Janmashtami
-
జన్మాష్టమి వ్యాపారం రూ. 25 వేల కోట్లు
దేశవ్యాప్తంగా నిన్న(సోమవారం) శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో నేడు కూడా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల నేపధ్యంలో దేశవ్యాప్తంగా భారీగా వివిధ వస్తువుల కొనుగోళ్లు జరిగాయి.కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకల సందర్భంగా రూ. 25 వేల కోట్లకు పైగా లావాదేవీలతో కూడిన వ్యాపారం జరిగింది. కృష్ణాష్టమి దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా నిర్వహించే పండుగ కావడంతో ప్రతీయేటా భారీగా కొనుగోళ్లు జరుగుతుంటాయి. ఈ ఏడాది జన్మాష్టమి సందర్భంగా జరిగిన కొనుగోళ్ల వివరాలను సీఏఐటీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ మీడియాకు అందించారు.శ్రీకృష్ణాష్టమి సందర్బంగా పూలు, పండ్లు, స్వీట్లు, వస్త్రాలు, అలంకరణ వస్తువులు, స్వీట్లు, పాలు, పెరుగు, వెన్న, డ్రై ఫ్రూట్స్ మొదలైనవాటిని వినియోగదారులు భారీ ఎత్తున కొనుగోలు చేశారని ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. జన్మాష్టమి వంటి పండుగలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంటాయన్నారు. ఈసారి జన్మాష్టమి ప్రత్యేక ఆకర్షణలుగా డిజిటల్ టేబుల్‌లాక్స్, శ్రీకృష్ణునితో సెల్ఫీ పాయింట్ నిలిచాయని అన్నారు. కాగా దేశంలోని వివిధ సామాజిక సంస్థలు కూడా జన్మాష్టమి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాయి. -
బంజారా హిల్స్ : హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ప్రత్యేకత గురించి తెలుసా? (చిత్రాలు)
-
కృష్ణాష్టమి వేడుకలు.. రాధా కృష్ణుడి వేషాల్లో అలరించిన చిన్నారులు (ఫొటోలు)
-
హైదరాబాద్ : అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)
-
Nishka: వెన్నదొంగగా మారిన బుల్లితెర నటి చైత్ర గారాలపట్టి.. (ఫోటోలు)
-
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు ఘనంగా (ఫొటోలు)
-
అయోధ్యలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
యూపీలోని అయోధ్యలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సకల ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాదే ప్రారంభమైన ఈ ఆలయంలో తొలిసారిగా రామనవమి జరిగింది. ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి వైభవంగా జరుగుతోంది.ట్రస్టు సభ్యులు డా అనిల్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈరోజున బాలరామునికి ఒకటిన్నర క్వింటాళ్ల నైవేద్యాన్ని సమర్పించనున్నామని తెలిపారు. నేడు రోజుంతా భజన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జన్మాష్టమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ నిర్వహించామన్నారు. సాయంత్రం భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. -
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజధాని ఢిల్లీలో గోపాల కృష్ణుని జన్మదిన వేడుకల కోసం ప్రముఖ బిర్లా ఆలయాన్ని అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధుర, బృందావనంలలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి.మధురలోని శ్రీ కృష్ణుని ఆలయం నేడు (సోమవారం) 20 గంటల పాటు తెరిచి ఉంటుందని, భక్తులకు నిరంతరాయంగా దర్శనం ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈరోజు ఉదయం 5.30 గంటలకు మంగళ హారతి, పంచామృత అభిషేకం, పుష్ప సమర్పణలతో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ పండితుడు నృత్య గోపాల్ దాస్ నేతృత్వంలోని నేటి అర్ధరాత్రి మహా అభిషేక వేడుక రాత్రి 11 గంటలకు ప్రారంభమై, 12.40 వరకు కొనసాగనుంది. తెల్లవారుజామున రెండు గంటలకు శయన హారతి నిర్వహించనున్నారు. #WATCH पन्ना, मध्य प्रदेश: श्री कृष्ण जन्माष्टमी के मद्देनजर जुगल किशोर जी मंदिर को रंग-बिरंगी लाइटों से सजाया गया। pic.twitter.com/BaKVkcGfpc— ANI_HindiNews (@AHindinews) August 25, 2024ఢిల్లీలోని బిర్లా ఆలయంలో పూల మాలలు, నెమలి ఈకలతో ప్రత్యేక అలంకరణ చేశారు. విద్యుత్ కాంతులు వెదజల్లే ఆకర్షణీయమైన రంగురంగుల లైట్లు ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణునికి ప్రత్యేక దుస్తులు ధరింపజేశారు. జన్మాష్టమి వేళ బిర్లా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఇక్కడ జరిగే భజన కీర్తనలు, శ్రీకృష్ణ లీలలను భక్తులు తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు పహారా కాస్తున్నారు.#WATCH अहमदाबाद (गुजरात): श्री कृष्ण जन्माष्टमी से पहले इस्कॉन मंदिर में तैयारी चल रही हैं। pic.twitter.com/YplKgI5FpJ— ANI_HindiNews (@AHindinews) August 25, 2024నోయిడాలోని ఇస్కాన్ టెంపుల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఆలయం వద్ద ఉదయం నుంచే భక్తుల రద్దీ నెలకొంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు జన్మాష్టమి నాడు ఇస్కాన్ ఆలయానికి వస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆలయం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
శ్రీకృష్ణాష్టమికి బ్యాంకులు పనిచేస్తాయా?
