దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజధాని ఢిల్లీలో గోపాల కృష్ణుని జన్మదిన వేడుకల కోసం ప్రముఖ బిర్లా ఆలయాన్ని అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధుర, బృందావనంలలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి.
మధురలోని శ్రీ కృష్ణుని ఆలయం నేడు (సోమవారం) 20 గంటల పాటు తెరిచి ఉంటుందని, భక్తులకు నిరంతరాయంగా దర్శనం ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈరోజు ఉదయం 5.30 గంటలకు మంగళ హారతి, పంచామృత అభిషేకం, పుష్ప సమర్పణలతో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ పండితుడు నృత్య గోపాల్ దాస్ నేతృత్వంలోని నేటి అర్ధరాత్రి మహా అభిషేక వేడుక రాత్రి 11 గంటలకు ప్రారంభమై, 12.40 వరకు కొనసాగనుంది. తెల్లవారుజామున రెండు గంటలకు శయన హారతి నిర్వహించనున్నారు.
#WATCH पन्ना, मध्य प्रदेश: श्री कृष्ण जन्माष्टमी के मद्देनजर जुगल किशोर जी मंदिर को रंग-बिरंगी लाइटों से सजाया गया। pic.twitter.com/BaKVkcGfpc
— ANI_HindiNews (@AHindinews) August 25, 2024
ఢిల్లీలోని బిర్లా ఆలయంలో పూల మాలలు, నెమలి ఈకలతో ప్రత్యేక అలంకరణ చేశారు. విద్యుత్ కాంతులు వెదజల్లే ఆకర్షణీయమైన రంగురంగుల లైట్లు ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణునికి ప్రత్యేక దుస్తులు ధరింపజేశారు. జన్మాష్టమి వేళ బిర్లా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఇక్కడ జరిగే భజన కీర్తనలు, శ్రీకృష్ణ లీలలను భక్తులు తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు పహారా కాస్తున్నారు.
#WATCH अहमदाबाद (गुजरात): श्री कृष्ण जन्माष्टमी से पहले इस्कॉन मंदिर में तैयारी चल रही हैं। pic.twitter.com/YplKgI5FpJ
— ANI_HindiNews (@AHindinews) August 25, 2024
నోయిడాలోని ఇస్కాన్ టెంపుల్‌లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఆలయం వద్ద ఉదయం నుంచే భక్తుల రద్దీ నెలకొంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు జన్మాష్టమి నాడు ఇస్కాన్ ఆలయానికి వస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆలయం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment