైభవంగా సాగుతున్న సంప్రదాయం. ఉట్టికొట్టడం గొప్ప ఆసక్తిగా సాగే క్రీడ. మన తిరుమల ఆలయంలో శ్రీ వేంకటేశ్వరుని పక్కనే రజితమూర్తిగా శ్రీకృష్ణుడు విరాజిల్లుతుంటాడు. వెయ్యేళ్ళపై నుంచే ఈ విగ్రహం అక్కడ ఉన్నట్లు చెబుతారు. శ్రీకృష్ణుడి బాల్యక్రీడలకు సంబంధించిన విశేషాలు ప్రతిస్పందించేలా తిరుమల మాడ వీధుల్లో పెద్ద కోలాహలం జరుగుతుంది. ఈ ఉత్సవం చాలా ప్రాచీనమైందని తెలుస్తోంది.1545 నాటి శాసనాల ఆధారంగా ఈ వివరాలు తెలుస్తున్నాయి.తాళ్లపాకవారే ఈ వేడుకలను ఏర్పాటు చేసినట్లు చెప్పుకుంటారు. శ్రీకృష్ణుడు గొప్ప రాజనీతి చతురుడు.ఎంతటి చతురుడో అంతటి రసికుడు.ఎంతటి రసికుడో అంతటి అప్తజన రక్షకుడు. సౌందర్యవిలాసుడు, విలక్షణ వాగ్భూషణుడు. అందుకే "నల్లనివాడు, పద్మ నయనంబులవాడు, కృపారసంబు పై చల్లెడివాడు" అన్నాడు మన పోతన్న. తనను నమ్ముకున్నవారిపై దయారసాన్ని గొప్పగా కురిపించే కరుణాసముద్రుడని భావం. కేవలం పాండవులపైనే కాదు, ధర్మమూర్తులందరిపైనా తన దయను విశేషంగా చూపించి విజయులను చేశాడు. కృష్ణుడిని అర్థం చేసుకుంటే ఆత్మజ్ఞానం కలిగినట్లే. -మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: భావోద్వేగాలను కట్టడి చేసే మహత్తరమైన శక్తి వాటికే ఉంది!) -
ప్రముఖుల ఇంట కృష్ణాష్టమి వేడుకలు
-
కృష్ణతత్వం
-
అడిగింది ఇవ్వకుంటే కూల్చేస్తాం !
విజయవాడలో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి వెరిఫికేషన్‌కు వెళ్లే అధికారులు అనుమతుల పేరుతో అడ్డగోలు దోపిడీ చేస్తున్నారు. వీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంలో అంతులేని అవినీతి చోటుచేసుకుంటుందని ఫిర్యాదులు వస్తున్నా.. సాక్షాత్తు వీఎంసీ ఇతర విభాగాల సిబ్బంది చెబుతున్నా, అధికారులలో ఎలాంటి మార్పురాకపోగా మరింతగా విజృంభిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పటమట: ఆ విభాగంలో అంతా పకడ్బందీగా జరుగుతుంది. ఇల్లుకట్టాలనుకున్న సామాన్యుల కలను అధికారులు వెరిఫికేషన్ పేరుతో కల్లగా మారుస్తున్నారని, భవన నిర్మాణానికి అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు పొందినప్పటికీ కొంతమంది టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు ఓఉన్నతాధికారి సహకారంతో అందినకాడికి దండుకుంటూ వెరిఫికేషన్‌లో అనుకూల/ప్రతికూల రిపోర్టులు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తమను సంతృప్తి పరచకపోతే అన్ని రకాల అనుమతులు ఉన్నా అప్పోసొప్పో చేసి కట్టుకుంటున్న నిర్మాణాలను కూల్చివేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అనుమతులకు విరుద్దంగా ఎలాంటి నిర్మాణాలు జరిగినా అధికారులకు లంచాలు ముట్టచెబితే చూసీచూడనట్లు వ్యవహరిస్తారని ఆరోపణలు. అడ్డగోలు దోపిడీ.. చుట్టుగుంట వద్ద ఏలూరు రోడ్డు వెంబడి జరుగుతున్న ఓ ఇంటి నిర్మాణ అనుమతులకు సంబంధించి పోస్ట్ వేరిఫికేషన్‌కు వెళ్లిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్ తాను రిపోర్టు చేస్తేనే అనుమతి వస్తుందని, అనుకూలంగా రిపోర్టు ఇవ్వాలంటే రూ. 3 లక్షలు ఇచ్చుకోవాల్సిందేనని పట్టుపట్టడంతో వెలగపూడిలోని సెక్రటేరియట్‌లోని ఓ సీనియర్ ఉద్యోగి రాయభారంతో రూ.1.25 లక్షలకు బేరం కుదిరింది. సకాలంలో భవన యజమాని సొమ్ములు చెల్లించకపోవటంతో గత వారం డీవియేషన్స్ జరుగుతున్న ప్రాంతాన్ని కూల్చేయటానికి వెళ్లగా అప్పటికప్పుడు రూ. 75వేలు చెల్లిస్తేగానీ కూల్చకుండా వదిలేశారని సమాచారం. రామలింగేశ్వరనగర్‌లోని ఎస్టీపీ ప్లాంట్‌కు సమీపంలో ఓ భవన నిర్మాణానికి సంబంధించి పోస్ట్ వెరిఫికేషన్‌కు వెళ్లిన అధికారులను మెప్పించకపోవటంతో నిర్మాణ అనుమతికి సంబందించి కొర్రిపెట్టి ఇంటి నిర్మాణాన్ని నిలుపుదల చేశారు. వెరిఫికేషన్‌కు వెళ్లిన అధికారుల బృందం రూ. 