జన్మాష్టమి.. దీనినే శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి అని కూడా అంటారు. ఇది హిందువులు అత్యంత వేడుకగా చేసుకునే పండుగ. ఈసారి జన్మాష్టమి సోమవారం అంటే ఆగస్టు 26న వచ్చింది. ఆగస్టు 24, 25వ తేదీలు శని, ఆదివారాలు కావడంతో బ్యాంకులు మూసి ఉంటాయి. మరి సోమవారం, శ్రీకృష్ణాష్టమి నాడు బ్యాంకులు పనిచేస్తాయా? లేదా మూసివుంటాయా?రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం జన్మాష్టమి సందర్భంగా ఆగస్టు 26న సోమవారం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయయనున్నారు. అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, హైదరాబాద్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, పట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్‌లలో సోమవారం నాడు బ్యాంకులు పనిచేయవు. దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు వేర్వేరుగా ఉంటాయి. కస్టమర్లు తమ సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి సెలవుల జాబితాను పొందవచ్చు.కాగా త్రిపుర, మిజోరం, మహారాష్ట్ర, కర్ణాటక, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, న్యూఢిల్లీ, గోవాలలో సోమవారం నాడు బ్యాంకులు పనిచేస్తాయి. అయితే సోమవారం సెలవు ఉన్న బ్యాంకులకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాట్సాప్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మొదలైన సేవలు ఎప్పటిలానే కొనసాగుతాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా వినియోగదారులు బ్యాంకు సేవలను పొందవచ్చు. -
మధురలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ప్రారంభం
సోమవారం (ఆగస్టు 26) శ్రీ కృష్ణ జన్మాష్టమి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఘనంగా వేడుకలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలోని మధురలో గల శ్రీకృష్ణుని ఆలయం సోమవారం తెల్లవారుజాము నుంచి భక్తుల కోసం 20 గంటల పాటు తెరిచివుంటుందని శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ తెలిపింది.మధుర శ్రీకృష్ణుని ఆలయంలో నేటి (శనివారం) నుంచి ఉత్సవాలు ప్రారంభమై గురువారం వరకు కొనసాగుతాయని శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవాసమితి కార్యదర్శి కపిల్ శర్మ, సభ్యులు గోపేశ్వర్ చతుర్వేది తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయాన్ని 20 గంటల పాటు తెరిచి ఉంచుతామన్నారు. సోమవారం స్వామివారి మంగళ హారతి కార్యక్రమంలో షెహనాయ్ వాదన ఉంటుందన్నారు. ఉదయం 5.30 నుండి దర్శనాలు మొదలువుతాయన్నారు. ఉదయం 11.00 గంటలకు స్వామివారికి పంచామృతాభిషేకం జరుగుతుందన్నారు.జన్మాష్టమి నాడు సాయంత్రం వేళ శ్రీకృష్ణ లీలా మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో భరత్పూర్ గేట్ నుంచి ఊరేగింపు ప్రారంభమై హోలీగేట్, ఛట్టా బజార్, స్వామి ఘాట్, చౌక్ బజార్, మండి రాందాస్, డీగ్ గేట్ మీదుగా శ్రీకృష్ణ జన్మస్థలానికి చేరుకుంటుందన్నారు. ఆలయంలో స్వామివారి అలంకరణ అద్భుతంగా ఉండబోతుందని అన్నారు. ఆలయానికి వెళ్లే అన్ని మార్గాల్లో జిల్లా యంత్రాంగం షూ షెడ్లు, లగేజీ షెడ్లు ఏర్పాటు చేసిందన్నారు. అలాగే వైద్య శిబిరాలు, విచారణ కేంద్రాలు కూడా ఏర్పాటవుతున్నాయని తెలిపారు. -
ప్రముఖ ఆలయాల్లో జన్మాష్టమి వేడుకలు..
