"గోకులాష్టమి" లేదా "కృష్ణాష్టమి" ఈ నెల సెప్టెంబర్ 7న పలెల్లోనూ, నగరాల్లోనూ కనుల పండుగగా జరిగింది. ఆయా ప్రాంతాల సంప్రదాయాన్ని అనుసరించి వేడుకగా చేసుకున్నారు ఈపండుగను. ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో కృష్ణుడిపై తమ భక్తిని చాటుకున్నారు. జ్ఞానానికి ప్రతీకగా, జీవుల కష్టాల నుంచి బయటపడేలా చేసే భగవద్గీత వంటి మహోన్నత గ్రంథాన్ని అందిచిని గురువుగా.. "కృష్ణం వందే జగద్గురుం" అని మారుమ్రోగిపోయేలా కృష్ణుడి పుట్టిన రోజుని వేడుకగా చేసుకున్నారు. చిన్ని కృష్ణా, వెన్నదొంగ, కన్నయ్య, రావయ్య మా ఇంటికి రమ్మంటూ రంగవల్లులతో కృష్ణుని పాదాలను వేసి మరీ ఆహ్వానిస్తూ బంధువార సపరిమేతంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు ప్రజలు.
అలాగే కృష్ణుడు జన్మస్థలమైన గుజరాత్‌లో మరింత వీనుల విందుగా జరిగింది. తగ్గేదేలే అన్నట్లుగా భక్తులు ఈ పండుగను నూతనోత్సహంతో చేసుకోవడమే గాక తమ చిన్నారులను కన్నయ్యలుగా మార్చి సంబరపడ్డారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో పంథాలో తమదైన రీతిలో ఈ వేడుకను చేసుకుంటే..మంగళూరుకి చెందిన ఓ మహిళ అందరూ ఆశ్చర్యచకితుల్ని చేసేలా పండుగను సెలబ్రేట్ చేసుకుంది. కృష్ణ భక్తి అంటే ఏంటో..దానికున్న శక్తి ఏంటో చాటి చెప్పింది.
మంగళూరుకి చెందిన ఓ మహిళ కృష్ణుడు జన్మ తిథి అష్టమి కలిసి వచ్చేలా 88 రకాల పిండి వంటలను నైవేద్యంగా పెట్టి ఔరా! అనిపించింది. కృష్ణుడుపై ఉన్న అపారమైన భక్తి ఎంతటి సాహసానికైనా లేదా ఎంతటి అనితరసాధ్యమైన పనికి అయినా పురికొల్పి చేయగలిగే శక్తిని ఇస్తుంది అని చెప్పడానికి ఆమె ఓ ఉదాహరణ. అందుకు సంబంధించని ఫోటోని ఓ కార్డియాలజిస్ట్ వైద్యుడు కామత్ నెట్టింట షేర్ చేశారు.
ఆ మహిళ తన పేషెంట్ అని, ఆమెకు కృష్ణుడిపై ఉన్న భక్తి తేటతెల్లమయ్యేలా ఎంతలా శ్రమ ఓర్చి మరీ ఆ కన్నయ్యకు ఇలా విందు ఏర్పాటు చేసింది. కృష్ణునికి నివేధించే ఛపన్ భోగ్‌లో ఉండే వంటకాలకు మించి చేసిందని ప్రశంసించారు. ఆమెను చూసినా, ఆమె కృష్ణ భక్తిని చూసినా తనకు చాలా గర్వంగా అనిపిస్తుందన్నారు. ఆమె గతేడాది కృష్ణాష్టమి రోజున తాను చేసిన పిండి వంటల రికార్డును ఆమే బ్రేక్ చేసిందని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. మీరు ఓ లుక్కేయండి.
Proud of her and her devotion to lord Krishna. She is my patient. She has again broken her previous record. 88 dishes were prepared last night for Gokulashtami. #janamashtami pic.twitter.com/SDoh3JKTvM
— Dr P Kamath (@cardio73) September 7, 2023
(చదవండి: అత్యంత ఖరీదైన కాఫీ..తయారీ విధానం తెలిస్తే..షాకవ్వడం ఖాయం!)
Comments
Please login to add a commentAdd a comment