2 లక్షలు డిమాండ్ చేయగా తానెందుకు చెల్లించాలని భవన యజమాని ప్రశ్నించటంతో అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతుందని, ఇలా నిర్మా ణం చేపడితే కూల్చేస్తామని, తమకు ‘సహకరిం చకపోతే’ కూల్చేస్తామని అధికారులే బెది రింపులకు దిగుతున్నారని బా«ధితుడు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నగరంలోని అన్ని ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్నా వీఎంసీ ఉన్నతాధికారి దృష్టిసారింకచకపోవటంపై పలు అనుమానాలకు తావిస్తోంది. వీఎంసీ ఆదాయానికి గండి.. నగర పాలక సంస్థ పరిధిలో భవనాలకు ఇంటి పన్న వేసే సమయంలో ప్లింత్ ఏరియా, నిర్మాణం స్వభావం, ఉపయోగవిధానం(రెసిడెన్షియల్/కమర్షియల్/ఇతర), పరిశీలించి అధికారులు పన్ను లు విధించాల్సి ఉండగా ఆయా నిర్మాణాల వద్దకు పోస్ట్ వెరిఫికేషన్ సర్వేకు వెళ్తున్న అధికారులు కొలతల్లో, కేటగిరీల్లో మాయాజాలం చేస్తున్నారు. కొంతమంది వాణిజ్యప్రాంతాల్లో భవనాలు నిర్మిం చి కేవలం నివాస ప్రాంతాలుగానే పన్ను చెల్లింపులు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. భవన నిర్మాణ యజమానుల నుంచి అధికారులు ప్రత్యేకంగా పన్నులు తగ్గించేలా ‘రహస్య’ ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీనివల్ల నగర పాలక సంస్థకు రావాల్సిన ఆదాయానికి గండి పడుతుంది. వన్‌టౌన్‌లోని అత్యంత రద్దీగా ఉండే ప్రదేశంలో జరుగుతున్న ఓ భవన నిర్మాణం పోస్ట్ వెరిఫికేషన్‌కు వెళ్లిన పట్టణ ప్రణాళిక అధికారులు చెప్పిన విషయాలు విన్న ఆ భవన నిర్మాణ యజమానికి అధికారుల డిమాండ్ విని దిమ్మతిరిగిపోయింది. 150 గజాల స్థలంలో ఆన్లైన్లో అనుమతి పొంది జీప్లస్–2 నిర్మాణం చేసుకుంటుండగా, ప్లాన్‌లో చూపిన విధంగా మెట్లు సక్రమంగా లేవని, పోర్టికో నాలుగు అడుగులు ముందుకు వచ్చిందని డీవియేషన్స్ ఉన్న ప్రాంతాన్ని కూల్చేస్తామని, ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణం జరుగుతుందని ఓ అధికారి రూ.5లక్షలు డిమాండ్ చేశారు. స్థానిక కార్పొరేటర్ సహాయంతో ఎమ్మెల్సీని కలిస్తే చివరికి రూ.1.5 లక్షలకు సెటిల్మెంట్ జరిగినట్లు సమాచారం. -
కృష్ణాష్టమికి గోపాల గోపాల ఫస్ట్ లుక్ !
చెన్నై: విక్టరీ హీరో వెంకటేష్ హీరోగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అతిథి పాత్రలో నటిస్తున్న చిత్రం గోపాల గోపాల. ఆ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఆగస్టు16వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఆ చిత్ర దర్శకుడు కిషోర్ కుమార్ గురువారం చెన్నైలో వెల్లడించారు. గోపాల గోపాల చిత్రంలో శ్రీకృష్ణుడు కీలక భూమిక పోషిస్తాడని.. ఈ నేపథ్యంలో ఆయన జన్మదినమైన కృష్ణాష్టమి రోజున ఆ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. చిత్రంలోని పవన్, వెంకటేశ్‌ల డైలాగ్‌లు ప్రేక్షకుల హృదయాలు దోచుకుంటాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ పాత్ర చిత్రంలో 25 నిముషాలు మాత్రమే ఉంటుందని అన్నారు. హిందీలో నిర్మితమైన ఓ మై గాడ్ చిత్రం కిషోర్ కుమార్ దర్శకత్వంలో గోపాల గోపాల రీమేక్ చిత్రంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఓ మై గాడ్ చిత్రంలోని అక్షయ్ కుమార్ పోషించిన పాత్రను పవన్ కల్యాణ్, పరాష్ రావెల్ పాత్రను వెంకటేష్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రియా, మిథున్ చక్రవర్తి, మురళి శర్మలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండగ రోజున గోపాల గోపాల చిత్రం విడుదలకు సిద్దమతుంది.