మధుర, బృందావనం మొదలుకొని దేశవ్యాప్తంగా నేటి ఉదయం నుంచి పలు ఆలయాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణుని విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు. శ్రీహరి అవతారాల్లో ఇది సంపూర్ణమైనదని చెబుతారు. ఈ సారి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రెండు రోజులు నిర్వహిస్తున్నారు. కొందరు సెప్టెంబరు 6న జన్మాష్టమి వేడుకలు చేసుకోగా, మరికొందరు నేడు (సెప్టెంబరు 7)న ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపద్యంలో ఆలయాలన్నీ ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. #WATCH | UP: Mangala aarti underway in Krishna Janmabhoomi temple in Mathura, on the occasion of #Janmashtami pic.twitter.com/DSV80e7mbD — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 7, 2023 శ్రీకృష్ణ జన్మభూమి మధురలో ఉదయం స్వామివారికి మంగళహారతి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆ సమయంలో ఆలయంలో శంఖనాదాలు చేశారు. ఆలయంలో కొలువైన రాధాకృష్ణులకు పసుపురంగు దుస్తులు ధరింపజేశారు. అలాగే పూలతో అలంకరించారు. #WATCH | West Bengal: Devotees celebrate & offer prayers at the Iskcon temple in Kolkata on the occasion of #Janmashtami pic.twitter.com/wEDQWVEs0D — ANI (@ANI) September 7, 2023 పశ్చిమబెంగాల్లోని ఇస్కాన్ ఆలయంలో ఉదయం నుంచే భక్తుల సందడి నెలకొంది. ఆలయంలో పూజలు, అర్చనలు విశేషరీతిలో జరిగాయి. కొందరు భక్తుల భగవానుని సమక్షంలో నృత్యాలు చేశారు. కొందరు శంఖనాదాలు చేశారు. #WATCH | Uttarakhand: Devotees throng Badrinath temple during the #Janmashtami celebrations pic.twitter.com/8bf3lhclIz — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 7, 2023 ఉత్తరాఖండ్‌లోని బదరీనాథ్ ఆలయంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. జన్మాష్టమి సందర్భంగా ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. ఆలయాన్ని ఎల్ఈడీ వెలుగులతో నింపేశారు. #WATCH | Delhi: Tulsi aarti underway in Iskcon temple on the occasion of #Janmashtami pic.twitter.com/TpCbF6tsJ7 — ANI (@ANI) September 6, 2023 ఢిల్లీలోని ఇస్కాన్ మందిరంలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం స్వామివారికి తులసి హారతి సమర్పించారు. ఆలయ పూజారులు, భక్తులు సంయుక్తంగా హారతి అందించారు. స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. #WATCH | UP: Mangala Aarti underway in Noida Iskcon temple, on the occasion of #Janmashtami pic.twitter.com/U0I5878Um9 — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 6, 2023 -
కారు చీకటిలో కాంతిరేఖ కృష్ణుడు
అతడి రూపం నల్లటిది. కాని మనసు మాత్రం మరుమల్లె కన్న తెల్లనిది, పరిమళభరితమైనది, స్వచ్ఛమైనది. బాల్యం నుంచి – ఆ మాటకొస్తే పుట్టకముందు నుంచే ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు? ఎన్ని సవాళ్లను అధిగమించాడు? కన్నతల్లిదండ్రులకు దూరమయ్యాడు. స్వంత మేనమామే శత్రువై సంహరింప చూసినా చలించని, దేనికీ భయపడని, ఎవరికీ లొంగని ఆ ధీరోదాత్తుడే శ్రీకృష్ణుడు. కార్యసాధన అంటే ఏమిటో ఆచరించి చూపిన సిసలైన కార్యసాధకుడు, శరణన్న వారికి రక్షణగా నిలిచిన అసలైన రక్షకుడు, మోసాన్ని మోసంతోనే జయించాలని, ముల్లును ముల్లుతోనే తీసివేయాలని, తగిన ఉపాయముంటే ఎంతటి అపాయం నుంచయినా బయట పడవచ్చునని రుజువు చేసి చూపిన అసహాయ శూరుడు శ్రీకృష్ణుడు. అసలైన వ్యక్తిత్వ వికాసమంటే ఏమిటో గీత ద్వారా బోధించి చూపాడు. శ్రీకృష్ణుని లీలలు తెలుసుకోవడమే కాదు, ఆయన మంచితనాన్ని, ఉన్నత వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలి. కిట్టనివాళ్లు ఆయనను మాయావి అన్నారు. ఓరిమితో సహించాడు. కొందరు కృష్ణుడంటే శృంగార పురుషుడే కదా! అన్నారు. చిరునవ్వులు చిందించాడు. కొందరు తాత్వికుడన్నారు. కాదనలేదు. నీవే పరమాత్ముడవంటూ పూజలు చేశారు. కాదు పొమ్మనలేదు... తనను ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో దర్శనమిచ్చాడు. పదహారువేలమంది గోపికలన్నారు కానీ, వారిలో ఏ ఒక్కరైనా కృష్ణయ్య నన్ను చూసి నవ్వాడనో, కొంటెగా కన్నుగీటాడనో అనగా విన్న దాఖలాలు ఉన్నాయా ఎక్కడైనా? అష్టభార్యలన్నారు. వారిలో ఏ ఒక్కరైనా తనను నిర్లక్ష్యం చేశాడని మొరపెట్టుకున్నట్లు విన్నామా? లేదే! చీరలెత్తుకెళ్లిన చిలిపివాడన్నారు కానీ, గోపకాంతలు ఒడ్డున చీరలు వేసి, ఆదమరచి స్నానాలు చేస్తుంటే, వారికి తెలివి నేర్పటం కోసమే తానలా చేశానని కానీ, అజ్ఞానానికి సంకేతమైన నల్లని కుండ నుంచి జ్ఞానానికి ప్రతీక అయిన తెల్లని వెన్నను దొంగిలించి తినడం ద్వారా వారికి తాను ఎన్నో సంపదలను ప్రసాదించానని కానీ, దుష్టురాక్షసులను సంహరించటం ద్వారా వారికి ముక్తిని ప్రసాదించానని కానీ చెప్పుకోలేదు. దేనికీ చలించకుండా తన స్థితప్రజ్ఞతను లోకానికి చాటిన వాడే శ్రీకృష్ణుడు. కృష్ణాష్టమి ఎలా జరుపుకోవాలంటే... ఇది యావద్భారతం చేసుకునే పండుగ. ఈ పండుగను చేసుకునేవారు ఉదయాన్నే లేచి పరిశుద్ధులై, షోడశోపచారాలతో కృష్ణుని పూజించాలి. పగలంతా ఉపవసించి సాయంకాలం చిన్నికృష్ణుని విగ్రహాన్ని ఊరేగించి, తర్వాత ఊయలలో ఉంచి, ఊపాలి. దేవకీదేవి బాలకృష్ణునికి స్తన్యమిస్తున్నట్లుగా ఉండే విగ్రహాన్ని పూజించినా మంచిదే. అనంతరం కృష్ణునికి ప్రీతికరమైన పాలు, వెన్న, పండ్లు, అటుకులు మొదలైన వాటిని నైవేద్యం పెట్టి, వాటిని ప్రసాదంగా ఆరగించడం వల్ల అన్నింటా జయం సిద్ధిస్తుందని పురాణోక్తి. ఈ పుణ్యతిథి నాడు కృష్ణుని పూజించి, భాగవత గ్రంథాన్ని పఠించినా, దానం చేసినాlసకల పాపాలూ తొలగి, చతుర్విధ ఫల పురుషార్థాలు అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం ప్రాప్తిస్తాయని స్కాందపురాణం చెబుతోంది. – డి.వి.ఆర్. భాస్కర్ సకల అవతారాలకు మూలం శ్రీ కృష్ణస్వరూపం శ్రీ కృష్ణుని ఏ చిత్రం చూసినా మనకు ప్రధానంగా కనిపించేవి ఆయన గోపసఖులతో ఆటలాడుకోవడం, గోవులను కాయటం, వన్యప్రాణుల మధ్య పిల్లన గ్రోవిని పట్టుకొని మధుర వాయిద్యం చేయటం వంటివే! భగవంతుని స్వభావం కేవలం గంభీరంగా వ్యవహరిస్తూ దుష్టులను అంతమొందించటమే కాదు. అది కేవలం ఈ విశ్వనిర్వహణకు అవసరమయ్యే గుణం మాత్రమే. అందుకు తగ్గ ఐశ్వర్య సంపన్నమైన రూపమే విష్ణు లేదా నారాయణరూపం. ఆయనున్న ఆ ఐశ్వర్యధామానికే వైకుంఠమని పేరు. సాధారణంగా విష్ణువుతో భక్తులు దాస్యరస భావనను కలిగుంటారు. అంటే, తాము భగవంతుని నిత్యసేవకులమని, దాసులమని. కాని, భగవంతుని అసలైన రూపం, స్వభావం, తన భక్తులతో షడ్రస భావనతో మెలిగే తత్త్వం కేవలం కృష్ణ స్వరూపంలో మాత్రమే సంపూర్ణంగా వీక్షించగలం. భగవంతుడు అన్యరూపాన్ని ధరించక, ఎట్టి ఐశ్వర్యతత్త్వాన్ని వెళ్లబుచ్చక మన ముందు వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో, ఆ రూపమే శ్రీ కృష్ణస్వరూపం. ‘కృష్ణస్తుభగవాన్ స్వయం’ అన్నది అందుకే మరి! దేవదేవుని అవతారాలు ఎన్నైనా, అంశలు అసంఖ్యాకమైనా, శ్రీ కృష్ణుడే స్వయంభగవంతుడని ప్రబోధించారు వేదవ్యాసులవారు. ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న కోవిడ్–19 సమస్త మానవాళికి ఒక ముఖ్యమైన అనుభవాన్ని చవిచూపింది. జీవితసత్యాన్ని నేర్పించింది. కోవిడ్ అంటేనే ఎంతో మంది భయభ్రాంతులకు లోనవుతున్నారు. నిత్యం దాని గురించే ఆలోచిస్తూ, మితిమీరిన భావోద్వేగాలకు ఆస్కారమివ్వటమే ఇందుకు కారణం. అందుకు బదులుగా, మన దృష్టిని శ్రీ కృష్ణుని లీలావైభవాన్ని తెలుసుకునేందుకో, కీర్తించేందుకో మరల్చగలిగితే సత్వరం ఆ భావోద్వేగాల నుండి ఉపశమనం పొందగలం. ప్రతి ఒక్కరికీ శ్రవణం, కీర్తనం, స్మరణం చేయగల సామర్థ్యాలున్నాయి. వాటిని కృష్ణుని కోసం ఎందుకు ఉపయోగించరాదు? అదే మనకు మరోధైర్యాన్ని అందించే దివ్యౌషధం. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో మనం కలత చెందకుండా మనల్ని రక్షించగలిగే ఉపాయమొక్కటే – శ్రీ కృష్ణదివ్య నామాలు, లీలలను శ్రవణం, కీర్తనం, స్మరణం చేయటం. నేడు, రేపు జరిగే శ్రీ కృష్ణజన్మాష్టమి వేడుకల సందర్భంగా, ఆరోగ్య రక్షణ సూత్రాలను పాటిస్తూ వేడుకలలో పాలుపంచుకోండి. శ్రీ కృష్ణుని దివ్యనామాలను మనసారా కీర్తించండి: నిత్యం భగవన్నామాలను జపించండి. ఆనందంగా జీవించండి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే – శ్రీమాన్ సత్యగౌర చంద్ర ప్రభుజీ, హరేకృష్ణ మూవ్ మెంట్ హైదరాబాద్ అధ్యక్షులు అక్షయపాత్ర ఫాండేషన్ ప్రాంతీయ అధ్యక్షులు. -
వెన్నపాలు తినవలె...
శ్రీకృష్ణుడు వాడవాడలా తనకు పెట్టిన కొత్తకొత్త నైవేద్యాలను చూశాడు... అబ్బో! భక్తులు ఎంత మారిపోయారో అని మురిసిపోయాడు... సంప్రదాయ వంటకాలనూ చూశాడు.. అదేవిధంగా మురిసిపోయాడు. నేను వెన్నపాలు తింటే, నా భక్తులు కూడా అవే తింటున్నారు... మరి నేను కూడా వారు పెట్టిన బువ్వలు తినాలిగా అనుకున్నాడు. మనం కూడా ఈ జన్మాష్టమి నాడు మనకు తోచినన్ని నైవేద్యాలు తయారు చేసి.. భక్తితో పరమాత్మునికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిద్దాం.. కృష్ణం వందే జగద్గురుమ్ అందాం... ధనియా పంజీరీ ఉత్తరప్రదేశ్, బిహార్, పంజాబ్ రాష్ట్రాలలో ఈ ప్రసాదాన్ని శ్రీకృష్ణుడికి నివేదిస్తారు. కావలసినవి: ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు ; పంచదార పొడి – 2 టేబుల్ స్పూన్లు ; నెయ్యి – తగినంత ; జీడిపప్పు తరుగు + బాదం పప్పు తరుగు + పిస్తా తరుగు + పటికబెల్లం బిళ్లలు + కిస్మిస్ – అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూను. తయారీ: ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక ధనియాలు వేసి దోరగా వేయించి తీసేయాలి lబాగా చల్లారాక మిక్సీలో వేసి పొడి చేయాలి (మరీ మెత్తగా ఉండకూడదు) ∙ఒకపాత్రలో ధనియాల పొడి, పంచదార పొడి వేసి కలపాలి ∙నెయ్యి జత చేయాలి ∙చివరగా డ్రైఫ్రూట్స్ తరుగు జత చేసి, శ్రీకృష్ణుడికి నివేదన చేసి, ప్రసాదంగా స్వీకరించాలి. సాథ్ పడీ పూరీ కావలసినవి: మైదా పిండి – రెండున్నర కప్పులు ; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్ స్పూన్లు ; నీళ్లు – తగినంత ; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. పేస్ట్ కోసం: బియ్యప్పిండి – అర కప్పు ; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ∙ముందుగా ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి తగినన్ని నీళ్లు జత చేస్తూ పరాఠాల పిండిలా కలుపుకుని అరగంట సేపు పక్కన ఉంచాలి ∙మరొక పాత్రలో అర కప్పు బియ్యప్పిండి, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి పిండిని ముద్దలా చేçసుకోవాలి (నీళ్లు పోయకూడదు). మైదాపిండిని సమాన భాగాలుగా చేసి ఒక్కో ఉండను చపాతీలా ఒత్తాలి ∙ముందుగా ఒక చపాతీ మీద బియ్యప్పిండి నెయ్యి కలిపిన ముద్దను కొద్దిగా పూసి ఆ పైన మరో చపాతీ ఉంచాలి ∙ఈ విధంగా మొత్తం ఏడు చపాతీలను ఒకదాని మీద ఒకటి ఉంచాక ఏడవ చపాతీ మీద కూడా బియ్యప్పిండి ముద్ద పూసి నెమ్మదిగా ఆ ఏడు చపాతీలను రోల్ చేయాలి ∙చాకుతో గుండ్రంగా ముక్కలు కట్ చేయాలి ∙ఒక్కో ముక్కను జాగ్రత్తగా అప్పడాల కర్రతో ఒత్తాలి ∙బాణలిలో నూనె కాగాక వీటిని ఒక్కొక్కటిగా నూనెలో వేసి రెండు వైపులా బంగారు వర్ణం వచ్చేవరకు వేయించి తీసేయాలి. మఖ్ఖ్ఖన్ మిస్రీ శ్రీకృష్ణుడు నడయాడిన బృందావనంలో మఖ్ఖన్ మిస్రీని ప్రసాదంగా అందచేస్తారు. తయారీ చాలా సులభం. కావలసినవి: వెన్న – 100 గ్రా. (ఇంట్లో మజ్జిగ చిలికి తీసినది); çమిశ్రీ – 50 గ్రా. (పటికబెల్లం చిప్స్). తయారీ: ఒక పాత్రలో వెన్న, పటిక బెల్లం చిప్స్ వేసి బాగా కరిగే వరకు కలపాలి ∙ఈ మిశ్రమాన్ని సుమారు గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి ∙బయటకు తీసి, ప్రసాదంగా చల్లచల్లగా తినాగోపాల్ కళ కావలసినవి: బియ్యపు రవ్వ – అర కేజీ; కీర దోస ముక్కలు– అర కప్పు ; కొబ్బరి తురుము – పావు కప్పు; పెరుగు – ఒక లీటరు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; పంచదార – ఒక టేబుల్ స్పూను; వేయించిన జీలకర్ర – 2 టీ స్పూన్లు. తయారీ: ∙స్టౌ మీద పెద్ద పాత్రలో తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి ∙బియ్యపు రవ్వ వేసి బాగా కలియ పెట్టి, సన్నని మంట మీద పూర్తిగా ఉడికించి దింపేయాలి ∙ఒక వెడల్పాటి పాత్రలో... ఉడికించిన బియ్యపు రవ్వ, కీర దోస ముక్కలు, కొబ్బరి తురుము, పెరుగు, పంచదార, నెయ్యి, వేయించిన జీలకర్ర వేసి బాగా కలపాలి ∙ఉండలుగా చేసుకుని, శ్రీకృష్ణుడికి నివేదన చేయాలి ∙ఈ ప్రసాదాన్ని పేదవారి ఆహారంగా చెబుతారు ∙గోకులాష్టమి నాడు అర్ధరాత్రి శ్రీకృష్ణుడిని ప్రార్థించి, భగవంతుడికి నివేదన చేసి, ఉపవాస విరమణ ప్రసాదంగా స్వీకరిస్తారు. -
కృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి, నలుగురు మృతి
కోల్‌కతా : పశ్చిమబెంగాల్లో ఆలయం గోడ కూలి నలుగురు దుర్మరణం చెందగా, సుమారు 27మంది గాయపడ్డారు. నార్త్ 24 పరగణ జిల్లాలోని కచ్వాలోని లోక్‌నాథ్ బాబా మందిర్‌లో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో ఈ అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. ఇంతలో ఆలయం గోడ ఒక్కసారిగా కూలడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. వారిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమాచారంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హుటాహుటీన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన మృతుల ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50 వేలు తక్షణ సాయంగా ప్రకటన చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణాష్టమి వేడుకలు
-
ముస్లింలు అక్కడ నమాజ్ చేయొద్దు: యోగి
లక్నో: రోడ్లపై నమాజ్ చేయొద్దని ముస్లింలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరారు. రంజాన్ పర్వదినం రోజున రోడ్లపైకి వచ్చి నమాజ్ చేయడం సరి కాదని యోగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను తాను ఇలా అడగకపోతే ఉత్తరప్రదేశ్ పోలీసు స్టేషన్లలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకోవడం ఆపేయాలని తాను కోరలేనని అన్నారు. గత ప్రభుత్వం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను సరిగా నిర్వహించలేదని చెప్పుకొచ్చిన ఆయన.. ఇక నుంచి అంగరంగ వైభవంగా పండుగను జరుపుకుందామని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా దేశంలోని ప్రతి ఒక్కరూ తమ పండుగల రోజుల ఆరాధ్య దైవాలను పూజించుకోవచ్చని యోగి పేర్కొన్నారు. పోలీసు వ్యవస్ధలో మార్పు తెచ్చేందుకు కీర్తనలు, ప్రార్థనలు ఉపయోగపడతాయని యోగి వ్యాఖ్యానించినట్లు జాతీయ మీడియా ఓ కథనం ప్రచురించింది. -
సుప్రీం ఆదేశాలు పాటించకుండా..
ముంబై: దహీ హండీ (ఉట్టి) కొట్టేందుకు ఏర్పడే మానవ పిరమిడ్ ఎత్తు పెంచడానికి అనుమతివ్వబోమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కృష్ణభక్తులు పట్టించుకోలేదు. కృష్ణాష్టమి సందర్భంగా 20 అడుగులకు మించి పిరమిడ్లను నిర్మించి గురువారం ముంబైలోని పలుచోట్ల ఉట్టి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురు చిన్నారులు సైతం ఉన్నారు. ఉల్లాస్ నగర్లో నిర్వహించిన ఉత్సవాల్లో తీవ్రంగా గాయపడిన 12 ఏళ్ల సుజల్, కాండివ్లి ప్రాంతంలో ఉత్సవాల్లో పాల్గొన్న 9 ఏళ్ల ధీరజ్ ఇప్పుడు ఆసుపత్రిలో ప్రాణాలకోసం పోరాడుతున్నారు. దహీ హండీ సందర్భంగా ముంబై వ్యాప్తంగా 159 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. వీరిలో 115 మంది ప్రధమ చికిత్స అనంతరం కోలుకోగా.. మిగిలినవారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే గత సంవత్సరం ఇదే ఉత్సవాల సందర్భంగా 364 మంది గాయపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ సారి గాయపడిన వారి సంఖ్య తగ్గినా.. సుప్రీంకోర్టు నిబంధనలు మాత్రం పూర్తిగా అమలు కాలేదు. దహీ హండీలో ఉత్సవాల్లో 18 ఏళ్లు నిండని వారు పాల్గొనరాదని, మానవ పిరమిడ్ ఎత్తు 20 అడుగులకు మించరాదని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. -
కనులపండువగా శోభాయాత్ర
నెల్లూరు(బందావనం) : శ్రీకష్ణ జన్మాష్టమి పర్వదినం, విశ్వహిందూ పరిషత్ స్థాపనాదివస్ను పురస్కరించుకుని విశ్వహిందూపరిషత్, శ్రీరంగనాథ కోలాట భజన మండలి, దుర్గావాహిని, భజరంగ్‌దళ్ తదితర సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్ర కనులపండువగా సాగింది. గురువారం నెల్లూరులోని వీఆర్ ఉన్నత పాఠశాలలో యాత్రను సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బాలబాలికల్లో ధార్మికచింతనను కలిగించేందుకు హిందూధార్మిక సంస్థలు విశాల ధక్పథంలో చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. ఉన్నతమైన వ్యక్తిత్వంతో లోకంలో మంచిని కాపాడేందుకు శ్రీకష్ణపరమాత్మ అనుసరించిన తీరు సమాజానికి ఓ సందేశాన్ని ఇస్తుందన్నారు. పురాణపురుషుల జయంతులను జరుపుకోవడం ద్వారా దేశభక్తి పెంపొందడమే గాకుండా భావితరాలకు మార్గదర్శకంగా ఉంటుందన్నారు. భారతీయ పండగలు సంస్కతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, వీహెచ్‌పీ దక్షిణ భారతదేశ బాధ్యులు డాక్టర్ గోపాల్జీ, రాష్ట్ర కార్యదర్శి మెంటా రామమోహన్‌రావు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. చిన్నికష్ణుల సందడి : నెమలిపింఛాలను ధరించి, పిల్లన గ్రోవులను చేతబట్టి, బుడిబుడి అడుగుల నడకలతో రాధా, గోపికలు వెంటరాగా చిన్నికష్ణులు నగరంలో సందడి చేశారు. శోభాయాత్ర సందర్భంగా బాలబాలికలు శ్రీకష్ణరాధాగోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. -
సుప్రీం తీర్పునూ లెక్క చేయలేదు
భారీ ఎత్తులో పిరమిడ్లు నిర్మించిన మహారాష్ట్ర వాసులు ముంబై: దహీ హండీ (ఉట్టి) కొట్టేందుకు ఏర్పడే మానవ పిరమిడ్ ఎత్తు పెంచడానికి అనుమతివ్వబోంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కృష్ణభక్తులు పట్టించుకోలేదు. కృష్ణాష్టమి సందర్భంగా 20 అడుగులకు మించి పిరమిడ్లను నిర్మించి గురువారం ఉట్టి ఉత్సవం నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా దాదర్ ప్రాంతంలో భక్తులు 20 అడుగుల మానవ పిరమిడ్ రూపంలో నేలపై పడుకుని నిరసన తెలిపారు. దహీ హండీ కొట్టేందుకు ఏర్పడే మానవ పిరమిడ్ ఎత్తు విషయంలో హైకోర్టు తీర్పునే కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 20 మీటర్లకు మించి ఎత్తు పెంచలేమని ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆదేశాలను ఉల్లంఘించారు. పలుచోట్ల 40 నుంచి 50 అడుగుల ఎత్తులో మానవ పిరమిడ్లను నిర్మించే ఉట్టికుండలను పగులకొట్టారు. సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ ఠాక్రే సమర్థించుకున్నారు. ’మహారాష్ట్ర పండుగల పరిరక్షణ కోసం చట్టాలను ఉల్లంఘించాల్సి వస్తే అందుకు నేను సిద్ధం. ఎత్తు విషయంలో ఆంక్షలు చట్టమేమీ కాదు. కోర్టు ఆదేశాలు మాత్రమే. అందుకు మీకు ఇష్టమున్న రీతిలో మానవ పిరమిడ్లు నిర్మించుకొని గోవిందులకు (ఉట్టి వేడుకలో పాల్గొనేవారికి) చెప్పాను’ అని ఠాక్రే మీడియాతో అన్నారు. మహారాష్ట్రలో ఏటా జన్మాష్టమి సందర్భంగా దహీహండీ నిర్వహిస్తారు. -
కృష్ణాష్టమి రోజున వెల్లి విరిసిన మత సామరస్యం
-
ఘనంగా శ్రీకృష్ణజన్మాష్టమి
సాక్షి, ముంబై : ఉట్టి ఉత్సవాలకు ముంైబైతోపాటు దాదాపు అన్ని ప్రాంతాలు ముస్తాబయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి శ్రీకష్ణుని జన్మదినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి ఉట్టి ఉత్సవాలు ఇదే స్ఫూర్తితో నిర్వహించడానికి ఉట్టికొట్టేమండళ్లన్నీ ఏర్పాట్లు చేసుకొన్నాయి. ఈ సారి మానవపిరమిడ్ల విషయంపై కోర్టులో వ్యాజ్యం దాఖలుచేయడంతో ఉట్టి ఉత్సవాలపై అనేక అనుమానాలు తలెత్తాయి. సుప్రీం కోర్టులో కొంత ఊరట లభించడంతో ఉట్టి కొట్టే మండళ్లతోపాటు ఉట్టి నిర్వాహకుల్లో ఆనందం కన్పిస్తోంది. ఉత్సవాలను సంప్రదాయంగా నిర్వహించడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకొన్నారు. దాదర్‌లోని మార్కెట్లు రద్దీగా మారాయి. మానవ పిరమిడ్లు ఏర్పాటు చేసి ఉట్టి పగుల కొట్టే సమయంలో ప్రమాదాలకు గురయ్యే గోవిందలను ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీ ఎంసీ) ఆదుకోనుంది. ముంబై, ఠాణేలో పెద్దఎత్తున ఉట్టి ఉత్సవాలు నిర్వహిస్తారు.ఉత్సవాలను తిలకించడానికి చిన్నపెద్ద, ఆడ మగా తరలివస్తారు.